Wednesday, September 3, 2025

ఎందుకని ఫారిన్ కంట్రీస్, ఇండియన్స్ ను తక్కువగా చూస్తున్నాయి..? || Why world hate Indians , Reasons ?

 ఎందుకని ఫారిన్ కంట్రీస్, ఇండియన్స్ ను తక్కువగా చూస్తున్నాయి..? || Why world hate Indians , Reasons ?



మన దేశ గొప్పదనాన్ని ఎంత చెప్పినా ఎంత పొగిడినా తక్కువే దేశంలో ప్రజలకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ప్రపంచం ముందు మాత్రం మన దేశాన్ని మనం గొప్పగానే చూపించే ప్రయత్నం చేస్తాం. 1947 లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక రంగాల్లో అంచలంచలుగా ఎదిగాం. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ప్రతి దేశంతో నేడు ఇండియా పోటీ పడుతూనే ఉంది. ఫారెన్ పాలసీ, సైన్స్ అండ్ డెవలప్మెంట్, రసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ట్రేడ్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, కల్చర్, ట్రెడిషన్, ఎకనామీ ఇలా ప్రతి ఒక్క విషయం వరల్డ్ లో ఇండియాను స్పెషల్ కంట్రీగా మార్చాయి. ఇలా చెప్తూ పోతే కంట్రీ గ్రేట్నెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా సమయమే పడుతుంది. కానీ ఇదంతా కాయిన్ కి ఒకవైపు మాత్రమే. నిజంగానే మనం నమ్ముతున్నట్టే ఇండియన్స్ కి ఫారెన్ కంట్రీస్ లో రెపుటేషన్ అనేది ఉందా? అసలు నిజంగానే ఇండియన్స్ కి వెస్టర్న్ వరల్డ్ లో వాల్యూ ఉందా అంటే మాత్రం కాస్త ఆలోచించాలి. జనవరిలో రిలీజ్ అయిన హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ 85 ఇవన్నీ కాదు అమెరికా ఇండియా రెండు మిత్ర దేశాలని గొప్పగా చెప్పుకుంటాం కదా కొన్ని నెలల క్రితం ట్రంప్ అమెరికాలో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ని అమెరికా నుంచి పంపించే ముందు కనీసం మానవత్వం మన దేశం పట్ల గౌరవం కూడా లేకుండా ఎంత దారుణంగా చేతులకు కాళ్ళకు సంకెళ్లు వేసి ఇండియాకు పంపించాడో మనం చూసాం. కాబట్టి ఇండియా ఎంత సూపర్ పవర్ గా ఎదిగినా కూడా ప్రపంచ దేశాల్లో ఇండియన్స్ అంటే ఇప్పటికీ చిన్న చూపే ఉంది. ముఖ్యంగా ఇండియా అంటే ఆయా దేశాల ప్రభుత్వాలకి గౌరవం ఉండొచ్చు. కానీ ఆ దేశాల్లోని పౌరులకు మాత్రం ఇండియన్స్ అంటే చాలా చులకన భావం ఉంది. విదేశాల్లో ఉన్న వారి అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి అసలు ప్రపంచ దేశాల్లో ఇండియా పట్ల చులకన భావం ఉండడానికి కారణం ఏంటి? ఎందుకని ఇండియాను వెస్టర్న్ కంట్రీస్ వారు ద్వేషిస్తున్నారు. మిగతా దేశాల్లో మన ఇండియన్స్ కి ఎంత విలువిస్తారు ఇలా కొన్ని నిజాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎమోషనల్లీ కాకుండా లాజికల్లీ ఈ వీడియోని చూడండి. మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో.  