Saturday, January 30, 2021

మన మహర్షులు

 *🕉️భారతదేశ ధార్మిక నేపథ్యానికి, ఆధ్యాత్మిక తత్వానికి అవసరమైన బలమైన పునాదులను వేసిన మహనీయులు మన మహర్షులు.వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.🕉️* 


*మన మహర్షులు - 1*


 _*అగస్త్య మహర్షి*_


📚✍️ మురళీ మోహన్


🙏శ్రీలు పొంగిన పుణ్యభూమి, భారతావనిలో అనితర సాధ్యమైన మహత్కార్యాలు చేసిన మహాత్ముడు. ..అగస్త్య మహర్షి.


ఈయన పుట్టడం కూడా చాలా విచిత్రంగా పుట్టాడు అగ్నిదేవుడూ, వాయుదేవుడూ ఈ ఇద్దరి అంశతో నిండుగా నీళ్ళున్న ఒక పాత్రలోంచి పుట్టాడు అగస్త్య మహర్షి అందుకే ఆయనకు కలశజుడు, కుంభసంభవుడు ఔర్వశ్రేయుడు, మిత్రావరణ పుత్రుడు, వహ్నిమారుత సంభవుడు అని ఇంకా అనేక

పేర్లున్నాయి


అగస్త్య మహర్షికి చిన్నతనంలో ఉపనయనం, ప్రణవ పంచాక్షరీ మంత్రోపదేశం అన్ని దేవతలే చేసేశారు. ఆయన బ్రహ్మచర్యం తీసుకుని తపస్సు చేస్తూ ఉండేవాడు.


 ఒకసారి అడవిలో తిరుగుతూ  తలక్రిందులుగా వ్రేలాడుతూ ఉన్న మునులని చూసి మీరెందుకు ఇలా ఉన్నారని అడిగాడు అగస్త్య మహర్షి


ఆ మునులు.. నాయనా ! మమ్మల్ని పితృదేవతలంటారు. మాకు పుణ్యలోకం రావాలంటే నువ్వు పెళ్ళి చేసుకోవాలి లేకపోతే మా గతి ఇంతే అన్నారు


అగస్త్యుడు ఇది విని మరి పెళ్ళి చేసుకోవాలంటే మంచి వధువు కావాలి కదా అందుకని తన తపోబలంతో పుత్రకాముడనే పేరున్న విదర్శరాజుకి ఒక చక్కటి కుమార్తె పుట్టాలని వరం ఇచ్చాడు


ఆ అమ్మాయి పేరు లోపాముద్ర .ఆ లోపాముద్రని అగస్త్యుడు పెళ్ళి చేసుకుని తనతో ఆశ్రమానికి తీసుకువచ్చాడు. 



మణిమతీ పురానికి రాజు 'ఇల్వలుడు' అయనకి 'వాతాపి' అనే తమ్ముడుండే వాడు. ఇల్వలుడు తన తమ్ముడు వాతాపిని చంపి బ్రాహ్మణులకి వండి పెట్టేవాడు. తర్వాత వాతాపిని పిలవగానే వాతాని బ్రాహ్మణులు కడుపులో నుంచి బయటకి వచ్చేవాడు, ఈ విధంగా అన్నదమ్ములిద్దరూ కలిసి బ్రాహ్మణులని చంపేసేవాళ్ళు,


అగస్త్యుడు ధనం కోసం  ఇల్వలుడి ఇంటికి వెళ్ళాడు. మామూలుగానే ఇల్వలుడు. ఇల్వలుడు వాతాపి చంపి, వండి పెట్టి, మళ్ళీ వాతాపిని పిలిచాడు. కానీ అగస్త్యుడు భోజనం చెయ్యగానే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం' అన్నాడు. వాతాని జీర్ణం అయిపోయాడు. ఇల్వలుడు ఎంత పిలిచినా వాలాకు బయటికి రాలేదు. ఉంటే కదా ... రావడానికి.


ఇల్వలుడు అగస్త్యుడికి ధనం, బంగారం, ఆవులు ఇన్ని ఇచ్చి పంపించాడు, తర్వాత అగస్తుడికి ధృడస్యుడు  అనే కొడుకు, తేజస్వి అనే మనుమడు కలిగారు. పితృదేవతలు పుణ్యలోకాలకి వెళ్ళిపోయారు.



