Tuesday, April 7, 2020

అంతా ఆయనిష్టం. మనం నిమిత్తమాతృలం అవ్వాలి.

అంతా ఆయనిష్టం
🕉️🌞🌎🏵🌼🚩

అంతా ఆయనిష్టం. మనం నిమిత్తమాతృలం అవ్వాలి. జీవితంలో మనకి ఏ అభినయము దొరికిందో దాన్ని పూర్తి చేయాలి. శరీరము, మనసు మరియు అహంకారములతో కలిసి ప్రవహించడం వలన దుఃఖము కలుగుతుంది. అంటే మనం శరీరము, మనసు,అహంకారము లతో కూడా నిమిత్తమాత్రంగానే ఉండాలి. ఆ నిమిత్తమాత్రంగా ఉండాలి అనే సూత్రాన్ని, ఈ దుఃఖం అనే పార్శం ని ఎలా పరిష్కరించుకోవాలి?

దీని అర్ధం మీరు నిమిత్తమాతృడు అనే భావదశని పట్టుకోలేకపోయారు. నిమిత్తుడు అవడంలో అర్ధం ఏమిటంటే.....ఓ పరమాత్మ! నీవు దుఃఖాన్ని ఇవ్వాలని అనుకుంటే దుఃఖాన్ని ఇస్తావు. ఆ దుఃఖం మా సౌభాగ్యం. సుఖం ఇవ్వాలి అనుకుంటే సుఖాన్ని ఇస్తావు. మాకు ఎటువంటి ఎంపిక లేదు. మా బిక్షపాత్రలో ఏది పడేస్తావో, దాన్ని కృతజ్ఞతా పూర్వకంగా స్వీకరిస్తాము.

సుఖంలో ప్రతివారూ నిమిత్తునిగా ఉండాలని అనుకుంటారు. సుఖాన్ని స్వీకరిస్తాము. దాన్ని తొలిగించుకోవలసిన అవసరం లేదు. అందుకని కర్తని తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. దుఃఖాన్ని స్వీకరించలేము. అందుకని దాన్ని తొలిగించాలి. తొలిగించడానికి తొలిగించే వాడిని తీసుకురావాలి.

ఏ రోజు మీరు సుఖాన్ని, దుఃఖాన్ని ఒకేలా స్వీకరించడం జరుగుతుందో, ఆ రోజు కర్త విలీనమైపోతాడు. సుఖాన్ని కోరుకోకండి. దుఃఖాన్ని ద్వేషించకండి.

దుఃఖాన్ని మేము అనుభవించాలని అనుకోవడం లేదు అని అనుకుంటున్నది కర్త. నిజానికి మీకు దాని వలన ఎంతో సుఖం లభిస్తుంది. కాబట్టే మీరు నిమిత్త మాత్ర భావనని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ భావన స్వీకరించిన తర్వాత కూడా మనకి సుఖం లభిస్తుంది, దుఃఖం కూడా లభిస్తుంది. కానీ మెల్ల మెల్లగా దుఃఖం దుఃఖంలా ఉండదు, సుఖం సుఖంలా ఉండదు. ఈ సుఖదుఃఖాల ఆవల ఏ స్థితి ఉందో అది "సాక్షీ స్థితి". కర్త నుండి విముక్తుడవు అయినప్పుడు నీవు సాక్షివి అవుతావు.

నిమిత్తమాతృడు అవ్వాలి అంటే ఈశ్వరుడు ఒకడున్నాడు అనే ధారణ ఉండాలి. చేసే వాడివి నీవు అనేది నిమిత్తమాత్రతకి అర్ధం. నేను కేవలము ఒక ఉపకరణాన్ని. కానీ ఒకవేళ మీ శ్రద్ధ ఈశ్వరుని మీద లేదు అనుకోండి, దానికి మీరు ఏమీ కంగారుపడ నవసరం లేదు. మీరు శూన్యంగా ఐపోండి. నేనసలు లేనే లేను అనుకోండి. చాలు. అది ఘటిస్తుంది. భగవంతుడు అనే మాధ్యమము లో భక్తునికి ఏది లభిస్తుందో, అదే ధ్యానం చేసే వానికి శూన్యము అనే మాధ్యమము లో లభిస్తుంది.

