Tuesday, April 8, 2025

 ఇది నా స్వీయ రచన.. 
#శ్రీమతిపద్మాదాశరధి542025

    * లోపభూయిష్టమైన ఆహారశైలి *

అడిగినప్పుడల్లా ఏదంటే అది ఇచ్చి వాడి ఆరోగ్యాన్ని పాడు చేసింది నువ్వు కాదా..?

ఆకాటికి చెప్తునేవున్నా..,
అతిముద్దు అనర్ధాలకి దారితీస్తుందని.." విన్నావా? 

'ఒక్కగానొక్క కొడుకు అన్నావు.., 
 తినటం వల్ల బలమే కానీ ఊబకాయం అందువల్ల రాలేదని నాతో వాదిస్తూ వచ్చావు!. 

' పెట్టేది పౌష్టికాహారమా..
 కాదా..  అన్నది చూడలేదు.. సరికదా..'

అందరూ నా కొడుకు తిండికే దిష్టి పెడుతున్నారు..' 

అన్నావుగాని, వాడికి ఏదిగాని వేళలని క్కూడా చూడక మరీ దిట్టించి పెట్టి  అడ్డంగా పెంచేసావ్.. చూసావు కదా...' 

చిన్నతనంలోనే అధికబరువు వల్ల, గుండెసమస్యలకి..' సుమారుగా చేరువయ్యాడు,

ఇప్పుడు వాడలా..' అచేతనంగా హాస్పిటల్ బెడ్ పై పడి ఉంటే..'  

"ఈ దుస్థితిని చూడ్డానికే అన్నట్టయ్యింది 
మన పరిస్థితి.."

కొడుకు దీనస్థితికి మిక్కిలి  వేదనతో వాపోయాడు   రాఘవ!.

"రోగమనేది మనిషికి కాకపోతే మానుకు వస్తుందా..? " 

ఇప్పుడు మనకేం లోటని?' బోల్డంత డబ్బు ఉండనే ఉంది, దాంతో.. ఎలాగోలా  వదిలించుకోవచ్చు లెండి!..' 

నిర్లక్ష్యంతో ధీమాగా పలికి, 

అదంతా తినడం వల్ల రాలేదు, చూసినవాళ్ళందరూ,నా కొడుకు తిండికి, ఆకారానికి
 సగం దిష్టి పెట్టడం వల్లే.. బహుశా ఇలా జరిగింది
 కాబోలు.."

కొడుకు విషయంలో తన బద్ధకంతో కూడిన  అశ్రద్ధని..' సమర్థించుకుంది.. రాజి!.

"నీ బుర్రలో.. పేర్కుపోయిన బంకమట్టిని వదిలించాలంటే '

"దేవుడే ప్రత్యేకమైన  మరో మనిషిని గుణపాఠంతో.. పంపిస్తేగాని నువ్వు మారవేమోలే..? "  

ఇంత జరుగుతున్న, వాడి జీవనసరళి మారుస్తాననవ్..? 

ఓమూల కొడుక్కి ఏం చెప్తారో..' టెన్షన్ పడుతూ  భార్య.. వాలకానికి  విసుగు చెందేడు!.

అనండి.. అనండి.. అన్నీ నన్నే ఆడిపోసుకోండి..' ఈ మాట ఎప్పటికైన అంటారని..' అనుకుంటూనే ఉన్నా..' 

అందరికన్నా ఎక్కువ నేనే ' బాధపడుతున్నాను,
నా బాధని ఎవ్వరు అర్థం చేసుకున్నారు?' 

ఉక్రోషన్తో..' రోషపడింది రాజి!.

అప్పటికే..' అత్తగారు,మామగారొచ్చి.. మనవడి పరిస్థితికి చింతిస్తూ..'   

అంత చిన్నవయసులో గుండెనొప్పి అనడమేంటి?'  

ఒకప్రక్క ఆశ్చర్యపోతూ, 

కోడలి పెంపక దోషాన్ని.. నిలదీశారని..' 

వాస్తవాన్ని గ్రహించుకోలేక అక్కస్సుతో  కస్సుమనింది రాజి!.

" పెద్దవాళ్లు మన తప్పుని.. వేలెత్తి చూపారని.. రోషపడ్డంకాదు..' 

దానికి మనమెంత బాధ్యులమని..' 