వృత్రుడు అనే రాక్షసుడు ఇంద్రుణ్ణి జయించి ధర్మచరిత్ర గల మహర్షులందరినీ రాత్రి సమయంలో చంపి పగటి సమయంలో సముద్రంలో దాక్కుని ఉండేవాడు


మహర్షిలందరూ కలిసి ఆ సముద్రజలాన్ని అగస్త్య మహర్షికి దానమిచ్చారు. అగస్త్యుడు ఆ సముద్రాన్ని తన కమండలంలో పట్టి ఒక్క గుటకలో త్రాగేశాడు. వృత్రాసురుడు బైటపడ్డాడు. దధీచి దేహాన్ని ఆయుధాలుగా చేసుకుని దేవతలు వృత్రుణ్ణి చంపేశారు.




అగస్త్య మహర్షి దండకారణ్యంలో నివసిస్తూ ఉండగా శ్రీరాముడు అరణ్యవాసం చెయ్యడానికి వెడుతూ అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఖడ్గము విల్లు బాణాలు అక్షయమైన అమ్ములపాటి రాముడికి ఇచ్చి దీవించాడు. అగస్త్యుడు కొంతకాలం తర్వాత రామరావణ యుద్ధం అప్పుడు ఆదిత్యహృదయం అనే మహాస్తవం ఉపదేశించాడు.


పూర్వం సహుషుడనే రాజు సూరు అశ్వమేధ యాగాలు చేసి ఇంద్రపదవిని పొందాడు. కానీ, ఐశ్వర్యం ఉందన్న అహంకారంతో శచీదేవిని తనతో ఉండమని అడిగాడు. శచీదేవి మునులను వాహనంగా చేసుకుని రమ్మంది. నహుషుడు శచీదేవి రగ్గరికెడుతూ మునులని రథం మొయ్యమని చెప్పాడు. పూర్వాచార్యులు మంత్రాల్ని, బ్రాహ్మణుల్నీ నిందించటం తప్పని చెప్పిన అగస్త్యుడి తల మీద తన్నాడు సహుషుడు, సహుఘడిని క్రూరసర్పముగా మారమని శపించాడు అగస్త్యుడు. తర్వాత నహుషుడి కోరిక మీద పూర్వజ్ఞానం ఉండేలా కరుణించాడు అగస్త్యుడు


అగస్త్యుడు 'ద్వాదశ వార్మిక యజ్ఞం' చేశాడు. అంటే ఆ యజ్ఞం వన్నెండు సంవత్సరాలు జరిగింది. దానికి ఇంద్రుడు సహకరించలేదు. అప్పుడు అగస్త్యుడు తానే ఇంద్రపదవి పొంది వర్షాలు కురిపించి నిధులు తెచ్చుకుంటాను అన్నాడు. మునులు ఇంద్రుడు భయపడి కుంభవృష్టి కురిపించాడు.


సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తిరగడం లేదని వింధ్యపర్వతం కోపగించి సూర్య, చంద్ర, నక్షత్రాల గమనం ఆపేసినప్పుడు 'మేం తిరిగి వచ్చే వరకు నువ్వు భూమికి సమానంగా ఉండు. మేమిప్పుడు దక్షిణాపథం వెడుతున్నామని '

చెప్పాడు. ఈ విధంగా వింధ్య పర్వతానికి సహజంగా ఉండే పెరుగుదల కూడా లేకుండా దాని గర్వాన్ని

ఆడిగించాడు అగస్త్యుడు .


 అగస్త్యుడు భార్యతో కలసి యాత్రలు చేస్తూ గోదావరీ తీరంలో ఉన్న పంపానరోవరం, దండకారణ్యం, గోదావరీ తీరం, కోటిపల్లి, పలివెల, భీమేశ్వరం

ద్రాక్షారామం, వీరభద్రశేఖరం మొదలయినవి చూసి కొల్హాపురం చేరి అక్కడ లక్ష్మీదేవికి స్తోత్రం చేశాడు.


 లక్ష్మీదేవి అగస్త్యుణ్ణి ద్వాపర యుగంలో వేదవ్యాసుడవై పుట్టి వారణాశిలో ఉంటావని దీవిస్తుంది.




