వ్యక్తిత్వ వికాసం - సి.నరసింహారావు
1వ రోజు.....
మనం పొరపాట్లు చేయడం కూడా జీవితంలో వివిధ అంశాలను నేర్చుకోవడంలో ఒక భాగమే! మనం మరింతగా ముందుకెదగడానికి అవి దోహదం చేస్తాయి. ఎప్పుడూ పొరపాటు చేయగూడదనుకొనేవారు, ప్రతి పనిని ఆచి తూచి చేయవలసి వుంటుంది. ఫలితంగా వారు అనవసరంగా ఉద్రిక్తతకు, ఆందోళనకు లోనవ్వడం జరుగుతుంది. మీరు చేసే పొరపాట్లను ఇతరులు చీదరించుకోరు. అవి మానవ సహజమని గుర్తించి మీకు మరింత సన్నిహిమవుతారు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని పొరపాట్లు చేసినందుకు తెగనాడినా, వారిని మీరు పెద్దగా పట్టించుకోనవసరం లేదు. వారి మనస్సులోని అభద్రతా భయం వల్లనే, ఇలా విమర్శించ పూనుకొన్నారని మీరు గుర్తించగలిగితే చాలు.
సేకరణ
No comments:
Post a Comment