ఆలోచించుకొని సమస్య పరిష్కారానికి..' 
మార్గం వెతుకుతూ, జటిలం కాకుండా చూసుకుందికి.. పనికొచ్చే ప్రయత్నంతో మారితే మంచిది. 

రాజి..'  నీకు అమ్మ ఎన్నోసార్లు పిల్లడి..' 

ఆహారపువిషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోమని.. చెప్పిచూసింది. 

నా కొడుక్కి పెట్టుకుంటే ఈవిడకేం నొప్పి అని..' 

తిరిగి ఆమెని నిష్టూరమాడేవు.  

నిండా 14 ఏళ్లు లేవు..' 

వయసుకి మించిన ఆకారంతో,
అధికబరువు, ఉండకూడని చోట పేరుకుపోయిన కొవ్వుతో  వికృతంగా కనిపిస్తున్నాడు "

మన ముందు కాకపోయినా,  మన వెనక..' వాడి ఆకృతికి నవ్వుకునేవారు లేరనుకున్నావా..'?

జీవనసరళిలో..' తిండి,నిద్రకే ఎక్కువ ప్రాధాన్యతని  ఇస్తే అధికబరువుతో అనర్ధాలకి చేరువవుతారు!. 

ఇప్పటికే కలుషితమైన వాతావరణ.. పరిధిలో ఉన్న మనకి,..' 
ఒక్కనాడంటే ఒక్కనాడు ఇంట్లో ఆరోగ్యకరంగా వండిన పదార్థాల్ని స్వయంగా నీ చేతులతో సవ్యంగా పెట్టుకున్నావా ? ' 

ఎంతసేపు చూసినా,  ప్యాషన్ ప్రపంచమని, ప్రస్తుత ట్రెండ్ అదేనని, వాడికి అవే మప్పుకొని, అక్కర్లేనివి అలవాటు చేసావు..!

మీ తల్లి,కొడుకుల దృష్టంతా   జంక్ ఫుడ్లా వైపుకే.. మనసులాగేది!"

ఆ క్షణానికి అవి రుచితో ఆకర్షణీయంగా  కనబడతాయనిగాని..' 

ఆరోగ్యానికి హాని అనేది తెలుసుకోలేకపోతున్నారు..'

రోజులో ఏదో ఒక పూటైన, ఫాస్ట్ఫుడ్ సెంటర్కి వెళ్లి  తినకుండా ఇద్దరు,  కాలాన్ని.. ముందుకి వెళ్ళనిచ్చారా? "  

పోనీ అప్పుడప్పుడు  ఒంట్లో రుగ్మత వచ్చినప్పుడు వాటి వల్ల ఏమో భావిస్తూ నోళ్ళు ఏమైన కట్టుకున్నారా? "

అంటే అదీ లేదు!.

భార్యకి జరిగిపోయిన కాలాన్ని, ఏవిధంగా దుర్వినియోగం  చేసుకున్నారో..' 

దానివల్ల ముప్పుతో ఇప్పుడు ఎంత బాధ పడుతున్నామో..' 

సాధ్యమైనంత సున్నితంతో  బోధపరిచాడు!.

రాఘవగారంటే మీరేనా?'

డాక్టర్గారు మిమ్మల్నిద్దరినీ..  అర్జెంట్గా ఆయన క్యాబిన్కి  రమ్మంటున్నారని..'

 డ్యూటీ నర్స్ వచ్చి చెప్పడంతో, 

కొడుకు రాజాని, వేసిన  స్పెషల్ వార్డ్ నుండి., అటువైపుకి పరుగులాంటి నడకతో  ఎందుకో ఏమిటోనని ఆందోళనతో..'
 
ఆయన క్యాబిన్లోకి, జతగా వెళ్ళేరు!.  

ఆ.. తల్లితండ్రుల్ని  నిమిషం పాటు పరిశీలనగా పరికించి చూసే ప్రయత్నం చేసి, భృకిటి ముడిపడిన వదనంతో..'

ఆ..డాక్టర్గారు, గంభీరమైన కంఠంతో..' 

పేషంట్ రవి' 
నిత్య దినచర్యని, 

అతని తల్లిగా మీకే ఎక్కువ తెలుస్తుంది కాబట్టి  ఏదీ దాచకుండా విపులంగా వివరించండని, రాజీని చూస్తూ   ప్రశ్నించారు!.