ఇంట్రో చూసిన వెంటనే చాలా మందికి తప్పుగా అనిపించి ఉండొచ్చు. మన దేశ సంస్కృతి సాంప్రదాయాల పట్ల విదేశీయులు కూడా ఆకర్షితులు అవుతున్నారు. మన దేశంలో ఉన్న గుళ్లను, గోపురాలు చారిత్రిక సంపదను అధ్యయనం చేసేందుకు నిత్యం వందల మంది ఫారెన్స్ వస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇండియాను గౌరవిస్తూనే ఉన్నారు గాని చాలా మంది కనిపించి ఉండొచ్చు. నిజానికి ఈ ఆలోచనలో నిజం ఉంది. ఇండియాకు వచ్చి ఇండియన్ కల్చర్ ఎక్స్ప్లోర్ చేసేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఇండియాను అడ్మైర్ చేసేవారి కన్నా హేట్ చేసేవారే ఎక్కువ. 2024 లో సోషల్ మీడియాలో ఒక పెద్ద క్యాంపెయిన్ నడిచింది. ముఖ్యంగా ఎక్స్ లో పజీత్ అనే మాట చాలా పాపులర్ అయింది. పజీత్ అంటే అదేదో పేరులా అనిపించొచ్చు కానీ ఇండియన్స్ ని హేట్ చేసేవారు ఉపయోగించే మాట అది. ఈ పజీత్ పేరుతో సోషల్ మీడియాలో మీమ్స్ కూడా ఉన్నాయి. చాలా కాలంగా విదేశాల్లో ఇండియన్స్ ని తిట్టడానికి విమర్శించడానికి ఈ పజిత్ అనే పదాన్ని విపరీతంగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి ప్రపంచ దేశాల్లో ఇండియా పట్ల ద్వేషం ఎందుకు పెరిగింది అనేదానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది మన జనాభా. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో ఇండియా చైనా పోటీ పడుతూ ఉంటాయి. ఇప్పటికే ఇండియన్ పాపులేషన్ 140 కోట్లను దాటింది. కానీ అమెరికన్ పాపులేషన్ కేవలం 34 కోట్లు, రష్యా పాపులేషన్ 14.38 38 కోట్లు 27 దేశాల కలయకైన యూరోపియన్ యూనియన్ పాపులేషన్ కూడా 44.9 కోట్లు మాత్రమే. ప్రతి డెవలప్డ్ కంట్రీ పాపులేషన్ పరంగా ఇండియా కన్నా చాలా వెనకబడే ఉన్నాయి. 1980 నుంచి ఇండియన్స్ ప్రపంచం మీద దండయాత్ర మొదలు పెట్టారు. ఇక్కడ దండయాత్ర అంటే యుద్ధం కాదు ఉద్యోగాల కోసం ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్ళడం ఎక్కువైంది. దాంతో అభివృద్ధి చెందిన దేశాల్లో ఇండియన్ మైగ్రేషన్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇక మరోవైపు ఇండియాలో ఫారెన్ కల్చర్ మీద లైఫ్ స్టైల్ మీద అక్కడ వస్తున్న హై పేయింగ్ జాబ్స్ మీద విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఎర్లీ 2000 లో సినిమాలు కూడా విపరీతంగా ఫారెన్ కల్చర్ ని ప్రమోట్ చేశయి. హీరో ఫారెన్ లో సెటిల్ అయ్యి ఇండియాకి రావడం లాంటి క్యారెక్టర్స్ చాలా వచ్చాయి. ఒక రకంగా ఫారెన్ క్రేజీ ను పెంచడానికి సినిమాలు కూడా ఉపయోగపడ్డాయి. దానికి తోడు ఇక్కడ పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఇండియాలో ఎంప్లాయ్మెంట్ అపర్చునిటీస్ క్రియేట్ కాలేదు. దాంతో పెద్ద