అమరయోగి మహావతార్ బాబాజీ జీవితం మరియు జ్ఞానం | Mahavatar Babaji Life Story in Telugu #mahavatarbabaji
హాయ్ ఫ్రెండ్స్ నా పేరు భార్గవ రెడ్డి నేను గత 14 సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తున్నాను. నాకు ఆధ్యాత్మిక పుస్తకాలు అంటే చాలా ఇష్టం. నేను అనేక ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతుంటాను. ఆ పుస్తకాల్లోని జ్ఞానాన్ని మీ అందరితో పంచుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు నేను శ్రీ మహావతార్ బాబాజీ గారి జీవిత విశేషాలు మరియు ఆయన యొక్క జ్ఞానాన్ని మీతో పంచుకోబోతున్నాను. ఈ యొక్క కంటెంట్ ని కాన్వర్జేషన్ విత్ మహావతార్ బాబాజీ దీనినే తెలుగులో మహావతార్ బాబాజీతో సంభాషణలు అనే పుస్తకంలోనే జ్ఞానాన్ని మీతో పంచుకోబోతున్నాను. ఇక వీడియోలోకి వెళితే పూజకోటి సమం స్తోత్రం స్తోత్రకోటి సమోజపః జపకోటి సమం ధ్యానం ధ్యానకోటి సమోలయః అని శ్రీకృష్ణ భగవానుడు ఉత్తరగీతలో శ్రీ అర్జునుడికి చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని సమస్త మానవాళికి ప్రాక్టికల్ గా చెప్పడం కోసం ఒక అవతారం అవతరించింది. ఆ అవతారం పేరే శ్రీ శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారు. మనిషి కేవలం మాంసపు ముద్ద మాత్రమే కాదని ఈ మాంసపు ముద్దను నడిపించే ఆత్మ చైతన్యం అని ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసం మనిషి తన బాహ్య ప్రపంచం నుంచి తిరిగి అంత ప్రపంచంలోకి ప్రయాణించాల్సి ఉంటుంది. ఎవరైనా అతి సుదీర్ఘ ప్రయాణం దేనిని చేరుకోవడానికి అని అడిగితే మనం ఏదో గ్రహం పేరు చెప్తాం. కానీ నిజానికి అతి సుదీర్ఘ ప్రయాణం మన అంత ప్రపంచాన్ని చేరుకోవడానికి పట్టే సమయమే. అదేమిటి కళ్ళు తెరిస్తే ఉన్నది బాహ్య ప్రపంచం కళ్ళు మూస్తే ఉన్నదంతా అంత ప్రపంచమే కదా మరి వీటి మధ్య దూరం ఎక్కడుంది అని మీకు సందేహం కలగవచ్చు. నిజానికి సగటు మనిషి తన బాహ్య ప్రపంచం నుంచి తన అంత ప్రపంచంలోకి చేరుకోవడానికి అనేక వందల జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల మనిషి పరిణామ క్రమమే కాకుండా ఈ భూమి యొక్క పరిణామ క్రమం కూడా మందగించడంతో ఈ పరిణామ క్రమాన్ని సులువుగా మరియు వేగవంతం చేయడానికి ఆ పరమశివుడి యొక్క సంకల్పంతో ఆయన మెడలోని నాగుపాము నాగరాజనిగా జన్మ తీసుకొని కఠిన కఠోర సాధనలు చేసి మహావతార్ బాబాజీగా ఎదిగి ఆ కఠిన కఠోర సాధనల వల్ల దేనినైతే తెలుసుకున్నారో ఆ విద్యనే క్రియాయోగ విద్యగా ఈ సమస్త మానవాళకి ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ క్రియాయోగ మరియు ధ్యాన సాధనను క్రమం తప్పకుండా చేస్తారో వారికి మహావతార్ బాబాజీ గారి గైడెన్స్ అందుతుంటుంది. అలా ఆయన గైడెన్స్ అందుతున్న వాళ్ళలో నేను కూడా ఒకడినని సంతోషంగా చెప్పగలను. సమయ సందర్భం వచ్చినప్పుడు నాకు బాబాజీతో ఉన్న అనుభవాలు ఏంటో ఖచ్చితంగా నేను మీతో పంచుకుంటాను. అయితే ఈ పుస్తకంలో నాకు బాబాజీ గారితో ఒక అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని ఈ వీడియో చివరిలో మీతో పంచుకుంటాను. ఇక ఈ క్రియాయోగ విషయానికి వస్తే బాబాజీ గారు ఈ పుస్తకంలో ఈ క్రియాయోగ విద్య గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు కాబట్టి నేను కూడా ఈ విషయం గురించి ఎక్కువగా మీతో చెప్పదలుచుకోలేదు. ఇక బాబాజీ గారి జీవిత విశేషాల్లోకి వెళ్లే ముందు ఈ పుస్తక రచయిత ఆవిడ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోబోతున్నాను. ఈ పుస్తక రచయిత పేరు మాస్టర్ పల్లవి గారు ఈవిడ మహారాష్ట్ర బీడి జిల్లాలో సెప్టెంబర్ 3 1986 లో జన్మించడం జరిగింది. ఈవిడ చెన్నైలో గ్రాడ్యువేషన్ చేస్తున్నప్పుడు ఈవిడ స్నేహితురాలి మదర్ ద్వారా ఈవిడకి మొట్టమొదటిసారిగా పిరమిడ్ ధ్యానం పరిచయమయింది. 