అందరి కోసం బ్రతికినా మీకు దక్కిందేమిటి | Stop Living For Others Validation | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fAhTlusnX9g
Transcript:
(00:00) మీరు ఎప్పుడైనా గమనించారా మనం ఎవరినైతే ప్రాణం అనుకుంటామో ఎవరి కోసమైతే మన జీవితాన్ని దారపోస్తామో సరిగ్గా వాళ్లే మనల్ని ప్రాణం తీసే పరిస్థితికి తీసుకొస్తారు. ఇది వినటానికి చేదుగా ఉండొచ్చు కానీ ఇది నిజం మన చుట్టూ ఉన్న మనుషులు మన బంధాలు మనల్ని ఎంతగా గాయపరుస్తాయో ఆ గాయం బయటకు కనిపించదు కానీ లోపల మనల్ని నిలువున దహించేస్తూ ఉంటుంది.
(00:22) మనం పుట్టినప్పటి నుంచి మనకి ఒకటే నేర్పిస్తారు బంధాలు ముఖ్యం ప్రేమ సర్వస్వం అని అవును అది నిజమే కావచ్చు కానీ సమస్య ఎక్కడ మొదలవుతుందో తెలుసా ఎదుటి వారు మనల్ని అర్థం చేసుకోవాలి అని మనం ఆశించినప్పుడు మీరు మీ ఇంట్లో వాళ్ళ కోసం మీ స్నేహితుల కోసం లేదా మీకు నచ్చిన వాళ్ళ కోసం ఎంతో చేస్తారు మీ సుఖాన్ని వదులుకుంటారు.
(00:42) మీ ఇష్టాల్ని చంపేసుకుంటారు. వాళ్ళ సంతోషమే మీ సంతోషం అనుకుంటారు. కానీ ప్రతిఫలంగా మీకు ఏం దక్కుతుంది ఒక చిన్న మాట ఒక చిన్న నిర్లక్ష్యం లేదా అసలు మిమ్మల్ని పట్టించుకోపోవడం అప్పుడు మీ మనసులో కలిగే ఆవేదన వర్ణనా తీరం నేను వాళ్ళ కోసం ఇంత చేస్తే వాళ్ళు నన్ను అలా అంటారా అనే ప్రశ్న మీ నిద్రను కూడా దూరం చేస్తుంది. మీరు అందరి మధ్యలోనే ఉంటారు కానీ మీ లోపల ఒక భయంకరమైన ఒంటరితనం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది.
(01:07) జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక మాట అంటారు. ప్రేమ అంటే మరుగురి మీద ఆధారపడటం కాదు. కానీ మనం ఏమనుకుంటాం ప్రేమించడం అంటే అవతల వాళ్ళ కోసం ఏమైనా చేయడం వాళ్ళని కంటిన్యూస్ గా సాటిస్ఫై చేయడం లేకపోతే వాళ్ళని నవ్వించడం వాళ్ళు బాధలో ఉంటే మనం కూడా బాధపడటం అని చెప్పేసి మనం మన జీవితాన్ని కూడా అలా డిజైన్ చేసుకుంటాం. అంటే మీ జీవితం మీ చేతుల్లో లేదు. వేరే వాళ్ళ మూడు మీద ఆధారపడి ఉంది.
(01:28) వాళ్ళు నవ్వారనుకోండి ఓకే ఇప్పుడు వాళ్ళు బాగనే ఉన్నారు కదా అని చెప్పేసి మీరు ఆనందంగా ఉంటారు. ఒకవేళ వాళ్ళు బాధపడ్డారు అనుకోండి కొంపతీసి నేనేమన్నా బాధ పెట్టానా అని చెప్పేసి మీకు మీరుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. నిజం చెప్పండి ఇక్కడ ప్రేమ ఉందా? ఈ మానసిక బానిసత్వం అనేది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఎవరికీ చెప్పుకోలేక భరించలేక చివరికి అసలు ఈ జీవితం ఎందుకని చెప్పేసి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మీ జీవితంలోకి వచ్చేస్తాయి.
(01:53) చీకటి ఆలోచనల వరకు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాయి. అవును కదా ఒకసారి మీ మనసుని అడగండి. సరే అసలు మనల్ని అంతగా ప్రేమించే వాళ్ళని మనల్ని ఎందుకు అర్థం చేసుకోరు. దీనికి కారణం ఎదుటివాళ్ళు కాదు మనలోని అటాచ్మెంట్ లేదా అతిగా అతుక్కుపోయే తత్వమే. మనం ఒక మనిషిని ప్రేమిస్తున్నాం అంటే ఆ మనిషి మనకు నచ్చినట్లు ఉండాలి అని కోరుకుంటాం. అది ప్రేమ కాదు అది ఒక రకమైన కంట్రోల్.
