Friday, February 26, 2021

మంచి మాట... లు

ఆత్మీయ బంధు మిత్రులకు శుభోదయ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.... రహస్యం..అనేది నీ దగ్గరున్నంతసేపూ నీకు బానిస. మరొకరికి చెప్పావంటే ఇక అది నీకు యజమాని. మీ AVB సుబ్బారావు 🌷🤝💐🙏
సోమవారం --: 22-02-2021 :--
ఈ రోజు AVB మంచి మాట... లు
మన జీవితం సాఫిగా నడుస్తున్నంత కాలం హాయిగానే ఉంటుంది కానీ మన జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు వాటిని నీకు అనుకూలంగా మార్చుకున్నప్పుడే మనమేంటో అందరికీ తెలుస్తుంది .

మనం కలవటానికి మనం విడిపోవటానికి చూపించే తొందర ఆలోచించటానికి మనల్ని అర్థం చేసుకోవటానికి చూపిస్తే ప్రతి బంధం కూడా అనందంగానే ఉంటుంది .

ప్రేమ లేని మనిషి ఈ ప్రపంచంలో ఉండరు గాయం లేని గతం కూడా ఉండదు ఇవి రెండూ లేనిదే మన జీవితమే ఉండదు జీవితంలోజరిగిన మధురమైన సంఘటనలు మర్చిపోతే కానీ బతకలేం కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేం అలలకు అలసట ఉండదు ఆశలకు హద్దు ఉండదు ఇదే జీవితం .

మనిషి ఎలాంటి వాడంటే .
పక్కవాడు బాగుపడుతుంటే పైకి ప్రేమ నటిస్తూ , లోపల ఈర్ష్యతో రగిలిపోతారు . అదే ఒకడు నాశనం అవుతుంటే , లోపల సంతోషిస్తూ బైట బాధగా నటిస్తాడు . ప్రపంచమే రంగస్థలం మనుషులే మహానటులు అని ఊరికే అనలేదు మహానుభావులు .

సేకరణ ✒️ *మీ ... AVB సుబ్బారావు 🌷💐🤝🙏

Source - Whatsapp Message

ప్రశాంతతకి లాజిక్కు

❤️💚❤️💚❤️💚❤️💚❤️💚❤️💚

. ప్రశాంతతకి లాజిక్కు

గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఒక రోజుకి 7000 లీటర్లు పంప్ చేస్తుంది. మా ఇంటి నీళ్ళ ట్యాంకు 1000 లీటర్లు. అలాంటి 7 ట్యాంకుల రక్తాన్ని గుండె ఒక్క రోజులో పంప్ చేస్తుంది.

ఇందులో 70% మెదడుకి వెళుతుంది. 30% మిగతా శరీర అవయవాలకు వెళుతుంది.

గుండె ఒకసారి కొట్టుకోటానికి 0.8 సెకన్ల సమయం పడుతుంది. ఈ 0.8 సెకన్ల సమయంలో 0.3 సెకన్ల సమయం సంకోచించటానికి (contraction), 0.5 సెకన్ల సమయం వ్యాకోచించటానికి (అంటే రిలాక్స్ కావటానికి). ఈ 0.5 సెకన్ల రిలాక్స్ టైమ్ లో రక్తం ఊపిరి తిత్తులకు వెళ్లి శుభ్రపడుతుంది. ఈ రిలాక్స్ టైమ్ తగ్గితే రక్తం సరిగా శుభ్రపడదు.

మీరు టెన్షన్ లో గానీ కోపంతో గానీ ఉంటే ఏమవుతుంది? మీ మెదడుకి ఎక్కువ రక్తం అవసరమవుతుంది. అప్పుడు గుండె తక్కువ రిలాక్స్ అవుతుంది. 0.5 బదులు 0.4 సెకన్ల టైమ్ రిలాక్స్ అవుతుంది. గుండె ఒక బీట్ కి 0.8 కి బదులు 0.3 + 0.4 = 0.7 టైమ్ మాత్రమే తీసుకుంటుంది. నిమిషానికి 84 సార్లు కొట్టుకుంటుంది. గుండెకి విశ్రాంతి (రిలాక్సేషన్) 20% తగ్గుతుంది. రక్తం 80% మాత్రమే శుభ్రపడుతుంది.

ఈ అపరిశుభ్రమైన రక్తం మీ మెదడుని మీ శరీర అవయవాలని సరిగా శుభ్రపరచలేకపోతుంది.

కనుక కోపపడవద్దు, టెన్షన్ పడవద్దు. ఇతరులమీద కోపం, ద్వేషం బదులు మీరు ప్రేమ చూపిస్తే మీ గుండె 72 సార్లు కొట్టుకుని మీ మెదడు ప్రశాంతంగా చురుకుగా ఉంటుంది.

గుండె నెమ్మదిగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది

❤️💚❤️💚❤️💚❤️💚❤️💚❤️💚

Source - Whatsapp Message

మంచి మాట...లు

ఆత్మీయ బంధు మిత్రులకు ఆదివారం శుభోదయ శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. మనసును అదుపులో పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది నీ మనస్సు అన్నిటికీ మూలం
ఆదివారం --: 21-02-2021 :-- ఈరోజు AVB మంచి మాట...లు

నీవు నిజాయితీ గా ఉండటం కూడా ఒక యుద్థం లాంటిదే , ఆ యుద్థంలో ఒంటరిగా నిలబడటం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండటం కూడా అంతకన్నా ఎక్కువే కష్టం .

మీరు మీ జీవితంలో ఎప్పుడైనా గుర్తుంచుకోండి అతిగా మాట్లాడితే మన గౌరవాన్ని కోల్పోతాం , అతిగా ఆశపడితే మన సంతోషాన్ని కోల్పోతాం , అతిగా ఆలోచిస్తే మన ప్రశాంతతను కోల్పోతాం , అతిగా ఇష్టపడితే మన విలువను కోల్పోతాం , అందుకే ఏది అతిగా వద్దు .

మనకంటూ ఒక తోడున్నప్పుడు వచ్చే దైర్యం మనం ఎన్ని ఆస్తులు సంపాదించినా రాదు . ఆస్తిని కాదు నీ కంటూ ఒక మనిషిని సంపాదించుకో ‌డబ్బును చూసి కాదు మనిషి వ్యక్తిత్వాన్ని చూసి గౌరవించు . అందం చూసి కాదు అందమైన మనసును చూసి ప్రేమించు కోప్పడటం అలగటం ఈ రెండూ ఉన్నవారు మీ జీవితంలో ఉంటే వాళ్ళని ఎప్పటికి వదులుకోకండి ఎందుకంటే వాళ్ళకి నటించడం రాదు .

సేకరణ ✒️ మీ ... AVB సుబ్బారావు ✒️🌷🤝🕉️🙏

Source - Whatsapp Message

మంచి మాటలు

మంచి మాటలు


🪴ఐకమత్యం అంటే మనం కుక్కమీద రాయి విసిరితే కుక్కపారిపోతుంది. అదే.. తేనెతుట్టి మీద విసిరితే మనమే పారిపోవాలి !


🪴ఇద్దరు కొట్టుకుంటే.. ఒక్కరే గెలుస్తారు. రాజీపడితే... ఇద్దరూ గెలుస్తారు

🪴దేవుడికోసం తీర్ధాలు, పుణ్యక్షేత్రాలంటూ తిరుగుతావ్, ఆయనెక్కడోలేడు. శ్వాస తీసుకుంటూ సృష్టితో నువ్వేసుకున్న 'లంకె'లోనేవున్నాడు.

🪴సృష్టంతా అద్భుతమే. అందులో నువ్వూ భాగమే. ఆ అద్భుతమే భగవానుడు. అది తెలుసుకుని దాన్ని అనుభవించు, ఆనందించు.

🪴కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు. ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... నీకు గొడుగుపట్టి కాపాడతాడు... గుర్తుంచుకో ..

🪴జ్ఞానం.. ఆలోచించి మాట్లాడుతుంది. అజ్ఞానం.. మాట జారాక ఆలోచిస్తుంది. అమాంతం అజ్ఞానం పోయి జ్ఞానంరాదు.

🪴కొబ్బరిచెట్టు పెరిగేకొద్దీ పాతమట్టలు రాలిపోతాయి. జ్ఞానం కలిగేకొద్దీ తనపర భేదాలు తొలగిపోతాయి.

🪴పుండు మానితే పొలుసు అదేపోతుంది. పుండు మానకుండానే పొలుసు పీకేస్తే… పుండు తీవ్రమై రక్తం కారుతుంది ! జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలగాలి. ఆత్రపడితే లాభంలేదు !

🪴సముద్రమంత సమస్యొచ్చిందని దిగులుపడకు. ఆకాశమంత అవకాశం కూడా వుంది. తలెత్తి చూడు ముందు. నీపై నీకు నమ్మకం కావాలి.

🪴నీపై నమ్మకం నీకుబలం. నీపై అపనమ్మకం అవతలివారికి బలం !నీబలం ఎవరికీ తెలియకపోయినా నీవు బ్రతికేయవచ్చు.. నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు నిన్ను నిన్నుగా బ్రతకనివ్వరు !

🪴మరణం అంత మధురమైనదా ? ఒక్కసారి దాన్ని కలిసినవారు వదిలిపెట్టలేరు ?ప్రకృతికి కూడా అదంటే ఎంత పక్షపాతం ! ప్రాణంపోయిన జీవుల్ని నీళ్ళలో తేలుస్తుంది. ప్రాణమున్న జీవుల్ని నీళ్ళలో ముంచుతుంది !

🪴నీ పరిసరాలనెంత శుభ్రంగా వుంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలడు. వాటిని ఆరోగ్యంగా వుంచుకో.

🪴వెంటరాని ఇంటిని, ఒంటిని రోజూ కడుగుతావ్.. నీవెంట వచ్చే మనసునెప్పుడు కడుగుతావు ?

🪴నిజాయితీపరులు సింహంలాంటి వాళ్ళు. సింహం కూర్చోటానికి సింహాసనమెందుకు ? అదెక్కడ కూర్చుంటే అదే సింహాసనం. నిజమైన నిజాయితీపరులకు గుంపు అక్కర్లేదు !



🪴పండు తింటే అరిగిపోతుంది. తినకపోతే ఎండిపోతుంది. జీవితం నువ్వు ఖుషీగా గడిపినా, భయపడుతూ గడిపినా కరిగిపోతుంది !



🪴ఇప్పటిదాకా ఇతరుల కోసమే (నావాళ్ళనుకుంటూ) బతికేశావు. ఇప్పటికైనా ఆరోగ్యంగా, ఆనందంగా నీకోసం నువ్వు బతుకు.

🪴వచ్చే జన్మలో నువ్వెవరో, ఎక్కడ, ఎలా పుడతావో, అసలు జన్మవుందో లేదో తెలీదు.


🪴నువ్వు 'నావాళ్ళు నావాళ్ళు' అనుకుంటుంటే వాళ్ళు తర్వాత 'వాళ్ళవాళ్ళకోసమే' బతుకుతారు. నీకంటూ ఎవరూ ఉండరు. ఏమీ మిగలదు !

🪴అర్ధం చేసుకుంటే.. పుట్టిందగ్గర్నుంచీ- పోయేందుకే మన ప్రయాణం ! ఈమాత్రం దానికి పుట్టటమెందుకో తెలియదు. తెలుసుకోటంలోనే వుంది కిటుకంతా.. అందుకే ఈ జీవితమంతా !

🪴మరణం దగ్గరపడితేనే మహాసత్యాలు బోధపడ్తాయ్.



మానవులుగా బతకటం కాదు..
మానవత్వంతో బతకాలి
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Source - Whatsapp Message

మంచి మాట.. లు

ఆత్మీయ బంధు మిత్రులకు శనివారపు శుభోదయమరియు భీష్మాష్టమి శుభోదయ శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబ సభ్యులకు లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ.. బతకడం చాలా చాలా సులభం, కాని జీవించడమే చాలా కష్టం మీ AVB సుబ్బారావు..
శనివారం --: 20-02-2021 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు
మనకు కొన్ని పరిచయాలు మొదట్లో ఎంత సంతోషపెడుతాయో చివరికి అంతే బాధపెడతాయి . నా వల్ల ఎవరు బాధ పడకండి తెలియక మీ జీవితాల్లోకి వచ్చాను మిమ్ముల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి . నేను ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను .

మీరు కంటితో చూడని , మీ చెవితో వినని వాటిని నమ్మొద్దు వాటిని ఇతరులతో అస్సలు పంచుకోవద్దు ఎందుకంటే అసూయాపరులు చెప్పే అబద్దాల వలన అనుబంధాలు చచ్చిపోతాయి .

నీ నీడను చూసి నీ బలం అను కుంటే పొరపాటే ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టే తన తీరును మారుస్తుంది . మనుషులు కూడా అంతే అవసరాన్ని బట్టి పిలుపు అవకాశాన్ని బట్టి తమ తీరు మారుస్తారు .

మన మానవ జీవితాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దుకోవడానికి కావాల్సిన ఒకే ఒక ఆయుధం ఆలోచన ఆలోచనలు మంచివైతే నీ పయనం మంచి వైపు ఆలోచనలు చెడువైతే నీ దారి చెడువైపు .

సేకరణ ✒️ *మీ ...AVB సుబ్బారావు 🌷🤝💐🕉️🙏

Source - Whatsapp Message

ఈలోకంలో మనకు నిజమైన ' యజమాని ' ఎవరు.??

🌷ఈలోకంలో మనకు నిజమైన ' యజమాని ' ఎవరు.??

ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు ఇంతలో సాయంత్రం అయ్యింది చీకటిపడేలా ఉంది.

ఇంతలో ఒక పులి తనవైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుచుకోవడం కోసం ఆవు అటూ ఇటూ పరుగులెట్టి, పారిపోతోంది, పులి కూడా అంతే వేగంగా అవుని వెంబడిస్తోంది. చివరికి అవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది, పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది, పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనుకే ఆ చెరువులోకి దూకేసింది.

దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి, ఆవు ఈదుకుంటూ ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది. అక్కడ చాలా లోతైన బురద ఉంది అందులో ఆవు పీకివరకూ కూరుకుపోయింది.

అవుని వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకుని పీకల్లోతు లో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం అవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇక అంతకుమించి ముందుకి వెళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది.

ఈ స్థితిలో ఉన్న ఆ "ఆవు-పులీ" రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి.

కొద్దిసేపయ్యాక, ఆవు పులితో ఇలా అంది,
" నీకెవరైన యజమాని గానీ గురువు గానీ ఉన్నారా.?? అని అడిగింది ". దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది,

నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది గొప్పగా..
అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయి కదా.., అంది.

అప్పుడు ఆ పులి, ఆవు తో ఇలా అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.?? అంది.

అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది,

"చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ, ఎంత దూరమైన వచ్చి నన్ను ఈ బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళతాడు." మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు .?? అంది.

ఇలా అన్న కొద్దిసేపటికి ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే ఆ అవుని గట్టిగా పట్టుకుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి ఆ అవుని బయటకు లాగి, తన ఇంటికి తీసుకెళ్లాడు. వెళ్లేటప్పుడు ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చూసింది. కావాలంటే ఆ ఆవు, మరియు దాని యజమాని.. వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు.

ఈ కథలో...

ఆవు - సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo.

పులి - అహంకారం నిండిఉన్న మనస్సు.

యజమాని - సద్గురువు/పరమాత్మ.

బురదగుంట - ఈ సంసారం/ప్రపంచం

మరియు,

ఆ ఆవు-పులి యొక్క సంఘర్షణ : నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం.

నీతి :

ఎవరిమీదా ఆధార పడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ,

" నేనే అంతా, నా వలనే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలుగరాదు.

దీనినే ' అహంకారము ' అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది.

ఈ జగత్తులో 'సద్గురువు'(పరమాత్మ)ను మించిన హితాభిలాషి , మన మంచిని కోరుకునే వారు వేరే ఎవరుంటారు.?? ఉండరు.

ఎందుకంటే.?? వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు.

పరమాత్మా నీవే ఉన్నావు...!
అంతా నీ ఇష్టప్రకారమే జరుగనీ..!!

