కొత్తపెళ్లికూతురుకు సలహాలు
శ్రీ కళ్యాణవాణి
----------------------
ప్రియాతి ప్రియమైన కళ్యాణికి
నీ మేనత్త ప్రేమతో వ్రాయునది .....
నీ పెళ్లికి వచ్చి ఎన్ని కట్నకానుకలు ఇచ్చినా నాకు తృప్తి కలగడం లేదు. ఇంకా ఏదో ఇవ్వాలనిపిస్తోంది.
ఏమివ్వాలా? అని ఆలోచించాను...
నా అనుభవాన్నంతా సలహాల రూపంలో ఒక ఉత్తరం రాసి ఇస్తే నీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందనిపించింది.
తల్లిలేని పిల్లవి నువ్వు..దాంపత్య జీవితం గూర్చి నీకెంత తెలిసో నాకు తెలియదు.నీ తల్లి ఉండుంటే ఇవ్వన్నీ చెప్పేది.
...నేనిచ్చే ఈ సలహాలు నీకు ఉపయోగపడతాయని భావిస్తున్నాను. వీటిని ఖాళీసమయం దొరికినప్పుడు రోజూ ఒక్కసారన్నా చదువు..
నీ అన్యోన్య దాంపత్యం విషయంలో నా ఈ సలహాల ఉత్తరం ఏమైనా ఉపయోగపడితే నా ఆలోచన ఫలించినట్లే!!
డియర్ కల్యాణి!
ఈ ప్రపంచంలో ఎవరంటే మనకు బాగా ఇష్టం ఉండాలో తెలుసా!
"తనమీద తనకే!"
అప్పుడే మనలో తృప్తి, ఆత్మవిశ్వాసం, ఆనందం ఏర్పడుతాయి. అలా తనమీద తనకి ఇష్టం కలిగేవిధంగా "మన ప్రవర్తన, నడవడిక,మనసిక స్థితి, వ్యక్తిత్వం" అలవర్చుకోవాలి.
ఇందుకోసం మనం నిరంతరం ప్రయత్నించాలి.
అందుకోసమే ఈ సలహాలు.....
ఎక్కడినుండి ప్రారంభించాలి?
దాంపత్యానికి మూలం బెడ్ రూమ్ కాబట్టి అక్కడినుండే ప్రారంభిస్తాను.
1. బెడ్రూమ్ లో మన ప్రవర్తన చాలా ముఖ్యమైనది.
"అన్ని సమస్యలకు మూలం బెడ్రూమ్ లొనే ఉంటుంది"అంటారు పెద్దలు.
ఆ సమయంలో...
ఆవులించడం.. విసుగు..ఉదాసీనత..నిర్లక్ష్యం.. అపరిశుభ్రత.. మొ౹౹ లక్షణాలు అసలే ఉండవద్దు!
సాయంత్రం స్నానం చేసి ఫ్రెష్ గా తయ్యారుకావాలి..రాత్రి కూడా బ్రష్ చేసుకోవడం మంచిది.
బెడ్రూంలో నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే...
(ఎంత వయస్సు వచ్చినా కూడా)
" మొదట్లో కొంచెం సిగ్గు,...ఆసక్తి,..ఇష్టం,.. సంతోషం,..నమ్మకం,... బాధ్యత,.. ప్రేమ,..ప్రతిస్పందన,.. చురుకుదనం,.. సంభాషణాచాతుర్యం,.. తెలివి,..వివేకం,..క్రియేటివిటీ,.. భర్తకు అభద్రతాభావాన్ని కలిగించకపోవడం..సన్నని దరహాసం,.. ఆనుకూల్యత,..నాజూకుతనం,..గడుసుతనం,..తన్మయత్వం,..సరసత్వం,..ఏకాగ్రత,..తననూ-ప్రపంచాన్ని-కాలాన్ని మర్చిపోయేంత అనుభూతి,.. భక్తి,...................చివరగా తృప్తి."
....ఈ 24 లక్షణాలు నీలో ఉండాలి..నీ భర్తకి కనిపించాలి కూడా!
కొంతమంది ఇది తప్పు..పాపం అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు.
అది చాలా పొరపాటు అభిప్రాయం.
"ఇదీ గృహస్థాశ్రమ జీవితంలో శివశక్తుల స్వరూపాన్ని అనుభూతి చేసుకునే ఒక ఆథ్యాత్మిక సాధన."
దేవునిగుడిలోకి ఎలాంటి పవిత్రభావంతో వెళతావో అలాంటి పవిత్రత బెడ్రూంలో కూడా ఉండాలి.
ఒక్కమాటలో చెప్పాలంటే....
