Friday, March 13, 2020

కలశాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారంటే...

శ్రీమాత్రే నమః🙏
కలశాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారంటే.. సృష్టికి పూర్వం శ్రీ మహావిష్ణువు పాల సముద్రము మీద శయనించుచున్న తరుణంలో అతని నాభి నుంచి ఒక కలువ పువ్వు ఉద్భవించినది.

దాని మీద కూర్చుని బ్రహ్మ ఉద్భవించాడని పురాణాలు చెప్తున్నాయి. అంతా జలమయమై ఉన్న విశ్వంలో బ్రహ్మ సృష్టి ప్రారంభమైంది. సృష్టికి ముందు విశ్వమంతా జలమయంగానే వున్నదని పురాణాలు చెప్తున్నాయి.

విశ్వం జలమయం కావడం సమస్త జీవులను నీరే ఆధారమనే విషయాన్ని మానవాళి అర్థం చేసుకోవచ్చు. నీరు పూజ్యనీయమైంది. అందుకే ఏ పూజ చేసినా కలశం ఏర్పాటు చేసి.. అందులో పవిత్ర జలంతో నింపుతారు.

కలశానికి పూచే పసుపు కుంకుమలు, మామిడి ఆకులు సౌభాగ్యానికి సంకేతం. కలశములోని నీరు సమస్త విశ్వానికి ప్రతీక. ఇందులో దేవతలుంటారని వారిని ఆహ్వానించే దిశగానే కలశపూజ చేస్తారని విశ్వాసం. ఈ కలశాన్ని పూజించడం ద్వారా సకల దేవతామూర్తులను పూజించడంతో సమానం.🙏

అమ్మ అందరిని చల్లగా చూడు తల్లి🙏

No comments:

Post a Comment