ఎత్తున ఇండియన్స్ అంతా విదేశాలకు మైగ్రేట్ అయ్యారు. దానివల్ల అవుట్సైడ్ ఆఫ్ ద కంట్రీ ఇండియన్ పాపులేషన్ క్రమంగా పెరిగింది. ప్రస్తుతం ప్రతి దేశంలో మన ఇండియన్స్ కమ్యూనిటీ విపరీతంగా పెరిగిపోయింది. దానివల్ల విదేశాల్లో ఎక్కడైతే ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారో ఆ ప్రాంతాల్లోని ఆ దేశపు వారికి ఇండియన్స్ మీద ద్వేషం పెరిగింది. ఇండియన్స్ వల్ల వారు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వడం మొదలు పెట్టారు. మరీ ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల్లో ఇండియన్స్ కి విదేశీ కంపెనీలు తక్కువ జీతానికి నియమించుకునేవే. కానీ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం ఇండియన్స్ ఇదే చాలా బెస్ట్ శాలరీ అన్నట్టు ఫీల్ అయ్యేవారు. దాంతో అటువైపు ఫారెన్ కంపెనీలు తక్కువ ధరకే వస్తున్న ఉద్యోగులు కావడంతో ఒకానొక సమయంలో ఇండియన్స్ ని హైర్ చేసుకునేందుకు విదేశీ కంపెనీలు పోటీ పడ్డాయి. దాంతో ఆ దేశంలోనే ఆ ప్రజలకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గుతూ వచ్చాయి. ఒక ఎంప్లాయ్మెంట్ విషయంలో మాత్రమే కాదు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇండియన్ స్టూడెంట్స్ వల్ల అక్కడ వారికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో చాలా కాలంగా అమెరికా, యూకే, కెనడా, సింగపూర్ లాంటి దేశాల్లో ఇండియన్స్ మీద అసహనం పెరుగుతూ వచ్చింది. అయితే గత 40 సంవత్సరాలుగా విదేశాల్లో పెరుగుతున్న ఇండియన్ కమ్యూనిటీ చాలా బలంగా తయారైంది. టాప్ లెవెల్ పొజిషన్ లో వైట్ కలర్ జాబ్స్ లో సెటిల్ కావడం మొదలైంది. దాంతో తమ దేశానికి వలస వచ్చిన వారు తమకన్నా బెటర్ లైఫ్ లీడ్ చేయడాన్ని అక్కడ వారు సహించలేకపోతున్నారు. విదేశాల్లో ఇండియన్ కమ్యూనిటీ చాలా బలంగా తయారైింది. ముఖ్యంగా 2024 లో జరిగిన అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ని ఒక ఉదాహరణగా తీసుకుంటే అక్కడ ఎన్నికల్లో వివేక్ రామస్వామి కమల హారీస్ లాంటి వారు ఏకంగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడే స్థాయికి వెళ్ళారు. ఇక ఇటు బ్రిటన్ లో చూసిన రిషి సునక్ అటు కెనడాలో చూసినా కూడా ఇండియన్ సిక్ కమ్యూనిటీ అక్కడ గవర్నమెంట్ ని ఎఫెక్ట్ చేసే స్థాయికి వెళ్ళింది. ఇలా ఇండియన్ కమ్యూనిటీ వేరే దేశాల్లోని పాలిటిక్స్ లో కూడా ఆయా దేశాల్లో తమ ప్రభావాన్ని చూపించడం మొదలైంది. దీనివల్ల అపోనెంట్ పొలిటికల్ పార్టీలు ఇండియన్స్ మీద నెగిటివిటీ ని స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టాయి. బ్రిటన్ లో రిషి సునక్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన అపోనెంట్లు రిషి సునక్ భార్య