Monday, August 17, 2026

అప్పు చేసి పిల్లలను చదివించాలా.? ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తెలుసుకోవాలి.? | Vijay Barla Interview

అప్పు చేసి పిల్లలను చదివించాలా.? ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తెలుసుకోవాలి.? | Vijay Barla Interview

Author Name:Signature Studios

Youtube Channel Url:https://www.youtube.com/@SignatureStudiostv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=OXAFE9Bzruk



Transcript:
(00:00) మై డాడ్ ఇస్ మై హీరో చిన్నప్పటి నుంచి ఒక స్టేజ్ దాకా ఆయనే నా హీరో రైట్ నేను బిజినెస్ స్టార్ట్ చేసే టైం కి అంటే నా సొంతం కూడా కదా ఆయన చేసే పని నేను చేయడం మొదలు పెట్టేసరికి హి బికమ్ విలన్ ఆఫ్ ఐ మీన్ కరెక్ట్ చేయలేదేమో అయితే అలా కాదు హి ఓన్లీ టెల్స్ ఎవరీబడీ దట్ మా అబ్బాయికి మా అబ్బాయిని సలహా అడగండి ఏదైనా కావాలతే వాడు ఇచ్చినంత పర్ఫెక్ట్ గా వాడు ఇవడు వాడు ఒక్క రూపాయ పాడు చేయడని ఆయనే చెప్పాడు రైట్ బట్ ద ఓల్డ్ స్కూల్ రూల్స్ ఓకే రైట్ సో నాకు అర్థమైంది ఏంటంటే ఓల్డ్ స్కూల్ రూల్స్ లో ఇమ్మీడియట్ గా నేను ఏమనుకుంటే నా ఒక్కడికి ఇలా జరుగుతుందేమో అని చాలా
(00:28) ఫ్రస్ట్రేట్ అయ్యా బయట ప్రపంచంలో లోకి వెళ్ళి చూస్తే ఎవరి దగ్గరనా చిన్న మాట చెప్తే వాళ్ళు 100 చెప్తున్నారు దరిద్రేసి అరే మా ఇంట్లో ఇదే పరిస్థితి మా ఇంట్లో ఇదే పరిస్థితి అని చెప్పేసి అప్పుడు ఐ థాట్ ఓకే 80స్ నుంచి ఇది జరుగుతుంది అన్నమాట అండ్ ద సిస్టమ్స్ టెక్నాలజీ గాట్ చేంజ్డ్ అన్ని మారడం మొదలు పెట్టాక మనుషులు మారకపోవడం వల్ల ఫేస్ చేసిన ఇబ్బందులు ఈ జనరేషన్ బాగా ఎక్కువ ఫేస్ చేసింది ట్రూ అనేది నాకు అర్థమయి నేను సరదాగా మాట్లాడాను అది ఏం సరదాగా చాలా సీరియస్ కాంటెంట్ పెట్టి సరదాగా అంటారు మీరు చాలా క్యాజువల్ గా మా స్టాఫ్ చెప్తున్నప్పుడు అదే అదే
(01:00) అదే ఒక భావోద్వేగం ఎలా చెప్పాలి నేర్పించడానికి మాట్లాడాను నేను అది యాక్చువల్ గా వాళ్ళు ఏదో చెప్తుంటే ఒక విషయం తాలక ఇంటెన్సిటీ తెలియాలంటే మన మాటలో స్వచ్ఛత ఉండాలి ఏదో నిద్రపోయినట్టు చెప్తే అవడ వండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడానికి చెప్పింది అది అవును అవును సో దాన్నే కట్ చేసి ఇంటర్వ్యూ వేస్తే ఇట్ కేమ్ వెరీ హై అన్నమాట చాలా మంది సెలబ్రిటీస్ కూడా దాన్ని లైక్ చేశారు నిజమే నిజమే నిజమే 100% నిజమే అంటే పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పటికి వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ కి ఇప్పుడు ఇప్పుడు మనకున్న నాలెడ్జ్ కి అక్కడ కొంత గ్యాప్ వచ్చేస్తుంది
(01:30) చాలా అంటే మన అనుభవాలు ఎక్కువ వాళ్ళకన్నా వాళ్ళకి ఏంటంటే అప్పట్లో వాళ్ళకు ఉన్న దాంట్లో ఆ కాస్త పరిధిలో వాళ్ళు నెగ్గుకుంటూ వచ్చేసారు. మనక అది సరిపోవట్లేదు. ఇప్పుడు ఈ 80 90స్ లో పుట్టిన వాళ్ళకి వీళ్ళకి పిల్లలు జన్జీలు ఉన్నారు అందరూ ఇక అసలు వాళ్ళకి వీళ్ళకి మధ్యలో తబలా వాయించినట్టు అయిపోతుంది లైఫ్ అసలు ఏమైందంటే 80స్ 90స్ వరకు జరిగింది ఏంటంటే 100కి 99.
(01:54) 99% 99% ఇల్లలో ఒకటే రకమైన వ్యాపారం ఒకటే రకమైన పని ఒకటే రకం కుటుంబాలు కరెక్ట్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక కుటుంబం కోసం ఒక ఇల్లు బాగు చేయడం కోసం ఆ ఇంటి ముందు ఉన్న పంటల కోసం 80స్ నుంచి ఏమైందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ స్టార్ట్ అయిపోయినాయి న్యూక్లియర్స్ ఫ్యామిలీ స్టార్ట్ అయ్యాక ఏమైతది 10 మంది ఉండే ఇల్లు నలుగురు ఉండే ఇల్లు అయింది అవును నలుగురు ఉండే ఇంట్లో పెద్దోడు ఉండడు చెప్పేవాడు ఉండడు ఒరేయ్ ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పేవాడు ఉండడు సో ఎవరు తీసుకున్న డెసిషన్ వాళ్ళది అవును సో అక్కడ స్టార్ట్ అయినయి మెయిన్ ప్రాబ్లమ్స్ జీరో నుంచి మొదలు పెడతారు అప్పుడు
(02:22) అప్పుడు అప్పుడు వాళ్ళ పిల్లలు మామూలు కష్టాలు ఉండవు ఇంకా ఎగజక్ట్లీ [నవ్వు] పైగా మీరు ఇందాక ఒక మాట చెప్పారు ఇప్పుడు జంజీ పిల్లలతో అవును ఇది ఇది దీనికి కారణం ఏంటి నేను చెప్పమంటారా చెప్పండి తప్పకుండా అంటే నాకు యాక్చువల్ గా నాన్నగారురా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. నేను మార్నింగ్ లేస్తే ఒక మూడో తరగతి నర్సరీ పిల్లోడి దగ్గర నుంచి 70 ఏళ్ళ వాళ్ళ తాత వరకు మాట్లాడతా.
(02:38) సో ఐ గాట్ ఏ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద ప్రాక్టికల్ సిచువేషన్స్ నేనేదో క్యాజువల్ గా బుక్స్ చదివి ఇంకోటిని కాకుండా సో నేను అది చూసినప్పుడు ఒక తాత ఏం చేస్తాడంటే ఒక పిల్లోడిని బ్యాగ్ తీసుకొని వెళ్తుంటాడు. వీడు ఒక 20 రూపాయలు చాక్లెట్ చూపించి తాత అది కొంటావా కొనవా అని అడుగుతాడు. ఆయనకి ఎంత కష్టం అది వాళ్ళ వయసులో రెండు రూపాయల చాక్లెట్ కూడా దెబ్బలు తిని ఉంటారు కరెక్ట్ కరెక్ట్ 20 రూపాయల చాక్లెట్ అలవాగ్గా అడుగుతాడు వాళ్ళ తాత గట్టిగా గదిమేడు అనుకోండి కోడలు వచ్చి తాతని తిడతారు మా అబ్బాయిని మేమే ఒక దెబ్బనో ఒక మాట అనో మీరు అనేస్తారా అని అంటే ఆయన ఏమి చేయలేని పరిస్థితి
(03:04) అవును వాళ్ళ కొడుకుని పెంచినట్టు మనని పెంచడానికి లేదు అది లేదు ఆప్షన్ లేదు మీకు అర్థమైందా పాయింట్ అవును అవును అవును సో పేరెంట్ ఏం చేస్తున్నాడు అంటే నేను తిన్న దెబ్బలు నా కొడుకు తినకూడదు అని చెప్పి వాడి జీవితం అంతా దెబ్బ అయిపోలే పెంచుతున్నాడు ఇది ఫాక్ట్ ఇప్పుడు ఎక్కడో ఎందుకు నేను నా సంగతి నేను ప్రతి ఇంటర్వ్యూలో నాది ఇంకల్కేట్ చేస్తా ఓకే ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ఎవరికనా ఉపయోగపడుతుందేమో అనే ఒకే ఒక్క పాయింట్ తో లేదా చూసిన వాళ్ళు ఎవరైనా కొంచెం నాలెడ్జ్ పెరుగుతుందని పాయింట్ నేనేమో గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చాలా కష్టపడ్డాం హైదరాబాద్
(03:33) వచ్చిన తర్వాత గాని అంతకు ముందు గాని లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో లాంగ్వేజ్ బారికేడ్స్ ఎలా ఉంటాయి అంటే ఏంటి ప్రొఫెషనల్ గా చాలా పెద్ద దెబ్బ అది అవును దాంట్లో కొట్టుకుంటూ రావడానికి మాకు చాలా టైం పట్టేసింది అంటే ఈ ఈ 20 ఏళ్ల మధ్యలో అంటే చదువుకునే అప్పటి నుంచి ఎంప్లాయి గా జాయిన్ అయినప్పటి నుంచి చూసుకుంటే లాంగ్వేజ్ అప్పటినుంచి ఉండి ఉంటే ఈ పాటికి ఇంకెక్కడ ఉండేవాళ్ళం సో లాంగ్వేజ్ లేదు దాన్ని నేర్చుకోవడంలోనే చాలా ఏళ్లుు పట్టిసింది సో దాని వల్ల ఏమైపోతుందంటే నేనేమనుకున్నా పిల్లల్ని తెలుగు మీడియం లో కాదు ఇంగ్లీష్ మీడియం లో
(03:59) వేయాలి చిన్న చిన్న స్కూల్లో కాదు పెద్ద స్కూల్లో వేయాలను నేను పెద్ద స్కూల్లో వేస్తే లాంగ్వేజ్ తో పాటు వాళ్ళు చాలా నేర్చేసుకున్నారు. ఉమ్ డెఫినెట్లీ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి వాళ్ళ గ్రూప్ అంతా కూడా చాలా పెద్ద పెద్ద గ్రూప్లతో కనెక్ట్ అయిపోయాను నేనేమో మిడిల్ క్లాస్ ఓకే వాళ్ళు ఫంక్షన్ లో వెళ్తేనే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఆ లింక్ ఎందుకో నాకు అసలు సెట్ అయినట్టు అనిపించదు ఎందుకంటే వాళ్ళ ఆలోచన ధోరణ వేరు వాళ్ళ అలవాట్లు వేరు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఉండే సిస్టం వేరు ఇక్కడ చూస్తేనేమో ప్రాపర్ మిడిల్ క్లాస్ ఇది ఉంటుంది. సో రెండింటికి సింక్ అవ్వదు.
(04:26) ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ స్థాయిలో ఊహించుకుంటున్నారు లైఫ్ ని ఎక్లీ ఈ స్థాయిలో ఊహించుకుంటారు అంటే సెట్ అవ్వట్లేదు. ఆ ఆలోచనతో ఉంటున్నారు అక్కడ అంటే బయట చూసే ప్రపంచంలో వీళ్ళు వేరు వీళ్ళు ప్రాక్టికల్ గా ఉన్న ప్రపంచం వేరు ఈ రెండింటి మధ్యన వాళ్ళు కొట్టుకుంటున్నారు నేను వాళ్ళతో కొట్లాడుతున్నా ఈ విషయం 99% అని నేను చెప్పంగానే 60 ట 70% ఫ్యామిలీస్ చేసే తప్పు ఏంటంటే అంటే ఇది అందరికీ తెలియాల్సిన విషయం చెప్పొచ్చంటే చెప్తాను అయ్యో తప్పకుండా ప్రాక్టికల్ గా మనుషులు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద స్కూల్లో చదివించాలి పిల్లల్ని మంచి స్కూల్ అన్న విషయం
(04:55) మర్చిపోయారు. అవును పెద్ద స్కూల్లో చదివిస్తే బాగుంటుంది. ఆ మంచి స్కూల్ పెద్ద స్కూల్ే అయి ఉంటుందని కదా అదే అదే ఇక్కడ పాయింట్ చెప్తాను వినండి మంచి స్కూల్ పెద్ద స్కూల్ కి డిఫరెన్స్ చెప్తాను ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఇందాక చెప్పారు గవర్నమెంట్ స్కూల్ అని అవును మనకి అబ్దుల్ కలాం గారు చనిపోయి జస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయింది అవును అవును ఈ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ముందు మనకి ముందు అందరికన్నా ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనిపించుకున్న వ్యక్తి హి స్టడీడ్ ఇన్ ఏ గవర్నమెంట్ స్కూల్ అవును అవును ఇప్పుడు లేదు కదా మరి మనకి నేను చాలా స్ట్రాంగ్ గా చెప్తాను ఏమని
(05:22) అంటే ద ప్రాబ్లం ఈస్ మనమే ఒక స్టెప్ బ్యాక్ వేయాలి అందరూ ఏం చేస్తారుంటే లక్షలు అప్పులు చేసి కడుతున్నారు. మీరు నమ్మరు మేము ఎక్కడో ఉండేవాళ్ళం అలకాపరి ఇది నగర్ దగ్గర ఉండేవాళ్ళం సొంత ఫ్లాట్ 2000 ఇయర్ లో సంగతి నేను చెప్పేది. నాకు ఓబుల్ రెడ్డి స్కూల్ లో సీట్ కావాలి అని చెప్పి చాలా మంచి స్కూల్ చాలా సిస్టమాటిక్ గా నడుస్తుంది ఆంధ్ర మళల సభ వాళ్ళది ఓకే అండ్ ఫీస్లు కూడా అంత ఇప్పటికీ అంత హై ఫీజెస్ కూడా ఏమ ఉండవు.
(05:45) కానీ అక్కడికి వచ్చి పిల్లల ఫ్యామిలీస్ అందరూ చాలా పెద్ద పెద్ద కార్లో వస్తారు. ఆ విషయం నాకు తెలియదు కదా నా గోల్ ఒక్కటే ఉండింది ఏంటి వీళ్ళని బాగా చదివించాలి. బాగా చదివించా అంతే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండకూడదు. మంచి నేను పడ్డ కష్టాడు పడకూడదు అనుకొని నేను అనుకుంటే వాళ్ళు అక్కడ అమ్మ బాబోయ్ అసలు నేను చూస్తే లాంగ్వేజ్ కన్నా ఎక్కువ నేర్చుకుంటారు లాంగ్వేజ్ తక్కువ నేర్చుకుంటారు ఎగజక్ట్లీ అదే ఇందాక నేను చెప్తా ఆపిన విషయం ఏంటంటే ఇప్పుడున్న సో కాల్డ్ కంపెనీస్ అన్ని ఇప్పుడు సపోజ మీ స్టూడియో ఉంది ఇఫ్ యు గో అండ్ ఆస్క్ యువర్ చైర్మన్
(06:13) కచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ లో చదివి ఉంటారు. లేదంటే ఒక మామూలు స్కూల్ లో చదువు ఉంటా ఇప్పుడు మీరు ఉన్నారు ఇంతమంది ఎడ్యుకేట్ చేస్తున్నారు యువర్ నాలెడ్జ్ ఇస్ ఫ్రమ్ ద బేసిక్ గవర్నమెంట్ కరెక్ట్ ఇప్పుడు నేను పుట్టేసరికి ద ప్రైవేట్ స్కూల్స్ హవ్ బీన్ అరైవడ్ నేను మంచి ప్రైవేట్ స్కూల్ లోనే చదువుకున్నాను బట్ నా మొత్తం అన్ని 10 సంవత్సరాల ఫీస్ కలిపి ఫస్ట్ క్లాస్ టు 10ెత్ క్లాస్ ఫీస్ కలిపి రెండు మూడు లక్షలు కూడా అయి ఉండదు.
(06:31) అవును అవును ఇప్పుడు ఒకే సంవత్సరానికి రెండు మూడు లక్షలు ఖర్చు పెడుతున్నారు పేరెంట్స్ ఏంటండీ ఫస్ట్ క్లాస్ కి ఉందా ఫీస్ అవును సో మీకు ఏమవుతుంది ప్రెస్టేజ్ కోసం అప్పులు చేసి చిన్న ఉదాహరణ చెప్తాను మీకు మా పనమ్మాయి ఉంది నేను హైదరాబాద్ రాగానే హైదరాబాద్ వదిలేదు మా పనమ్మాయి ఉంది. మా పనమ్మాయి నా దగ్గరికి వచ్చి సార్ ఒక ఫ్రీ స్కూల్ ఉంది సార్ లాస్ట్ ఇయర్ మా మనవరాని అక్కడే జాయిన్ చేసాం.
(06:53) మా అల్లుడి మా కొడుక్కి కోడలకి గొడవ వచ్చి పిల్లల్ని తీసుకువెళ్ళిపోయింది ఒకసారి ఇలా అడగండి సార్ అని చెప్పాను. నేను ఫోన్ చేసి అడిగాను అవతలో ఆ ప్రిన్సిపల్ నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే వాళ్ళు నాకు టార్చర్ చూపించారు సార్ నేను అయితే ఫ్రీగా చదివించనఅని చెప్పింది తర్వాత పాపం ఆవిడ నన్ను కాకుండా ఒక 100 మందిని రికమెండ్ చేసింది 100 మంది రికమెండేషన్స్ పని చేయలే అయ్యో పని చేయకపోతే ఇవి నా దగ్గరికి వచ్చి ఏం చేయమంటారు సార్ అి అమ్మ ఎందుకు దగ్గరలో ఏద అంటే ఆమె ఇప్పుడు జస్ట్ ఎల్కేజీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది నర్సరీ ఎల్కేజీ యుకేజీ వరకే మనకు సీట్లు
(07:17) దొరుకుతాయి. ఉ ఇ మళ్ళీ ఫస్ట్ క్లాస్ నుంచి 10ెత్ వరకు వాళ్ళు ప్రమోట్ అవుతూ వెళ్తారు కదా మధ్యలో ఒక్క సీట్ దొరికి చాదు సో చూస్ చేసుకునేదే కచ్చితంగా నర్సరీలో ఎల్కేజీ యుకేజీ లోనే పట్టుకోవాలి స్కూల్ ని ఓకే ఇదో పెద్ద ప్రాబ్లం పేరెంట్ కి అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆమె నా దగ్గరికి వచ్చి అడిగాక నేను సరేమ్మా ఏదో ఒక స్కూల్ లో జాయిన్ చేయ నేను రికమెండ్ చేస్తాను అవసరమైతే గవర్నమెంట్ స్కూల్ లో వేసుకోవచ్చు కదా ఒక త్రీ ఇయర్స్ నష్టమే ఉంది అంగన్వాడీస్ ఇలాంటివి ఉంటాయి కదా అని చెప్తే ఆమె తీసుకెళ్లి ఒక ప్రైవేట్ స్కూల్ లో జాయిన్ చేసింది. ఆ
(07:45) అమ్మాయి ఫీస్ వచ్చేసి 50 ట 60,000 షి ఇస్ వర్కింగ్ యస్ ఏ మేడ్ ఫర్ మీ నేను మనసులో ఒకటే అనుకున్నాను ఈవిడి కష్టానికి ఇవిడి సంకల్పాని కన్నా అమ్మాయి బాషా చదువుకోవాలి. అవును అంటే ఇప్పుడు వీళ్ళఏంటి అందులో చదివించాల అన్నానికి మనం సరిపోం అవును అవును కానీ వాళ్ళ తాపత్రయం ఏం చూసి నాకు ఏమ అనిపించింది అంటే మన డబ్బులు ఉన్నాయమ్మా అని అన్నాడు అన్ని డబ్బులు ఉన్నాయా అని అడిగితే ఏదో ఒకటి చేస్తాను బాబు ఏం చేస్తాను కష్టపడాలి కదా అంటారు ఇంకేమంటాం మనం అంటే ప్రతి మనిషి కూడా చదువు ఫస్ట్ వీక్నెస్ ఈస్ ఎడ్యుకేషన్ అవును చదువుకి ఏదో రూపంలో డబ్బులు ఉండొచ్చు
(08:11) అవును చదువు తర్వాత ఆ స్కూల్ లో చదవడం వల్ల అడిగే కోరికలకి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఎగ్జాక్ట్లీ అదే కదా నేను అది విషయం వాళ్ళకి చెప్పినప్పుడు అర్థం అవుతుంది అవును కూర్చోపెట్టి అమ్మ చదువు ఓకే ఆ 50 60 ఏదో అప్పు చేసి కడతా నెక్స్ట్ ఇయర్ ఇంకో 10,000 పెరుగుద్ది మళ్ళీ కడతా అన్ని ఓకే ఓకే అవును తర్వాత ఫ్రెండ్స్ ని చూసి నా బర్త్ డే కి ఒక 50,000 ఖర్చు పెట్టు నా బట్టలకి ఒక 10,000 ఖర్చు పెట్టు అంటే నువ్వు పెట్టగలవా లేదు అని అడుగుదామంటే మమ్మల్ని తక్కువ చేసి చూడు సార్ పెట్ట సో కొన్ని వాస్తవాలు ఏంటంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఖర్చు ప్రెస్టేజ్ కోసం
(08:38) పెట్టొద్దు అవసరం కోసం చేయండి పిల్లలకి డే వన్ నుంచి వాళ్ళ కష్టాలు చెప్పాలి నువ్వు అక్కడ చదువుతున్నావ్ కాబట్టి వాళ్లా బతుకని చెప్పకూడదు. నేను కష్టపడి 10 ఇళ్లల్లో పని చేసి నేను అక్కడ చదివిస్తున్నాను అంటే కారణం ఏంటంటే నువ్వు గొప్పోళ్ళు ఎలాగ అవ్వాలి ఒక అబ్దుల్ కలాం ని చూపించాలి లేదంటే ఒక శ్రీనివాస్ రామానుజని చూపించాలి ఇలాంటి వ్యక్తులని చూపించాలి ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కి అసలు శ్రీనివాస్ రామానుజన్ అనేవాడు ఎవడో కూడా స్వామి వివేకానంద కోసం ఎవడో మాట్లాడడు మొన్న చాణక్యనీతి మీద చిన్న వీడియో చేశ చాణక్యనీతి అంటే ఏంటి సార్ అని
(09:02) అడుగుతున్నారు నన్ను మెసేజ్లు పెడుతున్నారు ఏ బుక్ కొనాలి అసలు ఏదో బుక్ ముందు మొదలు పెట్టాలి కదా చాణక్యనీతిలో ఏ సిరీస్ ఆఫ్ బుక్ బాగుంటది సార్ అంట అంట్లో మళ్ళీ ఛాయిస్ ఉంది అంటే పీపుల్ ఆర్ థింకింగ్ దట్ అది కూడా నేనే చెప్పాలి చేతిలో చార్జ Google లో ఉంటే చేసుకోవచ్చు కదా అంటే వి ఆర్ ఫ్రీ ఫర్ సర్వీసెస్ దే ఆర్ యూసింగ్ ఫర్ దే ఆర్ యూజంగ్ 100% అన్నమాట అది సో పేరెంట్స్ మస్ట్ నో దట్ ప్రెస్టేజ్ కి పిల్లలని చదివించడం కాదు పిల్లలకి పాఠాలు జీవిత పాఠాలు నేర్పించి నా దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేసి చదివిస్తున్నాను అని చెప్పి పాత మేము చిన్నప్పుడు బట్టలు మాకు
(09:31) మా డాడీ నేను పుట్టేటప్పటికి జస్ట్ సైకిల్ మీద తిరిగేవారున్నమాట దేవుడి దేవాళ్ళు ఇప్పుడు చాలా మంచి పొజిషన్ కి వెళ్ళిపోయారు. అది మా అదృష్టమో మా చెల్లి అదృష్టమో లేదా మా ఇంట్లో అందరూ అదృష్టమో తెలియదు మంచి పోజిషన్ గెలిపారు బాగానే సక్సెస్ అయ్యాం కానీ నాకు ఇంకా గుర్తు బట్టలు ఓ మూడు సంవత్సరాలు పని చేసే కొనేవరు పుట్టిన రోజు అంటే ఇక్కడికి వచ్చే విషో ఎక్కడికనా వెళ్తే నవ్వ వచ్చేసేది మా వాళ్ళకి అరే 1ఇంచ్ లూస్ తీసుకోరా 1ఇంచ్ పొడుగు తీసుకోరా అంటే లేదు లేదు ప్రాపర్ గా ఫిట్టింగ్ ఉండాలి అంటారు.
(09:57) అది కొన్న తర్వాత కరెక్ట్ గా మూడు నెలలు కూడా పట్టవు పొట్టిద అయిపోయింది ఎందుకంటే ఎదిగే వయసులో ఉంటారు కదా వీళ్ళు ఆ వాళ్ళకి చెప్తే అర్థం కాదు ఒరేయ్ 2000 పెట్టి షర్ట్ కనీసం మూడు నెలలు కూడా కట్టుకుంటే పొట్టు అయిపోయింది అంటావ ఏంటరా అసలు 2000 3000 చొక్కలకి వాల్యూే లేదు అసలు లేదు

