*ఆట అంటేనే గెలుపు ఓటములు కదా? గెలుపు ఓటములు నీ అధీనమైనా నమ్మిన వారిని గెలిపిస్తావో నమ్మకాన్ని వమ్ముచేసి ఓడిస్తావో నీ ఇష్టం.*
*నీతో ఆడి గెలవలేని నిస్సహాయత నాది అణువు ఎక్కడ? అనంతం ఎక్కడ? పరమాణువు ఎక్కడ? పర్వతం ఎక్కడ? సింధువు ఎక్కడ? సముద్రము ఎక్కడ అయినా నీ రచనలో భాగముగా ఉన్నానుగా... కానీ వరస ఓటములతో విసిగి పొతే ఆశ అడియాసగా మారితే నీ ధ్యాస మరచిపోతే నిన్ను తలచేవారెవ్వరు నిన్ను కొలిచేవారెవ్వరు నిన్ను సేవించేవారెవ్వరు...*
*ఆటే కదా అని ప్రతి సారి నమ్మినవారిని ఓటమి పాలు చేస్తే ఆటలో ఆసక్తి పోతుంది ఈశ్వరా!*
*అపుడపుడు నీ కింకరులను గెలిపించుకో సడలుతున్న నమ్మకాన్ని నిలబెట్టుకో తరిగిపోతున్న భక్తిభావాన్ని పెంచుకో ఎప్పటికైనా నీవే కొండంత అండ అని నిన్ను నమ్మితే అంతిమ విజయమని ప్రకటించి నీ అస్థిత్వాన్ని నిరూపించుకో ఆటలో ఆనందాన్ని నీ భక్తులనీ ఆస్వాదించనీ...*
*ఇది వేడుకోలు* *కాదు సుమా పాదాలు పట్టి విడువని పంతం పట్టుదలతో సాధించుకునే మూఢ విస్వాసం. తండ్రిని గదమాయించే పిల్లల అమాయకత్వం దిక్కులేక ఆక్రోశించి వేడుకొనే వెర్రి నమ్మకం...*
*🔱IIశివోహం శివోహం శివోహంII🔱*
No comments:
Post a Comment