Source - Whatsapp Message

#నాస్తికునికి, #ఆస్తికునికి మద్య సంభాషణ

#నాస్తికునికి, #ఆస్తికునికి మద్య సంభాషణ:*

నేను జాతకాలు నమ్మను.
--- అవును అది మీ జాతకంలోనే ఉంది.

నేను దేవుడిని నమ్మను.
---- తప్పేముంది? రావణుడు, కంసుడు వంటివారు కూడా నమ్మలేదు.

నాకు దేవుడిని చూపించగలరా?
---- ఆయన మిమ్మల్ని చూట్టానికి ఇష్టపడాలికదా.

ప్రసాదాలు సమర్పిస్తారు. మరి దేవుడు స్వీకరిస్తే ప్రసాదాల్లో ఒక్క మెతుకు కూడా తగ్గదేం?
----- మీరు పుస్తకం చదువుతారు. అందులో ఒక్క అక్షరమన్నా మాయం కాదేం.

మనుషులను దేవుడే పుట్టిస్తే మరి అంతా సమానంగా లేరేం?
---- అదేంటి. అందరూ తొమ్మిదినెలలు గర్భంలో ఉండి నగ్నంగానే పుట్టి కెవ్వుమనే ఏడుస్తారుగా?

దేవుళ్లకు, రాక్షసులకు పిల్లలున్నారుగా. మరి వాళ్ల పిల్లల పిల్లలు ఎవరూ లేరా?
----- ఉన్నారుగా. మనమంతా వారి వంశాలలోని వారిమేగా

దేవుడు సర్వాంతర్యామికదా. మరి గుడిలో విగ్రహం ఎందుకు?
---- నీకు నిగ్రహం తక్కువ కదా. దాన్ని నిలపటానికి.

దేవుడిని తలచుకోకపోతే జరగదా?
--- ఏమో! నువే చెప్పాలి. క్షణం వదలకుండా తలచుకుంటున్నావుగా....

ఇంకేముంది గోగినేని తలవంచుకుంటు వెనుదిరిగారు.....

Source - Whatsapp Message

క‌ర్మ‌ఫ‌ల‌మే జ‌న్మ

🤘క‌ర్మ‌ఫ‌ల‌మే జ‌న్మ….🔱

🕉️⚜️🌞🌎🏵️🌼🚩

ఒక శరీరంతో చేసిిన పాప పుణ్యాలు అదే శరీరంతో అనుభవించటం లేదు. మరో శరీరంతో అనుభవిస్తున్నారు. ఒకరు ఈ జన్మలో ఎన్ని పాపాలు చేసినా పూర్వ జన్మ పుణ్యం వల్ల సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. అతడు ఈ జన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తున్నా, పూర్వ జన్మలో చేసిిన పాప ఫలితం ఈ జన్మలో అనుభవిస్తూంటాడు. ఇదే పునర్జన్మలున్నాయన్న దాన్ని తెలుపుతుంది.
జీవుడు తన జీవ పరిణామదశలో అనేక జన్మలెత్తుతూ ఉంటాడు. మానవ జన్మలలో స్త్రీగాను, పురుషునిగాను జన్మిస్తుంటాడు. ఇక జంతు జన్మల్లో పశు పక్ష్యాది జన్మలు కూడా ఎత్తవచ్చును. కర్మ ఫలితాలను బట్ట్టి చర్యకు ప్రతిచర్యగా ఈ జన్మలు ఏర్పడుతుంటాయి. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే కిందటి జన్మ యాక్షన్‌కు రియాక్షనే ఈ జన్మ. స్త్రీ జన్మ ఎ త్తితే వారికి సంబంధించిన ధర్మాలు, పురుషునిగా జన్మిస్తే ఆ ధర్మాలు ఆచరించాల్సి ఉంటుంది. ఈ రెండు వర్గాల వారికి శారీరక ధర్మా లు కూడా వేరుగా ఉంటాయి. పునర్జన్మ అంటే సూక్ష్మ శరీరం కొనసాగుతూ స్థూల శరీరాన్ని మరల మరల తెచ్చుకోవడం. పునరపి జననం పునరపి మరణం అనగా మళ్ళీ మళ్ళీ పుట్ట్టడం, మళ్లిd మళ్ళీ మరణించడం. పుణ్య కర్మల వల్ల్ల సుఖాలు, పాపాల ఫలితంగా దు:ఖాలు వస్తాయన్న విషయం తెలిసిందే. అయితే అందుకు విరుద్ధంగా పుణ్యం చేసేవారికి బాధలు, పాపాలు చేసే వారికి సుఖాలు కలగడం అక్కడక్కడ చూస్త్తుంటాం. పుట్టుకతో అంధుడైన వ్యక్తి, ఆగర్భ శ్రీమంతునిగా జన్మించిన వ్యక్తి ఆ జన్మలో ఎప్పుడు పుణ్యంగాని, పాపంగాని చేసి ఉండదు కదా అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం చెప్పేదే పునర్జన్మ సిద్ధాంతం. పూర్వ జన్మ కృతం పాపం వ్యధి రూపేణ, పూర్వ జన్మ కృతం పుణ్యం భోగరూపేణ అంటారు.

అంటే పూర్వ జన్మలో చేసిిన పాపం రోగ రూపంలోను, గత జన్మలో చేసిన పుణ్యం ఈ జన్మలో సుఖాలకు కారణమవుతుందని దీని అర్థం. ఒక శరీరంతో చేసిిన పాప పుణ్యాలు అదే శరీరంతో అనుభవించటం లేదు. మరో శరీరంతో అనుభవిస్తున్నారు. ఒకరు ఈ జన్మలో ఎన్ని పాపాలు చసినా పూర్వ జన్మ పుణ్యం వల్ల సుఖాలను అనుభవిస్త్తూఉంటాడు. అతడు ఈ జన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తున్నా, పూర్వ జన్మలో చేసిిన పాప ఫలితం ఈ జన్మలో అనుభవిస్తూంటాడు.

ఇదే పునర్జన్మలున్నాయన్న దాన్ని తెలుపుతుంది.
పురాణ తిహాసాల్లోను పునర్జన్మల ప్రస్తావన ఉంది. అర్జునుడు కన్నప్పగాను, భీముడు మధ్వాచార్యులుగాను జన్మించారని చెప్పేవారున్నారు. గజేంద్ర మోక్షం లోని గజేంద్రుడు గత జన్మలో ఒక మహారాజు. 3,4 సంవత్సరాల వయస్సు పిల్లలు పూర్వ జన్మ విషయాలను వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. షిిరిడీ సాయి బాబా ఒక చోట పాము – కప్పల వైరాన్ని వారి పూర్వ జన్మకు సంబంధించినదిగా పేర్కొ నడం, రెండు బల్లులు కలిసినప్పుడు అవి గత జన్మలో అక్కా చెల్లెళ్లు అని చెప్పడం గమనార్హం. కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం తెలిసిన వాడు రాబోయే జన్మలలో మరింత సుఖ భోగాలుం డేలాగున అనేక పుణ్య కార్యాలు చేయవచ్చును. మనం చేసే ప్రతి పనిలోని (కర్మ) స్పంద నలు వాయు మండలంలో నిక్షిప్తమవుతాయి. వాయు మండలంలో బాధామయ స్పందనలు, ఆనందమయ స్పందనలు జనిస్తాయి. దుష్కర్మల వల్ల్ల బాధలు జనిస్తాయి. ఈ రకంగా కర్మ ఫలితం చర్యకు ప్రతిచర్య రూపం దాలుస్తుంది. క్షమాగుణం కలిగిన వారు కర్మ చక్రాన్ని ఆపగల శక్తి కలిగి ఉంటారు. పుణ్య కర్మల చేత దేవతలుగా, మిశ్రమ కర్మలచేత మానవులుగా, పాప కర్మల చేత పశు పక్షి క్రిమి కీటకాదులుగా పుట్టడం జరుగుతూంటుందనేది స్థూలంగా కర్మ సిద్ధాంతం. కర్మ వల్ల్లనే పుట్ట్టడం, పెరగడం, మరణించడం జరుగుతోంది. కర్మయే ఈ సృష్టికి కారణమని తెలుస్తోంది. పుణ్యకర్మలు చేసిన వారు దైవ గుణాలు, పాప కర్మలు చేసే వారు ఆసురీ గుణాలు కలిగి ఉంటారు. మానవుడు పూర్వ జన్మల్లో చేసిన కర్మలు వ్యర్థం కావు. దైవ గుణాలు సంసార బంధం నుంచి విడుదలకు హేతువు అవుతాయి. ఆసురీ గుణాలు జనన మరణాలకు కారణమైన కర్మ బంధాన్ని పటిష్టం చేస్త్తుంటాయి. ఒక జన్మలో ఒకరు ఒక విషయంలోపొందిన శిక్షణ మరు జన్మలో అతని గుణంగా రూపాంతరం చెందుతుంది.
ఆసురీ గుణాలు
కామం…
అన్ని రకాల దేహేంద్రియ భోగ సంబంధమైన కోరికలను కామం అంటారు.
క్రోధం…
క్రోధం అంటే కోపం. దీని వల్ల్ల మనిషిి గొప్పతనం సన్నగిల్లుతుంది. బ్రతుకు దుర్భరమవుతుంది. విపరీతమైన కోపం వచ్చిన వానికి పిచ్చి వానికి తేడా ఉండదు. ఆరోగ్యం క్షీణిస్తుంది.
లోభం…
లోభం కలవాడు తనకు ఉన్న దానిని ఎవ్వరికీ ఇవ్వడానికి ఇష్టపడడు, అనగా అతనికి దాన గుణం ఉండదు.
మోహం…
మోహం అంటే పుత్ర మిత్ర కళత్రాదులందు, ధన ధాన్య వస్తు వాహనాదుల పట్ల మిక్కుటమైన ప్రేమ. యుక్తాయుక్తాలు ఎరుగని చిత్త వృత్తి.
మదం…
ఇది ఎనిమిది విధాలు. అవి కలం, బలం, ధనం, రూపం, ¸ °వ్వనం, విద్య, రాజ్యం, తపస్సు.
మాత్సర్యం…
ఎందులోనైనా తన కంటె ఇతరులు ఎక్కువగా ఉండటాన్ని ఓర్వలేక పోవటమే మత్సరం.
రాగము…
ఎదుట వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఇతరులపై కలిగే ఇష్టం రాగం.
ద్వేషం…
ఒకరు తనకు అపకారం చేశారని మరల వారికి అపకారం చేయాలనే చిత్త వృత్తి.
ఈర్ష్య…
తనకు మాత్రమే కష్టాలు కలుగుతున్నాయని, ఇతరులకు ఎందుకు కలగటంలేదని వారిపై ఏర్పడే కోపమే ఈర్ష్య.
అసూయ…
తనకు మాత్రమే సుఖం కలగాలని ఇతరులకు ఆ సుఖం రాకూడదనే చిత్తవృత్తి.
దంభము....
తను చేసే పనులను ఇతరులు మెచ్చుకోవాలనే చిత్తవృత్తిని దంభము అంటారు.
దర్పం…
నేను సర్వ విషయాల్లో సమర్థుడనని తనకు సాటి అయిన వాడు ఎక్కడా లేడని భావించే చిత్తవృత్తి
(అదే గర్వం)
అహంకారం…
అకారణంగా ఇతరులను శిక్షించాలనే తమో గుణాన్ని చిత్తవృత్తి గలవారిని అహంకారులు అంటారు
ఆసురీ గుణాల్ని తొలగించేందుకు సాధన చేయాలి. అప్పుడు ఆ అజ్ఞానం వీడుతుంది. సాధనలకు గురువు సహకారం అవసరం. శాస్త్రాలు కూడా ఏది చేయాలో, ఏది చేయకూడదో నిర్దేశించాయి. ఇక్కడ శాస్త్త్ర ఆదేశా నుసారం కర్మ చేయాలి.
మనిషి మరణానంతరం జీవుడు ఏమౌతాడు? పునర్జన్మ వున్నదా?

పునర్జన్మ అనేది వున్నది అని అంగీకరించడమే సనాతన ధర్మంయొక్క జీవగర్ర. సనాతన ధర్మమునందు వున్నాను అంటే పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించాను అని అర్థం. పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించాను అన్నదానికి గుర్తు ఏమిటంటే బొట్టుపెట్టుకున్నాను. పునర్జన్మ అన్న మాటకి అర్థం జీవుడు ఈ శరీరాన్ని వదలి ఇంకొక శరీరంలోకి వెళ్తాడు. శరీరం ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడు అంటే చేసిన పాపాన్ని దుఃఖంగా, పుణ్యాన్ని సుఖంగా అనుభవించాలి. శరీరం లేదు పాప ఫలితం ఎలా అనుభవిస్తారు? ఎవరి కాలిమీదో కర్రెట్టి కొట్టాను. వాడు రెండేళ్ళు ఏడ్చాడు. ఇప్పుడు ఈ జన్మలో నాకు మోకాళ్ళు నొప్పులు వుండాలి. అప్పుడా పాపం మోకాళ్ళు నొప్పులుగా పోయింది. శరీరం వుంటే కదూ పోవడం. గతజన్మలో ఏదో పుణ్యం చేశాను ఈ జన్మలో సుఖపడాలి. ఈ సుఖానికి పుణ్యం కారణం. దుఃఖానికి పాపం కారణం. వచ్చే జన్మలో సుఖపడాలి అనుకుంటే పాపం మానేయాలి. ఒక విత్తనం వేసి ఇంకొక పంట కోయడం సాధ్యం కాదు. వరి విత్తనాలు వేసి మొక్కజొన్న కావాలంటే కుదరదు. చేసినవి పాపపు పనులు కావలసినవి సుఖాలు అంటే రావు. పుణ్యం చెయ్యి, సుఖాన్ని కోరుకో. కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ఏం చేస్తుందంటే మనిషిని మనిషిగా బ్రతికేటట్లు చేస్తుంది. కర్మ చేసే అధికారం మనిషికి ఒక్కడికే. మిగిలిన ప్రాణులకు లేదు. అందుకే మనిషియొక్క ప్రవర్తనని నియంత్రించేది ఏది అని అంటే పునర్జన్మ సిద్ధాంతం.
ఒకప్పుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి దగ్గరికి విదేశాలనుంచి ఒక వనిత వచ్చింది. గడపకి అవతల ఆవిడ కూర్చుంది. లోపల మహాస్వామి అభిషేకం చేసి వున్నారు. ఆవిడ బయటినుంచి ఒక ప్రశ్న వేసింది. పునర్జన్మ వున్నది, దానికి కారణము చేసిన పాపపుణ్యములు కారణము అంటారు కదా సనాతనధర్మంలో..! నిరూపించడానికి ఏదైనా ఆధారం వున్నదా? అని అడిగింది. ఆయనేమీ మాట్లాడలేదు. ఒక అరగంట అయిపోయింది.ఆవిడ అలాగే నుంచుంది ఏమైనా చెప్తారేమో నని. ఆయన ప్రక్కన వున్న అంతేవాసిని పిలిచి అన్నారు “ఈసందు చివరలో ఒక ప్రసూతి వైద్యశాల వుంది. ఈవిడని ఇవాళ మధ్యాహ్నం వెళ్ళమనండి. ఆ వైద్యశాలలో ఎన్ని గదులున్నాయి? ఏ ఏ గదిలో ఎవరు ప్రసవం కోసం వున్నారు? ఏ గదిలో వున్నవాళ్ళు ఏంచేసున్న వాళ్ళు? మరునాటి వుదయంలోపల వాళ్ళకి మగపిల్లవాడు పుట్టాడా? ఆడపిల్ల పుట్టిందా? ఆ పిల్ల/పిల్లవాడు పుట్టినప్పుడు వాళ్ళెలా భావిస్తున్నారు. ఇవి వ్రాసుకొని నాదగ్గరికి రమ్మనండి జవాబు చెప్తాను” అన్నారు. ఆవిడ మరునాడు వచ్చి ఏమీ అడగలేదు. మహాస్వామి వారికి కొంత దూరంలో నేలమీద పడి నమస్కారం చేసి “నాకర్థమైంది, పునర్జన్మ సిద్ధాంతం ఎంత సత్యమైనదో నాకు తెలిసిపోయింది. ఇక మీరు జవాబు చెప్పక్కరలేదు.” అన్నది. ఎలా? ఆవిడ అక్కడికి వెళ్ళి చూసింది. పది గదులున్నాయి. 8 గదులు మామూలువి. 2 గదులు ఏసి. మళ్ళీ ఈ ఎనిమిది గదులలో నాలుగు స్పెషల్ రూమ్స్. నాలుగు మామూలువి. ఆవిడ మరునాటి ఉదయం వరకు పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రుల స్థితి సేకరించింది. ఒకరు జిల్లాకి అధికారి. ఏసి రూములో ఆయన భార్యకి మొట్టమొదటి సంతానం కొడుకు పుట్టాడు. కొన్ని వందలమంది వచ్చి జిల్లా అధికారికి చేతిలో పుష్పగుచ్ఛాలు పెట్టి పళ్ళు పెట్టి అయ్యా మీకు కంగ్రాచ్యులేషన్స్ అండీ మీకు కొడుకు పుట్టాడు అంటున్నారు. ఇంకొకరికి సామాన్యమైన గదిలో ప్రసవమైనది, శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. వెయ్యి రూపాయలనుకున్నది పదివేలయింది. భర్త చూడడానికి రాలేదు ఎందుకంటే బిల్లు కట్టడానికి కావలసిన డబ్బు అప్పు చేసుకోవడానికి తిరుగుతున్నాడు. ఆయనకీ కొడుకే పుట్టాడు. ఇంకొక ఆవిడకి ప్రసవానికి వేళయిపోయింది. ఆవిడ గది కూడా తీసుకోలేదు. వరండాలో బల్లమీద పడుకోబెట్టి పురుడు పోశారు. నాలుగిళ్ళల్లో పనిచేసుకొనేటటువంటి వ్యక్తి. పుట్టడానికి ముందే ఎక్కడ పుట్టడానికి అనువుగా వుంటుందో ఎంత భోగకరమైన ప్రదేశంలో పుట్టవచ్చో ముందే నిర్ణయమైపోయిందా? అంటే వాడు ఎంత భోగమనుభవించాలి అని నిర్ణయింపబడితే కదూ వాడికి తెలియకపోయినా వాడికి పిల్లవాడిగా వచ్చాడు.గతజన్మలో చేసుకున్నది లేకుండా ఇలా ఎలా పుట్టారు? అక్కడే పుట్టేటట్లు చేసినవాడు ఒకడున్నాడు. అలా చేసేటప్పుడు వాడి పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ పుట్టించాడు. వాడి పాపాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక ఫలితాన్ని కూడా ఇస్తాడు. అందుకే ఆవిడ ఇక మాట్లాడలేదు. నాకు అర్థమైపోయింది ప్రసూతి కేంద్రానికి వెళితే పునర్జన్మ సిద్ధాంతం ఎంత గొప్పదో అని. కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం.