A Woman’s Life Is Never Easy❤️ #pathbreakingstories #women #inspiration #shorts

A Woman’s Life Is Never Easy❤️ #pathbreakingstories #women #inspiration #shorts

Author Name:Inspire With Raju

Youtube Channel Url:https://www.youtube.com/@Inspirewithraju

Youtube Video URL:https://www.youtube.com/watch?v=zpCxzuVorK0



Transcript:
(00:00) మ్యారేజ్ కి ఏడు అడుగులు ఎంతైతే ఇంపార్టెంట్ో ఉమెన్ కి కూడా ఏడు అడుగులు ఉంటాయి అంటే పీరియడ్స్ అని ప్రెగ్నెన్సీ అని డెలివరీ అని పోస్ట్ పార్టం కెరియర్ గ్యాప్ మెనోపాస్ మోర్ స్వింగ్స్ ఇన్నిటితో దే హావ్ టు గెట్ ఆన్ విత్ లైఫ్ చాలా మందిని చూస్తుంటాం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు పీరియడ్స్ తోని స్కూల్స్ కి వెళ్తారు కాలేజెస్ కి వెళ్తారు ఆఫీసెస్ కి వెళ్తారు ఇలాంటి సిచువేషన్స్ లో కూడా పివి సింధు బ్యాడ్మింటన్ లో గోల్డ్ కొట్టింది.
(00:26) ఇలాంటి పరిస్థితుల మధ్యే ఇండియన్ ఉమెన్ టీం వరల్డ్ కప్ పొట్టింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రగతి గారు కూడా మనకి ఇండియాకి పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ సిల్వర్ అన్నీ కొట్టారు. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మమ్ ఇట్ ఇస్ నాట్ ఈజీ టు లివ్ ద లైఫ్ ఆఫ్ ఏ వమెన్ ఎందుకంటే ఒక మాట అనడం చాలా మందికి చాలా ఈజీ ఇన్నీ గో త్రూ అయ్యి తర్వాత కూడా ఫ్యామిలీని మొత్తం అంతా చూసుకొని అంచలంచలుగా లైఫ్ లో పైకి వెళ్తున్నారు.
(00:52) సో ఆ ఉమెన్ అందరికీ హాట్స్ ఆఫ్ మీకు కూడా

ఒక స్త్రీ సంతృప్తి చెందిందని ఎలా తెలుసుకోవాలి..? @chanakyaneethi1226

ఒక స్త్రీ సంతృప్తి చెందిందని ఎలా తెలుసుకోవాలి..? @chanakyaneethi1226

Author Name:CHANAKYANEETHI

Youtube Channel Url:https://www.youtube.com/@chanakyaneethi1226

Youtube Video URL:https://www.youtube.com/watch?v=u-0psYT8aQE



Transcript:
(00:00) హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు చాణక్యస్ నీతి జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే చాలామంది దీనికి ఒకే ఒక్క సంకేతం ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి స్త్రీ సంతృప్తి అనేది కేవలం శారీరక ప్రతిస్పందనతో మాత్రమే నిర్ణయించబడదు. ఈ వీడియోలో అయితే స్త్రీ సంతృప్తి చెందింది అని సూచించే కొన్ని విషయాల యతే మనం తెలుసుకుందాం.
(00:40) అయితే దానిలో మొదటిది ఆమె రిలాక్స్ గా కనిపించడం సంభోగం తర్వాత ఆమె ముఖంలో ప్రశాంతత అలాగే ప్రశాంతంగా ఉండడం ఒత్తిడి తక్కినట్లు కనిపించడం మంచి సంకేతంగా అయితే భావించొచ్చు అయితే ప్రతి ఒక్కరు ఒకే విధంగా స్పందించరు. కొంతమంది మాట్లాడుతారు. ఇక కొందరు నిశశబ్దంగా అయిపోతారు. ఈ రెండు సహజమే ఇందులో రెండోది ప్రేమగా దగ్గరగా ఉండాలని అనుకోవడం సంభోగం ముగిసిన వెంటనే దూరంగా వెళ్ళిపోకుండా మీ చేతిని పట్టుకోవడం అలాగే హత్తుకోవడం మీ భుజంపై తల పెట్టుకోవడం లేదా ప్రేమగా మాట్లాడడం వంటి ప్రవర్తన ఆమెకు ఆ
(01:29) అనుభవం సానుకూలంగా అనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఇక మూడవది చిరునవ్వు మరియు సంతోషమైన మూడ్ సంభోగం తర్వాత ఆమె చిరునవ్వుతో ఉండడం సరదాగా మాట్లాడడం లేదా సంతోషంగా కనిపించడం కూడా మంచి సంకేతమే ఇక ఇది కేవలం శారీరక ఆనందం మాత్రమే కాదు భావోద్వేగ సంతృప్తిని కూడా సూచిస్తుంది. అర్థమైంది కదండీ అలాగే ఇక నాలుగవది తన భావాలను స్వేచ్ఛగా చెప్పడం అంటే నాకు బాగా నచ్చింది.
(02:09) నువ్వు చాలా ప్రేమగా చూసుకున్నావు. నిన్ను ఇంకా దగ్గరగా చూడాలనిపిస్తుంది. అలాగే నిన్ను ఇంకా దగ్గరగా అనిపిస్తుంది అంటే నువ్వు ఇంకా నాకు దగ్గరగా అనిపిస్తున్నావు ఇలాంటి మాటలన్నీ కూడా ఆమెకి ఆ అనుభవం సంతృప్తికరంగా అనిపించింది అని అయితే చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి ఇక ఐదవది మళ్ళీ సాన్నిహిత్యం కోరుకోవడం. తర్వీతే రోజుల్లో మీతో ప్రేమగా ఉండడం మళ్ళీ ఆత్మీయత క్షణాలు గడపాలని ఆసక్తి చూపడం మీతో సమయం గడపాలని కోరుకోవడం కూడా సంబంధం ఆరోగ్యంగా ఉందని సూచిస్తుంది.
(02:52) ఇక ఆరవది కమ్యూనికేషన్ అత్యంత ముఖ్యం అత్యంత సమ్మదిగా అంటే మార్గం ఏమిటి అంటే ఆమెతో ప్రేమగా మాట్లాడటం నీకు ఎలా అనిపించింది ఏమైనా మార్పులు కావాలనిపించాయా నిన్ను ఇంకా సంతోషంగా ఉంచడానికి నేను ఏం చేయాలి? ఏమి చేయగలను ఇలాంటి ప్రశ్నలు అడగడం ద్వారా నిజమైన సమాధానం తెలుసుకోవచ్చు. కాబట్టి ఒక స్త్రీతో సంభోగం చేసినప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఆమె నుండి ఏ సమాధానాలు వస్తాయి అని మీరు గమనించండి.
(03:33) ఇక ఏడవది శరీర భాష కూడా ఒక సంకేతమే మాటలు చెప్పకపోయినా కొన్నిసార్లు శరీర భాష చాలా విషయాలను తెలియజేస్తుంది. సంభోగం తర్వాత మీతో సౌకర్యంగా ఉండడం హత్తుకోవడం ప్రేమగా చూడడం వంటి ప్రవర్తన ఆమెకు ఆ అనుభవం సానుకూలంగా అనిపించింది అని మనం అనుకోవచ్చు. అయితే ఇవి ఖచ్చితంగా నిర్ధారణలకైతే కావు. కొందరు సహజంగానే ప్రశాంతంగా ఉంటారు మరికొందరు తమ భావాలను బయట పెట్టరు.
(04:10) అర్థమైంది కదండీ ఇక ఎనిమిదవది సంతృప్తి అంటే కేవలం ఉద్వేగ శిఖరం అంటే అర్ఘాజం ఇది మాత్రమే కాదు చాలామంది పురుషులు అర్ఘాజం జరిగితేనే స్త్రీ సంతృప్తి చెందుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ పూర్తిగా నిజం కాదు చాలామంది మహిళలు ప్రేమ ఆప్యాయత గౌరవం భావోద్వేగ అనుబంధం వల్ల కూడా సంభోగాన్ని సంతృప్తికరంగా భావిస్తారు.
(04:43) ప్రతిసారి అర్ఘాజం జరగకపోయినా ఇద్దరికీ మంచి అనుభవంగా కూడా ఉండొచ్చు. ఇక తొమ్మిదవది తొందర పడకుండా సమయం ఇవ్వడం సంభోగం అనేది పోటీ కాదు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తొందర పడకుండా ఇద్దరికీ సౌకర్యంగా ఉండే వేగంతో ముందుకు సాగితే మంచి అనుభవం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిజమే కదండీ ఇకపవది ముందస్తు ఆప్యాయత అంటే ఫోర్ ప్లే దీన్ని ఈ విధంగా కూడా అంటారండి ప్రాముఖ్యత అనేది దీంట్లో చాలామంది నిపుణులు ముందస్తు ఆప్యాయతకు అంటే ఫోర్ ప్లే ను మంచి ప్రాధాన్యత అయితే ఇచ్చారు.
(05:27) డాక్టర్స్ కూడా ముందు ఫోర్ ప్లేనే ట్రై చేయమంటారు. అంటే ప్రేమగా మాట్లాడడం ఇలా ముద్దు ముచ్చట్లు హగ్గులు ఒకరినొకరు అర్థం చేసుకోవడం వంటివి అనేక జంటల్లో సాన్నిహిత్యాన్ని పెంచడంలో సహాయపడతాయని ఇలా ముందు డైరెక్ట్ గా సంభోగం చేసుకోకుండా ఫోర్ పే తో స్టార్ట్ చేయండి అని ప్రతి ఒక్కరు అయితే చెబుతారు. మీకు సంభోగంలో ఏదన్నా ఇబ్బందులు ఉన్నా మీరు నిపులను సంప్రదిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఫోర్ ప్లే తో స్టార్ట్ చేయమని చెబుతారు.
(06:06) ఇక 11వది సంబంధం బలంగా ఉండడం కూడా ముఖ్యమే. [గురకలు] రోజు వారి జీవితంలో గౌరవం నమ్మకం ప్రేమ ఒకరినొకరు వినడం వంటి అంశాలు కూడా శృంగార జీవితంపై ప్రభావం చూపుతాయి. మంచి సంబంధం ఉంటే ఇద్దరూ తమ అవసరాలు మరియు అభిరుచుల గురించి స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు. ఇక 12వది ప్రతి మహిళా స్పందించే విధానం ఒకేలా ఉండదు.
(06:34) ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సినిమాల్లో లేదా సోషల్ మీడియాలో చూపించినట్లు ప్రతి మహిళ ఒకే విధంగా స్పందించదు. కొంతమంది ఎక్కువగా భావాలను బయట పడతారు. మరికొందరు నిశశబ్దంగా ఉంటారు. ఇంకొందరు ప్రేమగా నవ్వుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. కాబట్టి ఇతరులతో పోల్చుకోకుండా మీ భాగస్వామి ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
(07:02) అర్థమైంది కదండీ ఇక 13వది తర్వాత కూడా ప్రేమగా మాట్లాడడం ఎందుకు ముఖ్యం అని చాలామంది అంటూ ఉంటారు. చాలామంది సంభోగం పూర్తయ్యాక అంతే అని అనుకుంటారు కానీ నిజానికి ఆ తర్వాత కూడా భాగస్వామితో ప్రేమగా మాట్లాడడం హత్తుకోవడం ఆమె ఎలా ఉందని అడగడం వంటి విషయాలు సంబంధాన్ని మరింత బలపరుస్తాయి. ఉదాహరణకి నువ్వు కంఫర్ట్ గానే ఉన్నావా నీకేమన్నా ఇబ్బందిగా ఉందా ఏమైనా అసౌకర్యంగా అనిపించిందా? నీకు ఏం బాగా నచ్చింది ఎలాంటి ప్రశ్నలు ఆమెకు తన భావాలను స్వేచ్ఛగా చెప్పే అవకాశం అయితే ఇస్తాయి. కాబట్టి మీరు ఒక్కసారి
(07:47) ట్రై చేసి చూడండి. ఇక 14వది సంతృప్తి అనేది ఇద్దరి బాధ్యత. చాలామంది పురుషులు నేను మాత్రమే ఆమెను సంతృప్తి పరచాలి అని అనుకుంటారు. కానీ నిజానికి శృంగార జీవితం అనేది ఇద్దరి భాగస్వామ్యం ఇద్దరూ తమ అభిరుచులు ఇష్టాలు పరిమితులు గురించి ఓపెన్ గా మాట్లాడుకున్నప్పుడు మంచి అనుభవం కలిగే అవకాశం ఉంటుంది. ఇక 15 నమ్మకమే గొప్ప ఫలం.
(08:19) ఒక మహిళ తన భాగస్వామిని పూర్తిగా నమ్మినప్పుడు తనకు నచ్చినవి నచ్చనివి తన భావాలను స్వేచ్ఛగా చెప్పగలుగుతుంది. ఇక ఆ నమ్మకాన్ని గౌరవించడం ఒత్తిడి చేయకుండా వ్యవహరించడం ఆరోగ్యకరమైన సంబంధానికి పునాది అవుతుంది. గుర్తుపెట్టుకోండి. 16వది అపోహలను నమ్మకండి. ఒక నిర్దిష్ట సమయం కొనసాగితేనే సంతృప్తి కొన్ని ప్రత్యేక భంగ్యమల వల్లే సంతృప్తి ప్రతిసారి ఒకే విధమైన అనుభవం ఉండాలి.
(08:53) ఇలాంటి అపోహలకు శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రతి జంట అనుభవం భిన్నంగా ఉంటుంది. పరస్పర సమ్మతి కమ్యూనికేషన్ భావోద్వేగ సంబంధం చాలా ముఖ్యమైంది. ఇక 17 భాగస్వామి అభిప్రాయాన్ని గౌరవించడం ఒక ఆరోగ్యకరమైన సంబంధంలో నేను బాగా చేశానా అనే ప్రశ్న కంటే నీకెలా అనిపించింది అనే ప్రశ్నకు ఎక్కువ విలువ ఉంటుంది.
(09:26) ఎందుకు అంటే ప్రతి వ్యక్తి అభిరుచులు సౌకర్యం అవసరాలు వేరువేరుగా ఉంటాయి. ఆమె చెప్పే అభిప్రాయాన్ని విమర్శగా కాకుండా ఒకరికొకరు ఇంకా బాగా అర్థం చేసుకునే అవకాశంగా చూడాలి. అర్థమైంది కదండీ ఇక 18 వది తొందరపడి నిర్ణయాలకు రావద్దు. ఒకసారి భాగస్వామి నిశశబ్దంగా ఉందని లేదా అలసిపోయినట్లుగా కనిపించిందని ఆమె శ్రంతృప్తిగా ఉందని అనుకోవద్దు. కొన్నిసార్లు అలసట ఒత్తిడి ఇక నిద్ర లేకుండా లేదా ఇతర కారణాల వల్ల కూడా అలాంటి స్పందన ఉండొచ్చు.
(10:06) అందుకే ఊహించకుండా సరైన సమయంలో ప్రేమగా మాట్లాడడం చాలా ఉత్తమ మార్గం. 19 వది ఆరోగ్య పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయి. శారీరక ఆరోగ్యం హార్మోన్ల మార్పులు మానసిక ఒత్తిడి ఇక మందుల ప్రభావం వంటి అనేక అంశాలు కూడా లైంగిక అనుభవాన్ని ప్రభావితం చేయొచ్చు. అందువల్ల ప్రతి అనుభవం ఒకేలా ఉండాలని ఆశించకండి. ఒకరోజు అనుభవం ఆధారంగా మొత్తం సంబంధాన్ని అంచన వేయడం సరైంది కాదు మంచి సంబంధానికి మూడు బంగారు నియమాలు అందులో మొదటిది పరస్పర సమ్మతి ఇక రెండవది స్పష్టమైన కమ్యూనికేషన్
(10:52) చివరిది పరస్పర గౌరవం అర్థమైంది కదా ఈ మూడు అంశాలు ఉంటేనే ఇద్దరికీ కూడా సురక్షితమైన సంతోషకరమైన అలాగే ఆరోగ్యకరమైన శృంగార జీవితం ఉంటుంది. చివరి ముగింపు అందరి కూడా స్త్రీ సంతృప్తి చెందింది అని తెలుసుకోవడానికి ఏదైనా మాయ సంకేతం ఏదీ లేదు. గుర్తుపెట్టుకోండి ఆమె భావాలను వినండి. ఆమె సౌకర్యాన్ని గౌరవించండి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మెలిగిపోండి.
(11:31) అంతే ఇక ఎప్పుడూ కూడా మీ జీవితం అనేది సంతోషంగా సాగిపోతుంది. అర్థమైంది కదండీ సో చూశారు కదా ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తలను మనకి చెప్పబోతున్నారు అనేది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం

Only girls can relate to these feelings 🙋‍♀️🤭 #shorts #relatable #youtubeshorts

Only girls can relate to these feelings 🙋‍♀️🤭 #shorts #relatable #youtubeshorts

Author Name:Sujay And Gopu

Youtube Channel Url:https://www.youtube.com/@Sujayandgopu02

Youtube Video URL:https://www.youtube.com/watch?v=xOWtbAQPWsk



Transcript:
(00:13) [Music] Jewish [Music] mom. Chared. [Music]
 "రామాయణం రంకు, భారతం బొంకు" అంటారు ఎందుకు? ఈ సామెత ఎలా వచ్చింది?
గాసట బీసటే చదివి గాథలు త్రవ్వు తెలుగు వాళ్లే ఇలాంటి పదాలు ప్రాస కోసం పాకులాడుతూ కల్పిస్తారు.

అబద్దానికుండే శక్తి సత్యానికి ఎక్కడ ఉంటుంది ?

నిజం తెలియడానికి చాలా ఓపిక, పట్టుదల ,జిజ్ఞాస ఉండాలి.

ఎవరి కర్మాన వాడు పోతాడు —అని అందరినీ స్వేచ్ఛగా వదలివేయడం మన జాతి లక్షణం.

"న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం" అంటాడు భగవానుడు.

చేతులు కాలి బుద్ధి తెచ్చుకొంటాడు. సొంతంగా అనుభవానికి వస్తే గట్టిగా నిలబడతాడు.. బాగా తెలిసి రావాలి. ఈ జన్మ కు కాకపోతే పై జన్మకు అని పూర్తి స్వేచ్ఛనిస్తాం మనం..

వైరంతోనైనా స్మరించనీ. ! అని.

కామ్యాలు తీర్చేవాడుగా ముందు ఆకర్షిస్తాడు ఇష్ట దైవం .

.అనేక జన్మ సంసిద్ధః అయి, సత్యం తెలుసుకుంటాడు.

కట్టెలు మండుతూ ఉంటే పొగ గూడా వస్తుంది.

*వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే

వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా !*

అని ఒక వైపు చెప్తూ ఉంటే , ఇది రంకు అనే వాళ్ల వి జ్ఞానాన్ని ఏమనగలం ?

రావణాసురుడు, వాలి, శూర్పణఖ ఆదర్శమైనవాళ్ళకు రామకథ అలాగే కనిపిస్తుంది. రాముడు స్త్రీ లోలుడుగా కనిపిస్తాడు.

బొంకి , జూదానికి ముందు చేసుకొన్న ఒప్పందం ఉల్లంఘించి, కుల నాశనం చేసుకొన్నారు ధార్తరాష్ట్రులు.

యుగ ధర్మం అనుసరించి , నోరు లేని జంతువులపైన అస్త్రాలు వేయడం తప్పించి , యుద్ధం తప్పు దారిని బడకుండా సత్య శుభదాయకం అయి, సద్గతి ప్రదంగా కొనసాగడానికి

శ్రేయస్సు కోరే భగవానుని మాటను అనుసరించిన ధర్మజుడు

బొంకినవాడుగా కళ్ళున్న మనకు కనిపిస్తాడు.

. కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి గూడా , ఇది తప్పుగా కనిపించలేదు. ఆక్షేపించ లేదు.

కానీ, ప్రతి పనికీ ప్రతిగా మరొక ప్రతి చర్య జరిగి తీరడం ప్రకృతి నైజ గుణం.

* న కేవలం యో మహతోపభాషతే

శ్రుణోతి యస్మాదపి యః సః పాపభాక్ *-- అని దేవీ వచనం.

కర్తా కారయితా చైవ ప్రేరకశ్చానుమోదకః

సుకృతే దుష్కృతే చైవ చత్వారః భాగినః .

అని భారత వచనం. అందుచేత ఊరికే నోరు పారేసుకోగూడదు. త్రికరణాలలో నోరూ ఒకటి.. అది చేసే పనికీ ఫలితం ఉంటుంది గా!

వాకునకుం దెచ్చుట ఉచితమె? అంటాడు నన్నయ. ఆలోచించి గానీ మాట పెగలగూడదు.