అక్షతామూర్తి బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ కన్నా అత్యంత ధనవంతరాలు అని ప్రచారం చేశారు. రిషి సునక్ బ్రిటన్ లో టాక్స్ ఎగ్గొట్టి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాని ప్రచారం చేశారు. నిజానికి అక్షతామూర్తి వెల్త్ అంతా ఇన్ఫోసిస్ లో ఆమెకుఉన్న షేర్స్ నుంచి వచ్చింది. కానీ ఈ మొత్తం ప్రచారం వల్ల ఇండియన్ కమ్యూనిటీ టార్గెట్ అయింది. బ్రిటిష్ దేశ సంపదను ఇండియాకుి తీసుకెళ్తున్నట్టు చాలా మంది అక్కడ వారు భావించారు. ఇలా ఇండియన్స్ సరిజన్ వ్యక్తులు ఆ దేశాల్లో పాలిటిక్స్ చేయడం వల్ల కూడా అక్కడ ప్రత్యద్దులు ఇండియాని టార్గెట్ చేస్తున్నారు. దీని ఎఫెక్ట్ అనేది ఎంటైర్ ఇండియన్ కమ్యూనిటీ మీద పడుతుంది. ఇక కెనడా అమెరికా లాంటి దేశాల్లో ఇండియా సేకంగా కొన్ని రాష్ట్రాల్లో పాపులేషన్ పరంగా అక్కడ వారిని కూడా మించిపోయారు. అమెరికాలోని టెక్సస్ లాంటి స్టేట్ లో ఇండియన్ పాపులేషన్ చాలా పెరిగిపోయింది. డల్లాస్ లాంటి నగరం పూర్తిగా ఇండియన్ సిటీగా మారిపోయింది. ఎక్కడైతే మెజారిటీ ఇండియన్స్ ఉన్నారో అక్కడ ఇండియన్ కల్చర్ ని ట్రెడిషన్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. మన ఇండియన్ కల్చర్ కి వెస్టర్న్ కల్చర్ కి చాలా తేడా ఉంటుంది. మన కల్చర్ ని మన ట్రెడిషన్ ని అక్కడ వారి ముందు గొప్పగా ప్రదర్శించడం వల్ల అక్కడ వారికి ఇండియన్స్ పట్ల చిన్న చూపు మొదలైంది. విదేశాలకు వెళ్ళిన ఇండియన్స్ ప్రవర్తన కూడా విదేశాల్లో ఇండియా పట్ల ద్వేషం పెరగడానికి కారణం. ప్రతి చిన్న విషయంలో ఇండియన్ బిహేవియర్ కి వెస్టర్న్ బిహేవియర్ కి చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకి టాయిలెట్ పేపర్ విషయాన్ని తీసుకుంటే ఇండియన్స్ టాయిలెట్ పేపర్ యూస్ చేయరు. కానీ వెస్టర్న్ కల్చర్ లో వారు టాయిలెట్ వేపర్ ని ఉపయోగిస్తారు. ఇండియన్స్ డైరెక్ట్ గా చేతు క్లీన్ చేసుకోవడాన్ని వెస్టరన్ పీపుల్ అన్హైజినియక్ గా భావిస్తారు. ఈ విషయంలో ఇండియన్స్ ని చాలా హేలన్ చేసి మాట్లాడడం వెస్టర్న్ పీపుల్ కి బాగా అలవాటు. ఇండియన్స్ డ్రెస్సింగ్ స్టైల్ ని కూడా వెస్టర్న్ ప్రపంచం హేలన్ గా చూస్తుంది. వెస్టర్న్ పీపుల్ ఖచ్చితంగా కాళ్ళకు షూ ధరిస్తారు. మన దేశంలో మాత్రం ఎక్కువ మంది చెప్పులు వేసుకుంటారు. దీన్ని కూడా వెస్టర్న్ పీపుల్ చులకనగా భావిస్తారు. ఫ్రీక్వెంట్ గా ఒకే జత షూ వేయడం కూడా అక్కడ వారికి నచ్చదు. పర్ఫ్యూమ్స్ లిప్స్టిక్స్ లాంటివి చాలా మంది ఇండియన్స్ కి అలవాటు ఉండవు. ఇలా పర్ఫ్యూమ్స్ లిప్స్టిక్స్ లేకుండా కనిపిస్తే ఆటోమేటిక్ గా వెస్టర్న్ పీపుల్ చులకనగా చూస్తారు. ఇవి మాత్రమే కావు తినే సమయంలో డైరెక్ట్ గా చేత్తో తినడం