మోక్షం కలడానికి భక్తితో అంటే ధార్మికమైనటువంటి జీవనాన్ని గడపగా గడపగా అనువైన సమయం చూసి పరమేశ్వరుడు యే కోరికా లేకుండా భక్తితో బ్రతుకుతున్నాడు గనుక చిత్తశుద్ధినిస్తాడు. ఆ చిత్తశుద్ధికి పాత్రత అంటారు. నా దగ్గర ఆవుపాలు గోరువెచ్చటివి వున్నాయి. పాలు త్రాగడానికి మీరు ఒక గిన్నె పట్టారు. అది అపరిశుభ్రంగా వుంది. అటువంటి పాత్రలో నేను పాలు పోస్తానా? పాలు విరిగిపోతాయి. వేరేది తెచ్చుకోండి అందులో పోస్తాను అంటారు. పాత్రత లేకుండా జ్ఞానమివ్వరు. పాత్రత కలగాలంటే చేసిన పుణ్యానికి ఫలితాన్ని అడగకూడదు. నేనొక పుణ్యం చేసి ఫలితం కావాలంటే సుఖం క్రింద ఇచ్చేస్తాడు. అయిపోయిందిఆ పుణ్యం అక్కడితో పోయింది. ఒక పుణ్యం చేసి నాకేఫలితం అక్కరలేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు – ఈశ్వరుడికే ధారపోశాను. పాపం అనుభవించేశాను. అనుభవించడానికి ఇప్పుడు పుణ్యం వుందా? లేదు. అనుభవించడానికి పాపం వుందా? లేదు. ఒకవేళ పాపం వున్నా చిత్తశుద్ధిని ఇస్తాడు. అది పాత్రత అంటారు. అందులో జ్ఞానధార కటాక్షిస్తాడు. జ్ఞానధార పోయగానే సంచితం తగలపడిపోతుంది. ఇక అనుభవించడానికి పాపంలేదు, పుణ్యం లేదు. పాపమూ, పుణ్యమూ లేని వాడికి ఇక శరీరమెందుకు? వాడు ఈశ్వరుడియందు ఐక్యమైపోతాడు. అదే మోక్షం.
బుద్ధుడు తిరిగి రాని విధంగా (పునర్జన్మ అంటూ లేని విధంగా ) గతించాడు కనుక ఆయన్ని సుగతుడనీ, తథాగతుడనీ కూడా పిలుస్తారు.
మనకు తెలియకుండానే కర్మలను చేస్తున్నాం. ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుణం.
త్రికరణములు: 3 పనిముట్లు 1 మనస్సు 2వాక్కు3శరీరం.వీటితోనే మనం అనుక్షణం ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ కర్మలే. ఇవి 2రకాలు.1బైటికి కనిపించేవి. 2కనిపించనివి.వాక్కాయాలతో చేసే పనులు కనిపిస్తాయి. మనస్సు తో చేసే పనులు కనిపించవు. ఇవి మళ్లీ 2రకాలు.పుణ్యకర్మలు.పాపకర్మలు.పుణ్యకర్మలవల్ల
సుఖం పాపకర్మల వల్ల దుఃఖం కల్గుతాయి. కర్మ(పనులు) ముగిసిన తరువాత వాటిప్రభావం
సూక్ష్మ శరీరం గా(మనోబుధ్ధిచిత్యహంకారములు)
ఏర్పడుతుంది. వీటిని కర్మవాసనలు అంటారు.
బాల్యం లోజరిగిన వాటిని ముసలితనం లో చెప్పడం
కొన్ని సార్లు గత జన్మ విషయాలు చెప్పడం వంటి
వన్నీ ఈ వాసనలే.

కర్మలను గురించి స్పష్టంగా తెలుసుకోవడం మేధావులకు కూడా సాధ్యం కాదు కర్మలను (పనులు) గురించి చక్కగా తెలుసుకున్నప్పుడే అశుభమైన సంసార వ్యామోహం నుండి బైటపడగలం. కర్మ ను గురించి మాత్రమే కాకుండా అకర్మ, వికర్మలను గురించి కూడా తెలుసుకోవాలి
స్థూలంగా కర్మ అకర్మ వికర్మలను గురించి తెలుసుకుందాం. 1కర్మ:శాస్త్రవిహితమైనవే
అంటే శాస్త్రము బోధించే కర్మలు. 2అకర్మ:ఫలితం కోరకుండా అంటే అహంకార మమకారాలను వదలి చేసే పని. కర్తగా భోక్త గా ఏవిధమైన
సంబంధం లేకుండా చేసే కర్మ. దీని వల్ల కర్మవాసనలు అంటవు. 3వికర్మ:శాస్త్రము నిషేధించిన కర్మలు. పాప కర్మలు. అంతేకాకుండా ఒకరికి కర్మ వేరొకరికి వికర్మ కావచ్చు. (వర్ణాశ్రమ ధర్మాలనుబట్టి) అందరికీ వర్తించే వికర్మలూ ఉన్నాయి. అందుకే గీతలో కర్మసిధ్ధాంతం అంత లోతుగా అధ్యయనం చేయబడినది.
మరొక విధంగా కర్మ 3రకాలు. 1సంచిత.2ప్రారబ్ధ3ఆగామి.
సంచితకర్మ:ప్రతి జన్మలో కర్మ ఫలాన్ని నిల్వ చేసుకోవడం.
ప్రారబ్ధం :సంచితకర్మ లో కొంత భాగాన్ని అనుభవించడం.
ఆగామి :ఇప్పుడు చేస్తున్న కర్మ ఫలితం రాబోయే
జన్మలో అనుభవించడానికి సంపాదించుకోడం. మన
ధ్యేయమంతా దీనిపై నే ఉండాలి. దీనిని బట్టి రాబోయే జన్మలో మన కష్టసుఖాలు నిర్ణయం చేయబడతాయి. మనం చేసే కర్మలలో గొప్పది అభ్యాసయోగమే. అందుకే అభ్యాసయోగి కిమాత్రమే పునర్జన్మ లో ఉత్తమ మానవ జన్మ సిధ్ధిస్తుంది.
కర్మ ఫలితం తప్పక అనుభవిచాల్సిందే. మరొక రకంగా కర్మ ఫలం నశించదు. అందుకే జ్ఞాని కూడా కర్మలను మానకూడదు. అట్లే కర్మ ఫలం అనుభవించక తప్పదు.
కర్మ సిద్ధాంతము : మూడవ భాగము క్రియ ప్రతిక్రియ అనే శాస్త్రీయ విధానమే కర్మసిదాంతానికి మూలం దీన్ని ఒప్పుకోని వారు హేతువాదవిరోధులు.
కారణం ఇప్పుడు అనుభవించే వాటికి మూలం వెనుకటి కర్మలే అనడం తప్పు అన్నప్పుడు మరి అవెక్కడినుండి వచ్చినాయి ఊరకే శూన్యంనుండి ఊడిపడవుకదా. దీన్ని తర్కశాస్త్రము ‘అకృతాభ్యాగమం’ అనే దోషంగా పేర్కొంటుంది అంటే చేయకుండానే ఫలితం పొందడం అన్నమాట విత్తుకు కారణం చెట్టు అట్లే చెట్టు కు కారణం విత్తు అట్లే తండ్రి కారణం కొడుకుకార్యం మళ్ళీ ఆ కోడుకు తన కొడుకుకు కారణం అన్నమాట …
అందుకే జీవులు చేసే కర్మలు అంతటితోనే నశించవు మరొక రూపంగా మార్పు చందాల్సిందే దీన్ని కాదనడాన్ని“కృతవిప్రనాశము” అనే దోషము గా శాస్త్రం ఖండిస్తుంది. అంటే చేయబడిన కర్మ నశించడం అన్నమాట. పుణ్యకర్మలు ఎంత గొప్పవైతే అంత గొప్ప ఫలితాన్నిస్తాయి.

అందుకే గీతలో వేదాధ్యయనము యజ్ఞదానతపస్సులు చేసేవారికన్నా అభ్యాసయోగి పొందే ఫలం గొప్పదని పేర్కొన్నారు ఎందుకంటే అభ్యాసయోగి చేసే ఏకాగ్రతారూపాభ్యాసయోగము సూక్షమైనది మరియు ప్రభావవంతమైనది. కేవలం మనస్సుతో మాత్రమే చేసే అభ్యాసయోగం లోకానికి ఎంతో అభ్యుదయాన్ని కల్గిస్తుందిఅందుకే అభ్యాసయోగికి మాత్రమే పునర్జన్మలో ఉత్తమ మానవజన్మ తప్ప్పక కల్గుతుందని భగవంతుడు నొక్కి చెప్పినాడు*

సేకరణ;వే శ్రీ

🕉️🌞🌎🏵️🌼🌈🚩

Source - Whatsapp Message

Wednesday, February 24, 2021

మానవ దేహంలో 96 తత్వంలు

🧘‍♂️ మానవ దేహంలో 96 తత్వంలు 🧘‍♂️

📚 మురళీ మోహన్

5 ఙ్ఞానింద్రియంలు

1 శబ్ద
2 స్పర్ష
3 రూప
4 రస
5 గంధంలు.

5 ( పంచ తన్మాత్రలు )

1 చెవులు
2 చర్మం
3 కండ్లు
4 నాలుక
5 ముక్కు


5 ( పంచ ప్రాణంలు )

1 అపాన
2 సామనా
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యాన
.
5( అంతఃర ఇంద్రియంలు )
5 ( కర్మఇంద్రియంలు )

1 మనస్సు
3 బుద్ది
3 చిత్తం
4 జ్ఞానం
5 ఆహంకారం

1 వాక్కు
2 పాని
3 పాదం
4 గుహ్యం
5 గుదం

6 ( అరిషడ్వర్గంలు )

1 కామం
3 క్రోదం
3 మోహం
4 లోభం
5 మదం
6 మచ్చార్యం

3 ( శరీరంలు )

1 స్థూల శరీరం
2 సూక్ష్మ శరీరం
3 కారణ శరీరం

3 ( అవస్తలు )

1 జాగ్రదవస్త
2 స్వప్నవస్త
3 సుషుప్తి అవస్త

6 ( షడ్బావ వికారంలు )

1 ఉండుట
2 పుట్టుట
3 పేరుగుట
4 పరినమించుట
5 క్షిణించుట
6 నశించుట

6 ( షడ్ముర్ములు )

1 ఆకలి
2 దప్పిక
3 శోకం
4 మోహం
5 జర
6 మరణం

7 ( కోశములు ) ( సప్త ధాతువులు )

1 చర్మం
2 రక్తం
3 మాంసం
4 మేదస్సు
5 మజ్జ
6 ఎముకలు
7 శుక్లం

3 ( జీవి త్రయంలు )

1 విశ్వుడు
2 తైజుడు
3 ప్రఙ్ఞాడు

3 ( కర్మత్రయంలు )

1 ప్రారబ్దం కర్మలు
2 అగామి కర్మలు
3 సంచిత కర్మలు
.
5 ( కర్మలు )
,
1 వచన
2 ఆదాన
3 గమన
4 విస్తర
5 ఆనంద
.
3 ( గుణంలు )
,
1 సత్వ గుణం
2 రజో గుణం
3 తమో గుణం
.
9 ( చతుష్ఠయములు )

1 సంకల్ప
2 అధ్యాసాయం
3 ఆభిమానం
4 అవధరణ
5 ముదిత
6 కరుణ
7 మైత్రి
8 ఉపేక్ష
9 తితిక్ష
.
10 ( 5 పంచభూతంలు పంచికరణ చేయనివి )
( 5 పంచభూతంలు పంచికరణం చేసినవి )
.
1 ఆకాశం
2 వాయువు
3 ఆగ్ని
4 జలం
5 భూమి
.
14 మంది ( అవస్థ దేవతలు )
,
1 దిక్కు
2 వాయువు
3 సూర్యుడు
4 వరుణుడు
5 అశ్వీని దేవతలు
6 ఆగ్ని
7 ఇంద్రుడు
8 ఉపేంద్రుడు
9 మృత్యువు
10 చంద్రుడు
11 చతర్వకుడు
12 రుద్రుడు
13 క్షేత్రజ్ఞుడు
14 ఈశానుడు
.
10 ( నాడులు )
,
1 ఇడా నాడి
2 పింగళ
3 సుషుమ్నా
4 గాందారి
5 పమశ్వని
6 పూష
7 అలంబన
8 హస్తి
9 శంఖిని
10 కూహు
11 బ్రహ్మనాడీ

10 ( వాయువులు )

1 అపాన
2 సమాన
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యానా
.
6 కూర్మ
7 కృకర
8 నాగ
9 దేవదత్త
10 ధనంజమ
.
7 ( షట్ చక్రంలు )
,
1 మూలాధార
2 స్వాదిస్థాన
3 మణిపూరక
4 అనాహత
5 విశుద్ది
6 ఆఙ్ఞా
7 సహస్రారం
.
( మనిషి ప్రమాణంలు )
,
96 అంగళంలు
8 జానల పోడవు
4 జానల వలయం
33 కోట్ల రోమంలు
66 ఎముకలు
72 వేల నాడులు
62 కీల్లు
37 మురల ప్రేగులు
1 సేరు గుండే
అర్ద సేరు రుధిరం
4 సేర్లు మాంసం
1 సరేడు పైత్యం
అర్దసేరు శ్లేషం
.
( మానవ దేహంలో 14 లోకలు ) పైలోకలు 7
,
1 భూలోకం - పాదాల్లో
2 భూవర్లలోకం - హృదయంలో
3 సువర్లలోకం - నాభీలో
4 మహర్లలోకం - మర్మంగంలో
5 జనలోకం - కంఠంలో
6 తపోలోకం - భృమద్యంలో
7 సత్యలోకం - లాలాటంలో
.
అధోలోకలు 7
.
1 ఆతలం - అరికాల్లలో
2 వితలం - గోర్లలో
3 సుతలం - మడమల్లో
4 తలాతలం - పిక్కల్లో
5 రసాతలం - మొకల్లలో
6 మహతలం - తోడల్లో
7 పాతాళం - పాయువుల్లో
.
( మానవ దేహంలో సప్త సముద్రంలు )
,
1 లవణ సముద్రం - మూత్రం
2 ఇక్షి సముద్రం - చేమట
3 సూర సముద్రం - ఇంద్రియం
4 సర్పి సముద్రం - దోషితం
5 దది సముద్రం - శ్లేషం
6 క్షిర సముద్రం - జోల్లు
7 శుద్దోక సముద్రం - కన్నీరు
.
( పంచాగ్నులు )
,
1 కాలగ్ని - పాదాల్లో
2 క్షుదాగ్ని - నాభీలో
3 శీతాగ్ని - హృదయంలో
4 కోపాగ్ని - నేత్రంలో
5 ఙ్ఞానాగ్ని - ఆత్మలో
.
7 ( మానవ దేహంలో సప్త దీపంలు )

1 జంబు ద్వీపం - తలలోన
2 ప్లక్ష ద్వీపం - అస్తిలోన
3 శాక ద్వీపం - శిరస్సుప
4 శాల్మల ధ్వీపం - చర్మంన
5 పూష్కార ద్వీపం - గోలమందు
6 కూశ ద్వీపం - మాంసంలో
7 కౌంచ ద్వీపం - వేంట్రుకల్లో
.
10 ( నాధంలు )
,
1 లాలాది ఘోష - నాధం
2 భేరి - నాధం
3 చణీ - నాధం
4 మృదంగ - నాధం
5 ఘాంట - నాధం
6 కీలకిణీ - నాధం
7 కళ - నాధం
8 వేణు - నాధం
9 బ్రమణ - నాధం
10 ప్రణవ - నాధం
.🦚

Source - Whatsapp Message

భీష్మ ఏకాదశి / సర్వ ఏకాదశి

నేటివిశేషం

భీష్మ ఏకాదశి / సర్వ ఏకాదశి
మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు.
బీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికాలుడుతు గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుడిని ప్రశ్నించారు.
"మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడని ఆ జగన్నాటక సూత్రధారి సమాధానం ఇస్తాడు.

అందుకే నా మనసు అక్కడికి వెళ్లిపోయింది , మీరు కూడా నాతో రండని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు , ధర్మశాస్త్రాలను అవపోశణం పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది , ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోడానికి రండి' అని భీష్మపితామహుడి చెంతకు తీసుకు వచ్చాడు.

సుమారు మూడు పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు, దేహమంతా బాణాలు గుచ్చుకుని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది.
మాఘమాసంలో ఎండకు ఎండుతూ , మంచుకు తడుస్తూ , నీరు , ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు.
తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది , కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు.
ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకున్నాడు.

తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు.
అంతటి జ్ఞానం కలిగిన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది.
అలాంటి వాళ్లు ఏ రోజు నిష్క్రమించినా వైకుంఠం ప్రాపిస్తుంది. భీష్ముడు తనకి మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు.

అయితే తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గాంగేయుడికి జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి పాపం శరీరం పైనే రాసి ఉంటుందట ! అది తొలగితే తప్ప సద్గతి కలగదట.
ఇంతకీ భీష్మపితామహుడు చేసిన దోషం ఏంటంటే ? పాండవ పత్ని ద్రౌపదికి నిండు సభలో అంతటి అవమానం జరుగుతున్నా ఏమీ చేయలేక పోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ.
తన గురువైన వసిష్ఠుడు ఆమెతో ఇలా చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపతి ! ఇతరులు తొలగించలేని ఆపదలు కలిగినపుడు శ్రీహరిని స్మరించుకోమన్నారు.

కురుసభలో వస్త్రాపహరం జరుగుతుంటే అతి పరాక్రమవంతులైన అయిదుగురు భర్తలు ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు.
వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు , కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కనబెట్టారు.
కృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. కాబట్టే అలా చేసినందుకు కౌరవులను మట్టు పెట్టాడు.
పాండవులకూ కూడా అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలనుకున్నాడో ఆమెకే నష్టం జరుగుతుందని భావించాడు.

ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడే అర్జునుడితో చెప్పాడట.
ద్రౌపదికి ఎప్పుడు అవమానం జరిగిందో అప్పుడే వారిని తీసి పాడేశాను , ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితంలా ఉన్నారే తప్ప , ఆ గౌరవాన్ని నీకు కట్టబెట్టాలని యుద్ధం చేయమంటున్నాంటూ అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నాడట.

భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే , పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ 'తాతా ! ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని ప్రశ్నించిదట. అందుకు భీష్ముడు 'అవును తల్లీ ! నా దేహం నా అధీనంలో లేదు , అది ధుర్యోదనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా , నా దేహం నా మాట వినలేదని అన్నాడు. అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నానని చెప్పాడు.

కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు , పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్వజించాడు. " హే ద్రౌపతీ ! కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు , కానీ శరీరం దుష్టమైపోయింది.
దాన్ని పరిశుద్ధం చేసుకోడానికే అంపశయ్యపై పడి ఉన్నాను , అందుకు ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చని పాండవులకు ఎన్నో సూత్రాలను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాందించి ధర్మసూత్రాలను చెప్పించాడు.

నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు , నీవే చెప్పొచ్చుకదా అని భీష్ముడు ప్రశ్నించాడు. నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదని కృష్ణుడు బదులిచ్చాడు. నేను చెబితే అది తత్వం , నీవు చెబితే అది తత్వ ద్రష్టం.
తత్వాన్ని చూసినవాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల తన సారాన్ని చెప్పగలదా !
అందులో పండిన మొక్క చెబుతుంది ఎంత సారమో. అలాగే అనుభవజ్ఞుడవైన నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు.

భగవంతుడు సముద్రం లాంటి వాడు , నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యమవుతుంది.
అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితమని జగన్నాటక సూత్రధారి భావించాడు.
అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి , భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు,
భగవద్గీత ఆయనే నేరుగా చెప్పాడు , విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు, కాబట్టి విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా మోక్షం కలుగుతుంది...

🥀శుభమస్తు🥀*
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

Source - Whatsapp Message

భీష్మ ప్రతిజ్ఞ

భీష్మ ప్రతిజ్ఞ

గంగాదేవి తనను వీడి వెళ్ళినప్పటినుండి శంతన మహారాజు వైరాగ్యంతో ఉన్నాడు. కాని ఒక రోజు యమునాతీరానికి వాహ్యాళికని వెళ్ళి అక్కడ జగన్మోహినినా ఉన్న ఓ అమ్మాయిని చూసి ఆ పిల్లను తన భార్యగా చేసుకోవాలనుకున్నాడు.తనను పెళ్ళి చేసుకోమని ఆ అమ్మాయిని అడిగాడు. " నా తండ్రి దాశరాజు. బెస్త్ల్లందరికీ నాయకడు. మీరు ఆయనతో మాట్లాడి ఆయన అనుమతి తీసుకోండి. అది మీకూ నాకూ మంచిది " అని బదులు చెప్పిందాపిల్ల.
శంతనుడు వెళ్ళి దాశరాజును కలిశాడు. ఆయన నవ్వుతూ " మా అమ్మాయిని మీ చేతుల్ల్లో పెడతాను కాని నా కూతురి వల్ల మీకు కలగబోయే పిల్లవాడే మీ తరువాత రాజు కావాలి " అన్నాడు.
శంతనుడు ఒప్పుకోలేదు.
దేవవ్రతుణ్ణి తోసేసి మరొకరికి పట్టాభిషేకం చేయడం కుదరదన్నాడు.
అయితే ఈ పెళ్ళే జరగదన్నాడు దాశరాజు.
దిగులుతో హస్తినాపురానికి తిరిగి వచ్చాడు శంతనుడు. దేవవ్రతుడు తండ్రి మనసులోని విచారాన్ని ఆయన రధసారధి ద్వారా తెలుసుకొని వెంటనే దాశరాజు దగ్గరకు వెళ్ళి " నీ కూతురుకు పుట్టబోయే బిడ్డే రాజవుతాడు. నాకు రాజ్యం అక్కర్లేదు. నా పట్టాభిషేకాన్ని ఇప్పుడే పరిత్యాగం చేస్తున్నాను " అని శపధం చేశాడు. అయినా దాశరాజు భయం పోలేదు. దేవవ్రతుడు కాకపోయినా అతని సంతతివారెవరైనా ముందు ముందు అవరోధాలు కలిగించవచ్చు కదా అని సందేహించాడు. దేవవ్రతుడు అది గ్రహించి తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేశాడు. దీనినే భీష్మ ప్రతిజ్ఞ అంటారు. అప్పుడాపల్లెరాజు సంతోషించి తన కూతుర్ని శంతనుడికిచ్చి పెళ్ళిచేసాడు.
ఆ అమ్మాయి పేరు సత్యవతి.

శంతనుని వల్ల ఆమెకు చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు పిల్లలు కలిగారు.

Source - Whatsapp Message

మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు. పూర్వ నామం "దేవవ్రతుడు".

మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు. పూర్వ నామం "దేవవ్రతుడు". భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర అనిర్వచనీయమైనది.

ఆయన అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణ జన్ముడు. అష్ట వసువులలో ఒకడు. అష్ట వసువులు అనగా దేవలోకం లో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం సాక్షాత్తూ బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధృవులు.

ఒక సారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్టుని ఆశ్రమంలో ఉండే కామధేనువు. దానిని వారు దొంగతనంగా తీసుకుని వెళతారు. వశిష్ఠుడు తన దివ్యదృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్టుని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన ఏడుమంది వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని కానీ కామధేవుని తీసుకుని వెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెబుతాడు.

వారు ఆ శాపం గురించి ఆలోచిస్తుండగా గంగా దేవి వారి వద్దకు వస్తుంది. వారు ఆమెను మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారవేయ వలసిందిగా కోరతారు. గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది.

ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజు గంగానదీలో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి వచ్చి ఆయన కుడి తొడమీద కూర్చుంటుంది. ఆమె తనను మోహిస్తుందేమోనని ఆయన బాధ పడి ఆమె ఎందుకు అలా కూర్చుందో అడుగుతాడు. సాధారణంగా కూతుళ్ళు, కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు. తనకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్ళాడవచ్చునని సూచిస్తాడు. అది విని ఆమె అంతర్ధానమైపోతుంది.

కొద్ది కాలానికి ప్రతీపునికి శంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు. ఆయన ఒకసారి గంగాతీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు. శంతనుడు ఆమెను పెళ్ళి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది. దాని ప్రకారం పెళ్ళి తర్వాత ఆమె ఏం చేసినా శంతనుడు అందుకు అడ్డు చెప్పకూడదు. ఆక్షేపించ కూడదు. అలా చేసిన పక్షంలో ఆమె అంతర్ధానమైపోతుంది. శంతనుడు అందుకు అంగీకరించి ఆమెను పెళ్ళి చేసుకుంటాడు.

కొద్ది కాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు మగ సంతానం కలుగుతారు. అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది. ఆ ఏడుగురి విషయంలోనూ ఎలాగోలా ఊరుకున్న శంతనుడు ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు. ఆమె ఆ శిశువును శంతనుడికిచ్చి అంతర్ధానమైపోతుంది. ఆ శిశువే దేవవ్రతుడు. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు. గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గాంగేయుడు అని కూడా పిలవబడ్డాడు.

వారే భీష్మాచార్యులు వారు !

Source - Whatsapp Message

సాధన ఎలా ఉండాలి?

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


సాధన ఎలా ఉండాలి?
➖➖➖
✍️ మురళీ మోహన్

🤘సాధనలో .. అహం పెరగకుండా వినయం పెరగడం ఉత్తీర్ణతకు గుర్తు !!

గురువు సత్యాన్ని గుర్తు చేస్తాడు. సద్గురువు సత్యాన్ని గుర్తుపట్టేలా, గుర్తుండేలా.. చూస్తాడు.

మనలో భక్తీ, సాధన పెరుగుతుందంటే ‘శాంతి, వినయం’ పెరగాలి. మనం సత్యానికి దగ్గరవుతున్నాం అనటానికి అదే గుర్తు.

భౌతిక జీవనంలో డబ్బు, కీర్తి, పాండిత్యం పెరిగితే సాధారణంగా అహంకారం పెరుగుతుంది. అవి పెరిగినా అహం పెరగకపోవడమే ఉత్తమ జీవనం అవుతుంది.

ఆధ్యాత్మిక మార్గంలో కూడా సాధన పెరిగే కొద్ది సిద్ధులు, శక్తులు, సంకల్ప బలం పెరిగి అహం పెరుగుతుంది.

సాధన పెరిగేకొద్దీ అహం పెరగకుండా శాంతి మరియు వినయం పెరగడం ఉత్తీర్ణతకు గుర్తు

దైవసంకల్పం లేకుండా ఒక గడ్డిపోచ అయినా కదలదు. ఒక జీవుడికి మంచిరోజులు వచ్చినపుడు అతడి ఆలోచనలు అతణ్ణి ప్రార్థనకు పురికొల్పుతాయి. అదే చెడ్డ రోజులు దాపురించినపుడు అతని ఆలోచనలన్నీ చెడుదారిన పడతాయి.

గొంగళి పురుగు అని అసహ్యించు కున్నవారు సీతాకోకచిలుకలా మారిన తరువాత వర్ణించడానికి మాటలు వెతుకుతుంటారు.....

మనిషి జీవితం కూడా అంతే... కష్టపడుతున్నప్పుడు రాని ఎవరూ... నువ్వు సుఖపడుతున్నప్పుడు వెతుక్కొని మరీ వస్తారు.

మనం చేసే ప్రతి పనిని ధర్మం కనిపెడుతూనే ఉంటుంది.
అన్నీ దేవుడు చూస్తూనే ఉంటాడు.
అంతరాత్మ పరిశీలిస్తూనే ఉంటుంది.
ఇక పగలు..రాత్రి.. సూర్యుడు.. చంద్రుడు ఉండనే ఉన్నాయి......
ఇన్నిటి ఎదుట మనం ఏదైనా
తప్పు చేస్తున్నామంటే.....
అది ఆత్మవంచనే అవుతుంది.....!!

నీ విజయాలను నీకన్నా చిన్నవారితో పంచుకో..! స్ఫూర్తితో వారు నిన్ను అనుసరిస్తారు.

నీ ఓటములను నీకన్నా పెద్దవారితో పంచుకో! అనుభవంతో వారు నీకు బోధిస్తారు.

ఎకరా ఎకరాలుగా భూమిని కొంటున్న మనిషిని చూసి స్మశానం నవ్వింది..... ‘నిన్ను కొనబోయేది నేనేనని..!.’ నీకు ఇవ్వబోయేది ఆరడుగులేనని..!"

ఆశ ఉన్నవారు....ఆనందంలో మాత్రమే బ్రతకగలరు!

ఆశయం ఉన్నవారు... బాధలో కూడా ఆనందంగా బ్రతకగలరు!

తెలివికి నిదర్శనం తప్పులు వెదకడం కాదు! పరిష్కారాలను సూచించ గలగడం....!