* తెలియనివన్ని తప్పులని దిట్ట తనాన వచింపబోకు, నీ పలికిన నోట దుమ్మువడ* —అని పాపం ఒక కవి ఇలాంటి మాటలు వినలేక నోరు చేసుకొన్నాడు.!
 'ఆమడ దూరం'లో 'ఆమడ' అంటే అర్థం ఏంటి? ఈ పదం ఎలా పుట్టింది? ఎంత దూరం?

ఆమడ దూరం.. ఈ పదాన్ని ఒకప్పుడు దూరాన్ని కొలిచేందుకు వినియోగించేవారు. బ్రిటీష్ పాలనకు ముందు తెలుగు ప్రాంతాల్లో విస్తృతంగా వాడేవారు.

ఆధనిక భాషలో ఇది చాలా దూరం అని అర్థం. కానీ కచ్చితమైన కొలతలు, ప్రామాణిక లెక్కల ప్రకారం..

ఆమడ దూరం - 4 క్రోసులు

క్రోసు - 2 మైళ్లు

2 మైళ్లు - 3.2 కిలోమీటర్లు

ఆమడ అంటే 8 మైళ్లు లేదా 13 కిలోమీటర్ల దూరం

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ పాత నిఘంటువు ప్రకారం ఆమడ దూరం అంటే 8 లేదా 10 మైళ్లు అని ఉంది. ప్రాంతీయ వ్యత్యాసాల వల్ల కొంత వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా 13 కిలోమీటర్ల దూరం అని అర్థంచేసుకుంటారు.

ఆమడదూరం అనే పదం ఎలా ఆవిర్భవించింది?

ఆమడ అనేది తెలుగు స్థానిక పదం..ఇది సంస్కృతం నుంచి నేరుగా రాలేదు. భారతీయ కొలత వ్యవస్థలో భాగం. క్రోసు అనే పదం క్రోశం అనే సంస్కృత పదం నుంచి వచ్చింది..క్రోసు అంటే ఓ మనిషి కేక వినిపించే దూరం. ఆరోగ్యవంతుడైన వ్యక్తి పెద్దగా అరిస్తే..ఆరోగ్యవంతుడైన వ్యక్తికి వినిపించే దూరం. అలా ఆమడ దూరం ఈ క్రోసుల మీద ఆధారపడింది. 4 క్రోసులు ఒక ఆమడ. బ్రిటీష్ రాకముందు వరకూ వాడిన కొలత ఇది. గ్రామాల మధ్య దూరం, ప్రయాణాలు చెప్పేటప్పుడు రెండు ఆమడల దూరం అనే పదం వినియోగించేవారు.

బ్రౌన్ నిఘంటువులో స్పష్టంగా...“The greatest Telugu measurement of extent, equal to four coss, or about eight English miles.”
పాత సాహిత్యంలో, కథల్లో, మాటల్లో...ఇది అలసట కలిగించే దూరంగా కూడా వాడారు. ప్రతి అడుగు ఆమడగా అనిపించిందనేవారు. అంటే చాలా అలసిపోయినట్టు అర్థం.

ఇతర పురాతన కొలతలతో పోల్చితే...దీన్నే యోజనం అనేవారు
సాధారణంగా 4 క్రోసుల దూరం అంటే ఒక యోజనం
యోజనం అంటే 8 నుంచి 15 కిలోమీటర్ల దూరం మధ్య మారుతుంది
కొన్ని సంప్రదాయాల్లో ఆమడను యోజనంతో సమానంగా చెప్తారు
ఇతర కొలతలు - అంగుళం, జాన, మూర, బార, దండం, క్రోసు, ఆమడ/యోజనం

ఆధ్యాత్మిక దృష్టిలో..

ఆమడ అంటే 13 కిలోమీటర్ల దూరం మాత్రమే..కానీ ఆధ్యాత్మికంగా ఇది లోతైన అర్థం కలిగి ఉంది. పురాణాలు, రామాయణం, మహాభారతంలో దూరాన్ని యోజనాల్లో చెప్పారు. రాముడు అరణ్యవాసం, హనుమంతుడు సముద్ర లంఘనం అన్నీ యోజనాల్లో చెప్పారు. ఇది కేవలం భౌతిక దూరాలు కావు..శ్రమను, సహనాన్ని అంతరాత్మ ప్రయాణాన్ని సూచిస్తాయి.

ఆమడదూరం నడవడం అంటే శరీరం అలసిపోయేంత అని అంచనా. జీవితంలో లక్ష్యాలు, సాధన, ఆత్మజ్ఞానం కూడా ఓ ఆమడదూరంలా అనిపిస్తాయ్. కానీ నడుస్తుంటే ప్రతి అడుగు ఓ అనుభవం అవుతుంది, పాఠం నేర్పిస్తుంది. వేదకాలం నుంచి కొలతలు ప్రకృతి, మనిషి, దైవం మధ్య సమతుల్యతను చూపించేవి అవుతాయ్.

ఆమడ అనేది మనిషి సామర్థ్యానికి అనుగుణంగా ఉన్న కొలత. దూరం ఎంతైనా కానీ నడవడం ముఖ్యం. ఆధునిక కాలంలో ఇప్పుడు మనం కిలోమీటర్లు, మైళ్లు అనే పదాలు వాడుతున్నాం..కానీ ఆమడదూరం అనే మాట ఇంకా జీవించి ఉంది. ఎందుకంటే అది సంఖ్య కాదు ఓ భావం. ఒక పాత మాట జీవించి ఉండడం అంటే ఆ భాష, సంస్కృతి బలంగా ఉందని అర్థం.
 రీసైక్లింగ్ వీరుడు (The Young Eco-Hero)
​అరవింద్ అనే ఎనిమిదేళ్ల బాలుడు ప్రతిరోజూ బడికి వెళ్లేటప్పుడు దారిలో ప్లాస్టిక్ సీసాలు, కవర్లు రోడ్డుపై చెత్తగా పడి ఉండటం చూసేవాడు. చాలామంది దాన్ని చూసి పట్టించుకోకుండా వెళ్లేవారు. కానీ అరవింద్ తన స్కూల్ బ్యాగ్‌లో ఒక చిన్న సంచి ఉంచుకుని, రోజుకి కనీసం ఐదు ప్లాస్టిక్ సీసాలు ఏరి డస్ట్‌బిన్‌లో వేయడం మొదలుపెట్టాడు.
​ఆ విషయాన్ని గమనించిన అతని ఉపాధ్యాయుడు అసెంబ్లీలో అందరి ముందు అరవింద్‌ను మెచ్చుకున్నాడు. అది చూసి స్కూల్లోని మిగతా విద్యార్థులు కూడా ప్రేరణ పొంది, 'గ్రీన్ క్లబ్' ప్రారంభించి తమ చుట్టుపక్కల ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మొదలుపెట్టారు. ఒక చిన్న పిల్లాడి ఆలోచన పెద్ద మార్పుకు నాంది పలికింది.
​నీతి: సమాజంలో మార్పు రావాలంటే వేరొకరు మొదలుపెడతారని వేచి చూడకూడదు; మనమే ఆ మార్పుగా మారాలి.
 .             *🌷 నేటి కథ🌷*

రచయిత :*ప్రభాకర్ గౌడ్ నోముల* వరంగల్ జిల్లా
944 0060 852 .

*నహిమాలుమ్*

హిందీలో "నహి మాలుమ్" అంటే "నాకు తెలియదు" అని అర్థం కదా. 

ఒక పల్లెటూరిలో బిక్షపతి అనే వ్యక్తి కి హిందీ భాష రాదు. ఈ మధ్యకాలంలో అతడు కొన్ని రకాల వ్యాపారాలు చేశాడు. ఆర్థికంగా మంచిగానే సంపాదించాడు. అతనికి ఎప్పటి నుండో ఒక కోరిక హైదరాబాదును చూడాలి ఎక్కడ ఉన్న చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయని విన్నాడు. కానీ అయితే వాటి గురించి అతనికి కొంత మాత్రమే తెలుసు పూర్తిగా తెలుసుకోవాలి. వాటిని చూడడానికి ఒక రోజు బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు అతనికి కారు ఉంది. అందులో ఒక్కడే బయలుదేరాడు. అతను వెంట వేరే వాళ్ళు వస్తే అతను చూడవలసిన ప్రదేశాలు ప్రశాంతంగా చూడాలి అనుకున్నాడు. బిక్షపతికి ఐఫోన్ ఉంది లొకేషన్ పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాడు అది నేర్చుకున్నాడు ఈమధ్య మొత్తానికి  పాతబస్తీ హైదరాబాద్ లోని చార్మినార్ వద్దకు  వచ్చాడు. ఆశ్చర్యం అనిపించింది. ఇంత అద్భుతంగా ఉంది. ఇది ఎవరు కట్టారు అనుకున్నాడు వెంటనే పక్కనుండి పోవుచున్న ఒక వ్యక్తిని హ్యాపీ ఇది ఎవరు కట్టారు చాలా బాగుంది అన్నాడు. ఆ వ్యక్తి బిక్షపతి ని కిందికి మీదికి చూసి "నహి మాలుమ్" అని వెళ్ళిపోయాడు. బిక్షపతి కి హిందీ రాదు కాబట్టి "నహి మాలుమ్"అంటే ఒక వ్యక్తి పేరు అనుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అబ్బా చాలా గొప్ప వ్యక్తి "నహి మాలుమ్"అనేవాడు అనుకున్నాడు. చార్మినార్ దాని పక్కనే ఉన్న మక్కా మస్జిద్ దగ్గరకు వెళ్లాడు దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఇది చాలా బాగా అద్భుతంగా ఉంది. దీన్ని ఎవరు కట్టి ఉంటారు. అనుకున్నదే తడువుగా అక్కడ ఉన్న ఒక వ్యక్తిని అడిగాడు ఇది ఎవరు కట్టారు. వాడు కూడా వెంటనే "నహి మాలుమ్"అని వెళ్ళిపోయాడు. బిక్షపతి మళ్లీ ఆశ్చర్యపోయాడు. ఇది కూడా "నహి మాలుమ్"అతనే కట్టాడా చాలా గొప్ప వ్యక్తి అనుకున్నాడు. మళ్లీ google లొకేషన్ పెట్టి హుస్సేన్ సాగర్ కట్ట మీదికి చేరుకున్నాడు. అద్భుతం బుద్ధ విగ్రహం చెరువు మధ్యలో ఎక్కడ పల్లీలు అమ్ముకునే వ్యక్తిని అడిగాడు ఈ చెరువును ఎవరు తోవ్వించారు అని అడిగాడు, పల్లీలు కొనుక్కోక వీడు నన్ను పిచ్చి ప్రశ్న అడుగుతున్నాడు అనుకుని చిరాగ్గా మొఖం పెట్టి "నహి మాలుమ్"అని వెళ్ళిపోయాడు. అక్కడ నుండి గోల్కొండ కోట కు చేరుకున్నాడు. మళ్లీ ఆశ్చర్యపోయాడు. అక్కడున్న ఒక వ్యక్తిని వెంటనే ఈ కోటను ఎవరు కట్టారు. అని అడిగాడు ఓకే సమాధానం "నహి మాలుమ్" బ్రహ్మాడం నాలాగా వీడు కోటీశ్వరుడు అయి ఉంటాడు ఎన్ని కట్టాడు ఇతన్ని కలుసుకోవాలి అనుకున్నాడు. బిక్షపతి కి సినిమా వాళ్లు అంటే చాలా ఇష్టం ఒకటి అరా సినిమాలలో నటించాలి అనే కోరిక కూడా మనసులో ఉంది. అనుకున్నదే ఆలస్యం వెంటనే లోకేషన్ పెట్టుకొని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలిం సిటీ , కాసు బ్రహ్మానంద రెడ్డి (KBR) నేషనల్ పార్క్ టిడిపి పార్టీ ఆఫీస్ వద్దకు  కారులో వస్తున్నాడు బిక్షపతి. ఇంతలోనే అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. అందరిలాగే చూడ్డానికి కారు పక్కన ఆపి ఏం జరిగింది అని ముందుకు వచ్చాడు. అక్కడ ఒక వ్యక్తికి తలకు దెబ్బ తాకి పడి ఉన్నాడు. ఒక గొప్ప వ్యక్తి ఒక సినిమా యాక్టర్ కానీ అతని పేరు ఎవరికీ సరిగ్గా తెలియదు. పక్కన ఉన్న వాడు చాలా మంచి మనిషి నాకు తెలిసిన వాడు కానీ నేను ఆఫీస్ కి వెళ్ళాలి అనుకుంటూ వెళ్లిపోయాడు. బిక్షపతికి అతని మీద సదాభిప్రాయం ఏర్పడింది వెంటనే పక్కనున్న మరో వ్యక్తిని అడిగాడు ఇతను ఎవరు?. అతను వెంటనే "నహి మాలుమ్" అన్నాడు. బిక్షపతి కి ఎంతో ఆశ్చర్యం అయింది. నా అభిమాన హీరో చార్మినార్ నుండి గోల్కొండ కోట వరకు కట్టించిన వ్యక్తి "నహి మాలుమ్" ఇతనేనా అని మనసులో అనుకొని అన్నా నాకు తెలిసిన వ్యక్తి ఇతను నేను హాస్పిటల్కు తీసుకు వెళ్తాను ఇతడు మంచి మనిషి నా కారులో ఇతన్ని ఎక్కించండి అంటూ కార్ డోర్ తీశాడు బిక్షపతి. మరో నలుగురు సహాయంతో ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. సొంత ఖర్చులతో బాగు చేయించాడు. తర్వాత కొన్ని రోజులకు అతని సహాయంతో ఒకటి అర సినిమాల అవకాశము ఇచ్చాడు "నహి మాలుమ్" బిక్షపతి ఇప్పుడు సినిమా యాక్టర్. 
*✍️*
*┈┉┅━❀꧁ ప్రభాకర్ గౌడ్ నోముల ꧂❀━┅┉┈*
 కథ 
*శ్రీమతి...ఒక బహుమతి*
*****************
నిన్న సాయంత్రం రిటైర్మెంట్ ఫంక్షన్ అయ్యాక ఆలస్యంగా ఇంటికొచ్చి పడుకున్నాడు ఆనంద్.

ఈరోజు నుంచి ఆఫీసుకు వెళ్ళక్కర్లేదు. ఆఫీసు అటెండర్, డ్రైవర్ అతనింటికి రారు. గడియారం కూడా నెమ్మదిగా తిరుగుతున్నట్లుగా ఉంది.
నీరజ కాఫీ కప్పు తెచ్చి టీపాయ్ మీద పెట్టింది. 
ఎదురుగ్గా ఉన్న టేబుల్ మీద  ఎప్పటిలా ఫైళ్ళు లేవు. ఆనంద్ అంతరంగ మస్తిష్కం లో మాత్రం పుస్తకంలో పేజీల్లాగా  జ్ఞాపకాల దొంతరులు తెరుచుకుంటున్నాయి.
కాఫీకప్పును చేతిలో పట్టుకుని బాల్కనీలోకి వచ్చి కూర్చున్నాడు.
తన ముందు కూర్చున్న నీరజను గమనించాడు.
ఆమె జుట్టు అక్కడక్కడా నెరిసింది. ఆమె కళ్ళల్లో మాత్రం  ప్రశాంతత కనిపిస్తోంది.
"నీరజా!" పిలిచాడు.
అతని పిలుపులో సంవత్సరాల తపన దాగి ఉందనిపించింది.
నీరజ నవ్వుతూ చూసింది ' ఎందుక' న్నట్లుగా ?
నీరజకు దగ్గరగా జరిగాడు.
ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు.
ఇన్నాళ్లూ నిన్ను పట్టించుకోలేకపోయాఅన్నాడు నెమ్మదిగా. 
ఆనంద్ కళ్ళు  పశ్చాత్తాపంతో నిండిపోయాయి.
"గెజిటెడ్ ఆఫీసర్ గా ఇన్నాళ్లూ 'రాణిం'చానంటే ఆ వెనుక వెన్నుముకలా నీ కృషి ఉంది. ఇప్పుడు తెలుస్తోంది. నువ్వున్నావ్ కనుకనే నేను 'రాజు'లా వెలిగాను అన్నాడు.
నీరజ మృదువుగా నవ్వింది. "మీకిప్పుడే తెలిసిందా నా ప్రేమ? ఈ క్షణమే అర్ధమైందా నా హృదయం ?" అంది.
"అవును, నీ డైరీ చదివాకే తెలిసింది".
"పరాయి వారి డైరీ చదవడం తప్పు కదా ? అంది మెల్లగా.
"నిజమే. కానీ నువ్వు పరాయిదానివి కాదు. నాలో సగం. ఆ సగం అర్థమైంది" నీరజ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూశాడు.

ఆనంద్ మాటలతో, నీరజకు 
కాలం వెనక్కు వెళ్లినట్లనిపించింది. డైరీలో ఒక్కొక్క పేజీ గతం గుర్తు చేస్తూ  కళ్ళ ముందు సినిమా రీళ్లలా కదలాడింది.
        ******
ఆనంద్ ఒక మామూలు సాదా సీదా ప్రభుత్వ గుమస్తాగా ఉద్యోగం చేస్తున్నాడు. తాను ఉంటున్న ఇంటిని, నెలలో వచ్చే జీతాన్ని చూసి నిట్టూర్చేవాడు. 
సగటు జీవి(తం). పైకి ఎగురలేడు. కిందకు దిగనూ లేడు.

పేరు చివర పేరు మోసిన డిగ్రీలు ఎన్ని చదివినా, అర్హతకు తగిన ఉద్యోగం రాలేదన్న అసంతృప్తి ఏ మూలనో ఉండి పోయింది. అయితే, ప్రేమించి పెళ్లాడిన నీరజను, ప్రేమకు ప్రతిఫలం అయిన అరుణ్ ని చూసి, ఆ  అసంతృప్తిని పక్కన పెట్టేసేవాడు.
ఇల్లు చిన్నది. జీతం ఇంకా చిన్నది. అయితే అతని హృదయం విశాలం. మమత అనంతం.
ప్రేమ ఆకాశం.
భార్యా, బిడ్డలతో హాయిగా గడిపేవాడు.
సాయంత్రం సైకిల్ బెల్ వినబడటంతోనే నీరజ కళ్ళు గుమ్మం వైపు చూసేవి. నీరజ వీధి గుమ్మం చేరుకునేసరికి కళ్ళు వాకిట్లో ఉండేవి.
"అమ్మా!...'నాన్న!' వచ్చారంటూ ఐదేళ్ల అరుణ్ తండ్రి తెచ్చే చాకలెట్ల కోసం సైకిల్ దగ్గరకు చేరిపోయేవాడు.
చాకలెట్లు తీసుకోగానే అరుణ్ ముద్దిచ్చేవాడు.
"మా మంచి నాన్న" అంటూ చాకలెట్స్ పట్టుకుని ఆటలకు వెళ్లిపోయేవాడు.
"నీరూ! మన వాటా" అంటూ మూర మల్లెపూల దండను చేతిలో పెట్టేవాడు. నీరజ మురిపెంగా తీసుకునేది.
అరుణ్ చాకలెట్స్ తీసుకోగానే ముద్దిచ్చాడు. మరి నువ్వు ?  కొంటెగా  అనేవాడు.
చాళ్ళెండి...సంబడంఅంటూ కవ్వించేది.
ఆరోజు ఆనంద్ నీరజ ల పెళ్ళిరోజు.
రాత్రయింది. పున్నమి వెన్నెల పడకగది  కిటికీలోంచి గదిలోకి ప్రసరిస్తోంది.
ఆనంద్ పడుకోబోతూ కిటికీ వేయడానికి లేచాడు.
"ఎందుకో ?" అంది కవ్వింపుగా.
"చందమామ చూస్తాడు" అన్నాడు అంతే కవ్వింపుతో.
"మెల్లగా వేయండి!"
"దేనికో?"
"బాబు లేస్తాడు".
"గడుసరివే"
"సొగసరిని కానా ?
"కాదన్నానా ? కబుర్లతోనే  వెన్నెల రాత్రిని కరిగించేస్తావా ? అంటూ నీరజను దగ్గరకు తీసుకున్నాడు.
తమకంతో ఆనంద్ ను అల్లుకు పోయింది.
ఆనంద్ తపనతో నీరజకు మరింత చేరువ అయ్యాడు.
కొంతసేపటి తరువాత
ఆనంద్, అరుణ్ తో సమానంగా ఆదమరిచి నిద్ర పోతున్నాడు.
నీరజ ముందు గదిలోకి వచ్చి తన డైరీ తీసుకుంది.
"ఈ పున్నమి రాత్రి ఎంతో అందంగా, ఆనందంగా గడిచింది. ఈ ఆనందం పదిలం కావాలి. ఆనంద్ ఎప్పుడూ, నాతో ప్రేమగా ఉండాలి. అని రాసింది.
తెలతెల్లగా తెల్లారింది.
ఆరోజు ఆదివారం.
ఆనంద్ అరుణ్ ను సైకిల్ సీటు మీద కూర్చోపెట్టి, సైకిల్ ను పట్టుకున్నాడు. ముందుకు నడిపిస్తున్నాడు.
కాలు అందడం లేదు. పడిపోతా నాన్నా!
నన్ను దాటి ఎదగాలి. నేను చూడాలి. నీ బాధ్యత నాది. అన్నాడు. సైకిల్ పై విన్యాసమా ?
తండ్రీ కొడుకులకేసి ఆప్యాయంగా చూస్తూ అంది.
కాదు... విహారం అన్నాడు.
"అమ్మా! నేను ముందు కూర్చుంటాను. నువ్వు వెనుక సీటు మీద కూర్చో. నాన్న సైకిల్ తొక్కుతారు" అన్నాడు అరుణ్.
"అమ్మో! నాకు భయం కన్నా!" అని నీరజ. 
"ఆనంద్ ఉండగా నీ చెంత. ఇంకేల ఆ చింత ?"  నవ్వుతూ అన్నాడు సైకిల్ సీటు మీద కూర్చుంటూ.
"శ్రీవారు ప్రాసలో బాగా చెప్పారే"

పడిపోకుండా కూడా సైకిల్ నడిపేస్తా అంటూ నీరజను సైకిల్ వెనుక సీటుపై కూర్చోబెట్టాడు. మెల్లగా ముందుకు సైకిల్ తొక్కాడు.
ఆమె చేతులు ఆనందును వెనుక నుండి పట్టుకున్నపుడు
'సైకిల్ కదిలిందా, ఆమె గుండె కదిలిందా ? నీరజకు తెలియలేదు. ఆమె  శ్వాస తాకిడికి అతడి మనసు ఎగిరినంత ఆనందంగా ఉంది.
దారిలో ఫోటో స్టూడియో దగ్గర ఆపాడు. ఆనంద్ ను చూడగానే ఫోటో స్టూడియో అప్పారావు బయటకు వచ్చాడు.
"అప్పారావ్ ! మా ముగ్గురికి ఈ సైకిల్ మీద ఉండగా ఓ ఫోటో తియ్యి" అన్నాడు.
అప్పారావు వెంటనే ఇన్ స్టెంటు కెమెరా తో ఫోటో
తీసిచ్చాడు.  మళ్ళీ ఇంటికి బయల్దేరారు.
భార్యా, బిడ్డలను సైకిల్ పై బాధ్యతగా ముందుకు నడిపిస్తున్న భర్త మీద అమితమైన ప్రేమ కలిగింది. ఆ ప్రేమనే, అక్షరాలలో వ్యక్త పరచాలనుకుంది.
డైరీ తీసింది. పేజీలు తిప్పింది.
"ఈనాటి  ఈ సంతోషం విలువ, కలంతో రాయలేనంత. కాలం తో కొలవలేనంత. నా ఆనందం అంబరాన్ని తాకింది. సంబరాలు జరుపుకోవడానికి పండుగే అవసరం లేదు. మనకంటూ మనసు, ఆ మనసును అర్ధం చేసుకునే మనిషి ఉంటే చాలును . మా ఇల్లు ఇరుకే..కానీ ఆయన హృదయం విశాలం.
జీతం తక్కువే. కానీ   జీవితం ఆనందమయం...ఆ ఆనందం ..ఈ అనంద్  నా సొంతం" అని రాసింది.
**********
కాలం గిర్రున తిరగడం సహజం. కానీ ఆనంద్ కూడా కాలంతో సమానంగా పరుగు పెట్టాడు. ఉద్యోగం, స్థాయీ పెరగాలనుకున్నాడు. జీతం, హోదా, సోషల్ స్టేటస్ అన్నీ పెరగాలి...పెంచుకోవాలి" అనుకున్నాడు. పట్టుదలతో చదివాడు. గ్రూప్స్ పరీక్షలు రాసి గెజిటెడ్ ఆఫీసర్ అయ్యాడు.
మూడు గదుల ఇల్లు, మూడు బెడ్ రూమ్ ల  భవనమైంది. సైకిల్ స్థానంలో కారొచ్చింది. నీరజకు  పనితో పాటు ఆనందమూ ఆవిరయ్యింది.  ఒకే ఇంట్లో ఉంటున్నా ఆనంద్ తనకు బాగా దూరంగా ఉన్నట్లుగా ఉంటోంది. మనసు విప్పి మాట్లాడుకునే సమయం లేదు. ఆనంద్ చుట్టూ ఫైల్స్, ఎప్పుడూ ఫోన్స్...నెలలో ఎక్కువుగా క్యాంపులు.
గతంలో నీరజ రోజులో ఒక్కసారి మాత్రమే డైరీ చూసేది, రాసేది.
ఆనంద్ ఆఫీసు పనితో, అరుణ్ హాస్టల్ చదువులో బిజీ బిజీ అయ్యారు.
మధ్యలో నీరజ మాత్రం నిశ్శబ్దంగా సర్దుకుంది. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో నీరజ కు అర్థమయ్యింది. డైరీ తోనే  రోజంతా గడుపుతోంది.
ఆనంద్ ! నేను నీ ఉరుకుల, పరుగుల జీవితాన్ని ఆశించ లేదు. నువ్వు ఎదిగావ్. అది గెలుపే కావచ్చు. కానీ నాకు అందడం లేదు. నీ గెలుపుతో నా ఓటమి మొదలైంది. నీ చేతిని అందుకునే లోపు, పరుగు పెడుతున్న కాలం, నీ వేళ్ళు పట్టుకుంది. పున్నమి రాత్రులు నన్ను వెక్కిరిస్తూ వెళ్లిపోతున్నాయి. నా మరో సగం... ఆశల పల్లకీని అందుకోవాలని అలసి సొలసి తిరుగుతోంది. ఈ సగం మాత్రం ఆశగా ఎదురు చూస్తోంది అంటూ డైరీలో రాసుకుంది.
*************

నీరజా! పిలుస్తుంటే పలకవే. ఏమిటా ఆలోచనలు ?
ఆనంద్ మాటలతో ప్రస్తుతం లోకి వచ్చింది.
ఇన్నాళ్లూ మౌనమే నా భాష అయింది. మూగకు మాటొచ్చినా, ఆనందం ఎక్కువైనా, ప్రతిస్పందనకు సమయం పడుతుంది అంది.
నీకొక గిఫ్ట్ అంటూ ఒక కవర్ చేతిలో పెట్టాడు. 
కవర్ ఓపెన్ చేసి చూసింది. ఫోటో...
ఆ ఫోటో గతకాలపు తీపి జ్ఞాపకం. అరుణ్ ముందు కూర్చున్నాడు. తాను వెనుక సీటు మీద కూర్చుంది. ఆనంద్ సైకిల్  మధ్య సీటు మీద కూర్చున్నాడు.
ఫోటో చూడగానే నీరజ కళ్ళు జలపాతాలయ్యాయి...నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి.
ఈ కోల్పోయిన ఆనందాన్నే కోరుకున్నానంటూ నీరజ, ఆనంద్ భుజం మీద వాలిపోయింది.
"ఉద్యోగం,  జీవితంలో ఒక భాగం. కానీ 'ఆలూమగల అనుబంధం' అంటూ ఆనంద్ కేసి చూసింది.
"భాగం కాదు, జీవితం" అన్నాడు. నీరజను మరింత దగ్గరగా తీసుకుంటూ.
వాళ్ళిద్దరి 'చొరవ' మధ్యన గాలి కూడా 'చొర 'బడలేక తన ఓటమిని ఒప్పుకుంటూ పక్కకు తప్పుకుంది.
****************
  ..శుభం..
**************
Lakshman Rao Kokkeragadda

9/8/2026 ఆదివారం, ప్రజాశక్తి అనుబంధం స్నేహలో ప్రచురించడం జరిగింది..
***********

.
 💦*చిట్టి పొట్టి కథలు (Chitti Potti Kathalu) - 7*

*🐥కడుపుతీపి కారం*

*🍥విశాలదేశంలోని శంఖవరం, పంఖవరం ఇరుగుపొరుగు నగరాలే అయినా, పౌరుల ఆచార వ్యవహారాల్లోనూ, ఆహారపుటలవాట్లలోనూ చాలా తేడాలున్నాయి. శంఖవరం పౌరులు కారం ఎక్కువ తింటారు. పంఖవరం పౌరులు తీపి, చప్పిడి పదార్థాలు తింటారు. శంఖవరంలో వుండే పద్మకు, పంఖవరంలోని చంద్రంతో పెళ్ళయింది. భర్త, అత్తమామలు మంచివారే కానీ, అత్తవారింట ఎవరూ కారం నోట బెట్టరనీ, చప్పిడికూడు తినలేక పోతున్నాననీ, పద్మ తల్లిదండ్రులను కలిసినపుడల్లా గోలపెడుతూండేది.*
 
*అందువల్ల వీలు కుదిరినపుడల్లా తల్లి ఆమెకు ఊరగాయలూ, పచ్చళ్ళూ అందజేస్తూండేది. ఇలా ఉండగా శంఖవరానికి చాలా దూరంలో వున్న మయూరిపురికి, చంద్రం ఉద్యోగరీత్యా రాజప్రతినిధి వెంట వెళ్ళి తన కుటుంబంతో సహా కొన్నాళ్ళు గడపవలసి వచ్చింది. పంఖవరం తిరిగిరావడానికి నాలుగేళ్ళు పట్టింది. ఆ నాలుగేళ్ళ పాటు పద్మ తల్లిదండ్రులు, కూతురును చూడలేక పోయూరు. అప్పటికి పద్మకో కూతురుపుట్టి మూడేళ్ళ వయసుదయింది. కూతురూ, అల్లుడూ తిరిగివచ్చారని తెలియగానే, పద్మ తల్లిదండ్రులు వాళ్ళను చూడబోతూ, పద్మకు ఇష్టమని బాగా కారంగా ఉండే పచ్చళ్ళు, ఊరగాయలు వెంట తీసుకు వెళ్ళారు.*
 
*ఐతే వాటిని చూసిన పద్మ తల్లిదండ్రులతో, ‘‘నా కూతురు కారం బొత్తిగా తినలేదు. దాని కోసమని నేనూ చప్పిడికూడు అలవాటు చేసుకున్నాను. మీరు తెచ్చిన ఊరగాయలూ అవీ మునుపటి కంటే ఎక్కువ కారంగా ఉన్నాయి. అలాంటివి తిన్నారంటే ఈ వయసులో మీ ఆరోగ్యం ఏం కావాలి?'' అన్నది. ‘‘ఆ ఊరగాయలూ, పచ్చళ్ళల్లో వున్నది కారంకాదు. కడుపు తీపి! నువ్వు నీ కూతురుకు చేసినట్టే, మీ అమ్మ తన కూతురికోసం ప్రేమతో వీటినలా తయూరు చేసిందంతే,'' అన్నాడు పద్మతండ్రి..*
        💦🐋🐥🐬💦
 *నాలుక కత్తరించిన పిచుక (జపాన్ జానపద కథ)* - 
డా.ఎం. హరి కిషన్-కర్నూలు-9441032212
**********************
జపాన్ లోని చిన్న పల్లెటూరులో ఒక ముసలాయన, ఆయన పెళ్ళాం నివసించేవాళ్ళు. ముసలాయన చాలా మంచోడు. ఊరిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా పరిగెత్తుకొనిపోయి చేతనైన సాయం చేసేవాడు. బాగా కష్టపడి పని చేసేవాడు. కానీ ముసలామె అట్లా కాదు. కోపిష్టి. పరమ గయ్యాలి. కోపం ఎప్పుడూ ముక్కు మీదనే ఉండేది. చీటికిమాటికి చిన్న చిన్న వాటికే మొగున్ని పట్టుకొని నోటికొచ్చినట్టు తిట్టేది. చుట్టుపక్కల అందరితోనూ తగవులు పెట్టుకునేది. పెద్దా చిన్నా తేడాలేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేది. ముసలాయన చాలావరకు ఇంట్లో నోరు తెరిచేవాడు కాదు. తన పని తాను మౌనంగా చేసుకుంటూ గమ్మున ఉండేవాడు.
ఆ ముసలాయనకు ఒకరోజు ఇంటికి వస్తావుంటే దారిలో ఒక చిన్న పిచ్చుకపిల్ల కనపడింది. దాని రెక్కలకు దెబ్బ తగలడంతో అది ఎగరలేక అల్లాడిపోతా వుంది. దానిని ఇంటికితెచ్చి బాగా మందుపూసి, గింజలు తినిపించి, నీళ్లు తాపించాడు. కొద్దిరోజులకు దానికి దెబ్బలన్నీ తగ్గిపోయాయి. ఆ ముసలాయనకు పిల్లలు లేరు. దాంతో ఆ పిచ్చుకనే సొంతబిడ్డలా భావిస్తూ అల్లారుముద్దుగా చూసుకోసాగాడు. చిన్నచిన్న మాటలు నేర్పించసాగాడు. ప్రతిరోజు పొలంనుంచి రాగానే దాంతో కబుర్లు చెప్పేవాడు. కడుపునిండా గింజలు తినిపించేవాడు. ప్రేమగా వీపుపై నిమురుతూ నిద్రపుచ్చేవాడు. ఆ చిన్ని పిచ్చుక ఎప్పుడూ ముసలాయన వెంటే తిరుగుతూ భుజంమీద వాలుతూ ఉండేది.
కానీ ఆ ముసలామెకు ఆ పిచ్చుక అంటే అస్సలు ఇష్టం లేదు. "ఈ పనికిమాలిన పిట్ట ఇల్లంతా గలీజు చేస్తూ ఉంది. ఎప్పుడూ కిచకిచమని అరుస్తూ విసుగు తెప్పిస్తోంది. నీకు వండి పెట్టడమే ఎక్కువ అనుకుంటే ఇది మరొకటి. దీని పీడ ఎప్పుడు విరగడవుతుందో ఏమో" అంటూ తిట్టుకునేది. దగ్గరికి అసలు రానిచ్చేది కాదు.
ఒకరోజు ఎప్పటిలాగే ముసలాయన పొద్దున్నే పొలానికి పోయాడు. ముసలామె తినడానికి తీయని పాయసం చేసుకుంది. దాన్ని ఒక గిన్నెలో వేసుకొని తినడానికి కూర్చుంది. అదే సమయంలో పక్కింటి ఆమె పిలిస్తే ఆ గిన్నెను అక్కడేవున్న గట్టుమీద పెట్టి బయటికి పోయింది. సరిగ్గా ఆ సమయంలోనే ఆ చిన్ని పిచ్చుక అక్కడికి వచ్చింది. గిన్నెలో పాయసం చూసింది. "ఆహా... అది తన కోసమే చేసి ఆ గట్టుమీద పెట్టారు" అనుకుంది. దాంతో సంబరంగా ఆ గిన్నె దగ్గరికిపోయి నెమ్మదిగా ఒక్కొక్క చుక్క చప్పరిస్తా పాయసం మొత్తం తాగేసింది. కాసేపటికి ఆ ముసలామె అక్కడికి వచ్చి చూస్తే ఇంకేముంది... గిన్నెలో పాయసం కనపడలేదు. పొరపాటున ఎక్కడన్నా పెట్టానేమోనని చుట్టూ వెతికింది. పిచుక తాగేసిందని అర్థం అయింది. దాంతో ఆమెకు కోపం ముంచుకు వచ్చింది.
ఇది చూసిన పిచ్చుక భయపడుతూ కిందికివచ్చి "అమ్మా... పొరపాటయింది. నాకోసం ఉంచారేమో అనుకుని తాగేశాను. ఈ చిన్న పొరపాటుకు మన్నించండి" అని వేడుకుంది. ముసలామె కోపంతో రగిలిపోయింది. "నా పాయసాన్ని నా అనుమతి లేకుండా తింటావా... వుండు నీ పని చెబుతా" అంటూ దాన్ని గట్టిగా పట్టుకుంది.
"ఈ నాలికతోనే కదా నా తీయని పాయసాన్ని దొంగతనంగా తాగింది. ఇప్పుడు చూడు... ఇంకెప్పుడూ నీవు తాగకుండా ఏం చేస్తానో" అంటూ కత్తెర తీసుకొచ్చి దాని నాలుకను కత్తిరించి వేసింది. పాపం అది బాధతో విలవిలలాడుతూ వుంటే "ఇంకో నిమిషం గనక నువ్వు ఇక్కడ ఉన్నావనుకో ఈసారి ఏకంగా నీ పీకనే కత్తిరిస్తా... పో ఇక్కన్నుంచి" అంటూ తరిమివేసింది. పాపమా పిచ్చుక కళ్ళనీళ్ళతో, కారుతున్న రక్తంతో అక్కడినుంచి ఎగిరిపోయింది.
సాయంకాలం ముసలాయన పొలంనుంచి ఎప్పటిలాగే ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లోకి రాగానే రివ్వున ఎగిరొచ్చి భుజం మీద వాలే చిన్ని పిచ్చుక ఆ రోజు కనపడలేదు. ఇంటి లోపలంతా వెతికాడు. బయట చూశాడు. కనబడిన వాళ్లందరినీ అడిగాడు. పిచుక కనబడక పిచ్చిపట్టిన వానిలా అయిపోయాడు. పెళ్ళాం దగ్గరికి వచ్చి కళ్ళనీళ్లు పెట్టుకుని "నిజం చెప్పు... నా చిన్ని పిచ్చుక ఏమైంది. ఏం చేశావు" అని అడిగాడు.
అప్పుడు ఆ ముసలామె "ఆ దొంగ పిచ్చుక... నేను ఎంతో ఇష్టంగా చేసుకున్న పాయసాన్ని ఒక్క చుక్కకూడా మిగలకుండా తాగేసింది. అందుకే కోపంతో దాని నాలుక కత్తిరించి ఇంట్లోంచి తరిమేశాను. నాకెదురు చెబితే ఆ పిచ్చుకకే కాదు నీకు కూడా అదే గతి పడుతుంది. జాగ్రత్త" అంటూ హెచ్చరించింది. ఆ ముసలాయనకు ఆమె ఎదిరించే శక్తి లేదు. పాపం బాధతో కళ్ళనీళ్లు పెట్టుకొని ఆ చిన్నారి పిచ్చుకను వెతుక్కుంటా బయలుదేరాడు.
"నాలుక లేని ఆ చిన్న పిచ్చుక ఇక ఎప్పటికీ కిచకిచలాడ లేదేమో... పాపం ఆ బాధను అది ఎలా భరించిందో... ఆదుకునేవాళ్ళు ఎవరూ లేక ఎక్కడికి పోయిందో... ఎలా ఉందో..." అని బాధపడుతూ ఇల్లు ఇల్లు తిరిగాడు. వీధి వీధి వెతికాడు. కనపడిన అందరిని అడిగాడు. ఎవరూ చెప్పలేకపోయారు. అట్లా వెతుక్కుంటా పక్కనేవున్న అడవిలోకి అడుగు పెట్టాడు.
నీళ్లు, నిద్ర, తిండి... ఏదీ పట్టించుకోలేదు. వెతుకుతూనే ఉన్నాడు. అడుగుకోసారి "ఓ నా ప్రియమైన పిచ్చుకా... ఎక్కడున్నావు. ఎలా ఉన్నావు. మీ నాన్నని వచ్చాను. ఒక్కసారి కనబడు తల్లీ. ఈసారి గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాను" అంటూ అరవసాగాడు. నిమిషాలు గంటలవుతున్నాయి. గంటలు రోజులవుతున్నాయి. రోజులు వారాలవుతున్నాయి. కానీ... ఆ పిచ్చుక మాత్రం ఎక్కడా కనబడడం లేదు. అయినా ఆ ముసలాయన పట్టు వదలడం లేదు. అడవంతా జల్లెడ పట్టసాగాడు. ఒకరోజు ఒక చెరువు దగ్గర పిలుస్తా పోతావుంటే తనకెంతో ఇష్టమైన పిచ్చుక రెక్కల చప్పుడు వినిపించింది. సంబరంగా ఆగిపోయి చుట్టూ చూడసాగాడు. అంతలో ఆ పిట్ట ఒక చెట్టుమీద నుంచి ఎగురుతూ వచ్చి ఆ ముసలాయన భుజం మీద వాలింది.
దానిని రెండు చేతులలోకి తీసుకొని ఆప్యాయంగా తలని నిమురుతూ "ఎలా వున్నావు తల్లీ... నువ్వు కనిపించక పిచ్చిపట్టిన వానిలా తిరుగుతావున్నా... నీ నాలుక ఇప్పుడు ఎలా ఉంది" అని ఆప్యాయంగా అడిగాడు. ఆ చిన్ని పిచ్చుక చిరునవ్వు నవ్వి "పరవాలేదు నాన్నా... ఇప్పుడు కొత్త నాలుక వచ్చింది. ఇంతదూరం నా కోసం వచ్చావు. తప్పనిసరిగా మా ఇంటికి వచ్చి నేను ఇచ్చే విందును తీసుకొని పో" అంటూ ఆ పిచ్చుక అతని కళ్ళముందే ఒక అందమైన దేవకన్యలాగా మారిపోయింది. అదిచూసి ఆ ముసలాయన నోట మాట రాలేదు. "ఇన్ని రోజులు నాతో వున్నది ఈ దేవకన్యనా" అని ఆశ్చర్యపోయాడు.
అప్పుడు ఆ దేవకన్య "గాయపడిన నన్ను కాపాడి కన్నతండ్రిలా ఆప్యాయంగా చూసుకున్నావు. అందుకే నిన్ను వదిలి రాలేకపోయాను" అంటూ చేయి పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్ళింది. తన అమ్మానాన్నలను పరిచయం చేసింది. ఆ రోజు అతనికి రకరకాల ఆహార పదార్థాలతో గొప్ప విందును ఇచ్చారు. తర్వాతరోజు ఆ ముసలాయన సంతోషంగా "నీకు ఏం జరిగిందో... ఎలా వున్నావో అని ఇన్నిరోజులు భయపడిపోయాను. ఇప్పుడు నా మనసంతా చాలా తేలికగా సంతోషంగా ఉంది. నువ్వెక్కడున్నా పెదవులపై చిరునవ్వుతో ఇలాగే కమ్మగా కలకాలం బ్రతుకు. ఇక నేను పోయొస్తా" అన్నాడు.
ఆ దేవకన్య రెండు చెక్కపెట్టెలు తెచ్చింది. ఒకటి పెద్దగా వుంటే మరొకటి చిన్నగా ఉంది. "నాన్నా... ఈ రెండింటిలో నీకు నచ్చింది తీసుకొని నా గుర్తుగా ఉంచుకో" అంది. ముసలాయన చిరునవ్వు నవ్వి "తల్లీ... నేను చివరిదశలో ఉన్నాను. నీ పెదవులపై చిరునవ్వు, నీ మొహంలో ఆనందం తప్ప ఏ కానుకలు నాకు సంతోషాన్ని ఇవ్వవు. కానీ నీ గుర్తుగా ఈ చిన్న పెట్టె తీసుకుంటాను. దీన్ని చూసినప్పుడల్లా నీ చల్లని కళ్ళు, కిచకిచలాడే నవ్వులు గుర్తుకొస్తాయి" అంటూ చిన్న పెట్టెను తీసుకున్నాడు. పదేపదే కూతురులాంటి ఆ దేవకన్యను వెనక్కి తిరిగి చూస్తూ భారమైన హృదయంతో ఇంటికి చేరుకున్నాడు.
చాలారోజుల తర్వాత ఇంటికి వచ్చిన ముసలాయనను చూసి ముసలామెకు చాలా కోపం వచ్చింది. "చెప్పాపెట్టకుండా ఎక్కడికి పోయావు. అక్కడనే చచ్చినా బాగుండేది. పది నిమిషాలు ఏడ్చి పాయసం చేసుకుని తినేదాన్ని" అంటూ తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టింది. అంతలో ఆమెకు ఆ ముసలాయన చేతిలో పెట్టె కనపడింది. "ఏముంది ఆ పెట్టెలో. ఎవరిచ్చారు" అంటూ గుంజుకుంది. ముసలాయన జరిగిందంతా చెప్పాడు. "అబ్బో... అయితే ఆ నాలుక కత్తిరించిన పిచ్చుక పెద్ద దేవకన్య అన్నమాట. చూద్దాం నీ ముద్దుల కూతురు ఏం బహుమతి ఇచ్చిందో" అంటూ ఆ పెట్టెను తెరిచింది.
అంతే... కళ్ళు జిగేలుమన్నాయి. లోపల అత్యంత విలువైన వజ్రాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలు ధగధగా మెరిసిపోతా కనబడ్డాయి. వాటిని చూస్తానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగయ్యాయి. మొహం ఆనందంతో వెలిగిపోయింది. కానీ ఆ ఆనందం ఐదు నిమిషాలలోనే ఆవిరిపోయింది. "ఒరేయ్... తెలివితక్కువ ముసలోడా... ఈ దరిద్రపు చిన్న పెట్టె బదులు, ఆ పెద్దపెట్టెను తెచ్చింటే, మనం పదితరాలు కాలుమీద కాలేసుకుని వందమంది సేవకులను పెట్టుకుని హాయిగా బతుకుతుంటిమి కదా. చేతికందిన చక్కని అవకాశాన్ని జారవిడిచావు. ఆ పిచ్చుక వుండే చోటు ఎక్కడో చెప్పు. నేను పోయి ఆ పెద్ద పెట్టె తీసుకొని వస్తా" అంటూ దారి కనుక్కొని బయలుదేరింది.
అడవిలో చెప్పిన గుర్తుల ప్రకారం వెతుక్కుంటా ఆఖరికి ఆ పిచ్చుక వున్న ఇంటికి చేరుకొని తలుపు తట్టింది. లోపలినుంచి ఆమెను చూడగానే ఆ దేవకన్య అమ్మానాన్నల కళ్ళు ఎరుపెక్కాయి. తన కూతురు నాలుక కిరాతకంగా కోసిన రాక్షసి ఇదే కదా అని పళ్ళు పటపటలాడాయి. అంతలో దేవకన్య అక్కడికి వచ్చింది. "ఈ ముసలామె ఎంత రాక్షసురాలైనా నన్ను ఎంతో ప్రేమించి కన్నతండ్రిలా చూసుకున్నా ఆ ముసలాయన పెళ్ళాం. ఆమెను ఒక్కమాట కూడా అనొద్దు" అంటూ మాట తీసుకొని తలుపు తెరిచింది. ప్రేమగా లోపలికి ఆహ్వానించింది.
ఆ ముసలామె ఆ పిచ్చుకను చూడగానే దొంగప్రేమ చూపించింది. "అయ్యో నా చిన్ని పిచ్చుకా... ఎలా వున్నావు తల్లీ... ఎన్ని రోజులైంది నిన్ను చూసి. పొరపాటున ఆవేశంతో నేను చేసిన పనికి ఎంత బాధ పడుతున్నానో తెలుసా. తప్పు తెలుసుకుని నీకు నయం చేయడానికి వెతకని చోటు అంటూ లేదు. తిరగని వీధి అంటూ లేదు. ఆఖరికి ఇక్కడ కనబడ్డావు" అంటూ దొంగ ఏడుపులు ఏడ్చింది. బంగారు పిచ్చుక ఆమెను లోపలికి పిలిచింది. అమ్మానాన్నలను పరిచయం చేసింది. రకరకాల తినుబండారాలతో విందుభోజనం పెట్టింది.
తర్వాతరోజు తిరిగి పోయేటప్పుడు రెండు చెక్కపెట్టెలు తెచ్చి ముందుపెట్టింది. ఒకటేమో చిన్నది. మరొకటేమో చాలా పెద్దది. "అమ్మా... నీకు బహుమతిగా ఈ రెండింటిలో ఏది కావలిస్తే అది తీసుకో" అంది. అందుకోసమే ఎదురు చూస్తావున్న ఆ ఆశపోతు ముసల్ది వెంటనే పెద్దపెట్టె తీసుకొని సంబరంగా ఇంటికి బయలుదేరింది.
కొంచెందూరం పోగానే ఆ పెట్టెలో ఏమున్నాయో చూడాలనిపించింది. వెంటనే పెట్టె దించి సంబరంగా మూత తెరిచింది. అంతే... భయంతో గట్టిగా కెవ్వుమని కేక పెట్టింది. లోపల భయంకరమైన ఒంటికన్ను రాక్షసుడు చేతిలో పెద్ద కొరడాతో ఉన్నాడు. ఆమె పెట్టె తెరవడం ఆలస్యం బయటకు దూకి ఆమె జుట్టు పట్టుకొని వంగబెట్టి దభీదభీమని నాలుగు గుద్దులు గుద్దాడు. ముసలామె భయంతో వణికిపోతూ పారిపోతుంటే కొరడా తీసుకొని కొట్టినచోట కొట్టకుండా ఒళ్లంతా వాతలు పడేటట్లు కొడుతూ ఇంటివరకు తరిమాడు. "ఇంకొకసారి ఎప్పుడన్నా నోరుతెరిచి నీ మొగున్ని ఒక్కమాట అన్నా, బాధపెట్టినా మరలా తిరిగి వస్తా. ఈసారి కొట్టడం కాదు... మరలా జన్మలో నోరు తెరిచి మాట్లాడకుండా నీ నాలుక కత్తిరించి తీసుకుపోతా. జాగ్రత్త. నీకు ఇదే చివరి అవకాశం" అని చెప్పాడు. అంతే... ఆ రోజునుంచి ఆ ముసలామె మరలా ఎప్పుడూ ఎవరినీ నోరెత్తి ఒక్కమాట అనలేదు. బుద్ధిగా ఉండసాగింది.
**********************
డా.ఎం. హరి కిషన్-కర్నూలు-9441032212
**********************
కథ నచ్చితే SHARE చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
 *భట్టివిక్రమార్క కథలు-10*
(శ్రీ ఇచ్ఛాపురపు రామచంద్రం)
63/374

