Tuesday, March 17, 2020

నాయనమ్మ ఉవాచ

నాయనమ్మ ఉవాచ

ఒరేయ్ అలా మడి ఆచారాలు, శుచి, శుభ్రత లేకుండా ఏంటిరా ఆ అప్రాచ్యపు పనులు

- చెప్పులు ఇంట్లోకి తీసుకు రాకురా.

- బయటి నుండి రాగానే కాళ్ళు కడుక్కొరా

- స్తానం చేసిన తరువాత మాత్రమే తిను

- బయట తిరిగి వచ్చిన తరువాత స్థానం చేసి , వేరే బట్టలు వేసుకొని ఇంట్లోకి రా

- ఉతకని బట్టలు కట్టు కోవద్దు

- ఏదైనా తినే ముందు చేతులు కడుక్కో

- ఎవర్ని బడితే వాళ్ళని తాకి , వాళ్ళు ఎంగిలి చేసినది నువ్వుతినకు

- శాఖాహారం మాత్రమే తిను

- కుక్కల్ని , పిల్లుల్ని అలా ఒళ్ళో కూర్చో బెట్టుకొని ముద్దుచేయకు

- బయట వండినవి , నిన్న వండినవి తినకు , వేడిగా ఉన్నప్పుడే తిను

- మడి కట్టుకొని వండు , నేను వంట చేస్తు న్నప్పుడు నన్ను ముట్టుకోవద్దు

- పిల్లల్ని నేరుగా ముద్దాడద్దు

- పాత్రలు ఎండలో బోర్లా పెట్టు

- శవాన్ని ముట్టు కోవద్దు , చనిపోయిన వారి కుటుంబ సభ్యులను రెండు వారాలదాకా ముట్టుకోవద్దు,
వారితో తిరగ వద్దు

- ఒకప్పుడు మన ఇళ్ళల్లో పెద్దలు ఇలా అంటే చాదస్తం అని చిరాకు పడే వాళ్ళం.
ఇప్పుడు ప్రపంచం మొత్తం చాదస్తం పాటించవలసిన వస్తుంది.

అదే మన హిందూ థర్మం యొక్క విశిష్టత
🌹👏🏾🌷

No comments:

Post a Comment