(02:14) మనం అవతలి వ్యక్తి మీద ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటాం. మా నాన్న ఇలా ఉండాలి. మా ఆవిడ నన్ను ఇలా చూసుకోవాలి. మా స్నేహితుడు నన్ను ఎప్పుడు సపోర్ట్ చేయాలి అని కొన్ని లెక్కలు వేసుకుంటాం. [సంగీతం] ఎప్పుడైతే ఆ మనిషి మీ లెక్కల ప్రకారం ప్రవర్తించాడో అప్పుడు మీకు బాధ కలుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఆ మనిషిని చూసి బాధపడటం లేదు.
(02:33) మీరు ఊహించుకున్న ఆ ఇమేజ్ పగిలిపోయినందుకు బాధపడుతున్నారు. మన సమాజంలో త్యాగం అనే పదానికి చాలా వాల్యూ ఇస్తారు. కానీ ఆ త్యాగం వెనుక ఒక సూక్ష్మైన అహంకారం ఉంటుంది. నేను నీకోసం ఇంత త్యాగం చేశాను కాబట్టి నువ్వు నాకోసం రుణపడి ఉండాలి అనే కోరిక ఉంటుంది. ఎప్పుడైతే అవతలి వ్యక్తి ఆ రుణాన్ని తీర్చాడో అప్పుడు మీకు కోపం వస్తుంది. నిరాశ వస్తుంది.
(02:56) మనం ఇతరుల మీద ఆధారపడటం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. మనకి మనంగా ఉండడం తెలియదు. మనల్ని మనం ప్రేమించుకోవడం చేత కాదు. అందుకే బయట ఎక్కడో ఆ ప్రేమ కోసం గుర్తింపు కోసం వెతుకుతుంటాం. ఆ వెతుకులాటలోనే మనల్ని మనం కోల్పోతున్నాం. అందుకే ఈ బంధాలు భారంగా మారుతున్నాయి. మరి ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలి మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే బంధాలు వదిలేసి అడవులకు వెళ్లాల్సిన అవసరం లేదు.
(03:20) మీరు ఎక్కడికి వెళ్ళినా మీ మనసులు మీతో ఉంటే చాలు. పరిష్కారం బయట లేదు మీ లోపలే ఉంది. మొదటగా మీరు గ్రహించాల్సింది ఏంటంటే మీ సంతోషానికి బాధ్యత కేవలం మీదే. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్లు అవగాహన ఉంటేనే విముక్తి కలుగుతుంది. మీరు మీ ఎమోషనల్ డిపెండెన్స్ ని తగ్గించుకోవాలి. బాధ్యతను నెరవేర్చండి. కానీ ఫలితం ఆశించకండి. మీ ఇంట్లో వాళ్ళకి ఏం చేయాలో అది చేయండి కానీ నేను చేశాను కాబట్టి వాళ్ళు నన్ను పొగడాలి అని కోరుకోమాకండి.
(03:45) ఎప్పుడైతే మీరు ఆశించడం మానేస్తారో అప్పుడు మిమ్మల్ని ఎవ్వరు గాయపరచలేరు. డిటాచ్మెంట్ అంటే ప్రేమ లేకపోవడం కాదు. డిటాచ్ మమెంట్ అంటే ఎదుటి మనిషి ఎలా ఉన్నారో అలా స్వీకరించడం. వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మీ విలువ తగ్గదు అని మీరు నమ్మాలి. మీ మనసు ఒక సముద్రం లాంటిది పైన అలలు ఎగిసి పడవచ్చు. కానీ లోపల మాత్రం ప్రశాంతంగా ఉండాలి.
(04:07) ఆ ప్రశాంతత మీరు ఎవరికీ అమ్మేయకండి. మీరు ఎవరికో ఏదో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీలా ఉండటమే అన్నిటికంటే పెద్ద విజయం. ఇతరుల ప్రవర్తన మీ మనశశాంతిని శాసించకూడదు అనే స్ట్రాంగ్ డిసిషన్ మీరు ఇప్పుడే తీసుకోవాలి. అలా కాకుండా నేను త్యాగం చేస్తున్నాను కాబట్టి వాళ్ళు నాకు నచ్చినట్లు ఉండాలి అంటే అసలు మీరు చేస్తుంది త్యాగం కాదు బ్లాక్ మెయిల్ అందులోనూ మీకు నచ్చినట్లు ఈ ప్రపంచం ఉండాలి.