వీలైతే నలుగురు కి సాయం చేయి!
గొప్పలు చెప్పకు ,
ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకు
నిజాలు మాట్లాడు ,
అబద్ధాలతో అందమైన జీవితం ఊహించుకోకు.
ఇంకొకరి తో పోల్చుకొని, మనశ్శాంతి కోల్పోకు✍️

🌷🙏🌷
L

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Source - Whatsapp Message

స్నేహితుడు, వెండి, బంగారం, జ్ఞానం’- ఈ నాలుగు పేదరికం నుంచి గట్టెక్కడానికి తోడ్పడే ముఖ్యమైన సంపదలు.

స్నేహితుడు, వెండి, బంగారం, జ్ఞానం’- ఈ నాలుగు పేదరికం నుంచి గట్టెక్కడానికి తోడ్పడే ముఖ్యమైన సంపదలు. వీటన్నిటిలోనూ ‘మిత్రుని సహాయమే’ ఎక్కువగా వెల కట్టలేనిది. ‘స్నేహం’ అనేది బాల్యం నుంచే మనిషి జీవితంలో చెరగని ముద్ర వేస్తుంది. అందుకే, ‘మంచి స్నేహితుడు’ లభించడమనేది ఒక వరం వంటిది. స్నేహితుణ్ని ఎంచుకోవడానికి విధిగా పాటించవలసిన జాగ్రత్తలను ‘మహాభారతమే’ మనకు ప్రబోధించింది. ‘మంచి మిత్రుని అండ దొరికిన వారు సమాజంలో గౌరవ సంపదలతో వర్ధిల్లుతుంటారు’ అన్నది ఆర్యోక్తి. అయితే, ‘దరిద్రునికి ధనవంతునితో, విజ్ఞానికి మూర్ఖునితో, నెమ్మదస్తునికి క్రూరునితో, ఉత్తమునికి దుర్మార్గునితో స్నేహమనేది ఎప్పుడూ పొసగదు’ .

‘చదువు, సంపద, నడవడికలలో సమానులకు మాత్రమే మైత్రి పొసగుతుంది’ ‘ఒకే స్వభా వాన్ని కలిగి, అన్యోన్యంగా ఉండే మిత్రులకు ఒకవేళ ఆస్తిపాస్తులు, డబ్బు వంటి విషయాల్లో ఏమైనా అభిప్రాయ భేదాలు ఏర్పడినా, వాటన్నిటినీ పక్కనపెట్టి విలువైన స్నేహం వైపే మొగ్గు చూపుతుండాలి’అన్న ప్రామాణికతను మరిచిపోరాదు. ‘మిత్రునికి అనుకోకుండా ఏదైనా ఆపద వస్తే తన తెలివితేటలను ఉపయోగించి అయినా అతణ్ని ఆ విపత్తు నుంచి గట్టెక్కించాలి’ ఇదే ‘మిత్రధర్మం’. ‘ఎంతో మేలు చేసి సంపాదించుకున్న మంచి మిత్రుని వల్ల సిద్ధించే ప్రయోజనాలను కాదని అతనిని దూరం చేసుకోవడం ఇరువురికీ క్షేమం కాదు. ఈ ‘మిత్ర సంపద’ మిగతా సంపదలన్నిటి కంటేకూడా ఎంతో గొప్పది’ అలాగే, ‘సమస్యలలో ఉన్నప్పుడు మిత్రుడు తనకు చేసిన మేలును మరిచిపోకుండా, అవసరం వచ్చినప్పుడు తిరిగి అతనికి మేలు చేస్తుండాలి. తమకు సహాయం చేసిన వాళ్ల ఋణాన్ని తీర్చుకోవడానికి తిరిగి సహాయం చేసేవాడే ‘కృతజ్ఞుడు’.

‘మిత్రద్రోహాన్ని’ మించిన పాపం మరొకటి ఉండదు. మిత్రద్రోహులనూ, కృతఘ్నులనూ, గుర్తుపట్టి వారిని ఎప్పుడూ నమ్మకుండా దూరం పెడుతుండాలి’ చేసిన మేలును మరచిపోయి నవారిని, ఆ మేలు చేసిన వారికి కీడు చేసేవారినీ ‘కృతఘ్నులు’ అంటారు. తనకు అంతటి స్థాయి రావడానికి, సంపదలన్నిటినీ సమకూర్చుకోవడానికి, సుఖప్రదమైన జీవితాన్ని అనుభవించడానికి, జీవితాం తం తనకోసం పాటుపడిన దాతకు అవసరాలన్నీ తీరిన పిమ్మట కీడు చేసే కృతఘ్నుని శవాన్ని తాకడానికి కుక్కలు కూడా అసహ్యించుకుంటాయి’ అందుకే, ‘కృతఘ్నత’ అనేది పనికి రాదనీ, ఇది అనేక అనర్థాలకు దారితీస్తుందనీ మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి. ‘మంచివాళ్లతో స్నేహం చేస్తే మంచి జరిగినట్లే, చెడ్డవారితో సహవాసం చేస్తే చెడు ఫలితాలే అనుభవంలోకి వస్తాయి’
ఆరు నెలలు కలిసి ఉంటే వాడు వీడూ, వీడు వాడూ అవుతాడనే నానుడిలోనూ వాస్తవం లేకపోలేదు. అసత్యవాది సాంగత్యంలో ఉంటే మంచివాడు కూడా చెడ్డవాడవుతాడు. ఎంతో మహిమతో ఉండే విష్ణు సహస్ర నామావళిని బోధించిన భీష్ముడంతటి వాడు కూడా దుర్యోధనుని సాంగత్యం వల్ల గోవులను దొంగిలించడానికి సిద్ధపడ్డాడు. అందుకే ‘దుష్టులతో స్నేహం’ ఎన్నటికీ పనికిరాదని మన సనాతన ధర్మం నొక్కి చెప్తున్నది. స్నేహం చేయడానికి ముందే ఆ వ్యక్తి గుణగణాలనూ, నడవడికనూ చక్కగా బేరీజు వేసుకోవాలి. తమ అవసరాలు తీర్చుకోగానే కీడు చేసేవారిని ఏ మాత్రం దగ్గరకు రానీయకుండా జాగ్రత్త పడుతుండాలి. అప్పుడే, జీవితానికి మేలు, మిత్ర ధర్మానికి సార్థకత చేకూరుతాయి.

Source - Whatsapp Message

నీ గురించి తెలుసు కో!!

నీ గురించి తెలుసు కో!!
💦🎊💞🦜🌹🦚🌈

🔰నువ్వే ఒక అద్భుతానివి ,,,తెలుసుకో!!

గొప్పగా బ్రతకాలని సంకల్పించు...
నీ ప్రేమని పొందాలంటే కూడా
ఓ అర్హత ఉండాలని గుర్తించు!!!!

కింద పడేసే సమస్యల్లో ఏముంది...?
తలబడి నిలబడగననే నీ నమ్మకంలోనే
ఉంది అసలైన జీవితం....అంతే కదా!!!

భూమిని చీల్చుతూ చిన్న విత్తనం
ఎలా మొలకెత్తుతుందో చూడు
అంతా ఐపోయిందనే
నీ నిరాశా భావాలను విడిచి
కొత్త ఆశల వైపు అడుగిడు.

జీవితంలో కింద పడని వాడే లేడు
పడకపోతే వాడు మనిషే కాడు
పడినా మరల పైకి రాకుండానూ లేడు కదా!!

అవసరం లేదని విసిరేసిన వాళ్ళే విస్తుపోయోలా...
పడగొట్టిన వాళ్ళ ముందే తలెత్తుకు
నిలబడితేనే కదా!!!

నీ నీడ కూడా నువ్వు వెలుగులో
ఉన్నప్పుడే నీ తోడుగా ఉంటుంది!!!!
మరి నువ్వు చీకట్లో ఉన్నప్పుడు
నమ్మిన వాళ్ళెలా తోడుగా ఉంటారనుకుంటున్నవ్????

సీతాకోక చిలుకను కూడా
గొంగళి పురుగులా ఉన్నప్పుడు
అందరూ అసహ్యించుకుంటారు కదా!!!!

జరిగిపోయిన దాన్నే ఆలోచిస్తూ...
గొంగళి పురుగులాగానే మిగిలిపోతావో.:
కొత్త ఆశలతో,ఆశయాలతో.
సీతాకోక చిలుకలా వెలిగిపోతావో;
తేల్చుకో ;;నీ జీవితాన్ని నువ్వే మార్చుకో;;!!!

🕉️🌞🌎🏵️🌈🚩

Source - Whatsapp Message

ఆ శక్తి అపారం. దాన్ని అందుకోగలిగిన నాడు, లోకంలో దేన్నయినా సాధించగలం. మనోవిజయమే లోక విజయం.

సహజంగా మనసు ప్రశాంతంగా ఉండదు. దాన్ని మనమే సరిచేసుకుంటూ ఉండాలి. లేకపోతే చిక్కులు పడిన తాడులా ఉంటుంది. అర్థం కాని సమస్యలా ప్రతీసారి మన ముందుకు వచ్చి నిలబడుతుంది.

ఎందుకిలా జరుగుతుంది? మనసుతో ఈ ఇబ్బంది ఏమిటి? చాలా సార్లు, చాలా మందికి అనిపిస్తుంది. మనసుతో ఇలాంటి గొడవ ఏదో ఒక రోజు రావాలి. అదే నాంది- మనసును శోధించడానికి. మనసును సాధించడానికి. దాని సంగతి తేల్చుకోవడానికి.

మనిషికి చాలా సంతోషకరమైన, మేధాపరమైన ఆట ఏది అంటే, మనసుతో నిత్యం ఆడేదేే! మనసుతో ఆడాలి. మనసును పరుగెత్తించాలి. మనల్ని మనసు పరుగెత్తిస్తుంటే ఆపాలి. మనసుకు ఎదురుతిరగాలి అంటారు స్వామి వివేకానంద.

మనసు భయపెడుతుంది. బాధ పెడుతుంది. విసిగిస్తుంది. చివరకు కాళ్లబేరానికి వచ్చి బుజ్జగించి, లాలిస్తుంది. రాయిలా మనం కదలక మెదలక ఉంటే, చివరకు దండం పెడుతుంది- రమణ మహర్షికి వశమైన మనసులా.

మనసు లేని మనిషి గడ్డకట్టిన సరస్సులాగా ఉంటాడు. శీతోష్ణ, సుఖ, దుఃఖాలను సమంగా చూస్తాడు.

ఇలాంటి ప్రశాంతమైన మనసు కలిగిన మనిషే శక్తికి పుట్టినిల్లు అవుతాడు. శక్తి కావాలంటే నిరంతరం ఆలోచనలతో సతమతమయ్యే మనసును భారంగా మొయ్యడం కాదు. ఆలోచనలను నియంత్రించుకుని, సృజనాత్మక భావాల మీద ఏకాగ్రత నిలిపితే అసలైన శక్తి పుడుతుంది.

ఆ శక్తి అపారం. దాన్ని అందుకోగలిగిన నాడు, లోకంలో దేన్నయినా సాధించగలం. మనోవిజయమే లోక విజయం.

ప్రశాంతమైన మనసే అద్భుతాలు సృష్టించగలదు. ఆలోచనలు తగ్గుతున్న కొలదీ సృజనాత్మకత పెరుగుతుంది. వందలు, వేల కొద్దీ క్రమం లేని ఆలోచనలు మనసులోని శక్తిని తగ్గించేస్తాయి. ఒక మంచి, గొప్ప ఆలోచన దివ్య మార్గంలో నడిపిస్తుంది.

హృదయం మనసుకు అనుసంధానమైనప్పుడు పుట్టే ప్రతి ఆలోచనా గొప్పది అవుతుంది. హృదయం కలగజేసుకోవాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే క్రమబద్ధమైన, శక్తిమంతమైన ఉపయోగకరమైన ఆలోచనలు చెయ్యాలి.

ఆలోచనలకు ముందు ధ్యానం చెయ్యాలి. ఆలోచించిన తరవాత ధ్యానం చెయ్యాలి. మరిన్ని మంచి ఆలోచనల కోసం ఆలోచనల తీరుతెన్నులు తెలుసుకోవాలి. ఆలోచనలకు స్థావరమైన మనసును ముఖాముఖీ ఎదుర్కోవాలి. అవసరమైతే పక్కకు తప్పుకొని మనసుకు సాక్షిగా నిలబడి ఉండాలి. ఇదంతా సాధన వల్లనే సాధ్యపడుతుంది.

మనసుతో వ్యాయామం చెయ్యని మనిషి సాధనలో పరిణతి చెందలేడు. మనసుకు అతీతంగా వెళ్లని మనిషి ఆధ్యాత్మిక రహస్యాలు అందిపుచ్చుకోలేడు.

మనసు మనకు మంచి మిత్రుడు. దారుణమైన శత్రువు కూడా. ఉపయోగించుకోవడంలో అంతా ఉంది.

మనసు గాలిలో దీపంలా ఉంది. దీన్నెలా వశం చేసుకోవాలని దీనంగా ప్రార్థించాడు అర్జునుడు. అప్పుడు పరమాత్మ చెప్పాడు-

‘నిస్సందేహంగా మనసు చంచలమైనది. దాన్ని వశపరచుకోవడం చాలా కష్టం. అభ్యాస వైరాగ్యాల ద్వారా దాన్ని నియంత్రించడం సాధ్యమే. మనసు వశం చేసుకున్న ప్రయత్నపరుడైన మనిషికి సాధనద్వారా సహజంగా యోగ సిద్ధి పొందడం సాధ్యమే
👏👏👏👏

Source - Whatsapp Message

దారి ఏదైనా గమ్యం కొరకే... గమ్యం ఏదైనా ఉన్నత స్తితి కొరకే.. ప్రయాణం ఏదైనా సహజ స్తితి కొరకే...

మార్పు అనేది నిత్యం జరుగుతూనే ఉంటుంది... మనం మన సహజస్థితి అంటే ఎలాంటి వత్తిడి లేకుండా ఉండటం... ఏ వత్తిడి లేనప్పుడు ఎలా ఉంటామో అది మనం... మార్పు జరుగుతున్నప్పుడు ఘర్షణ అనేది వస్తుంది... దానిని అధిగమించాలి అంటే మార్పును అంగీకరించటం మినహా ఇంకో దారి లేదు... దానికి మనం ఏ పెరు పెట్టుకున్న మార్పు మనల్ని తనలో కలిపేసుకుంటుంది దానికి ఏలాటి భావం లేకుండా..
దీనికి ఓ ఉపమానం చిన్న కద...

🌸 మన ఇంటిలోకి ఓ దొంగ వచ్చాడు మనం ఏమి చేస్తాం సహజంగా ఆపటానికి చూస్తాం కుదరకపోతే ఏమి చేస్తున్నాడో చూస్తాం... ఆ దొంగ గాలి లేదా ఊపిరి అయితే... అంగీకరించాల్సిందే.. వేరే దారి ఉండదు కాబట్టి... మార్పు అలాంటిదే అని అనుకుంటే పరిస్థితిని దానికి తగినట్లుగా మార్చుకుంటాం.. అంటే ఇక్కడ మన శక్తికి మించి అయితే లోబడ్డట్లు అనుకుంటే ఇప్పటి వరకు మనం జీవించం... బలవంతపు మార్పు మనిషిని సహజత్వం నుంచి దూరంగా తీసుకువెళుతుంది... అదే అంతే సహజంగా ఆహ్వానిస్తే జీవితం పూల బాట అవుతుంది... తేడా ఏమిటి అంటే అ0గీకరించటం మాత్రమే... ఏదైతే మనసా వాచా కర్మణా మనం మార్పును ఆహ్వానిస్తామో ఆక్కడ ఉండేది ఆనందం.. ఎప్పుడైతే ప్రశ్నిస్తామో అక్కడ ఘర్షణ మొదలు... ఘర్షణ వచ్చింది అంటే అక్కడ బావావేశాలు మొదలు... సహజమైన శాంతి స్తితి మనలో ఉండదు..