పరశురాముడు అగస్త్యుడు అచ్చిన కృష్ణకవచాన్ని ధరించే ఇరవై ఒక్కసార్లు రాజుల్ని చంపగలిగాడు.ఒకప్పుడు ఇన్ద్రద్యుమ్నుడు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ అగస్త్యుడు రావడం చూడలేదు, అగస్త్యుడికి కోపం వచ్చి ఏనుగునై పుట్టమని పించాడు, శ్రీమద్ భాగవతం లో గజేంద్రమోక్షంలో ఉన్న గణేంద్రుడే ఈ ఇంద్రద్యుమ్నుడు.


అగస్త్యుడు రాసిన గ్రంథాలు 'అగస్త్యగీత అగస్త్యసంహిత", 


అగస్త్య మహర్షి ఎప్పుడూ లోకం కోసమే పాలుపడ్డాడు. ఎంతో మందికి విద్యాదానంచేశాడు. ఎంత చెప్పినా అయిపోని గొప్పతనం ఆయనది.🙏


🍁🍁🍁🍁🍁🍁

*మన మహర్షులు - 2*


 *అత్రి మహర్షి* 


🍁🍁🍁🍁🍁


📚✍️ మురళీ మోహన్


*అత్రి మహర్షి  సప్తమహర్షులలో  ఒకరు.*


🙏అత్రి మహర్షి బ్రహ్మదేవుడి మనస్సులోంచి పుట్టాడు. 


అంటే బ్రహ్మమానస పుత్రుడన్నమాట. అలా పుట్టిన అత్రి మహర్షిని బ్రహ్మదేవుఁడు “లోక రక్షణ కోసం నేను కొంతమందిని సృష్టిస్తున్నాను, నువ్వు గొప్ప తపశ్చక్తిని పొంది నాకు ఈ సృష్టికార్యంలో సాయపడాలి" అని అడిగాడు


అందుకు అత్రి మహర్షి సరే! అలాగే సాయపడతానని చెప్పి ఒక మంచి అనుకూలమయిన ప్రదేశాన్ని చూసుకుని తపస్సు ప్రారంభించాడు


ఈ మహర్షి చేసిన ఘోరతపస్సుకి ఆయన కళ్ళల్లోంచి ఒక గొప్ప తేజస్సు బయటికి వచ్చి భూమి, ఆకాశం అన్ని దిక్కులా వ్యాపించి పోయింది. ఆ తేజస్సుని భూమ్యాకాశాలు కూడా భరించలేక పోవడం వల్ల అది సముద్రంలో పడిపోయింది


ఇది బ్రహ్మదేవుడికి తెలిసి ఆయన ఆ తేజస్సుని అత్రిమహర్షికి  తేజస్సు యొక్క కొంత అంశతో చంద్రుడు కుమారుడుగా పుడతాడని, క్షీరసాగర మథన సమయంలో మిగిలిన అంశ వచ్చి చంద్రుడిని కలుస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు.


 కొంతకాలం తర్వాత, అత్రి మహర్షికి  అనసూయాదేవితో వివాహం జరిగింది. 

. అనసూయాదేవి గొప్ప

పతివ్రతగా వినుతికెక్కింది.


 ఒకనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అనసూయాదేవిని పరీక్షిద్దామని బయలుదేరి అత్రిమహర్షి ఆశ్రమానికి వచ్చారు. 


అత్రి మహర్షి అనసూయాదేవి వారికి ఆతిథ్యం ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పుడు త్రిమూర్తులు మహర్షితో మాకు వడ్డించే స్త్రీ నగ్నంగా వడ్డించాలి

అన్నారు. అనసూయాదేవి అంగీకారంతో అత్రిమహర్షి మీ కోరిక ప్రకారమే అన్నాడు.



త్రిమూర్తులు స్నానం చేసి కూర్చున్నాక అనసూయ వారిమీద మంత్రజలం చల్లి చంటి పిల్లల్లా చేసి నగ్నంగా వడ్డించింది. మళ్ళీ దుస్తులు ధరించి వాళ్ళ ముగ్గుర్ని మంత్రజలంతో మామూలుగా చేసి తినండి అంది. భోజనం తర్వాత మళ్ళీ చంటి పిల్లల్ని చేసి ఉయ్యాలలో వేసింది.