*2వ బొమ్మ చెప్పిన కథ*

మరొక శుభలగ్నంలో భోజరాజు సింహాసనానికి పూజలూ అవీ చేయించి మొదటి మెట్టు ఎక్కి రెండవ మెట్టుపై అడుగు పెట్టబోయాడు.

ఆ మెట్టు మీదున్న ప్రతిమ - "రాజా! ఆగు. నా మాటలు కాదని ఎక్కబోయావో నీకు కీడు కలిగితీరుతుంది. 

విక్రమార్క చక్రవర్తి ఒక్కడే దీనిమీద కూర్చుందుకు అర్హుడు. అతని ప్రజ్ఞావిశేషాలు చెబుతాను. ఆ శుభ లక్షణాలు నీలో ఉంటే అధిష్టించు. లేకపోతే మరలిపో.” అంది.

భోజరాజు చెప్పమన్నట్లు చూసి ఆగిపోయాడు.

"విక్రమార్కుడు భట్టితో కలసి రాజ్యపాలన చేస్తూండగా జరిగిన అద్భుతం చెబుతాను." అంటూ ప్రారంభించింది ప్రతిమ.

ఉజ్జయినీ నగరానికి మూడు యోజనాల దూరంలో ఒక దట్టమైన అరణ్యం ఉంది. అక్కడ క్రూరజంతువులు విచ్చలవిడిగా తిరుగుతుంటాయి.

ఆ భయంకర అరణ్యంలో పురాతనమైన కాళికాలయంలో ఒక సన్యాసి చాలా సంవత్సరాలుగా ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. అతని తపస్సుకి మెచ్చి, కాళికాదేవి ప్రత్యక్షమయింది. “సన్యాసీ! నీ తపస్సుకి సంతోషించాను. నీకు వరమిద్దామని వచ్చాను. కావలసిన కోరిక అడుగు" అంది దేవి.

అతను కళ్ళు తెరచి భద్రకాళిని చూసి సంతోషించి... మొక్కి స్తుతించాడు. 

"ఆదిశక్తీ! నేను చక్రవర్తిని అవాలి. రాజులందరూ నాకు వశులవాలి. నేను తలచినట్లు జరగాలి. నేను తలచుకోగానే నువ్వు ప్రత్యక్షమై నా కోరికలు తీరుస్తూండాలి. 

ఇంతేకాక భేతాళుడు నా అధీనంలో ఉండి నేను చెప్పినట్లు చేస్తూండాలి. ఈ వరాలు ప్రసాదించు." అన్నాడు.

"సన్యాసీ! నువ్విప్పుడు కోరిన వరాలు సామాన్యంగా పొందదగినవి కావు. ఈ వరాలు నేను నీకు అనుగ్రహించాలంటే నేను సంతుష్టిచెందేలా హోమం ఒకటి ప్రారంభించి, నూరుగురు రాజులని హోమగుండంలో అర్పించి దహించాలి. 

నూరవ తల ఎంతో ప్రసిద్ధి చెందినవాడూ, రాజాధిరాజూ, ధైర్యసాహసాలూ, వితరణా మొదలైన సుగుణాలన్నీ కలవాడయిన చక్రవర్తిదయి ఉండాలి. 

అలాటి రాజుని నువ్విక్కడికి తీసుకువచ్చినప్పుడు ముందుగా భేతాళుడిని పట్టి తెమ్మని నియమించు. అలాటి గొప్పవాడికి గాని భేతాళుడు వశం కాడు. 

అలాటి రాజుని నీ దగ్గరకు తీసుకొచ్చాక నా మహిమ వల్ల భేతాళుడు నీకు వశమౌతాడు. 

ఇదంతా నీకు అసాధ్యమనిపిస్తే తపస్సంపన్నుడైన ఒక సన్యాసిని తెచ్చి అతని శిరస్సును ఖండించి హోమం చెయ్యి చాలు. నువ్వు తెచ్చే సన్యాసి వల్లనే నీకు భేతాళుడు వశమౌతాడు.

రాజులందరినీ ఒకసారే కాక క్రమంగా తీసుకొచ్చి వారి శిరస్సులతో హోమం చెయ్యవచ్చు. నూరుగురూ ఐతేనే నీ వ్రతం పూర్తవుతుంది. అప్పుడు ప్రత్యక్షమైనీకు వరాలిస్తాను. పో..” అని కాళికాదేవి మాయమైపోయింది.

భద్రకాళి దుస్సాధ్యాలయిన పద్దతులు చెప్పినా సన్యాసి నిరాశచెందలేదు. కర్తవ్యం గురించి ఆలోచించాడు. 

'సాధ్యంకాదనీ, అంతరాయాలకు విరక్తితోనూ.. పట్టువదలక - కాళి చెప్పిన ప్రకారం జరిపించి, కోరిన వరాలు సాధించికాని ప్రయత్నంమానను. 

నూరుగురుని తెచ్చుట కంటే ఒకరిని తేవడం లెక్కకు సులువే కాని, ఆ దేవి కోరికలాటి లక్షణాలు కల సన్యాసి నాకు దొరకడు. ఒకవేళ దొరికినా తన
తపోమహిమతో అంతా తెలుసుకుంటాడు. 

కనుక సన్యాసిని తెచ్చి బలివ్వడం జరిగేపనికాదు. 

రాజులని మోసగించి తెచ్చి హోమం చెయ్యడమే సాధ్యం. కర్తవ్యం! అని నిశ్చయించుకుని గుడి ముందు గుండం తవ్వి.. అక్కడక్కడ ఉన్న రాజుల దగ్గరికి పోయి సమయానుకూలమయిన మాటలుచెప్పి కాళికాలయానికి వారు వచ్చేలా చేసి దేవికి మొక్కించి, సాగిలపడినప్పుడు కత్తితో వారి కంఠం నరికి హోమగుండంలో వేయసాగాడు. అలాగ తొంభైతొమ్మిది మంది రాజులను చంపి వారి శిరస్సులని హోమం చేశాడు.

చివరగా చంపబడేవాడు అరవైనాలుగు కళలూ తెలిసినవాడూ,
సకలగుణ సంపన్నుడు, ధైర్యసాహసాలూ, శౌర్యపరాక్రమాలు కల రాజు అయి ఉండాలని భద్రకాళి చెప్పడం వలన - అటువంటి వాడెవడా అని ఆలోచించి, విక్రమార్కుడు తప్ప మరెవరూ లేరని, అతని నెలాగైనా తీసుకొచ్చి చంపి వ్రతం పూర్తి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. 

ఉజ్జయినికి పోయి, పరిసరాలలో నివసిస్తూ, రోజూ రాజుని దర్శించి అతని మనసు చూరగొనేందుకు తన మహిమతో రత్నాలనే గింజలుగా కలిగిన దానిమ్మపండుని పట్టుకుని రాజ సభకి వెళ్ళాడు.

"మహాత్మా! మీ దర్శనం వలన ధన్యుడినయ్యాను.” అని స్వాగతం అని పలికిన రాజుకి -

“రాజేంద్రా! నీ సత్ప్రవర్తన కెంతో సంతోషిస్తూంటాం. నీకు సకల శ్రేయస్సులూ కలగాలి. నిన్ను చూసి సంతోషిద్దామని వచ్చాను." అని దానిమ్మపండిచ్చి వెళ్ళాడు.

అలా నెలరోజుల పాటు జరిగింది. అప్పుడు విక్రమార్కుడు సన్యాసి తనకిస్తున్న పండ్లన్నిటినీ పెడుతూవచ్చిన చోటుకి వెళ్ళి వాటిలో ఒకదానిని పగలగొట్టి చూడగా దానిలోని గింజలన్నీ వజ్రాలని తెలిసింది.

మిగిలిన పండ్లను కూడా పగలగొట్టించి చూడగా అన్నీ రత్నాలు కలిగినవే. 

దేవలోకంలో కూడా యిలాటివి ఉండవు అని వాటిని మెచ్చుకుని, 'సన్యాసి ప్రతిరోజూ రావడానికీ, యిలా ఒక పండిచ్చి పోవడానికీ ఏదో కారణం ఉండి తీరుతుంది.

నా వల్ల అతని కేం ఉపకారం కావాలో? రేపతను రాగానే అడిగి తెలుసుకుంటాను.' అని నిశ్చయించుకున్నాడు. 

మర్నాడు అలాగే రాజు అడగగా, సన్యాసి “ఓ ప్రభువరేణ్యా! నువ్వు చెప్పింది నిజమే. తెలివైన వాడివి కనుక నా ఉద్దేశం చక్కగా గ్రహించావు. నాపై నీకు దయకలిగేందుకే యిలా చేస్తున్నాను. ఇప్పుడు నువ్వే అడిగావు కనుక చెబుతాను.

మహారాజా! ఈ పురానికి మూడు యోజనాలదూరంగా కల అరణ్యంలో కాళికాలయం ఉంది. నేనాదేవి నారాధిస్తూ అక్కడే ఉన్నాను. దేవికి ప్రీతి కలిగించడానికి వ్రతం పూని, హోమంచేసి ఆ వ్రతాన్ని పరిపూర్ణం చేయడానికి నిశ్చయించుకున్నాను. 

ఆ కార్యానికి నాకు సామాన్యులు సహాయం చెయ్యజాలరు. కనుక నీవక్కడికి వచ్చి నా వ్రతం నెరవేరేటట్లు చెయ్యాలి. ఇదే నా కోరిక. దీని కోసమే యింతకాలమూ నిన్నాశ్రయించాను.” అని ప్రార్ధించాడు.

అందుకు విక్రమార్కుడు నవ్వి- “దీనికోసం యిన్నాళ్ళు కాచుకున్నారా! మొదటే చెబితే అప్పుడే సాయం చేసి ఉందును. అనవసరంగా ఆలస్యం చేశారు. ఇదేమంత పని? ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి.” అన్నాడు.

"ఇంకేమీ అక్కర్లేదు. ఇది చాలు.”

“అలా అయితే ఆ గుడి ఉండే స్థలమూ, నేనక్కడ చేయవలసిన పనీ, ఎప్పుడు అక్కడికి రావాలో.. అన్నీ చెప్పండి..

“రాజేంద్రా! రేపు రాత్రికి నేను హోమం ప్రారంభిస్తాను. రేపు సాయంకాలానికి నువ్వొక్కడివే వస్తే చాలు. చెయ్యవలసిన పని స్వల్పం. అక్కడి కొచ్చాక చెబుతాను." అని కాళికాలయం గుర్తులు చెప్పాడు సన్యాసి.

మర్నాడు ఎవరికీ చెప్పకుండా గుర్రంమీద ఆ అరణ్యం చేరుకుని గుర్రాన్ని చెట్టుకు కట్టి సన్యాసి వద్దకు వెళ్ళాడు అప్పటికే హోమం ప్రారంభించిన సన్యాసి రాజుని చూసి... నమస్కరిస్తున్న అతనితో “రాజేంద్రా! వచ్చావా! సత్యశీలుడివి. నువ్విప్పుడు మొదట ఒకపని చెయ్యాలి.” అన్నాడు.

“ఏమిటో సెలవియ్యండి.” అన్నాడు రాజు వినయంగా. సన్యాసి చెప్పసాగాడు.

(సశేషం)
 ధర్మజలాలు- ఘర్మజలాలు

'ప్రతిజ్ఞ' అనే తన ప్రసిద్ధ కవితలో మహాకవి శ్రీశ్రీ-కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే స్వేదధారలకు ధర్మజలమనీ, ఘర్మ జలమనీ రెండు విశేషణాలు వాడారు. అవి అమూల్యమైనవి కాబట్టి వాటికి ఖరీదుకట్టే షరాబులు ఉండరని ఆయనే అన్నారు.

జలాల్లో ధర్మ, అధర్మ జలాలనే తేడాలుంటాయా! అని అనుమానం వస్తుంది మనకు. మహాకవుల ప్రయోగాల్లో సాధారణంగా వ్యర్థ పదాలుండవు. మనం వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలంతే! కట్టెలు కొట్టి చేపట్టే ధనానికి, కడుపులు కొట్టి చేజిక్కించుకునే దానికి స్వభావంలో ఏ రకమైన తేడా ఉంటుందో-అలాంటిదే ధర్మ, అధర్మ జలాల మధ్యా ఉంటుంది. కాయకష్టంలోంచి పుట్టుకొచ్చే చెమట బిందువులన్నీ-ధర్మ జలాలు! పల్లెల్లో కొందరు భూకామందులు పేదరైతుల నోళ్లు నొక్కి తమ పొలాలకు దౌర్జన్యంగా పంటకాల్వల నీరు మళ్లిస్తుంటారు
నగరాల్లో పేదల కాలనీలకు వెళ్లాల్సిన వాటర్ ట్యాంకులను పెద్దలు తమ ఇళ్లకు తోలుకుపోతుంటారు. వాటిని అధర్మ జలాలుగా చెప్పుకోవాలి. ఘర్మజలం వేడిగా ఉంటుంది. అన్యాయానికి బలై, ఆవేదనకు లోనైనప్పుడు గుండెల్లోంచి ఉబికే లావా- కళ్లలో బరువైన నీటి బిందువై నిలుస్తుంది. నిప్పు కణమై ఎప్పటికైనా అధర్మాన్ని కాలుస్తుంది. ఆ మరిగే నీటిబిందువులు, శ్రమలోంచి పుట్టే స్వేదజలాలు... ఘర్మజలాలే! కండల్ని కరిగిస్తూ, రక్తాన్ని మరిగిస్తూ శ్రమించే కష్టజీవి దేహంపై మెరిసే వైడూర్యాలవి. వాటికి విలువ కట్టడం సాధ్యం కాదని కవి భావం.

పవిత్రమైన గోవుల్లోనూ- ధర్మధేనువులు, ఘర్మధేనువులనే రెండు రకాలుంటాయని వేదం చెబుతోంది. ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలూ, విష్ణుపురాణంలో వెన్నెలకంటి సూరనా- ఆ రెండింటి గురించి ప్రస్తావించారు. యజ్ఞసంస్కృతిలో గోవులు, దర్భలు, అగ్ని... మూడూ పరమ పవిత్రాలు. యజ్ఞయాగాదుల్లో వినియోగించే ఆవు పాలు, ఆవు నెయ్యి వంటి వేదోక్తమైన హవిస్సులను ఎంపిక చేసిన కొన్ని గోవుల నుంచి సేకరిస్తారు. అలాంటి ప్రత్యేకమైన గోవులకు ధర్మధేనువులని పేరు. ధర్మధేనువుల పాలు హోమాల్లోనే తప్ప ఇతరత్రా వాడరు. అలాగే, యజ్ఞం పూర్తయ్యేలోగా ధర్మధేనువు ఏ కారణం వల్లనో మరణిస్తే- యజ్ఞమే ఆగిపోయే దుస్థితి ఎదురవుతుందని ఆముక్తమాల్యద చెబుతోంది. అదీ ధర్మధేనువు ప్రత్యేకత!
ఖాండిక్య, కేశిధ్వజుల కథలో ఆముక్తమాల్యద చెప్పిన ధర్మధేనువునే విష్ణుపురాణంలో సూరన ఘర్మధేనువుగా చెప్పాడు. క్రతువు మధ్యలో ఘర్మధేనువు పులివాత పడిందన్నాడు. ఆ క్రతువు పేరు ప్రవర్గ్యం! ఆ విశేష యాగంలో సలసల కాగే నేతిలో ఆవుపాలు పోసి హవిస్సుగా వినియోగిస్తారు. కాబట్టి ఆ సందర్భంలోని ధర్మధేనువునే ఘర్మధేనువు(ఘర్మార్ధా ధేనుః) అంటారని వేదవేత్తలు చెబుతారు. ఘర్మ శబ్దంలోని వేడిమి అర్థాన్ని బట్టి ధర్మధేనువునే సూరన కవి ఘర్మధేనువుగా పేర్కొన్నాడని వ్యాఖ్యాతల అభిప్రాయం. అంటే ధర్మ, ఘర్మ శబ్దాలు తమలో ఎనలేని పవిత్రతను నింపుకొన్నాయని ఆ కథల సారాంశం!

- ఎర్రాప్రగడ రామకృష్ణ
 ఇది పునరంకితవేళ...

