Sunday, January 31, 2021

అమ్మ నాదా??నీదా

అమ్మ నాదా??నీదా??🤱

రాజమ్మ ఒక తోటలో కూలీ చేసే యువతి... తండ్రి ఆలస్యంతో పెళ్ళి కూడా ఆలస్యంగా జరిగింది .. భర్త రంగయ్య పచ్చి తిరుగుబోతు... కష్టాలు పెరిగిపోయాయి రాజమ్మకి..ఏదో కూలీ పనిలో వచ్చిన డబ్బుతో సంసారం నడుపుకొంటున్నది.. అలా కాలం గడుస్తుంది.. ఇంతలో రాజమ్మ జీవితంలోకి అడుగుపెట్టారు నలుగురు కొడుకులు... సంతానం చూసి మురిసిపోయింది రాజమ్మ.కొడుకులు ప్రయోజకులై తనని ఉద్దరిస్తారని ఆశ రాజమ్మలో రోజురోజుకు పెరిగిపోతుంది..కాలగమనంలో సంతానను ప్రేమగా,ఏ లోటు లేకుండా చూసుకుంటుంది..

పిల్లలు పెరిగారు.. ప్రయోజకులయ్యారు...అందరికి పెళ్ళి చేసింది.. కోడళ్ళు సంసార బాధ్యతగా అత్తగారింటికి వచ్చారు.. కాలం గడిచిపోతూ ఉంది.. రంగయ్య మంచాన పడ్డాడు.. పక్షవాతం.. చిన్న ఇంటిలో సంసారం కష్టం ఐనది..ఉమ్మడి కుటుంబం ముక్కలైంది.. రంగయ్య బాధ్యత ఎవరికీ పట్టలేదు..రాజమ్మ మళ్ళీ కూలీ పనికి వెళ్లడం మొదలైంది..

రంగయ్య చనిపోయాడు... రాజమ్మ ఒంటరైంది..వేర్వేరు సంసారాలలో కొడుకులు రాజభోగాలుఅనుభవిస్తున్నారు..రాజమ్మ గోడు ఎవరికీ పట్టదు..కాయ కష్టంతోతనకడుపునింపుకుంటుంది..

చిన్నప్పుడు అమ్మ నాకు రా ..."అమ్మ నాది రా... "అని గొడవ పడ్డ చిన్నారి కొడుకుల అల్లరి మాటలు రాజమ్మను తడుముతున్నాయి.... అనుకోకుండా రాజమ్మ కళ్ళలో నీటి సుడులు తిరుగుతున్నాయి.. రాజమ్మ వయసు పైబడిన తరువాత కొడుకులని పిలిచి "నన్ను చూసుకోండిరా "అని అడిగింది .. కొడుకుల నుండి ఎలాంటి పిలుపులేదు.. !!!!

కాలంతో పోరాటం చేస్తూ రాజమ్మ ఇంకా బ్రతుకు మీద ఆశతో జీవితాన్నిగడుపుతుంది... ఆమె జీవితానికి దేవుడే దిక్కు అని అనుకుంటూ, కాలంచెల్లే రోజుల కోసం ఎదురుచూస్తోంది..

చివరిగా ఒక్కమాట ఎవరు ఎవరికీ శాశ్వతం కాదు.. కాని అమ్మలేని జీవితం లేదు.. అమ్మ ఒకవేళ చిన్న వయసులో మనల్ని వదిలేసి ఉంటే,,,,,,ఈ సంసారం,సంస్కారం మనకు ఉండేవా???
ఆమె దైవం!!.. ఆమె మన బాధ్యత!! జాగ్రత్తగా చూసుకుందాం..

సమాజాన్ని మేల్కొలపడం కోసం ఒక చిన్న ప్రయత్నం.."ఇది కథ కాదు"..
✍🏻నీరజ వాకా

Source - Whatsapp Message

పుష్పక విమానం

పుష్పక_విమానం

భారతీయ పురాణాలలో ప్రస్తావించబడ్డ గాలిలో ఎగరగలిగే ఒక వాహనం. ఎంతమంది ఇందులో కూర్చున్నా మరొకరికి చోటు ఉండటం దీని విశేషం.రామాయణంలో పుష్పక విమానం గురించిన వర్ణన ఉంది. యుద్ధానంతరం సీతతో కూడి సకాలంలో అయోధ్య చేరడానికి రాముడు దీనిని ఉపయోగించాడు. సుందర కాండ ఎనిమిదవ, తొమ్మిదవ సర్గలలో పుష్పక విమానం విపులంగా వర్ణించబడింది. సీతాన్వేషణా సమయంలో హనుమంతుడు పుష్పక విమానాన్ని చూశాడు. నిజానికి ఇది బ్రహ్మ దేవుడి కోసం విశ్వకర్మ సర్వవిధ రత్నములతో 'పుష్పకం' అనే పేరుగల ఒక దివ్య విమానాన్ని స్వయంగా నిర్మించాడట. ఐతే కుబేరుడు తీవ్రమైన తపస్సు చేసి, బ్రహ్మను మెప్పించి ఆ విమానాన్ని బ్రహ్మ అనుగ్రహముతో కానుకగా పొందాడట. పిమ్మట రావణుడు, తన సోదరుడైన కుబేరుని జయించి ఆ పుష్పక విమానాన్ని తన స్వంతం చేసుకున్నాడట.

ఇంతకీ ఆవిమానంలో మనం ఉహించినట్టుగా కేవలం ఆసనాలు మాత్రమే ఉండవు. ఎందుకంటే మన హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు, రావణుడు కానుకగా పొందిన పుష్పకము లోపల చూడగానే సాక్షాత్తు స్వర్గలోకమే అవతరించిందా? అన్న భ్రాంతి కలిగిందట. ఇక ఆ పుష్పకము యజమాని మనసు ననుసరించి మనో వేగముతో పయనిస్తుందట. అసలు శత్రువులకు దొరికే పరిస్థితి ఎప్పుడూ ఉండదుట. అంతే కాదు ఆ విమానానికి బయట లోపలివైపున విశిష్టమైన శిల్ప రీతులు గోచరిస్తాయట. కర్ణ కుండలాలతో శోభిస్తున్న ముఖములుగల వారు, మహా కాయులు, ఆకాశంలో విహరించే రాక్షసులు తమ ప్రభువుకు అనుకూలంగా ప్రవర్తించే వారు, విశాల నేత్రములు గల వారు, అతి వేగముగా సంచరించ గల వేలాది భూతగణాల వారు ఆ విమానాన్ని మోస్తున్నట్టుగా దాని వెలుపలి భాగంలో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అదంతా చూసిన హనుమ ఈ విమానం రావణుడి స్థాయికి తగినట్టు దర్పంగా ఉంది అనుకున్నాడట. ఇంకా చెప్పాలంటే మెరుపు తీగల్లాంటి నారీ మణులు ఎందరెందరో ఆ విమానంలో ఉండటమే గాక అనేక సుందర దృశ్యాలు చిత్రీకరించ బడి ఉన్నాయట. వాటిలో అవి భూమి మీద పర్వత పంక్తులా? అన్నట్టుగా చిత్రించిన చిత్రాలు ఆ పర్వతాల మీద వృక్ష సమూహములు పుష్పాలు వాటి కేసరములు, పత్రములు స్పష్టముగా చిత్రీకరించబడి ఉన్నాయట.

Source - Whatsapp Message

పిల్లలుగానీ,పెద్దలుగానీ తమ తప్పు తెలుసుకుని,ఆతప్పును సరిదిద్దుకొని,మళ్లీ చెయ్యకుండా ఉంటే వారి జీవితం బంగారు బాటవుతుంది.

సుజాత ,గోవిందరావుల ఏకైక కూతురు సరళ.ఆరవ తరగతి చదువుతోంది.ఙ్ఞాపక
శక్తి తక్కువ.చదువు లో కొంచెం వెనుకబడి
ఉండేది.బాగా చదవమని,మంచిమార్కులు రావాలని తల్లిదండ్రులు ఒత్తిడిచేసేవారు. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని తిట్టారు.కొట్టారు.
ఇకముందు మార్కులు తక్కువొస్తే వీపు
చీరేస్తామని బెదిరించారు.అలా దండించటం
వల్ల బాగా చదివి,గుర్తుంచుకుంటుందని భావించారు.సరళకు తల్లిదండ్రులంటే,
పరీక్షలంటే భయం పట్టుకుంది.
ఆరునెలల పరీక్షలు పూర్తయ్యాయి.
విద్యార్థులకు ప్రగతి పత్రాలిచ్చారు.తల్లి
దండ్రులకు చూపించి సంతకం చేయించుకుని రమ్మన్నారు.తక్కువ మార్కు
లు రావటంతో సరళ వణికిపోయింది.
అమ్మ,నాన్న కొడతారని భయపడింది.
ఆలోచిస్తే ఓ ఆలోచన తట్టింది.ప్రగతిపత్రం
లోని మార్కులను ఎక్కువ మార్కులుగా జాగ్రత్తగా సరిదిద్దింది. ఇంట్లోచూపించింది. సంతృప్తిగా సంతకం చేశాడు గోవిందరావు.
ప్రగతి పత్రం తెచ్చి తరగతి టీచర్ కిచ్చింది.
మార్కులు విద్యార్థుల ప్రగతి పుస్తకంలో
నమోదు చేసుకున్నారని సరళకు తెలియదు
మార్కులు దిద్దినవిషయం ఉపాధ్యాయురాలు గుర్తించింది.చాలా పెద్ద
తప్పు చేశావని సరళను దండించింది.సరళ
మార్కులు దిద్దిన విషయం చెప్పాలని
తల్లిదండ్రులను పిల్చుకు రమ్మంది.రెండు
దినాలైనా తల్లిదండ్రులను పిల్చుకురాలేదు.
మూడవరోజు తల్లిదండ్రులను తీసుకురమ్మ
ని సరళను పాఠశాలనుండి బయటకు
పంపింది టీచర్.
పాఠశాలబయట నిల్చుండిపోయింది సరళ.
ఇంటికెళ్ళి విషయం చెబితే వాతలుతేలేలా
తంతారు.ఇంటికెళ్ళటం కుదరదు.
పాఠశాలలోకెళ్ళటానికీ వీల్లేదు.
ఏంచేయాలో,ఎక్కడికెళ్ళాలో అర్థంకాలేదు.
వెక్కివెక్కి ఏడుస్తూ వుండిపోయింది.
ఆలోచనలు రకరకాలుగా పరుగెడుతున్నాయి.పెద్ద తప్పుచేశానని
కుమిలిపోతూవుంది.
ఓవ్యక్తి కారు దిగిస్కూలువైపు వస్తూ కనిపిం
చాడు.ఆయనను చూడగానే సరళకు ఓ
ఆలోచన వచ్చింది.ఏపరిచయం లేకున్నా
ఆయనను "అంకుల్...అంకుల్..."అని
పిలిచింది.ఆయన ఆ పాప వైపు చూసి "ఏమ్మా!ఎవరునువ్వు?ఎందుకేడుస్తున్నా
వు?"అని అడిగారు.
ఏడుస్తూనే జరిగిన విషయం ఆయనతో
చెప్పి"మార్కులు దిద్ది తప్పుచేశానంకుల్!
ఎప్పుడూ అలాంటి తప్పుచేయను.
మా అమ్మ,నాన్నలకి తెలిస్తే కొడతారు.
మీరు నాకు అంకుల్ అవుతారని,నాన్న
పంపారని టీచర్ తో చెప్పండి.ఇంకెప్పుడూ
అలాంటిపని చేయనని తరగతిలో చేర్చు
కోమనిచెప్పండి."అని వెక్కివెక్కి ఏడ్వసాగింది.
"చూడమ్మా!నువ్వు మార్కులు దిద్దడం
తప్పు.అదీగాక ఇప్పుడు నేను మీ అంకుల్
నని,మీ నాన్న పంపించాడని అబద్దమాడటం ఇంకా పెద్ద తప్పు.మీ టీచర్
తో నేను చెబుతానురా!"అంటూ ఆయన
సరళచేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళా
డు.
ఫోన్ చేసి గోవిందరావును పిలిపించారు.
ఉపాధ్యాయులు ఆగది దగ్గరకు చేరుకున్నారు.ఆయన జరిగిన విషయం
గోవిందరావుకు వివరించి "పాప తాను చేసి
న తప్పు తెలుసుకుంది.ఎప్పుడూ ఇలాంటి
పనులు చేయనని బాధపడుతోంది.ఇలా
జరగటానికి కారణం మార్కులు తగ్గితే
మీరు దండిస్తారనే భయం.తన్నటం,తిట్ట
డం వల్ల బాగా చదివి గుర్తుపెట్టుకుంటార
నుకోవటం పొరపాటు.మంచి మాటలద్వా
రా,ప్రశంసించటం ద్వారా,బహుమతులద్వా
రా చదివేలా చేయవచ్చు.ఙ్ఞాపకముండటా
నికి అవలంభించాల్సిన పద్దతులను అనుసరించాలి.టీచర్లు వ్యక్తిగత బోధన
చేయాలి.ఉపాధ్యాయులు తయారుచేసిన
,విద్యార్థులు తయారుచేసిన అభ్యసన సామాగ్రి బోధనలో బాగా ఉపయోగించాలి.
క్రమంగా వారి అభ్యసనలో మార్పుతేవాలి.
కొట్టడం,తిట్టడం వల్ల పిల్లల్లో మార్పు రాకపోగా ,వాళ్ళ ఆలోచనలు పెడదారి పట్టే
అవకాశముంది.పారిపోవటం లాంటి సంఘ
టనలు జరుగుతాయి."అంటూ వివరించారు
గోవిందరావుకు తన పొరపాటు అర్ధమయింది."క్షమించండి!మీరు చెప్పింది
అక్షరాలా నిజం.నా కళ్ళు తెరిపించారు.
ఇంతకీ మీరేం చేస్తుంటారు"అన్నాడు.
"నేను ఈమండలానికి కొత్తగా వచ్చిన
విద్యాధికారిని.పాఠశాల సందర్శనకు వచ్చాను."చెప్పారాయన.
"క్షమించండి నాన్న!ఇంకెప్పుడూ తప్పులు
చేయను"అంది సరళ.
విద్యాధికారి నవ్వి"తప్పు చెయ్యడం ఒక
తప్పయితే, ఆతప్పును కప్పి పుచ్చుకోవడా
నికి మరో తప్పు చెయ్యడం పెద్ద తప్పు.
తప్పులమీద తప్పులు చేస్తూపోతే జీవితం
వ్యర్థమవుతుంది.ఫలితంగా జీవితంలో
ఎందుకూ పనికిరాకుండా పోతారు.అలాగని
తప్పుచెయ్యని వారు ఉండరు.పిల్లలుగానీ,
పెద్దలుగానీ తమ తప్పు తెలుసుకుని,
ఆతప్పును సరిదిద్దుకొని,మళ్లీ చెయ్యకుండా
ఉంటే వారి జీవితం బంగారు బాటవుతుంది."అన్నాడు.
గోవిందరావు ఆయనకు నమస్కరించి
వెళ్ళిపోయాడు.
✍🏻చదువులబాబు

Source - Whatsapp Message

అనుభవాల దొంతరలే జీవితం...

అనుభవాల దొంతరలే జీవితం...

🌸 మానవ జీవితం బావావేశాల భరితం... ఒకో బావావేశ0 ఒకో అనుభవాన్ని గుర్తు చేస్తూ తాను జీవిత మణిహారంలో ఒక మణిని అని చెబుతుంది.. కానీ బావావేశాన్ని ఎప్పుడైతే గమనిస్తామో అది గతఅనుభవం నుండి వచ్చి0ది అనేది మనకు అర్ధమౌతుంది... బావావేశం ఎప్పుడైతే మనలో నుండి బయటకు వస్తుందో అక్కడ ఎరుకతో ఉంటే చాలా సవాళ్లు రానే రావు... కానీ సంసారా జీవితంలో బావావేశాల పంట త్వరగా పండి మనల్ని చక్కనైన మేలిమి బంగారంలా మారుస్తాయి... కారణం మనం మన జీవితాన్ని అనుభవాల పొందికతో నిర్మించుకున్నాం కాబట్టి... అనుభవాలు మన మది అనే ఫ్రిడ్జ్ లో దాచుకొని అవసరమైనప్పుడు తీసి వాడుకోవడం ఓ అలవాటుగా మారింది కాబట్టి దీనినే పోగేసుకోవడం అనుకుంటే... మనం మన తదుపరి తరానికి ఏమి అందించాలి అనుకుంటే మన దగ్గర ఉన్నది మినహా ఏమి అందించలేము అనేది వాస్తవం...

🌸 ఎప్పుడు మనం మన జీవితం కన్నా ఉన్నతమైన జీవితాన్ని పిల్లలకు అందించాలి అనే తపన మనలో కలిగుతుందో దానికోసం నేర్చుకోవాలి ఖచ్చితంగా మనం నిర్ణయించుకుంటాం.. ఇదంతా ఒక చెక్రం లాంటిది కానీ నేర్చుకువడం అనేది మనకు జ్ఞానం అందించే ఆయుధం... ఎక్కడ నేర్చుకోవాలి అనే భావన ఉంటుందో అక్కడ మన జివిత సవాళ్ల కన్నా పెద్ద సవాళ్లు ఎదురువుతాయి... అక్కడ మనల్ని మనం నిర్మించుతుంటాం... పడగోడుతుంటం...
సరిచేసుకుంటం...
తిరిగి నిర్మించుకుంటాం... ఇక్కడ మనకు మనమే గురువులం..
మనమే శిష్యులం...
మనమే అన్వేషకులం...
మనమే అన్ని... ఇక్కడ కొలత పరిమితి ఏమి ఉండవు ఉన్నదేళ్ల నిర్మిచటం మన జీవితాన్ని మనమే పునర్నిర్మాణం చేయటమే నిత్యం... అప్పుడు మన తరువాత తరానికి ఇచ్చే స్ఫూర్తి ఒకటే మనల్ని మనమే నిర్మించుకుంటు ఉంటే జ్ఞానం అనేది పుస్తకాలనుండే కాకుండా జీవితం నుంచి ఎక్కువగా నేర్చుకుంటాము అని.. అది చాలా మందికి రుచించక పోవచ్చు... కాని ఈ దారిలో తరువాతి తరం ఖచ్చితంగా విజేతగా నిలుస్తుంది అనేది కూడా ఖచ్చితo... మనం ఆనందం కోసం పోరాటం చేస్తుంటే వారు దానికే ప్రాధాన్యత ఇస్తారు... ఆనందం అనేది పునాదిగా చేసుకొని ప్రయత్నం చేస్తే మాత్రం అక్కడ విజేత కాకుండా ఆపేది ఎవ్వరు ఉండరు... ఇది వారసత్వంగా అందిస్తే...

