🕉🚩:
_*మహాన్యాసము*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
న్యాసం అంటే ప్రాధమిక అర్థం శుద్ధి చేయటం లేదా పవిత్రమొనర్చడం. న్యాసము వైదిక, తాంత్రిక సాధనలలో ముఖ్యమైన భాగము. న్యాసములు అనేకములుగా ఉన్నప్పటికీ నాలుగు రకాలు ప్రసిద్ధి చెంది ఉన్నాయి. అవి రుషి న్యాసము, కరన్యాసము, మాత్రిక న్యాసము మరియు షడంగన్యాసము. మహాన్యాసము అను పద్ధతిని మహా శివభక్తి తత్పరుడైన రావణుడు సూత్రీకరించాడు.
న్యాసములో చేతి వేళ్ళను మరియు వివిధ శరీర భాగములను తాకుతూ తత్ మంత్రమును లేదా బీజాక్షరాలను పలుకుతూ పవిత్రం చేసుకుంటారు. శివపూజకు ముందు మహాన్యాసం చేయడం తప్పనిసరి. వివిధ శరీరభాగాలలో వివిధ దేవతలను ప్రతిష్టించుకుని దైవత్వాన్ని నింపుకున్న అనుభూతిలో అత్యంత పవిత్రంగా, పరమ నిష్ఠగా పూజాదికాలు నిర్వహించడం భారతీయ దేవతార్చనలో ప్రధానం. ఈ విధంగా చేసిన పూజవల్ల సకలము సిద్ధిస్తుంది. హిందూ దేవతా సాంప్రదాయాలలో కొన్ని వందల పూజాశాస్త్రములు, కొన్ని వేల పూజా విధులు లెక్కకు మించి రహస్యములైన సాధనాలు, వాటికి సంబంధిచిన న్యాసములు ఉన్నాయి. అవి మహామహులకు తప్ప సామాన్యులకు అందవు. అవి మహాశక్తివంతములై, నియమ నిష్ఠలతో కూడుకొన్నవై, సులభసిద్ధిదాయకములై ఉన్నవి. కాబట్టి నిష్ఠాగరిష్టులు, తాత్విక చింతన కలిగినవారు, లోక క్షేమమును కాంక్షించు వారు మరియు లోకకల్యాణానికై సాధన చేయువారికి మాత్రమే అది కూడా గురువులనుంచీ మాత్రమే లభిస్తాయి. ఆ స్థాయికి చేరుకోవడం జన్మజన్మల పుణ్యం మరియు ఏకాగ్ర సాధన వలననే సాధ్యమవుతుంది. సంసారబంధములలో ఉన్నాకూడా సాధన చేయవచ్చని చాలామంది నిరూపించారు. ఇప్పటికీ పట్టు విడువకుండా సాధన చేసేవారు ఉన్నారు. సాధన చేయాలన్న బలమైన సంకల్పం మనల్ని సరైన గురువు దగ్గరకు చేరుస్తుంది. కావున మనందరమూ ఆధ్యాత్మికమార్గాన్ని కొంతవరకైనా అనుసరించడం జీవితంలో చాలారకాలుగా మంచిని చేకూరుస్తుంది.
రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రంలోతేడాలు ఉన్నాయి. యజుర్వేదంలోనిమంత్రభాగమైన 11 అనువాకాల'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు. దానికిఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రద్రాభిషేకంఅంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లుకూడా ఉన్నాయి.
ఈ 11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లుచెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి'అంటారు. రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసేఅభిషేకం 'లఘురుద్రాభిషేకం'.
11 లఘురుద్రాలు ఒక 'మహారుద్రం' అంటే, ఈఅభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది.
ఈ మహారుద్రాలు పదకొండయితే 'అతిరుద్రం',దీనిలో 14641 మారులు రుద్రం చెప్పబడుతుంది.ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే'రుద్రాభిషేకం' హోమంలో వినియోగిస్తే'రుద్రయాగం'. ఈ అభిషేక తీర్థాన్ని భక్తితోగ్రహించటం ద్వారా జీవాత్మను ఆశ్రయించి ఉన్నసమస్త మాయాదోషాలు తొలగి, జీవుడుమరమాత్మలోనికి ఐక్యం చెందుతాడు.
