🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*ప్రకృతిలో మూడుగుణాలు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. కానీ ఒకే గుణం ఉన్న జీవి ఉండదు. అలా ఎందుకు అంటే, ఏ పని చేయడానికైనా రజోగుణం కావాలి. పని చేసి అలసి పోతే విశ్రాంతి తీసుకోవడానికి, నిద్రపోవడానికి తమోగుణం కావాలి* .
*కాబట్టి పరమ సాత్వికగుణము కలవాడికైనా, రజోగుణం, తమోగుణం లేకపోతే జీవితం సాగదు. కాకపోతే సత్వగుణం ఎక్కువగా, రజస్తమోగుణాలు కొద్దిపాళ్లలో ఉన్న వారిని శుద్ధసత్వగుణ సంపన్నుడు అని అంటారు.*
*సత్వగుణం కలిగిన వాడు ప్రకాశవంతంగా, నిర్మలంగా ఉంటాడు. అంటే మంచి తెలితేటలతో వెలిగిపోతుంటాడు. సోమరి తనం ఉండదు. విషయగ్రహణ శక్తి, ధారణ శక్తి అంటే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. మనసు నిర్మలంగా ఉంటుంది. చెడు ఆలోచనలు ఉండవు.*
*సాత్వికుడి మనస్సు ఎటువంటి వికారాలకు, ఒడిదుడుకులకు, ఒత్తిళ్లకు లోను కాదు. ఎల్లప్పుడూ ప్రశాంతంగా సమత్వ బుద్ధి కలిగి ఉంటుంది. అని చెప్పాడు శ్రీకృష్ణుడు....*🙏
No comments:
Post a Comment