🌸 జీవితపు ముఖచిత్రం సమూలంగా మారిపోతుంది అనేది అంతే వాస్తవం.. కారణం మనం ఉన్నతమైన స్తితి అనేది ఏదైతే ఉందొ దానికోసం ప్రయాణం... కానీ మన పిల్లలు ఉన్న స్థితే ఉన్నతమైన స్థితిగా మార్చుకోవడం మనం దర్శిస్తా0.. ఇక్కడ జీవితాన్ని మనం ఎలా దర్శించిన అది లీలాగానే చివరకు తెలుస్తుంది వారికి ఆనందం పునాది అయినప్పుడు జీవితాన్ని లీలగా కాకుండా ఇంకొల ఎలా చూస్తారు అని అనుకుంటాం...
జీవితం ఉన్నది జీవించడానికి..
అది ఎలా అనేది వారి ఇష్టానికి వదిలే ఉన్నతస్థితి మనకు వస్తుంది... ఇది కూడా మన ఎదుగుదల కొరకే... ఇక్కడ ఉన్నత స్తితి అనేది మనం నిర్ణయంచుకోవాలి మినహా ఎవరు చెప్పిన అది వారి ఉన్నతికే... అంటే మనం చెప్పాలి అంటే మన ఉన్నతికే అనేది కూడా అంతే స్పష్టం... అంటే నేర్చుకున్న లేదా నేర్పిన అది మన ఉన్నతికే...

మనకోసం చేసే ఆలోచనలో స్వస్తితి... విశ్వం కోసం ఆలోచిస్తే స్వస్థితే విశ్వస్తితి అనేది అవగతమవ్వటమే ఉన్నతస్థితి...

సాధనతో సమకూరు ధరలోన...

ఇది ఇప్పటికే...

Thank you...🌸🌸🌸

Source - Whatsapp Message

చెప్పుడు మాటలు తెచ్చే తగవులే ఎక్కువ వుంటాయి...

మనిషికి... మనిషి... నచ్చుతాడేమో గాని

మనిషి...... మేధావితనం నచ్చదు

ఎందుకంటే..... ఎవరికివారు...

తమను గొప్పవారుగా అనుకుంటారు....

నిజమే....

మాటలు నమ్మేవారికి...,
అబద్దాలు సులువుగా చెప్పి నమ్మించొచ్చు ....,

మనిషిని నమ్మేవారికి,

అబద్దాలు చెప్పి నమ్మించడం కష్టమే.....


ఒక వ్యక్తి ఎదురుగా మాట్లాడితే,

మనసు విప్పి మాట్లాడినట్లు......

ఆ మనిషి లేకుండా మాట్లాడితే,

చాడీలు చెప్పినట్లు.....

మనిషికి మనిషికి మధ్య ఆస్తి తగవులకంటే,

చెప్పుడు మాటలు తెచ్చే తగవులే ఎక్కువ వుంటాయి......

మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం,

ఆ వ్యక్తిత్వ విలువ,
మన జీవన విధానాన్ని మార్చేస్తుంది.....,

అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే....,

సర్వస్వం కోల్పోయినట్లే......



Source - Whatsapp Message

మన హృదయమే దేవాలయము అవుతుంది...

🌻🌻🌻🌻🌻
దేవుని పాదాలపై పూలు పెట్టేందుకు గుడికి వెళ్ళకు,
ముందుగా నీ ఇంటిని ,మనసుని దయ, ప్రేమ, వాత్సల్యాల పరిమళాలతో నింపు......

దేవుని ముందుదీపాలు వెలిగించేందుకు గుడికి వెళ్ళకు,ముందుగా పాపం, గర్వం, అహంభావాల చీకటిని నీ హృదయం నుండి తొలగించుకో....

తల వంచి ప్రార్థించేందుకు గుడికి వెళ్ళకు,
ముందుగా నీ తోటి వారి ముందు వినయంగా
ఉండడం నేర్చుకో,....

మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థించేందుకు గుడికి వెళ్ళకు,...నువ్వు అన్యాయము చేసిన వారికి క్షమాపణ చెప్పుకో....

నీవు చేసిన పాపాలకు క్షమించమనిఅడిగేందుకు గుడికి వెళ్ళకు,ముందుగా నిన్ను గాయపరిచిన వారిని హృదయ పూర్వకంగా క్షమించధము నేర్చుకో....

అప్పుడ
మన హృదయమే దేవాలయము అవుతుంది..ఆ దేవుడు నీలోనే కొలువై నీకు ఏమి ,ఎప్పుడు ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు.
🌻🌻🌻🌻🌻

Source - Whatsapp Message

ఫ్లయింగ్‌ సీక్రెట్స్

🛬ఫ్లయింగ్‌ సీక్రెట్స్‌!🛫
------------------------
విమానం టైర్లు పేలితే.. గాల్లో ఉండగానే ఇంధనం అయిపోతే..
‘విమాన ప్రయాణం క్షేమమేనా?’, ‘అనుకోని పరిస్థితుల్లో కిటికీ అద్దాలు పగిలిపోతే?, ‘విమానం టైర్లు పేలితే ఎలా?’... తరచూ ఇలాంటి ప్రశ్నలు అడుగు తుంటారు పిల్లలు. ఏదో ఓ సందర్భంలో పెద్దలకూ వచ్చే అనుమానాలే ఇవి. ‘101 ఫ్లయింగ్‌ సీక్రెట్స్‌’ అనే ఆంగ్ల పుస్తకంలో ఆ ప్రశ్నలకు సవివరమైన, శాస్ర్తీయమైన సమాధానాలు ఇచ్చారు రాకేష్‌ ధన్నారపు. ఈ హైదరాబాద్‌ యువకుడు... ఆస్ట్రేలియాలోని రాయల్‌ మెల్‌బోర్న్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చదువుకున్నాడు. విమానాలపై అధ్యయనాలు చేశాడు. ‘ఫోను, వాషింగ్‌ మెషిన్‌, ఎయిర్‌ కండిషనర్‌, వాచీ.. ఏది కొన్నా వినియోగదారుడికి ఓ మాన్యువల్‌ ఉంటుంది. విమాన ప్రయాణికుడికి మాత్రం ఎందుకు లేదు?’ అన్న ఆలోచనే అతడిని పుస్తక రచనకు పురిగొల్పింది. అందులోని విశేషాలు సంక్షిప్తంగా..
ఇంధనం అయిపోతే?
కారులో హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌కు బయల్దేరితే, దార్లో అవసరమైనంత పెట్రోలు పోయించుకుంటాం. ఒకవేళ మధ్యలోనే ఇంధనం అయిపోతే, బంకులో ట్యాంకు నింపుకుంటాం. ఆకాశంలో ఆ ఛాన్స్‌ ఉండదు. అందుకే విమానం ఓ ఐదొందల కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటే... ఆరొందల కిలోమీటర్లకు సరిపడా ఇంధనాన్ని నింపుతారు. వాతావరణం అనుకూలించకపోతే... ఆ విమానం సమీపంలోని మరో ఎయిర్‌పోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి ఉపద్రవాలన్నీ ముందే ఊహించి.. అదనపు ఇంధనాన్ని నింపుతారు. అయినా ఇబ్బంది అయితే, ‘మాండిటరీ ప్యూయల్‌’ ఉంటుంది. ఆఖరి అరగంటకు సరిపోతుంది. అప్పట్లోగా ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ జరిగిపోతుంది కాబట్టి, సమస్య ఉండదు.
కిటికీలు బద్దలైతే?
పదునైన లోహపు వస్తువులు, కత్తులు, నెయిల్‌కట్టర్లు విమానంలో తీసుకెళ్లనీయరు. ఇక, విమానం కిటికీలను పాలీ కార్బొనేట్‌తో తయారుచేస్తారు. బలమైన మనిషి పిడికిలితో బాదినా అది పగలదు. అంతేకాదు, విమానం గాల్లో అంత వేగంగా వెళుతున్నప్పుడు పడే ఒత్తిడినీ, గాలీ వానా ఎండలనూ తట్టుకునే శక్తి కిటికీ అద్దాలకు ఉంటుంది. అవీ మూడు పొరలుగా ఉంటాయి. కాబట్టి, భయపడాల్సిన పన్లేదు.
ఆక్సిజన్‌ ఆగితే..
ముప్పయివేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నప్పుడు.. హఠాత్తుగా ఆక్సిజన్‌ ఆగిపోతే.. ఆ విషయాన్ని సెన్సర్లు గుర్తిస్తాయి. వెంటనే సీటుపైనున్న ఆక్సిజన్‌ మాస్క్‌లు తెరుచు కుంటాయి. వాటిని నోటికి అమర్చుకోగానే, రసాయన చర్య జరిగిపోయి... ఆక్సిజన్‌ సరఫరా మొదలవుతుంది. అలా, ఇరవై నుంచి ముప్పయి నిమిషాల పాటు ప్రాణవాయువు అందుతుంది. అంతలోపు విమానం కిందికి వచ్చేస్తుంది. 20 వేల అడుగుల కిందికి విమానం రాగానే, ఇక ఆక్సిజన్‌ సమస్య ఉండదు. ఇంజన్‌ నుంచి గాలిని తీసుకుని.. లోపలికి పంపిస్తుంది. ఇక మాస్క్‌లు తీసేయొచ్చు. అవసరమైతే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేస్తారు.
టైర్లు పేలిపోతే?
మూడు నుంచి ఇరవై మూడు టైర్లున్న విమానాలు ఉన్నాయి. ప్రతి టైరూ అత్యంత నాణ్యమైన రబ్బరుతో తయారై ఉంటుంది. సాధారణంగా విమానాలు గంటకు 330 కిలోమీటర్ల వేగంతో ల్యాండ్‌ అవుతాయి. అంత ఒత్తిడిని తట్టుకుని, విమానాన్ని రన్‌వే మీద బ్యాలెన్స్‌గా నిలిపేది టైర్లే! ఆ వేగంలోనూ ఏమాత్రం దెబ్బతినవు. ఒక విమానం ల్యాండ్‌ అయినప్పుడు... ఆ రాపిడికి రన్‌వే పైన 700 గ్రాములు రబ్బరు అంటుకుపోతుంది. అక్కడ నల్లటి చారలు పడేది అందుకే! విమానం రెండొందల సార్లు ల్యాండ్‌ అయిన ప్రతిసారీ టైర్లు మారుస్తుంటారు. కారు టైరు ఎంత సులభంగా మార్చవచ్చో.. విమానం టైరునూ అంతే సులభంగా మార్చవచ్చు.
పార్కింగ్‌ ఉందా?
కార్లు, బైకులకు పార్కింగ్‌ ఉన్నట్టే విమానాలకూ ఉంటుందా? అంటే... ఉంటుంది. ఎయిర్‌పోర్టులలో రెండు రకాలు... ఒకటి ప్రైమరీ, రెండు సెకెండరీ. మనకు శంషాబాద్‌, బేగంపేటల్లా అన్నమాట. ప్రైమరీలో పార్కింగ్‌ ఫీజులు అధికం. ఎందుకంటే విమానాల రాకపోకల రద్దీ ఎక్కువ అక్కడ. విమానం లాంజ్‌ దగ్గరకు వచ్చి, ఎయిర్‌బ్రిడ్జి ద్వారా ప్రయాణికులను నేరుగా విమానంలోకి ఎక్కించు కోవాలంటే, పార్కింగ్‌ ఫీజు ఎక్కువగా చెల్లించాలి. అదే విమానాన్ని దూరంగా పార్క్‌ చేసి.. బస్సులో ప్రయాణికుల్ని విమానం వరకూ తీసుకెళ్లగలిగితే.. తక్కువ రుసుముతో సరిపెట్టుకోవచ్చు. అందుకనే ప్రైవేటు గగనయాన సంస్థలన్నీ సొంత బస్సుల్ని ఏర్పాటు చేసుకుంటాయి.
ఎంత క్షేమం?
మిగిలిన రవాణా సాధనాలతో పోలిస్తే, విమానాలే సురక్షితం. ప్రమాదాలకు ఆస్కారం చాలా తక్కువ. ఒక అధ్యయనం ప్రకారం.. రోడ్డుమార్గంలో 140 ప్రయాణాలకు ఓ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అదే, గగనతలంలో... 5 లక్షల విమాన ప్రయాణాలకు ఒకసారి మాత్రమే ప్రమాదం పొంచి ఉంటుంది. ఆమాటకొస్తే, అపార్ట్‌మెంట్‌ లిప్టు కంటే విమానమే సురక్షితం.
తెలుపే ఎందుకు..?
ప్రపంచ వ్యాప్తంగా కార్లు... తెలుపు, వెండి రంగుల్లోనే ఎక్కువగా ఉంటాయి. విమానాలు కూడా తెలుపులోనే ఎక్కువ. దీనికి కారణాలు అనేకం. ప్రమాదవశాత్తు ఎయిర్‌క్రా్‌ఫ్ట్‌ అడవుల్లోనో, చెట్ల పొదల్లోనో పడిపోతే వెంటనే గుర్తుపట్టేయవచ్చు. తెలుపు ఏ రంగుతోనూ కలిసిపోదు. ఆ రంగు విమానాలు ఎండకు త్వరగా వేడెక్కవు. ఏసీ వేయగానే త్వరగా చల్లబడతాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్‌బస్‌ విమానానికి ఒక్కసారి పెయింట్‌ చేస్తే.. సుమారు 540 లీటర్ల రంగు అవసరం. ఒక లీటరు రంగు కిలో బరువుకు దాదాపు సమానం. కాబట్టి, మళ్లీ పెయింట్‌ వేసేప్పుడు పాతదాన్ని పూర్తిగా తొలగిస్తారు. లేకపోతే బండి బరువు ఇంకో ఐదొందల కిలోలు పెరుగుతుంది.
ఒకదానికొకటి ఢీ కొడితే..
రోజూ ఆకాశంలో వేలకొద్దీ విమానాలు తిరుగుతుంటాయి. అందులో కనీసం పదిలక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఆకాశంలో... అదొక పెద్ద నగరమంత జనాభా. రోడ్డు మీద జాతీయ రహదారులలానే, విమానయానానికీ నిర్దేశిత మార్గాలు ఉంటాయి. ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) వీటిని పర్యవేక్షిస్తుంది. గాల్లోకి ఎగిరిన ఒక విమానానికీ, మరో విమానానికీ మధ్య కనీస దూరం... రెండువేల అడుగులు. ఒక ఫ్లయిట్‌ ఎగిరే ముందు ఎయిర్‌ప్లాన్‌ తయారుచేసి ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోల్‌కు అందజేస్తారు. సంబంధిత ఎయిర్‌పోర్టుకూ సమాచారం వెళ్లిపోతుంది. ఫలానా ఫ్లయిట్‌ ఫలానా సమయానికి చేరుతుందని అర్థమైపోతుంది. ఇరవై నాలుగ్గంటలూ ఏటీసీతో పైలెట్లు అనుసంధానమై ఉంటారు. కాబట్టి, ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టే ఆస్కారమే లేదు.
టాయ్‌లెట్‌ క్లీనింగ్‌
విమానాల్లో ప్రయాణికులు టాయ్‌లెట్లకు వెళ్లినప్పుడు... ఆ వ్యర్థాలు ఆకాశంలోంచి కిందికి పడిపోతాయని అనుకుంటారు. అది అపోహే. సాధారణ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 250 లీటర్ల సీపేజ్‌ ట్యాంక్‌ ఉంటుంది. విమానం ల్యాండ్‌ అయిన తరువాత ఒక ట్రక్కు వచ్చి.. ఆ వ్యర్థాలను నింపుకుని వెళుతుంది. దాన్ని రీసైక్లింగ్‌ యూనిట్లకు తరలిస్తుంది. ఫ్లయిట్‌ ట్యాంక్‌ను ప్రత్యేక లిక్విడ్‌తో శుభ్రం చేస్తారు. చెత్తాచెదారం, వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహారం వంటివన్నీ కూడా రీసైక్లింగ్‌ యూనిట్లకే వెళ్తాయి.
ఎవరైనా మత్తు మందు ఇస్తే...
ఈ విషయాన్ని విమానయాన సంస్థలూ ముందే ఆలోచించాయి. అందుకే, విమానం నడిపే ఇద్దరు పైలెట్లకు వేర్వేరు ఆహారాలు అందిస్తారు. తిండిలో ఎవరైనా విషం కలిపితే.. ఇద్దరూ అస్వస్థతకు గురికావొచ్చు కదా! అందుకే ఈ ఏర్పాటు. వంటకాలను శుభ్రంగా, టెంపరేచర్‌ మానిటర్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ద్వారా భద్రపరుస్తారు. ఏవియేషన్‌ కిచెన్‌లు నూరుశాతం పరిశుభ్రంగా ఉంటాయి. ఏమాత్రం అశ్రద్ధ వహించరు. వండిన ఆహారాన్ని రాండమ్‌ శాంపిల్‌ తీసి పరీక్ష కూడా చేస్తారు. ప్రత్యేక కంటైనర్‌లలో పంపిస్తారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ప్రత్యేక వంటశాలలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద విమానయాన పాకశాల ఎమిరేట్స్‌ వాళ్లకుంది.
ఒక విమానం ఎగరాలంటే పదిమంది పైలెట్లు అవసరం.
అయితే మనకు కాక్‌పిట్‌లో ఇద్దరే కనిపిస్తారు. ఎయిర్‌పోర్టుకు దగ్గర్లో స్టాండ్‌బై డ్యూటీగా మిగతా వాళ్లను ఉంచుతారు. ఓ పైలెట్‌ ఎయిర్‌పోర్టుకు వస్తున్నప్పుడు హఠాత్తుగా అనారోగ్యం పాలైతే.. మిగిలిన వాళ్లు సిద్ధంగా ఉంటారు.
కుడి అయితే ఎక్కువే..
విమానాశ్రయానికి ఎయిర్‌పోర్టు ఛార్జీలు, పార్కింగ్‌, ఫుడ్‌, రిటైల్‌, షాపింగ్‌, కార్గోలతో గణనీయమైన ఆదాయం వస్తుంది. ఎయిర్‌పోర్టు డిజైనింగ్‌లో చాలా సూక్ష్మమైన విషయాల్ని కూడా లెక్కలోకి తీసుకుంటారు. ఎడమచేతితో ట్రాలీ బ్యాగ్‌ పట్టుకుని వెళుతున్నప్పుడు, సహజంగానే కుడివైపు చూస్తూ నడుస్తారు ప్రయాణికులు. కాబట్టి, ఆ వైపు ఉన్న దుకాణాల అద్దెలు కూడా ఎక్కువే. అంతర్జాతీయ కంపెనీల రిటెయిల్‌ స్టోర్లు కుడివైపున ఏర్పాటయ్యేది కూడా అందుకే!
పైలెట్లు నిద్రపోతారా?
అంతర్జాతీయ ప్రయాణాల్లో.. రోజుల తరబడి విమానాల్ని నడపాల్సి వస్తుంది. పైలెట్లకు విశ్రాంతి తప్పనిసరి. ప్రయాణ దూరం, విమానసైజును బట్టి... ముగ్గురు నలుగురు పైలెట్లు ఉంటారు. వాళ్లంతా షిప్టుల్లో కాక్‌పిట్‌లోకి వస్తూపోతూ ఉంటారు. నిబంధనల ప్రకారం పైలెట్లకు కచ్చితంగా విశ్రాంతి ఉండాల్సిందే! ఒక పైలెట్‌ పనిగంటలు ముగిశాక, మరో పైలెట్‌ ఆ బాధ్యతను తీసుకుంటారు. అతను కాక్‌పిట్‌ సీట్లో కూర్చున్నాకే, మొదటి వ్యక్తి రిలీవ్‌ అవుతాడు. విమానంలోనే చిన్న బంకర్‌లు ఉంటాయి. అందులో కాసేపు నిద్రపోతారు. విమానం ముందు భాగంలో కానీ, వెనకవైపు కానీ వాటిని ఏర్పాటు చేస్తారు.
ప్రపంచంలో అత్యధిక మహిళా పైలెట్లు ఉన్న దేశం?
అమెరికా, ఆస్ట్రేలియా.. ఇలా వెళుతుంది మన సమాధానం. ఆ ఘనత మన దేశానిదేనంటే ఆశ్చర్యం కలుగుతుంది. పదమూడు శాతం మహిళా పైలెట్లు భారత్‌లోనే ఉన్నారు.
ఒకప్పుడు కెప్టెన్‌ పెద్ద సూట్‌కేసు పట్టుకుని విమానం ఎక్కేవాడు. అందులో నావిగేషన్‌, వెదర్‌ రిపోర్టు, మాన్యువల్స్‌ ఉండేవి. ఇది కనీసం పన్నెండు కిలోల బరువు ఉండేది. ఇప్పుడు ఆ సమాచారమంతా ఒక ట్యాబ్‌లోకి వచ్చేసింది. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుంటుంది. శాటిలైట్‌ సహాయంతో పనిచేస్తుంది. దాన్ని హ్యాక్‌ చేయడం కష్టం.
కొన్ని ఎయిర్‌లైన్స్‌లలో ఎయిర్‌హోస్టెస్‌ల బరువుకు కూడా నిబంధనలు పెడుతున్నారు. బక్కపల్చ భామలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక్కో విమానంలో నాలుగైదు మంది ఉంటారు కాబట్టి, ఒక్కొక్కరు ఐది కిలోలు తగ్గినా.. ఇరవై కిలోల బరువును వదిలించుకున్నట్టే కదా!
వికలాంగులు పైలెట్లు కాలేరు. అయితే, ఈ ప్రతిబంధకాన్ని అధిగమించింది జస్సికా కాక్స్‌ అనే అమెరికన్‌ యువతి. తనకు చేతులు లేకపోయినా.. కాళ్లతోనే విమానాన్ని నడిపి.. ఔరా అనిపించుకుంది. ఏకంగా పైలెట్‌ లైసెన్సునూ సంపాదించింది.
కొత్తకారు కొన్నప్పుడు, ఎలాగైతే షోరూమ్‌ వాళ్లు వెల్‌కమ్‌ చెబుతారో.. కొత్త విమానానికీ అలానే స్వాగతం పలుకుతారు ఎయిర్‌పోర్టు సిబ్బంది. విమానానికి రెండువైపులా రెండు వాటర్‌ట్యాంకులు ఫైర్‌ఇంజన్‌లా నీటికి ఎగజిమ్ముతాయి. అదో సంప్రదాయం.
ఫ్యూయల్‌ డంపింగ్‌..
విమానంలో ఇంధనం అయిపోతే?.. అనేదే పెద్ద సమస్య. అయితే దానికి భిన్నమైన సమస్య ఇంకొకటుంది. విమానం పైకి ఎగిరినప్పుడు.. అందులోని ఇంధనాన్ని పారబోయాల్సి వస్తే? ఆ అరుదైన ప్రక్రియను ‘ప్యూయల్‌ డంపింగ్‌’ అంటారు. ఫుల్‌ట్యాంకుతో విమానం పైకి ఎగురుతుంది. లగేజీ, ప్రయాణికులు, ఇంధనం.. వీటన్నిటి వల్ల బరువు ఉంటుంది. గాల్లోకి ఎగిరిన పదినిమిషాలకే ఒక ప్రయాణికుడికి తీవ్రమైన గుండెనొప్పి వచ్చిందనుకోండి.. అంత బరువైన విమానాన్ని వెంటనే ల్యాండింగ్‌ చేయాలంటే ఇబ్బందే! కాబట్టి ఆ బరువు తగ్గించుకోడానికి ఏకైక మార్గం.. ఇంధనాన్ని తగ్గించడం. అయితే ఇంధనాన్ని ఎక్కడపడితే అక్కడ వదిలేయరు. పొరపాటున ఏ ఇళ్లమీదో, ఫ్యాక్టరీల మీదో పడితే అగ్నిప్రమాదాలు జరగొచ్చు. నావిగేషన్‌ ద్వారా పరిశీలించి.. ప్యూయల్‌ డంపింగ్‌ జోన్స్‌ (ఖాళీ జాగా)లలోనే కొంత ఇంధనాన్ని ఒలికిస్తారు. బరువు తగ్గాక విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేస్తారు. పేషెంట్‌ను ఆస్పత్రికి తరలిస్తారు.
విమానానికీ శ్మశానం
ఒక మనిషి చనిపోతే శ్మశానం (గ్రేవ్‌యార్డ్‌)లో అంత్యక్రియలు చేస్తారు. మరి, విమానం ఆయువు తీరితే.. ? వాటికి వీడ్కోలు చెప్పే శ్మశానం ఒకటుంది. అదే ‘బోన్‌యార్‌’్డ. అమెరికా, ఆస్ట్రేలియా, మెక్సికోలలో ఇలాంటివి ఎక్కువ. విమానం ఇక పనికిరాదని తేలాక... ముఖ్యమైన, విలువైన విడిభాగాలను తీసేసుకుని.. మిగిలిన వ్యర్థాల్ని అక్కడ వదిలేస్తారు. బోన్‌యార్డులు ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి. ఎడారుల్లో వర్షం రాదు కాబట్టి.. విమానాలు తుప్పు పట్టవు. అక్కడికి వెళ్లి రెక్కలు, ఇతర భాగాలను తీసుకొచ్చి.. హోటళ్లు నిర్మించేవాళ్లూ ఉన్నారు.
నిషేధిస్తారు జాగ్రత్త..!
ప్రయాణికులకూ కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. వాటిని అతిక్రమిస్తే.. భవిష్యత్తులో విమానం ఎక్కలేరు. అదే ‘నో ఫ్లయింగ్‌ లిస్ట్‌’. మొదటిసారిగా ఈ నిబంధన అమెరికాలో మొదలైౖంది. మన దేశంలో మాత్రం రెండేళ్ల కిందట ప్రవేశపెట్టారు. ఒక వ్యక్తి ఎయిర్‌పోర్టులోనో, విమానాల్లోనో అసభ్యంగా ప్రవర్తించినా, అమర్యాదగా వ్యవహరించినా నిషేధం తప్పదు. ఎయిర్‌క్రాఫ్ట్‌ భద్రత విషయంలో సమస్య తలెత్తినా వేటు వేస్తారు. ఒకవేళ ప్రయాణం మధ్యలో ఆ వ్యక్తి దుశ్చర్యలు మితిమీరితే... విమానసిబ్బంది ప్రత్యేక సీటుబెల్టులతో అతన్ని బంధించవచ్చు. టేపుతో చేతులు కట్టేయవచ్చు. దీన్ని ‘మిడ్‌ ఎయిర్‌ అరెస్ట్‌’ అంటారు. విమానం ల్యాండ్‌ అయ్యాక పోలీసులకు సమాచారం ఇస్తారు. నేర నిర్ధారణ తర్వాత ఆ ప్రయాణికుడి పేరు ‘నో ఫ్లయింగ్‌ లిసు’్టలో పెడతారు. అమెరికాలో 2007లో 40 మంది ఈ జాబితాలో చేరితే.. 2011లో 78 మంది నమోదయ్యారు. మన దేశంలో ఇద్దరు ముగ్గురు నేతలూ ఆ లిస్టులో చేరారు. నేర తీవ్రతను బట్టి నిషేధకాలం పెరగవచ్చూ తగ్గవచ్చూ.
2007లో ఆరు కోట్ల మంది విమానాల ద్వారా ప్రయాణించారు. 2017 వచ్చేసరికి అది 15.8 కోట్లకు చేరింది. అందులో సుమారు 68 శాతం దేశీయ ప్రయాణమే. భారత్‌లో మరో 400 కొత్త విమానాశ్రయాలు రాబో తున్నాయి. ఆ ప్రకారంగా... విమానయాన రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది.
పిడుగులు పడితే..
మనకు తెలియదు కానీ.. మనం ప్రయాణించే విమానం మీద కూడా ఏడాదికి ఒక్కసారైనా పిడుగు పడుతుంది. అది పెద్దది కావచ్చు, చిన్నదీ కావొచ్చు. అలాంటప్పుడు విమానం మీద నల్లమచ్చలు ఏర్పడతాయి. కాక్‌పిట్‌ లేదా ఇంధన ట్యాంకులకు తగిలితే మాత్రం ప్రమాదమే. అందుకని.. విమానంపైన ఒక రకమైన రాగి జాలీ వేస్తారు. పిడుగుల ద్వారా జ్వలించిన విద్యుత్‌ను అది తీసేసుకుంటుంది. లోపలికి అస్సలు రానివ్వదు.
కాక్‌పిట్‌లో గొడవపడితే..
కాక్‌పిట్‌లో కూర్చున్నప్పుడు పైలెట్‌, కో పైలెట్‌లు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడం సాధారణమే. ఏదో ఓ సందర్భంలో... అభిప్రాయభేదాలు తలెత్తి, గొడవలకు దారితీస్తే..? అవును, అలాంటి సమస్యా ఉంది. గత ఏడాది ఒక కెప్టెన్‌ తన కోపైలెట్‌ను కాక్‌పిట్‌లో చెంపదెబ్బ కొట్టాడు. ఆమె బయటికి వచ్చి ఏడ్చింది. మళ్లీ లోపలికి వెళ్లింది. తను మళ్లీ కొట్టాడు. దాంతో బయటికి వచ్చేసి, ఇక కాక్‌పిట్‌లోకి వెళ్లనని మొండికేసింది. దీంతో సిబ్బంది ‘మీరు ఇలా చేస్తే విమానానికి ప్రమాదం. ముందు కాక్‌పిట్‌లోకి వెళ్లండి. విమానం ల్యాండ్‌ అయ్యాక ఫిర్యాదు చేయండి’ అని సముదాయించారు. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆ ఇద్దరి లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేసినట్టు సమాచారం.
ఓ లెక్కే..
ప్రతి సీట్లో ఒక మ్యాగజైన్‌.. ఒక్కోటి వంద గ్రాములు.. అన్ని సీట్లలోని మ్యాగజైన్లను కలిపితే.. కిలోలుగా మారుతుంది. గ్రాము బరువు కూడా విమానానికి అదనపు భారమే! అందుకని పలు విమానయాన కంపెనీలు మ్యాగజైన్లను తొలగించడమో, వాటి పేజీలను తగ్గించడమో చేస్తున్నాయి. విమానం బరువు తగ్గే కొద్దీ ఇంధనం ఖర్చు కూడా తగ్గుతుంది.
-@whatsapp

Source - Whatsapp Message

సంస్కృతం లో రక్త సంబంధీకుల పేర్లు...

సంస్కృతం లో రక్త సంబంధీకుల పేర్లు...మీకోసం

👇 .👇
1. పితా (తండ్రి)
2. పితామహా (తాత)
3. ప్ర పితామహా (ముత్తాత)
4. మాతా (తల్లి)
5. పితామహి (బామ్మ)
6. ప్రపితామహి (బామ్మ అత్తగారు)
7. సాపత్ని మాతా (సవతి తల్లి)
8. మాతామహ (తల్లి తండ్రి)
9. మాతా పితామహ (తల్లి తాత)
10. మాతుః ప్రపితామహ (తల్లి ముత్తాత)
11. మాతామహి (అమ్మమ్మ)
12. మాతుః పితామహి (అమ్మమ్మ అత్త)
13. మాతుః ప్రపితామహి (అమ్మమ్మ అత్తగారి అత్త)
14. ఆత్మపత్ని (తన భార్య)
15. సుతః (కుమారుడు)
16. భ్రాత (సోదరుడు)
17. జ్యేష్ట పితృవ్యః (పెద తండ్రి)
18. కనిష్ట పితృవ్యః (పిన తండ్రి)
19. మాతులః (మేనమామలు)
20. తత్పత్నిః (వారి భార్యలు)
21. దుహిత (కుమార్తె)
22. ఆత్మ భగినీ (తోబుట్టువులు)
23. దౌహిత్రః (కూతురు బిడ్డలు)
24. భాగినేయకః (మేనల్లుళ్లు)
25. పితృష్వసా (తండ్రి తోబుట్టువులు)
26. మాతృష్వసా (తల్లి తోబుట్టువులు)
27. జామాతా (అల్లుళ్లు)
28. భావుకః (తోబుట్టువు భర్త)
29. స్నుష (కోడలు)
30. శ్వశురః (మామగారు)
31. తత్పత్నీః (వారి భర్యలు)
32. స్యాలకః (బావమరుదులు)
33. గురుః (కుల గురువు)
34. ఆర్ధినః (ఆశ్రితులు)

అడపా.శ్రీనివాసరావు పసుమర్తి.తోషన్ ఊటసముద్రం🙏🙏🙏

Source - Whatsapp Message

లవ్-జిహాద్ ఆడపిల్లలు ఏమి చేస్తున్నారో తల్లిదండ్రులు తెలుసుకోవడం చాలా అవసరం

నేనొక న్యాయవాదిని. నన్ను లవ్-జిహాద్ కేసులో దెబ్బ తిన్న ఓ అభాగ్యురాలైన అమ్మాయికి న్యాయసహాయం కోసం పిలిచారు. గత 3 నెలల్లో ఇది 5 వ కేసు. ఇలాంటి సందర్భాల్లో ఆడపిల్లలు ఏమి చేస్తున్నారో తల్లిదండ్రులు తెలుసుకోవడం చాలా అవసరం అని నేను భావిస్తున్నాను.

1. నా వద్దకు వచ్చిన 5 కేసులలో, ఒకటి మాత్రమే ఆర్థికంగా 'దిగువ' కులం. మితావి అన్నీ మామూలువే.

2. బాలికలు ఏ వయసువారైనా ఇలా చిక్కుకుంటుంన్నారు. ఒక్క అమ్మాయ మాత్రమే ఇద్దరు పిల్లల వితంతువు. కానీ ఈ వ్యవహారం ప్రారంభమైనప్పుడు మిగతా అమ్మాయిలందరూ 14 మరియు 16 మధ్య వయసు వారే.

3. దాదాపు అన్ని సందర్భాల్లో తురక అబ్బాయిలు, హిందూ అమ్మాయిలను ఏదోరకంగా పరిచయం చేసుకొని బైక్ రైడ్స్‌లో బయటకు తీసుకువెళతారు. ఇదే 'స్వేచ్ఛ' అని అమ్మాయిలను బాగా నమ్మిస్తారు.

4. తురక అబ్బాయిలకు, హిందూ బాలికలను లైంగికంగా ప్రేరేపించే ప్రత్యేక శిక్షణ ఇస్తారు మరియు వారు చేతులు పట్టుకోవడం, స్నేహపూర్వక కౌగిలింత ఇవ్వడం, కొన్ని ప్రదేశాలను పొరపాటుగా తాకినట్టు తాకడం ప్రారంభిస్తారు ... అలా మెల్లి మెల్లిగా వారు అమ్మాయి 10/12 వ ఏట ఉన్నప్పుడే ముద్దులూ మరియు శారీరక సంబంధానికి ప్రేరేపిస్తారు. ఆ తర్వాత అమ్మాయిల శారీరక సంబంధం యొక్క వీడియోలు రహస్యంగా చిత్రీకరిస్తారు.

5. ఇలా విషయం ఆలస్యం అయ్యేవరకు చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు.

6. తల్లిదండ్రులు తెలుసుకున్న తర్వాత మరియు సంబంధాన్ని తెంచుకోవడానికి ప్రయత్నించిన తర్వాత, అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోవడానికి ఈ తుర్క వాడి వల్ల ఒత్తిడి చేయబడుతుంది లేదా పైన చెప్పినట్టు రహస్యంగా తీసిన వీడియోలను ఉపయోగించి బాలికలను బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇంతవరకూ వీడియో తయారు చేయబడిందని అమ్మాయికి కూడా తెలియదు.

7. ఈ సందర్భంలో అమ్మాయి విడిపోవాలని పట్టుబడుతుంటే, తుర్క అబ్బాయి తన ఇతర స్నేహితులతో బాలికను శారీరక సంబంధాన్ని బలవంతంగా చేయటానికి బ్లాక్ మెయిల్ చేస్తాడు. అన్ని సమయాలలో, అతను అమ్మాయిని వివాహం చేసుకుంటాననే చెప్తూనే ఉంటాడు.

8. తల్లిదండ్రులు జోక్యం చేసుకుంటే, బాలుడు తాత్కాలికంగా దూరంగా ఉంటాడు. అమ్మాయి 18 ఏళ్లు నిండిన తర్వాత, ఇది మళ్ళీ మొదలవుతుంది మరియు ఈసారి అమ్మాయి పూర్తిగా చిక్కుకుంటుంది.

9. ఇలాంటి విషయాల్లో వివాహం జరుగుతుంది. శీఘ్రంగా అమ్మాయి మతం మార్చబడుతుంది. ఓ ఐదారు నెలలు ఎటువంటి సమస్య ఉండ కుండా చూస్తారు. ఆతర్వాతే అసలు హింస ప్రారంభమవుతుంది. మొదట కొట్టడం, హింసిచడం లాంటివి. నిరంతరగా గర్భం తీయించడం జరుగుతూ ఉంటుంది.

10. ఓ సంవత్సరం అటూఇటుగా ఆ తురక బాలుడు ఈ అమ్మాయి భార్యగా ఉండగానే మరో అమ్మాయిని వివాహం చేసుకుంటాడు.

11. ఇప్పుడు అమ్మాయి ఖచ్చితంగా అడ్డుకుంటుంది. ఆమెను ఇంట్లో ఉంచడానికి, అబ్బాయి తండ్రి మరియు అన్నదమ్ములు ఈ అమ్మాయిపై దౌర్జన్యంగా పథకం ప్రకారం అత్యాచారం చేస్తారు. అబ్బాయి తల్లి, ఇతర భార్యలు మరియు అబ్బాయి సోదరీమణులు అంతా కలిసి ఈ అమ్మాయి నీ ప్రతిరోజూ ఈమెను కొడతూవుంటారు.

12. గత్యంతరం లేక పోలీసులు మరియు హిందూ కుటుంబ సభ్యులు వివాహాన్ని సర్దుబాటు చేయడానికి మరియు కొనసాగించమని అమ్మాయికి సలహా ఇస్తారు.

13. చాలా సందర్భాల్లో, అమ్మాయి మానసికంగా బలంగా ఉంటే, ఆమెకు మొబైల్ కూడా లేకుండా ఇంటి లోపల బంధించి ఉంచుతారు

14. ఒక వేళ ఆమె తప్పించుకొని పారిపోగలిగితే, ఆమె పిల్లలను వదిలేసి లేదా ఒక పిల్లాడినో తీసుకుని పారిపోవచ్చు. చాలా సందర్భాల్లో బిడ్డలు తుర్కల ఇంట్లోనే ఉండిపోతారు.