“నారుద్రో రుద్రమర్చయేత్” - అనగా రుద్రుడుకాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడు.ఇది ప్రమాణ వచనము. అందుకనే, కల్పసూత్రకారులగు బోధాయనులు మహాన్యాసముఅనే రౌద్రీకరణ విధానాన్ని మనకు ఇచ్చారు.అప్పటినుంచి ఈ మహాన్యాసము శ్రీరుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ఏర్పడి మనదేశములో ప్రసిద్ధమై, ప్రచారములో ఉంది.
ఈ మహన్యాస పారాయణ కూడా యోగా శాస్రంవంటిది. అంగన్యాస కరన్యాసాలు చేస్తూమహన్యాస పారాయణ చేయుటవలన శరీరంఅంతర్ముఖంగాను, బహిర్ముఖంగాను శుచిని పొందిపవిత్రమగును. సామ్రాజ్య పట్టాభిషేకము, దశశాంతులు, పంచ సూక్తములు, కాఠకాదులతోచేయవలయును.
మరి ఈ మహాన్యాసము అంటే?
మహాన్యాసము అంటే భక్తుడు శ్రీ రుద్ర జప,హోమ, అర్చన, అభిషేకాదులు చేయుటకుఅధికారి అవ్వటానికి, వాటికి ముందు మహామహిమలు కలిగిన రుద్రుని తన (ఆత్మ) యందువిశిష్టముగా నిలుపుకొనుట, రౌద్రీకరణము. ఇదిచాలా మహిమ కలది. దీన్ని అనుష్ఠించటంలోభక్తుడు పంచాంగ న్యాసములందు వివిధమంత్రములు పఠించుచు, తన సర్వాంగములనుతాకుచుండుట చేత, రుద్రుని తన దేహాత్మలందుభావించి తనలో ప్రవేశపెట్టుటచే, తాను రుద్రుడేఅయి, రుద్రార్చనకు అధికారి అగును.
రుద్ర మహాన్యాసము ఐదు అంగన్యాసములు కలిగినది.
౧. ప్రథమాంగన్యాసము - శిఖాది అస్త్రాంతముముప్ఫై ఒకటి అంగన్యాసములు కలది
౨. ద్వితీయాంగన్యాసము - మూర్ద్నాదిపాదాంతము దశాంగన్యాసము కలది
౩. తృతీయాంగన్యాసము - పాదాదిమూర్ధ్నాంతము పంచాంగన్యాసము కలది
౪. చతుర్థాంగన్యాసము - గుహ్యాదిమస్తకాంతము పంచాంగన్యాసము కలది
౫. పంచమాంగన్యాసము - హృదయాదిఅస్త్రాంతము పంచాంగన్యాసము కలది –
ఇవి అయిదు కలవారు పంచాంగ రుద్రులు.
౧. ప్రథమాంగన్యాసము
భక్తుడు సంకల్పము చేసిన మీదట పూర్వాంగరుద్ర, దక్షిణాంగ రుద్ర, పశ్చిమాంగ రుద్ర, ఉత్తరాంగరుద్ర, ఊర్ధ్వాంగ రుద్రులకు స్తుతి పూర్వకనమస్కారములు చేయవలెను. అటు తర్వాత, పూర్వాంగముఖ రుద్ర, దక్షిణాంగముఖ రుద్ర,పశ్చిమాంగముఖ రుద్ర, ఉత్తరాంగముఖ రుద్ర,ఊర్ధ్వాంగముఖ రుద్రులకు స్తోత్ర పూర్వకనమస్కారములు చేయవలెను. తర్వాత, "యా తేరుద్ర శివాతమా" మొదలగు మంత్రములనుపఠించుచు, తన శిఖాదులను తాకవలెను.
౨. ద్వితీయాంగన్యాసము
ఓం నమో భగవతే రుద్రాయ అని పలికినమస్కరించి, ఓం మూర్ద్నే నమః,
ని ర్మే వాచిశ్రితః వాగ్ఘ్రుదయేహృదయం మయి" మొదలు "అంత స్తిష్ఠత్వమృతస్య గోపాః" వరకు పఠించి లింగము,అంగములను స్పృశించ వలెను. గంధము,అక్షతలు, బిల్వ పత్రములు, పుష్పాలు, ధూప దీపనైవేద్య తాంబూలములతో లింగమును అర్చించిఆత్మను ప్రత్యారాధించ వలెను.అభిషేకప్రారంభములో చమకములోని 'శంచమ'అనువాకమును, నమక చమకముల లోనిమొదటి అనువాకములను పఠించి, "ప్రాణానాంగ్రంథిరసి" అనే నాలుగు అనువాకములు, దశశాంతి మంత్రములు, ప్రశ్నాంతము జపించి,శతానువాకములను, పంచకాఠకములను పఠించిఅభిషేకము చేయవలెను. ఇట్లు ఏకాదశవారములు చేసినచో అది ఏకాదశరుద్రాభిషేకమగును.] - ఇది క్లుప్తంగా మహాన్యాసం లోని అధికార అర్హతకు చేయవలసిన పధ్ధతి.
నంనాసికాయై నమః, మోం లలాటాయ నమః, భంముఖాయ నమః, గం కంఠాయ నమః, వంహృదయాయ నమః, తేం దక్షిణ హస్తాయనమః, రం వామ హస్తాయ నమః, యంపాదాభ్యాం నమః అనే మంత్రాలు చదువుతూఆయా అంగాల యందు నమస్కార పూర్వకంగాన్యాసము (రుద్రుని నిలుపుట) చేయవలెను.
౩. తృతీయాంగన్యాసము
సద్యోజాతాది మంత్రములు చదువుతూ పాదాదిఅంగములను న్యాసము చేయవలెను. హంసగాయత్రీ మంత్రము పఠించి "హంస హంస" అనిపలికి శిరస్సును స్పృశించవలెను. హంస అనగాశివుడు. ఇలా న్యాసము చేయుట వలన భక్తుడుఆ సదాశివుడే తానగును.
తర్వాత, అంజలి చేసి "త్రాతార మింద్ర...."మొదలగు మంత్రములు పఠించుచు ఆయదిక్కుల అధిదేవతలగు ఇంద్రాదులకునమస్కారములు చేయవలెను. దీనినే, సంపుటంఅంటారు.
తర్వాత దశాంగ రౌద్రీకరణం - భక్తుడు అంజలిఘటించి, పైన సంపుటంలో చెప్పిన మంత్రములుపఠించుచు, వరుసగా తూర్పు నుండి మొదలుపెట్టి అథో దిక్కు వరకు , ఆయా దేహ స్థానాన్నితాకి (లలాటము నుండి పాదముల వరకు),ఆయా దేవతకు నమస్కరించుచు (ఇంద్రునిమొదలు పృథివి చివర) రుద్రుని తన దేహముయందు న్యాసము చేయవలెను. ఇందులో ప్రతిమంత్రమునకు ముందు "ఓంనమశ్శంభవేచ...శ్శివ తరాయచ" అనిచెప్పవలెను.
తర్వాత షోడశాంగ రౌద్రీకరణము - ఓం అంవిభూరసి ప్రవాహణో.... అనే మంత్రముతోమొదలు పెట్టి ఓం అః ఆహిరసి బుధ్నియో"అను మంత్రముల వరకు (అకారాది వర్ణమాల),అన్ని మంత్రములు ప్రతి దాని చివర'రౌద్రేణానీకేన పాహిమాగ్నే పిపృహి మా మామాహిగ్ం సీః' అనే మంత్రభాగమును జోడించిచదువుతూ, తన శిఖ నుండి పాదముల వరకుపదహారు అంగములను తాకుచు, తనదేహమును రుద్రుని భావించవలెను. కొంతమందిదీనికి కూడా ప్రతి మంత్రము ముందు "ఓంనమశ్శంభవేచ...శ్శివ తరాయచ" అనిసంపుటీకరణ చేస్తారు.
దీనివలన తన చర్మము, ఎముకలయందు సర్వపాపములనుండి విముక్తి పొందును, సర్వభూతములచే అపరాజితుడగును,ఉపఘాతములన్ని తొలగి, రక్షణ పొందును.
౪. చతుర్థాంగన్యాసము
"మనోజ్యోతిః...." మొదలగు మంత్రములుచదువుతూ, గుహ్యాది శిరస్యంతం అంగములతాకుతూ, ఆ అంగములను అభిమంత్రణముచేయవలెను. గుహ్యము, పాదములుతాకినప్పుడు అప ఉపస్పృశ్యము చేయవలెను(రెండు చేతులను నీతితో శుద్ధి) - ఈ ప్రక్రియమొత్తాన్ని ఆత్మ రక్షా అంటారు. దీనితో పాటు"బ్రహ్మాత్మ న్వదసృజత" మొదలగు మంత్రములుచదివి 'ఆత్మనే నమః' అని నమస్కారముచేయవలెను. ఇలా చేయటం వలన తన ఆత్మయందు ఆ పరమాత్మ ఉండునట్లు చేయుటఅగును.