జెండా ఊంచా రహే హమారా' నినాదం-ఎదలోయల్లో చెలమగా, చెలిమిగా చివురుగా కలంగా కవితగా... జాతి భావోద్వేగాలకు వేదికగా, జనుల గుండె చప్పుళ్ల నివేదికగా ఉప్పొంగే రోజిది. జెండా అంటే- సర్వతంత్ర స్వతంత్ర భారతదేశ సర్వసత్తాక సౌభాగ్య చిహ్నం! వినువీధుల్లో రెపరెపలాడుతూ దేశ సార్వభౌమత్వాన్ని సగర్వంగా లోకానికి చాటే విజయకేతనం! జాతి స్వాభిమానమది! 'ఇనుపకరాలు, ఉక్కునరాలు, జవం, జీవమూ, ఆత్మస్థైర్యం' అంటూ వివేకానందుడు ఎలుగెత్తి చాటిన జీవలక్షణాల మేలికలబోత- దాని మువ్వన్నెల నేత! ‘సూత్రయుగముల శుద్ధ వాసన, క్షాత్రయుగముల చండ శౌర్యము, చిత్ర దాస్యముచే చరిత్రల చెరిగి పోయెర సోదరా!' అని అలనాడు ఈ జాతి గుర్తించింది. జూలు విదిల్చింది. సమరశంఖం పూరించింది. సుదీర్ఘ పోరాటం సాగించింది. స్వరాజ్యాన్ని సాధించింది. ఆ సమరయోధుల, అమరవీరుల త్యాగఫలాలనే మన తరం అనుభవిస్తోంది!
ఆనాటి యోధుల వీరగాథలను వింటుంటే ఒళ్లుగగుర్పొడుస్తుంది. గాంధీజీ పిలుపుతో జాతి జాతిమొత్తం ఉత్తేజితమైంది. సుబ్బారావు పాణిగ్రాహి
అన్నట్లు ‘దిక్కుమొక్కులేని జనం- ఒక్కొక్కరుఅగ్నికణమై' కదనరంగంలోకి దూకారు. భగత్్సంగ్ గురించి కవి సోమసుందర్ చెప్పినట్లు 'ఒక తారక
మేల్కాంచెను, ఒక వీరుడు కనువిచ్చెను, ఒక
మెళుకువ, ఒక్క వెలుగు' ఆంగ్లేయుల కళ్లకుమిరుమిట్లుకొల్పిందిచేసేదేం లేక, దేశం వదిలిపోలేక
'మీకింకా పాలనా సామర్థ్యం పట్టుబడలేదు, ఏలడం చేతకాదు' అని పెదవి విరిచారు ఆంగ్లేయులు. దానికి దాదాభాయ్ నౌరోజి మనవరాలు ఖుర్షిద్
గొప్ప సమాధానం చెప్పారు. 'మా దుస్థితి ఎలా
ఉందంటే- ఇంటికొచ్చిన అతిథులు పొమ్మంటున్నా
పోకుండా నట్టింట తిష్టవేసినట్లుంది- స్వతంత్రభారతం
మీరంటున్నట్లు ‘అరాచక రాజ్యం’ కాబోదు. మా
సమస్యలను మేం పరిష్కరించుకోగలం' అన్నారామె.
మా యువతరంపై మాకు నమ్మకం ఉంది. మా
స్వయం ప్రతిపత్తి పట్ల మాకు ధీమా ఉంది. మా
దేశం అద్భుతాలు చేస్తుందన్న విశ్వాసాన్ని నాటి దేశం అద్భుతాలు చేస్తుందన్న విశ్వాసాన్ని నాటి నేతలెందరో సగర్వంగా ప్రకటించారు. అదే భవిష్యద్వాణిగా, జీవనాడిగా మారింది. ఆ తరం దీవెనలు ఆశలు ఆశయాలే- మన జెండాలో మువ్వన్నెలుగా వెలుగులు చిమ్ముతున్నాయి. కేవలం వస్త్రం కాదది- జాతి నిస్తేజాన్ని నిర్మూలించే బ్రహ్మాస్త్రం! మనం చేయాల్సింది వట్టి వందనం కాదు-ముందుతరం ఆశయాలను పూర్తిచేస్తామన్న 
తెలుగు వెలుగు పింగళి వెంకయ్య రూపొందించిన ఆ జాతీయ జయకేతనం- సమరోద్యమ చరిత్రలో
పెను సంచలనం. నివురు కప్పిన జాతి
ఆభిజాత్యానికి, ఆత్మప్రత్యయానికి- ఇంధనం. అలనాటి
సమరస్ఫూర్తికి, ఉద్యమదీప్తికి నేటి సజీవచిహ్నం.
దాని పరువెంతో, బరువెంతో తెలియాలంటే-
మంచుకొండల్లోని వీరసైనికుల తుపాకులను
అడగాలి. రైతన్నలు భుజానమోసే నాగళ్లను
అడగాలి. పరిశోధనాశాలల్లో మగ్గిపోయే శాస్త్రవేత్తల
మెదళ్లను అడగాలి. 'జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్'
నినాదంలోని హిమనగమంత సందేశాన్ని గ్రహించాలి.
అప్పుడే 'నేనంతా పిడికెడు మట్టే కావచ్చుకాని, కలం
ఎత్తితే- నాకీ దేశపు జెండాకున్నంత పొగరుంది' అన్న
కవి శేషేంద్ర ధీమాతో పరిచయం అవుతుంది. 'నా
దేశం భగవద్గీత. నా దేశం అగ్నిపునీత సీత. నా
దేశం కరుణాంతరంగ. నా దేశం సంస్కార గంగ
అన్న సినారె నివాళిలోని భావసాంద్రత గుండెను
తాకుతుంది. స్వరాజ్య సమరోద్యమ చైతన్యాన్ని
యువతరం గుండెల్లో రగిలించి, సురాజ్యస్థాపన
దిశగా నడిపించడమే- జెండా పండుగకు ఫలశ్రుతి!
దానికోసమే- ఈ వైతాళిక గీతాలాపనలూ... స్వా
తోరణాలూ... జెండా వందనాలూను!
ఈనాడు సంపాదకీయం
 ఆధునిక వాలి శక్తి – ఒక ప్రేరణాత్మక కథ

ఒక మహానగరంలో విక్రమ్ అనే యువకుడు ఉండేవాడు. అతను అసాధారణమైన తెలివి, శారీరక బలం, ఆత్మవిశ్వాసంతో అందరికీ ఆదర్శంగా కనిపించేవాడు. అతని ప్రత్యేకత ఏమిటంటే, అతనితో పోటీకి దిగిన ప్రతి ఒక్కరి ధైర్యం క్రమంగా తగ్గిపోతుండేది. వారి ఆలోచనలు, ఆత్మవిశ్వాసం బలహీనపడితే, విక్రమ్ మరింత శక్తివంతుడిగా మారేవాడు. అందుకే ప్రజలు అతనిని "ఆధునిక వాలి" అని పిలిచేవారు.

అయితే విక్రమ్‌కు ఒక లోపం ఉండేది. తన శక్తిని ఇతరులను ప్రోత్సహించడానికి కాకుండా, వారిని తక్కువగా చూపించడానికి ఉపయోగించేవాడు. అతని విజయం పెరిగే కొద్దీ అహంకారం కూడా పెరిగింది. సహచరులను అవమానించడం, వారి కలలను చిన్నచూపు చూడడం అతనికి అలవాటైంది.

ఒక రోజు నగరానికి ఆచార్య దేవ్ అనే వృద్ధ గురువు వచ్చాడు. ఆయన విక్రమ్‌తో మాట్లాడుతూ, "నిజమైన బలం ఎదుటివారి శక్తిని లాక్కోవడంలో లేదు. వారి శక్తిని వెలికితీసి వారిని ఎదగనివ్వడంలో ఉంది" అని చెప్పాడు.

ఆ మాటలు మొదట విక్రమ్‌కు నచ్చలేదు. కానీ కాలక్రమేణా తన చుట్టూ ఉన్నవారు దూరమవుతున్నారని, తనకు గౌరవం కంటే భయం మాత్రమే మిగిలిందని గ్రహించాడు. అప్పుడు తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.

అప్పటి నుంచి తన అనుభవాన్ని యువతకు పంచుతూ, వారికి ధైర్యం, నైపుణ్యం, ఆత్మవిశ్వాసం పెంచే గురువుగా మారాడు. ఒకప్పుడు ఇతరుల బలాన్ని తగ్గించిన వాలి, ఇప్పుడు వేల మందిలో కొత్త శక్తిని నింపే నాయకుడిగా ఎదిగాడు.

నీతి: ఇతరుల శక్తిని తగ్గించి గెలిచే విజయం తాత్కాలికం. కానీ ఇతరులను బలంగా మార్చి సాధించే విజయం శాశ్వతం. నిజమైన నాయకుడు భయాన్ని కాదు, ధైర్యాన్ని పంచుతాడు.
 రామాయణం'లో మారీచుని జీవిత ప్రస్థానం నుండి మనం నేర్చుకోదగిన పాఠాలు ఏమిటి?


మహాభాగవతంలో " భయంతో కాని, కోపంతో కాని, ప్రేమతో కాని ఏ విధంగా నన్ను తలుచుకున్నా అనుగ్రహిస్తాను " అన్నారు పరమాత్మ.

రామభూతమిదం సర్వం
అరణ్యం ప్రతిభాతి మే,
రామమేవ హి పశ్యామి
రహితే రాక్షసాధిప "
- 3:39:16

" ఈ అరణ్యంలో ఎక్కడ చూసినా నాకు రాముడే కనిపిస్తున్నాడయ్యా.‌ రాముడు తప్ప వేరేమీ కనబడుటలేదు " - ఈ మాటలు అన్నది మారీచుడు అనే రాక్షసుడు, రావణుడితో.

అంతా రామమయం
జగమంతా రామమయం " అంటే ఇదే.

మారీచుడు అంటాడు రావణుడితో " రాముడు కొట్టిన దెబ్బకు నేను మాంసం తినడం మానేసాను. ఇతరులను హింసించడం మానేసాను. ఋషుల వలే ఈ ఆశ్రమం కట్టుకుని " రామజపం " చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు వేరే ఏ జపాలు తెలియవు కనుక. " ర " తో మొదలయ్యే ఏ పదాన్ని విన్నా రెండవ అక్షరం " మ‌ " గానే వినిపిస్తూంది నాకు " అని.

ఏ వృక్షం చూసినా దాని వెనుక కోదండం ఎక్కుపెట్టిన రాముడు కనిపిస్తున్నాడు. పడుకున్నా కలలో కూడా రాముడే కనిపిస్తున్నాడు.

రావణుడు ప్రభువు, అతనికి ఆగ్రహం కలుగుతుంది అని తెలిసినా ఇంత కఠినమైన నిజాలు మారీచుడు ఎలా మాట్లాడగలిగాడు అంటే ఇప్పుడు మారీచుడికి నిజమైన ప్రభువు/గురువు శ్రీరాముడు కనుక. అతను ఆ స్థితికి చేరిపోయాడు.

మారీచుడు భయయోగి. భయం శాపం కాదు, వరం మనిషికి. జాగ్రత్తగా ఉంటాడు, ఆనందంగా గడిపేస్తాడు.

రావణుడి చేతిలో చనిపోవడం కంటే రాముడి చేతిలో చనిపోవడమే మేలని భావించి, అతను జింక రూపంలో వెళ్ళాడు.

అదే నిజమైన ఆత్మ సాక్షాత్కారం మరియు విముక్తి. మారీచుడు ఒక ధన్యమైన ఆత్మ.
శుభమస్తు
 🕉️ కురుక్షేత్రంలో అర్జునుడి విషాదం

కురుక్షేత్ర యుద్ధభూమిలో రెండు సేనలు యుద్ధానికి సిద్ధంగా నిలిచాయి. పాండవుల తరఫున అర్జునుడు తన రథంపై శ్రీకృష్ణుడితో కలిసి ఉన్నాడు. యుద్ధం ప్రారంభమయ్యే ముందు, అర్జునుడు తనకు ఎదురుగా ఉన్న కౌరవ సైన్యాన్ని చూడాలని శ్రీకృష్ణుడిని కోరాడు.

శ్రీకృష్ణుడు రథాన్ని భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి మహావీరుల ఎదుట నిలిపాడు. అక్కడ అర్జునుడు తనకు ఎదురుగా శత్రువులుగా నిలిచింది కేవలం కౌరవ సైన్యం కాదని గ్రహించాడు. తన తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, బంధువులు, స్నేహితులు, సోదరులు మరియు పరిచయస్తులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని చూశాడు.

ఆ దృశ్యం అర్జునుడి మనసును తీవ్రంగా కలచివేసింది. యుద్ధం చేసి రాజ్యాన్ని గెలుచుకున్నా, తన స్వంత బంధువులను కోల్పోతే ఆ విజయానికి అర్థమేంటి అనే ఆలోచన అతనిలో మొదలైంది. తన చేతుల మీదుగా గురువులు, పెద్దలు, బంధువులకు హాని కలగడం తాను కోరుకోవడం లేదని భావించాడు.

అర్జునుడి మనసులో కర్తవ్యబాధ్యత, కుటుంబ అనుబంధం, ధర్మం, ప్రేమ, భయం, సందేహం అన్నీ ఒకేసారి సంఘర్షించాయి. యుద్ధం చేయాలనే ధైర్యం తగ్గిపోయింది. అతని శరీరం బలహీనంగా అనిపించి, మనస్సు అయోమయంలో పడింది. చివరకు తన విల్లైన గాండీవాన్ని కిందికి వదిలి, యుద్ధం చేయలేనని శ్రీకృష్ణుడితో చెప్పాడు.

ఈ సంఘటనను “అర్జున విషాద యోగం” అని భగవద్గీత మొదటి అధ్యాయంలో పేర్కొంటారు. ఇది కేవలం యుద్ధభూమిలో అర్జునుడి బాధను మాత్రమే చూపించదు. మన జీవితంలో కూడా కర్తవ్యానికి, భావోద్వేగాలకు మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు మనిషి ఎలా అయోమయానికి గురవుతాడో చూపిస్తుంది.

అర్జునుడి విషాదం నుంచే శ్రీకృష్ణుడి భగవద్గీత బోధన ప్రారంభమైంది. ధర్మం, కర్తవ్యం, ఆత్మ, కర్మయోగం, భక్తి, జ్ఞానం వంటి గొప్ప ఆధ్యాత్మిక విషయాలను శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు. అందువల్ల అర్జునుడి విషాదం అతని బలహీనతకు ముగింపు కాదు; జ్ఞానోదయానికి ఆరంభం. 🕉️🙏
 🧭 “My Rules” అంటే తెలుగులో “నా నియమాలు”, “నేను పాటించే నియమాలు” లేదా “నా జీవితానికి నేను పెట్టుకున్న నియమాలు” అని అర్థం. ఇది ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా నడిపించుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, తన సమయం మరియు శక్తిని ఎక్కడ ఉపయోగించాలి అనే విషయాలపై తానే నిర్ణయించుకున్న సూత్రాలను సూచిస్తుంది.

“My Rules” అనేది ఇతరులపై నియమాలు విధించడం అనే అర్థం తప్పనిసరిగా కాదు. ముఖ్యంగా ఇది మన జీవితానికి మనమే బాధ్యత వహించడం అనే భావనను సూచిస్తుంది. సమాజం, స్నేహితులు లేదా ఇతరుల అభిప్రాయాల ఆధారంగా ప్రతి నిర్ణయం తీసుకోకుండా, మన విలువలు, లక్ష్యాలు, అనుభవాలు మరియు బాధ్యతలకు అనుగుణంగా జీవించడం ఇందులో ముఖ్యమైన అంశం.

📌 My Rules‌లో ఉండే ముఖ్యమైన సూత్రాలు

1. నా సమయాన్ని గౌరవిస్తాను:

సమయం తిరిగి రాదు. అందుకే అవసరం లేని విషయాల కోసం సమయాన్ని వృథా చేయకుండా, ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇస్తాను.

2. నా నిర్ణయాలకు నేనే బాధ్యత వహిస్తాను:

తప్పు జరిగినప్పుడు ఇతరులను నిందించడం కాకుండా, నా నిర్ణయాలను పరిశీలించి వాటి నుంచి నేర్చుకుంటాను.

3. అందరినీ గౌరవిస్తాను:

నా అభిప్రాయం వేరుగా ఉన్నా, ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తాను. గౌరవం పరస్పరం ఉండాలి.

4. నా హద్దులను నేను నిర్ణయించుకుంటాను:

ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించను. నాకు అసౌకర్యంగా అనిపించే విషయాలకు అవసరమైనప్పుడు “లేదు” అని చెప్పడం నేర్చుకుంటాను.

5. గతం నుంచి నేర్చుకుంటాను:

గతంలో జరిగిన తప్పులను మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ ఉండకుండా, వాటి నుంచి పాఠాలు తీసుకుని ముందుకు సాగుతాను.

6. నా లక్ష్యాలపై దృష్టి పెడతాను:

ఇతరులతో పోల్చుకోవడం కంటే, నిన్నటి నాతో ఈరోజు నేను మెరుగ్గా ఉన్నానా అనే దానిపై దృష్టి పెడతాను.

7. నిజాయితీకి విలువ ఇస్తాను:

నిజం చెప్పడం కొన్నిసార్లు కష్టమైనా, నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నిజాయితీ అవసరం.

8. నా ప్రశాంతతకు విలువ ఇస్తాను:

అనవసరమైన గొడవలు, ప్రతికూలత మరియు నిరంతర ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను.

🌱 చివరగా

“My Rules” అంటే ప్రపంచాన్ని నా ఇష్టానికి మార్చుకోవడం కాదు. ప్రపంచం ఎలా ఉన్నా, నేను ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాల్లో నాకు నేను ఒక స్పష్టమైన దిశను ఏర్పరచుకోవడం.

ప్రతి వ్యక్తి జీవిత పరిస్థితులు వేరు. అందుకే “My Rules” కూడా ప్రతి ఒక్కరికీ వేరుగా ఉండవచ్చు. ఒకరికి విజయం అంటే డబ్బు కావచ్చు, మరొకరికి కుటుంబం, ప్రశాంతత, స్వేచ్ఛ లేదా తనకు నచ్చిన పనిని చేయడం కావచ్చు.

అందుకే నా జీవితం, నా బాధ్యత, నా నిర్ణయాలు, నా విలువలు, నా హద్దులు, నా లక్ష్యాలు అనే స్పష్టత కలిగి ఉండటం “My Rules” యొక్క అసలు భావం. 🧭🌱
 *భట్టివిక్రమార్క కథలు-9*
(శ్రీ ఇచ్ఛాపురపు రామచంద్రం)
57/374

ఈ విధంగా విక్రమార్కుడు ఇంద్రలోకం ఆహ్వానించబడ్డ యింద్రునిచే ప్రశంసలూ, ఆశీస్సులూ, వరాలూ, బహుమతులూ పొంది వచ్చిన విధానమూ - భట్టి అడగగానే చెప్పాడు.

అంతా చెప్పి.. "భట్టి! నేనొక తెలివితక్కువ పని చేశాను. నా బుద్ధికప్పుడు తట్టలేదు. అదేమిటంటే దేవేంద్రుడు - నేను వెయ్యిసంవత్సరాలు బతికుండి రాజ్యం పాలించేటట్లు వరమిచ్చాడని చెప్పాను కదా. 

ఆ సమయంలో నీ విషయం ప్రస్తావించడం మరచి పోయాను. నేనడిగితే ఇంద్రుడు నీకూ అలాటి వరం యిచ్చి ఉండేవాడు. తప్పు నాది కాని అతనిది కాదు. నువ్వు లేకపోతే నేనెన్నాళ్ళు జీవించి ఏం ప్రయోజనం? ఈ రాజ్యం నా కెందుకు? ఇప్పుడేం చెయ్యాలో తోచడంలేదు.” అని చింతించాడు.

అందుకు భట్టి - "గడిచిన దానికి వగచి ఉపయోగమేమిటి? దీనికి నేనొక ఉపాయం చెబుతాను. 

నేను కాళికాదేవి గురించి తపస్సు చేసి ఆమె కరుణ పొంది చాలా కాలం జీవించేలా వరం పొందుతాను. మీరు చింతించకండి." అని అన్నకి నమస్కరించి, అతని అనుమతి తీసుకుని తపస్సుకు వెళ్ళిపోయాడు.

కాళికాలయంలో ఆరు నెలల పాటు భట్టి తీవ్రంగా తపస్సు చేశాడు. 

అతని నిష్టకీ, భక్తి శ్రద్దలకీ, స్థిరత్వానికీ దేవి సంతోషించి ప్రత్యక్షమైంది. అతడామెను స్తుతించి- "తల్లీ! నేను రెండు వేల సంవత్సరాలు జీవించి ఉండేలా వరం ప్రసాదించు.” అని ప్రార్ధించాడు.

అతని కోరిక విని కాళి నవ్వి “వత్సా! నీ కోరిక దుర్లభమైనది. ఇలాటి వరం కావాలంటే.. ధైర్యం, సాహసం, వితరణ మొదలైన
సద్గుణాలన్నీ కలిగిన ఒక రాజుని నా పీఠం వద్ద ఖండించి అతని శిరస్సును నాకు బలివ్వాలి. ఇలా చెయ్యలేకపోతే మరో వరం కోరుకో.” అంది.

దేవి మాటలు వినగానే భట్టికి దిగులేసింది. 'ఇంక నేనేం చెయ్యాలి? చేసిన తపస్సంతా వృధా. కాళి చెప్పిన మహత్కార్యం చెయ్యడం నా తరమా? 

సకల సద్గుణాలూ కల రాజు ఎవరు నా కోసం తన ప్రాణాలర్పిస్తాడు. అలాటివాడు అన్న విక్రమార్కుడొక్కడే. 

ఈ విషయం అతనికి చెబితే ఏమనుకుంటాడో? ఒకవేళ అందుకంగీకరించి 'ప్రాణత్యాగానికి సిద్ధపడినా అలాటివాడిని చంపి నేనెంతకాలం బతికినా ఏం ప్రయోజనం? అని చింతించి,

"తల్లీ! నాకు మరేవరమూ అక్కర్లేదు. నువ్వు చెప్పిన లక్షణాలు కలవాడు విక్రమార్కుడొక్కడే. అతనితో ఆలోచించి తరవాత చెబుతాను." అన్నాడు.

“సరే” అని కాళి అంతర్థానమైపోయింది.

దీనవదనంతో వచ్చిన భట్టిని చూసి "తమ్ముడూ! ఏమైంది?" అని అడిగాడు విక్రమార్కుడు.

భట్టి - జరిగినదంతా చెప్పాడు.

అదివిని - "దీనికంత విచారం దేనికి? ఇది గొప్పకార్యం కాదు. పద. నేను నా శిరస్సుని కాళికాదేవి కర్పిస్తాను. మన వంశం నిలవడానికి నేనైతేనేం? నువ్వైతేనేం? చింతించకు.” అంటూ.. భట్టి ఎంత చెబుతున్నా వినకుండా కాళికాలయానికి బయలుదేరాడు. విధిలేక భట్టి అతని ననుసరించాడు.

ఇద్దరూ అంబకి నమస్కరించాక, రాజు తమ్ముణ్ణి చూసి- "భట్టీ! సంకోచించకు. ఇదుగో ఖడ్గం. ఈ పరాశక్తికి ప్రీతికలిగేలా వేగంగా నా మెడ నరుకు." అని బలిపీఠం ముందు తలవంచాడు.

విక్రమార్కుణ్ణి మళ్ళీ బ్రతికించుకోవచ్చు నన్న ధైర్యంతో కత్తి తీసుకుని కాళికి మొక్కి - "తల్లీ! నువ్వు కోరినట్లు రాజుని బలిస్తున్నాను. నా మీద అనుగ్రహించి నేను కోరిన వరమియ్యి." అంటూ భట్టి రాజు తల నరికి బలి పీఠం మీదుంచి చేతులు కట్టుకుని నిలబడ్డాడు.

కాళిమాత ప్రత్యక్షమయింది. “వత్సా! మెచ్చాను. నువ్వు కోరినట్లే రెండు వేల సంవత్సరాలు జీవించి, ఉండేలా వరమిస్తున్నాను. సుఖంగా ఉండు." అన్న అంబని చూసి భట్టి పకపకానవ్వాడు.

"ఎందుకు నవ్వుతావు? నేను చెప్పినట్లు జరగదనుకుంటున్నావా?”

"జననీ! నా కలాగే అనిపించింది. ఎందుకంటే ఈ విక్రమార్క మహీపతి దేవేంద్రుడి నుంచి వెయ్యేళ్ళు జీవించి రాజ్యపాలన చేసేలా వరంపొందాడు. ఆ వరమిచ్చి రెండు రోజులయినా కాకుండానే నేను తపస్సు మొదలెట్టాను. ఇంత స్వల్పకాలంలోనే ఇతనికి మరణం సంభవించింది. దేవేంద్రుడి మాట అబద్దమయింది. 

ఇది జరిగాక నీ మాట మాత్రం నిలుస్తుందని ఎలా నమ్మడం? ఆ వరంలాగే ఇదీ ఔతుందనిపించి నవ్వొచ్చింది. తప్పులేదుకదా?”. అన్నాడు.

భట్టి చెప్పింది నిజమే అని గ్రహించిన కాళికాదేవి అతని వివేకానికి సంతోషించి - 

"భట్టీ! నువ్వు చెప్పింది న్యాయమే కాని భూమ్యాకాశాలు తలకిందులయినా నా మాట తప్పదు. దేవేంద్రుడి వరమూ తప్పదు.

