Monday, March 2, 2020

గురు బోధ (స్నేహం )

గురు బోధ (స్నేహం )
.....................................................................

ఆత్మ స్వరూపులందరికీ శుబోదయం

ఆత్మ స్వరుపులారా మనందరం దైవ వారసులం .
నీవు ఈ ఫ్రపంచములో ఏవేమిటో చేస్తూవుంటావు ,కానీ చెయ్యవలసినది స్నేహం .ఆ స్నెహం ఎలాంటిదై ఉండాలంటే కల్మషం లేనిదై ఉండాలి .స్వార్ధరహిత స్నేహమై ఉండాలి .కల్మషాలు లేని
స్నేహమై ఉండాలి .ఆ స్నేహం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే స్నేహమై ఉండరాదు .ఒకరి కష్టకాలంలో వున్నప్పుడు ఆ కష్టం తనదిగా భావించే స్నేహమై ఉండాలి .కాని ఈ భౌతిక ప్రపంచములొ అది కరువైనది .

అందరు ఎదో కావాలని ఆసిస్తూ స్నేహం చేస్తుంటారు .అది నిజమైన స్నెహం కాదు .నిజమయిన స్నేహం ఎలాగుంటుందంటే
నిరంతరం వారితో మాట్లాడాలని తనలో దాచుకున్న రహస్యాలను పంచుకోవాలని ,నిరంతరo తన మిత్రుని క్షేమం కోరుకుంటూ , తాను బాదలలో ఉంటె ఉచితరీతి సలహాలు అందిస్తూ ,తాను అడగకుండానే తనమనస్సులోనున్న భాదను గ్రహించగల్గినవారే స్నేహానికి అర్హులు .స్నేహం చేస్తే ఈ విధంగా చేయాలి .అంతేగాని స్నెహం ముసుగులో కాలయాపన చేయరాదు .అది వ్యాపారంగా మారుతుంది .పరిచయాలుగా మారుతాయి .అంతేగాని స్నేహపరిధిలోనికి రాదు. అలాంటి స్నెహం చేయండి .మీకు మనుష్యులలో కుదిరితే స్నెహం చేయండి .లేకుంటే మీతో నిజమయిన స్నెహం చేయడానికి ఆ పరమాత్మ సిద్ధంగా ఉన్నాడు .మీరు ఎప్పుడు తనతో స్నెహం పెంచుకుంటారా , తనతొ ఎప్పుడు మాట్లాడుతారా అని ఎదురు చూస్తున్నాడు .ఒక్క సారి ప్రయత్నం చేయండి .

బౌతిక ప్రపంచంలో మిరు చేసే స్నెహం భగవంతుని చేసే చెలిమిలాగా ఉండాలి .పరీక్షించుకోండి, మీ స్నేహాన్ని .అలాగా కాకపొతే అది మాయ స్నేహం ........

ఆ స్నేహం భార్య భర్తలమధ్య కావొచ్చు ,ప్రియుడు ప్రియురాలిమద్య కావొచ్చు ,ఇద్దరు స్త్రీపురుషుల మధ్య కావొచ్చు ,ఇద్దరు స్త్రీలమధ్య కావొచ్చు ,ఇద్దరు పురుషులమధ్య కావొచ్చు ,ఎవరి మధ్యనున్న స్నేహం పవిత్రంగా ఉండాలి .,నిష్కల్మషం లెనిదై ఉండాలి ,ఇద్దరి మద్య వ్యాపార లావాదేవీలు లెనిధ్య ఉండాలి .అదే స్నెహం అంటే .అలంటి స్నెహం పవిత్రమైనది ............

హరే కృష్ణ

No comments:

Post a Comment