నుదురంతా..' అప్పటికే చిరుచెమటలు పోసి, 
కన్నబిడ్డ ఆరోగ్య విషయంలో ఏం చెప్తారోనని..' 

మిక్కిలి కంగారు పడుతున్న రాఘవ,

అదీ.. అని  ఏదో..' చెప్పడానికి, కంఠాన్ని సవరించుకొన్నాడు, 

మీరు ఆగండి.., 
మీ కన్నా ఆమె అయితేనే బెటర్,  రాఘవని వారించిన డాక్టర్,.. 
తల్లి ఐతే, బిడ్డ ప్రతీ కదలికని క్షుణ్ణంగా వివరించగలరు "..

అందుకే మిమ్మల్నే చెప్పమంటున్నా..'  ఏదీ దాచకుండా చెప్పండి..' 

రాజీ వైపు చూస్తూ డాక్టర్గారు అనడంతో..,

ఇదేదో చిన్న సమస్యలా అనుకుంటే పెద్ద సమస్య లాగా అయ్యేటట్టు ఉందే..? "

ఎలా మొదలెట్టాలో రాజికి పచ్చివెలంకాయే గొంతులో అడ్డు పడినట్టయ్యి  ముందు కాసేపు మౌనంతో భయపడి తటపటాయించింది !.

చెప్పండమ్మా పరవాలేదు డాక్టర్ కాస్త  శాంతంగానే రెట్టించి అడగడంతో, 

అదీ.. మాకు బాబు..  పెళ్లయిన  ఐదేళ్లకి..' 

లేక లేక ఏక సంతానంగా.. కలగడంతో..' 

పొంతనలేని మాటలతో నసగడాన్ని మొదలెట్టింది!.

నేను..'  అడిగింది అది కాదు మేడమ్' 

కేవలం ప్రతిరోజు బాబు దినచర్యని మాత్రమే అడుగుతున్నా..?

బాబు దినచర్య రోజూ,  
ఏవిధంగా  ఉంటుందో..  ఆమె మాటల్లో.. వరుసక్రమంలో  వింటుంటే ఒక్కసారిగా 
మతిపోయినట్టు అయింది డాక్టర్కి..?

ఇటువంటి ఊబకాయంతో మరి స్కూలుకి.. రెగ్యులర్గా వెళ్తుంటాడా?" 

ఆయనకి మొదటిగా వచ్చిన డౌట్ని..'  
వారి ముందు ఉంచాడు!.

ఆ వెళ్తాడు రెగ్యులర్ అనేకంటే ఇరెగ్యులర్ అనే చెప్పాలి డాక్టర్!.

ఓ రోజు గుడ్డుపోటు( కన్నుపోటు ) అంటే, మరోరోజు  తలనొప్పి అంటాడు, ఇంకోరోజు  కడుపులో నొప్పి..'  

ఏదో ఒక బాధతో కంప్లైంట్లు చేస్తూనే ఉంటాడు, వెంటనే రాఘవ ' స్పందిస్తూ చెప్పాడు!.

మరి ఇంట్లో ఉన్న సమయంలో.. ఏమేమి చేస్తుంటాడు?.. 

తినడానికి తినడానికి మధ్య గ్యాప్ ఇస్తుంటాడా..?

 ఎక్కువ జంక్ ఫుడ్కి ప్రాధాన్యత  ఇస్తాడా? 

లేక మామూలు భోజనాన్ని తింటుంటాడా ?.. 
ఒంటి వ్యాయామానికి  టైం ఇస్తూ, ఆ పిల్లోడికి.. చెప్పి ఒప్పిస్తూ  మీరూ చేయించటలేదా? "

లేకపోతే, ఆ వయసులో అతిగా వచ్చిన ఒళ్ళు బలం అనుకుంటున్నారా..? 

విరామమివ్వని ప్రశ్నలని సంధించి అడిగాడు!.

"ఫ్రిజ్ నిండా.. రంగులు కలిపిన  రకరకాల బ్రాండెడ్ కంపెనీల  కూల్ డ్రింకులు, ఐస్క్రీమ్స్, 

అలాగే ఏవిధంగా బలం చేకూరని వ్యర్థపదార్ధాలని నింపుతుంది మా ఆవిడ..'  

అవి అప్పటికే నిల్వపదార్థాలు కాగా మరింత దాచిపెట్టి పెడుతుంది!. వాటికి బాగా ఎడిక్ట్..' అయిపోయాడు!. 