ఫోక్ లేదా స్పూన్స్ లాంటివి యూస్ చేయడం లాంటివి కూడా వెస్టరన్ పీపుల్ కి ఇండియా పట్ల చిన్న చూపుకు కారణం. ఇలాంటి విషయాలు తెలియక విదేశాల్లో ఇండియన్స్ చాలా అవమానాలు ఎదుర్కున్నారు. కానీ రాను రాను ఇవన్నీ వెస్టర్న్ పీపుల్ కి ఇండియన్స్ పట్ల చులకన భావాన్ని నింపాయి. బిహేవియర్ హ్యాబిట్స్, కల్చర్ ఇలాంటి విషయాల్లో ఇండియన్స్ చేసే ప్రతి విషయం వెస్టర్న్ పీపుల్ కి తప్పుగానే కనిపిస్తాయి. ఇండియన్ స్టైల్ లో వంట చేస్తే వచ్చే స్మెల్ కూడా అక్కడ వారికి పడదు. ఇండియాలో డ్రైవింగ్ అలవాటు ఉన్నవారు వెస్టర్న్ కంట్రీలో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇండియాలో డ్రైవింగ్ సీట్ రైట్ సైడ్ ఉంటుంది. కానీ వెస్టర్న్ కంట్రీస్ లో డ్రైవింగ్ సీట్ లెఫ్ట్ లో ఉంటుంది. రోడ్ కి రైట్ సైడ్ లో డ్రైవ్ చేయాలి. ఈ విషయంలో అక్కడికి కొత్తగా వెళ్ళిన వారిలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. దానికి తోడు ఇండియాలో ఎన్ని డ్రైవింగ్ రూల్స్ ఉన్నా ఇక్కడ వాటిని ఎవరూ పెద్దగా పాటించరు. కానీ ఫారెన్ కంట్రీలో రోడ్ సేఫ్టీ అండ్ డ్రైవింగ్ రూల్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. కాబట్టి డ్రైవింగ్ అండ్ రోడ్ సేఫ్టీ విషయంలో కూడా ఇండియన్స్ ని అక్కడ వారు విమర్శిస్తూ ఉంటారు. ఇలా చెప్తూ పోతే ఇండియన్స్ ఆర్ సో అన్హైజినిక్ అండ్ ఇండిసిప్లిన్ అనే అభిప్రాయం విదేశాల్లో చాలా బలంగా పెరిగిపోయింది. వీటితో పాటు ఇండియన్స్ మీద చులకన భావన రావడానికి ప్రధాన కారణం ఇంగ్లీష్ యసెంట్. ఇండియన్స్ వెస్టర్న్ పీపుల్ లాగా పోస్ట్ ఇంగ్లీష్ మాట్లాడలేరు. దాంతో ఇండియన్ యసెంట్ ని ఈజీగా రికగ్నైజ్ చేయవచ్చు. యసెంట్ విషయంలో ఇండియన్స్ ని అమెరికా యూకే లాంటి దేశాల్లో చాలా తక్కువగా చూస్తారు. వీటితో పాటు అమెరికాలో న్యూజర్సీ, దుబాయ్, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో భారి హిందూ దేవాలయాలు నిర్మించారు. హిందూ మతం ప్రపంచవ్యాప్తం కావడం నిజంగా హిందువులుగా మనం గర్వపడాలి. కానీ ఈ అంశం అక్కడ వారికి అభద్రత భావాన్ని నింపింది. చాలా దేశాల్లో ఇస్లామాఫోబియా అనే మాట చాలా పాపులర్. అంటే ముస్లిం పట్ల భయం అభద్రత భావం ఉంటే ఈ మాటను ఉపయోగిస్తారు. ఇస్లమాఫోబియా తరహాలోనే హిందూ ఫోబియా అనే మాటను కూడా ఈ మధ్య విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. విదేశాల్లో పెరుగుతున్న ఇండియన్ కమ్యూనిటీ హిందూ మతం పట్ల అక్కడ వారు ఏ స్థాయిలో ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ఇది ఉదాహరణ. ఇక మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే దుబాయ్, కువైట్, కతర్ లాంటి దేశాల్లో ఇండియన్స్ డ్రైవర్లుగా పనివాళ్ళుగా పని