🌴 మానవుడు కోరికలు తీరితే ఆనందం లభిస్తుందని అనుకుంటాడు. నిజానికి కోరికలు ఆరితేనే అసలైన ఆనందం లభిస్తుంది. చదువుకున్నవాడు మంచి మార్క్స్ రావాలని కోరుకుంటాడు. తరువాత మంచి ఉద్యోగం, అటుపై మంచి అమ్మాయి రావాలని, ఆపై పిల్లలు కలుగాలని, జీతం చాలక ప్రమోషన్స్ కావాలని, ఆస్తులు పెంచుకోవాలని... ఇలా చూస్తే మనిషి పుట్టినది మెుదలు గిట్టినంత వరకూ ఆశలకు, కోరికలకు అంతుండదు. ఇవి తీరినా దుఃఖమే, తీరకపోయినా దుఃఖమే!. కోరికలు తీరితే మరోక దానికోసం శోకం, తీరక పోతే దానికోసమే శోకించడం.. ఇదంతా ఓ పెద్ద తలనొప్పి.. అయితే నేడు కోరికలు లేనివారు ఎవరూ లేరు. కానీ వాటికి ఓ పరిమితి పెట్టుకోవాలి. అవసరమైనది భగవంతుని అడగండి. కానీ ఆయన ఏమిచ్చినా దానితో సర్దుబాటు చేసుకోవాలి. ఆయనతో వాదులాటకు, బేరాలకు దిగకూడదు. నిజానికి భగవంతుడు ఇచ్చిన దాని వలన కలిగే సంతృప్తి మరొక దాంట్లో దొరకనే దొరకదు. 🌴
No comments:
Post a Comment