Saturday, January 11, 2025

 మన శాకాహార షడ్రుచులు 
Rayachoti Krishna Murthy 

నిన్న మా వంటింట చేరిన మరో "జంట" 'కుంభకోణం ఇత్తడి 'కాఫీ డవరా' & ప్యూర్ కాఫీ డికాక్షన్......

ఈ దేశంలోని కొన్ని రాష్ట్రాలలో......అలనాటి కొన్ని సత్సాంప్రదాయాలు పాటించే వారు ఎందరో ఉన్నారు. ఇతరులకివి చాదస్తాలుగా కనిపించినా వీళ్ళేం లెక్కచేయరు...ఇలాంటిదే.....తమిళనాడు లో
కననిపించే --- *కాఫీ* *డవరా* --- వాడకం. శంఖంలో పోస్తేగానీ తీర్థం కాదనే ఓ సామెత లాగా...

ముఖ్యంగా
తమిళనాడులోని 'కుంభకోణం', 'కోయంబత్తూరు', 'దిండిగల్', 'మధురై' తదితర పట్టణాలలో ఈ కాఫీ 'డవరా'ల వాడకం ఎక్కువగానే ఉంది.

     ఈ కాఫీ 'డవరా'లను స్వచ్ఛమైన ఇత్తడితో తయారు చేస్తారు. సాధారణంగా తమిళ ప్రజలు స్వచ్ఛమైన అసలు సిసలు -- ప్యూర్ కాఫీ గానీ..చికోరి కలిపిన కాఫీ ఇష్టపడతారు. పోగలుగక్కే వేడి కాఫీ డవరా లో నింపినా.....ఆ రెండు పాత్రల్లో తిప్పుతూ కాస్తంత చల్లార్చి - తాగుతారు. ఈ ప్రాసెస్ లో గ్లాసును పైకెత్తి పెదాలకు (నోటికి) అనించి తాగరు. ఇలా.....ఇత్తడితో తయారుచేసిన 'కాఫీ డవరా' లో...కాఫీ రుచులు కమ్మగా ఉంటాయని వీరి నమ్మకం. 
ప్రస్తుతం..... ఈ ఇత్తడి కాఫీ  *డవరా* లను అనేక పట్టణాలలోని హోటల్స్ వారు ఉపయోగిస్తూ.....వారి ఖాతాదారులను ఆకర్షిస్తున్నారు.

No comments:

Post a Comment