Tuesday, April 8, 2025

 ఆరోగ్యమే మహా భాగ్యం 


ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుతారు.హెల్తీ గా ఉండాలంటే తప్పనిసరిగా కొన్నిరకాల జాగ్రత్తలు పాటించాలి. అందులోభాగంగా ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోవాలి.. ఆరోగ్యంగా ఉండటానికి,సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

 మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మానసికంగా,శారీరకంగా ఆరోగ్యంగా ఉందలంటే..? హెల్తీ ఫుడ్ ను ఎంచుకోండి. ప్రకృతి మనకు సహజ సిద్ధంగా అనేక రకాల కాయలు,పండ్లు, కూరగాయలు అందిస్తోంది. వీటిని తినడం వల్ల మన శరీరాన్ని వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. 

ఇందు కోసం ఆకుకూరలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ప్రత్యేకంగా ఆహారంలో చేర్చుకోవాలి. ఇది కాకుండా, ప్రోబయోటిక్ ఆహారాలు కూడా మంచివి, ముఖ్యంగా పెరుగు. సీజనల్ పండ్లను కూడా తప్పకుండా తినాలి. అవకాడో వంటి కొన్ని ప్రత్యేక పండ్లలో అనేక రకాల విటమిన్లు , మినరల్స్ ఉంటాయి. ఇతర పండ్లతో పోలిస్తే ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్నా మంచి కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది పొటాషియం, యాంటీఆక్సిడెంట్లకు కూడా మంచి మూలం. ఇవే కాకుండా బొప్పాయి, కీరదోస, దోసకాయ, పుచ్చకాయ వంటి అనేక పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తీసుకోవడం ద్వారా హెల్తీగా ఉండొచ్చు.

1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి ప్రపంచ ఆరోగ్య సమావేశాన్ని నిర్వహించింది . 1950 నుండి అమలులోకి వచ్చేలా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7 ను ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోవాలని అసెంబ్లీ నిర్ణయించింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని సంస్థ స్థాపనకు గుర్తుగా జరుపుకుంటారు మరియు ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్యానికి ముఖ్యమైన విషయంపై ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించడానికి సంస్థ దీనిని ఒక అవకాశంగా భావిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నిర్దిష్ట ఇతివృత్తానికి సంబంధించిన రోజున అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు స్థానిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రజారోగ్య సమస్యలపై ఆసక్తి ఉన్న వివిధ ప్రభుత్వాలు మరియు ప్రభుత్వేతర సంస్థలు గుర్తించాయి.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన 11 అధికారిక ప్రపంచ ఆరోగ్య ప్రచారాలలో ఒకటి , ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం , ప్రపంచ రోగనిరోధక వారం , ప్రపంచ మలేరియా దినోత్సవం , ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం , ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం , ప్రపంచ రక్తదాతల దినోత్సవం , ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవం , ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం , ప్రపంచ యాంటీమైక్రోబయల్ అవగాహన వారం మరియు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంవంటివి ఉన్నాయి.

2025లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనక భవిష్యత్తులు అనే ఇతి వృత్తం తో జరుపుతున్నారు.శాస్త్రవేత్త ల కృషి ఫలితంగా ఈనాడు వివిధ రకాల రోగాలకు మందులు, వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో కొత్త అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ రోజు వైద్యం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. పేద వారు వైద్య ఖర్చులని భరించే స్థితిలో లేరు. మరోవైపు వైద్య విద్యను అభ్యశించలన్నా సామాన్య ప్రజల వల్ల కావడం లేదు. ప్రభుత్వాలు వైద్య విద్య ఖర్చులు తగ్గించాలి. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగు పర్చాలి. మందుల ధరలను తగ్గించాలి. అదే విధంగా ప్రజలు మద్య పానానికి, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఆరోగ్యమే మహా భాగ్యం అని అందరూ గ్రహించాలి.

యం. రాం ప్రదీప్ 
జెవివి సభ్యులు, తిరువూరు 
9492712836
(ఏప్రిల్ 7-ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని )

No comments:

Post a Comment