Tuesday, April 8, 2025

 ఆ రోజులు బాగున్నాయ్.....

ఆదివారం ఆటలాడుతూ అన్నాన్ని, ఆకలిని మరిచిపోయిన ఆ రోజులు బాగున్నాయ్.....

మినరల్ వాటర్ గోల లేకుండా నల్లా దగ్గర, బోరింగుల దగ్గర,  బావుల దగ్గర దోసిళ్లతో నీళ్లు తాగిన ఆ రోజులు బాగున్నాయ్.....  ఎండాకాలం సలివేంద్రాల దగ్గర చల్లని నీళ్ల కోసం ఎర్రని ఎండను  సైతం లెక్క చేయకుండా వెళ్లిన ఆ రోజులు బాగున్నాయ్... 

వందల కొద్ది ఛానళ్లు లేకున్నా.. ఉన్న ఒక్క దూరదర్శన్లో చిత్రలహరి, 

ఆదివారం సినిమా కోసం వారమంతా ఎదురుచూసిన ఆ రోజులు  బాగున్నాయ్... 

సెలవుల్లో అమ్మమ్మ, నానమ్మల ఊళ్లకు వెళ్లి... 

ఇంటికి రావాలన్న ఆలోచన మరిచిపోయిన ఆ రోజులు ఎంతో బాగున్నాయ్... 

ఏసీ కార్లు లేకున్నా... ఎర్రబస్సులో కిటికీ పక్క సీట్లో కూర్చోని ప్రకృతిని ఆస్వాదించిన ఆ రోజులు బాగున్నాయ్...

మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా బర్త్ డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ... 

చాక్లెట్లు పంచిన ఆ రోజులు బాగున్నాయ్... 

మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ లేకున్నా ఎండాకాలం మామి  డికాయ పచ్చడి పెట్టిన రోజున 

అందరం కలిసి పచ్చడి కారం కలుపుకుని అన్నం తిన్న రోజులు బాగున్నాయ్.... 

జేబునిండా కార్డులున్నా, పర్సు నిండా డబ్బులున్నా... 

కొట్టుకు పంపితే మిగిలిన చిల్లర నొక్కేసిన ఆ రోజులు బాగు న్నాయ్.

బటర్ స్కాచ్ చల్లగా నోట్లో నానుతున్నా.... 

అమ్మ చీర కొంగు పైసలతో గీతా ఐస్క్రీ కొనుక్కుని తిన్న ఆ రోజులు బాగున్నాయ్.. 

దొంగల భయం, సెల్ఫోన్ పోతదనే భయం లేకుండా. 

ఎండాకాలం ఆకాశంలో చందమామను చూస్తూ... వాకిట్లో పడుకున్న రోజులు బాగున్నాయ్... 

ఆ రోజులు బాగుంటాయ్.... ఎందుకంటే... అవి మళ్లీ రావు కాబట్టి..!

No comments:

Post a Comment