🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(251వ రోజు):--
స్వామీజీ క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడినది గోవాలో మాత్రమేకాదు ఆయన ఎక్కడకు వెళ్లినా క్రైస్తవమత ప్రచారకులు కూడా ఆయన ఉపన్యా సాలు వినడానికి ఆసక్తితో వచ్చేవా రు. దురదృష్టవశాత్తూ, వారిలో కొందరికి హిందూమత పద్దతులపై సదభిప్రాయంలేదు. హైదరాబాద్ యజ్ఞంలో ఆఖరురోజున గంగాజలం ఆందరిపైనా సంప్రోక్షించే సందర్భం లో ఒక కాథలిక్ మతాచార్యుడు అక్కడే ఉన్నారు. గంగాజలంతో స్వామీజీ ఆయన ఉన్న వరుసవద్దకు రాగానే, తనమీద ఆ నీళ్లు పడకూడ దని ఆయనలేచి బయటకు నడవ టం మొదలుపెట్టారు; పట్టువదలని స్వామీజీ దీన్ని గమనించి, ఆయన్ను వెంబడించి బాగా నీళ్లు చల్లారు.
ఆర్ధికంగానూ, ఆధ్యాత్మికంగానూ కూడా సమాజాన్ని ఉద్దరించాలనే ఆయన ఉద్దేశాన్ని గ్రహించిన చాలా మంది క్రైస్తవమతాచార్యులు స్వామీ జీనీ, చిన్మయమిషన్ ను ఆమోదిం చారు. బొంబాయిలో జరిగిన 137 వ గీతాజ్ఞానయజ్ఞానికి ప్రారంభోత్సవం చేసిన వలేరియన్ కార్డినల్ గ్రాసియా స్ మారుతున్న కాలానికి అనుగుణం గా మతాలను పునరుజ్జీవింప జేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మతానికి నిజమైన అర్థాన్ని జనబాహుళ్యంలో ప్రచారం చేయటానికి స్వామీజీ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. క్రైస్తవమతం కూడా భారతీయుల సంస్కృతిలో భాగంగా ఉన్న కేరళరాష్ట్రంలో యజ్ఞాలకూ, ఇతర చిన్మయమిషన్ కార్యక్రమాలకూ క్రైస్తవమతాచార్యు లు కూడా తరుచూ హాజరయ్యేవారు
బొంబాయిలో అంతర్జాతీయ కాథలిక్ సదస్సు జరిగినపుడు ఫిర్యాదుచేసిన హిందువులకు భారతదేశంలో క్రైస్తవుల కార్యకలా పాల గురించి చింతించాల్సిన అవ సరం లేదనీ, వారు హిందూమతాన్ని జయించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదనీ నచ్చచెప్పారు. "ఏదై నా ఒక క్రమపద్ధతిలో చేసే సామర్థ్యం వారికున్నా సంఘీభావం లేకపోవ టం హిందువుల బలహీనతైనా.."
దీనిఅర్థం హిందూపూజారులను విమర్శించినంత నిశితంగా ఆయన క్రైస్తవ మతాధిపత్యాన్ని విమర్శించ లేదనికాదు. వందమంది రక్షకభటు ల బలగంతో పోపు భారతపర్యటన కు వచ్చినపుడు, ఆయనను నిందిం చే అవకాశాన్ని వదలుకోలేకపోయా రు. "ఎంత సిగ్గుమాలినతనం! ఒక నూలువస్త్రాన్ని మాత్రం ధరించి తిరిగే భారతదేశపు మహాత్ములకు ఏ హానీ జరుగదు ; కాని, సర్వాలంకార భూషితుడైన ఈ మనిషికి మాత్రం మరతుపాకుల రక్షణకావాలి. మర తుపాకులు పట్టుకొన్న క్రైస్తవులు... ఇది ఎంత హాస్యాస్పదమో మీకు తెలియటం లేదూ ? ప్రేమే అందరినీ జయిస్తుందనే క్రీస్తు ఉపదేశాన్ని జీవించాల్సిన పద్దతి ఇదేనా?"
భారతదేశానికి బయట పర్యటిం చేటప్పుడు, అన్యమతాలలో నమ్మిక కలవారిని వారి నమ్మికప్రకారమే నడుచుకోమనీ, హిందూవేదాంతం ఏ మతపద్ధతికైనా వన్నె తెస్తుందనీ చెప్పేవారు. కాని, భారతదేశంలో ఉన్నపుడు మాత్రం, తమ దేశాలకు పంపే సమాచారంలో చాలామంది క్రైస్తవమతంలో చేరారని చెప్పుకోవ డం కోసం పేదవారికి పదిరూపాయ లిచ్చి తమ మతంలో కలుపుకుంటు న్నారని భారతదేశంలో పనిచేసే క్రైస్తవమిషనరీలను దుయ్యబట్టేవారు
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment