🌹 మానవ సంబంధాలు పెంపొందించుకోవడం ఎలా (ఆత్మ జ్ఞాని)
🔺మొట్ట మొదటి మానవ సంబంధాలు ఎలా పెట్టుకోకూడదో నేర్చుకుంటే, ఎలాంటి బంధాలు పెట్టుకోకూడదో నేర్చుకుంటే సరైన సంబంధాలు ఏర్పడాతాయి.
🔺 మానవ సంబంధాలు ముఖ్యంగా నాలుగు రకాలు
1. మైత్రి
సుఖంగా ఉండే వాళ్ళు , అంటే డబ్బు ఉన్న వాళ్లు కాదు, ఆస్తి ఉండే వాళ్ళు కాదు. సత్యంతో జీవించేవారు, జ్ణానవంతులు, బాహ్యమైన ఏ కారణం లేకుండా అకారణంగా ప్రతిక్షణం ఆనందంగా ఉండే వాడు. అలాంటి వాళ్ళతో ఎప్పుడు మైత్రి కొనసాగించాలి.
2. కరుణ
ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. అన్నీ ఉంటాయి. కాని చింతిస్తూనే ఉంటాడు. ఇలాంటి వాళ్ళతో మైత్రి అవసరం లేదు. వాళ్ల పట్ల ఎప్పుడూ కరుణ కలిగి ఉండాలి. వాళ్లకి ఓదార్పు ఓదార్పు నివ్వాలి. వాళ్లకి ఎప్పుడు ధైర్యంగా జీవించమని చెప్పాలి.
3. ముదితము .
వీరు ఎప్పుడు ఆనందంగానే ఉండరు. అలాగని దుఃఖంతో ఉండరు. వీళ్లు సామాజిక సేవలో అన్నదానం వస్త్రదానం పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారి పట్ల, మంచి పనులు చేస్తునందుకు అభినందిస్తూ, ప్రోత్సహిస్తూ ఉండాలి. వీళ్ళతో మైత్రి వల్ల మన ఆధ్యాత్మ జీవితం మెరుగు పడదు. వీళ్ళు కరుణ చూపించుకొనే స్థితిలో ఉండరు.
4. ఉపేక్ష
వీరు అందరిని విమర్శిస్తూ, గేలి చేస్తూ, వెనకాల కామెంట్స్ చేస్తూ, ఈర్ష ,అసూయలతో, రగిలిపోతుంటారు. వీరు చెప్పిన వినే స్థితిలో ఉండరు. వీరితో మైత్రి కరుణ. ముద్రితం, అవసరం లేదు. వీరి పట్ల ఉపేక్ష భావన కలిగి (ignore) ఉండాలి. వారిని పూర్తిగా వదిలి వేయాలి
అప్పుడు మాత్రమే అన్ని రకాల సంబంధాలు అద్భుతంగా ఉంటాయి.
🌹 అసలు సంబంధాలు ఎందుకు ఏర్పరచుకోవాలి?
నా ఆనందం కోసమా? వాళ్ళ ఆనందం కోసమా?
మొట్ట మొదటి సంబంధం నాతో నేను ఎలా సంబంధం కలిగి ఉండాలి? అని ఈ క్రింది విధంగా అవగాహన పెంచుకోవాలి
నాకు నేనే గొప్ప మిత్రుడను.
నా చైతన్యమే నాకు ఆప్తమిత్రుడు.
నా అంతర నిశ్శబ్దమే అతి దగ్గర మిత్రుడు.
ఇలా ఉండగలిగినప్పుడు
మానవ సంబంధాలన్నీ సక్రమంగా సరైన విధంగా ఉంటాయి
ధ్యానమే నాకు సరైన మిత్రుడు
నీతో నువ్వు దగ్గరయ్యే కొద్దీ బాహ్యంగా అందరూ దగ్గరగానే ఉంటారు
🌹నీతో నువ్వు దూరం పెంచుకొనే కొద్ది అందరూ దూరంగానే పెంచుకుంటారు
అందుకే ప్రతి రోజూ ధ్యానం చేయండి మీతో మీరు ఉండండి. అప్పుడే అందరూ మీతోనే ఉంటారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂
Reference - whatsapp group
No comments:
Post a Comment