2006 నుంచి మాస్టర్ పల్లవి గారు ప్రతిరోజు ధ్యానం చేస్తున్నారు. ఈవిడకి 2009 లో మొట్టమొదటిసారిగా మహావతార్ బాబాజీ గారితో అనుభవం కలిగింది. 2017 లో ఈవిడ ఒకసారి మెడిటేషన్ లో ఉన్నప్పుడు మహావతార్ బాబాజీ గారు ఈవిడక ఒక మెసేజ్ ఇస్తారు. అదేంటంటే 2018 లో నేను నీ దగ్గరికి వస్తాను. అప్పుడు నేను నా జీవిత విశేషాలు అదేవిధంగా నీకున్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాను అని చెప్తారు. అయితే మాస్టర్ పల్లవి గారికి బాబాజీ గారు మూడు విధాలుగా మెసేజెస్ ని ఇచ్చేవారు. మొదటిది బాబాజీ కనపడి మెసేజెస్ ని ఇచ్చేవారు. రెండవది బాబాజీ వాయిస్ ద్వారా మెసేజెస్ అందేవి. మూడవది ఆయన ప్రెసెన్స్ ని ఫీల్ అవుతూ. ఇలా మూడు విధాలుగా బాబాజీ గారు ఆయన యొక్క జ్ఞానాన్ని మాస్టర్ పల్లవి గారికి ఇవ్వడం జరిగింది. బాబాజీ గారు చెప్పినట్లుగానే 2018 లో మాస్టర్ పల్లవి గారితో కనెక్ట్ అయ్యి ఏదైతే ఆ విలువైన జ్ఞానాన్ని ఇచ్చారో ఆ యొక్క జ్ఞానాన్ని కన్వర్జేషన్ విత్ మహావతార్ బాబాజీ అనే పుస్తకం ద్వారా మనకు అందించడం జరిగింది. ఇక బాబాజీ గారి జీవిత విశేషాల్లోకి వెళితే పరమశివుడి యొక్క దివ్య సంకల్పంతో ఆయన మెడలోని నాగుపాము తమిళనాడులోని కడలూరు జిల్లాలో పెరంగిపెట్టై అనే ఊర్లో నాగరాజన్ గా జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఈయన మార్చి 23, 203 ఏడి లో జన్మ తీసుకోవడం జరుగుతుంది. సరళమైన భాషలో చెప్పాలంటే ఇప్పటికి ఆయన జన్మ తీసుకొని 1822 సంవత్సరాలు అయింది. అలా నాగరాజన్గా జన్మ తీసుకొని కఠిన కఠోర సాధన చేసి మహావతార బాబాజీగా ఎదిగారు. నాగరాజన్ గారి జన్మను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ పుస్తకంలో బాబాజీ గారు చెప్పిన దాని ప్రకారం నాగరాజన్ గారు ఎవరో కారు పరమశివుడి మెడలోని ఆ నాగుపామే నాగరాజనిగా జన్మ తీసుకున్నారు అని నాగుపాము మనిషిలోని కుండలిని శక్తికి ప్రతీక అంటే ప్రతి మనిషిలో కూడా ఈ కుండలిని శక్తి నాగుపాము రూపంలో ఉండి నిద్రాణ స్థితిలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుందో ఇది మనలోని షట్ చక్రాలను యాక్టివేట్ చేస్తూ సహస్రార చక్రాన్ని చేరుకుంటుంది. దీని యొక్క అర్థం ఆ వ్యక్తికి ఆత్మ సాక్షాత్కారం అయ్యింది అని ఈ విధంగా నాగరాజన్ గారి పుట్టుకతోనే మనకు అర్థమవుతుంది. సమస్త మానవాళని ఆత్మ సాక్షాత్కారం వైపు నడిపించడానికే అని ఇక మహావతార్ బాబాజీ గారి బాల్య విశేషాల్లోకి వెళ్తే నాగరాజన్ గారికి తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన ఫ్రెండ్స్ తో ఆడుకొని అలసిపోయి ఒక బావి గట్టున కూర్చుంటారు. అయితే ఈ ఫ్రెండ్స్ లో దమన అనే అబ్బాయి కూడా ఉంటాడు. అతను స్లిప్ అయి బావిలో పడిపోతాడు. అయితే ఆ దమనాన్ని కాపాడడం కోసం నాగరాజన్ మరియు వారి స్నేహితులందరూ కూడా సహాయం కోసం ఆ చుట్టుపక్కల ఎవరనా ఉన్నారా అని గట్టి గట్టిగా అరిచి చూస్తారు. ఎంతకీ సహాయం అందకపోవడంతో అప్పుడు ఈ నాగరాజన్ దమనాన్ని కాపాడాలని ఆ చెట్టుకి ఒక దారం ఉంటుంది. అప్పుడు ఈ నాగరాజన్ తన స్నేహితులతో ఆ దారాన్ని బావిలోకి వేయమని చెప్తాడు. అలా నాగరాజన్ అతి కష్టంగా ఆ దారాన్ని పట్టుకొని బావి లోపలికి