మీ యిద్దరి ధైర్య సాహసాలనీ, మనోనిబ్బరాన్నీ తెలుసుకోవాలనే అలా కోరాను నీ కింకా ఏదైనా వరం కావాలంటే కోరుకో.” అంది.

"జగదీశ్వరీ! అలాటి సుగుణశీలుడైన రాజు మరణించాక నేనెంతకాలం జీవించి ఉన్నా ప్రయోజనం లేదు. కనుక నా మీద దయుంచి ఇతన్ని బతికించు." అని కోరుకున్నాడు.

"భట్టీ! విక్రమార్కుడి శిరమును మొండెంతో చేర్చు.” చెప్పింది కాళి. 

అతను అలా చేసేసరికి విక్రమార్కుడు నిద్రలోంచి లేచినట్లు లేచి ఎదురుగా ఉన్న దేవిని స్తుతించాడు.

వాళ్ళిద్దరికీ సకల శ్రేయస్సులూ చేకూరాలని అంబ దీవించి అంతర్ధానమయ్యాక ఇద్దరూ నగరం వెళ్ళిపోయారు. తరవాత 'విక్రమార్కుడికొక అనుమానం వచ్చింది.

"తమ్ముడూ! దేవేంద్రుడు నాకు వెయ్యి సంవత్సరాలు ఆయుర్దాయం వరమిస్తే, కాళికాదేవి నీకు రెండువేల సంవత్సరాలిచ్చింది. దీనిని బట్టి నేను గతించాక నువ్వు వెయ్యి సంవత్సరాలు జీవించి ఉండాలి.

ఇందుకు నువ్వూ నాలాగే చింతిస్తున్నావేమో." అదివిని భట్టి తలూపి - "నిజమే. కాని దీనికొక ఉపాయం ఉంది.

అలా ఐతే నువ్వూ రెండువేల సంవత్సరాలు జీవించగలవు.” అన్నాడు.

“ఎలా?” అడిగాడు విక్రమార్కుడు.

“మీరు సంవత్సరానికారు మాసాలే రాజ్యపాలన చేస్తూ మిగిలిన ఆరు మాసాలూ రాజ్యాన్ని యితరుల కప్పగించి దేశసంచారం చేస్తూండండి. 

అలా అయితే వెయ్యేళ్ళు రాజ్యపాలన చేయడానికి మరో వెయ్యేళ్ళు కూడి వస్తుంది. 

మొత్తం రెండువేల యేళ్ళు జీవించవచ్చు. దీనివల్ల మరో లాభం కూడా ఉంది. దేశ సంచారం చేయడం వల్ల అనేక విషయాలు తెలుస్తాయి.”

“ఎంత తెలివైనవాడివి భట్టీ! నువ్వు చెప్పినట్లే చేస్తాను” అని అతన్ని రాజు ఎంతగానో మెచ్చుకున్నాడు. అది మొదలు విక్రమార్కుడు సంవత్సరంలో ఆరు మాసాలు మాత్రమే పరిపాలన చేస్తూ మిగిలిన ఆరునెలలూ రాజ్యాన్ని భట్టి కప్పగించి దేశాటనం చేయసాగాడు.

ఒక్కొక్కప్పుడు ఇద్దరూ బయలుదేరేవారు. అప్పుడు రాజ్యాన్ని భట్టి కొడుక్కి అప్పగించేవాడు.

“ఓ భోజరాజా! ఇలా విక్రమార్క చక్రవర్తి సాహసం, వితరణ, పరోపకారం మొదలైన సద్గుణాలన్నీ కలిగి ప్రజారంజకంగా పాలించాడు. 

అతని రాజ్యంలో మృగాలకి కూడా జాతివైరం ఉండేది కాదు. రాజు, మంత్రి ఐన ఆ అన్నదమ్ముల ఐకమత్యాన్ని అందరూ పొగడేవారు. అతని గుణగణాలు వర్ణించడం అసాధ్యమని ఆదిలోనే చెప్పాను కదా?

విక్రమార్కుని గుణాలు విన్నావు కదా. అతని లక్షణాలు కొన్నయినా నీలో ఉంటే ఈ సింహాసనం అధిష్టించు. లేకపోతే నీకా అర్హత ఉండదు. వెళ్ళిపో" అంది ప్రతిమ.

ముహూర్తం దాటిపోడంతో భోజరాజు కొలువు చాలించి మందిరానికి వెళ్ళిపోయాడు.

(సశేషం)
 *న్యాయం-2*
(రావిశాస్త్రి గారి కథలు)

"నే నేం నేరం చెయ్య లేదండి."

"అయితే కేసు వొప్పుకుంటానని యెందుకంటున్నావు?"

"కేసు కొప్పేసుకుంటానండి."

"కేసు వప్పుకోవడం అంటే ఏమిటి నీకు తెలుసా?"

ఈ విధంగా కోర్టువారికీ, ఆమెకీ సంభాషణ సాగుతోంది. 'ఈ కేసుతో తెల్లారిపోతుంది, కాబోలు, చాదస్తం మొగుడు చెబితే వినడు, చెప్పిందాక ఒగ్గడు. అలా సూస్తా వుండు, ఇలా హాల్లో అంతా అస్పష్టంగా గొణుక్కుంటున్నారు. బెంచి గుమాస్తా కుర్చీలో ఈడిగిలబడి, కాళ్ళు పూరాగా జాచుకొని కూర్చున్నాడు. గోడ గడియారపు ముళ్ళు నెమ్మదిగా నడుస్తున్నాయ్.

"నీ దగ్గర గేలం సారా దొరికిందా లేదా?" అని చివరికి గట్టిగా అరవ్వలసి వచ్చింది మేజిస్ట్రేటుగారు. ఆయనకి నుదుటిమీద చెమట చిమ్మింది. నుదుట వరాలు ఆకు పచ్చని గీతలుగా మారేయి.

"నా దగ్గర సారా దొరక లేదండీ! తాగేననీ పట్టుకున్నారు" అని గబుక్కున సమాధానం చెప్పింది ముద్దాయి.

“సరిరా" అన్నాడొక ముసలాయన, కిటికీల దగ్గరున్న జనం హాయిగా నవ్వేరు. ఒక పడుచులాయరు ఉద్రిక్తుడయి కూర్చున్నాడు.

మేజిస్ట్రేటుగారు నిర్ఘాంతపోయేరు.

"ఏం తాగేవు?" అని నీరసంగా అడిగేరు.

"బీరు, జీన్ను, బ్రాంది, విస్కి, వాళ్ళేదిస్తే అది. వేరే ఎక్కణ్నుంచొస్తుంది?"

ఆమె కళ్ళు ఎరుపుతో తడిసేయి.

"సారా దొరకలేదా?"

"త్రాగేను"

కోర్టువారు 'ఇనస్పెక్టరువైపు' అసహాయంగా చూసేరు. అతను హెడ్డుని కళ్ళతో అడిగేడు. 

హెడ్డు బెంచి దగ్గరగా వెళ్ళి గొంతు సవరించుకున్నాడు. పురాణం చెప్పేవారి పాటలా గంభీరంగా, మృదువుగా, శ్రావ్యంగా వుంటుందతని మాట.

"మొన్న అమెరికన్ షిప్పొచ్చింది బాబుగారూ! తమరితో చెప్పకేం! నిన్న రాత్రి ఉళ్ళోకి బేచి బేచంతా దిగిపోయింది. పాపం, షిప్పులో అవస్థలు పడిపడి ఊళ్ళోకి దిగేసరికి వాళ్ళకెలా వుంటుంది బాబూ! ఏదో కాస్త జల్సా చేద్దామనుంటుంది. ఆ జల్సాలో వాళ్ళు తాగేసి దీన్ని తాగించేసి పోయేరు. పోయినవాళ్ళు మామూలుగా పోకుండా ఆ సర్దాలో దీన్ని ఎలా వున్న దాన్నలా గుమ్మందాకా తీసుకొచ్చి ఒదిలేసి పోయేరు. 

మరింక రోడ్డు మీద దీని అల్లరి చూసుకోండి. పట్టుకొని స్టేషన్ కి తీసుకొచ్చేసరికి మా తాతలు దిగొచ్చేరు. నక్కలా వుందేకాని తాగేసినమీద దాన్నోట్లోనుంచి యెన్ని బూతులు గలగలా రాలాయో చెప్పలేం. 

ప్రాప్రయిటరుగాడికి కబురు పంపిస్తే వాడు బట్టలు పంపించి, తనుమాత్రం కనుపించడం మానేసేడు. 

వాడికి గలాటా అంటే భయం. ప్రాద్దున్న లేపి బట్ట కట్టించి బయల్దేర దీసేసరికి బ్రహ్మాండమయింది. మమ్మల్నేం చెయ్యమంటారు? తాగిన మాట నిజమే! కాని సారాకూడా దొరికింది బాబుగారూ!"

డిపార్టుమెంటులోని అన్ని బాధలూ, సకల కష్టాలూ మూర్తీభవించేయా అన్నట్టుగా వుంది ఆ సమయంలో హెడ్డుగారి మూర్తి.

మేజిస్ట్రేటుగారి ముఖంలో రకరకాల ప్రశ్నలు కనిపించేయి. ఆయనకేం చెయ్యడానికి పాలుపోకుండా వుందని స్పష్టంగా తెలుస్తోంది.

నేరం చెయ్యలేదు. కేసుకి వొప్పేసుకొంటుందట. ఇదో సమస్య. అన్నీ సమస్యలే! ఏదీ యెవరూ సాఫీగా సవ్యంగా నడవనివ్వరు.

అంతలోనే అకస్మాత్తుగా ముద్దాయీ కళ్ళంట నీళ్ళు బొటబాట కారేయి. 

కొబ్బరాకులమీద ఎండ మెరుగూ, ఇంటిముందు కళ్ళాపుమీద ముగ్గులూ, చెరువు గట్టున దేవుడి గుడిప్రక్కన కన్నూ కన్నూ కలిపిన యువకుడూ, తొలిసారిగా కాలుజారిన చీకటి సమయం, ఏమేమి జ్ఞప్తికి వచ్చేయోకాని ఆవిడ అక్కడ కోర్టు చీకట్లో గోడవారి నిల్చొని రెండు బెక్కులు బెక్కింది.

"కోర్టులో ఏడవకూడదు" అన్నారెవరో.

"తాగి తందనాలాడ్డం, కోర్టుకొచ్చి ఏడవడం!" అని ఇనస్పెక్టరు ఆమె మీద కేకలు వేసేడు

"ఆవిణ్నేం భయ పెట్టకండి" అని మేజిస్ట్రేటుగారు విసుక్కొంటూ అన్నాడు. విసుక్కోవలసిన మూడ్ లో ఆమె తనని పెట్టినందుకు ఆమె యెడల ఆయనకి విసుగు ఎక్కువయింది.

"మరోడూ మరోడూకాదు, అమెరికన్ ప్రెసిడెంటొస్తే అందుకోసమే వచ్చాడనుకొని ఎంతిస్తావని అడుగుతుంది. అటువంటి రకంసార్ ఇదీ! ఉరితీస్తాం అంటే ఖాతర్ చెయ్యని మనిషికి ఏడుపా?" అన్నాడు ఇనస్పెక్టరు.

"తాగడం ఏమిటి? అందులోనూ ఆడది! ఛ!" అన్నాడు మేజిస్ట్రేటుగారు.

"కలికాలం బాబుగారూ!" అన్నాడు హెడ్డు. అలా అనగలిగిన వయసు అతనిది. సర్వీసులోనే నెరసిపోయిందతని తల.

"సార్! తమరు నన్ను తిడితే తిట్టండి. ఏమనాలనివుంటే అనండి. కాని నిజం చెపుతున్నాను నమ్మండి. ఇలాటి లంజలకి -తప్పుమాట అన్నానుకోకండి- అది అది!
అందుకన్నాను-అలాటివాళ్ళకి ఓట్లిచ్చి గవర్నమెంటుని ఎన్నుకుంటే అదింకేఁ గవర్నమెంటుసార్. 

ఇంగ్లీషువాడి టైములో" అని ఇన్ స్పెక్టరు మాట పూర్తి కాకుండానే

హెడ్డు అడ్డొచ్చి-

"ఆ టైములో ఒక చిన్న జవానుకాదు, యింకా ట్రైనింగు పూర్తవని రిక్రూట్ వైపైనాసరే ఎవడైనా కన్నెత్తి చూస్తే చాలు బాబుగారూ! వెంట్నే తెచ్చి కొట్టులో' వేసీడమే! శిశుపాలుడి పరిపాలన! తన్ని పరిపాలించాడు తెల్లబాబు. అందుకే అంత 'హాపీ'గా వెళ్ళిపోయింది" అని పూర్తి చేసేడు హెడ్డు. ఆ హాయైన పూర్వపు రోజులకి ఒక చిన్న నిట్టూర్పుకూడా పారేశాడు సమయానుకూలంగా.

"తంతేకాని వీళ్ళు లొంగరు సార్."

"కాని యిప్పుడు తన్నడానికి మాకు గుండెలున్నాయా బాబుగారూ! మేము కుక్కని కాల్తో తంతే గుద్దేస్తున్నారు? టెలిగ్రాంలు- నెహ్రూగారికే. స్టేషన్లో కుక్కల జొరబడిపోతున్నాయంటే దండం పెట్టి ఊరుకుంటున్నామనుకోండి బాబూ! అదీ పరిస్థితి, ముద్దాయిమీద చెయ్యి వెయ్యిడానికే పోలీసువాడు జంకితే యింకేం ప్రభుత్వఁ బాబుగారూ"

“మనకి నిజంగా డిక్టేటరుండాలి సార్!"

"ఉండి మనల్ని- తప్పు బాబుగారూ! మనల్నంటే యిదిగో యిలాటి వాళ్ళని-కమ్చీతో కొట్టాలి బాబుగారూ! నిన్న రాత్రి రోడ్డుమీద యిది చేసిన అల్లరి తమరు చూసేరు కారు. చూస్తే అప్పుడే పంపించేస్తుందురు. ఆర్నెల్లకి తక్కువ కాకుండాను."

తన నెవరో ఆకాశం పైనుంచి క్రిందికి గబగబా లాగుతున్నట్టుగా అనిపించింది.
మేజిస్ట్రేటుగారికి. 

కిందటి రాత్రి ఆ ముద్దాయీ ఏ విధంగా ఉండుంటుందో ప్రయత్నంజేసి ఊహించే రాయన మనసులో. 

అందులోనూ ఆడవారిలో అంత అసహ్యంగా ప్రవర్తించే వారుంటారా అనిపించిందాయనికి, ఈ ఆడమనిషికూడా మనిషేకదా!" అని ఆశ్చర్య పోయారాయన.

"అయినా, అదీ మనలాటి మనిషేగా!" అని కొంచెం హీనస్వరంలో అన్నారాయన.

అప్పుడు ఇనస్పెక్టర్ “సార్, నా సంగతి తీసి పెట్టి నన్ను వేరే ఉంచండి. కాని తమకీ, దానికీ కూడా తేడా లేదని తమరు సెలవియ్యడం ధర్మమా సార్!" అన్నాడు.

"బాబుగారిది అతి మెత్తని మనసు" అని హెడ్డుకూడా అతి శ్రావ్యంగా పలికేడు.

మేజిస్ట్రేటుగారికి కాళ్ళు తేలిపోతున్నట్లుగానూ, బరువుతో దిగలాగి పోతున్నట్టుగానూ, రెండు విధాలాకూడా ఉంది. ఆ సమయంలోనే తన డిపార్టుమెంటులోని ఒక పెద్ద మనిషి సలహా గుర్తుకొచ్చిం దాయనకి,

"నీ కోర్టులో నెలకి ఎన్ని కేసులు? కనీసం అయిదు వందలు. కొండ కొండా
చొప్పున అయిదువందల కొండలు తవ్వాలంటే తవ్వు, దానికి నీకు శక్తుంటే ఉండవచ్చు; కాని టైముంటుందా? ఆలోచించు" అన్నాడా పెద్ద మనిషి,

మేజిస్ట్రేటుగారు ఆ సలహాని చూరువైపు చూస్తూ మననం చేసుకొని, తరువాత ఫైనల్గా ఇనస్పెక్టర్ని ఒక మాట అడిగేరు.

"మరైతే, ఆ కంపెనీలు-మీరు చెప్పినవి అవన్నీ ఎందుకు ఎత్తించరూ?" అనిఅడిగేరు

"ఎత్తించేస్తూనే వున్నాంసార్! ఎత్తించేస్తే వీళ్ళు రోడ్లు కాసేస్తున్నారు సార్! ఏం చెయ్యమంటారు? వీళ్ళతో మా కెంత టెరిబుల్ న్యూసెన్స్ వుందో తమరితో చెప్పాలంటే వారంరోజులు పడుతుంది. అంత న్యూసెన్సుగా వుంది. కంపెనీలోంచి తన్ని తగిలేస్తే చేరదీసే వాడెవడూ కనిపించడు" అన్నాడు ఇనస్పెక్టరు.

"దిక్కు మాలిన ముండల్ని యెవరు చేరతీస్తాడు బాబూ? మరింక పాట్ట పోషించుకుందికి ఈ పన్లుమానమంటే చస్తే మానరు వీళ్ళు. అది వాళ్ళ బబతుకు! వాళ్ళని పట్టు కోవడం బతుకు మా బతుకు -ఏ బతుకు బతికే వాళ్ళు ఆ బతుకు బతకాలి కదా బాబుగారూ!" అన్నాడు హెడ్డు ఫిలాసాఫికల్ .

ఇదంతా జరుగుతున్నంత సేపూ ముద్దాయి కొంచెం కొంచెం బెక్కుతోందంలేకాని 'బతుకు బతుక' నే మాట ఆరేడుసార్లు వినేసరికి ఆమె మెదడ్లో ఏ నరాలకి నిప్పంటుకుందోగాని, ఆమె ఒక్క పెట్టున ముందుకొచ్చి పెద్దగా ఏడుస్తూ కేకలు వేయడం మొదలు పెట్టింది.

"నా కొద్దుబాబూ నా కొద్దు" అంటూ ప్రారంభించింది. "నా కొద్దీ బతుకు. నన్ను చంపేయండి. కాని బాబూ నా కొద్దీబతుకు. నేనింక బతకలేనసలు. ఇంత నీచం బతుకు, హీనంబతుకు నేబతకలేను. ఇంత కష్టపడి తెచ్చుకున్న కూడయినా తిందావంటే సయిస్తుందా? అన్నం తింటే వాంతులు కడుపు నొప్పి, తలబాధ, లేకపోతే మూర్ఛలు. 

రాత్రల్లా నిద్దర్లేదు, పగలు నిమిషం హాయిలేదు. వంట్లో నీరసం, వళ్ళంతా విషం. పగలంతా బాధ. రాత్రంతా బాధ. నిన్న రాత్రి మీరు చూళ్ళేదు. హెడ్డుబాబు చూసేరు. 

అడుగో ఆ బాబు; బాబూ! నీకు తెలుసు. ఎంతమందున్నారు? ఎలా వున్నారు? మరి తాక్క చచ్చి పోమంటారా? చెప్పండి బాబూ చెప్పండి. చచ్చిపోమంటారా? చెప్పండి. చచ్చిపోతాను. చచ్చిపోతే, యెవడేడవాలి? మీ రేడుస్తారా? యెవరేడవాలి? 

తల్లా తండ్రి తోబుట్టువా? ఎవరున్నారు? అందరూ వుంటే ఈ బతుకెందుకు బతకాలి? అందరూ వుంటే మీ కడుపున పుట్టిన ఆడకూతుర్లందర్లాగానే నేనూ బతుకుదును. ఈ కుక్క బతుకెందుకు బతకాలి? 

చూడండి బాబూ చూడండి! నాకు సిగ్గు లేదు. చూడండి మరేఁ సిగ్గుపడక చూడండి. ఒకరు కాదు. ఇద్దరు కాదు. ఒక్క రాత్రికి అంతమంది ఇలా కరి సేసి, రక్కేసి, రక్తం తాగేసి ప్రాణాలు తీసేస్తే నిన్నరాత్రి ఇందరు ప్లీడరుబాబులు, యిందరు
జవాను బాబులు, ఇందరు ధర్మప్రభువులు ఇంతమందీ ఉన్నారు-నిన్న రాత్రి యేబాబొచ్చి అడ్డుకున్నాడు? చెప్పండి! యెవరొచ్చేరు? యెవరూ రాలేదే? 

మరింక ఈ బతుకు నన్నింక బతకనివ్వక నన్ను చంపేయండి. మెడకి తాడేసి ఆ గుమ్మానికి వేలాడ దీసేయండి. మీ మడాలకింద పడేసి మన్ను కుమ్మేసినట్టు కుమ్మేసి మట్టిలో కలిపేయండి. 

రెండు కట్టెలుంటే చాలు. గుప్పెడు బుగ్గయిపోతాను. గుప్పెడు బుగ్గీచేయిస్సీ గాలి కెగరేసేయండి. కత్తితో పొడిచేయండి. సముద్రంలోకి తోసేయండి. నన్ను చంపేయండి, చంపేయండి."

-అంటూ మేజిస్ట్రేటుగారి వైపు పరిగెట్టిందామె.

కోర్టులో అంత మందికీకూడా ఆమెని పట్టుకు ఆపడం చాలా కష్టమయుంటుంది. ఆఖరి కామె ఎలాగో అలాగా చల్లారుతూ చల్లారుతూ గోడవార కూలబడింది.

"చూసేరుబాబూ! ఎలా తిరగ బడుతూందో" అన్నాడు హెడ్డు.

ఆమె చింపేసుకున్న జాకెట్టు వైపు చూడలేకపోయేరు మేజిస్ట్రేటుగారు ఆయనకి వమనం వచ్చేట్టయింది.

"ఒక్కసారిగా తుఫాన్లా లేచిపోయిందండి?" అన్నాడు ముసలి వకీలొకాయన.

"ఇంకా యిలా చూస్తూ కూర్చోండి వీళ్ళంతా కలిసి, అది చెప్పినట్టు- రేపొద్దున్న మనల్నింత మందినీ గాలి కెగ రేసేస్తారు. అలా చూస్తూ వుండండి; నా మాట నిజం కాకపోతే చూసుకోండి" అన్నాడు ఇనస్పెక్టరు.

“పోనీ! ప్రథమ తప్పు క్రింద వదిలేస్తాను" అన్నాడు మేజిస్ట్రేటు గారు.

"పాత కేసు లింకా మరో మూడున్నాయి బాబుగారూ దీనిమీద! అవికూడా వప్పేసుకుంటుంది." అన్నాడు హెడ్డు.

"అయితే పోనీ జరిమానా కట్టుకుంటుందా?"

“దాని ప్రాప్రయిటర్ గాడు రాలేదు, మరింక రాడు బాబూ!”

చివరికి నాలుగు కేసుల్లోనూ కలిసి "ఒక నెల" అన్నారు కోర్టువారు.

"న్యాయం" అన్నాడు హెడ్డు.

ఆ తరువాత, మేజిస్ట్రేటుగారు, మిగతా కేసుల్ని చక చకా పిలవ నారంభించేరు.

