Saturday, January 11, 2025

 పాపం , పుణ్యం ఈ రెండు మనిషిని వదలక వెంట వస్తాయి.

పాప ఫలం.... నరకం... ఇనుప సంకెళ్లు
పుణ్య ఫలం... స్వర్గం.... బంగారు సంకెళ్లు

మనిషి సదా కాలము... బ్రహ్మ భావంతో జీవించాలి... ఇది కుదరకపోతే... నూరు సంవత్సరాలు కర్మ(పనులు) చేస్తూనే బ్రతకాలి. ఐతే, మనిషిని ఆ కర్మలు బంధించకూడదు..*(న కర్మ లిప్యతే నరే*... ఈశావాస్య ఉపనిషత్తు : మంత్రం 02)

కర్మలు బంధించకుండా వుండాలంటే... నిష్కామ కర్మ యోగాన్ని అవలంబించాలి. ఇందుకోసం సహాయం చేసేది, సజ్జన సాంగత్యం.
ఆది శంకర భగవత్పాదులు చెపుతున్నారు....
*సత్సంగత్వే...నిస్సంగత్వం,నిస్సంగత్వే...నిర్మోహత్వం,నిర్మోహత్వే..... నిచ్చల తత్త్వం,నిచ్చల తత్త్వే.... జీవన్ముక్తి*.... అని
సజ్జనులతో, సాధకులతో స్నేహం వల్ల విషయాలతో సంగం వుండదు, ఆ కారణంగా మోహం  వుండదు... మోహం లేని బుద్ధి స్థిరంగా వుంటుంది.... ఆ స్థిర బుద్ధి మోక్ష సాధనకి ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment