Tuesday, April 8, 2025

 *📖 మన ఇతిహాసాలు 📓*


*పాండవులు లేకుంటే ద్రౌపది 14మందితో కాపురం చేయాల్సి వచ్చేది!*

మహాభారతం ద్రౌపదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆమె జీవితం, పుట్టుక, వైవాహిక బంధం అన్నీ ఆసక్తికరమే. పరిచయం అక్కర్లేని ఈ పేరుకు చాలా చరిత్ర ఉంది. ద్రుపదుడి రాజ్యాన్ని పాంచాలమని అంటారు. అర్జునుడి ద్వారా ఈ రాజ్యాన్ని జయించాడు ద్రోణుడు. దాంట్లోని ఉత్తర పాంచాలాన్ని తన దగ్గరబెట్టుకొని, దక్షిణ పాంచాలాన్ని మాత్రమే ద్రుపదుడి కిచ్చాడు. పాంచాలమంటే పంచానాం అలం.. ఐదుగురికి చక్కగా సరిపోయేది అని అర్థం.

*ద్రౌపది పేర్లు*

ద్రౌపదికి చాలా పేర్లు ఉన్నాయి. ద్రౌపదికి పాంచాలి, యగ్నసేని, మహాభారతి, సైరాంధ్రి అనే పేర్లు ఉన్నాయి. పాంచాల రాజ్యానికి రాణి కావడం వల్ల పాంచాలి అనే పేరు, అగ్ని దేవుడి ద్వారా జన్మించడం వల్ల యగ్నసేని అనే పేరు, ఐదుగురికి భార్య అవడం వల్ల మహాభారతి అనేపేర్లు వచ్చాయి.

*యుక్త వయస్సుతో పుట్టింది*

ద్రౌపది తల్లి గర్భాశయం నుంచి జన్మించలేదు. ఈమె అగ్ని నుంచి పుట్టింది. అది కూడా శిశువుగా పుట్టలేదు. యుక్తవయస్సుతో పుట్టింది. ఈమె పాంచాల రాజు అయిన ద్రుపదుడుకి అగ్ని ద్వారా జన్మించింది. అందువల్లే ఈమెను యగ్న సేని అంటారు.

*శ్రీకృష్ణుడు ఒక్కడే ఆమె స్నేహితుడు*

శ్రీకృష్ణుడుకి ప్రాణ స్నేహితురాలు ద్రౌపది. ఆమె పేరు కూడా కృష్ణుడే కదా. భక్తి, దృఢత్వం, నీతితో ద్రౌపది శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందింది. తన ప్రతి విషయాన్ని తన స్నేహితుడు శ్రీకృష్ణుడికి చెప్పుకునేది ద్రౌపది.


*ద్రౌపదికి 14మంది భర్తలు వచ్చేవారు*

ద్రౌపది పూర్వ జన్మలో 14 ప్రత్యేక లక్షణాలున్న వ్యక్తిని భర్తగా కావాలని శివుడిని కోరింది. అయితే అలాంటి 14 ప్రత్యేక లక్షణాలు ఒకే మనిషిలో అస్సలు లేవంట. ఒక వేళ 14 మందిని పెళ్లి చేసుకుంటే తప్పా ఆమె కోరిక తీరదు. అలాంటి తరుణంలో ఈ 14 లక్షణాలు ఐదుగురిలో ఉన్నట్లు శివుడు గుర్తించాడు. వారే పాండవులు. 14 లక్షణాలున్న ఐదుగురు వ్యక్తులు నీకు భర్తలుగా వస్తారని శివుడు వరం ఇచ్చాడంట. ధర్మం, శక్తి, బాణం వేయడంలో నైపుణ్యం, అందం, ఓర్పు తదితర గుణాలున్నా ఆ ఐదుగురిని ద్రౌపది అప్పుడు ఒక్కో గుణం ఒక్కొక్కరిలో ఉండటంతో.. పాండవులను పెళ్లాడింది ద్రౌపది.

*ఐదుగురి భార్య కావాల్సి వచ్చింది*

మత్స్య యంత్రాన్ని ఛేదించిన అర్జునుడిని ద్రౌపది వరించింది. అయితే అనుకోని పరిస్థితుల కారణంగా పాండవులు ఐదుగురికి భార్యగా మారాల్సి వచ్చింది. అతిబల పరాక్రమవంతులైన ఐదుగురు భర్తలను వివాహమాడినా ఆమెకు ఆశించిన ప్రేమ దక్కలేదు.

*ధైర్యశాలి*

ద్రౌపదికి ధైర్యం చాలా ఎక్కువ. ఆమెకు ఎవరికీ భయపడేదికాదు. తనను అవమానపరిన తర్వాత నేరుగా హస్తీనాపురం రాజు ధ్రుతరాష్ట్రుడినే న్యాయం అడిగిన ధీర వనిత.

*కన్యగానే కాపురం చేసేది*

ద్రౌపది తన ఐదుగురి భర్తలతో కాపురం చేసేటప్పుడు చాలా నియమాలు పాటించేది. ఆమె భర్త దగ్గర నుంచి మరో భర్త దగ్గరకు వెళ్లేటప్పుడు అగ్నిలో నడిచేది. దీనివల్ల ఆమె కన్నెతనం అలాగే ఉండేది. అగ్నిలో నడవడం వల్ల ఆమె మళ్లీ పవిత్రతను పొంది కన్నెగా మారేది.

*ఐదుమందిలో అతను అంటేనే ఇష్టం*

ద్రౌపదికి విల్లు, బాణం సంధించడం చాలా ఇష్టం. అలాగే తన ఐదుగురు భర్తల్లో ద్రౌపదికి అర్జునుడంటేనే ఎక్కువ ఇష్టం. అతనితో ఎక్కువగా గడపడానికి ఇష్టపడేది.

*ఉప పాండువులు*

ద్రౌపది తన ప్రతి భర్తతో ఒక కొడుకులను కనింది. వాళ్లను ఉప పాండవులు అంటారు. ధర్మరాజు కు పాంచాలికి ప్రతివింధ్యుడు, భీమునికి శ్రుతసోముడు, అర్జునునకు శ్రుత కీర్తి, నకులునకు శతానీకుడు, సహదేవునకు శ్రుత సేనుడు కలిగారు.

*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

No comments:

Post a Comment