ఎన్ని గొడువలూ.. వాదనలు ఉన్నా బెడ్రూంలో ఒక భార్యగా నీ ప్రవర్తన "నేను అన్నీ మర్చిపోయాను సుమా!" అన్నట్లుగా ఉండాలి.
నే చెబుతున్న విషయాలు కొందరికి నచ్చకపోవచ్చు!..కానీ ఈ విషయాలన్నీ ముఖ్యమైనవే కాదు..సత్యమైనవి కూడా!
ఇక బెడ్రూంను స్టోర్ రూంలా చిందరవందరగా ఉంచుకోవద్దు! (ఆ మాటకొస్తే స్టోర్ రూమ్ కూడా అలా ఉంచుకోవద్దు...)
దీని ప్రభావం నీ దాంపత్యంపై పడుతుంది. కాబట్టి మనసుకు హాయి గొలిపేలా వీలైనంత శుభ్రంగా.. ఆకర్షణీయంగా ఉంచుకో!! అనవసర వస్తువులు బెడ్రూమ్ లో అసలే ఉంచవద్దు!
ఇక తెలిసి తెలియక మీరిద్దరూ నీలి చిత్రాలు..వంటి కృత్రిమ,అపవిత్ర పద్ధతుల ద్వారా స్పందన పెంచుకునే ప్రయత్నం ఎన్నడూ చేయవద్దు..ఒకసారి అలాంటి అపవిత్ర విధానానికి అవకాశం ఇస్తే క్రమక్రమంగా దాంపత్యం అపవిత్ర దిశగా వెళ్లడం ప్రారంభమౌతుంది.
ఇక ఈ సలహా విషయంలో పెద్దలు అంటుండగా విన్న ఒక శ్రుతి వాక్యాన్ని ఉటంకిస్తున్నాను.
" ప్రజాతిరమృతమానంద ఇత్యుపస్థే " అని అంటుందట ఒక దగ్గర వేదం.
ఉపస్థం అంటే జననేంద్రియం
దీనివల్ల రెండు ప్రధాన ప్రయోజనాలు..
1. ధర్మ బద్ధమైన సంతానం
2.అమృతమయమైన ఆనందం
ఇదిగో ....ఈ రెండు ప్రధాన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మీ బెడ్రూం దాంపత్యం ఉండాలి.
2.నీ దాంపత్యజీవితంలో ప్రేమపూర్వక మాటలను పెంచుకో!..కోపంతో కూడిన వాదనలను తగ్గించుకో!!
"నిన్ను చేసుకోవడం శుద్ధ వేస్ట్"....
"నన్నసలే పట్టించుకోరు"...
."నాతో మాట్లాడనే మాట్లాడరు"....
"నాతో ఏ విషయాలు చెప్పరు"....
"మీకేది చేతకాదు"...
"అతన్ని చూసి నేర్చుకోండి"...
"నే చెబితే విన్నారా?మంచి బుద్ధొచ్చింది!"....
"మీ వంశమే అంత"...
......ఇలాంటి నెగిటివ్ మాటలు అసలే మాట్లాడవద్దు!
ప్రశ్నలకు ప్రశ్నలనే సమాధానంగా ఎప్పుడూ ఇవ్వొద్దు... ఎందుకంటే "నూటికి 90% గొడవలకు ప్రశ్నలకు ప్రశ్నలనే సమాధానంగా ఇచ్చే మాటతీరే కారణమవుతుంది!"
కావాలంటే నువ్వు గయ్యాలి అని అనుకునే వాళ్ళను గమనించు!..వాళ్ళు ప్రశ్నకు...మరో ప్రశ్ననే సమాధానంగా ఇస్తుంటారు.
ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోవద్దు!
వాస్తవమేదో దాన్నే స్వీకరించు!
నీ వాస్తవపరిస్థితులకు తగ్గట్టు జీవించు!!
డాంభీకాన్ని ప్రదర్శించవద్దు!!!
మరింత అభివృద్ధి సాధించడానికి నీ భర్తకు ధైర్యాన్ని..ప్రోత్సాహాన్ని..ప్రేమను అందించు.
నీ భర్తకు సంబంధించిన వ్యవహారాలలో ఎందులో జోక్యం చేసుకోవాలి?...ఎందులో చేసుకోవద్దు? అన్న విషయాలలో నీ భర్త మానసిక స్థితిని జాగ్రత్తగా గమనించు!
ఇక అనవసరంగా నీ భర్తకు ఉచితసలహాలు ఇవ్వమాకు!...పూర్తి కరెక్ట్ అని నువ్వు భావిస్తేనే సలహా ఇవ్వు!! ఎందుకంటే...
నువ్విచ్చే సలహాలు సరిగ్గా ఉండవు అనే అభిప్రాయం అతనికి దాంపత్య ప్రారంభంలోనే కలిగితే తర్వాత తర్వాత నీతో ఏ విషయాలు అతను చర్చించడు...క్రమంగా జీవితంలో ముఖ్య సంఘటనల్లో నీ ప్రాధాన్యత లేకుండానే జీవితం వెళ్లదీయాల్సి వస్తుంది.
అందుకే మొదట్లోనే ఈ విషయంలో నమ్మకం పోగొట్టుకోకుండా జాగ్రత్తపడి...క్రమక్రమంగా నమ్మకాన్ని పెంచుకోవాలి
3. ఇక కళ్యాణీ !నువ్వు చాలా అందంగా ఉంటావు.
ఈ సమాజంలో ముసుగువేసుకున్న గుంటనక్కలు...తోడేళ్ళు..చొంగకార్చే కుక్కల స్వభావం కలిగిన వారు ఎందరో ఉంటారు.
కాబట్టి అలాంటి వారు నీ అందాన్ని పొగుడుతూనో,...నీ కష్టాలపై సానుభూతిని చూపిస్తూ...లేదా అన్ని రకాలుగా స్నేహం చేద్దామని...చొరవ తీసుకుని ప్రయత్నాలు చేసేవారిని వెంటనే కట్ చేసెయ్యాలి.
అవసరమైతే ఈ విషయంలో మొహమాటం,భయం లేకుండా నీ భర్తకు చెప్పడం మంచిది.
నీ భర్తకు తెలియని ఏ స్నేహాన్ని నువ్వు కొనసాగించవద్దు..దాంపత్యంలో స్వేచ్ఛ కన్నా...నిజాయితీ,నమ్మకం అనేవి చాలా ముఖ్యం.
4. నీ భర్తను/ మీ ఇంట్లో పెద్దవారిని నిర్లక్ష్యం చేసినట్లు కనిపించొద్దు!
వాళ్ళు ఒక్కసారి పిలవగానే రెస్పాన్స్ ఇవ్వడం అలవాటు చేసుకో!
ఈ సందర్భంగా "ఒక్క నిమిషం!".."ప్లీజ్ "...ఇలా అవసరం బట్టి మాటలు ఉపయోగించాలి.
ఇంట్లో గౌరవించదగిన పెద్దలు ( నీ మనసును బట్టి కాదు..ధర్మాన్ని బట్టి) క్రింద కూర్చున్నప్పుడు నువ్వు పైన కూర్చోవడం సంస్కారం కాదు.
అలాగే పెద్దలకు అనుకోకుండా కాళ్ళు తగిలితే వారికి భక్తిపూర్వకంగా నమస్కరించాలి.
వాళ్ళు నీ పట్ల అనుకూలంగా ఉన్నా లేకున్నా నీ ధర్మం నువ్వు నిర్వర్తించాలి.ధర్మ విరుద్ధంగా పెద్దలకు అమర్యాద చేయొద్దు.
మన ధర్మమే మనకూ...ముఖ్యంగా మన పిల్లల విషయంలో రక్షగా నిలుస్తుంది.
5. కళ్యాణీ! భార్యాభర్తల మధ్య దాదాపు ఒక సంవత్సరం పాటు ఆకర్షణ తీవ్రంగా ఉంటుంది... తర్వాత తగ్గుముఖం పడుతూ ఒక శూన్యం లాంటింది ఏర్పడే అవకాశం ఉంటుంది....ఒకవేళ అలాగే చూస్తూ ఉన్నావనుకో! జీవితాంతం అలాగే గడపాల్సివస్తుంది! అలాంటి స్థితి ఏర్పడేముందే నువ్వు జాగ్రత్తపడి ఆ శూన్యాన్ని తొలగించుకోవాలి!!"
ఆ శూన్యాన్ని తొలగించుకోవాలంటే..ఒకరి ఇంట్రెస్ట్ లను ఒకరు తెలుసుకుని వాటిని గౌరవించి...చర్చింటంత జ్ఞానాన్ని కూడా పెంచుకోవాలి!
తన ఇంట్రెస్ట్ లు భాగస్వామికి ఇష్టం లేకపోయినా..లేదా..అర్థం చేసుకునే జ్ఞానం లేకపోయినా...క్రమంగా భాగస్వామితో మాట్లాడడం తగ్గిస్తూ అవే ఇంట్రెస్ట్ లు గల ఇతరులతో మాట్లాడడం చేస్తుంటారు ఎవరైనా......