🌸 సహజమైన స్తితిలో ఎదుగుదల ఉండదు కాబట్టి మార్పు అవసరం... ఎదుగుదల కోసం ప్రయాణం మార్పు కోసం వెధకడమే.. రెండు సరైనవే కానీ సరికాదు.. ఇక్కడ ప్రతి ఒక్కరూ దోలాయన స్తితిలోకి వెళుతుంటారు... మన15 వ సంవత్సరం నుంచి 45 సంవత్సరం వరకు ఎదుగుదల కోసం మన ప్రయాణం అనివార్యంగా ఉంటుంది... ఇక్కడ ఘర్షణతో కలిసి ప్రయాణం... 45 నుంచి మన పరుగు ఆపుతాం కారణం అప్పటికే ఘర్షణ అంటే విసుగు వచ్చి... అక్కడ నుంచి సహజస్థితి కోసం పరుగులు... ఇలా మనకు మనం (ఆత్మ) ఎదుగుదల కోసం చిన్నప్పటినుంచి ప్రయాణం మొదలు పెట్టటం చాలా అవసరం... మన పిల్లలకు చిన్ననాటినుంచే ధ్యాన ప్రయాణం అనివార్యం కూడా... మనం ఏమి చేసినా ఇలా ఇప్పుడు ఉన్నస్తితి వారికి అందించగలిగితే ఇప్పటి జెనరేషన్ నుండి రెండో జెనరేషన్ శాంతి సౌఖ్యలతో విలసిల్లుతు0ది... దారి ఏదైనా గమ్యం కొరకే... గమ్యం ఏదైనా ఉన్నత స్తితి కొరకే.. ప్రయాణం ఏదైనా సహజ స్తితి కొరకే...

ఇప్పటికి ఇంతవరకు...

Thank you...🌸🌸🌸

Source - Whatsapp Message

మీ బ్రెయిన్ కి feed చేయాల్సింది మీరే.

ఇది చదవండి కాదు,కాదు ఆచరించండి, మీరు ఇప్పటికి ఈ క్రింది చెప్పిన విధంగా ఆచరించకుండ ఉన్నట్లు అయితే.. మీ జీవితం లో మార్పుకోసం..

కొద్దిగా నీరసంగా ఉంది,
కొద్దిగా బద్దకంగా ఉంది,
కాసేపు పడుకోవాలనిపిస్తోంది,
కాసేపాగి పనిచేసుకోవచ్చులే,
ఇప్పటికిప్పుడు కొంపలేం మునిగి పోవట్లేదు కదా..!!
మీకు మీరు ఇచ్చుకునే ఈ auto suggestions ని మీరు
ఎప్పుడైనా గమనించారా? హ్యూమన్ బ్రెయిన్ చాలాగొప్ప executor. మీరు అనుకున్నవన్నీ తూ. చ. తప్పకుండా చేస్తుంది. నిద్ర వస్తోంది అనుకోండి,అప్పటి నుండే ఆవలింతలు మొదలవుతాయి.ఇవ్వాళ రిలాక్స్ అయి రేపు పనిచేద్దాంలే అనుకోండి,వెంటనే సాకులు వెదికిపెట్టి మనం కంఫర్టబుల్‌గా రిలాక్స్ అయ్యేలా చేస్తుంది.. బ్రెయిన్ ప్రోగ్రామింగ్ఓ గొప్ప సబ్జెక్ట్..ప్రతీ క్షణం మన థాట్ ప్రాసెస్‌ని గమనించు కుంటూ, మన బ్రెయిన్‌ని సిస్టమాటిక్‌గా పెట్టుకుంటూ,output ని సమీక్షించుకుంటూ చేయాల్సిన పని..ఒక్క క్షణం కమిట్ అవ్వండి, మీరు ఏది ఏమైనా ఈ పని చేస్తానని"!Next మినిట్ మీ చావు రాసి పెట్టి ఉన్నా,మొదట మీరుఅనుకున్న పని చేశాకే చచ్చిపోతారు. అది మన గొప్పదనం కాదు. మన బ్రెయిన్ గొప్పదనం..మీరు ఏదనుకుంటే అది చేసి చూపెడుతుంది..అందుకే ఎప్పుడూ గొప్పగా ఆలోచించండి. మీరు
ఇప్పటికిప్పుడు కష్టపడతానంటే మీ
ఆవలింతలను,మీ
నిద్రనీ,మీ బద్ధకాన్నీ,మీ జలుబునీ,మీజ్వరాన్నీ,మీ
చుట్టూ ఉండే అన్ని, అన్ని డిసప్పాయింట్‌మెంట్లనీ పక్కన పడేసి మీబ్రెయిన్ మీ
పని మీద ఫోకస్ చెయ్యడం మొదలు పెడుతుంది. గుర్తుంచుకకోండి, మీ
బ్రెయిన్‌కి feed ఇవ్వాల్సింది మీరే. మీరు ఎవరితో కలిసి పనిచేయాలి, ఎవరిని దూరంగా పెట్టాలి అని నిర్ణయించేది మీ
బ్రెయిన్ కి feed చేయాల్సింది మీరే. దాని మీదే మీమానవ సంబంధాలు ఆధారపడి ఉంటాయి, దాని ఫలితాల పూర్తి బాధ్యత మీరే. మీ జీవిత
గమ్యం కోసం మీ బ్రెయిన్‌ని సిద్ధపరుచుకోండి. బురదలో పద్మం పుట్టుకొస్తే దాని విలువ మాటల్లోచెప్పలేం. చుట్టూ ఉన్న బురదలోని దుర్గందం వదిలి దూరాన ఉన్న సూర్యుని చెలిమితో ఎంతో బాగా వికసిస్తుంది పద్మం.అంతా క్లీన్‌గా, పాజిటివ్ గా ఉంటే మీరేంటి ప్రతీ ఒక్కరూ సాధించగలరు. మీ చుట్టూ ఉండే బలహీనతలను దాటుకుని, మీరు ఏలా ఎదగాలి అన్నది మీ గొప్పదనం.
👏👏👏👏

Source - Whatsapp Message

ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు

ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు

👉🌱1. ఒక రోజు ఒక సమయం లో నీకోసం నీవు కనీసం 60 నిముషాలు కేటాయించుకో !
👉🌱2. నీ ఒత్తిడి ని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయట పడాలో ? శాంతం వహించాలో గమనించుకో !
👉🌱3. ప్రతి రోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను
తగ్గించగలదని గుర్తించుకో !
👉 🌱4. నీ ఆహారం లో పళ్ళూ , కాయగూరలూ , నీరూ తగినంతగా ఉండేలా చూసుకో ! మాంసాహారం -విషాహారం అని తెలుసుకో !
👉🌱 5. కక్ష కన్నా క్షమ గొప్పది
క్షమ కన్నా జీవుల పట్ల కరుణ గొప్పదని అని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో !
👉🌱 6. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం నేర్చుకో !
👉 🌱7. నవ్వును , దగ్గరకు తీసుకో , ఇతరులతో నీ భావాలు పంచుకో!
👉🌱 8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని ధ్యానసాధన చెయ్యి. రెండో సారి దానికే మళ్ళీ గురికాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కోట్టడం నేర్చుకో !
👉🌱9. ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ! ఎదుట వారిని అంచనాలు వేయడం మానుకో !
👉🌱 10. పాజిటివ్ గా ఆలోచించు. దాని వలన ఎనలేని సంతోషం నీసొంతం చేసుకో !
👉🌱11. మద్యానికి , మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండు . అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో శాకాహారిగా ఉండడం ధ్యానం చేయడం నేర్చుకో!
👉🌱12. డబ్బు విషయం లో జాగ్రత్త వహించు .నీడబ్బులో కనీసం 10 శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యిడం నేర్చుకో!
👍🌱13. నాకు ఒద్దు , నాకు రాదు నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో !
👉 🌱14. బయటకు వెళ్ళు . మిత్రులతో , బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో !
👉🌱 15. టి వి కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించుకో !
👉🌱16. పొగ తాగడం ఒత్తిడి పెంచడమే కాదు నిన్ను చంపగలదు అని తెలుసుకో !
👉🌱17. బంధాలను పెంచుకో , కాపాడుకో , ఎక్కువ విను , తక్కువ మాట్లాడు నేర్చుకో !
👉🌱18. ప్రతీదీ అనుభవించు; కాని దేనికీి బానిస కాకూడదు అని తెలుసుకో !
👉🌱 19. వారానికి ఒక్కసారి ఉపవాసం ; ఉదయం సూర్యోదయం; సాయంత్రం సూర్యాస్తమయం చూడడం నేర్చుకో !
👉🌱 20. విషయాలను నీ కోణం నుండి కాకుడా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో !
👍🌱21. విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో!
👉🌱22. నీ ఆందోళన వలన సమస్యలు తొందరగా గానీ , మంచిగా కానీ పూర్తి కావు .అని గుర్తించుకో !
👉🌱23. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో !
👉🌱24. ప్రతీ రోజూ భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని. నవ్వుతూ ఉండు. ఈ ప్రపంచం అనే అందమైన పెయింటింగ్ లో నువ్వూ ఒక భాగం అని తెలుసుకో !
👉🌱25. యోగా చెయ్యి. ప్రాణాయామం చెయ్యి.

👍🌱శ్వాస మీద ధ్యాస తో ధ్యానం చెయ్యి.
👉🌱 ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు .
👉🌱 నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు .

ఇవి మానవ జీవితానికి కంప్లీట్ ఎగ్జామ్ పేపర్
🥰🌱🥰🌱🥰🌱🥰
మీ....పి.సారిక....

Source - Whatsapp Message

ఇలాంటి శాంతిని నాకు ప్రసాదించు.

అలలు ఆలోచనలు రెండు అలజడులు సృష్టించేవే
అలలు సముద్రంలో సృష్టిస్తే
ఆలోచనలు మస్తిష్కం లో సృష్టిస్తాయి


కత్తి పట్టడానికి ఆవేశం ఉంటే చాలు కత్తి
తయారుచేయడానికి ఆలోచన ఆచరణ రెండు కావాలి

ఆశలను వదులుకుంటే శ్రమలుండవు. సంపదలేకుంటే భయముండదు. పరులను హింసించకుంటే పాపంరాదు. సుఖాలను కోరకపోతే బుద్ధిచెడిపోకుండా ఉంటుంది.
స్వతంత్రంగా ఉంటే చిక్కులుండవు. కోరికలు లేకపోతే లేనిపోని బంధాలుండవు.
స్వార్థం మానుకుంటే దుఃఖాలుండవు.


కావున ఈ అన్నింటినీ గూర్చి ఆలోచించి, గొప్పతనాన్ని పొంది ప్రవర్తించే మానవుడే నిశ్చింతగా శాంతిగా ఉంటాడు. ఇలాంటి శాంతిని నాకు ప్రసాదించు.

👏👏👏👏

Source - Whatsapp Message

మంచి మాటలు....


🕉🌞🌏🌙🌟🚩

శిష్యుడు:- దేవుణ్ణి పొందటం ఎలా?

గురువు:- దేవుడు అంటే ఏమిటో అర్థం తెలిస్తే, పొందటం గురించి తర్వాత ఆలోచిద్దాం.

( దేవుడు అనంతుడు. పొందటం, పోగొట్టుకోవడం అసంభవం అని భావం.)

⚡️✨⚡️✨⚡️✨

సృష్టికి లయం సంగతి తెలియదు.లయానికి సృష్టి సంగతి తెలియదు.స్థితికి ఈ రెండిటి సంగతి తెలియదు.

➡️ ఈ మూడింటి సంగతి ఒక్కదానికే తెలుసునని ఉన్నదే 'మాయ'.

➡️ భూతకాలం అనే 'పెనుభూతం' నుండి బయటపడటమే ఆధ్యాత్మికత.

➡️ భవిష్యత్తు అనే 'గాలిమేడలు' నుండి బయటపడటమే ఆధ్యాత్మికత.

➡️ వర్తమానంలో ప్రతి అనుభవాన్ని గొప్ప అనుభవంగా స్వీకరిస్తూ, ఆ అనుభవంలో జీవించడమే ఆధ్యాత్మికత.

⚡️✨⚡️✨⚡️✨

ఆధ్యాత్మిక అన్వేషణ....
👉 'ఇదంతా నాదే' అని మొదలై,
👉 'ఇదంతా నేనే' అని ముగుస్తుంది.

⚡️✨⚡️✨⚡️✨

✳ సత్యం అర్థమైతే - విద్య.

✳ సత్యం అనుభవమైతే - పరావిద్య.

⚡️✨⚡️✨⚡️✨

నిరంతరం, అన్నింటినీ, అందరి దగ్గరా నేర్చుకుంటూ వుండడమే 'ప్రజ్ఞ' అంటే !

నిరంతరం, అన్నింటినీ, అందరికీ నేర్పిస్తూ వుండడమే 'కరుణ' అంటే !

🕉🌞🌏🌙🌟🚩
గురువు:- దేవుడు అంటే ఏమిటో అర్థం తెలిస్తే, పొందటం గురించి తర్వాత ఆలోచిద్దాం.

( దేవుడు అనంతుడు. పొందటం, పోగొట్టుకోవడం అసంభవం అని భావం.)

⚡️✨⚡️✨⚡️✨

సృష్టికి లయం సంగతి తెలియదు.లయానికి సృష్టి సంగతి తెలియదు.స్థితికి ఈ రెండిటి సంగతి తెలియదు.

➡️ ఈ మూడింటి సంగతి ఒక్కదానికే తెలుసునని ఉన్నదే 'మాయ'.

➡️ భూతకాలం అనే 'పెనుభూతం' నుండి బయటపడటమే ఆధ్యాత్మికత.

➡️ భవిష్యత్తు అనే 'గాలిమేడలు' నుండి బయటపడటమే ఆధ్యాత్మికత.

➡️ వర్తమానంలో ప్రతి అనుభవాన్ని గొప్ప అనుభవంగా స్వీకరిస్తూ, ఆ అనుభవంలో జీవించడమే ఆధ్యాత్మికత.

⚡️✨⚡️✨⚡️✨

ఆధ్యాత్మిక అన్వేషణ....
👉 'ఇదంతా నాదే' అని మొదలై,
👉 'ఇదంతా నేనే' అని ముగుస్తుంది.

⚡️✨⚡️✨⚡️✨

✳ సత్యం అర్థమైతే - విద్య.

✳ సత్యం అనుభవమైతే - పరావిద్య.

⚡️✨⚡️✨⚡️✨

నిరంతరం, అన్నింటినీ, అందరి దగ్గరా నేర్చుకుంటూ వుండడమే 'ప్రజ్ఞ' అంటే !

నిరంతరం, అన్నింటినీ, అందరికీ నేర్పిస్తూ వుండడమే 'కరుణ' అంటే !

🕉🌞🌏🌙🌟🚩

Source - Whatsapp Message

నేటి మాట

🍃🌺🍃🌸🍃🌺🍃🌸🍃🌺

🌹నేటి మాట🌹

ఎవరైనా కాలంచేతిలో కీలుబొమ్మలే..
సాక్షాత్తూ శ్రీరామచంద్రుడు ఒక్కరోజులో తారుమారై,
పట్టాభిషేకం బదులు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేసాడు

రాజసూయయాగం చేసి విజయాలుపొందిన,
పాండవులు పన్నెండేళ్ళు అరణ్యం,
ఒకేడు అజ్ఞాతవాసం చేయాల్సొచ్చింది.
హరిశ్చంద్రుడు నలుడుఅంతా కాలమహిమకి కష్టాలుపడ్డారు.

మనల్ని మోసం చేసారని తోటి వారిని,
మన కోసం ఆగలేదని కాలాన్ని,
ఎప్పుడు నిందించకూడదు.
ఎందుకంటే...
మోసపోవడంలోను,
కాలాన్ని వృధా చేయటంలో,
మన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది.!

మనస్సాక్షి అంటూ ఉన్న వారికే,
తప్పులు ఎప్పటికప్పుడు శిక్షిస్తుంటాయి.!
నిజం నీతిగా ఒంటరి అవుతుంది..
అబద్ధం నమ్మిస్తూ, నటిస్తూ, దగ్గేరై మోసం చేస్తుంది..

ఒక్కరోజు నీవు అనుకున్నలా లేదని ఆరోజును చేడుగా అనుకోవద్దు...
ఇంకా చాలా రోజులు మిగిలి ఉన్నాయి...
ఒక్కరోజు బాగులేదని జీవితాంతం అలాగే ఉంటుందని అనుకోవడం పొరపాటు...!

