చూపున్న మాట
Fatty liver: కాలేయ కొవ్వు... పెనుముప్పు
దేశ జనాభాలో 65% మందిలో సమస్య
అపోలో హెల్త్ ఆఫ్ ది నేషన్-2025 నివేదిక
ఈనాడు, హైదరాబాద్: దేశ ప్రజల్లో ఫ్యాటీలివర్ (కాలేయంలో కొవ్వు) ఆందోళనకర రీతిలో వృద్ధి చెందుతోంది. ఏకంగా 65% మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు అపోలో ఆసుపత్రి సోమవారం విడుదల చేసిన హెల్త్ ఆఫ్ ది నేషన్-2025 నివేదిక వెల్లడించింది. మొత్తం బాధితుల్లో మద్యం అలవాటులేని వారు 85% మంది ఉన్నారని, ఇది ఆందోళనకరమంది. దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్‌గా వ్యవహరిస్తారంది. దేశవ్యాప్తంగా 25 లక్షల మందికిపైగా వ్యక్తుల ఆరోగ్య పరీక్షల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ డా.ప్రతాప్ సి.రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లోనూ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సంస్థ ఎండీ డా.సునీతారెడ్డి మాట్లాడుతూ.. లక్షల మందికి ఎలాంటి బాహ్య లక్షణాలు కన్పించనప్పటికీ దీర్ఘకాలిక అనారోగ్య స్థితిని ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ఫ్యాటీలివర్ మాత్రమే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతోపాటు దేశవ్యాప్తంగా ఇతర జీవనశైలి వ్యాధులు(ఎన్‌డీసీ) పెరుగుతున్నాయి. పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల్లోనూ ఊబకాయం పెరుగుతోంది. జంక్‌ఫుడ్‌కు, ధూమపానానికి, మధ్యపానానికి దూరంగా ఉండాలి. నిత్యం వ్యాయామం చేయాలి. ఆహారంలో పండ్లు, చిరుధాన్యాలను చేర్చాలి. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి’’ అని నివేదిక సూచించింది.
నివేదికలో ఇతర ప్రధానాంశాలు
నిశ్శబ్ద గుండె ప్రమాదాలు: 46%
ప్రాథమిక పాఠశాల పిల్లల్లో ఊబకాయం: 8%
కళాశాల విద్యార్థుల్లో అధిక బరువు: 28%
మహిళలు, పురుషుల్లో హైపర్‌టెన్షన్: 26%
డి-విటమిన్ లోపం... పురుషుల్లో 77%,
మహిళల్లో 82%
మానసిక సమస్యలున్నవారు: 6%
నిద్ర రుగ్మతలు ఉన్నవారు: 24%
మధుమేహం సమస్య: 23%
No comments:
Post a Comment