చేసేందుకు అక్కడికి ఎక్కువగా వెళ్తున్నారు. ఎడారిలో ఒంటెలు కాసేందుకు కూడా కొన్ని వందల మంది ఇండియన్స్ మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఉన్నారు. వీరంతా లో లెవెల్ జాబ్స్ చేయడం వల్ల కూడా ఇండియన్స్ అంటే ఆయా దేశాల్లో చిన్నచూపు ఉంది. వీటితో పాటు ప్రత్యద్ది దేశాల పరువును ప్రతిష్టను దిగదార్చడం కూడా కొన్ని దేశాలకు పరిపాటుగా మారింది. ఎకనామికల్, ట్రేడ్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ లాంటి విషయాల్లో దేశాల మధ్య పోటీ ఉంటుంది. ఈ పోటీలో ప్రత్యద్దులో వెనక నెట్టడం కోసం కూడా ఆయా దేశాల మీద విదేశాల్లో తప్పుడు ప్రచారం చేయడం లాంటివి కొన్ని దేశాలు చేస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రచారం వల్ల కూడా ఇండియన్స్ అంటే వెస్టర్న్ కంట్రీస్ లో హేట్ పెరిగిపోయింది. ఉదాహరణకి కెనడాలో సిక్కుల విషయంలో ఇలాంటి ప్రచారమే జరుగుతుంది. ఫారనర్స్ ఇండియాను ఇండియన్స్ ని హేట్ చేయడానికి ఇంటర్నల్ రీజన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇండియాలో పోష్ లావిస్ రిచ్ ఏరియాలు చాలా ఉన్నాయి. కానీ ఇండియాలో ప్రతిదీ అంతే నీట్ గా అండ్ క్లీన్ గా ఉండదు. చాలా మంది ఫారనర్స్ ఇండియా గురించి గొప్పగా ఊహించుకొని ఇండియాని ఎక్స్ప్లోర్ చేసేందుకు వచ్చిన టూరిస్టులకు ఇక్కడున్న రియాలిటీ బాగా అర్థమవుతుంది. ఇండియాలో స్లమ్స్ ఉంటాయి పేదరికం ఉంటుంది. కానీ ఇవన్నీ బయట వ్యక్తులకు ఇక్కడికి వచ్చి చూసేవరకు తెలియవు. ఒక్కసారి ఇక్కడఉన్న పరిస్థితి అర్థమైిన తర్వాత ఇండియా మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం వారికి పోతుంది. ఫారనర్స్ ఇండియాకి వచ్చినప్పుడు వారి పట్ల ఇండియాస్ ప్రవర్తించే తీరు కూడా చాలాసార్లు వివాదస్పదమైంది. 2024 లో జార్ఖండ్ లో స్పానిష్ బైకర్ మీద ఏడుగురు వ్యక్తులు చేసిన అత్యాచారం చాలా సంచలం అయింది. ఈ మధ్యకాలంలో కూడా హంపీలో విదేశీ మహిళను అత్యాచారం చేసిన ఘటన చోడ్చేసుకుంది. కాబట్టి ఇండియా ఈస్ నాట్ ఏ సేఫ్ కంట్రీ అనే విధంగా కొందరు ఇండియన్స్ ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇండియన్స్ పట్ల హేట్ పెరగడానికి ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా కొంతవరకు కారణమే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే జస్ట్ లైక్ చేయండి చాలు అండ్ ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్ లో తెలపండి. అండ్ మీలో ఎవరైనా ఫారెన్ కంట్రీస్ లో నివసిస్తుంటే మీరు ఎదుర్కున్న ఒక అవమాన పరిస్థితి ఏమిటి తప్పకుండా కామెంట్స్ లో పంచుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ హావ్ ఏ గుడ్ డే.

No comments:

Post a Comment