త్రిమూర్తుల్ని వెతుక్కుంటూ సరస్వతి, లక్ష్మి, పార్వతి వచ్చి అనసూయ దగ్గర చంటి పిల్లల్ని చూసి మా భర్తల్ని మాకియ్యమని అడిగి అత్రి అనసూయలను మా ముగ్గురి అంశలతో ముగ్గురు పిల్లలు కలుగుతారని దీవించి తమ భర్తల్ని తీసుకుని వెళ్ళిపోయారు.


ఒకసారి కౌశికుడి భార్య, సూర్యుడు ఉదయించగానే తన భర్త చనిపోతాడని తెలిసి సూర్యుడు ఉదయించకుండా చేసింది. అనసూయాదేవి సూర్యుడు ఉదయించేటట్లు చేసి కౌశికుణ్ణి కూడా బ్రతికించింది.


అత్రి మహర్షి సంతానం కోసం  వంద సంవత్సరాలు భార్యతో కలిసి తపస్సు చేశాడు.


అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమై పిల్లలు కలిగేలా వాళ్ళని ఆశీర్వదించారు.


 కొన్నాళ్ళయ్యాక అత్రి మహర్షి  

 అనసూయా దేవికి చంద్రుడు,  దత్తాత్రేయుడు, దుర్వాసుడు అనే పేర్లతో ముగ్గురు పిల్లలు పుట్టారు.


సంసారపోషణార్ధం  పృథు చక్రవర్తి దగ్గరకు ధనం కోసం  వెళ్ళాడు అత్రి మహర్షి.


ఆ సమయంలో పృథుచక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్నాడు. ఆ యాగాశ్వాన్ని రక్షించడానికి తన కుమారుడితో వెళ్ళమని పృథు చక్రవర్తి అత్రి మహర్షిని అడిగాడు. అత్రి మహర్షి సరేనని బయల్దేరాడు.


పృథు చక్రవర్తి వైభవాన్ని చూడలేక ఇంద్రుడు యాగాశ్వాన్ని దాచేశాడు. 


అత్రి మహర్షి తన దివ్యదృష్టితో చూసి ఆ విషయం పృథు చక్రవర్తి కుమారుడికి చెప్పాడు.


 అతడు ఇంద్రుణ్ణి జయించి ఆ యాగాశ్వాన్ని తీసుకుని వచ్చాడు.


అశ్వమేధయాగం పూర్తయ్యాక పృథు చక్రవర్తి ఇచ్చిన ధనం, వస్తువులు మొదలయిన వాటిని తీసుకువెళ్ళి పిల్లలకిచ్చి అత్రి మహర్షి అనసూయా దేవితో కలిసి తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోయాడు.


 ఒప్పుడు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది. అందులో రాహువు వేసిన అస్త్రాలకి సూర్యచంద్రుల్లో వెలుగు తగ్గిపోయి లోకమంతా చీకటయిపోయింది. అప్పుడు

అత్రి మహర్షి తన చూపులతోనే రాక్షసులందర్ని చంపేశాడు.


అత్రి మహర్షి రచించిన ఆత్రేయ ధర్మశాస్త్రంలో దాన ధర్మాలు, జపతపాలు రహస్య పాయశ్చిత్తాలు మొదలయిన వాటి గురించి తెలియచేయబడ్డాయి.


. అలాగే అత్రి సంహితలు అనే గ్రంథాల్లో ఆచారాలు, గురుప్రశంస, చాతుర్వర్ణ ధర్మాలు, జపమాలాపవిత్రత, పుత్రులు దత్తపుత్రులు మొదలయినవాటి గురించి తెలియచేయబడ్డాయి.


దత్తపుత్రుణ్ణి స్వీకరించవచ్చు అనే దాన్ని గురించి మొట్టమొదట ప్రవేశపెట్టింది.

అత్రిమహర్షి......!



చదివారు కదా !... సప్తమహర్షుల్లో ఒకడయిన అత్రి మహర్షి గురించి...


రేపు మరో మహర్షి గురించి తెలుసుకొందాం...🙏



🍁🍁🍁🍁



No comments:

Post a Comment