" మన భారతీయ సంస్కృతిలో "యతి నియమములు" మరియు ప్రత్యేకతలు. సేకరణ మరియు సమర్పణ: "మజుందార్, బెంగుళూర్" 87925-86125. నేడు పీఠాధిపతులు, స్వామీజీలు, చేతియందు దండం పట్టుకుని, కాషాయ రంగు వస్త్రములు చుట్టుకునే సంచరించే వారిని తరచూ చూస్తూ ఉంటాము. కానీ మనకు సరి అయిన అవగాహన, ఉండదు, వారు ఎలా ఉండాలి అనేది కూడా మనలో చాలా మందికి తెలియదు. అనవసర వ్యాఖ్యలు చేస్తారు ఏమి తెలియకుండా కూడా, వారికి ఎన్నో నియమాలు, నిష్టలు ఉండును, కొన్ని విషయాలు నాకు తెలిసిన, విన్న, కన్నా, విషయాలు మేరకు, తెలుసుకుందాం! "మోక్ష ర్ధి " అయిన వారికి శాస్త్ర అధ్యయనం విధిగా ఉండి తీరాల్సిన లక్షణం. "యతులకు" మరీ తప్పనిసరి. మోక్షానికి భక్తి మార్గమని మన మత సంస్కర్తలు పేర్కొన్నారు. "మోక్ష సాధన" ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి. అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్తమమైన జన్మ . ఈ జన్మమునందు భక్తి సారంతో జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. మరీ యతి వరుల చేతిలో కర్ర (దండం) పట్టుకుంటారు. ఎటువంటి పరిస్థితులలో దానిని వదిలిపెట్టరు. ఈ దండము వైరా గ్యానికి, తాత్వికత కు, ద్వైత, అద్వైత, భావానికి గుర్తుగా పట్టుకుంటారు. వీటి ఆకారములు బట్టి, ప్రతిదానికి ఒక అర్థము బోధపడును. పంచభూతాల సమ్మేళనమే" మనిషి", కాబట్టి సన్యాసులు ఐదు అడుగుల కర్ర ధరిస్తారు. ఏక, ధ్వి, త్రి, అను మూడు విధాలు, వీటికి" రావి చెట్టు" కర్ర వాడతారు. ఒక కర్రను (ఏకదండి) ధరించి ఉండేవారు. మీరు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారు. జీవుడు- దేవుడు ఒకటేనని సిద్ధాంతము వీరిది. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాప ఫలితాన్ని బ్రతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు. అదే సిద్ధాంతమును బోధిస్తారు. వీరి చేతుల్లో జ్ఞానానికి సంకేతమైన (బుద్ధుడు కూర్చున్న రావి చెట్టుకింద జ్ఞానము సంపాదించిన సేకరించిన ఒక కర్ర) ఉంటుంది. మరి రెండు కర్రలు కలిపి ఒకటిగా కట్టి (ద్వి దండి) ధరించి బోధనలు చేసే వారు. "ద్వైత సిద్ధాంతాన్ని " నమ్మి ఆచరించే వారు, (శీ మద్వాచార్యులు ) వీరు వైష్ణవ భక్తులు. శివుడు ని కూడా పూజిస్తారు. జీవాత్మ -పరమాత్మ వేరు వేరు అనే ఈ సిద్ధాంతాన్ని భారత యుద్ధంలో "శ్రీకృష్ణుడు" అర్జునునికి బోధిస్తాడు. మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి (త్రిదండి) భుజాన పెట్టుకునేవారు కూడా ఉన్నారు. దీనిని తత్వ త్రయం అంటారు. ఇలా ధరించేవారు విశిష్టాద్వైతము ను బోధిస్తారు. శరీరములో జీవుడు ఉన్నట్లు జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని జీవాత్మ, పరమాత్మ ,ప్రకృతి సత్యము ఈ మూడింటిని నారాయణ తత్వం నమ్ముతూ జీవుడు అజ్ఞానంతో సంసార బంధము చిక్కు కుంటాడని శరణు వేడిన వారికి భగవంతుని అనుగ్రహం వలన అజ్ఞానం నుండి విముక్తులై మరణానంతరము నారాయణ సన్నిధానం, మోక్షము పొందుతారని వారికి మరుజన్మ ఉండదని "విశిష్టాద్వైత" సిద్ధాంతాన్ని బోధిస్తారు. యతులు అనేవారు సకల సద్గుణ వంతుడు, సర్వజ్ఞుడు, శాస్త్ర పరిణితి, వాదనా కౌసల్యం, తత్వ దీక్ష, విషయ వైరాగ్యము, వాక్సుద్ధి, తపస్సు, శుద్ధి, అపార లోకజ్ఞానం, విశిష్ట సమయ మనం, అపార స్థితప్రజ్ఞత, "శీహరి " పట్ల అచంచలమైన భక్తి, సమానుల పట్ల మైత్రి, చిన్నవారి పట్ల ఆదరణ, విశిష్ట తత్వం రంగరించి ఉండాలి. సన్యాస దీక్ష తరువాత పీఠాధి కారిగా. నియమించేటప్పుడు, వేదాంత పీఠం మీద కూర్చోపెట్టి, పట్టాభిషేకం చేసి, శిరస్సు మీద సాలి గ్రామాల నుంచి, శంఖం తో నీటిని నింపి పురుష సూక్తము తో మంత్రాలను పఠిస్తూ, అనేక పండితులు సైతం వేద మంత్రోచ్ఛారణలతో అభిషేకించి, కొత్త నామం పెట్టు తారు. అది చూసి నా! విన్న వారు ధన్యులు, ఒళ్ళు పులకించి పోవును. ఈ యతులు నిత్యం సంచారం చేస్తూ ఉండాలి. బలమైన కారణం ఉంటే తప్ప ఒకే చోట మజిలి చేయుట, చాతుర్మాస దీక్ష కాలములో మాత్రం ఒకే చోట ఉంటారు. వాళ్లను మాత్రమే "పరివ్రాజకులు" అంటారు. రాజకీయాలకు అతీతంగా ఉంటారు. నేటికీ ద్వైత సిద్ధాంతం వారు మడి ఆచారం , శోచం, పాటించుట, బొగ్గులు, కట్టెలు, వంట నేటికి కనిపించుచున్నది. వీరి నియమాలు కొన్ని చూద్దాం! 1)" కాషాయ రంగు, బట్ట చుట్టుకుంటారు. కట్టుకోరు. 2)" మొలత్రాడు, యజ్ఞోపవీతం వీరికి ఉండదు. 3)"లంగోటా కడతారు, కానీ దానికి కుట్టు వెయ్యరు. దారం కుట్టు పనికిరాదు. 4)"వారు పూజ చేయుటకు చాలా "నిబద్ధత" తో కూడిన నియమాలు ఉంటాయి. సువాసన గల పుష్పాలనే వాడతారు. అరటి నారతో కట్టిన "పూల దండలు" భగవంతునికి వినియోగిస్తారు. 5)" ఉప్పు, కారం తగ్గించి తింటారు. "ఏకాదశి" రోజు నీరు కూడా త్రాగరు. ఆ రోజు పూజ నందు కొబ్బరికాయ కూడా కొట్టరు. 6)" ద్వాదశి పారాయణ టైములోనే దేవుని పూజ చేసి పారాయణ చేస్తారు. నిత్యం పూజ, నిత్యం సాలిగ్రామ తీర్థము తీసుకుంటారు. తరువాతే ప్రసాదము స్వీకరిస్తారు. 7)" సంచారము చేసి వచ్చిన తర్వాత దేవుడికి కట్టిన బట్టలు విప్పి, బంగారు లేదా వెండి రేకు అడ్డుపెట్టి తిరిగి స్నానం చేసి వచ్చి జపం, తపం, సంధ్యావందనం చేసుకుని, శ్రీ రామదేవుని పూజ దీక్ష తీసుకుంటారు. ఆ సమయమందు వాయుదేవుడు ఒంటిమీద ఉంటారు, ఎక్కువ సేపు" వాయు దేవుడు" వారిని భరించుట కష్టము తలకు "శాటి" కట్టుకుంటారు. ఇక వారు ఎవరిని చూడరు, తాకరు, మాట్లాడరు, హారతులు విశేషముగా ఇస్తారు, వాటిని అసిస్టెంటు రెడీ చేస్తూ, దగ్గరగా పెడతారు. అభిషేకము చేసిన బంగారు ,వెండి ,రాగి, పాత్ర లను స్పీడ్ గా విసురుతున్న వాటిని శిష్యుడు పట్టుకుంటాడు. ద్వాదశ స్తోత్రములతో నివేదనలు అందచేస్తారు. భక్తులకు నివేదన కనిపించకుండా గుడ్డ అడ్డుగా కడతారు. పూజా సమయంలో "యతులు" మోకాళ్ళు, పాదములు, భగవంతునికి కనపడకుండా పైన గుడ్డ కప్పు కుంటారు. దేవుడికి నైవేద్యం పెట్టి నారాయణ మంత్రం జపం 108 సార్లు చేస్తారు. జపం చేయునప్పుడు ముఖం, చేతులు, కనబడకుండా గుడ్డ కప్పుకుంటారు . పూజ పూర్తి అవగానే చివర దండం పట్టుకుని మూడుసార్లు ప్రదక్షిణ చేస్తారు. భగవంతుని పాదాలను కళ్ళకు వద్ద పెట్టుకుంటారు. ధ్యానం నిమగ్నులై అవుతారు. ఆ సమయంలో శిష్యుడు ఒకరు ఆ విగ్రహము ఏ కాలము నాటిది ఎవరు పూజించినది,విశేషణ, వివరణాత్మకంగా అచట ఆసీనులైన భక్తులకు వివరించుట ప్రత్యేక ఆకర్షణ. దేవతార్చన పెట్టెలను జింక చర్మము తో చేసిన వాటితో చుట్టి భద్రపరుస్తారు. ఒక పెద్ద ఇత్తడి పెట్టె నందు భద్రపరచు తారు. ఆ దేవుడికి పెట్టే చుట్టూ మూడు సార్లు దండము తో పట్టుకొని 3 ప్రదక్షిణాలు చేసి, సాష్టాంగ నమస్కారము పెట్టుకుంటారు. 8)" యతులకు మొదటి అర్హత:- తనకున్న సమస్తాన్ని భగవంతునికి సమర్పించడం, తనకు ఉన్నదే కాదు తాను చూసింది ప్రతిదీ భగవంతుడి ఆదీనమే అని విశ్వసించాలి. 9)" మోక్షర్థి" అయిన యతికి శాస్త్ర అధ్యయనం విదిగా ఉండి తీరాలి. ప్రతిరోజు శిష్యులకు బోధన చేయాలి. చిన్న వాళ్లకి పెద్ద వాళ్లు ఎప్పుడూ నమస్కరించు తారు,. చుట్టూ తిరిగి ప్రదక్షణం చేయుట అనేది సన్యాసం తీసుకుని తల్లి తండ్రి అంగీకరించినట్లే. యతి ఒక్క తల్లి కి తప్ప, మనుషులు ఎవ్వరికి నమస్కరించ రాదు. పాద పూజలు, బిక్ష, "ముధ్ర ధారణ " మొదలగు విశేషములను మరొకసారి ముచ్చటించుకుందాం! (సశేషం)
Source - Whatsapp Message
Source - Whatsapp Message
No comments:
Post a Comment