*సంక్రాంతి బసవన్న, సంక్రాంతి అంటే కేవలం పండగ మాత్రమే కాదు అది మన సంస్కృతి, సాంప్రదాయం. ఇక్కడ అన్నింటికీ ఒక కథ ఉంది. ఆ కథ వెనుక నిజం కూడా దాగుంది.*
సంక్రాంతి సమయంలో బసవన్న ( ఎద్దు ) ని తీసుకొస్తారు. ఇది వారు సంక్రాంతి సమయంలో సంప్రదాయం తీసుకొస్తారు అలా మన ఇంటి ముందు ఆ బసవన్న ఆడుతుంటే మన ఇంటి ముంగిళ్లలో సంక్రాంతి శోభ కలుగుతుంది ...
ఇలా బసవన్నని తీసుకురావడం వెనుక ఓ చిన్న కధ ఉంది. అది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు , అందరూ వారి పొట్ట కూటి కోసం ఇలా వస్తారు అనుకుంటారు. అది నిజమే కానీ ఆ నిజం వెనుక ఒక పరమార్ధం ఉందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ...
బలంగా ఉండే ఎద్దులనే గంగిరెద్దులుగా వాడతారు... గంగిరెద్దు ఎంత బలిష్టంగా ఉంటుందో అంతా పనిచేస్తుంది. సోమరిగా ఎంతమాత్రం ఉండదు... అదే కాదు ఎద్దు శివుని వాహనంగా, పూర్తి ధర్మస్వరూపం గా భావిస్తారు...
అసలు సంక్రాంతి అంటే రైతు పండుగ ... తొలికరి చినుకు పడిన నాటి నుంచి పంట ఇంటికి వచ్చేవరకూ రైతుకు అండగా శ్రమించే ఎద్దు ... సంక్రాంతి వేళ తానే స్వయంగా ఇంటి ముందుకు భిక్షకు వస్తుంది ...
అంటే.. మీకు ఇంత కష్టపడి ధాన్యం పండించింది నేనే అనే అహంకారం ఎంతమాత్రం ఉండదు అని చాటి చెబుతునట్టు ...
ఒకప్పుడు బసవన్న ఇంటి ముందుకు వస్తే వారికి తోచిన దక్షిణ ఇచ్చి , ఇంట్లో పాతవి ఏమైనా బట్టలు ఉంటే ఇచ్చేవారు లేకుంటే దోసిట్లో బియ్యం అయిన దానం చేసేవారు ... ఇది ఇక్కడ మన పెద్దమ్మ గారు వాళ్ళు చేస్తున్నట్టు.. ఇప్పుడు కూడా చాలా మంది చేస్తున్నారు ... కానీ ఇదివరకు అంతగా వారిని పట్టించుకోవడం లేదు , వారు వచ్చేది సంవత్సరానికి ఒకసారి కాస్త బియ్యం పది రూపాయలు ఇస్తే మన ఇంట్లో సంపద తరిగిపోదు ... ఖచ్చితంగా ఇవ్వాలని కాదు కాని ఇచ్చి మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడమని అంతే.
No comments:
Post a Comment