Thursday, January 28, 2021

ఉపయోగించుకోవడంలో ఉంది

మనస్సులో సంతోషం లేనప్పుడు...
నువ్వు ఏడంతస్థుల మేడలో ఉన్నా...
ఏమి లేని గుడిసెలో ఉన్నా ఒక్కటే.

మనస్సులో ఒర్వలేనితనం ఉన్నప్పుడు...
నువ్వు ఏడుకొండలు ఎక్కినా...
ఏడుస్తూ పూజచేసినా, ఒక్కటే.

పాదంలో గుచ్చుకున్నా, ముల్లు తొలగిపోతే, నడవడం ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
మనసులో అహంకారం తొలగిపోతే, జీవించడంలో ఆనందం అనుభవమవుతుంది.

నడిచే కాళ్ళలో ఎంత అంతరం.
ఒకటి ముందుంటే మరొకటి వెనుక.
కానీ ముందు ఉన్నందుకు అభిమానము లేదు వెనుక ఉండడములో అవమానము లేదు.
ఎందుకంటే వాటికి తెలుసు క్షణంలో తమ స్థానాలు మారుతాయని. దీనినే జీవితం అంటారు.
అందుకే నవ్వుతూ సంతోషంగా ఉండండి.

మనం చలి కాచుకోవడానికి, ఆహారం తయారుచేసుకోవడానికి, ఉపయోగపడే నిప్పు,
మనల్ని కాల్చి బూడిద చేయగలదు.
లోపం నిప్పులో లేదు.
దాన్ని ఉపయోగించుకోవడంలో ఉంది.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Source - Whatsapp Message

No comments:

Post a Comment