మీరెప్పుడూ ధ్యానం అంటే ఏమీ చేయకపోవడం అని, అది ఒక భావ దశ అని, సమర్పణం అనేది ఒక.ద్వారం అని అంటారు. కానీ అనేక యోగసాధనలు కూడా చేయాలని అంటారు. అయితే నాకున్న కష్టం ఏమిటంటే, ఏదీ చేయకుండా, సమర్పణ భావనతో జీవిస్తుంటే నాలో తమోగుణం పెరుగుతోంది. అలా అని అన్ని రకాల సాధనలు చేస్తుంటే అహంకారం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితులలో నాకు మార్గం ఏది?

నీవు సమర్పణా చేయవు, సాధనా చేయవు. నేను సమర్పణ గురించి చెప్తున్నప్పుడు నీవు సాధన గురించి ఆలోచిస్తూ ఉంటావు. నేను సాధన గురించి చెప్తున్నప్పుడు నీవు సమర్పణ గురించి ఆలోచూస్తూ ఉంటావు. అది ఒక నిజాయితీ లేని చిత్త దశ.

ఏదో ఒక దారిని ఎన్నుకోండి. మీకు సమర్పణ బాగుంటుంది అంటే దాన్ని ఎన్నుకోండి. కానీ ఏదీ చేయక్కరలేదు కదా అని మీరు సమర్పణని ఎన్నుకుంటారు. మీరు ఎన్నుకున్నది సమర్పణం కాదు. ఏదీ చేయకుండా ఉండడాన్ని, ఖాళీగా కూర్చుని ఉండడాన్ని. మీరు సోమరితనం ఎన్నుకుందాం అనుకుంటారు. దానికి సమర్పణలో ఒక సాకు వెతుకుతారు. సోమరితనం లో ఎటువంటి పరమాత్మ లభించడు. అందుకని మీకు సమర్పణ చేయడం వలన ఏదీ లభించడం లేదు అని అనిపిస్తుంది. అసలు మీరు సమర్పణ చేయడమే జరగలేదు.

సమర్పణ చేయలేదు కానీ ఆయన లభించాలి అనే ఆకాంక్ష పెట్టుకుని కూర్చుంటారు. అప్పుడు ఏదైనా చేద్దామా అని ఆలోచిస్తారు. అలా చేయాలి అని అనుకోవడం సంకల్పము కాదు, సాధన కాదు. సోమరిగా కూర్చోవడం వలన ఆదరణ పోయి, అహంకారానికి దెబ్బ తగలడం వలన, మెల్లగా అశాంతి జనిస్తుంది. అప్పుడు అహంకారం పైకి లేస్తుంది. ఇప్పుడు నేను ఏమి చేయాలి అనే చింత కలుగుతుంది.

అందుకే రెండింటిలో, సంకల్పం లేదా సమర్పణ, ఏదో ఒకటి ఎంచుకోవాలి. సమర్పణలో అహంకారం అనే ప్రమాదం ఉండదు. సంకల్పం లో సోమరితనం అనే ప్రమాదం ఉండదు.

జీవితంలో సఫలుడు అయిన వాడే త్యాగము చేయగలడు. దేని విషయం లోనైనా అసఫలతని పొండినప్పుడు, ఆ విషయాన్ని త్యాగము చేయకూడదు. అలా చేస్తే అది మీ జీవనశైలి అవుతుంది. అలంటప్పుడు మీరు సఫలురు కాలేరు. అందుకే మీరు ఏదైనా వదలాలి అనుకుంటే, మీరు సఫలరు అయిన తర్వాతే వదలాలి.

🕉️🌞🌎🏵🌼🚩

No comments:

Post a Comment