ఏదైన అలవాటు చేయడం.. సులువుగాని, మాన్పుకోవడం బహుకష్టతరం ..'

 అదే జరుగుతుంది ప్రస్తుతం  మా ఇంట్లో అండి!.

ఆ క్షణానికి ఒంట్లో బాగోలేదన్నవాడు మరో గంటలోనే..' 
జంక్ఫుడ్స్ జోలికి వెళ్లడం..' చదువుకోవడం కన్నా, బద్ధకం పాలిటపడి  నిద్రకి ఎక్కువసేపు  ప్రాధాన్యత ఇవ్వడం..' చేస్తుంటాడు!.. 

యధార్ధాన్ని  చెప్పుకొచ్చాడు  రాఘవ!.
  
ఇది నిజమేనా?' అన్నట్టు ఆమె వైపు  మరోసారి ప్రశ్నార్ధకంగా  చూసి వాస్తవం అదేనని..'

" ఆ పిల్లాడి హెల్త్ కండిషన్లో అంతరార్థం  అవగతమయ్యింది డాక్టర్కి..,

"మీకు తెలుసా..? అబ్బాయి..' వయసుకి మించిన ఊబకాయంతో.. షుగరు, బీపీలకి చేరువయ్యి,  కడుపులో అల్చర్లకి..' అంకురం ఏర్పడింది!. 

"ఈ వయసు నుంచే..' రకరకాల మెడికేషన్తో  కెమికల్స్ వాడడం వల్ల, 
వాటి ప్రభావంతో  ఎంత డేంజరో..'  

సాధారణంగా  కాస్తేన ఊహించగల్గేరా ? 

కేవలం లోబడిన ఆహారపు అలవాట్ల వల్లే ఇంత అనర్థం వచ్చింది, 

"మీ ఇంట్లో..' పాతతరహా పద్ధతుల్ని ఆచరణతో ఆవలంబిస్తూ తెలియజేసేందుకు  పెద్దవాళ్ళేవరు లేరా? 

లేక వాళ్ల మాటలని పెడచెవిని పెట్టారా..?' 

"ఇదే వరుసతో ఇక మీదట కూడా వ్యవహరిస్తే, అబ్బాయి ఆరోగ్యానికి మాత్రమే హాని కాదు, ప్రాణానికి కూడా.. ప్రమాదం..' చాలా సీరియస్ అయ్యాడు డాక్టర్!.

అంత మాట అనకండి డాక్టర్..'  

బాబు ఆరోగ్యం కన్నా ఏది ఎక్కువ కాదు..' 

"మీరు ఎలా చెప్తే అలా నడుచుకొని..' ఆహారపు అలవాట్లని మెల్లిమెల్లిగా మారుస్తాను!. 

"మావాడి  ఆరోగ్యం ఆయుష్షు కంటే ఏది మాక్కేక్కువ కాదు.. బోరున విలపించింది తల్లి రాజి!.

"చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం మంటే ఇదే..'  

ఇప్పటికైన ప్రమాదపు అంచున అతని ఆరోగ్యం ఉన్నాదని గ్రహించి నేను చెప్పిన పద్ధతులని దినచర్యలో భాగంగా  కష్టంగా తీసుకోక, ముఖ్యమనుకొని  బాబుని మోటివే చేస్తూ మార్చుకుంటే..'  ఫలితం వెంటనే కాకపోయిన నిదానంతో  కొన్నాళ్ళకి.. రావచ్చు!.

అప్పటికప్పుడు ఓ చార్ట్ని.. ప్రిపేర్ చేసి'  ప్రతినిత్యం దినచర్యలో క్రమం తప్పకుండా నేను సూచించినట్లే  పాటించాలని..' 

మాటలో ఖచ్చితాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి మరో మూడురోజుల వరకు చిన్న వయసేన తప్పదు మరి,  పవర్ఫుల్  యాంటీబయటిక్..' ఎక్కించాల్సిందే 
పెదవివిరిచాడు!.
***
"కొన్ని జటిల సమస్యలకి  నిర్ణయాల్ని.. కఠినంగా తీసుకుంటేనే   పరిష్కార'మవుతాయని.. 
తెలిసిన  రాఘవ..' 

తల్లితండ్రులు ఉండే  ఊరికి..' భార్య,పిల్లడిని కట్టడితో  అలవాట్ల మార్పికై  కొన్నాళ్లపాటు.. పంపిస్తాడు!. 

