Friday, April 17, 2026

వస్తువులకి బానిసలుగా మారకండి | Stop Being a Slave to Things | Satyagrahi

వస్తువులకి బానిసలుగా మారకండి | Stop Being a Slave to Things | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=II5_GT7ykic



Transcript:
(00:00) ఒక నిమిషం ఆగి ఆలోచించండి మీ ఇంట్లో టీవీ పగిలిపోతే మీరు ఎంతో బాధపడతారు బహుశా ఏడుస్తారు కూడా కానీ అదే పక్కింటి టీవీ పగిలితే మీరు అంతగా బాధపడరు కనీసం మీ కళ్ళలో నీళ్లు కూడా రావు ఎందుకు వస్తువులో ప్రాణం ఉందా లేక మీ ఆలోచనలో ఉందా ఆ టీవీ పగిలినప్పుడు ముక్కలయ్యేది కేవలం గ్లాస్ మాత్రమే కాదు దానికి మీరు తగిలించుకున్న నాది అనే ముద్ర మీరు అనుకోవచ్చు ఇలాంటి మాటలు నేను చాలా విన్నాను అది నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను ఎన్నో రోజులు కష్టపడ్డాను అని కానీ నిజం చెప్పండి మీరు కష్టపడి సంపాదించుకున్నవని అన్నీ మీతో పాటే ఉంటున్నాయా పోనీ మీరు
(00:32) పోయిన తర్వాతే మీతో పాటే వస్తాయా మీరు సంపాదించుకునేది ఖర్చు పెట్టడానికి మీరు సంపాదించుకునేది మీకు తెలిసి తెలియక పోగొట్టుకోవడానికి సో ఖర్చు పెట్టే ప్రాసెస్ లో అవి కొన్ని రోజులు మనతో ఉండొచ్చు లేకపోతే మనకి తెలియకుండానే పోవచ్చు. కాకపోతే అసలు సమస్య ఏంటంటే ఏ మనిషి అయినా సరే వస్తువుల మీదో లేకపోతే వ్యక్తుల మీదో ఇది నాది అని ముద్ర మాత్రమే వేస్తారు.
(00:57) అవి మనతో ఉండాలా పోవాలా అనేది కాలం నిర్ణయిస్తుంది. కాకపోతే ఉన్నప్పుడు ఎలా ఉండాలి పోయినప్పుడు ఎలా ఉండాలి అనేది మన చేతుల్లో ఉంటుంది. సమస్య ఎప్పుడైనా సరే వస్తువుల్లో లేదు. సమస్య వ్యక్తుల్లో కూడా లేదు. అసలు సమస్య మన మైండ్ లో ఉంది. మనం పుట్టినప్పటి నుంచి మనకు నేర్పిన మొదటి పాఠం నా అది నా బొమ్మ నా బట్టలు నా మార్కులు నా ఉద్యోగం నా ఇల్లు ఇలా ప్రతిదానికి నా అనే ముద్ర వేస్తాం.
(01:19) ఎప్పుడైతే ఒక వస్తువు మీద మీరు అతిగా ప్రేమ పెంచుకుంటారో అది డబ్బులు అవ్వచ్చు లేకపోతే కారు అవ్వచ్చు లేకపోతే ఇల్లు అవ్వచ్చు లేకపోతే మీరు ఇష్టపడే మనుషులు అవ్వచ్చు. మీరు ఎప్పుడైతే ప్రేమ పెంచుకుంటారో మీ స్వేచ్ఛ అనేది అక్కడితో అయిపోతుంది. ఎందుకంటే ఆ వస్తువు మీద అయిన మరు క్షణమే దాన్ని కోల్పోతానేమో అనే భయం మీలో మొదలవుతుంది.
(01:42) మీరు గమనించారా మన దగ్గర ఉన్న ఐఫోన్ కింద పడితే గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అది వేరే వాళ్ళ ఐఫోన్ పడితే చూసుకోవాలి కదా మరి అంత వస్తువు అంటే జాగ్రత్త లేకపోతే ఎలాగ అని చెప్పేసి సలహాలు ఇస్తాం. ఇక్కడ ఫోన్ విలువ కంటే ఆ వస్తువులతో మీకున్న అటాచ్మెంట్ మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టిద్ది. మనం ఒక వస్తువుని యజమానిలా వాడుకోవడం లేదు. ఆ వస్తువులకి బానిసలు అయిపోతున్నాం.