వెళ్తాడు. వెళ్ళంగానే అక్కడ దమన ఎంతో భయంతో వనికిపోతూ ఉంటాడు. అప్పుడు నాగరాజన్ దమనాతో భయపడకు దమన నేను నిన్ను కాపాడతాను అని చెప్పి ఏదైతే దారం ఉందో ఆ దారం సహాయంతో నాగరాజన్ దమనాన్ని ఆ బావి గట్టుకు పంపిస్తాడు. ఈ నాగరాజన్ దమనాన్ని కాపాడే క్రమంలో తనకు ఈతరాదని మర్చిపోతాడు. అలా నాగరాజన్ స్లో స్లో స్లోగా ఆ నీటిలో మునిగిపోయి అడుగు భాగానికి చేరుకుంటాడు. అప్పుడు తను ఎంతగానో ప్రయత్నిస్తాడు తనకు ఎలాంటి సహాయం అందదు అప్పుడు నేను ధమనానే కాపాడినప్పుడు నన్ను నేను ఎందుకు కాపాడుకోకూడదు అని ఆలోచించి తన చేతుల్ని కాళ్ళని గట్టిగా కొట్టడం మొదలు పెడతాడు. అప్పుడు బావి పై నుంచి ఒక బంగారు కాంతి బావిలోకి ప్రవేశించడం ఈ నాగరాజన్ చూస్తాడు. ఆ కాంతి నెమ్మది నెమ్మది నెమ్మదిగా అడుగు భాగంలో ఉన్న ఈ నాగరాజన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు నాగరాజన్ ఆ కాంతిని ముట్టుకోగానే ఆ కాంతి మొత్తం ఈ నాగరాజన్ శరీరంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు స్లో స్లో స్లోగా ఈ నాగరాజన్ ఆ బావి ఉపరితలానికి చేరుకుంటారు. చేరుకోగానే ఏదైతే దారంతో ఆ దమనాన్ని పైకి పంపించాడో ఈ నాగరాజన్ కూడా ఆ దారాన్ని పట్టుకొని బావిగట్టుకు చేరుకుంటాడు. అయితే ఈ సంఘటన నాగరాజన్తో పాటు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ సంఘటన వల్ల నాగరాజనికి ఏం అర్థం అవుతుంది అంటే జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా భయపడకూడదు దానిని ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి అని అర్థమవుతుంది. ఒకరోజు ఈ నాగరాజన్కి ఒక కల వస్తుంది. అదేంటంటే కలలో ఒక చిన్న అబ్బాయిని కొంతమంది కిడ్నాప్ చేస్తున్నట్లు ఈ కలని ఈ నాగరాజన్ తన తల్లితో చెప్తాడు అన్నమాట చెప్తే తన తల్లి చెప్తుంది అది నిజం కాదు అది కల మాత్రమే దాని గురించి ఎక్కువ ఆలోచించుకో అని సరే తల్లి చెప్పినట్లే ఈ నాగరాజన్ కూడా ఆ కల గురించి ఆలోచించడం మానేస్తాడు. నాగరాజని కళలో చూసినట్టుగానే ఒకరోజు ఊరికి కొంత దూరంలో ఉన్న ఒక శివాలయం దగ్గర ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే ఇద్దరు తెలియని వ్యక్తులు ఈ నాగరాజన్ని ఒక విధంగా చూస్తూ నాగరాజన్ దగ్గరికి వచ్చి వారి దగ్గర ఉన్న ఆ మత్తిమందు కచచీఫ్ ని ఈ నాగరాజన్ ముక్కు దగ్గర ఉంచుతారు. అలా ఉంచగానే కొంత సమయం తర్వాత ఈ నాగరాజన్ అన్కాన్షస్ అయి పడిపోతాడు. మరిసరిటి రోజు ఈ నాగరాజన్ కి సృహ వస్తే అప్పుడు తనకు తెలుస్తుంది తనని ఎవరో ఒక చీకటి రూమ్లో కాళ్ళు చేతులు కట్టి పడేశారు అని అయితే ఈ నాగరాజన్ కి ఈ దాహం ఆకలి వేస్తుంటుంది అన్నమాట అయితే నీళ్ల కోసం ఆహారం కోసంని ఎంతెంతగానో అరుస్తాడు అన్నమాట ఎవ్వరు కూడా తన దగ్గరికి రారు. అలా నాగరాజన్ అరిచి అరిచి అలసిపోయి ఆ శివున్ని తలుసుకొని ఏడుస్తూ ఉంటాడు. మూడవ రోజు ఇద్దరు వ్యక్తులు ఈ నాగరాజన్ని ఆ చీకటి రూమ్ నుంచి బయటకి తీసుకొచ్చి ధనవంతుడైన ఒక బెంగాళీ వ్యక్తికి అమ్మేస్తారు. ఈ బెంగాళీ వ్యక్తి నాగరాజుని ఎంతో సంతోషంగా తన ఇంటికి తీసుకెళ్తాడు. ఈ బెంగాళీ వ్యక్తి ఆయన భార్య ఇద్దరు బెంగాళీలో మాట్లాడుకుంటుంటారు. అయితే ఆ భాష ఏంటో ఈ నాగరాజన్కి అర్థం కాదు. ఈ దంపతులుఇద్దరూ నాగరాజన్నని ఎంతో ప్రేమతో చూసుకుంటుంటారు. అయితే వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్నా నాగరాజన్ అసంతృత్తితో ఉండేవాడు. చాలా రోజుల వరకు నాగరాజన్ దేవుడి మీద కోపంతో ఉండేవాడు. ఈ దేవుడు నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడు అని కానీ క్రమక్రమంగా నాగరాజన్లో మార్పు వచ్చి ఆ పరిస్థితిని కూడా యక్సెప్ట్ చేస్తాడు. అదేవిధంగా ఆ బెంగాళీ దంపతులతో ఎంతో ప్రేమగా ఉంటూ వారికి అన్ని పనుల్లో సహాయం చేస్తూ ఉంటాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది. కాస్త సమయం దొరికినప్పుడల్లా ఈ నాగరాజన్ పుస్తకాలు చదువుతుంటాడు. అయితే ఒకరోజు ఆ ధనవంతుడు ఈ నాగరాజన్తో మేము నిన్ను కొడుకుగా అనుకొని నిన్ను కొనుక్కొచ్చుకున్నాము. మీ తల్లిదండ్రుల్లా నిన్ను చూసుకోవడానికి ప్రయత్నించాము. కానీ ఎంత ప్రయత్నించినా నీలో మీ తల్లిదండ్రుల నుంచి నిన్ను వేరు చేసిన ఆ వెలితి కనబడుతుంది. మేము నీకు మీ సొంత తల్లిదండ్రులు లేని లోటిని తీర్చలేమని మాకు అర్థమైంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈ క్షణం నుంచి నువ్వు స్వతంత్రుడివి నువ్వు ఇక్కడి నుంచి వెళ్లొచ్చు నిన్ను ఆపేవాడు ఎవ్వరూ లేరు అని ఆ ధనవంతుడు నాగరాజన్కి చెప్తాడు. ఈ మాటలు విన్న నాగరాజన్ ఎంతగానో సంతోషిస్తాడు. మళ్ళీ ఆ ధనవంతుడు నువ్వు సాధారణ పిల్లోడివి కాదు నువ్వు ఒక గొప్ప యోగవి నీకు ఇష్టంవచ్చిన చోటికి వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు నాగరాజన్ ఆనంద భాష్పాలతో ఆ ఇంటి నుంచి బయటకి రాగానే ఆ ఇంటి ముందు నుంచి ఒక సాధువుల సమూహం అలా నడిచి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఈ నాగరాజని కూడా ఆ సాధువులను వెంబడిస్తూ వెళ్తాడు. ఇంతవరకు మహావతార్ బాబాజీ తన చిన్ననాటి అనుభవాలను చెప్తారు. అయితే ఈ రచయిత తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆతృతతో ఎదురుచూస్తుంటుంది. రెండు రోజులైనా కూడా బాబాజీ నుంచి ఎలాంటి మెసేజ్ అందదు. అయితే ఒకరోజు ఈ పుస్తక రచయిత మాస్టర్ పల్లవి గారు మరియు ఆవిడ హస్బెండ్ కృష్ణ బొమ్మ రెడ్డి గారు ఒక స్పిరిచువల్ కాన్సెప్ట్ పైన డిస్కస్ చేస్తుంటారు. అప్పుడు ఉన్నట్టుండి ఆవిడ హస్బెండ్ కృష్ణ బొమ్మ రెడ్డి గారు ఫస్ట్ డిఫైన్ యువర్ సెల్ఫ్ అని అంటారు. ఈ మాట వినగానే ఈ పల్లవి గారు చాలా కోపంతో కిచెన్ లోకి వెళ్లి పని చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆవిడకి బాబాజీ గారి నుంచి ఈ విధంగా మెసేజ్ వస్తుంది. ఇప్పటి నుంచి నువ్వు 12 గంటలు ఒక రూమ్లోకి వెళ్లి లాక్ వేసుకొని మౌనంగా ఉండాలి అని చెప్తారు. అలా బాబాజీ చెప్పినట్లే ఈ మాస్టర్ పల్లవి గారు ఒక రూమ్లోకి వెళ్లి లాక్ వేసుకుంటారు. అప్పుడు బాబాజీ గారు ఆ రూమ్లోకి వచ్చి గట్టిగా నవ్వి ఈరోజు పొద్దున్నే మీ హస్బెండ్ డిఫైన్ యువర్ సెల్ఫ్ అని నిన్ను అడగగానే నువ్వు చాలా కోపంగా ఉన్నావు కానీ అక్కడ మీ హస్బెండ్ ద్వారా నేను నిన్ను ఈ క్వశ్చన్ వేశాను కానీ అక్కడ అడిగింది మీ హస్బెండ్ కాదు ఆయన ద్వారా నేను నిన్ను అడిగాను అని చెప్తారు. ఈ మాట వినగానే మాస్టర్ పల్లవి గారు గట్టిగా నవ్వుతారు. బాబాజీ కూడా నవ్వుతారు. తర్వాత పల్లవి గారు బాబాజీతో బాబాజీ మీరు ఆ రోజు ఆ సాధువుల సమూహంతో వెళ్ళారు కదా తర్వాత ఏం జరిగింది అని అడుగుతారు. అప్పుడు బాబాజీ ఈ విధంగా చెప్తున్నారు. నేను ఆ సాధువులతో వెళ్ళిన తర్వాత అనేక ఆధ్యాత్మిక పుస్తకాలు చదివాను భగవద్గీత వేదాలు ఉపనిషత్ బైబిల్ ఇలా అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం వల్ల నేను అనేక ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడం జరిగింది. ఈ జ్ఞానం వల్ల నాకొక పెద్ద ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొనే అవకాశం వచ్చింది. అప్పుడు నేను ఆ ఆధ్యాత్మిక సదస్సుకు వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది అనేక ప్రశ్నలు అడిగేవారు. ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్నకు నేను సమాధానాలు ఇచ్చేవాడిని అయితే అదే సదస్సులో హరిదాస్ అనే పండితుడు కూడా పాల్గొన్నారు. అప్పుడు ఒక సందర్భంలో ఆయన నాతో ఈ విధంగా అడిగారు. అదేమిటంటే నువ్వు అనేక విషయాల గురించి చాలా చక్కగా సమాధానాలు ఇస్తున్నావు. అయితే అసలు నువ్వు ఎవరో నీకు తెలుసా అని ఎప్పుడైతే నేను ఈ ప్రశ్నను విన్నానో అప్పుడు నాకు ఏమి అర్థం కాలేదు ఎందుకంటే నేను అనేక విషయాల గురించి నా దగ్గర జ్ఞానం ఉంది కానీ నేను ఎవరో నాకు తెలియదు. సో అప్పుడు నా నోటి నుంచి మాట రాలేదు ఆధ్యాత్మిక సదస్సు మొత్తం కూడా చాలా సైలెంట్ గా అయిపోయింది. అప్పుడు నేను ఎవరో తెలుసుకోవాలి అని నేను నిర్ణయించుకొని ఆ సదస్సు నుంచి బయటకి వచ్చాను. బయటకి వచ్చి నేను నన్ను నేను తెలుసుకోవాలంటే నేను హిమాలయాలకు వెళ్ళాలి వెళ్లి సాధన చేయాలి అని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎందుకో నాకు తిరిగి ఒకసారి చూడాలి అనిపించింది. అప్పుడు నేను నా వెనక్కి తిరిగి చూస్తే ఆ సదస్సు యొక్క ఎంట్రన్స్ లో హరిదాసు నిలబడి ఉన్నాడు. ఆ హరిదాసు వెనకాల పెద్దగా ఆ పరమశివుడు దర్శనం ఇచ్చారు. అప్పుడు నాకు అర్థమైంది నేను కరెక్ట్ దారిలోనే వెళ్తున్నాను. నన్ను నేను తెలుసుకోవాలి అని. అలా నన్ను నేను తెలుసుకోవాలన్న తపనతో రాత్రి పగలు అనే తేడా లేకుండా అలా నడుచుకుంటూ హిమాలయాల వైపు వెళ్తున్నాను. ఈ యొక్క ప్రయాణంలో ఎంతో మంది నాతో వస్తున్నారు మధ్యలో ఆగిపోతున్నారు. ఎందుకంటే వారెవరికీ కూడా నాకున్నంత తపన లేదు. అదేంటంటే నేను నేను ఎవరో తెలుసుకోవాలన్న తపన కానీ నన్ను ఎవరైతే వెంబడిస్తున్నారో వాళ్ళు నాకోసం వస్తున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు కొంత దూరం వచ్చేవాళ్ళు తర్వాత ఆగిపోయేవారు. అయితే వీళ్ళలో ఒకరు సారా అనే వ్యక్తి నాతో పాటు వెంబడించేవాడు. నాకు అనేక సేవలు చేసేవాడు. ఎప్పుడైతే నేను బద్రీనాథ్ ని చేరుకున్నానో అప్పుడు నేను సారాతో ఈ విధంగా చెప్పాను. ఇక్కడి నుంచి నా ప్రయాణం ఒంటరిగా సాగాలి ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి. కాబట్టి నువ్వు ఇంకెవరైనా సాధు సంతులతో కలిసి నీ యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టు అని చెప్పాను. అయితే దానికి సారా నిరాకరించాడు. అప్పుడు మళ్ళీ నేను సారాతో ఇది మన చివరి కలయక కాదు కచ్చితంగా మళ్ళీ నేను కలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి నేను చాలా వేగంగా మౌంట్ కైలాస్ వైపు ప్రయాణం మొదలు పెట్టాను. అయితే సుదీర్ఘ ప్రయాణం తర్వాత కొన్ని రోజుల తర్వాత మౌంట్ కైలాస్ చేరుకోవడం జరిగింది. ఆ మౌంట్ కైలాస్ లో ఒక చెట్టు నన్ను ఎంతగానో ఆకర్షించింది. అప్పుడు నాకు ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయాలన్న కోరిక కలిగింది. వెంటనే నేను ఆ చెట్టు కింద ధ్యానంలో కూర్చున్నాను. కూర్చుట వెంటనే నా శరీరంలోనే విపరీతమైన నొప్పులు రావడం, దాహం వేయడం, ఆకలి వేయడం లాంటివి మొదలయ్యాయి. అయితే నేను పట్టుదలతో నన్ను నేను తెలుసుకోవాలని తపనతో ఆ ధ్యానాన్ని మొదలు పెట్టినప్పుడు క్రమక్రమంగా కాసేపు తర్వాత ఈ దాహం ఆకలి అనేవి చచ్చిపోయాయి. అలాగే నేను ఇంటెన్స్ మెడిటేషన్ చేయడం వల్ల నేను ఈ విశ్వశక్తిని నా ధ్యానం ద్వారా నా శరీరంలోకి రిసీవ్ చేసుకునేవాడిని దీనివల్ల ఆకలి దాహం అనేటివి వెళ్ళిపోయాయి. అలా నేను ఒకే చెట్టు కింద మూడు సంవత్సరాలు నిరంతరంగా ధ్యానం చేశాను. మూడు సంవత్సరాల తర్వాత ఒకరోజు శివ భగవానుడు ప్రత్యక్షమయి నువ్వు మృత్యుంజయ స్థితిని సాధించావు అంటే చిరంజీవి అయ్యావు. నువ్వు ఇదే శరీరంలో ఉంటూ ఈ భూమి పైన ఉన్న మానవాళిని అంధకారం నుంచి ఆత్మజ్ఞానం వైపు నడిపించాలి. అని ఆ పరమశివుడు మహావతార బాబాజీతో చెప్తారు. బాబాజీ కూడా వాటిని యక్సెప్ట్ చేస్తారు. మళ్ళీ మాస్టర్ పల్లవి గారు బాబాజీ మీకు కూడా ఫాస్ట్ లైఫ్స్ అనేటివి ఉన్నాయా అంటే గత జన్మలు ఉన్నాయా అని అడుగుతారు. అప్పుడు బాబాజీ నేను కూడా ఈ భూమి మీద అనేక జన్మలు తీసుకున్నాను అని చెప్తారు. మళ్ళీ మాస్టర్ పల్లవి గారు మీకు కూడా ఫీచర్ లైఫ్స్ ఉన్నాయా అని బాబాజీని అడుగుతారు. అప్పుడు బాబాజీ ఈ విధంగా చెప్తున్నారు. నేను హిమాలయాల్లో తీవ్ర ధ్యాన సాధనలో ఉన్నప్పుడు శివ భగవానుడు ప్రత్యక్షం అవ్వకముందు ఒకసారి బుద్ధ భగవానుడు నా దగ్గరికి వచ్చి నువ్వు ఈ జన్మలో ఏం చేయడానికి వచ్చావో నీకు తెలుసా అని అడిగారు. అప్పుడు నేను తెలియదని సమాధానం ఇచ్చాను. అప్పుడు బుద్ధుడు నువ్వు ఈ భూమి మీదకు వచ్చింది ధ్యాన సాధన చేసి మృత్యుంజయ స్థితిని సాధించావు. నువ్వు ఇదే శరీరంతో ఉంటూ ఈ భూమి మీద ఉన్న ఈ మానవాళకి మార్గ నిర్దేశం చేయాలి. దాంతో పాటు నువ్వు ఎనర్జీ వర్క్ చేయడం కూడా నేర్చుకోవాలి. దీని వలన భూమి వైబ్రేషన్ పెరుగుతుంది అని చెప్పి తన కుడి చేయిని రౌండ్ రౌండ్ గా తిప్పుతాడు. ఎప్పుడైతే ఆ బుద్ధుడు తన చేతిని రౌండ్ రౌండ్ గా తిప్పుతాడో అప్పుడు ఒక కొత్త ప్రపంచం అక్కడ కనపడింది. కనపడి ఆ ప్రపంచంలోకి ప్రవేశించడానికి ఒక ఎంట్రన్స్ డోర్ అక్కడ ఉంది. అప్పుడు బుద్ధుడు ఆ డోరు గుండా ఆ ప్రపంచంలోకి వెళ్ళమన్నాడు. బుద్ధుడు చెప్పినట్టుగానే నేను ఇంకొక ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయితే అక్కడ సెఫాన్ అనే ఒక వ్యక్తిని నేను కలవడం జరిగింది. ఆ సెఫాన్ మరి ఎవరో కాదు నా యొక్క ఫ్యూచర్ లైఫ్ అని చెప్తారు. చెప్పి మళ్ళీ ఈ విధంగా చెప్తున్నారు. అంటే భూమి మీద నేను బాబాజీగా ఉంటూ సీరియస్ లోకంలో లీడర్ గా పని చేస్తున్నాను. దీనివల్ల ఏంటి అంటే ఇక్కడ నేను మనందరికీ పారలల్ లైఫ్స్ ఉన్నాయి అన్న విషయాన్ని చెప్పడానికే ప్రయత్నిస్తున్నాను అని చెప్తారు. మళ్ళీ మాస్టర్ పల్లవి గారు అసలు ఈ సీరియస్ లోకం అంటే ఏమిటి? అక్కడ మీరు ఏం పని చేస్తున్నారు వాటి గురించి చెప్పండి అని అడుగుతారు. అప్పుడు బాబాజీ షెఫాన్ తో పాటు నడుస్తూ నడుస్తూ ఈ సెఫాన్ లో కలిసిపోతాడు. అంటే ఇక్కడి నుంచి షెఫాన్ మనకు సమాధానాలు ఇస్తాడు. అదేంటంటే ఈ సెఫాను ఆ సీరియస్ లోకం గురించి మరియు అక్కడున్న ఆయన యొక్క పని గురించి చెప్తున్నాడు అన్నమాట. ఈ సీరియస్ లోకం కూడా భూమి లాంటిదే కాకపోతే ఈ సీరియస్ లోకంలో అందరికీ వాళ్ళ గురించి వాళ్లకు తెలుసు అయితే భూమి మీద ఉన్న మానవులకి వాళ్ళ గురించి వాళ్లకు తెలియదు. అయితే ఈ సీరియస్ ప్లానెట్ లోని మనుషులు ఈ భూమి మీద ఉన్న మానవులకి వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పడం కోసం అదేవిధంగా వాళ్ళలోని దైవత్వం గురించి వాళ్ళకి తెలియజేయడం కోసం ఈ సీరియస్ ప్లానెట్ లోని వాళ్ళందరూ కూడా పని చేస్తుంటారు అని చెప్తారు. మళ్ళీ మాస్టర్ పల్లవి గారు ఈ సెఫాన్ తో అసలు మీరు సెఫాన్ గా ఆ సీరియస్ లో మీరేం చేస్తుంటారు అని అడుగుతారు. అప్పుడు సెఫాన్ ఈ విధంగా చెప్తారు నేను ఎనర్జీ వర్క్ చేస్తుంటాను. అసలు మీ భూమి మీద పిరమిడ్స్ ఎవరు కట్టారు అనుకుంటున్నావు వాటిని కట్టింది మేమే మేము అత్యాధునికమైన గణిత శాస్త్రాన్ని ఉపయోగించి ఆ భూమి మీద పిరమిడ్స్ నిర్మించడం జరిగింది. మళ్ళీ మాస్టర్ పల్లవి గారు అసలు పిరమిడ్స్ అంటే ఏమిటి? వాటి గురించి కాస్త వివరించండి. అప్పుడు సేఫాన్ ఈ విధంగా చెప్తున్నారు. పిరమిడ్స్ అనేటివి ఎంతో గొప్ప శక్తి క్షేత్రాలు ఈ పిరమిడ్స్ భూమి యొక్క వైబ్రేషన్ పెంచడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా మేము పిరమిడ్స్ లోపల ఎనర్జీ గిడ్స్ ని అమర్చడం జరిగింది. సో ఎవరైతే ఈ పిరమిడ్స్ లోపల కూర్చుని ధ్యానం చేస్తారో వారి యొక్క శరీర కణాల్లోకి ఈ శక్తి అనేది లోపలికి వెళ్లి వారి యొక్క కాన్షస్నెస్ ని పెంచుతుంది. అప్పుడు మనిషి కూడా ఒక శక్తి క్షేత్రంలా తయారవుతాడు. అంతేకాకుండా ఎక్కడైతే పిరమిడ్ ఉంటుందో ఆ చుట్టుపక్కల ప్రాంతం కూడా ఎంతో శక్తితో నిండి ఉంటుంది. మేము ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి ఈ పిరమిడ్ కాన్సెప్ట్స్ గురించి జ్ఞానాన్ని ఇస్తుంటాము. అదేవిధంగా ఎవరికైతే ఈ పిరమిడ్ కాన్సెప్ట్ అర్థమైందో వాళ్ళు ఇతరులకి ఈ జ్ఞానాన్ని అందించడంలో మేము సహాయం చేస్తుంటాము. ఇంకా చెప్పాలంటే ఈ పిరమిడ్స్ అనేటివి భూమి మరియు మనిషి యొక్క ఎనర్జీ పెంచడంతో పాటు ఇవి మంచి కమ్యూనికేషన్ నెట్వర్క్ గా ఉపయోగపడతాయి. అంటే ఈ సీరియస్ ప్లానెట్ లో ఎంతో జ్ఞానం ఉంది. ఆ యొక్క జ్ఞానాన్ని తీసుకురావాలంటే మాకుొక కమ్యూనికేషన్ నెట్వర్క్ కావాలి. సో ఆ కమ్యూనికేషన్ నెట్వర్క్ే ఈ పిరమిడ్స్ ఈ పిరమిడ్స్ ద్వారానే ఆ సీరియస్ ప్లానెట్ లో ఉన్న నాలెడ్జ్ ని మొత్తాన్ని కూడా ఈ భూమి మీదకి తీసుకురావడం జరుగుతుంది అని చెప్తారు. మళ్ళీ మాస్టర్ పల్లవి గారు ఇంకాస్త ఈ సీరియస్ ప్లానెట్ గురించి చెప్పండి అని అడుగుతారు. అప్పుడు సెఫాన్ ఈ సీరియస్ ప్లానెట్ అనేది భూమి కంటే కూడా ఎంతో అడ్వాన్స్ గా ఉంటుంది. అంతేకాకుండా భూమి మీద ఉన్న మనుషులు ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ భూమి యొక్క సౌందర్యాన్ని అంత నాశనం చేస్తున్నారు కానీ సీరియస్ గ్రహం లోని మనుషులు ఆ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ గ్రహాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అదేవిధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆత్మజ్ఞానం వైపు వాళ్ళు వెళ్తున్నారు అని చెప్తారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా బాబాజీ గారు ఈ కాన్వర్జేషన్ విత్ మహావతార్ బాబాజీ అనే పుస్తకం ద్వారా మాస్టర్ పల్లవి గారి ద్వారా మనకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. అయితే ఈ వీడియో స్టార్టింగ్ లో నేను మీకు ఒక విషయం చెప్పాను అదేంటంటే నాకు కూడా మహావతార్ బాబాజీతో కొన్ని అనుభవాలు ఉన్నాయని అయితే అందులో ఒక అనుభవం ఈ పుస్తకంలో ఉంది. అదేంటంటే ఒకసారి నేను మహావతార్ బాబాజీ కేవ్స్ కి వెళ్లి తిరుగు ప్రయాణంలో మాస్టర్ పల్లవి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. రాత్రి నేను వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యాను నేను మా వైఫ్ సో లేట్ నైట్ పడుకోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ నేను చాలా డీప్ స్లీప్ లో ఉన్నాను. అయితే సడన్ గా మాస్టర్ పల్లవి గారు వచ్చి బాబాజీ రమ్మంటున్నాడు వెంటనే రండి అని అన్నారు. సో నేను ఆ నిద్రలో నుంచి ఫటాఫటా లేచి ఫటాఫటా నేను స్నానం చేసేసి వెళ్ళాను ఆవిడ దగ్గరికి వెళ్ళాను వెళ్తే ఆవిడ అన్నారు మెడిటేషన్ లో కూర్చోమంటున్నారు అని మెడిటేషన్ లో కూర్చున్నాం. వన్ అవర్ మెడిటేషన్ అయిన తర్వాత సో మేము మెడిటేషన్ లో ఉన్నాము అప్పుడు పల్లవి గారి ద్వారా మహావతార్ బాబాజీ గారు నన్ను ఈ విధంగా అడిగారు. భార్గవు నీకుేమన్నా ప్రశ్న ఉంటే నన్ను అడుగు అని అప్పుడు నేను నాకున్న ప్రశ్న ఏంటంటే నేను ఎన్నో రోజులు ఉపవాసం ఉన్నా కూడా నాకు ఆకలి అయ్యేది కాదు. నేనేదో ఫీల్ అయ్యేవాడిని నా హెల్త్ లో ఏదో ఇష్యూ ఉందిని అయితే ఆ రోజు బాబాజీ అలా అడగమనేసరికి నేను అప్పుడు నా యొక్క సమస్యను బాబాజీతో చెప్పడం జరిగింది. బాబాజీ ఇలా నేను కొన్ని రోజులు కంటిన్యూగా ఉపవాసం ఉన్నా కూడా నాకు ఆకలి అవ్వట్లేదు అసలు కారణం ఏమిటి అని అప్పుడు బాబాజీ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే నా యొక్క ఆత్మ వేరే గ్రహంలో వేరే ప్లానెట్ లో ఎక్కువ స్పిరిచువల్ వర్క్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఏదైతే నా సోల్ కు దొరకాల్సిన ఆ ఎనర్జీ ఉందో ఆ వర్క్ వల్ల దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ ఫిజికల్ గా ఉన్న నా బాడీకి అందుకే ఆకలి అవ్వట్లేదు. కాబట్టి ఇదేంటో ప్రాబ్లం కాదు ఎప్పుడైతే నీ సోల్ కంప్లీట్ గా మళ్ళీ నీ బాడీలోకి వచ్చేస్తుందో మళ్ళీ నీకు యదావిధిగా ఆకలి అవుతుంది. సో నువ్వు దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని బాబాజీ గారు మాస్టర్ పల్లవి గారి ద్వారా నా ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇదే కాదు నా జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి బాబాజీ గారితో సమయ సందర్భం వచ్చినప్పుడు నా అనుభవాలు ఏంటో మీతో కచ్చితంగా పంచుకుంటాను. సో మళ్ళీ తిరిగి మనం ఈ కన్వర్జేషన్ విత్ మహావతార్ బాబాజీ పుస్తకం లోకి వస్తే ఈ పుస్తకం చాలా అద్భుతమైన పుస్తకం. దయచేసి మీరందరూ కూడా ఈ పుస్తకాన్ని తీసుకొని చదవండి. దీంట్లో ఎంతో జ్ఞానం ఉంది. ఈ బుక్ లో బాబాజీ గారు రెండు విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి ధ్యానం గురించి రెండవది పిరమిడ్ శక్తి గురించి. సో ఎవరైతే ధ్యానం చేస్తారో ధ్యానానికి ఈ పిర్మి శక్తిని ఉపయోగించుకుంటారో వాళ్ళు అతి తక్కువ కాలంలోనే వాళ్లకున్న జబ్బుల నుంచి రోగాల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. అదేవిధంగా వాళ్ళు తొందరగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అంటే అసలు మెడిటేషన్ అంటే ఏంటి ఎలా చేయాలి అసలు పిరమిడ్ అంటే ఏంటి? పిరమిడ్ ని ఎలా మెడిటేషన్ కి ఉపయోగించుకోవాలి అన్న డౌట్ ఏదున్నా సరే కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇచ్చాను. అది నా WhatsAppట్ లింక్ సో మీరు WhatsAppట్ లో జాయిన్ అయితే ఎవ్రీ సండే ఫ్రీ మెడిటేషన్ క్లాస్ ఉంటుంది. సో అక్కడ నేను మీకు ఖచ్చితంగా మీకు మెడిటేషన్ నేర్పిస్తాను. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీ డౌట్స్ ని నేను క్లారిఫై చేస్తాను. ఇది కంప్లీట్ గా ఫ్రీ ఎందుకంటే నేను 14 ఇయర్స్ నుండి మెడిటేషన్ చేస్తున్నాను. నాకు అనేక లాభాలు కలిగాయి కాబట్టి ఈ యొక్క జ్ఞానాన్ని ఫ్రీగా అందరితో పంచుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.
No comments:
Post a Comment