ప్రతీ వ్యక్తి తాను ఏ ఆసక్తుల వల్ల ఆనందాలను పొందుతున్నాడో వాటినే భాగస్వామితో కలిసి పంచుకోవాలని చూస్తాడు! వాటిని స్వీకరించకుండా తమ అసక్తులను మాత్రమే రుద్దుతూ ఉంటే సంఘర్షణ ప్రారంభమౌతుంది!!
అందుకే నీ భర్త ఇంట్రెస్ట్ లు ఏమిటన్నది స్టడీ చెయ్యు!...వాటిగూర్చి మీ ఆయనతో చర్చింటంత జ్ఞానాన్ని పెంచుకో!...దానివల్ల భార్యాభర్తలు ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉండొచ్చు.
ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉండే ...అంటే మాటల ద్వారా ఒకరితో ఒకరు కాలక్షేపం చేసేలా ఉంటే....
వారి దగ్గరితనం యొక్క తాజాతనం ఎప్పటికీ తగ్గదు.
6.ప్రేమ అనేది ప్రతీ వ్యక్తిలో ఉంటుంది...అది ప్రదర్శించే విధానాల్లో తేడానే సంఘర్షణకు..లోటుకు..అశాంతికి..శూన్యతకు కారణమౌతుంది!
1 st స్టెప్ లో ఒకరి అవసరాలను ఒకరు నెరవేరుస్తూ కేర్ తీసుకోవాలి!!...
2 nd స్టెప్ లో ఒకరి ఆసక్తులను..ఎమోషన్స్ ను.. ఒకరు తెలుసుకుని..గౌరవించి మాట్లాడుకుంటూ ఉండాలి!
దీనివల్ల ఇద్దరిమధ్య అత్యంత దగ్గరితనం పెరుగుతుంది!
ఆ వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉన్న విషయాలైతేనే..ఎంతసేపైనా ఆ వ్యక్తితో మాట్లాడగలము! అలా మాట్లాడడమే.. మనమీద అవతలివ్యక్తికి ఆసక్తిని పెంచుతూ వుంటుంది కూడా!!
3rd స్టెప్ లో ఒకరివిజయాల్లో ఒకరు భాగస్వాములు కావాలి!!
4 th స్టెప్ లో ఒకరి జ్ఞానాన్ని ఒకరు షేర్ చేసుకోవాలి!
5 th స్టెప్ లో సువాసన వెదజల్లే ధవళం ..పూలు కలిసిన దండను భగవంతునికి సమర్పించినట్లు..
పవిత్రంగా జీవించేలా ఒకరికొకరు ప్రేరణ కలిగించుకుంటూ ఆత్మైక్యం చెంది పూర్ణాత్మలో లీనం కావాలి!
ఇదే "సనాతనధర్మంలోని దాంపత్యజీవన ఆదర్శం".
"కానీ..ఈ అన్నింటిలో ముఖ్యమైంది,.. కొంత కష్టసాధ్యమైంది 2nd స్టెపే!!అదొక్కటి సరిగ్గా ఉండేలా చూసుకుంటే చాలు! తర్వాతవి సహజంగానే వస్తాయి"
*
కళ్యాణీ!...
ఇంకా చాలా విషయాలు చెప్పాలనుంది.కానీ
ఇప్పటికే ఉత్తరం చాలా పెద్దదైంది..
నీ విషయం తెలియదు కాని, ఇప్పటి పిల్లలకి పెద్ద మ్యాటర్ చదవడం అలవాటు తప్పిపోయింది.
అందుకే ముగిస్తాను. మళ్ళీ మరో ఉత్తరంలో మరిన్ని సలహాలు రాస్తాను.
ఒక విషయం గుర్తుంచుకో! మీ అమ్మ ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న మంచి గృహిణి. మీ అమ్మ తనసహచర్యంతో మా అన్నయ్య సోమరితనం తొలగించడమే కాక ...అతని ప్రస్తుత అభివృద్ధికి మీ అమ్మే కారణమైంది.
మీ అమ్మనుంచే ఈ విషయాలన్నీ నేను నేర్చుకున్నాను.ఇప్పుడు నీకు చెప్పినవి అందులో కొన్ని మాత్రమే!
ఈ రోజు తాను లేకపోయినా పైనుండి నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటుంది.
నీలో .." గొప్పవ్యక్తిత్వం గల మీ అమ్మను" చూసుకోవాలనే మా ప్రగాఢమైన ఆశ..ఆకాంక్ష.
ఇక ఉంటాను.
నా బంగారు మేనకోడలుకు
శుభాసిస్సులతో...
నీ అత్తమ్మ....
శ్రీవాణి.

No comments:
Post a Comment