Sunday, March 30, 2025

 *పరిజ్ఞానం.....* 

*ఈ రోజు ఉగాదితో రాబోయే తెలుగు సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరం అని మనకు తెలుసు... అసలు ... విశ్వావసు ఎవరు?*

*ఆయనకి శ్రీరామునకు ఏమిటి సంబంధం ??*

*ఈ కథ చదవండి...*
 
*విశ్వావసు 6000 గంధర్వులలో ఒక గంధర్వుడు. గంధర్వులు మంచి గాయకులు, నృత్యకారులు, సంగీతకారులు మరియు మంచి సౌందర్యవంతులు. అప్సరసులలో సహగమనం చేస్తూ ఉంటారు. విశ్వావసు తన తపస్సుతో బ్రహ్మ దేవుని నుంచి అమరత్వం సిద్దించుకున్నాడు. ఆ తరవాత అతను అహంకారంతో ఇంద్రుని మీద దాడి చేసి, ఇంద్రుని క్రోధానికి గురియైనాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో విశ్వాసుని చేతులని, తొడలని శరీరంలో తోసివేశాడు. దానితో విశ్వాసుడు చేతులు, తొడలు లేని వికృత రూపం పొందాడు. తన తప్పు తెసుకున్న విశ్వాసుడు ఇంద్రుని వేడుకున్నాడు. ఇంద్రుడు కరుణించి, తనికి రెండు పొడవైన చేతులతో పాటు, పొట్టపై భుజించుటకు వీలుగా ఒక నోటిని ఇచ్చాడు.*

*అలా విశ్వాసుడు కబంధుడై అరణ్యంలో జీవించాడు. అతను భయంకరమైన ఈ రూపం ధరించి వనాలలో ఉండే మునులను భయపెట్టుతూ వచ్చాడు. ఇలా చేస్తూండగా ఒకసారి స్థూలశిరుడనే మహాముని తటస్థపడి, ” నీకి రూపమే శాశ్వతంగా ఉండిపోవు గాక !”. అని శపించాడు. అప్పు డీ కబంధుడు మునికి క్షమాపణ చెప్పుకుని శాప విముక్తి ఎలాగని అడిగాడు. “ఎప్పుడు రాముడు అడవికి వచ్చి, నీ చేతులు నరికి నీకు దహనక్రియలు చేస్తాడో అప్పుడు నీకు యథారూపం వస్తుంది,” అని ముని చెప్పి వెళ్ళిపోయాడు.*

*విశ్వావసుడి శాప విమోచనం శ్రీరాముడు, లక్ష్మణుడు సీతను వెతుకుతూ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా విచిత్ర రూపంలో ఉన్న ఓ రాక్షసుడు రామలక్ష్మణులకు ఎదురయ్యాడు. అతనికి తల, మెడ, కాళ్ళు లేవు. ఉదరం- అంటే కడుపు భాగంలో మాత్రం ఓ పేద్ద నోరుంది. ఊరువుల ప్రదేశంలో రెండు ఉగ్రనేత్రాలున్నాయి. అతని బాహువులు మాత్రం ఎనిమిది యోజనాలవరకు విస్తరించి ఉన్నాయి. అటువంటి రాక్షసుడు ఒక్కసారిగా రామలక్ష్మణులను తన హస్తాలతో బంధించి గుప్పిట్లో బిగించాడు. దీనికే “కబంధ హస్తం” అనే నానుడి ఉన్నది.*

*భయకరమైన నోటిని తెరిచి వారిని ఆరగించబోతుండగా రాముడు కుడి చేతిని, లక్ష్మణుడు ఎడం చేతిని నరికివేయడంతో ఆ రాక్షసుడు నేలకు ఒరిగాడు. తనని గాయపరిచింది రాముడు అని తెలుసుకుని కబంధుడు ఎంతో సంతోషించాడు. కబంధుడు తన వృత్తాంతం తెలిపి తనకి అంత్యక్రియలు నిర్వహించమని శ్రీరాముడిని కోరగా, రాముడి అతని కోరిక మీరా అలానే చేస్తాడు. కబంధుడు తన పూర్వ గంధర్వ రూపం సంతరించుకుంటాడు. ఆ విశ్వావసు నామమే హిందు సంవత్సరాలలో ఒకటి.*

*┈┉┅━❀꧁జై శ్రీరామ్꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🙏🙏🙏 🏹🕉️🏹 🙏🙏🙏

No comments:

Post a Comment