(02:02) మీ సంతోషం మీ చేతుల్లో లేదు. మీరు కోరుకునే వస్తువుల మీద మీరు ఇష్టపడే మనుషుల మీద మీ సంతోషం ఆధారపడి ఉంది. వాళ్ళు మీ దగ్గర ఉన్నారనుకోండి నవ్వుతారు. వాళ్ళు మీకు దూరమైపోతే కుంగిపోతారు. అది వస్తువైనా మనిషి అయినా అంటే మీ ప్రశాంతత వేరే వాళ్ళకి తాకడు పెట్టేశారు. ఇది పెద్ద సమస్య. ఈ నాది అనే ఉచ్చులోకి మనం ఎందుకు వెళ్తాం అంటే మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేకపోవడం వల్ల టుబి ఫ్రాంక్ చెప్పాలంటే ఒక మనిషిని నువ్వు ఏం చేస్తుంటావు ఎంత సంపాదించావు ఓహో ఆ ఉద్యోగంలో బాగానే డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళ ఆస్తులను బట్టి వాళ్ళకి
(02:34) మనం గౌరవం ఇవ్వాలా లేదా అని చెప్పేసి చూస్తూ ఉంటాం. కానీ మిగతా వాళ్ళు మాత్రం మనల్ని చూసిన వెంటనే మనకి గౌరవించాలని చెప్పేసి మనలో మనం అనుకుంటూ ఉంటాం. దీనికి మించిన సమస్య ఇంకోటి ఉంటుందా చెప్పండి మనుషులకి అందులోనూ ఇలాంటి మైండ్సెట్ ఉండటం వల్ల మనకి ఇన్సెక్యూరిటీ ఎక్కువైపోతుంది అంటే అభద్రత భావం ఎక్కువైపోతుంది. నా దగ్గర ఈ కారు లేకపోతే సమాజం నన్ను ఏమనుకుంటుందో నా పిల్లలు నా మాట వినకపోతే నా పరువు ఏమవుతుందో ఈ ఆలోచనలే మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.
(02:59) మనం వస్తువులను ప్రేమిస్తున్నాం అనుకుంటాం కానీ నిజానికి ఆ అహంకారం దెబ్బ తింటుందనే భయం మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. స్వామి వివేకానంద గారు ఒక అద్భుతమైన మాట చెప్పేవారు మీరే దేవుడు అని చెప్పేసి మర్చిపోకండి బయట వెతకడం ఆపి నీలోని అనంతమైన శక్తిని నిద్రలేపు అని దీనికి అర్థం ఏంటంటే మీకు కావాల్సిన సంతోషం బయట వస్తువుల్లో లేదు అది మీ లోపలే ఉంది.
(03:20) ఈ సమస్యను అధిగమించడానికి మనం నేర్చుకోవాల్సింది డిటాచ్మెంట్ ఇన్ అటాచ్మెంట్ అంటే బంధంలోనే ఉంటూ నిర్లిప్తతను కలిగి ఉండటం. దీనికి అర్థం వస్తువులను వదిలేసి అడవుల్లోకి వెళ్ళమని కాదు కారులో ప్రయణించండి. మంచి ఇంట్లో ఉండండి. ఖరీదైన దుస్తువులు ధరించండి కానీ అవి ఉన్నా లేకున్నా మీ వ్యక్తిత్వం మారకూడదు.
(03:41) అవి నా అవసరానికి ఉన్నాయి కానీ అవి నేను కాదు అనే క్లారిటీ మీలో ఉండాలి. వస్తువులను వాడుకోవాలి కానీ వాటిని మనసులోకి తీసుకోకూడదు. ఈరోజు మీ దగ్గర ఉన్నా సరే అది రేపు పొద్దున ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది. అది సృష్టి ధర్మం. ఈ నిజాన్ని అంగీకరించిన రోజు మీరు వస్తువుల మీద పట్టు కోల్పోతారు కానీ జీవితం మీద పట్టు సాధిస్తారు. అలా అని చెప్పేసి నేను ఏమంటానంటే గాలిలో దీపం పెట్టేసి వదిలేయమని చెప్పను.
(04:02) మన జాగ్రత్తలో మనం ఉండాలి మనం సంతోషంగా ఉంటూనే ఉండాలి అలా అని చెప్పేసి సడన్ గా ఒక వస్తువు పోతే జీవితాన్ని అక్కడితో ఆపేయకూడదు. సో జాగ్రత్తగా ఉంటూనే మన ఆనందాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనందరం ఒక అతిథుల్లాగా ఈ ప్రపంచంలో జీవించడానికి వచ్చాం. అలాగే ఉందాం. ఒకవేళ అలా కాకుండా నేను చిన్న చిన్న వస్తువుల కోసం బాధపడతాను.
(04:22) భగవంతుడు ఇచ్చిన ఈ అమూల్యమైన జీవితాన్ని పాడు చేసుకుంటాను అంటే ఎవరు మాత్రం ఏం చేస్తారో చెప్పండి. ఈ భూమి మీదకి మనం అతిథుల్లా వచ్చాము అతిథుల్లాగే వెళ్ళిపోదాం. ఈ వీడియో మీకు నచ్చితే కచ్చితంగా లైక్ చేయండి బాయ్

No comments:

Post a Comment