గడియకో రకంగా మాట మార్చేవారే లోకానికి నచ్చుతారు....
లౌక్యం తెలిసిన వారు లోకులకు ఎప్పుడు హితులే....
లౌక్యం చేతకాని వారు శతృవులే..

ఆటిట్యూడ్ అంటే ఎదుటివారిని తూలనాడటం, చులకన చేయడం, విమర్శించడం, అవునంటే కాదనడం అనుకుంటారు చాలామంది..
పొగరికి, మూర్ఖత్వానికి చాలా తేడా ఉంది.!

పొగరంటే పరిస్థితి ఎంత దిగజారిన‌ తలవంచక పోవడం,
నష్ట పోయిన కూడా చిరునవ్వుతో ఎదుర్కోవడం
ఎదుటివారిని చులకన చేసి దిగజారడం కాదు ఆటిట్యూడ్ అంటే.!

నిన్ను అనుమానించే వారిని నీ దగ్గరకు రానీకు,
నిన్ను అవమానించే వారి దగ్గరికి నువ్వు వెళ్లకు,
నిన్ను అభిమానించే వారిని గుర్తించి వదులుకోకు!

నీ దారిన నువ్వెళ్ళు,
వచ్చేవారు వస్తారు..
పొయ్యేవారు పోతారు..
సూర్యుని వెలుతురును,
మబ్బులు ఎక్కువసేపు ఆపలేవు...!
నిజాలను...అబద్ధాలు ఎక్కువ రోజులు కప్పిపుచ్చ లేవు..

ఏది ఉంచుకోవాలో,
ఏది పెంచుకోవాలో,
ఏది వదిలించుకోవాలో...
తెలుసుకోవడమే విజ్ఞత.!
అడ్డమైన వాడినీ ప్రశ్నిస్తే...

వాడు నేనూ గొప్పోడినే అనుకునే ప్రమాదముంది.!
జీవితం అనే నాటకరంగంలో,
నటించకపోతే..
కొట్టి మరీ చంపేసాలా ఉంటారు.!...జాగ్రత్త


🙏లోకా సమస్త సుఖినోభవంతు🙏

Source - Whatsapp Message

Monday, February 22, 2021

నీలో లేనిది బయటేమీ లేదు, బయటఉన్నదంతా నీలోనూ ఉంది..

🎊💦🦚🌹💞🦜🌈

జీవితంలో కష్టము,
కన్నీళ్ళు, సంతోషము,
భాధ ఏవి శాశ్వతంగా ఉండవు,

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు.
ఆనందం, ఆవేదన కూడా అంతే.

నవ్వులూ, కన్నీళ్ళూ
కలగలసినదే జీవితం.

కష్టమూ శాశ్వతం కాదు,
సంతోషమూ శాశ్వతమూ కాదు.


ఓడిపోతే
గెలవడం నేర్చుకోవాలి,

మోసపోతే
జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి,

చెడిపోతే ఎలా
బాగుపడలో నేర్చుకోవాలి,

గెలుపును ఎలా పట్టుకోవాలో
తెలిసిన వాడికంటే
ఓటమిని ఎలా
తట్టుకోవాలో తెలిసిన వారే
గొప్ప వారు......


దెబ్బలు తిన్న రాయి
విగ్రహంగా మారుతుంది

కానీ దెబ్బలు కొట్టిన
సుత్తి మాత్రం ఎప్పటికీ

సుత్తిగానే మిగిలిపోతుంది....

ఎదురు దెబ్బలు తిన్నవాడు,

నొప్పి విలువ తెలిసిన వాడు

మహనీయుడు అవుతాడు...

ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు

ఎప్పటికీ ఉన్నదగ్గరే ఉండిపోతాడు...


డబ్బుతో ఏమైనా
కొనగలమనుకుంటున్నారా

అయితే కొనలేనివి ఇవిగో

మంచం పరుపు కొనవచ్చు-
కానీ నిద్ర కాదు

గడియారం కొనవచ్చు:-
కానీ కాలం కాదు

మందులు కొనవచ్చు:-
కానీ ఆరోగ్యం కాదు

భవంతులు కొనవచ్చు :-
కానీ ఆత్మీయత కాదు

పుస్తకాలు కొనవచ్చు :-
కానీ జ్ఞానం కాదు

పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చు

కానీ జీర్ణశక్తిని కాదు


ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే

అందరి కన్నా ముందు మేకలే జ్ఞానులు
కావాలి,

స్నానాలతోనే పాపాలు పోతే ముందు

చేపలే పాప విముక్తులు కావాలి,

తలక్రిందులుగా తపస్సు చేస్తేనే

పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు

గబ్బిలాలకే ఆ వరం దక్కాలి,

ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది

నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ

పరుగులు పెడితే ప్రయోజనమే లేదు,

నీలో లేనిది బయటేమీ లేదు

బయటఉన్నదంతా నీలోనూ ఉంది....

🎊💦🦚💞🌈🦜🌹

Source - Whatsapp Message

బుద్ద భగవానుడు చెప్పిన దశకుశలాలు అతిక్రమించి ప్రవర్తిస్తే కీడు చేస్తుంది. అదే వాటిని పాటిస్తే మేలు చేస్తుంది.

⛩️సంపూర్ణమైన తృష్ణరాహిత్య స్థితిని పొందాలంటే ఉన్నది ఒకటే మార్గం. చెడుపనులకు దూరంగా ఉండటం - నిరంతరం మంచిని పెంపొందించడం.

👌బుద్ద భగవానుడు చెప్పిన దశకుశలాలు అతిక్రమించి ప్రవర్తిస్తే కీడు చేస్తుంది. అదే వాటిని పాటిస్తే మేలు చేస్తుంది.

💝ఈ దశకుశల నియమాలు భిక్షువులే గాక బౌద్ధధర్మాన్ని అనుసరించే వారందరూ పాటించవలసినవి. అవేంటో తెలుసుకుందాం.
1. 🐜🐝🐛మనిషి అయినా లేక అతిచిన్న పురుగునైనా ఏ ప్రాణిని చంపరాదు. జీవులన్నిటిపట్ల ఆదరణ కలిగి ఉండాలి.
2. 👷👩‍🔧ఎవరి శ్రమఫలితం వారికే చెందాలి. 🕵️దొంగతనం, దోపిడీలు చేయరాదు.
3. 💃పరాయివాని స్త్రీ (భార్య లేక ప్రియురాలు)తో కామసంబంధం అనర్దదాయకం.
4. 🤦అసత్యం పలుకరాదు. కానీ సత్యాన్ని చెప్పడంలో విచక్షణ కలిగి ఉండాలి. అది ప్రేమ వివేకంతో కూడి, హాని కలిగించనిదై ఉండాలి.
5. 🍺🍷🥃మత్తును కలిగించే ఏ విధమైన పదార్థాలను సేవించరాదు.
6. 🗣️అసభ్యకరంగా మాట్లాడటం, తిట్టడం చేయరాదు. వ్యర్ధమైన కబుర్లు చెప్పరాదు. 🙊సభ్యతతో మాట్లాడాలి లేదా మౌనం పాటించాలి.
7. 🙊కట్టుకథలు చెప్పవద్దు. వాటిని ప్రచారం చెయ్యవద్దు. ఎప్పుడూ ఇతరుల తప్పులు ఎంచడం మాని, తోటివారితో మంచిని చూసి వారిని కాపాడు.
8. 😵పొరుగువాని సంపద చూసి అసూయ చెందకు, ఇతరులకు కలిగిన అదృష్టాన్ని చూసి ఆనందించు.
9. 😠దురాలోచన, కోపం, పరనిందలకు దూరంగా ఉండు. నీకు హాని చేసినవారిని సైతం ద్వేషించకు, ప్రాణులన్నింటిని దయతో ఆదరించు.
10. 🤔నీలో ఎన్నో సంశయాలు (doubts) రేకెత్తి నిరుత్సాహానికి , అనాసక్తికి దారితీయవచ్చు లేదా నువ్వు చేసే పొరపాట్లు ధర్మమార్గం నుండి నిన్ను దారితప్పించవచ్చు, కావున నీ మనసు నుండి అజ్ఞానాన్ని (అవిద్య) పారదోలి సత్యాన్వేషణా సంకల్పంతో ముందుకు నడువు.

📙 ప్రొఫెసర్ పి. లక్ష్మీ నరసు గారి "The essence of Buddhism" అనే ఆంగ్ల పుస్తకం నుండి శ్రీ డి. చంద్రశేఖర్ గారి తెలుగు అనువాదం.
🌷మైత్రీ భావనతో సాయికుమార్.

Source - Whatsapp Message

ఛత్రపతి శివాజీ

🌹 ఛత్రపతి శివాజీ 🌹

ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. తెలుగు సంవత్సరం , 1674 సంవత్సరం , హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివస్ జరుపుకుంటారు.

ఉపోద్ఘాతం

శివాజీ తండ్రి అయిన షాహాజీ నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. నిజాంషాహీలపైన షాజహాన్ దండయాత్ర చేసినపుడు షాహాజి సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్‌రావ్ అనే మరాఠా యోధుణ్ణి నిజాంషాహీ హత్య చేయించాడు. ఇది నచ్చని షాహాజీ నిజాంషాహి పైన తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు.

బాల్యం

శివాజీ క్రీ.శ. 1630 ఫిబ్రవరి 19వ సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ , జిజియాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం | వ్యవసాయ బొస్లే కులానికి చెందినవారు. శివాజీ తల్లి జీజియ బాయ్ యాదవ్ క్షత్రియ వంశమునకు చెందిన ఆడ పడుచు. (దేవగిరి మరాఠా యాదవ రాజుల వంశము). శివాజీకి ముందు పుట్టిన అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై పార్వతి పేరు శివాజీకు పెట్టింది. షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా , మొఘలులు ఆదిల్షాతో కలసి షాహాజీని ఓడించారు. ఆదిల్షాతో సంధి ప్రకారం షాహాజి ప్రస్తుత బెంగుళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది , పూణే వదిలి వెళ్లవలసి వచ్చింది. షాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవలసిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకొన్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జయ్ (అరవింద్ నాగులా). హిందూ సంప్రదాయాలు కాకుండా , అతనికి 8 మంది భార్యలు ఉన్నారు.

సామ్రాజ్య అంకురార్పణ

షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడయిన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన , ప్రజల పైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది. చిన్నప్పటినుండి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింప చేసింది. పరమత సహనం , స్త్రీల పట్ల గౌరవం తన తల్లివద్దనే నేర్చుకున్నాడు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకొన్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలు పెట్టాడు.

సుల్తానులతో యుద్ధాలు

17 ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో కొండన , రాజ్‌ఘడ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.

శివాజీ తమ కోటలను సొంత చేసుకోవడం చూసి ఆదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేసాడు. తర్వాత శివాజీని , బెంగుళూరులో ఉన్న శివాజీ అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములిరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు. అప్పుడు ఆదిల్షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్‌ను శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు.

ప్రతాప్‌ఘడ్ యుద్ధం

శివాజీ మెరుపుదాడులు , గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకొన్న అఫ్జల్ ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చకొట్టడానికి శివాజీ ఇష్ట దైవమయిన భవానీ దేవి దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్దముగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్‌ఘడ్ కోట దగ్గర సమావేశమవడానికి ఇద్దరూ అంగీకరించారు.

అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు. ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్ళి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినపుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు. అంతలో అడ్డు వచ్చిన అఫ్జల్ ఖాన్ సైనికాధికారులను , శివాజీ సైన్యాధికారులు అడ్డుకోనగా , శివాజీ తన దగ్గరున్న పిడి పులి గోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీనరసింహ వలె చీల్చి చెండాడుతాడు. అఫ్జల్ ఖాన్ తప్పించుకొని గుడారం నుండి బయటకు పారిపోతుండగా , ఒకే వేటుకు శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరుకుతాడు.

అఫ్జల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమయిన అడవుల్లో అటకాయించి మెరుపుదాడులతో మట్టికరపించింది. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు. ఎలాగయినా శివాజీని అణచాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధవీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పస్థూన్ సైనికులను పంపించగా , శివాజీ సేన వేల సంఖ్యలో పస్థూన్లను చంపి విజయం సాధించింది. ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్ఠలు భారతదేశమంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు.

కొల్హాపూర్ యుద్ధం

ఇది సహించలేని బిజాపూర్ సుల్తాన్ అరబ్ , పర్షియా , ఆఫ్ఘన్ నుండి మెరికల్లాంటి 10,000 మంది కిరాయి సైనికులను శివాజీని అంతమొందించడానికి పంపగా శివాజీ తన వద్దనున్న 5,000 మరాఠా యోధులతో కలసి కొల్హాపూర్ వద్ద ఎదుర్కొన్నాడు. 'హర హర మహాదేవ' అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృభించి శతృవులను ఊచకోత కోశాడు. ఈ విజయంతో కేవలం సుల్తానులే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. శివాజీ నుండి ఎప్పటికయినా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబు భావించి సన్నాహాలు మొదలు పెట్టాడు. తన మేన మామ షాయైస్త ఖాన్ ను శివాజీ పై యుద్ధానికి పంపాడు.

పవన్‌ఖిండ్ యుద్ధం

రెండుసార్లు పరాజయాన్ని ఎదుర్కొన్న అదిల్షా మూడవసారి సిద్ది జోహార్ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుడికి అపారమయిన సైనిక , ఆయుధ బలగాలు అందించి కొల్హాపూర్ పంపించాడు. ఆ సమయంలో కొల్హాపూర్ దగ్గరలో ఉన్న పన్‌హాలా కోటలో శివాజీ కొన్ని వందలమంది అనుచరులతో ఉన్నాడు. సిద్ది జోహార్ విషయం తెలుసుకొన్న శివాజీ ఎలాగయినా పన్‌హాలా కోట నుండి తప్పించుకొని తన సైన్యం మొత్తం ఉన్న విశాల్‌ఘడ్ కోటకు చేరుకొంటే యుద్ధం చేయవచ్చు అనుకున్నాడు. కానీ అప్పటికే పన్‌హాలా కోట చుట్టూ శత్రుసైన్యం ఉండడంతో తాను యుద్ధానికి సిద్దంగా లేనని సిద్ది జోహార్‌కు వర్తమానం పంపాడు. అది తెలుసుకొన్ని సిద్ది జోహార్ సైనికులు నిఘా సరళం చేసి విశ్రాంతి తీసుకొంటుంటే , శివాజీ తన అనుచరులతో కోట నుండి తప్పించుకొని తన సైన్యం ఉన్న కోటవైపు పయనించసాగాడు. చివరిక్షణంలో ఇది తెలుసుకొన్న సిద్ది జోహార్ తన బలగాలతో శివాజీని వెంబడించసాగాడు.

కోటకు చేరుకొనేలోపు శత్రువులు తమను సమీపించగలరు అన్ని విషయం గ్రహించి బాజీ ప్రభు దేశ్‌పాండే అనే సర్దార్ 300 మంది అనుచరులతో కలసి తాము శత్రుసైన్యాన్ని ఎదుర్కొంటామని , శివాజీని తన అంగరక్షకులతో ఎలాగయినా కోట చేరుకోమని చెప్పి ఒప్పించాడు. శివాజీ కోట వైపు వెళ్ళిన వెంటనే బాజీ ప్రభు దేశ్‌పాండే రెండు చేతులా ఖడ్గాలు పట్టుకొని శత్రువులతో యుద్ధం చేశాడు.

300 మంది సైనికులు తమ ప్రాణాలకు తెగించి అతి బలమయిన శత్రువులతో పొరాడి నేలకొరిగారు. అప్పటికి శివాజీ తన కోట చేరుకున్నాడు. కోటలో తన అనుచరులతో చర్చించిన అనంతరం తాము సిద్ది జోహార్ సైన్యాన్ని ఎదుర్కొనలేమని గ్రహించిన శివాజీ సంధికి అంగీకరించాడు. సంధిలో భాగంగా శివాజీ సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు పొందింది. సిద్ది జోహార్ విజయానికి బహుమతిగా పన్‌హాలా కోట లభించింది. ఈ యుద్ధమే సుల్తానులతో శివాజీ చేసిన ఆఖరి యుద్ధం. ఆ తరువాతి కాలంలో మొఘల్ సైన్యంతో యుద్ధాలు చేయవలసి వచ్చింది.