15. ఇలాంటి సందర్భాల్లో పారిపోయి వచ్చిన అమ్మాయి కేసు పెట్టనా, కోర్టు నెలవారీ నిర్వహణ ఇచ్చినా, ఆభర్త ఎప్పుడూ భరణం చెల్లించడు. ఇదో విచిత్ర మైన వివాహం, ఎందుకంటే అమ్మాయి వివాహం తర్వాత మాత్రమే మతం మార్చబడుతుంది, ముందు కాదు. కాబట్టి అలా మోస పోయిన అమ్మాయి మోసంచేసిన భర్త ఆస్తిపై హక్కును ఎప్పటికీ పొందలేదు. కానీ ఆ అమ్మాయి పిల్లలు హిందూ చట్టం ప్రకారం అమ్మాయి తల్లిదండ్రుల ఆస్తిపై మాత్రం హక్కును పొందవచ్చు.

16. దయచేసి ఇలాంటి దౌర్జన్యాలు చాలా జరుతున్నయి తెలుసుకోండి. ఇంతటి పథకం ప్రకారం నిర్వహిస్తున్న ఈ ప్రేమ జిహాద్ల గురించి, మన చుట్ట పక్కల ఉన్న ఆడ పిల్లలు మరీ చిన్న పిల్లలైనా తెలియ జేయాల్సిన అవసరం చాలానే ఉంది.

పై విషయాలన్ని ఓ కథ అల్లీ మీకు చెప్పటంలేదు. ఓ న్యాయవాదిగా నన్ను ఉచితన్యాయ సలహాకి పిలిచినప్పుడు నేను ప్రత్యక్షంగా చుసి న్యాయ సలహా అందిస్తున్నపుడు తెలుసుకొన్న నిజాలవి. హిందూలారా మనం ఎంత జాగృత్తగా వ్యవహరించినా ఏదో ఒక కొత్త విధానంలో ఈ లాంటి జీహాదులు జరుగుతునే ఉన్నాయి. జాగ్రత్త. లేదా టోపీలు గడ్డాలు తప్పవు.

ఈ మధ్యలో మన మగ పిల్లలు చాలా మంది గడ్డాలు ఎలాగో పెంచేసారు. ఇదికూడా తురక హీరోలు తయారు చేసి అలవాటు చేసిన ట్రెండంట ! ఇక త్వరలో ఇంకో కొత్త ట్రెండుతో టోపీలు కూడా వస్తయేమో !

ఇంత జరుగుతున్నా మన హిందువులు ఇంకా తుర్క బొందలూ, దర్గాలూ, తుర్క బాబాల దగ్గరకు వెళ్ళటం ఏ మాత్రం మానటం లేదు చూసారా. మనమే అలా అలా తెలియకుండా తుర్క మతంలోకి మెల్లి మెల్లగా వెళ్లి పోతున్నామేమో జాగ్రత్త !

లవ్ జీహాదుతో బాటు ఇదో బాబా జీహాదేమో ! జాగ్రత్త !

Source - Whatsapp Message

ప్రతి అమ్మాయి మనసులోనూ ఏదో ఒక క్షణం లో మగాడిగా ఎందుకు పుట్టలేదో అనే బాధ ఒక ప్రశ్న పుట్టే ఉంటుంది అవునా మీరే చెప్పండి...

ఆడజన్మ ఒక అదృష్టం అంటారు
ఆడపిల్ల ఒక వరం అంటారు
అదే ఆడతనంతో ఉన్న భార్య ఎందుకు అదృష్టం అనిపించిందో
ఆడతనంతో అడుగుపెట్టిన కోడలు ఎందుకు వరం అని అనిపించిందో
నాకు అర్థం కాదు

ఆడదానిగా పుట్టినందుకు ఆనందపడినదానికంటే
మగాడిగా ఎందుకు పుట్టలేదో అని బాధపడ్డ సందర్భాలే ఎక్కువ

పుట్టిల్లు మెట్టిల్లు ఇలా రెండిళ్ళు ఉన్నా ఏది తనకు సొంతమైతే కాదు
పెళ్ళి అయ్యేవరకు ఉన్న స్నేహితులతో చిరకాలం అదే స్నేహం మార్పు లేకుండా ఉంటుందా అంటే అనుమానమే

ప్రతిరోజు కలుసుకున్న స్నేహాన్ని కలవాలంటే
అనుమతి తప్పనిసరి
మగాళ్లు ప్రతిరోజు కలుస్తున్నా కుటుంభం తో ఒక్కరోజు కూడ వెచ్చించడం చేతకాక ఆరోజుల్లో సైతం స్నేహితులతో కాసేపు అంటూ వెళ్ళిపోతారు
అప్పుడు అనిపిస్తుంది ప్రతి అమ్మాయికి మనం ఎవరికోసం అనే అనుమానం

ఆడవాళ్లకు నచ్చకపోయినా
మగవాళ్లకు నచ్చినవారితో సర్దుకుపోవాలి
అదే సర్దుకుపోదాం అనే తత్వం మీ మగాళ్లకు ఎందుకు అనిపించదు
తనకు నచ్చనప్పుడు తన ఆలోచనలకూ కాస్త చోటిద్దాం అని అనిపించనప్పుడు ఆడతనం అదృష్టమా అని అనిపిస్తుంది

ఒక విషయం నచ్చడం లేదు అంటే ఆ విషయాన్నీ మీ భార్యల దగ్గర ప్రస్తావించకండి
ఇద్దరి మధ్య గొడవలకు కారణం అవే అని తెలిసినప్పుడు వాటికి దూరంగా ఎందుకు ఉండలేకపోతారు

కుటుంభానికి ఆత్మభిమానానికి విలువ ఇచ్చేవారు ఆడవాళ్ళైతే
కనీసం కుటుంబానికి సైతం విలువ ఇవ్వడం తెలుసుకోలేనివారు మగవాళ్ళు
ప్రేమతో చెప్పినా అర్థం చేసుకోకుండా విసుక్కుంటారే
అప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఈ ఆడజన్మ అని

ఏ భార్య భర్త చెడిపోవాలని
ఇతరులదగ్గర చులకన అయిపోవాలని కానీ కోరుకోదు కానీ అదే విషయాన్నీ చెప్పినప్పుడు
నీ మాటంత ఒక లెక్కనా అనే
పురుషాధికారం వస్తుందే అప్పుడు బాధ అనిపిస్తుంది ఆడవాళ్ళగా ఎందుకు పుట్టామా అని

తన పెంపకం పైన నమ్మకం లేక
ఇష్టం ఉన్నా లేకున్నా నీకోసమే అమ్మా అన్నప్పుడు
మన ఇష్టాలేంటో ధైర్యంగా కన్నవారిని వ్యతిరేకించలేనప్పుడు అనిపిస్తుంది
ఎందుకు ఈ వరం అని

ఏ నిర్ణయానికి స్వేచ్ఛ లేనప్పుడు
మనకు సంభందించిన విషయాన్నీ కూడా మన అనుమతి తీసుకోనప్పుడు మనసులో
పెద్ద సంఘర్షణ మొదలవుతుంది
ఆ మానసిక సంఘర్షణకు బదులు ఎవరూ చెప్తారు

ఓర్పు ఆడదానికి ధైర్యం అవుతుంది
సహనంతో సహవాసం చేస్తుంది

నాకు తెలిసినంతవరకు ప్రతి అమ్మాయి మనసులోనూ ఏదో ఒక క్షణం లో మగాడిగా ఎందుకు పుట్టలేదో అనే బాధ ఒక ప్రశ్న పుట్టే ఉంటుంది అవునా మీరే చెప్పండి...🌷

Source - Whatsapp Message

మాతృఋణం-తల్లిదండ్రులను చాలా బాగా చుాసుకుంటున్న కొడుకులు అందరికీ ఈ కథ అంకితం

👌 మాతృఋణం👏
==================
"రవీ! పెళ్లి కేన్సిల్ చేసావా?? నాకు ఒక్క మాట చెప్పకుండా ఎంత పని చేశావురా?? ఇప్పుడు పెళ్లి కేన్సిల్ చేయవలసిన అవసరం... ఏమివచ్చింది...

కావాలంటే ఒకసారి నేను వెళ్లి వాళ్లతో మాట్లాడి అన్నీ విషయాలు...చెప్పేవాడిని కదా!!

కుదరక... కుదరక... కుదిరిన పెళ్లి సంబంధాన్ని కాలదన్నుకున్నావు. నీకు అంత తొందర పాటు ఏమిటి?? నాతో ఒకసారి ఆలోచించాలి కదా"!! బయటనుంచి వస్తుా నాతో ఆవేశంగా ఆరిచాడు... మావయ్య...

"నీకు తెలుసు కదా మావయ్యా!! పదిరోజుల కిందట ఏం జరిగిందో ఆ ప్రమాదం ఎలా జరిగిందో?? ఎందుకు జరిగిందో?? అర్దం కాకుండా అయింది. ఆ సంఘటన జరిగినప్పుడు నేను ఇంట్లోనే వున్నాను కాబట్టి సరిపోయింది...

సాయంత్రం అమ్మ తులసి మెుక్క దగ్గర దీపం పెట్టింది. ఎలా అంటుకుందో ఏమెా దీపం చీర కొంగుకు అంటుకుంది. అమ్మ ముందు చూసుకోలేదు. తరువాత శరీరానికి వేడి అంటుకుని కేకలు వేసింది..

అప్పుడు నేను రుామ్ లో నుంచి పరుగెత్తుకు వచ్చాను.అప్పటికే మంటలు పైకి వచ్చాయి. నాకు ఒక్క క్షణం కాళ్ళు, చేతులు ఆడలేదు. ఒళ్లంతా ఒకటే వణుకు. ఆ టైమ్ లో ఏం చేయాలి ? మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది.

నాకు ప్రియమైన వాళ్ళు నా కళ్ల ముందే అగ్నిలో దహనమై పోతుంటే నాకు కళ్లు---బైర్లు కమ్మాయి. ఏం చేయాలి?? ఎలా ఈ ప్రమాదం నుంచి బయట పడెయ్యాలి??షాక్ తో నాకు నోటివెంట ఒక్క మాట రాలేదు...

అక్కడ బియ్యం బస్తా వుంటే బియ్యం కింద వంపేసి ఆ బస్తాతో అమ్మ శరీరాన్ని చుట్టేసి గట్టిగా పట్టుకుని నిలబడ్డాను. మంటలు కంట్రోల్ అయ్యాయి."

అప్పుడు హస్పటల్ కు తీసుకెళ్లాను...వెంటనే హాస్పటల్ కి తీసుకెళ్ళాను కాబట్టి. ప్రాణాపాయం తప్పిందన్నారు డాక్టర్స్.

"శరీరం మండుతుంది మంట తట్టుకోవడం కష్టం. చాలా...బాధ భరించాలి. ఆవిడను చాలా..
జాగ్రత్త గా చూసుకోవాలి"అని డాక్టర్ మరీ మరీ... చెప్పారు...

రేపు డిశ్చార్జి చేస్తారు నర్స్ రోజూ వచ్చి డ్రెస్సింగ్ చేసి ఇంజక్షన్ ఇవ్వడానికి మాట్లాడాను"...

"అవన్నీ నాకుా తెలుసు. నువ్వు ఫోన్ చేయగానే నేను పరుగెత్తుకు...వచ్చేనుకదా"! మధ్యలో అడ్డు తగిలాడు మావయ్య..

"ఈ పెళ్లి అయిపోతే ఆ అమ్మాయి నీకు అన్ని విషయాల లోను హెల్ప్ గా వుంటుంది. ఇప్పుడు నువ్వు ఒక్కడివే అమ్మని ఎలా చుాసుకోగలవూ??

ఆ అమ్మాయి కూడా వస్తే నువ్వు ఆఫీసు కి వెళ్ళి నపుడు తను అమ్మని చూసుకుంటుంది కదా"!! అని మావయ్య అన్నాడు...

"ఇప్పుడు మా అమ్మ ని గాజుబొమ్మ లా చూసుకోవాలి. ఈ టైమ్ లో నేను పెళ్లి చేసుకుంటే, ఒక వేళ నాకు తెలియకుండానే... నాలో స్వార్ధం పెరిగిపోయి అమ్మను సరిగ్గా చుాసుకొలేక పోతేనో??

నేను అమ్మతోటే ఉండిపోతే, అప్పుడు ఆ అమ్మాయికి కూడా పూర్తి...న్యాయం చేయలేను కదా? అమ్మ రేపు హస్పటల్ నుంచి డిశ్చార్జి అవుతోంది...

ప్రస్తుతం నేను ఆఫీసుకి లీవ్ పెట్టాను. అమ్మ తేరుకునేవరకు నేను ఆఫీసుకు వెళ్లను ఆఫీసులో అన్ని నెలలు శెలవు ఇవ్వకపోతే--- జాబ్ కి కూడా రిజైన్ చేసేస్తాను. ఇప్పుడు వున్న ప్రస్థుత పరిస్థితుల్లో, నాకు అన్నిటికన్నా మా అమ్మ ఆరోగ్యం ముఖ్యం"...

"ఇదివరకటిలా మా అమ్మ మామూలుగా లేచి తిరుగుతూ సంతోషంగా వుండాలి. దాని కోసం నేను ఏం చేయడానికి అయినా సిద్ధంగా వున్నాను..

ఇంకో సంబంధం చూసుకోండి, నాకు సెట్ అవ్వ డానికి టైమ్---పడుతుంది. మిమ్మల్ని అంతవరకు ఆగమనడం కూడా భావ్యం కాదు.... అని పెళ్లి వారికి ఫోన్ చేసి చెప్పేసాను"...

"పొరపాటు చేసావురా! మంచి సంబంధం అమ్మాయి బుద్ధి మంతురాలు!! అని మేమంతా ఎంతో సంతోష పడ్డాము." మావయ్య బాధగా అన్నాడు.

"ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు మావయ్యా! ఈ ముహూర్తానికే నేను పెళ్లి చేసుకుంటే కొత్త పెళ్లి కూతురు, రాగానే అత్త గారికి సేవ చేయమంటే చేస్తుందా ?? అయినా అలా చేయమనడం కూడా భావ్యం కాదు కదా? తన కెన్నో ఆశలు, కోరికలు వుంటాయి వాటికోసం నేను సమయం కేటాయించి నెరవేర్చలేను...

కొత్తలోనే మామధ్య అభిప్రాయ బేధాలు, గొడవలు మెుదలు అవుతాయి...మా అమ్మ శరీరం కాలి ఇంతగా బాధ పడుతూ వుంటే.. నేను పెళ్లి చేసుకుని నా సుఖం నన్ను చూసుకోమంటావా??..

మావయ్యా !! ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం.. ఇక మనిద్దరి మధ్య ఈ టాపిక్ మరో సారి తలెత్తకూడదు" అనేసి అక్కడ నుంచి లేచి వెళ్లి పోయాను...

"అమ్మా! నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు.. ఇదుగో నీ మంచం పక్కనే నేను కూడా కింద పక్క వేసుకొని పడుకుంటాను. ఏం కావాలన్నా నన్ను లేపు." బాత్రూం వస్తే చెప్పు.యుారిన్ పేన్ పెడతాను.ఇబ్బంది పడకు.

ఇంతలో అమ్మ ఏడుస్తూ వున్న శబ్దం వినిపించింది."ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా!? గాయాలు మండుతున్నాయా?? విసనకర్రతో విసరనా?? లేక ఆయింట్ మెంట్ రాయనా???" కంగారుగా అన్నాను నేను...

"నీ సంతోషకరమైన జీవితానికి నేను అడ్డంకిగా వున్నానురా నాన్నా !....ఆ ప్రమాదం లో నేను పోయినా బాగుండేదేమో? నాకోసం నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు రవీ..

మీ ఆఫీసులో అన్ని రోజులు లీవ్ ఇస్తారా ??
ఆవేశంలో, బాధలో ఉద్యోగాన్ని కూడా, పట్టించు కోవటం లేదు. నీ పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నావు. నావల్ల నీకు ఇన్ని కష్టాలు అవసరమా ?? నన్ను వదిలేసేయి కన్నా... నా బాధలేవో నేను పడతాను. నీ జీవితాన్ని నువ్వు చూసుకో..

నా కోసం ఆలోచించి నీ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోకు నీకు ఇంకా ఎంతో జీవితం వుంది... ఎన్నో మంచి రోజులు ఉన్నాయి.. ఇలా నాకోసం వృధా చేసుకోకు" అని అమ్మ బాధపడ సాగింది .

"అమ్మా! అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు ? నాన్న నా చిన్నప్పుడే చనిపోతే నువ్వు ఒక్కదానివే కష్టపడి నన్ను చదివించి నా అవసరాలను తీరుస్తూ నన్ను ఈ స్థాయికి తీసుకు వచ్చావు. నేను ఈ రోజు ఇలా నీ ముందు ఉన్నానంటే అందుకు కారణం నువ్వే!!

అలాంటిది నువ్వు కష్టంలో ఉంటే నిన్ను ఎలా వదిలేస్తాను అమ్మా"!!
అని నేను అంటుండగానే అసంకల్పితంగా నా కనుకొనుకుల్లోకి కన్నీరు చేరి వెచ్చగా చెంపల మీదికి జారిపోతున్నాయి...

మరుసటి రోజు హాస్పిటల్ నుండి ఒక నర్సు ఇంటికి వచ్చి రోజుకు రెండుసార్లు కాలిన చోట ఆయింట్ మెంట్ రాసి, డ్రెస్సింగ్ చేసి, బట్టలు మార్చి,ఇంజక్షన్ చేసి వెళుతోంది...

అమ్మకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ నేనే చేస్తూ తనకి వంట చేసి పెట్టి తినిపిస్తూ,పోషకాహారం అయిన జ్యూసులు అవీ తాగిస్తూ, అన్ని రకాలుగా సేవలు చేస్తున్నాను...

అమ్మ దగ్గరే వుండి చిన్నప్పుడు జరిగిన విషయాలు అన్నీ చెప్పి నవ్విస్తున్నాను. ఒక్క క్షణం కుాడా అమ్మ ని ఒంటరిగా వదలటలేదు...

నాకు సాధ్యం అయినంత వరకు అమ్మకి దిగులు, బాధ, భయం లేకుండా తన దగ్గరే వుంటుా తన శారీరక బాధలు నుంచి ఉపశమనం కలిగేలా జాగ్రత్త లు తీసుకుంటున్నాను...

అమ్మకి భగవద్గీత, సాయిబాబా జీవిత చరిత్ర , దత్తాత్రేయ పారాయణం చదివి వినిపించే వాడిని. మధ్య మధ్యలో పేక ఆడుతుా, చదరంగం ఆడుతుా, అమ్మకి బోర్ కొట్టకుండా చుాసుకుంటున్నాను.

ఇలా చూస్తుండగానే నాలుగు నెలలు గడిచిపోయాయి. అమ్మ క్రమంగా కోలుకోసాగింది. అమ్మ ఆరోగ్యం మెరుగు పడింది తన పనులు తాను చేసుకో సాగింది. గాయాలు తగ్గుముఖం పట్టాయి తనంతట తాను బాత్రూంకి వెళ్ల గలుగుతోంది...

ఒకరోజు డాక్టర్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్తే, డాక్టర్ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. "మీరు ఇంత ఫాస్ట్ గా రికవర్ అవుతారని మేము ఊహించలేదు.

ఇదంతా మీ అబ్బాయి చలువ వల్లనే జరిగింది అతను మిమ్మల్ని ఎంతో బాగా ప్రేమగా, జాగ్రత్తగా కంటిరెప్పలా చూసుకున్నాడు అందుకే మీరు ఇంత తొందరగా కోలుకున్నారు" అని డాక్టర్లు నన్ను మెచ్చుకుంటుంటే, అమ్మ నావైపు ప్రేమగా గర్వంగా చూసింది . అప్పుడు నా తల్లి కళ్ళల్లో పుత్రోత్సాహం కనిపించింది...

"మీరు చెప్పినట్లు నిజంగానే నా కొడుకు వల్లనే కదా మళ్ళీ నాకు పునర్జన్మ లభించింది.. వీడే లేకపోయి ఉంటే నేను ఈ పాటి కి ఎలాంటి పరిస్థితుల్లో ఉండేదాన్నో ఊహించుకోలేను" అంటూ నన్ను ప్రేమతో దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది అమ్మ...

అమ్మకి కొంత నయం అవ్వగానే నేను మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాను. అదృష్టవశాత్తూ నాకు తొందర్లోనే మంచి కంపెనీలోనే ఉద్యోగం వచ్చింది...

ఇంట్లో అమ్మకోసం ఒక ఆయాను మాట్లాడి, వంటపనికీ, ఇంటిపనికీ మనిషిని కుదుర్చుకున్నాను...

ఈలోగా పెళ్లి సంబంధం వాళ్ళనుంచి,అందులోనూ.. ఆ అమ్మాయి నుంచి ఫోన్ వచ్చింది.
"ఇదేంటి ఈ అమ్మాయి ఇప్పుడు ఫోన్ చేస్తోంది? బహుశా తనకి పెళ్లి కుదిరింది ఏమో !! ఆ విషయం నాకు చెప్పడానికి ఫోన్ చేసినట్టు వుంది...అనుకుని ఫోన్ తీసాను..

అప్పుడు ఆ అమ్మాయి "మీ అమ్మగారికి ఆరోగ్యం ఎలా ఉంది ? కొంచెం నయం అయిందా ?? ఒకసారి చుాడ్డానికి వద్దాం అనుకుంటున్నాను...ఈ సండే రోజున రావచ్చా"??" అని అడిగింది...

"ఇప్పుడు అమ్మకి బాగానే ఉంది తప్పకుండా రండి మీరు అందరూ ఎలా ఉన్నారు? పెళ్లి అయ్యిందా? " అని అడిగాను...

దానికి ఆ అమ్మాయి" మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు చెప్తాను!! ఉంటాను" !!!" అని ఫోన్ పెట్టేసింది...

ఆ సండే రోజు ఆ అమ్మాయి ఇంటికి వచ్చింది. అన్నీ రకాలు పళ్లు, స్వీట్లు , బిస్కెట్లు తీసుకుని వచ్చింది.

ఆ అమ్మాయి తన తల్లిని చూసి కాళ్లకు నమస్కారం పెట్టి"ఆరోగ్యం ఎలా ఉంది ఆంటీ"?? అంటూ క్షేమసమాచారాలు అడిగింది.

తను నాకేసి తిరిగి "మీరు మాకు ఫోన్ చేసి అలా చెప్పినప్పుడు, మేము ఆశ్చర్య పోయాము. తరువాత మీ మావయ్య గారు, మా ఇంటికి వచ్చి జరిగినదంతా మాతో చెప్పారు...

మీ అమ్మగారిని మీరు ఎంత బాగా చూసుకుంటున్నారో తెలిసాక.. పెళ్లి చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలి... ఇంకా ఎవరిని చేసుకో కూడదు అని నిర్ణయించుకుని, అదేమాట మా నాన్నకి కచ్చితంగా చెప్పేసాను"...

"తల్లి తండ్రులును ఓల్డ్ ఏజ్ హొమ్ లలో జాయిన్ చేసిన పిల్లలను చుాసేను గానీ , తల్లి కోసం జాబ్ నూ, పెళ్లినీ కూడా వదులు కోవడానికి సిద్ద పడ్డ మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా అనిపించింది...

తల్లిని ఇంత బాగా చూసుకుంటున్న వాళ్ళు భార్యని ఇంకెంత బాగా చూసుకుంటారో కదా?అందుకే ఎన్ని నెలలు అయినా మీ కోసమే ఎదురు చూస్తూ....ఉండాలని అప్పుడే నిర్ణయించుకున్నాను...

మీ అమ్మగారికి పూర్తిగా నయం అయ్యాక, ఆవిడ ఆరోగ్యంగా లేచి తిరిగినప్పుడు మనం పెళ్లి చేసుకుందాం. నేను మీ అమ్మ గారిని మా అమ్మ లాగా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ప్రామిస్!! " అని నా చేతిలో చేయి వేసింది...

అందుకు అమ్మ ఎంతో సంబరపడిపోయి "ఇలాంటి కోడలి కోసమే నేను ఎదురు చూస్తున్నాను. వాడి మంచి మనసుకు తగినట్లుగా నువ్వు సరియైన అర్థాంగి అవుతావు.మీరిద్దరూ కలకాలం సుఖంగా సంతోషంగా పిల్లాపాపలతో వుండాలని ఆ భగవంతుడుని కోరుకుంటున్నాను...

ఇప్పుడు నేను ఆరోగ్యం గానే ఉన్నాను..ఇంకా ఆలస్యం చేయకండి. నా కోసం పెళ్లి కేన్సిల్ చేసుకున్నాడని తెలిసిన దగ్గర నుంచీ చాలా బాధ పడుతున్నాను..ఇప్పుడు మనసులో వున్న బాధంతా మాయమైంది చాలా సంతోషంగా వుంది" మీరు వెంటనే పెళ్లి చేసుకోండి...అని చెప్పింది..

నాకు కుాడా చాలా సంతోషంగా అనిపించి వెంటనే ఒప్పేసుకున్నాను. "ఇన్ని రోజులు మాలో కలసిపోయే అమ్మాయి దొరికితే చాలు, మమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు అనుకునే వాళ్ళం నువ్వు మా ఇంటి దేవత లాగా వచ్చి మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటాను అంటే ఇంతకు మించిన ఆనందం ఉంటుందా!!

అయితే చిన్న కండీషన్ పెళ్లి ఆర్భాటంగా వద్దు. సింపుల్ గా చేసుకుని,ఆ డబ్బుతో పేదవాళ్లకి అన్నదానం చేసి బట్టలు పంచుదాము. సరేనా"!! అన్నాను.

"ఇంత మంచి మనసున్న మీరు ఏం చెప్పినా సరే ! మాకు అంగీకారమే." అంటూ అప్పటి వరకూ గుమ్మం బయటే నిలబడిన నా కాబోయే మామగారు నా మేనమామతో కలసి ఇంట్లోకి అడుగు పెట్టారు...

👌 తల్లిదండ్రులను చాలా బాగా చుాసుకుంటున్న కొడుకులు అందరికీ ఈ కథ అంకితం 👍
please read 🙏

Source - Whatsapp Message

అప్పట్లో కష్టం అంటే...

అప్పట్లో కష్టం అంటే...

తినడానికి..... సరైన తిండి దొరక్కపోవడం

చదివినా.... ఉద్యోగం దొరక్కపోవడ0

భార్యకి... భర్తపోరు... అత్తపోరు.

ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు

ఆరుగాలం కష్టపడిన రైతుకి... పంట చేతికి అందకపోవడం

ఇంటిల్లపాది....
ఒక్కరి సంపాదనతో బ్రతకడం

చాలీచాలని జీతాలు💵

ఇలా ఒకస్థాయిలో ఉండేవి.

మిగతావాటికి చాలావరకు సర్దుకుపోయేవారు.... సరిపెట్టుకునేవారు.

ఇప్పుడు కష్టం అనే రూపురేఖలు మారిపోయాయి.

పరీక్ష తప్పితే కష్టం.

అమ్మ తిడితే కష్టం.

నాన్న కొడితే కష్టం.

పాఠాలు నేర్పే గురువు అరిస్తే కష్టం.

సరైన చీర కొనకపోతే కష్టం.

ఇప్పటివారి కష్టాలకి కారణం ఒక్కటే.

అనుకున్నది.... దొరకాలి
అప్పుడు.... కష్టం లేనట్లు

పిన్నీసు దొరక్కపోయినా,
ప్రాణం పోయేంత.... కష్టం వచ్చినట్లు బాధ పడిపోతున్నారు.

అప్పట్లో మనస్సు చాలా బలంగా ఉండేది.

ఎందుకంటే చిన్ననాటి నుండి కష్టాలు చూసి పెరిగేవారు.

ఇప్పుడు కష్టం అంటే ఏంటో తెలియకుండా తల తాకట్టుపెట్టయినా పిల్లలు కోరిందల్లా వాళ్ళ కాళ్ళ ముందు పెడుతున్నాము.

మానసిక బలం తగ్గిపోబట్టి వాళ్ళకిప్పుడు ప్రతీది కష్టమే..

అంతెందుకు మొన్న

కర్ణాటక లో ఒక IAS ఆఫీసర్
కోస్తాంధ్ర లో ఒక IPS ఆఫీసర్
సినిమా హీరోలు..
ఎంతోమంది సబ్ ఇన్స్పెక్టర్లు...
ఐఐటీ స్టూడెంట్స్....
మెడికోస్...
కూడా మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య లు చేసుకున్నారు.

ఇప్పటి కొత్తతరం పెద్దలకి చెప్పేది ఏంటంటే.....

చదవండి.. చదివించండి.
దాంతోపాటే కష్టపడడం నేర్పండి...

మేము పడుతున్న కష్టం చాలు,....
పిల్లలెందుకు కష్టపడాలి.
అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు.

మీరు ఎంత కష్టపడుతున్నారో తెలియజేస్తూ వారిని పెంచండి.

అప్పుడే వారికి కష్టం విలువ తెలుస్తుంది.

జీవితంలో వారు స్థాయిలను చేరుకోవడానికి పునాది అవుతుంది.

మనమందరం అర్ధం చేసుకోవాలి....

Source - Whatsapp Message

హిందూదేశానికి సముద్ర మార్గాన్ని వెదకడానికి యూరోపియన్లు చేసిన సాహస యాత్రల వెనకాల చర్చ్ ప్రోత్సాహముంది.

చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదేమిటంటే 15,16 శతాబ్దులలో హిందూదేశానికి సముద్ర మార్గాన్ని వెదకడానికి యూరోపియన్లు చేసిన సాహస యాత్రల వెనకాల చర్చ్ ప్రోత్సాహముంది.

ఆనాటికి యూరోప్ అంతటా పోప్ మాటే చెల్లుబడి అవుతుండేది. భాషలవారీ జాతీయతగాని, రాజ్యాల వారీగా రాజరికాలుగాని అంత ప్రభావవంతంగా ఉండేవికావు. 1453లో తూర్పురోమన్ సామ్రా జ్యానికి రాజధానిగా ఉండిన కాన్స్టాంటినోపిల్ తురుష్కుల వశమైంది. దానిపేరు ఇస్తాంబుల్ గా మార్చటమేగాక ఆసియా దేశాలనుండి యూరోప్ దేశాలకు జరుగుతున్న వర్తక వాణిజ్యాలకు అడ్డుకట్ట వేశారు.

పర్యవసానంగా యూరోప్ దేశాలన్నీ గిలగిల కొట్టుకున్నాయి? అంతగా ఏమి ప్రమాదంవచ్చిందట? యూరోప్ ఖండం కర్కటరేఖకు ఉత్తరాన ఉన్న సంగతి మనకు తెలిసిందే. అంటే ఇటలీ, స్పెయిన్ వంటి కొద్దిదేశాలు మాత్రమే సమశీతోష్ణమండలంలో ఉండగా చాలాదేశాలు శీతలమండలంలో ఉన్నాయి. అక్కడ శీతాకాలంలో నదులు, సరస్సులు, సముద్రాలలో పైన ఉండే నీరు గడ్డకట్టుతుంది. పడవలు తిరగవు. చేపలవేట కుదరదు. కాబట్టి వేసవికాలంలో పట్టుకున్న వాటిని నిలువచేసుకుని శీతాకాలం తింటూ ఉంటారు. 15శతాబ్దమధ్య ఈ పరిణామం సంభవించిన నాటికి రిఫ్రిజిరేటర్లు కనుకొనబడలేదు. ఉప్పు, మిరియాలపొడిమిశ్రమాన్ని చేపలు చెడిపోకుండా ఊరవేసుకొనడానికి ఉపయోగించేవారు.

తురుష్కులు ఆసియాదేశాలనుండి సరఫరాలను ఆడ్డుకోవటంతో మొత్తం యూరప్ కి హిందూదేశం నుండి ఎగుమతిచేయబడే మిరియాలు రావటం బందయిపోయింది. ఆహారం నిలువచేసుకోవటమూ కష్టమైంది. ఇది ఒక దేశం సమస్య కాదు, అన్నిదేశాల సమస్య. ఒక ఏడాది సమస్యకాదు. ప్రతి ఏటా శీతాకాలంలోఎదురవుతున్న దుర్భరమైన సమస్య. యూరోప్ అంతటా హాహాకారాలు చెలరేగాయి.

వివిధ రాజ్యాల రాజులు పోప్ దగ్గరకు పోయి మొర పెట్టుకున్నారు. పోప్ ఎంత లోతుగా ఆలోచించాడో తెలియదుగాని, రెండు మూడు మాటలుచెప్పాడు. హిందూదేశం భూమిమీదే ఉందిగదా, హిందూదేశానికి ఇదితప్ప మరోమార్గం లేదనుకుంటే ఎలా? మీ రాజ్యాల లోని నావికులను పంపించి మరో మార్గం వెదికి పట్టుకోండి. అని ఆదేశించటమేగాక, ఆ నావికులు వెళ్ళేమార్గాలలో ఏయే దేశాలు, ప్రదేశాలు, భూభాగాలూ తటస్థపడతాయో, అక్కడ దేవుని వాక్యం వినిపించి అక్కడ నివసించే ప్రజలను క్రైస్తవులుగా చేయవలెనని, ఆ భూభాగాలపై రాజ్యాధికారాన్ని ఎవరుముందుగావెళ్ళి పాగావేస్తారో వారికి ఇచ్చేస్తున్నానని చెప్పాడు. ఇది యూరోపియన్ రాజ్యాల పాలకులకు ఉత్సాహా న్నిచ్చింది.

అయితే ఆనాటి వాస్తవస్థితి ఏమిటంటే యూరప్ లోని ఏరాజ్యానికి కూడా సంవత్సరం పొడవునా కొలువులో ఉండే సైన్యాలు ఉండేవి కావు. నౌకాసైన్యాలూ ఉండేవికావు. కొన్నిరాజ్యాలలో సముద్రపు దొంగలు ఉండేవారు. రాజులు ఆ సముద్రపు దొంగలను పిలిచి, సత్కరించి పోప్ ఆదేశాన్ని వినిపించి హిందూదేశానికి దారి కనుగొనే యాత్ర చేపట్టవలసిందిగా కోరారు. బహుమతుల ఆశతోపాటు, తాము కాలుపెట్టినచోట అధికారం చలాయించడానికి పోప్ అనుమతి, ఆదేశము ఉన్న మాట వారికి ఉత్సాహా న్నిచ్చింది.

అలా బయల్దేరి వెళ్లిన ఒక క్రిష్టఫర్ కొలంబస్ అమెరికా ఖండానికి వెళ్లి ఆదే హిందూదేశ మనుకున్నాడు. అక్కడి ప్రజలను రెడ్ ఇండియన్స్ గా వర్ణించాడు. అలా వెళ్లిన మరో వాస్కో డగామా అనే పోర్చుగీసు నావికుడు ఆఫ్రికా దక్షిణపు కొసవద్ద తుపానులో చిక్కుకొని స్కందుడు అనే హిందూదేశ నావికునిచే రక్షింపబడి అతని సౌజన్యంతో కేరళలోని కోఝికోడ్ వద్ద హిందూదేశపు భూమిపై అడుగు పెట్టాడు.

ఆతర్వాత రోజులలో ఈదేశంలో క్రైస్తవమతాన్ని వ్యాపింపజేయడానికి వారు అనుసరించిన పద్దతులు అమానుషమైనవి. దుర్మార్గమైనవి. అటువంటి పద్ధతులను ఎందుకు అనుసరించారంటే, పోప్ అనుమతి, ఆదేశమూ ఉన్నవని భావిస్తూ విర్రవీగు తున్నకారణంగానే వారు అంతక్రూరంగా వ్యవహ రించారు. ఆతర్వాత వచ్చిన ఆంగ్లేయులు కూడా ఇంచుమించుగా అంత క్రూరంగా వ్యవహరించారు.

మొదట్లో వంగివంగి సలాములు చేస్తూ మనరాజుల ప్రాపకం సంపాదించడానికి తీయగా మాట్లాడినా, కొద్దిపాటి పట్టుచిక్కగానే తమ ఈ భూమి కంతటికీ అధినేతలమని, అందరూ తమ మాటను విని తీరా లని బలప్రయోగాలకు మోసాలకు, కుతంత్రాలకూ పూనుకున్నారు. డల్హౌసి అమలుచేయబూనిన రాజ్యసంక్రమణ సిద్ధాంతానికి వెనక ఉన్నదికూడా తాము అడుగు పెట్టినచోట దేవుని రాజ్యాన్ని సుస్థిరంచేసే అధికారం పోప్ తమకు దఖలు పరిచినాడన్న భావనయే.

యావత్ప్రపంచమూ తమ కేలండరునే అనుస రించాలని, తాము నూతన సంవత్సరం ఆరంభంగా భావించే రోజునే అందరూ తప్పనిసరిగా భావించి కోలాహలంగా జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేస్తుండటం, వాటికి విస్తృతమైన ఏర్పాట్లుచేసే విధంగా అక్కడి ప్రభుత్వాలను, అధికారగణాలనూ ప్రభావితంచేయజూడటం - వీటి వెనకాల ఉన్నది కూడా ఆ మనో భావనయే.

మన మీద బలవంతంగా రుద్దబడుతున్న ఈ మనోభావనలను ప్రతిఘటించవలసిన బాధ్యత మనపై ఉందని మనదేశీయులందరూ గుర్తించి తదనుగుణంగా వ్యవహరించాలి.

కర్తవ్యమేవ కర్తవ్యం ప్రాణైః కంఠ గతై రపి.
అకర్తవ్యం న కర్తవ్యం ప్రాణైః కంఠ గతై రపి.

Source - Whatsapp Message

ఈ దేశ పునాది బ్రాహ్మణత్వంలో ఉంది అనేది యావత్ సమాజం విస్మరించకూడదు.

కొన ఊపిరితో చావు బతుకుల్లో ఉన్న మన సనాతన హిందూ ధర్మానికి ఊపిరి పోసి బతికించిన మహానుభావుడు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ...బ్రాహ్మణుడు.

ఆజాద్ హిందూ ఫౌజ్ ను స్థాపించి బ్రిటీష్ వారిని గడగడలాడించి తెల్ల కుక్కలకు పగలే చుక్కలు చూపిన ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ....బ్రాహ్మణుడు.

హిందూ పద బాదషాహీ , హిందూ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీని నడిపించి ఆది శంకరుల తర్వాత మళ్ళీ హిందూ ధర్మానికి జవసత్వాలు తీసుకువచ్చిన ధర్మప్రభువు సమర్థ రామదాసు ...బ్రాహ్మణుడు.

హిందూ ధర్మాన్ని , మన సనాతన గురుశిష్య పరంపరను , మన జ్ఞాన కేంద్రాలైన గురుకులాలను విధర్మీయులు కుట్రపన్ని క్రమేపి నాశనం చేయప్రయత్నిస్తూన్న తరుణంలో , అతి సామాన్యుడైన చంద్రగుప్తుడిని తన రాజనీతితో రాజుగా చేసి,హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి పునఃధర్మ స్థాపన చేసిన మేధోధీరుడు చాణక్యుడు...బ్రాహ్మణుడు.

పసికందును వెనక కట్టుకుని అరివీర భయంకర రణరంగంలో బ్రిటీషులను గడగడలాడించి,భారత మాతను బానిస సంకెళ్ళ నుండి విడిపించుటకు సింహగర్జన చేసిన ఆడ సింహం రాణి ఝాన్సీ లక్ష్మీబాయి....బ్రాహ్మణురాలు.

ఐక్యతారాగాన్ని ఆలాపించి,చెల్లా చెదరుగా విడిన హిందూ సమాజాన్ని ఏకం చేసి భారత స్వాతంత్ర సమరనాదాన్ని పూరించి , వాడవాడలా వినాయకుడిని స్థాపించి..తద్వారా భారత స్వాతంత్ర్యానికి పూనాదులు వేసి,మన సనాతన ధర్మ రక్షణకు ప్రాణాలు త్యాగం చేసిన భారత మాతా భక్తుడు బాల గంగాధర తిలక్ ...బ్రాహ్మణుడు.

నలంద , తక్షశిల లాంటి మన భారత దేశ జ్ఞాన కేంద్రాలను ఆక్రమణదారులు మట్టుబెట్టి భస్మీకృతం చేస్తే...అలాంటి జ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి , భారత మాతకు పూర్వ జ్ఞాన వైభవమును తేవాలని , జోలేపట్టి ఆఖరికి శవాలపై వేసిన డబ్బును ఏరుకోవడానికి వెనకాడక , భిక్షాటన చేసి బనారస్ హిందూ విశ్వవిద్యాలయము ( BHU ) ను స్థాపించి దేశములో విద్యావెలుగులను నింపిన అసమాన కీర్తిమంతుడు మదన మోహన మాలవీయ ...బ్రాహ్మణుడు.

కశ్మీరును స్వతంత్రం చేయాలని , భారతమాత శిరస్సు ఖండించబడకూడదని ఆరాటపడి పోరాటం చేసిన త్యాగధనుడు, జనసంఘ్ ను స్థాపించి భారత భవిష్యత్తుకు పునాదివేసి , ప్రాణాలు అర్పించిన డా॥ శ్యామా ప్రసాద్ ముఖర్జీ....బ్రాహ్మణుడు.

ఈ రోజు నేను హిందువుని అని ధైర్యంగా చెప్పుకునే స్వేచ్ఛా భిక్షను అనుగ్రహించిన,రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ( RSS ) ను స్థాపించిన డా॥ హెడ్గేవార్ ...బ్రాహ్మణుడు.

నేడు నరేంద్ర మోడీని చూసి యావత్ ప్రపంచం గర్విస్తూన్నది.ఆ నరేంద్ర మోదీ గారిని తీర్చిదిద్దిన భారతీయ జనతా పార్టీకి పురుడుపోసిన దీనదయాల్ ఉపాధ్యాయ...బ్రాహ్మణుడు.

అపర మేధావి , కవి , రచయిత...భారత యశస్వీ ప్రధానిగా కీర్తి గడించిన మన భారత రత్న అటల్ బిహారీ వాజపేయ్ ...బ్రాహ్మణుడు.

ప్రపంచ క్రికెట్ లో భారత దేశానికి అగ్ర స్థానాన్ని కల్పించి క్రికెట్ దేవుడిగా కీర్తింపబడే భారత రత్న సచిన్ టెండూల్కర్ ...బ్రాహ్మణుడు.

ఇలా చెబుతూ పోతే సంవత్సరాలు గడిచినా విషయం పూర్తవ్వదు.ఇది భారత జాతి కొరకు , భారత దేశం కొరకు , సనాతన హిందూ ధర్మం కొరకు తమ సర్వస్వాన్ని ధారపోసి , సంపూర్ణ జీవితాలను త్యాగం చేసిన త్యాగధనులైన బ్రాహ్మణుల చరిత్ర....ఎంత చెప్పినా తరగదు.

భారత మాత కొరకు కేవలం బ్రాహ్మణులే త్యాగం చేశారు...మిగితా వారు చేయలేదు...మిగితా వారు పాటుపడలేదు అనేది మా ఉద్దేశ్యం కాదు.దేశ నిర్మాణంలో అందరి పాత్ర ఉందీ...అన్నీ వర్గాల సమిష్టి పోరాటమే భారత రూపం.అందులో బ్రాహ్మణులు కూడా ఉన్నారనేది సమాజం గుర్తించాలి.

ఇంతటి త్యాగాలను చేసి దేశ వైభవాన్ని నిలిపిన , నిలుపుతూన్న బ్రాహ్మణుల గురించి చలన చిత్రాలలో వ్యంగ్యంగా చిత్రీకరించడం శోచనీయం...దానిని మిగితా హిందూ సమాజం ఖండించకపోవడం దౌర్భాగ్యం.

సినిమాలలో బ్రాహ్మణులపై వెధవ జోకులేయడం
బ్రాహ్మణులను కాలితో తన్నడం
బ్రాహ్మణులను రౌడీలకు సలహాదారుగా చూయించడం...ఇలా ఒకటా రెండా....ఏ చిన్న అవకాశాన్ని చిత్ర పరిశ్రమ వదలదు..బ్రాహ్మణులను కించపరుస్తూనే ఉంటుంది.

ఇకనైనా ఇటువంటి వెకిలి చేష్టలు మానాలి.
బ్రాహ్మణులు దేశ నిర్మాణంలో చేసిన సేవలను గుర్తించాలి.
వారికి తగిన గౌరవాన్ని కల్పించాలి.

బ్రాహ్మణత్వం నాశనమైన రోజు హిందూ ధర్మం నిలవదు.హిందూ ధర్మం నాశనమైన రోజు దేశం మిగలదు.

ఈ దేశ పునాది బ్రాహ్మణత్వంలో ఉంది అనేది యావత్ సమాజం విస్మరించకూడదు. గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు...🌷🙏🌷🙏🌷🙏.

॥ శ్రీమాత్రే నమః ॥

Source - Whatsapp Message

డిగ్నిటీ ఆఫ్ లేబర్

డిగ్నిటీ ఆఫ్ లేబర్

సికిద్రాబాద్ to వరంగల్ ట్రైన్ లో వస్తున్నా. నాముందు ఓ కుర్రాడు ఖాళీ గంపతో కొంచెం అలసటతో కనిపించాడు..

“నేను... ఏరా తమ్ముడూ!! సమోసాలు మెుత్తం అమ్మేసావా....”??

“అవును సార్!”

“పాపం రోజంతా కష్టపడుతున్నావ్?

“అవును సార్!!

ఏంచేస్తాం.. పొట్ట కూటి కోసం తప్పదు కదా!!”

ఒక సమోసా అమ్మితే ఎంత వస్తుంది...రా..???

“రూపాయి వస్తుంది సార్!!”

“రోజుకు ఎన్ని సమోసాలు అమ్ముతావు??”

“మంచి గిరాకీ ఉన్నప్పుడు దాదాపు 3,000 – 3,500 అమ్ముతాను.. ఇగ తక్కువలో తక్కువ 2000 సమోసాలు ఒక రోజుకు...గ్యారెంటిగ అమ్మే పోతా ఇంటికి

నా మెదడు ఒక్కసారిగా లెక్కలు వేయడం మొదలెట్టింది… రోజుకు 2,000 సమోసాలంటే వీడికి 2000రూ.. నెలకు ₹ 60,000/- రూ. ఓరి దేవుడో.. నా నెల జీతం 15,000రూ మాత్రమే.. వీడు నాకంటే బెటర్ గా ఉన్నాడనుకున్నా…
“తమ్ముడు మీరే తయారు చేస్తారా వీటిని”
“లేదన్నా మా యజమాని తయారుచేస్తారు...!!

“ఇవి కాకుండా ఏం చేస్తావు!!”
“వేరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా అన్నా..ఇంక సీజనల్ బిజినెస్ లు చేస్తా .... పోయిన సంవత్సరం ఎకరం పొలం కొన్నాను… నా అక్క పెళ్ళి చేసాను… ”
ఆ పొలం విలువ ఇప్పుడు పది లక్షలుంటది…????????

నాకు మాటలు లేవు.. ఏదో అనుకుంటాం కానీ వీడి సంపాదన ముందు మనమెంత.. అనుకుని
తమ్ముడు!! ఏం చదువుకున్నావు..
మూడో తరగతి…
ఏం నీకు చదవాలని లేదా!!!
సార్ నా వ్యాపారం నా పిల్లలకు ఇవ్వొచ్చు.. కానీ నీ ఉద్యోగం నీ పిల్లలకు ఇవ్వలేవు కదా!!

ఇదే మా అయ్య నాకు నేర్పిన నీతి… నాకు డబ్బు ఎలా సంపాదించాలో అర్థం అయ్యింది… ఇంక నాకు చదువెందుకు...??

అబ్బా ఎంత గొప్పనీతి సూత్రం!!!

అన్నా నా స్టేషన్ వచ్చింది నే పోతున్నా!!!

ఇప్పుడు చెప్పండి…. చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వారంతా గొప్పోళ్ళూ కారు….
చదువులేని వారు అనామకులూ కాదు…
మన ప్రతిభ ఎక్కడ ఉందో గుర్తెరిగి దానిని ఒక రీతిలో మలచు కుంటే…
రేపు మనదే…!!

దీనినే
‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ అంటారు.

Source - Whatsapp Message

యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి. ఇందులో 5 స్థాయులున్నాయి. అవి..

యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి.
ఇందులో 5 స్థాయులున్నాయి. అవి..
రథి,
అతిరథి,
మహారథి,
అతి మహారథి,
మహామహారథి.

1) రథి..💐
ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.

సోమదత్తుడు,
సుదక్షిణ,
శకుని,
శిశుపాల,
ఉత్తర,
కౌరవుల్లో 96మంది,
శిఖండి,
ఉత్తమౌజులు,
ద్రౌపది కొడుకులు -

వీరంతా..రథులు.

2) అతి రథి (రథికి 12రెట్లు)..💐
60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.

లవకుశులు,
కృతవర్మ,
శల్య,
కృపాచార్య,
భూరిశ్రవ,
ద్రుపద,
యుయుత్సు,
విరాట,
అకంపన,
సాత్యకి,
దృష్టద్యుమ్న,
కుంతిభోజ,
ఘటోత్కచ,
ప్రహస్త,
అంగద,
దుర్యోధన,
జయద్రథ,
దుశ్శాసన,
వికర్ణ,
విరాట,
యుధిష్ఠిర,
నకుల,
సహదేవ,
ప్రద్యుమ్నులు

వీరంతా..అతిరథులు.

3) మహారథి (అతిరథికి 12రెట్లు).💐
7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.

రాముడు,
కృష్ణుడు,
అభిమన్యుడు,
వాలి,
అంగద,
అశ్వత్థామ,
అతికాయ,
భీమ,
కర్ణ,
అర్జున,
భీష్మ,
ద్రోణ,
కుంభకర్ణ,
సుగ్రీవ,
జాంబవంత,
రావణ,
భగదత్త,
నరకాసుర,
లక్ష్మణ,
బలరామ,
జరాసంధులు

వీరంతా..మహారథులు.

4) అతి మహారథి (మహారథికి 12రెట్లు).💐
86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.

ఇంద్రజిత్తు,
పరశురాముడు,
ఆంజనేయుడు,
వీరభద్రుడు,
భైరవుడు -

వీరు..అతి మహారథులు.

రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు,
అటు ఇంద్రజిత్తు -
ఇటు ఆంజనేయుడు.
రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే.

5) మహామహారథి (అతిమహారథికి 24రెట్లు) .💐
ఏకకాలంలో 207,360,000
(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు,
దుర్గా దేవి,
గణపతి మరియు
సుబ్రహ్మణ్య స్వామి,

వీరంతా..మహామహారథులు.

మహామహారథులలో అమ్మవారు కూడా ఉండడం
హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ..యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు.
అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి ఏకంగా ఇరవైకోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మామూలు విషయం కాదు.
జై దుర్గా మాత..!!🙏

లోకా సమస్తా సుఖినోభవంతు..! 💐శ్రీ మాత్రే నమః🙏🙏🙏

Source - Whatsapp Message

మతం మార్చడం అంటే - తల్లిదండ్రులను మార్చినంత మహాపాపం - గరికపాటి నరసింహారావు

దయాగుణమునకు ఉన్న మహిమ !! కథ

మంచి కథ ఓపికతో చదవండి..

దయాగుణమునకు ఉన్న మహిమ !!
చాలా కాలం క్రితం ముసలి సన్యాసి ఒకాయన ఉండేవాడు. ఆయన సాధన బలం గొప్పది- అందువల్ల ఆయనకు కొన్ని అద్భుత శక్తులు కూడా సమకూరాయి...

వాటిలో ఒకటి, మానవుల తలరాతను చూడగలగటం. ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉండేవాళ్ళు. వాళ్ళలో ఎనిమిదేళ్ళ పిల్లవాడు కూడా ఒకడు ఉండేవాడు. ఒక రోజున ఆయన ఆ పిల్లవాడి ముఖం కేసి చూసీ చూడగానే ఆయనకు వాడి భవిష్యత్తు తెలిసిపోయింది: పిల్లవాడి ఆయుష్యు అయిపోవచ్చింది..

కొద్ది రోజుల్లో వాడు మరణించనున్నాడు! గురువు గారికి ఆ పిల్లవాడిని చూస్తే బాధ వేసింది. చనిపోయేటప్పుడు ఆ పిల్లవాడు తన తల్లి దండ్రుల దగ్గర ఉంటే మంచిదని ఆయనకు అనిపించింది. అందుకని ఆయన పిల్లవాడిని దగ్గరికి పిలిచి, "నాయనా! నువ్వు కొంతకాలంపాటు శలవు తీసుకొని, మీ యింటికి వెళ్ళు. వీలైనన్ని రోజులు మీతల్లిదండ్రులతో సంతోషంగా గడుపు....

వెనక్కి తిరిగి రావాలని తొందర పడకు" అని చెప్పి, ఇంటికి పంపించాడు. మూడు నెలలు గడిచాయి. ఆ పిల్లవాడు చనిపోయి ఉంటాడనుకున్నారు గురువుగారు...

అయితే ఒక రోజున, గురువుగారు కొండ మీద కూర్చొని క్రిందికి చూస్తూ ఆశ్చర్యపోయారు- ఆ పిల్లవాడు వెనక్కి తిరిగి వస్తున్నాడు! అతని ముఖంలోకి తదేకంగా చూసిన గురువుగారికి ఇప్పుడు అతను పండు ముసలివాడయ్యేంత వరకూ జీవిస్తాడని అర్థమైంది! "ఏమి చేయటం వల్ల, అతని రాత ఇంతగా మారింది?” అని గురువుగారికి ఆశ్చర్యం వేసింది....

"నువ్వు ఇక్కడినుండి వెళ్ళావు కదా, ఆరోజునుండీ ఏమేం జరిగాయో మొత్తం చెప్పు" అన్నారు శిష్యుడితో పిల్లవాడు తను ఇంటికి ఎలా చేరుకున్నాడోచెప్పాడు; మధ్య దారిలో తను చూసిని ఊళ్ళను గురించీ, తను దాటిన పట్టణాలను గురించీ చెప్పాడు; తను ఎక్కిన కొండల గురించీ, తను దాటిన నదుల గురించీ చెప్పాడు. "ఇంకా ఏమేమి విశేషాలున్నై?" అడిగారు.

గురువుగారుశిష్యుడు కొంచెం గుర్తుచేసుకొని చెప్పాడు: "ఒకసారి నేనొక వాగును దాటాల్సి వచ్చింది. వరద వచ్చి ఉన్నది- ఉధృతంగా ప్రవహిస్తున్నది, ఆ వాగు. వాగు మధ్యలో ఒక చిన్న మట్టి కుప్ప నిలచి ఉన్నది, ద్వీపం లాగా. ఆ మట్టి కుప్ప మీద ఒక చీమల గుంపు- ఎటు పోయేందుకూ వీలుకాక, ప్రాణభయంతో కొట్టు మిట్టాడుతున్నది. కొద్ది సేపట్లో ఆ మట్టి కుప్ప కరిగిపోతుంది- చీమలన్నీ నీటి పాలౌతాయి. నాకు వాటిని చూసి జాలి వేసింది...

ప్రక్కనే ఉన్న చెట్టు కొమ్మను ఒకదాన్ని ఆ మట్టి ముద్ద మీదికి వంచి, పట్టుకొని నిలబడ్డాను. చీమలు ఒక్కటొక్కటిగా ఆ కొమ్మమీదికి ఎక్కేసాయి. అవన్నీ భద్రంగా ఒడ్డెక్కేంత వరకూ నేను కొమ్మను అట్లాగే పట్టుకొని నిల్చున్నాను. ఆ తర్వాత నాదారిన నేను వెళ్ళాను...

ఆ చిన్న ప్రాణులను కాపాడగలిగానని నాకు చాలా సంతోషం వేసింది" అని. "
ఓహో, అదన్నమాట, కారణం! దేవతలు ఇతని జీవితాన్ని పొడిగించింది అందుకన్నమాట!"
అనుకున్నారు గురువుగారు...

దయతోటీ, ప్రేమతోటీ మనం చేసే పనులు మన రాతనే మార్చగలవు..

సేకరణ


Source - Whatsapp Message

మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు

#మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు

మీకు తెలుసా... ఇలాంటి పుస్తక సంపద 90 లక్షల గ్రంథాలను భక్తియార్ ఖిల్జీ నలందలో తగులబెట్టాడని... అవి అన్నీ కాల్చేందుకు వారికి ఒక సంవత్సర కాలం పట్టిందట... అన్ని గ్రంథాలు.... విజ్ఞాన సంపద ఉన్నాయి.. మన భారతీయుల దగ్గర..
(ఇతని పేరు మీద ఇప్పుడు ఒక ఊరు భక్తియార్ పూర్ అని ఉంది...దాని పేరు మారిస్తే బావుండు)
నేడు అమలులోలేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వ గ్రంథ శాస్త్ర రాజములు:
నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద. క్రింది మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు చూస్తుంటే నేడు మనకు ఇవి ఎలా అందకుండా పోయాయా అని ఆశ్చర్యం కలుగక మానదు.
1.అక్షర లక్ష: ఈ గ్రంథం ఒక ఎన్‌సైక్లోపీడియా గ్రంథము. రచయిత వాల్మీకి మహర్షి. రేఖాగణితం, బీజగణితం, త్రికోణమితి, భౌతిక గణిత శాస్త్రం మొదలైన 325 రకాల గణిత ప్రక్రియలు, ఖనిజ శాస్త్రం, భూగర్భ శాస్త్రం, జలయంత్ర శాస్త్రం, గాలి, విద్యుత్, ఉష్ణంలను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.

2. శబ్ద శాస్త్రం: రచయిత ఖండిక ఋషి. సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను, ప్రతిధ్వనులను ఇది చర్చించింది. ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం, వాటి పిచ్(స్థాయి), వేగాలను కొలవడం వివరించారు.
3. శిల్ప శాస్త్రం: రచయిత కశ్యప ముని. ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి. 307 రకాల శిల్పాల గురించి, 101 రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు. గుళ్ళు, రాజ భవనాలు, చావడులు మొదలైన నిర్మాణ విషయాలు 1000కి పైబడి ఉన్నాయి. ఇదే శాస్త్రంపై విశ్వామిత్రుడు, మయుడు, మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.

4. సూప శాస్త్రం: రచయిత సుకేశుడు. ఇది పాక శాస్త్రం, ఊర గాయలు, పిండి వంటలు, తీపి పదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేక రకాల వంటకాల గురించి, ప్రపంచ వ్యాప్తంగా ఆ విషయాలు, వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.
5. మాలినీ శాస్త్రం: రచయిత ఋష్యశృంగ ముని. పూల మాలలను తయారు చేయడం, పూలగుత్తులు, పూలతో రకరకాల శిరోఅలంకరణలు, రహస్య భాషలో పూవుల రేకుల పైన ప్రేమ సందేశాలు పంపడం లాంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.

6. ధాతు శాస్త్రం: రచయిత అశ్వినీ కుమార. సహజ, కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు. మిశ్రలోహాలు, లోహాలను మార్చడం, రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.
7. విష శాస్త్రం: రచయిత అశ్వినీ కుమార. 32 రకాల విషాలు, వాటి గుణాలు, ప్రభావాలు, విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.

8. చిత్ర కర్మ శాస్త్రం (చిత్ర లేఖన శాస్త్రం): రచయిత భీముడు. ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి. సుమారు 200 రకాల చిత్ర లేఖన ప్రక్రియల గురించి చెప్పారు. ఒక వ్యక్తి తల వెంట్రుకలను గాని, గోటిని కాని, ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది.
9. మల్ల శాస్త్రం: రచయిత మల్లుడు. వ్యాయామాలు, ఆటలు, వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు చెప్పబడ్డాయి.

10. రత్న పరీక్ష: రచయిత వాత్సాయన ఋషి. రత్నాలు కల్గి ఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి. వీటి శుద్దతను పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి. రూపం, బరువు మొదలగు తరగతులుగా విభజించి తర్కించారు.
11. మహేంద్రజాల శాస్త్రం: సుబ్రహ్మణ్య స్వామి స్వామి శిష్యుడైన వీర బాహువు రచయిత. నీటిపై నడవడం, గాలిలో తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.

12.అర్థ శాస్త్రం: రచయిత వ్యాసుడు. ఇందులో భాగాలు 3. ధర్మ బద్ధమైన 82 ధన సంపాదనా విధానాలు ఇందులో వివరించారు.
13. శక్తి తంత్రం: రచయిత అగస్త్యముని. ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని మొదలైన 64 రకాల బాహ్య శక్తులు, వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి. అణువిచ్చేదనం ఇందులోని భాగమే.

14. సౌధామినీ కళ: రచయిత మతంగ ఋషి. నీడల ద్వారా, ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది. భూమి మరియు పర్వతాల లోపలి భాగాల ఛాయా చిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.
15. మేఘ శాస్త్రం: రచయిత అత్రి ముని. 12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు, 64 రకాల మెరుపులు,33 రకాల పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.

16. స్థాపత్య విద్య: అదర్వణ వేదంలోనిది. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, కట్టడాలు, నగర ప్రణాళిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.
ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం, సాముద్రిక శాస్త్రం, అగ్నివర్మ విరచిత అశ్వ శాస్త్రం, కుమారస్వామి రచించిన గజ శాస్త్రం, భరద్వాజ ఋషి రచించిన యంత్ర శాస్త్రం మొదలగునవి, ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.

నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద. వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు.

Source - Whatsapp Message

Saturday, January 30, 2021

అందరూ తప్పక ఆచరించవలసిన వ్రతం

అందరూ తప్పక ఆచరించవలసిన వ్రతం :-

తప్పులెన్ను వారు తండోపతండంబు
లుర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వ దాభిరామ వినుర వేమ !


ఈ నాలుగు చిన్ని చిన్ని వాక్యాలలో - ఎంత అర్థం వుందో - చూడండి.

తప్పులెన్నువారు తండోపతండంబులు - నిజమే కదా...ఎక్కడి కెళ్ళినా - యిది మనం చూస్తూనే వున్నాము. ప్రపంచంలో అందరి తప్పులూ మనకు తెలుసు. అందరినీ విమర్శిస్తాం . మనలాగే మన పక్క వారూ. వారి పక్క వారూ - మనమందరూ అంతే. విమర్శించడం మన జన్మ హక్కు . పోనీ. మనం విమర్శించే తప్పు - కనీసం మనం చెయ్యకుండా వున్నామా? ..అదీలేదు.

ఆ తప్పు మనం చేస్తూనే, మరొకరిని విమర్శిస్తూ వుంటాం. అందుకనే వేమన అన్నారు - తప్పులెన్నువారు తండోపతండంబులు. నిజమే కదా!

"ఉర్వి జనుల కెల్ల వుండు తప్పు"

తప్పులే చెయ్యని వాడు ప్రపంచంలో పుట్ట లేదు. దేవతలు కూడా తప్పులు చేస్తారు వొక్కో సారి.
దానికి తగిన ఫలితమూ అనుభవిస్తారు.

పార్వతీ దేవి మగనికి అవమానం జరిగే యజ్ఞానికి వెళ్లి - తను కూడా అవమానం పాలైంది కదా. మహా యోగి శివుడు కూడా - యివ్వ తగని వరాలు యిచ్చి కస్టాలు అనుభవించాడు కదా. యివి కథలు కావచ్చు. కానీ మన కోసం చెప్ప బడ్డ జీవిత సూత్రాలు.

మరి మూడో వాక్యం చూద్దాం.. " తప్పులెన్నువారు తమతప్పులెరుగరు "

యిది చాలా ముఖ్యమైనది. చుట్టూ వున్న వారి తప్పులే, చూసే వారికి - తమ తప్పులు అసలు తెలీవు.


ఎవరో చేసే తప్పులు వేలెత్తి చూపుతాం. అదే తప్పు మనమూ చేస్తున్నట్టు గుర్తించం.

సరే. మనం చెప్పాం. వారు మారొచ్చు; మారక పోవచ్చు .

మారితే వారు బాగుపడ్డారు. మంచిదే. కానీ, మనమెప్పుడు బాగు పడేది? మనం ఎవరు చెబితే వింటాం?

"తప్పులెన్నువారు" మిగతా వారి మాటలు వినరు గాక వినరు. తమ తప్పులు చూడరు గాక చూడరు.

"నాలో తప్పులే లేవు" అనే వాడంత మూర్ఖుడు మరొకడు లేడు.

మనందరిలో తప్పులున్నాయి. వాటిని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ప్రతి నిమిషం వుంది.

ప్రతి రోజూ పడుకునే ముందు మనం చేసిన తప్పులు ఏమిటి అని చూసుకుని, వాటిని రేపెలా సరిదిద్దు కుంటామో ప్రణాళిక వేసుకొవాలి. దానికి దైవ సహాయం అడగాలి. అదే ప్రార్థన.

మీకు తెలిసే వుంటుంది - మన పూజల్లో - యిది వొక ముఖ్య భాగం. నేను తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు -వాటిని మనం పాపాలు అని అంటాం - వాటిని క్షమించు . మళ్ళీ వాటిని చెయ్యకుండా కాపాడు -అని ప్రార్థిస్తాము.

. దేవుడు ఎక్కడో లెదు. మన లోపలే వున్నాడు. బయటా వున్నాడు. ప్రార్థన రెండింటికీ అందుతుంది.

పక్క వాడి గురించి మాట్లాడ్డం - మన అలవాటు. అంతే.

సరే . మరెవ్వరి గురించీ - మనం మాట్లాడనే కూడదా ?

మాట్లాడొచ్చు . మొదట - వారి తప్పులు, మనలో లేకుండా చూసుకోవాలి. తరువాత - వారికి, మనం చెప్ప దగిన వాళ్ళమా, మనం చెబితే వారు వినే పరిస్థితిలో వున్నారా - అనేది కూడా చూడాలి.

సంస్కృతంలో ఒక సూక్తి వుంది. "సత్యం బ్రూయాత్; ప్రియం బ్రూయాత్; న బ్రూయాత్ సత్యమప్రియం".

సత్యం మాత్రమే చెప్పాలి. కాని, అది ప్రియంగా వుండేటట్టు చెప్పాలి . అలా మంచి మాటను మంచిగా చెప్పలేని వారు - చెప్పకుండా వుండడమే మంచిది.

మనం బాగు పడాలంటే - మన తప్పులు మనం తెలుసుకొవాలి. దిద్దుకోవాలి. యిది రోజూ చెయ్యాల్సిన పని. యిదే దైవ ప్రార్థన . యిదే ముక్తి మార్గం. యిదే మన సంతోషానికి రాచ బాట.

ఈ రోజు నుండీ - ఒక వారం రోజుల పాటు - "నేను ఎవరి తప్పులూ వేలెత్తి చూపను" అని ఒక వ్రతం పెట్టుకోండి.

మీ జీవన విధానంలో గొప్ప మార్పు వస్తుంది .

మీ మనసులో ఎంతో శాంతి, ఆనందం నిండుతుంది .
🙏కృష్ణo వందే జగద్గురుమ్🙏

Source - Whatsapp Message

అలా ఎందుకు అవుతుంది...................

అలా ఎందుకు అవుతుంది....................😉🤔


మనం ఎదురుగుండా ఉన్నంతసేపూ పొంగని పాలు ఒక్కక్షణం పక్కకి చూసే లోపులే పొంగుతాయి ఎందుకు!

వర్షం అనుకోకుండా పడుతుంటే గబగబా వెళ్లి బయట ఆరేసిన బట్టలు అన్నీ తీసి ఇంట్లోకి రాగానే వర్షం ఆగి భళ్ళున ఎండ వస్తుంది ఎందుకు!

గోరింటాకు పెట్టుకున్నప్పుడే ముక్కుకి దురద పెడుతుంది ఎందుకు!

కరెంటు పోయినప్పుడు మాత్రమే ఇంట్లో కొవ్వొత్తులు అయిపోయి ఉంటాయి ఎందుకు!

చీటికీ మాటికీ పొయ్యే కరెంటు పరీక్షలప్పుడు పోదెందుకు!

రోజూవచ్చే వర్షం బయటికి గొడుగుతో వెళ్ళినప్పుడు రాదెందుకు!

నేను ఆవులిస్తే పక్కవాడు కూడా ఆవులించడం ఎందుకు!

టి.వి లో వాళ్ళు ఆవులుంచినప్పుడు కూడా మనం ఆవులిస్తామెందుకు!

బస్సు ప్రయాణంలో పక్కవాడు నిద్దరోతే మనం కూడా పోతామెందుకు!

కార్ లో వెళుతున్నప్పుడు, తటాలున ముందు అద్దం మీద- పై నుంచి నీళ్లు ఒక్కసారే పడ్డప్పుడు ఉలిక్కిపడి సీట్ లో వెనక్కి జరుగుతాం ఎందుకు!


ఉలిక్కిపడి హఠాత్తుగా భయపడ్డప్పుడు నోటితో థూతూ అంటూ మనచేతితో వీపుపై మూడు సార్లు తట్టుకుంటాం ఎందుకు!

ఇంట్లో అన్నీ ఉన్నప్పుడు ఆకలి వేయకుండా,ఇంట్లో ఏ చిరుతిళ్ళు లేనప్పుడే ఆకలేస్తుంది ఎందుకు!

ఒక్కళ్ళమే కాఫీ తాగేటప్పుడు చటుక్కున వెళ్లే మన చేయి-స్నేహితుల తో కాఫీ తాగేటప్పుడు పర్సు దగ్గరకు మెల్లిగా వెళ్తుంది ఎందుకు!

హోటల్ లో మెనూ చూసినా- పక్కవాడి ప్లేట్ లో చూసిన తర్వాత ఆర్డర్ ఇస్తాం ఎందుకు!

రైల్ లో వెళ్ళేటప్పుడు ఎదుటివాడు భోజనం తినటం మొదలు పెడితే గాని మనం తినం ఎందుకు!

మొబైల్ ఫోన్ బ్యాటరీ ఆఖరి గీతలో ఉండగానే అర్జెంటు కాల్స్ వస్తాయి ఎందుకు!

సులభ్ టాయిలెట్ కి వెళదామనుకున్నప్పుడే చిల్లర ఉండదు ఎందుకు!

చీరల షాపులో బొమ్మకు కట్టిన చీర మొదట్లో నచ్చక షాపు అంతా తవ్వి చీర కొన్నాక బొమ్మకు కట్టిన చీరే నచ్చుతుందెందుకు!

అబ్బాయి తననే చూస్తున్నాడని అమ్మాయి అతని వైపు చూడకుండానే ఆ అమ్మాయికి తెలుస్తుంది ఎలా!

ఎప్పుడూ కళ్ళముందు విపరీతంగా తిరిగే ఓలా- ఊబర్ కార్లు, మనకి కావలసినప్పుడు ఎప్పుడూ ఆలస్యంగా వస్తాయి ఎందుకు!

మనకి కావాల్సిన వస్తువు అవసరం అయినప్పుడు ఇంత వెతికినా దొరకనిది- అవసరం తీరాక దొరుకుతుంది ఎందుకు!

మన ఎంత పైఅంతస్థులో ఉన్నా- కిందికి రోజూ దిగుతూనే ఉన్నా- కిందివాళ్ళ మీద చిన్నచూపు ఎందుకు!

“నీ, నా”అనే తేడాలేకుండా, మనస్ఫూర్తిగా, అరమరికలు లేకుండా మాట్లాడేవాళ్ళం -ఇప్పుడు వడకడుతూ (ఫిల్టర్ చేస్తూ) ఆచి తూచి-కృత్రిమంగా మాట్లాడుతున్నాం
ఎందుకు!


ఇందులో చాలావరకు సహజమైనవే, మరికొన్ని మనలో వచ్చిన మార్పు; మనిషి చాలా మారిపోయాడు, పరిస్థితులు కావచ్చు, స్వభావం కావచ్చు, స్వార్ధం కావచ్చు, గర్వం- అహంకారం చేరి ఉండొచ్చు -గతాన్ని మర్చి పోయి ఉండొచ్చు, కారణాలు ఏమైనా సరే.మరీ అంతలా మారాలా-అంత స్వార్ధం అవసరమా,మూలాల్ని,మన ఉనికికి మూలమైన వాళ్ళను మర్చి బతికేస్తుండటం ఏమి గొప్పతనం- అదో గొప్పతనమా.


ఏమి సాధించామని జీవితంలో, మనలా సంపదలతో, ఆర్జనలతో కొన్ని కోట్లమంది ఉన్నారుగా- ఏమిటి గొప్పతనం-పూర్వం ఓ సామెత ఉండేది “ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా” అని!

తమ ఒప్పూ తమ పచ్చా చూసుకోవడమేనా ఎప్పుడూ-చుట్టుపక్కల పరిసరాలు, మనుషులతో కూడా పరస్పరం పరిచయాలు, సంబంధాలు పెంచుకోవచ్చుగా-ఇందులో డబ్బు ఖర్చేమీ కాదుగా!


తనకు, తన కుటుంబానికి వెలుపల విశాల ప్రపంచం ఉంది-అందులోంచే ప్రతి ఒక్కరూ వస్తారు- ఇతరులతో మన అవసరాలు తీరాక పోనుపోనూ గిరి, గళ్ళు గీసుకొని బతికేస్తున్నాం - అదీ ఓ జీవితమేనా-దానికి ఓ సార్ధకత ఉందా?


మానవుడు స్వతహాగా సంఘజీవి-కాలక్రమేణా స్వార్ధజీవి అయిపోయాడు- ఆత్మపరిశీలన,అంతర్మధనం చేయాల్సిన సమయం వచ్చింది అని అనిపించట్లా.మన ప్రవర్తన, స్వార్ధం మనతీరు మన పిల్లలు చూస్తున్నారుగా- “ఆవు చేలో మేస్తుంటే, దూడ గట్టునుంటుందా”.అదే వాళ్ళూ నేర్చుకుని మనల్ని మించి స్వార్ధజీవులు అయితే! మన ముదిమిలో- వాళ్ళు మన బాటపడితే, మనం వంటరి అయిపోమా-ఇలా జరగదని హామీ లేదుగా, ఖచ్చితత్వం లేదుగా!


మనం ఇలా తయారు అవుతామనేనేమో-అందుకనే 150 ఏళ్ల పూర్వమే స్వామి వివేకానంద అన్నారు-🙏

“పిల్లలు మీమాట వినడం లేదని అనుకోవడం కాదు, మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు అని తెలుసుకోండి”

చక్కగా, నిస్వార్ధంగా బతకడానికి పెద్ద నేర్పరితనం అక్కర్లేదు, పెద్ద మనసు ఉండాలి-అందరి గుండె గుప్పెడేగా; ఆ గుండెనే కొద్దిగా లోపల విశాలంగా చేసుకుంటే జీవితంసుఖమంతం అవుతుంది! గుండె పెద్దది అయి డాక్టర్ దగ్గరకి వెళ్లేకంటే- అదే గుప్పెడు గుండె తో మంచిగా బతికేస్తే పోలా!




జీవితం చాలా అందమైనది.అది మన చేతల్లో, చేతుల్లో....

Source - Whatsapp Message

మూడు ముళ్ల బంధానికి, ఏడు అడుగులకు ఉన్న సంబంధమేంటి ?

మూడు ముళ్ల బంధానికి, ఏడు అడుగులకు ఉన్న సంబంధమేంటి ?

