Wednesday, February 17, 2021

దాంపత్యమనేది పరమప్రేమాత్మకం ఇదే భారతీయుల గృహస్థాశ్రమధర్మానికి మూల కందం ...

సృష్టి ద్వంద్వాత్మకం,
అందులో స్త్రీపురుష ద్వంద్వం,
సృష్టికి మూలం ! స్త్రీ పురుషులు,
వివాహానికి ముందు బ్రహ్మచారులుగా ఉండేంతవరకే వాళ్ళది వ్యష్టి జీవితం,
పిదప వివాహంతో ఆ ఇద్దరూ ఒకటౌతారు !
అపుడే వాళ్ళకు మనసా వాచసా కర్మణా ~
అనే మూడు ముళ్ళు పడతాయి,
ఇక విడి పోయే ప్రసక్తి ఉండదు
వాళ్ళిద్దరూ ఒకరిలో ఒకరు సగమై
ఇద్దరూ కలిసి ఒకటౌ తారు
అదే " దంపతి " ఆనే శబ్దరూపం
అమరం " దంపతీ జంపతీ జాయాపతీ
భార్యాపతీ చతౌ " అనింది .....
జాయా చ పతి శ్చ దంపతీ జంపతీ
జాయాపతీ చ భార్యాచపతి శ్చ భార్యాపతి
-- ఆలుమగలు దంపతులు జంపతులు
జాయా పతులు భార్యాపతులు --
అవుతారని వివరించింది ..............
దంపతులనేది నిత్యబహువచనం,
దీనికి దంపతుడు దంపతి అని కానీ
ఏకవచరూపం లేదు ................

ఇల్లాలు ఉండేది ఇల్లు,
దంపతుల్లోని ఇద్దర్నీ ఒకటిగా
బంధించేది దివ్యమైన నిర్మలమైన ప్రేమ,
ప్రేమ అనేది రెండక్షరాలే అయినా ...
దానితత్వంమాత్రం ద్వంద్వాతీతం,

దాంపత్యం అద్వైతం సుఖదుఃఖయోః అని
భవభూతి చెప్పిన అనుభూతి, దంపతుల
అద్యయభావాన్నే వ్యక్తం చేస్తుంది !
అనుభూతి లేనిదాంపత్యం వృథా,
ఆ అనుభూతి రెండుహృదయాల,
రెండుమనస్సులకి, రెండు జీవితాల,
రెండు తత్త్వాల, ఏకత్వంతో సుస్థిరంగా
ఉన్నప్పుడే దాంపత్యం ఆదర్శవంతంగా
ఆనందమయంగా
ధర్మకారగయాచరణశిఉలంగా
అనపాయతతో ప్రకాశిస్తుంది ........!

దేవతల్లో త్రిమూర్తులు దాంపత్యాలు
అనపాయినీత్వంతోనే ఆదర్శంగా నిల్చాయి,
విష్ణువు లక్ష్మిని హృదయంపై నిల్పుకున్నాడు,
బ్రహ్మ ముఖంలో నిల్పుకున్నాడు,
శివుడు అర్థశరీరమే ఇచ్చాడు ........🙏
ఇలా వాక్కు అర్థాల్లాగా దంపతులు
పరస్పరం ప్రేమ అనే
అంత స్సూత్రంతో ఏకంగానే ఉంటారు,
భౌతికంగా వేర్వేరుగా కన్పిస్తున్నా
అంతరంలో దాంపత్యమనేది పరమప్రేమాత్మకం ఇదే భారతీయుల గృహస్థాశ్రమధర్మానికి మూల కందం ...

Source - Whatsapp Message

No comments:

Post a Comment