౫. పంచమాంగన్యాసము
ఇందులో శివ సంకల్ప సూక్తం ప్రధాన మైనది. "యేవేదం భూతం భువనం భవిష్యతి.."మొదలుకొని ముప్ఫై తొమ్మిది మంత్రములున్నశివ సంకల్ప సూక్తాన్ని పఠించి "ఓం నమోభగవతే రుద్రాయశివసంకల్పగ్ంహృదయాయ నమః" అనిచెప్పి తన హృదయమున న్యాసముచేయవలెను. దీనివలన మోక్షము కలుగును.
తరువాత పురుష సూక్తము పఠించి "ఓం నమోభగవతే రుద్రాయ పురుష సూక్తగ్ంశిరసేస్వాహా" అని శిరసున న్యాసము చేయవలెను.దీనివలన జ్ఞానమోక్ష ప్రాప్తి.
తర్వాత, ఉత్తర నారాయణమును "అద్భ్య స్సంభూతః" మొదలు "సర్వమ్మనిషాణ" వరకుపఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఉత్తరనారాయణగ్ంశిఖాయై వషట్" అని శిఖయందు న్యాసము చేయవలెను.
తరువాత అప్రతిరథకవచమును పఠించి "ఓంనమో భగవతే రుద్రాయ ఆశుశ్శిశానోప్రతిరథంకవచాయ హుం" అని చెప్పి కవచముగా న్యాసంచేయవలెను. దీని వలన శత్రు బాధా నివారణం,విజయ ప్రాప్తి.
తరువాత, "ప్రతి పూరష మేకకపాలాన్నిర్వపతి......" అనే అనువాకమును, "జాతాఏవ ప్రజా రుద్రా న్నిరవదయతే..." అనుఅనువాకమును పఠించి, "ఓం నమో భగవతేరుద్రాయ ప్రతి పూరుషం ప్రతి పూరుషం విభ్రాడితి నేత్రత్రయాయవౌషట్" అని చెప్పి మూడునేత్రములను తాకవలెను.
తరువాత, "త్వ మగ్నే రుద్ర ....." అనేఅనువాకమును, "దేవా దేవేషు శ్రయధ్వం..."అనువాకమును పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ అస్త్రాయ ఫట్" అని న్యాసముచేయవలెను. తరువాత "భూ ర్భువ స్సువ ఇతిదిగ్బంధః" అని దిగ్బంధమును చూపించ వలెను.
తరువాత, ఆష్టాంగ ప్రణామములు చేయవలెను(ప్రతి అంగమునకు ఒక మంత్రము ఉంది. దాన్నిపఠించి, ఎనిమిది అవయవములు భూమిపైతాకునట్లు, వాటిని తాను కూడా తాకుచు ఒక్కొక్కఅవయవామునకు ఒక్కొక్క సాష్టాంగ ప్రణామముచేయవలెను (రొమ్ము, శిరస్సు, కన్నులు, మనస్సు,వాక్కు, పాదములు, చేతులు, చెవులు - ఇవిఅష్టాంగములు).
వీటి తర్వాత, తన్ను రుద్ర రూపునిగా ధ్యానించ వలెను.
శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకందశభుజగ్ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్ంశశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినంనాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకంకమండల్వక్షసూత్రధర మభయవరదకరగ్ంశూలహస్తం జ్వలంతం కపిలజటినగ్ం శిఖాముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టందివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తంసురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధంధ్రువమక్షర మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానంరుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్
దీని తర్వాత, రుద్ర స్నానార్చనాభిషేక విధిని ప్రారంభించ వలెను.
లింగమును ప్రతిష్ఠించి, "ప్రజననే బ్రహ్మాతిష్ఠంతు"మొదలు "సర్వేష్వంగేషు సర్వాః దేవతాఃయథాస్థానాని తిష్ఠంతు మాం రక్షంతు" అనిచెప్పవలెను. (ఇప్పుడు అన్ని అంగములలోఆయా దేవతలు యథా స్థానములందుఉండునట్లు ప్రార్థించునది).
[తరువాత,
No comments:
Post a Comment