(విశాలాంధ్ర దినపత్రిక. 23–4–1961)

(సమాప్తం)
 *న్యాయం-1*
(రావిశాస్త్రి గారి కథలు)

గుప్పున సారా కంపు!

కోర్టు.

గొల్లున సంతగోల!

కోర్టు.

అబద్దాలకి పాముల పుట్ట!

కోర్టు.

బందెలదొడ్డికి రాచబాట!

కోర్టు.

(అక్కడ అనాథుల ఆక్రందన. అక్కడ అసహాయుల ఆర్తనాదం. అక్కడ పేదల కన్నీటిజాలు. అదే సుమా కోర్టు! అని కూడా నాకు రాయాలనుంది. అయితే, సెంటిమెంటల్ సాబ్ స్టఫ్, ఏడుపురాత రాసేనని తప్పక చాలామంది వెక్కిరిస్తారు.)

పదకొండున్నర. పచ్చని పగలు, మేజిస్ట్రేటుకోర్టులో పల్చపల్చని నీడలు. బెంచిమీద కూర్చున్న మేజిస్ట్రేటుగారి తలలో చిక్కు వీడని ఆలోచనలు.

వరండాలో జనుల కిటకిట. వారికేకల గోల. వారి శరీరాల వాసన, వారి బట్టల దృర్వాసన.

మేజిస్ట్రేటుగారు యువకులు. ముఖంలో లేతతనువు ఛాయలు ఇంకా పోలేదు. పెదవుల కటూ ఇటూ రెండు గీతలు అస్పష్టంగా ఉన్నప్పటికీ, ముడుతలింకా నుదుట మీదకి ఎక్కలేదు. 

అతనేదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళాలని బయల్దేరేడో  ఆ సంగతి మధ్య దార్లో మర్చిపోయిన వాళ్ళా ఉన్నాడతను. 

వెళ్తూన్న దారి సరైన దారేనా ని అనుమానం తగిలినవాళ్ళా ఉన్నాడతను. ఏదో ఆలోచిస్తూ కొంతసేపు కాయితంలో ఏదో రాసుకున్నాడు. తరువాత ఆగి, చూరువైపు చూస్తూ కూర్చున్నాడు.

బెంచీకి ఎదురుగా నాలుగైదు నల్లకోట్లు కూర్చున్నాయి. అయిదారు ఎర్రటోపీలు
నిల్చున్నాయి. బెంచి వెనక్కి గోడని ఎత్తుగా ప్రభుత్వ చిహ్నం మినుకు మినుకు మంటూ హాల్లో చీకటిని చీల్చుకొంటోంది. ఒక గోడనున్న పటంలోంచి ప్రెసిడెంటుగారు పట్టుదలగానూ, మరో గోడ నుంచి సర్దార్ పటేల్ గారు భీకరంగానూ చూస్తున్నారు. 

మీదనున్న పంకాని చిరకాలపు సాలెగూళ్ళు గట్టిపట్టు పట్టుకోనున్నాయి. అవి పంకా కదలిక్కి సాగుతున్నాయే గాని సడలి తెగిపోవడంలేదు.

మేజిస్ట్రేటుగారి చూపు ఇంకా చూరు మీదుండగానే రెండు బూట్ల టకటక ఆయన చెవిన పడింది. టకటక లాడుతూ వచ్చిన బూట్లు టక్కున ఆగేయి. చూరుమీదున్న మేజిస్ట్రేటుగారి చూపు నెమ్మదిగా కిందికి దిగి, ఒక సబిన్ స్పెక్టరుగారి సాల్యూట్నీ, అతని చిరునవ్వునీ, సాల్యూటనంతరం కుర్చీలో అతను కూర్చోడాన్నీ గమనించింది.

"ఈ కేసుమీదే కదా?" అని అడిగేరు మేజిస్ట్రేటుగారు!

"ఏదిసార్?" అన్నాడు సబిన్ స్పెక్టరు.

"ఆ కేసు" అని ఓ ఆడపిల్లని చూపించేరు మేజిస్ట్రేటుగారు.

ఇన్ స్పెక్టర్ గారికి వెనగ్గా గోడకి బల్లిలా చేర్లబడి నిల్చుందొకామె. దూరంనుంచి చూస్తే, చీకట్లోచూస్తే ఆమె పిల్లలా ఉంటుంది. దగ్గిర్నించి చూస్తే పాతికేళ్ళు కనిపిస్తాయి. 

అందరూ తనవైపు చూడ్డం చూసి ఆమె కొంచెం సిగ్గుచూపింది. అంతలోనే ఆ సిగ్గుని కట్టేసింది. పగటివేళ మెరుపులా వికృతంగానూ, అర్ధరాత్రి మెరుపులా భయంకరంగానూ ఉందా సిగ్గు. 

కోర్టులో అంతా ఆ సిగ్గుచూసి ముచ్చటపడ్డారు. ఆమె పైటని తలమీదికి ముసుగువేసుకుంది. సగానికి ఉందా ముసుగు. ఆమె గుండెలు పుష్టిగా, మాయగా ఉన్నాయి. ముఖంలోనూ, మిగతా శరీరంలోనూ మాత్రం నిజం కనిపిస్తోంది. ఆమె వంట్లో ఊపిరిలేదు. ఆమె ముఖంలో కళాకాంతుల్లేవు. 

మూడో తరగతి రైలు పెట్టెలో ఓ మూల నలిగిపడి వాడిపోయిన పువ్వులదండలా వుందామె.

'తూస్తే పావుశేరు మాంసం ఉండదు' అని ఆమెని చూడగానే తోచింది. మేజిస్ట్రేటుగారికి.

"కేసు మనదేకదోయ్?" అని ఇనస్పెక్టరు హెడ్డుని అడిగేడు.

"మనదే బాబూ! 'గేలం' పెట్టేం. పట్టుకున్నప్పుడు తమరుకూడా ఉన్నారు" అని దగ్గరకొచ్చి గొణిగేడు హెడ్డు.

"ఈ కేసు మా కేసేసార్" అన్నాడు ఇనస్పెక్టరు కోర్టువారితో, తరువాత హెడ్డుని మెల్లిగా "నేరం వప్పేసుకుంటుందా?" అని అడిగేడు.

"చిత్తం! అలాగే అంది అనడం మన్తో" అన్నాడతను.

"ఛార్జిషీటు చూస్తే నిన్న సాయంకాలం 'గేలం' సారాతో మీరే స్వయంగా
పట్టుకున్నట్టుగావుంది" అన్నారు మేజిస్ట్రేటుగారు.

"అవునంతేసార్. అది రైటేసార్!" అని కోర్టువారితో చెప్పి, "ఏమే! కేసు వప్పేసుకుంటావుకదూ?" అని ఆమెని అడిగేడు సబ్ ఇనస్పెక్టరు.

ఆమె మరోసారి వికృతంగా సిగ్గుపడింది. ఎడమచేతి ఎర్రని గోళ్ళని కుడిచేతి ఎర్రని గోళ్ళతో పాపుచేసుకుంటూ నిలబడింది. 

ఆమె కట్టుకున్న నీలిపువ్వుల పరికిణీమీడి ఎర్రని కండువా పంకా గాలికి తలమీదా, గుండెలమీదా అతి నెమ్మదిగా కదుల్తోంది. రోడ్డువార నల్లకుక్క జూలులా ఆమె జుట్టంతా రేగిపోయింది.

"సిగ్గెందుకే, జవాబుచెప్పక?" అన్నాడు ఇనస్పెక్టరు.

కళ్ళెత్తి ఓసారి అతనివైపు చూసిందామె. ఆమె కళ్ళనే చూసేడు కాని కంటిలో తడిని గమనించలేదాయన.

"వీళ్ళకి రాత్రిళ్ళు సిగ్గుండదుసార్: పగలే ఈ సిగ్గంతాను" అన్నాడు ఇనస్పెక్టరు కోర్టువారివైపు తిరిగి.

"ఏం అమ్మాయ్! నీ కేంపని?" అని మేజిస్ట్రేటుగా రామెను ప్రశ్నించారు.

ఆ ప్రశ్నకి అంతా నవ్వేరు.

మేజిస్ట్రేటుగారు నెల్లాళ్ళయి ఉద్యోగంలో ప్రవేశించేరు. ప్లీడర్లంతా ఆయనను గురించి *'చాదస్తం ముండాకొడుకు*' అని తీర్పు చెప్పేరు. 

ఆయన గురించి "పట్టువిడుపూ లేదు. సర్దిపుచ్చుకోవడం తెలీదు. 'సత్యం సత్యం' అని తినేస్తున్నాడు. 

కల్పన కొంచెం అయినాలేని కేసు పృథ్విలోనే లేదు. అసలు ఈ ప్రపంచమే భగవంతుడి పెద్ద కల్పన అంతా మాయే అయినప్పుడు మాయలోంచి మాయగాక యింకేమిట్స్తుంది? న్యాయంట, ధర్మంట, సత్యంట! ఇలాటివాడే వెనకటికోసారి 'నిజంచెప్పు! నిజం చెప్పు!' అంటూ పెళ్ళాంపిక పిసికేసి నూతిలోకి దూకేసేడు. నిజమూ, న్యాయమూ కావాలి; 

కావాలంటే, నేను కాపరంచేసి పుట్టించాలిగాని, ఎక్కణ్నించి వొస్తుంది నిజం, న్యాయం? 

కేసుల్లోనే న్యాయంవుంటే ఈ పోలీసులం మేమెందుకు ? ఇంతమంది ఈ ప్లీడర్లు అంతా ఎందుకు? ఈ కోర్టులన్నీ ఎందుకు" అని హెడ్డు- అతను పర్మనెంటుగా రివర్టయేడు - నాలుగైదు సార్లు వరండాలో చమత్కరించాడు.

"ఏం అమ్మాయ్? ఏంపని చేస్తావ్" అని ఆమెని మేజిస్ట్రేటుగారు మళ్ళీ అడిగేరు. అంతా మళ్ళీ నవ్వారు.

మేజిస్ట్రేటుగారికేమీ బోధపడ్డంలేదు. అతను పెద్దించివాడు. ప్రాక్టీసు చేసిన రోజుల్లో అతను, డబ్బున్నవాడే అయినా, నలుగురిలో తిరిగేవాడు కాదు. ప్రాక్టీను వుండకపోవడంచేత అతను కథలే చదివేవాడు. 

ఎవరికీ చూపించకుండా పద్యాలు రాసుకొని దాచుకొనేవాడు. అతనికి కాకినాడ లో పెద్ద మేడా, హైద్రాబాద్ లో ఒక కొత్త 
యిల్లూ ఉన్నాయి. అతనికి పల్లపు భూములున్నాయి. మెట్టున తోటలున్నాయి బ్యాంకులో మంచి అకౌంటుంది. 

పురుష లక్షణానికి ఉద్యోగం వుంది. తల్లిదండ్రులకతను మంచి కొడుకు. తోబుట్టువులతనికి లేరు కాని, వుంటే వాళ్ళకతను మంచి అన్నదమ్ముడు. భార్య కతను ప్రేమించేభర్త. డెయిసీ ఇరానీ, షెర్లీ టెంపిల్, వాసంతి లాంటి కూతురుకతను మంచి తండ్రి. అతను చాలా మంచివాడు కాదని ఎవరూ ఇప్పటిదా అనలేక పోయేరు.

అందుచేత ఆయనకేమీ బోధపడ్డంలేదు.

"దాని కేం పనా? అదేపనండి" అని అప్పుడు హెడ్డు వస్తూన్న నవ్వు నిలిపిపారేసుకుని, కోర్టువారికి తెలియజేసేడు.

"ఏమే? సూకరాజు కంపెనీలో కదూ వున్నావు?"

అని ఇనస్పెక్టరు అడగ్గా ఆమె అవునన్నట్టు తలూపింది.

"ఏం కంపెనీ అది?" అని మేజిస్ట్రేటుగారు తిరిగి ప్రశ్నించేరు.

"కంపెనీ అంటే మామూలు కంపెనీ కాదుసార్! ముండల కంపెనీని ఇక్కడ టూకీగా 'కంపెనీ' అంటారు" అని ఇనస్పెక్టరు బెంచి దగ్గరగా వెళ్ళి నెమ్మదిగా చెప్పేడు. మేజిస్ట్రేటుగారు పెదవి కరుచుకున్నారు.

ఎదురుగా నిల్చున్న ముద్దాయిగురించి ఆ సంగతి తెలియగానే అతనికెందు గాని అసహ్యం వేసింది. అసహ్యం కలగడం ఆయనకే ఆశ్చర్యం కలిగించింది. కథ లో పతితలా లేదామె. వాస్తవదృశ్యం చూసేసరి కాయనకి కడుపులో వికారం పుట్టింది.

"నిన్న సాయంకాలం సూకరాజు అనే ఆసామీ ఇంటిప్రక్కన సందులో, స్వాధీనంలో ఒకగేలం వంటసారా వుండగా, నిన్ను పట్టుకొన్నామని, మదరాసు ప్రాహి బిషన్ ఆక్టు సెక్షన్ 4(1) ఎ ప్రకారం నువ్వు నేరం చేసేవని పోలీసువారు నీమీద కేసు పెట్టే నేరం చేసేవా?" అని ముద్దాయీగా నిలబడ్డ ఆమెని పద్ధతి ప్రకారం ప్రశ్నించేరు.

సమాధానంగా పిల్ల తలవూపింది.

"తలూపడము కాదు, నోటితో సమాధానం చెప్పాలి."

"కేసు వొప్పేసుకుంటానండి" అందామె.

"అంటే, నేరం చేసేనంటావా?"

"కేసు కొప్పేసుకుంటానండి."

"నేరం చేసేవా?"

"కేసు కొప్పేసుకుంటాను బాబుగారూ.”
"నే నేం నేరం చెయ్య లేదండి.”

"అయితే కేసు వొప్పుకుంటానని యెందుకంటున్నావు?"

"కేసు కొప్పేసుకుంటానండి."

"కేసు వప్పుకోవడం అంటే ఏమిటి నీకు తెలుసా?"

(సశేషం)
 *తెలుగు “కోరా”లో ఓ అపరిచిత వ్యక్తి అడిగిన ప్రశ్న:*

నేను (25) ఇప్పటి వరకూ మద్యం సేవించలేదు. మానసిక ఒత్తిడి తో ఆరోగ్యం చెడగొట్టుకునే కన్నా మద్యం సేవించి ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నా. నేను దేనితో (మద్యం రకం) మొదలు పెడితే మంచిది?

*రాజన్ పి.టి.ఎస్.కె సమాధానం:

మానసిక ఒత్తిడితో ఆరోగ్యం చెడగొట్టుకోవడం కంటే మద్యం సేవించడమే ఉత్తమం. కానీ మీరు ఎంచుకునే బ్రాండ్ల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి.

ముందుగా మీరు “యండమూరి”, “మధుబాబు” బ్రాండ్లతో మొదలు పెట్టండి. ఆ రెండు బ్రాండ్లూ ముప్పై, నలభై యేళ్ళుగా చాలా రిలయబుల్ బ్రాండ్లుగా పేరుమోసినవి. చాలామంది వాటితోనే మత్తులో జోగడం మొదలు పెట్టారు. ఆ మత్తు మహత్తు తెలిశాక, ఇంకా ఎక్కువ మత్తిచ్చే వాటికోసం వెతుక్కుని మరీ వెళ్ళేవారు. మీరు మొదట్లోనే “విశ్వనాథ”, “చలం” వంటి బ్రాండ్లను వాడడానికి ప్రయత్నించకండి. అవి చాలా కాస్ట్‌లీ బ్రాండ్లు. వాటిని ఒకసారి టేస్ట్ చూస్తే ఇక వదిలి పెట్టడం కష్టం. అవి రెండూ పూర్తిగా డిఫరెంట్ టేస్ట్‌లు కూడా.

ఇంకా నేను వాడిన వాటిలో “ముళ్ళపూడి”, “శ్రీపాద”, “గురజాడ”, “జాషువా” చాలా ఎక్కువ కిక్కిచ్చే బ్రాండ్లు. ఇప్పటికీ నేను ఈ బ్రాండ్లు వాడుతూనే ఉన్నాను. మీరు ఇంకొక టైప్ మద్యం కూడా పుచ్చుకోవచ్చు. అవి వీటికంటే త్వరగా అంటే ఇన్‌స్టంట్‌గా కిక్ ఇచ్చేవి. మీ సమస్య ప్రేమకు సంబంధించినదైతే “ఆత్రేయ” బ్రాండ్ వాడండి. ఒకవేళ జీవితంలో ఎదుగుదలకు సంబంధించినదైతే “సిరివెన్నెల” బ్రాండ్ వాడండి. మీ సమస్య ఏమిటో మీకే స్పష్టత లేకపోతే.. ఒన్ అండ్ ఓన్లీ “వేటూరి” బ్రాండ్ వాడండి. ఆ కాక్‌టైల్ బ్రాండ్‌ని మించిన బ్రాండ్‌ నాకింతవరకూ దొరకలేదు. అది సర్వరోగ నివారిణి టైపన్న మాట. అది తాగితే మీకు మత్తెక్కడం 100 శాతం గ్యారంటీ. అందుకు నాదీ పూచి. ఇవి కాకుండా ఇంకొక టైపు బ్రాండ్లు కూడా ఉన్నాయి. మీకు టేస్టీగా ఉంటూ మాంచి మత్తెక్కాలంటే “ఓషో” బ్రాండ్ వాడండి. కానీ పొరపాటున కూడా “JK” బ్రాండ్‌కు మాత్రం వెళ్ళకండి. JK అంటే జిడ్డు కృష్ణమూర్తి. ఆ బ్రాండ్ తాగితే మీకెక్కిన మత్తు మొత్తం దిగిపోవడమే కాదు, అంతకుముందు తాగిన బ్రాండ్ల టేస్ట్‌లన్నీ కూడా మరచిపోతారు. 

ఇక విషయంలోకి వద్దాం. మీ సమస్యేమిటో మాకు తెలియదు. ఒకవేళ మీరు చెప్పినా అది మాకెంత వరకూ అర్థమవుతుందో కూడా చెప్పలేం. మీ సమస్య విని దానికో అద్భుతమైన పరిష్కారం చెప్పెయ్యడానికి, అసలు ఈలోకంలో సమస్య లేనివాడెవ్వడు? వాడి సమస్యనే వాడు పరిష్కరించుకోలేనప్పుడు మీ సమస్యనేం పరిష్కరిస్తాడు. కనుక ఇతరుల మీద ఆధార పడటం అన్నది ఏదో కాసింత సాంత్వన చేకూర్చడానికి ఉపయోగ పడుతుంది తప్ప, పరిష్కారానికి కాదు. కాకపోతే సమస్యను చర్చించడం ద్వారా మీకు కొత్త ఆలోచనలు వచ్చి, సమస్యా పరిష్కారం వైపు అడుగులు పడే అవకాశం మాత్రం ఉంది. కానీ అందుకు వేదిక ఇది కాదు. మీ వ్యక్తిత్వం గురించి, ఆలోచనా సరళి గురించి ఏమాత్రం తెలియని ఇక్కడి వాళ్ళు, మీ సమస్యను ఏ కోణంలో చూస్తూ చర్చించగలరు? కనుక మీరు మీ సమస్య గురించి చర్చంటూ చేస్తే అది మీ ఆప్తమిత్రలతోనే అయ్యుండాలి.

పోనీ మీతో మీ సమస్య గురించి చర్చించే ఆత్మీయులెవరూ లేరనుకుంటే, అప్పుడు ఈ మద్యం దగ్గరకు రావొచ్చు. కాకపోతే, మద్యం తాగాక ఒక పూట వరకూ అయితే మత్తుంటుంది. కానీ అది దిగిపోయాక మళ్లీ మీకు మీ సమస్య గుర్తొస్తుంది. అప్పుడు మళ్ళీ తాగాలి. అలా తాగుతూనే ఉండాలి. ఇవన్నీ కాస్ట్‌లీ వ్యవహారాలు. ఆరోగ్యం, ఆదాయం గుల్లైపోతాయ్. సమస్యకు పరిష్కారం ఎలానూ ఆ మద్యం ఇవ్వలేనప్పుడు, దానికోసం అంత ఖర్చు పెట్టడం ఎందుకు? అనవసరంగా ఆరోగ్యం పాడుచేసుకోవడం ఎందుకు? అందుకే మీకు పెద్దగా ఖర్చులేనివైన పై బ్రాండ్లను సజెస్ట్ చేశాను. పుస్తకాలను చదవడం వల్లా, ఉత్సాహాన్నిచ్చే పాటలను వినడం వల్లా రెండు రకాల లాభాలున్నాయి.

ఒకటి.. పుస్తకం చదువుతున్నంతసేపూ, పాటలు వింటున్నంతసేపూ తాత్కాలికంగా మన సమస్యను మరచిపోవచ్చు
రెండు.. పుస్తకాలు చదవడం వల్ల వచ్చే కొత్త జ్ఞానం, పాటలు వింటున్నప్పుడు కలిగే నూతన స్ఫూర్తి మీ ఆలోచనా విధానాన్ని మార్చడానికి ఉపయోగపడవచ్చు.

వేటూరి గారి “కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు” అనే పాట సురేంద్రబాబు అనే వ్యక్తి IPS ఆఫీసర్ అవడానికి ప్రేరణనిచ్చింది. సీతారామశాస్త్రి గారి “ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి” అనే పాట రాజమౌళికి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారికి కష్టకాలంలో ఊరటనిచ్చింది.

Yandamoori Veerendranath గారి రచనలతో స్ఫూర్తి పొంది, నిరాశాపూరితంగా గడుస్తున్న తన జీవితాన్ని వ్యాపారవేత్త స్థాయికి మలచుకున్న ఓ వ్యక్తి కథ కూడా మనకు చెప్పలేనంత ధైర్యాన్నిస్తుంది. ఆయన తన లారీలన్నింటి వెనుక “జై యండమూరి” అని వ్రాయించుకున్నాడంటేనే ఆయనకు యండమూరి గారి రచనలు ఎంత ప్రేరణనిచ్చాయో తెలుస్తోంది.

మీ ప్రశ్నకు సమాధానంగా నేను జవాబు వ్రాసిన విధానంలో కాసింత సరదా ఉందేమో కానీ, సమస్యతో సతమతమవుతున్న మీ మీద మాత్రం నాకు సాటి మనిషిగా సానుభూతి, మీరు మీ సమస్యనుండి త్వరలోనే బయటపడాలనే ఆకాంక్ష ఉన్నాయి.
స్వస్తి!

పంచంలో సమస్యలున్న సుమారు 795 కోట్లమందిలో ఒకడైనవాడు, కానీ ఎన్నటికీ ధైర్యం కోల్పోనివాడూ, మీ శ్రేయస్సు కోరుకునేవాడు అయిన
మీ
రాజన్ పి.టి.ఎస్.కె.

మనవి: మద్యం తాగడం మంచిదా కాదా? సరదాగా తాగడం తప్పా ఒప్పా? మొదలైన విషయాలు ఇక్కడ నేను చర్చించడం లేదు. సమస్యకు పరిష్కారంగా మద్యం ఏమాత్రం ఉపయోగపడదని మాత్రమే నేను చెబుతున్నాను....
సేకరణ...