(04:32) అందులోన అందరితోనే మంచిగా ఉన్నా కూడా అది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు మంచోళ్ళ అయినంత మాత్రాన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచిోళ్ళు అవ్వాలని రోల్ లేదు. ఒకవేళ అందరూ మంచోళ్ళయినా కూడా మీకు నచ్చినట్లు బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. అందులోనూ మీరు అవతలి వాళ్ళ పొగడతల కోసం అందులోనూ అవతలి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఎటువంటి పనులు చేయకండి. ఎందుకంటే వాళ్ళు పొగడకపోయినా వాళ్ళు ఇంప్రెస్ అవ్వకపోయినా మీరు ఎంతో బాధపడుతూ ఉంటారు.
(04:56) అందులో నేను ఎందుకు వాడికి ఇంత చేశాను నేను ఇంత చేసినా కూడా నన్ను పొగట్లేదు అని చెప్పేసి మీలో మీకు తెలియని ఒక గిల్ట్ ఫీలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఎవరికీ ఏ హెల్ప్ చేసినా ఎవరిని ఇష్టపడినా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉండనివ్వండి అందులోనూ మీకు నచ్చినట్లు మీరు ఉండండి. కొన్ని రూల్స్ పెట్టుకొని నేను ఇష్టపడతాను అనుకుంటే మాత్రం దయచేసి అవదల వాళ్ళని ఇష్టపడటం మానేయండి.
(05:18) ఎందుకంటే మీరు ఇష్టపడటం కూడా వాళ్ళకి కష్టంగా ఉంటుంది. అదేదో జైలు శిక్ష విధించినట్లు ఉంటుంది. కాబట్టి ఎవరిని వాళ్ళగా ఇష్టపడటం మొదలు పెట్టండి. నేను ఇష్టపడ్డాను కాబట్టి నాకు నచ్చినట్లుగా ఉండాలి అనుకుంటే మాత్రం అసలు ఇష్టపడవద్దు. దానివల్ల మీరే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది.
(05:36) కానీ ఇకపై మీ జీవితం ఇలా ఉండకూడదు. ఈ క్షణం నుండి మీరు మారాలి. మీ జీవితాన్ని మీరు గౌరవించుకోవాలి. దీనికోసం ఒక చిన్న ప్రాక్టీస్ మొదలు పెట్టండి. ప్రతిరోజు కనీసం 10 నుండి 20 నిమిషాలు కేవలం మీ కోసం మీరు కేటాయించుకోండి. ఆ సమయంలో ఫోన్ వద్దు, మనుషులు వద్దు, ఆలోచనలు కూడా వద్దు. ప్రశాంతంగా కూర్చొని మిమ్మల్ని మీరు గమనించుకోండి. నా సంతోషం వేరే ఒక ప్రవర్తన మీద ఆధారపడి ఉండదు అని మీ మనసుకు పదే పదే చెప్పుకోండి.
(06:00) మీలో మీరు ఒక శక్తిని పెంచుకోవాలి. ఆ శక్తి ఎలా ఉండాలంటే ఎవరైనా మిమ్మల్ని తిట్టినా, పొగిడినా మీ లోపల ఉండే ఆ మౌనం చెదిరిపోకూడదు. ఎందుకంటే తిట్టినా పొగిడినా సరే ఒకేలా రియాక్ట్ అవుతుంటే చూసే వాళ్ళకి ఏంటంటే వీడు దేనికి రియాక్ట్ అవుతాడురా బాబు అని చెప్పేసి ఒక చిన్న పాటి కన్ఫ్యూషన్ మొదలవుతుంది. సో మనల్ని ఎవడు డిస్టర్బ్ చేయలేడు.
(06:20) పొగుడి డిస్టర్బ్ చేయలేడు తిట్టి అసలు డిస్టర్బ్ చేయలేడు. కాబట్టి దేనికైనా ఒకేలాగా రియాక్ట్ అవ్వడం నేర్చుకోండి. జీవితం చాలా చిన్నది. ఎవరో మిమ్మల్ని అర్థం చేసుకోలేదని ఎవరో మిమ్మల్ని తక్కువ చేశారని కుమిలిపోతూ కూర్చుంటే మీకున్న అద్భుతమైన సమయాన్ని వృదా చేస్తున్నట్లే అందులోనూ మీ బంగారు లాంటి భవిష్యత్తుని మీరు చేతులారా నాశనం చేసుకున్నట్లే కాబట్టి అలాంటి పనులు అస్సలు చేయకండి.
(06:43) మీరు మారితే మీ ప్రపంచం మారుతుంది. మీరు ఎప్పుడైతే ఇతరుల నుంచి ఆశించడం మానేస్తారో అప్పుడే మీకున్న నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది. మీ పట్ల మీరు కరుణతో ఉండండి. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఈరోజే ఇప్పుడే మీకంటూ కొన్ని రూల్స్ పెట్టుకోండి. ఆ రూల్స్ ఏంటంటే మీరు అందరినీ ఇష్టపడతారు. కానీ మీరు ఇష్టపడే ప్రతి ఒక్కళళ మీకు నచ్చినట్లు ఉండాలనుకోవటం అస్సలు కాని పని ఎందుకంటే వాళ్ళు మీకు నచ్చినట్లు ఉండరు.
(07:04) ఒకవేళ మీకు నచ్చినట్లు ఉండాలి అంటే వాళ్ళని మీరు ప్రేమతోనే గెలవాలి. అలా కాకుండా గట్టిగా మాట్లాడుతాను పెద్ద పెద్దగా అరుస్తాను అంటే అసలు జరగని పని. కాబట్టి ప్రేమతో గెలవండి పోయేదేముంది. అందులోనూ మిమ్మల్ని ఎవ్వరు తిట్టినా సరే అస్సలు పట్టించుకోకండి. ఎందుకంటే తిట్టిన ప్రతి ఒక్కరిని పట్టించుకుంటూ పోతే మన దేశంలో చాలా మంది మిమ్మల్ని తిట్టడానికి రెడీగా ఉన్నారు.
(07:26) కాబట్టి వాళ్ళందరికీ రియాక్ట్ అవ్వకండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరన్నా పొగిడినా [సంగీతం] సరే ఆ పొగడతలకు కూడా లైట్ గా ఒక స్మైల్ ఇచ్చేయండి అంతే అంతకు మించి ఎక్కువ రియాక్ట్ అవ్వకండి. ఎందుకంటే చాలా మంది పొగడతలకి పడిపోతూ ఉంటారు. పొగడతలకి పడిపోయారు అంటే వాడిని పొగిడి వాడి చేత మనం ఏ పనైనా చేయించుకోవచ్చు. వాడిని పొగిడి మనం వాడిని మ్యానిపులేట్ చేయొచ్చు.
(07:44) కాబట్టి మనల్ని పొగిడి మనిపులేట్ చేసే వాళ్ళు మనల్ని పొగిడి మన చేత పనులు చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి పొగిడిన కూడా పెద్దగా పట్టించుకోమాకండి. అలా పట్టించుకోకుండా ఉంటే నిజంగా మన వాళ్ళు ఎవరు మనల్ని పొగిడి పని చేయించుకునే వాళ్ళు ఎవరు అని చెప్పేసి మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. చూశరా జస్ట్ దేనికి రియాక్ట్ అవ్వకుండా అలా చూస్తూ ఉంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంతేకాకుండా జీవితంలో ఎన్నో ఉడుదులు కూడా చూసి ఉంటారు. ఎన్నో గాయలు తిని ఉంటారు.
(08:08) కానీ గుర్తుంచుకోండి విరిగిపోయిన వస్తువు కంటే విరిగి మళ్ళీ అతుక్కున్న వస్తువులకి ఎక్కువ బలం ఉంటుంది. కాబట్టి గాయపడినంత మాత్రాన మళ్ళీ జీవితంలో రికవర్ అవ్వడం కష్టం అనుకోమాకండి. అలా అని చెప్పేసి మనకేం గాయాలు లేవు కదా అని చెప్పేసి అనుకుంటే మాత్రం మిమ్మల్ని గాయపరిచే వాళ్ళకి మిమ్మల్ని గాయపరచడం పెద్ద విషయం కూడా కాదు.
(08:26) కాబట్టి లైఫ్ లో మెలుకువుగా ఉండండి. ఎక్కువగా దేనికి రియాక్ట్ అవ్వకండి అందులోనూ పొగడతలకి తిట్లకి కాబట్టి ప్రశాంతంగా ఉండండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అందులోనూ ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీ కోసం ఇంకో రెండు అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను వాటిని కూడా చూడండి.
(08:43) ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్
No comments:
Post a Comment