అసలు దొంగలు ఎవరో ఆ పెరుమాళ్ళకెరుక
ఒక బస్సు ఆ బస్సు వనపర్తి నుండి మహబూబ్ నగర్ వెళుతుంది అందులో చాలామంది ప్రయాణికులు ఎక్కారు ఆ బస్సు బయలు దేరుతుంది కండక్టర్ టికెట్లు తీసుకుంటుండు అందర్నీ టికెట్ ఇవ్వాలని కోరుతూ ముందుకు వస్తున్నాడు.
అలా సగం మంది టికెట్లు తీసుకో గా ఒక ఆయన దగ్గరికి వచ్చాడు ఓ పెద్దాయన టికెట్ తీసుకో అని చెప్పాడు
ఆ పెద్దమనిషి తన జేబులు అన్ని తడుముకొని చూసి అరే అరే నా జేబులో ఐదు వందల రూపాయల నోటు ఉండాలి అది ఎక్కడో పడిపోయింది అని ఆ పెద్దమనిషి చెప్పాడు
కండక్టర్ లేదు నువ్వు కచ్చితంగా టికెట్ తీసుకోవాలి లేదంటే నిన్ను ఈ మధ్యలోనే బస్సులో నుంచి దింపి వేయడం జరుగుతుంది అంటూ ఆ పెద్దమనిషిని తిట్టసాగాడు కండక్టర్.
ఆ పెద్దమనిషి అయ్యా నేను ఒక ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను నేను ఈ క్షణాన అక్కడికి వెళ్లకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది నేను కచ్చితంగా నేను వెళ్ళాలి అని కండక్టర్ ని వేడుకుంటూ ఉన్నాడు ఇంతలో ఆ బస్సులోనే ఇంకొక రెండవ పెద్ద మనిషి అయ్యా అతని టికెట్ నేను తీసుకుంటాను అతని తిట్టొద్దు అంటూ రెండవ పెద్ద మనిషి మొదటి పెద్ద మనిషిని టికెట్ తీసుకున్నాడు.
మొదటి పెద్దమనిషి ఆ టికెట్ తీసుకున్న రెండవ పెద్ద మనిషిని చూసి అయ్యా నువ్వు నిజంగా దేవుడవయ్యా అన్ని మొక్కడం మొదలుపెట్టాడు
నాకు ఈ ప్రయాణం ఎంతో ముఖ్యం అందరిలోనూ నువ్వు నాకు టికెట్ తీసుకున్నందుకు నువ్వు దేవుడవయ్యా
అని తను బస్సు దిగి ఇంటికి పోయిన తర్వాత కూడా బస్సులో ఒక పెద్ద మనిషి నాకు టికెట్ తీసుకున్నాడు అంటూ ఇంకా మనసులో ప్రార్థిస్తూ ఉన్నాడు.
ఇలా సాయం చేసినందుకు జీవితాంతం ఆ పెద్దమనిషిని మరవకుండా కొలవడం ఈ పెద్దమనిషి పని అయింది.
అయితే తన దగ్గర ఉన్న 500 రూపాయలు ఎక్కడో పడిపోయి అనుకున్నాడు మొదటి పెద్దమనిషి
కానీ రెండో పెద్ద మనిషే ఇతని 500 రూపాయలను దొంగలించింది ఇతగాడే....
ఐదు వందల రూపాయలు దొంగలించి 5 రూపాయల బస్సు టికెట్ తీసుకుని దేవుడవయ్యా అనిపించుకున్నాడు
ఆ రెండవ దొంగ పెద్దమనిషి.
రాజకీయాలలో ఉన్న పెద్ద మనుషులు అందరూ తమ సొంత కష్టార్జితం సంపాదించి తమ ఇంట్లో నుంచి ఇస్తున్నట్టుగా, మీకోసం అది చేశాం, ఇది చేశాం, ఇంకా ఏదో ఏదో చేస్తాం, నా జీవితం
ప్రజాసేవకే అంకితం అంటూ తీయని మాటలతో మన కడుపు నింపుతున్నారు.
మన దగ్గర నుండి పన్నుల రూపం లో వసూలు చేసిన డబ్బు వారికి కావలసినంత దాచుకున్నకా మిగిలిన ఏంగిలి మెతుకులు ప్రజల కు విదిలించి మీకోసం మా సర్వసం ధారపోస్తున్నం
అన్నట్లుగా నటిస్తున్నారు.
మంచివారు గా, పెద్ద మనసులో గా, గౌరవనీయులు గా సమాజాన్ని శాసిస్తూ అందరి అభిమానాన్ని పొందుతూ,
దేవుని కంటే ఎక్కువగా
గౌరవించ బడుతున్నారు.
మరి అసలు దొంగలు ఎవరో ఆ పెరుమాళ్ళకెరుక.

No comments:
Post a Comment