Thursday, April 10, 2025

 *ప్రతి మనిషి నేను సుఖంగా, ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకుంటాడు. మంచిదే కానీ ఆ సుఖం, ఆనందం ఎక్కడ ఉందో ఎలా లభిస్తుందో తెలుసుకోవడం లేదు.*

*దైవమును మరచి ప్రాపంచిక సుఖాలే నిత్యమనుకుంటాడు. సుఖము వచ్చినపుడు తానే కర్తనంటాడు. దుఃఖము వస్తే దైవమును నిందిస్తాడు.*

*నిజమునకు సంసారము సుఖదుఃఖముల సమ్మేళనము. సుఖదుఃఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూపోతూ ఉంటాయి.*

*మనసును ప్రాపంచిక విషయముల నుండి మరలించి భగవంతుని యందు స్థిరంగా ఉంచితే అదే శాశ్వతసుఖము. దాని కోసం ఎవరూ ప్రయత్నించరు. ఎపుడూ తాత్కాలిక సుఖాల కోసమే పాకులాడుతుంటాము. వాటినే మనసులో చింతిస్తూ ఉంటాము.*

*ఇలా ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తూ పరమాత్మ గురించి ఆలోచించని వాడికి శాశ్వతమైన సుఖము, ఆనందము ఎలా లభిస్తాయి? దీనికి బాధ్యులు ఎవరు మనమా? భగవంతుడా?? మనము చేసుకున్నదానికి భగవంతుని నిందిస్తే ఎలా??!*

 *┈┉┅━❀꧁ హరి ఓం ꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
*🍁🌹🍁 🙏🕉️🙏 🍁🌹🍁*

No comments:

Post a Comment