మొఘలులతో యుద్ధాలు

(షైస్తా ఖాన్ తో యుద్ధం)

1660లో ఔరంగజేబు తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్‌కు లక్షకు పైగా సుశిక్షుతులయిన సైన్యాన్ని , ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని రమ్మని పంపించాడు. బలమయిన షాయిస్తా ఖాన్ సేన ముందు శివాజీ సేన తల వంచక తప్పలేదు. శివాజీ ఓటమి అంగీకరించి పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది. పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్‌లో షాయిస్తా ఖాన్ నివాసం ఏర్పరుచుకొన్నాడు.

ఎప్పటికయినా శివాజీ మెరుపుదాడి చేస్తాడని షాయిస్తా ఖాన్ పూణే నగరమంతా చాలా కట్టుదిట్టమయిన భద్రతను ఏర్పాటు చేసాడు. 1663 ఏప్రిల్ లో నగరంలో ఒక పెళ్ళి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలసి పెళ్ళికూతురు తరపున బంధువుల్లో కలసిపోయి లాల్ మహల్ చేరుకొన్నాడు. ఆ భవనం స్వయానా తన పర్యవేక్షణలో నిర్మించబడింది. కాబట్టి , సులువుగా లోపలికి చేరుకొని షాయిస్తా ఖాన్ గదిలోకి చేరుకొన్నాడు. శివాజీ కత్తివేటుకు షాయిస్తా ఖాన్ మూడువేళ్ళు తెగి కింద పడగా , షాయిస్తా ఖాన్ కిటికీలో నుండి దుమికి ప్రాణాలు రక్షించుకున్నాడు. అంతలో ఇది పసిగట్టిన షైస్తా ఖాన్ అంగరక్షకులు షాయిస్తా ఖాన్‌ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళారు. మొఘలులకు మచ్చ తెచ్చిన షాయిస్తా ఖాన్‌ను ఔరంగజేబు సుదూర బెంగాలీ ప్రాంతానికి పంపించివేసాడు.

సూరత్ యుద్ధం

1664 నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపారకేంద్రంగా ఉండేది. శివాజీ సూరత్ పైన దాడి చేసి ధనాన్ని , ఆయుధాలను దోచుకున్నాడు. అపారమయిన ఆ మొఘల్ సంపదతో కొన్ని వేలమందిని తన సైన్యంలో చేర్చుకొన్నాడు. కొద్దిరోజుల్లో మొఘలుల , బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు.

ఇది చూసిన ఔరంగజేబు ఆగ్రహోద్రుడై తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడయిన రాజా జై సింగ్‌ను శివాజీ పైకి పంపించాడు. రాజా జై సింగ్ గొప్ప రాజ నీతిజ్ఞుడు. రాజా జై సింగ్ అద్వర్యంలో మొఘల్ సేనలు మొదట పురంధర్ దుర్గాన్ని ఆక్రమించాయి. తర్వాత రాయఘర్ ఆక్రమనకై సేనలు ముందుకు సాగుతుండగా ఓటమి గ్రహించిన శివాజీ రాజ జై సింగ్ తో సంధికి దిగాడు. 1665 లో శివాజి రాజా జై సింగ్ తో పురంధర్ వద్ద సంధి చేసుకున్నాడు..

ఆగ్రా కుట్ర

1666లో ఔరంగజేబు తన యాభయ్యవ పుట్టినరోజు సందర్భంగా శివాజీని , అతని ఆరేళ్ళ కొడుకు శంభాజీని ఆగ్రాకు అహ్వానించాడు. సభలో శివాజీని సైనికాధికారుల వెనుక నిలబెట్టి అవమానపరిచాడు. ఇది సహించలేని శివాజీ బయట వెళ్తుండగా భటులు చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిథి గృహానికి తీసుకెళ్ళి అక్కడే బందీ చేశారు.

ఔరంగజేబు మొదట శివాజీని చంపాలనుకున్నా , దానివల్ల మరాఠాలు ఒక్కసారిగా చెలరేగుతారని తెలుసుకొని శివాజీని బందీగా ఉంచాలని నిశ్చయించాడు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగయినా తప్పించుకోవాలని ప్రయత్నించసాగాడు. ప్రతిరోజు తాను ఏరికోరి సమకూర్చిన పళ్ళను ఆగ్రాలోని సాధువులకు , గుడులకు , ఫకీర్లకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలలపాటు పళ్ళ బుట్టలు పంపించిన తర్వాత తాను పనిమనిషిగా మారువేషం వేసుకొని కొడుకును బుట్టలో పెట్టుకొని తప్పించుకున్నాడు. శివాజీ , శంభాజీ ఇద్దరూ పళ్ళబుట్టల్లో దాక్కుని తప్పించుకొన్నారని ఒక వాదన.

తప్పించుకున్న తర్వాత శివాజీ రాయఘర్ చేరుకున్నాడు. ఆ తర్వాత రెండు సంవత్సరముల వరకు శివాజీ మోఘలులపై ఎటువంటి సైనిక చర్యకు దిగకుండా పురంధర్ సంధికి కట్టుబడి ఉన్నాడు. మువ్వాజం అనే దక్కన్ రాష్ట్ర పాలకుడి సలహా మేరకు ఔరంగజేబు శివాజీ ని రాజుగా గుర్తించాడు. కొన్ని రోజులకు ఈ శాంతి ఒప్పందం పటాపంచాలైనది. మొఘలు సైన్యాధిపతులు మహాబత్ ఖాన్ , బహుదూర్ ఖాన్ , దిలేవార్ ఖాన్ లు మూకుమ్మడిగా శివాజీ పై దాడి చేశారు కానీ వారి ఎత్తులు పారలేదు. శివాజీతో యుద్ధంలో వారు ఘోర పరాజయం పొందారు. శివాజీ జీవిత చరిత్రలో ముఖ్యమైన విజయంగా దీన్ని పేర్కొనవచ్చు.

అప్పటికే శివాజీ ఎక్కువ ప్రాచుర్యంపోందేలా కాకుండా రహస్యంగా తన కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. 1674 నాటికి లక్ష మంది సుశిక్షితులయిన సైన్యాన్ని , ఆయుధాలు , అశ్వాలు , నౌకా వ్యవస్థను సమకూర్చుకున్నాడు. 1670 జనవరి నుండి మొఘల్ కోటల పైన దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు. మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కొనలేకపోయింది.

సింహగఢ్ యుద్ధం

శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్నా , పూణే దగ్గర ఉన్న కొండన కోట స్వాధీనం కాలేదు. ఆకోటను ఉదయ్‌భాన్ రాథోడ్ అనే రాజపుత్రుడు పరిరక్షిస్తుండడమే కారణం. దుర్భేధ్యమయిన ఆ కోట చుట్టూ ఎప్పుడూ సైనికులు పహారా కాస్తుండడంతో శివాజీ తనదగ్గర అత్యంత గొప్ప సైనికాధికారిగా పేరు తెచ్చుకొన్ని తానాజీ మలుసారేకి ఆ కోట స్వాధీనం చెసుకొని బాధ్యత అప్పగించాడు.

తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్దిరోజులపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు. అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమయిన సైన్యం ఉంది. చివరగా కోటకు ఒకవైపు ఉన్న ఒక కొండ తానాజీని ఆకర్షించింది. ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం. అప్పుడు తానాజీ 'యశ్వంతి' అనే పేరుకల ఉడుముకు తాడు కట్టి కొండ పైకి విసిరాడు. తాడు సహాయంతో పైకి వెళ్ళినవారు అందించిన తాళ్ళను పట్టుకొని సైన్యం కోటలోకి చేరుకొంది. చరిత్రలో యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే ప్రథమం అనుకోవచ్చు.

అంతలో తానాజీ సోదరుడు సూర్యాజీ కోట ముఖద్వారంపైన దాడి చేసాడు. మారాఠాలకు రాజపుత్రులకు జరిగిన భీకరపోరులో మరాఠాలు గెలిచినా తానాజీ మరణించాడు. ఈ వార్త విన్న శివాజీ 'కోటను గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకొన్నాము' అన్నాడు. సింహంవలె పోరాడిన తానాజీ గౌరవార్థం కొండన కోట పేరును సింహఘడ్‌గా మార్చాడు.

చివరిదశ

శివాజీ పట్టాభిషేకము జూన్ 6, 1674న రాయఘడ్ కోటలో వేద మంత్రాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి' అని బిరుదును ప్రదానం చేసారు. కొన్నాళ్ళకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్రచేసి వెల్లూరు , గింగీలను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ళపాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 న మధ్యాహ్నం 12 గడియలకు రాయఘడ్ కోటలో మరణించాడు.

శివాజీ పెద్దకొడుకయిన శంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు.

పరిపాలనా విధానం

యుద్ధతంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి , విదేశాంగ విధానం , పటిష్ఠమయిన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేసాడు. ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి , వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటు పడ్డాడు.

వ్యక్తిత్వం

సుదీర్ఘ యుద్ధ కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్రస్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేనివారికి , స్త్రీలకు , పసివారికి సహాయం చేసాడు.

ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమయిన కోడలును తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. శివాజీ ఆమెతో "నా తల్లి కూడా మీ అంత అందమయినది అయిఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని" అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు. శివాజీ లౌకిక పాలకుడు. శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండి , అన్ని మతాల ప్రజలను బాగా చూసుకునేవాడు..

నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం , తాను చేస్తున్న పనిపట్ల అంకితభావం , మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు , ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులు ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్పరాజుగా చేసాయి.

సైన్యం

మరాఠా సామ్రాజ్యం ముగిసేవరకు శివాజీ ఏర్పాటు చేసిన సైనిక వ్యవస్థ నిలిచి ఉండేది. పటిష్ఠమయిన నౌకా దళాన్ని , ఆశ్వికదళాన్ని ఏర్పాటు చేసాడు. ఎనిమిది నెలలు పంటలు పండించే రైతులు కూడా నాలుగు నెలలు యుద్ధ నైపుణ్యాలను నేర్చుకోవడం శివాజీ విధానాలను అద్దం పడుతుంది. కేవలం సైనికులే కాక సంఘంలోని అన్ని వర్గాలవారు కోటను పరిరక్షించేవారు. మరణించే నాటికి శత్రువులందరూ వెనుకాడే విధంగా లక్ష సైన్యాన్ని తయారు చేసిన సమర్థుడు శివాజీ.

కోటలు

మరణించేనాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేధ్యమయిన కోటలను నిర్మింపచేయడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడు. నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగీ వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించబడ్డాయి.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Source - Whatsapp Message

భగవానుడు పంపిన మెయిల్

🕉️“భగవానుడు పంపిన మెయిల్”🕉️
.
✍️ మురళీ మోహన్
.
.👉నువ్వు ఏదో ఒక రోజు ఈ మెయిల్ చూస్తావని నీకు ఈ మెయిల్ పంపుతున్నాను .
.

.
నువ్వు రోజూ నిద్ర లేచాక నా వేపు చూస్తావనీ , నన్ను పలకరించి రెండు మాటలు మాట్లడతావనీ ఎదురు చూస్తుంటాను .
.
కానీ
.
నువ్వు లేచీ లేవగానే నీ సెల్ ఫోన్ తీస్తావు . అందులో నీకు వచ్చిన మెస్సేజెస్ చూస్తావు .
.
అది అయ్యాక నా వేపు చూస్తావేమో అనుకుంటాను . అపుడు నీకు టైం కనిపిస్తుంది . అప్పుడే టైం అయిపోయిందా అనుకుంటూ గబగబా పక్క దిగి బాత్ రూం లోకి వెళ్లి పోతావు .
.

అక్కడనుండి వచ్చాక నేను ఉన్న చోటికి వచ్చి ఒక సారి నా వేపు చూసి పలకరిస్తావు అని చూస్తుంటాను
.
కానీ
.
. డైనింగ్ టేబుల్ దగ్గరకి వెళ్లి టిఫెన్ తింటూ పేపర్ చూస్తూ టి వి ఆన్ చేసి వార్తలు చూస్తుంటావు .
.
టిఫిన్ అయ్యాక గబగబా డ్రెస్ చేసుకుని ,జుట్టును తీరిగ్గా దువ్వుకుని , సెంటు రాసుకుని , ముఖానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని , షూ వేసుకుని బయటకు వెడుతూ నా కేసి చూస్తావేమో అనుకుంటాను .
.
కానీ
.

.
బయటకు ఆదరా బాదరా వెళ్లి పోతావు .
.
అయ్యో నీకు పాపం తీరిక లేదే అని బాధ పడడం తప్ప ఏమి చెయ్యను ?
.

.
పోన్లే !
.

మధ్యాహ్నం లంచ్ టైం లో భోజనం కారియర్ విప్పుతూ కాంటీన్ లో నాలుగు టేబుళ్ళ వెనకాల ఒకాయన కళ్ళు మూసుకుని నన్ను తలచుకుంటుంటే నువ్వు కూడా నన్ను తలచుకుంటావు అని ఎదురు చూస్తున్నాను
.
కానీ
.
నువ్వు నవ్వుకుని నీ స్నేహితుడితో సినిమా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసేసావు .
.

.
సాయంత్రం ఇంటికి వచ్చాక తీరు బడిగా నాతో మాట్లాదతావేమో అని అనుకున్నాను .
.
కానీ
.

సాయంత్రం ఇంటికి వస్తూ దారిలో రెండు మూరల మల్లె పూలు కొన్నావు . నా కోసం కూడా పూలు కొంటున్నావు అనుకున్నాను .
.
కానీ
.
నీకు అవి కనిపించ లేదనుకుంటాను .
.
పోన్లే !
పూలెందుకు ? నువ్వు నాతో మాట్లాడితే చాలు . నా కేసి చూస్తే చాలు .
.

.
ఇంటికి వచ్చావు .
.

సోఫాలో కూల బడి టి వి చానల్ మార్చి మార్చి చూస్తూ కాఫీ తాగావు . బాత్ రూం కి వెళ్లి స్నానం చెసి వచ్చి తెల్లటి బట్టలు కట్టుకున్నావు . అప్పుడు కూడా నా కేసి వస్తావనీ , నాతో మాట్లాదతావనీ ఎదురు చూశాను .
.
కానీ
.

.
నీ లాప్ టాప్ ముందుకు వెళ్లావు . అందులో నీకు ఇష్టమైన వన్నీ చూస్తూ రాత్రి 11 గంటల వరకూ గడిపావు . ఇక నీకు నిద్ర వస్తోంది . అపుడు నా దగ్గరకు వస్తావు అని అనుకున్నాను . నీ ఎదురుగా నే ఉన్నాను .
.
కానీ
.
నువ్వు నన్ను చూడలేదు .
.

.
ఇంకో అరగంట తర్వాత నా కేసి చూస్తావు అనుకున్నాను . నువ్వు అలిసిపోయావు . నీ భార్య తో గుడ్ నైట్ చెప్పి పడుకుండి పోయావు . నాకూ చెబుతావు అనుకున్నాను . చెప్పలేదు
.
పోన్లే !
.
నాకు ఓపిక ఉంది . నేను ఎదురు చూస్తుంటాను . నీకు కూడా ఇతరులతో ఎలా ఉండాలో నేర్పాలన్నదే నా తపన .
.

.
నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను . . కానీ ... కానీ ... నాకు కూడా నీవు నా వేపు చూడాలనీ , ఒక్క సారి నా ముందు తల వంచి నన్ను పలకరించాలనీ ఉంటుంది .
.
నీ గుండెలో ఉన్న నన్ను నువ్వు చూడడానికి నీ ప్రయత్నం ఏమీ చెయ్యక పోతే ఎలా ?
.
ఒకవైపు నుండే సంభాషణ ఎలా ?
.
.
ఇదిగో ఈ మెయిల్ చూశాక అయినా నీవు నా వేపు చూస్తావనీ , నాతో రోజులో కొన్ని సెకనులు అయినా గడుపుతావనీ ఎదురుచూస్తుంటా !
నీ లోనే నీతోనే ఉన్న " నేను🤘

::::::::::::::::::::::::::::::::::::::::::::::

Source - Whatsapp Message