" చక్కగా వేకువజామునే లేవడం,పొద్దున్నే వ్యాయామం..' 

సరైన టైమ్కి  అల్పాహారం..' 
మధ్యాహ్నం సాధుగా ఉండేటట్టు పౌష్టికకరమైన మితాహారం , వీటన్నిటికీ మించిన..'  డిస్ప్లేన్..' అలవడేలా..' భయపెట్టో,బ్రతిమాలో..' 

మనవడిని చేరదీసి..' మనిషిలో మార్పు తెచ్చేందుకు కష్టపడేరు!.

"మొక్కై వంగనిది మానై వంగడ'మంటే..' 

అంత తేలికైన విషయమైతే కాదు!. 

"తేలికగా మప్పుకోగలిగినంతగా.. '  మంచిగా మరల్చుకోవడం..' 

కష్టమే కావచ్చు కానీ దాని ఫలితంతో.. లాభం కోకొల్లలు!.
***
"ఒక్కసారి వెంటనే కాకపోయిన..' 
మెల్లిగా.. ముందు తల్లి తర్వాత బిడ్డలో మార్పు రాసాగింది!. 
హాస్పిటల్లో నిండా వైర్లు పెట్టి..'  పెద్ద పెద్ద సూదులతో గుచ్చుతుంటే భయంతో బెగిలిపోయిన రవి, కేవలం తన  యెక్క ఆహారపు అలవాట్లు, లోపభూయిష్టమైన దినచర్య   కారణంగానేనని..' 

డాక్టరు..'  సీరియస్గా  చెప్పడంతో.. పక్కబెదురుతో..' మెల్లిమెల్లిగా మార్పుని తాతా, నాయనమ్మ చేర్పున  పాతకాలపు తరహా ఆహారపు అలవాట్ల వల్ల..'

ప్రస్తుత కాలమాన పరిస్థితుల బట్టి..'  సొంతసిరిలో,  పెద్దజాగాతో వున్న పెరట్లో కూరగాయలు.. ఆకుకూరలు ఓ రెండురకాల..' ఫలాల చెట్లు..'  ఉండడంతో సాధ్యమైనంత.. వాటి నీడనే మసులుతూ,  ఇంట్లో ఉన్నవాటితో సర్దుకొని..'  తింటూ,ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడమెలాగో..'  స్వానుభవంతో నింపాదిగా  అలవాటు చేసుకోసాగాడు!.

కాలం ముందుకి వెల్లదీస్తుంటే  ఇప్పుడు అంచలంచెలుగా.. ఆకృతైన  అంగసౌష్టవం, లావు మీద బొద్దుగా కనబడే మోములో మార్పు చేరి..'   అందంగా అగుపిస్తున్నాడు!. 

దానికి తోడు అప్పుడే యవ్వనంలోకి.. ఆరంభమొకటి!. 

ముందు రోజుల్లో.. కేవలం ఒంటిబరువు బద్ధకం వల్ల మెదడు మొద్దుబారి  చదువు ఎక్కేది కాదు.." 

కాలంతో పాటు మనిషి నాజూగ్గా తయారవుతున్నకొలది..' 

పాదరసంలాంటి తెలివితేటలతో చురుగ్గా..' 

చదువులో  ముందంజలో ఉండగలుగుతున్నాడు!.

"ఈ సమస్య అతనొక్కడిదే కాదు, 

నేటి వ్యవస్థలో.. బాలలు,యువతలో..'  నిత్య సమస్యగా పరిగణిస్తోంది!. 

విలంబంతో  పిల్లలతోపాటు, పెద్దలు బాధ్యులే!.

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహించక  వ్యర్థపదార్థాలలో  ఎంత విషవలయం  చుట్టి ఉందో  నర నరాల్లో ప్రాకక  మునుపే..'  అందరిలో కొందరైన అనారోగ్యపాలవకమునుపే, వాస్తవాన్ని ఎరిగి  మేలుకుంటే కొంతలో కొంతైన జాగ్రత్త పడిన వాళ్ళమవుతాము!. 

"ఇది ఎవరో ఒక్కరి సమస్య కాదు సమాజాన్ని పట్టిపీడిస్తున్న.. తన వైపుకి  ఆకర్షించుకునే  అంటూవ్యాధి లాంటిది!.

                 *శుభం*

No comments:

Post a Comment