సాధారణంగా హిందు వివాహ సాంప్రదాయంలో వివాహ సమయంలో దంపతుల చేత ఏడు అడుగులు వేయిస్తారు. హోమం చుట్టూ వేసే ఆ ఏడు అడుగులనే సప్తపది అంటారు. సప్తపదిలో వేసే ప్రతి అడుగుకు ఒక్కో అర్థముందంటారు మన పెద్దలు.
ఇద్దరు వ్యక్తులను, రెండు కుటుంబాలను ఒకటిగా చేసేదే వివాహ బంధం. హిందూ సాంప్రదాయంలో వివాహ సమయంలో జరిగే వివిధ క్రతువులకు ప్రత్యేకమైన అర్ధం, పరమార్ధం ఉంది. అపరిచితులైన ఇద్దరు వ్యక్తులను మంత్రబద్ధంగా ఒకటిగా చేస్తుంది వివాహం. పెండ్లి కుమారుడు కళ్యాణమండపానికి వచ్చిన తర్వాత కళ్యాణ దీక్షా కంకణం కడతారు పురోహితులు. అమ్మాయి తల్లితండ్రులు వరునికి కాళ్లు కడిగి , తమ
కన్నబిడ్డను ధర్మార్ధ, కామ, మోక్షాలలో తోడుగా ఉంటానని ప్రమాణం చేయించి కన్యాదానం చేస్తారు. వివాహ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టి , పిమ్మట మాంగల్యధారణ జరుగుతుంది.

వివాహ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత వధువరుల కొంగు ముడులు కలిపి బ్రహ్మముడి వేస్తారు. వధువు చిటికిన వేలును వరుడు పట్టుకునీ అగ్ని హోత్రం చుట్టూ ప్రదక్షణ చేస్తూ ఏడు అడుగులు నడవడాన్నీ సప్తపది అంటారు. భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం. పూరోహితుడు వధూవరులిద్దరిని అగ్నిసాక్షిగా జీవితాంతం ఒక్కటిగా కలిసి మెలిసి ఒకరికొకరు తోడుగా, నీడగా ఉంటామనే ప్రమాణాలు చేయిస్తాడు.

"సప్తపది అంటే ఏడడుగులు కలిసి నడవడం"

ఇద్దరూ కలిసి ఏడడుగులు నడిస్తే మిత్రబంధం ఏర్పడుతుందని భావం. అందుకే పెద్దలు వివాహబంధం ఏడడుగుల బంధం అని అంటారు.మరి ఏడు అడుగుల వెనుక దాగున్న పరమార్థాలేంటో తెలుసుకుందాం...

మొదటి అడుగు
"ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు"

ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరిని ఒక్కటి చేయుగాక!"

రెండవ అడుగు..
"ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు"

ఈ రెండవ అడుగుతో విష్ణువు మనిద్దరికీ శక్తిని ఇచ్చుగాక

మూడవ అడుగు
త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు" ఈ మూడవ అడుగుతో విష్ణువు వివాహవ్రతసిద్ధిని అనుగ్రహించుగాక.

నాలుగవ అడుగు
"చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు" ఈ నాలుగవ అడుగుతో విష్ణువు మనకు ఆనందమును కలిగించుగాక.

ఐదవ అడుగు
"పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు" ఈ ఐదవ అడుగుతో విష్ణువు మనకు పశుసంపదను కలిగించుగాక.

ఆరవ అడుగు
"షడృతుభ్యో విష్నుః త్వా అన్వేతు " ఈ ఆరవ అడుగుతో ఆరు ఋతువులు మనకు సుఖమును ఇచ్చుగాక.

ఏడవ అడుగు
"సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు" ఈ ఏడవ అడుగుతో విష్ణువు మనకు గృహాస్తాశ్రమ ధర్మనిర్వహణకు అనుగ్రహమిచ్చుగాక. మొత్తం జీవితానికి అవసరమయిన అంశాలన్నింటిని ఈ ఏడు అడుగుల్లోకి ఇమిడ్చి ప్రామాణికంగా రూపొందించడాన్నే సప్తపది అని అంటారు.

Source - Whatsapp Message

పాలిష్ బియ్యం మానండి...

పాలిష్ బియ్యం మానండి...

ఎప్పటి నుండైతే మనిషి రైస్ మిల్లులను కనుక్కున్నాడో అప్పటి నుంచి బియ్యాన్ని పాలిష్ పట్టడం మొదలు పెట్టాడు. ఎర్రటి బియ్యాన్ని పాలిష్ మరలో పోస్తే, ఆ మిల్లు ఆ బియ్యంపై ఒక పొరను చెక్కేస్తుంది. ఆ చెక్కగా వచ్చిన పై పొట్టును మొదటి పాలిష్ అంటారు. ఈ పై పొరలో, బియ్యంలో ఉండే అతి ముఖ్యమైన పోషక పదార్థాలు 50 శాతం వరకూ పోతాయి. అవి ముఖ్యంగా 12 రకాలు. బి విటమిన్ల సముదాయం, విటమిన్-ఇ, పీచు పదార్థాలు, లిసిథిన్ మొదలైనవి ఈ మొదటి పాలిష్ లో అన్నీ ముఖ్యమైన పోషకాలే ఉన్నాయి.

అందుకే ఆ తౌడును మందుల కంపెనీల వారు కొనుక్కొని మందుల తయారీకి వాడతారు. ఈ తౌడునే ఖాళీ గొట్టాలలో పోసి, బలానికి గొట్టాలుగా తాయారు చేసి మనకి అమ్ముతారు. మొత్తం తౌడునే కాకుండా ఆ గొట్టాలలో నిల్వ ఉండడానికి, రంగుకు, వాసనకు కొన్ని మందులను కలిపి తయారు చేస్తారు.

తెల్లటి బియ్యం తిని బి-కాంప్లెక్స్ గొట్టాలు వేసుకోవడం ప్రజలకు తేలికగా ఉంది కదూ.

ఈ మొదటి పాలిష్ తౌడును బలానికని పాలల్లో వాడే పొడుల్లో, ఇతర బలవర్దక మైన ఆహార పదార్థాలలో కలుపుతూ ఉంటారు. మొదటి పాలిష్ పోగా వచ్చిన బియ్యం కొద్దిగా తెలుపే తప్ప పూర్తిగా తెలుపు రావు. అందుచేత ఈ బియ్యాన్ని మళ్లీ పాలిష్ కోసం మరలో పోస్తారు. దాంతో పెద్ద పొరను మిల్లులు దొలిచేస్తాయి. ఈ సారి తెల్లగా మెరిసిపోతూ వస్తాయి. ఇలా రెండవసారి వచ్చిన తౌడును (30 శాతం పోషక పదార్థాలుంటాయి) గేదెలకు, ఆవులకు, ఇతర పశువులు, చేపలకు, రొయ్యలకు బలానికి వాడతారు, ఆ తెల్ల బియ్యాన్ని మాత్రం వాడుకునేందుకు
మనం ఉంచుకుంటాం.

ఈ తౌడులో ఉండే పోషకాలు
Thiamine (B), Riboflavin, (B) Niacin, Pyridoxine (B) Pantothenic acid, Biotin, Choline, Folic acid, Inositol, zinc, iron, Manganese, Copper, lodine

తెల్లటి బియ్యంతో నష్టాలెన్నో...

తెల్లటి బియ్యాన్నిఎన్నో సంత్సరాలుగా తింటూ శరీరానికి ఎంతో నష్టాన్ని కలిగించుకుంటున్నాం. తెల్లటి బియ్యం వల్ల నష్టాలను తెలుసుకుందాం.

1). బియ్యంలో ఉండే 12 రకాల బి విటమిన్స్ 80 శాతానికి పైగా కోల్పోయి, కేవలం 15, 20 శాతం మాత్రమే మిగులుతాయి.

2). శరీరానికి బలాన్నిచ్చే బి విటమిన్లు సరిగా లేకుండా ఉన్న తెల్లటి అన్నాన్ని తిన్నందున ఎక్కువగా అలసిపోవడం, త్వరగా నీరసం రావడం, పిక్కలు లాగడం, కష్టపడి పనిచేయలేక పోవడం మొదలైనవన్నీ వస్తాయి.

ఉదాహరణకు మన ఇళ్లలో ఇప్పుడున్న 70, 75 సంవత్సరాల ముసలివారికున్న ఓపిక 50 సంవత్సరాల వారికి లేదు. ఆలాగే 50 సంవత్సరాల వారికున్న ఓపిక 25, 30 సంవత్సరాల వారికి లేదు. ఇక వీరికున్న ఓపిక చిన్న పిల్లల్లో లేదు. దీనికి కారణం చూస్తే తెల్లటి బియ్యాన్ని తినడం అని స్పష్టంగా తెలుస్తున్నది.

3). పై పొరలో విటమిన్ ఇ అనేది ఉంటుంది. ఇది త్వరగా ముసలితనం రాకుండా చేస్తుంది, తెల్లటి బియ్యంలో ఇది పూర్తిగా ఉండదు.

4). లిసిధిన్ అనే పదార్థం తెల్లటి బియ్యంలో ఉండదు. ఈ పదార్థం మనలో కొవ్వు, (కొలెష్ట్రాల్) పదార్థాలు పేరు కోకుండా నివారించేందుకు కొవ్వుకు విరుగుడుగా పని చేస్తుంది. తెల్లటి బియ్యం తినేవారికి ఈ రక్షణ శరీరంలో ఉండదు. గుండె జబ్బులు రాకుండా నివారించే శక్తి తెల్లటి బియ్యంలో ఉండదు.

5). పీచుపదార్థాలన్నీ బియ్యం పై పొరలలో ఉండడం వల్ల, తెల్ల బియ్యంలో పీచు లేనందువల్ల మలబద్ధకం వస్తుంది. ఎన్ని మందులు వాడినా తగ్గదు.

6). తెల్లటి బియ్యం తినేవారు ఎక్కువ బరువు పెరుగుతారు. ఈ బియ్యంలో పీచు పదార్థాలు లేనందు వల్ల తిన్న ఆహారం ద్వారా వచ్చిన శక్తి, రక్తం లోనికి ఒకేసారి చేరిపోతుంది. దాంతో శరీరం ఈ శక్తి అంతటిని కొవ్వుగా మార్చి వేస్తుంది. ఫలితంగా మధుమేహ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది అదే పీచు పదార్థాలుంటే ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తాయి.

7). తెల్లటి అన్నం మెతుకులు సన్నగా ఉండే సరికి, సరిగా పంటి కింద పడక, నమలకుండా తేలిగ్గా జారి గొంతులోకి వెళ్లిపోతూ ఉంటాయి. నమలనందుకు నోటిలో గానీ, పొట్టలో గాని జీర్ణక్రియ సరిగా ఉండదు.

8). శరీరానికి ఎక్కువ సేపు వరకూ, ఎక్కువ శక్తిని
సమకూర్చలేదు. తిన్న 3, 4 గంటలలోనే నీరసం వచ్చేట్లుగా చేస్తుంది.

9). తెల్లటి బియ్యం తినడం వల్ల బి కాంప్లెక్స్ గొట్టాలు, బలానికి టానిక్కులు తాగాల్సిన స్థితిని మనమే శరీరానికి కలిగిస్తున్నాం.

10). కాళ్లకు నీరు పట్టడం, తిమ్మిర్లు రావడం లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి.

11). తెల్లటి బియ్యంలో తేలిగ్గా జీర్ణమయ్యే కొవ్వు పదార్థాలు ఉండవు. తౌడులోకి ఈ కొవ్వు పదార్థాలు వెళ్లి పోతున్నాయిగా. ఈ ఉపయోగపడే కొవ్వు పదార్థాలు హాని లేకుండా శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తాయి. కానీ తెల్లబియ్యం తినే వారికి ఈ శక్తి లోపిస్తుంది.

12). తెల్లటి అన్నం రుచి ఉండదు, చప్పగా ఉంటుంది. పచ్చళ్ల తో తినాలినిపించే విధంగా చప్పదన ముంటుంది.

బలాన్నిచ్చే దంపుడు బియ్యం, తౌడుకు 10, 15 రోజుల్లో పురుగులు పట్టేస్తాయి. ముడి బియ్యంలో అయితే 2, 3 నెలలైనా గానీ పురుగు పట్టదు. అదే తెల్లటి బియ్యాని కైతే 7,
8 నెలలైనా పురుగు పట్టదు.

ముడి బియ్యం అన్నం అరగదనేది అపోహ మాత్రమే. గోధుమలు, రాగులను, జొన్నలను కూడా అన్నంగా వండుకునైనా తినవచ్చు. పళ్లు లేనివారు ఎర్రటి గోధుమ రవ్వను వండుకొని తినవచ్చు. విరేచనం సాఫీగా అవుతుంది. తెల్ల గోధుమ రవ్వ అయితే పాలిష్ పట్టి ఉంటారు కాబట్టి లాభముండదు. అన్నం బదులుగా రొట్టెలు లేదా మూడు, నాలుగు రకాల
గింజలను కలిపి ఆడించి ఆ పిండితో రొట్టెలు చేసుకోవచ్చు.

పాలిపోయే బియ్యపు అన్నాన్ని తినే సంస్కృతిని పక్కన బెట్టి మంచి బలాన్నందించే
ముడిబియ్యాన్నే వాడుకోవడం ఉత్తమం.

Source - Whatsapp Message

అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం..!

🌻 అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం..! 🌻

🍃🌹పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు.

🍃🌹ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే… ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే ‘బ్రహ్మముహూర్తం’ అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది.

🍃🌹నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు.

🍃🌹ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.

🌻 పురాణగాథ 🌻

🍃🌹బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది.

🍃🌹అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.

🌻 ఏం చేయాలి..? 🌻

🍃🌹ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది.

🍃🌹సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.

🍃🌹ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు… హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు.

🍃🌹అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.

🍃🌹చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.

🍃🌹బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.

🍃🌹బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము.
సర్వేజనాఃసుఖినోభవంతు సకలసన్మంగళాథిభవంతు లోకాసమస్తా సుఖినోభవంతు

🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

Source - Whatsapp Message

మృత్యు భయం ఎవరికి ఉండదు ...???

మృత్యు భయం ఎవరికి ఉండదు ...???
మరణానికి మరొక మారుపేరు "మార్పు". మార్పుని మనందరం చాలా సహజంగా స్వీకరిస్తాం. కానీ మరణం అనే పదాన్ని వాడగానే చాలా భయపడి పోతూవుంటాం
మనం జన్మించిన తరువాత, మన జీవితంలో మనం చేసిన మొట్ట మొదటి పని గాలి పీల్చడం. మనం చేసే చిట్టచివరి పని, గాలి వదిలేయడం. మనం ఊపిరి వదిలి మళ్లీ తీసుకోకపొతే, అదే మృత్యువు .... అంతే
“జీవితం ఎప్పుడూ అనిశ్చితమే. మృత్యువు మాత్రం నిశ్చయం.
ఈ విషయం తెలుసుకుంటే మృత్యువు కూడా శాశ్వతనిద్రగా స్వీకరిస్తావు . నిద్రలోని ఆనందం మృత్యువులోనూ పొందుతావు. “-అంటారు శ్రీభగవాన్ రమణ మహర్షి

ఈ దేహoపైన ప్రేమ.. మమకారం.. ప్రాపంచికతపై మోజు - తీరనంత కాలం, వియోగం పుట్టనంత వరకు - మృత్యువు భయంకరంగానే కనిపిస్తుంటుంది.

శ్లో: "దేహినోస్మిన్ యధాదేహే కౌమారం యౌవనం జరా తథాదేహాన్తర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి "
జీవికి బాల్యము, యౌవనము, వార్ధక్యము, మరియు దేహాంతరప్రాప్తి అను నాలుగు అవస్థలు కలవని. ఇవన్నియూ మార్పులే అని. మనిషి, బాల్యము పోయి, యౌవనము వచ్చినప్పుడు, దుఃఖించుటలేదు, యౌవనముపోయి, వార్ధక్యము వచ్చినప్పుడు దుఃఖించుటలేదు, కానీ వార్ధక్యము పోయి మరణం ఆసన్నమైనప్పుడు మాత్రము దుఃఖపడుతూ, భయం పొందుతూ ఉంటాడు. మనిషి, మనిషిపై అతిగా మమకారం, బంధాన్ని పెంచుకోవటంవల్ల భౌతిక వస్తువులు, సుఖాలపై ప్రీతిని, మోహాన్ని, బంధాన్ని అతిగా పెంచుకోవటంవల్ల తాను ప్రేమిస్తున్నవి తాను అనుభవిస్తున్నవి సుఖాన్ని ఇస్తున్నవి ఇక ఉండవేమో అన్న ఆలోచనే మరణంపై భయాన్ని కలుగచేస్తుంది.

మనిషి అన్నింటిని ఒప్పుకొంటాడు, కానీ ఒక్క మృత్యువు అంటే భయపడతాడు,
నేను దేనికి ఒరవను, భయపడను అన్న వాడు కూడా మృత్యువు అంటే ఆమడ దూరం పరుగెడతాడు...
మరి ఎవరికి ఈ మృత్యువు అంటే భయముండదు?
పురాణాలను చదివిన వారికా, పూజలు సల్పే వారికా, సేవలు చేసే వారికా, భజనలు నిర్వహించే వారికా?
అయితే, ఆ మృత్యువు అనే భయాన్ని ఆత్మజ్ఞానంతో అధిగమించవచ్చు. ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి, తద్వారా మృత్యుభయాన్ని దాటడానికే మనకు ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలను భగవంతుడు అనుగ్రహించాడు.
వీటినే శాస్త్రాలు అంటారు.
ఇలాంటి శాస్త్రాలను గురువుల వద్ద శ్రవణము చేసి ప్రయోజనం పొందాలి. ఇలా పొందాలంటే.. నిత్యానిత్య వివేకము, ఇహమూత్రార్థ భోగవిరాగము. శమదమాదిషట్క సంపత్తి, ముముక్షుత్వం అనే నాలుగు లక్షణాలు కలిగిఉండాలి. ఈ లక్షణాలు ఉన్నవారు మృత్యుభయాన్ని సులభంగా దాటగలరు.

ఒకసారి రామావతార సంఘటన చూద్దాం
శ్రీ రామ పట్టాభిషేకం సందర్భంగా, అయోధ్యా నగర మంతయూ, వివిధ అలంకరణ లతో, అశేష జన సందోహంతో కళకళలాడింది. ...

'మనువు' ధరించి న కిరీటం ధరించడం, సూర్యవంశ పురాజుల సాంప్రదాయం.
ఆ సాంప్రదాయ మును ననుసరించి, వశిష్ఠుడు, వామదేవుడు,జాబాలి ముగ్గురూ కూడి రాముని శిరస్సుపై ఆ కిరీటమునుంచారు...

అనేకమంది రాజులు, రారాజులు, సామంతులును, ఋషులు, ఈ మహోత్సవంలో పాల్గొన్నారు.
సింహ ద్వారము వద్ద, పెద్ద పెద్ద అక్షరాలతో,
" సత్యధర్మాభియుక్తానాం నాస్తిమృత్యుభయం" అని వ్రాయబడిన బోర్డు కనిపించింది.
అనగా .... సత్యధర్మాలతో జీవితం గడిపే వారికి, మృత్యు భయం లేదని అర్ధము....

ఎందుకంటే - సత్యధర్మాలను పాటించే వారికి మరే జన్మ ఉండదు. జన్మించారు అంటేనే కదా, మరణముండేది!

Source - Whatsapp Message