Saturday, February 13, 2021

మంచి మాట...లు

ఆత్మీయ బంధు మిత్రులకు గురువారపు శుభోదయం శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబ సభ్యులకు పూజ్య గురువులు ఆది శంకరాచార్యులవారు గురు దత్తాత్రేయ స్వామి వారు గురు రాఘవేంద్ర స్వామి వారు గురు సాయి బాబా వార్లఅనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.... ఏది ఊరకనే రాదు తప్పు చేస్తే పాపం ఒప్పు చేస్తే పుణ్యం ఏది కావాలో నీ ఇష్టం... మీ AVB సుబ్బారావు 💐
గురువారం --: 11-02-2021 :-- ఈరోజు AVB మంచి మాట...లు


మనిషికి మరణం విచిత్రమైనది ఇంటి నిండ ఆస్తులున్న కోటేశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఎడుస్తున్నాడు , అదే ఇంటి నిండ కష్టాలు ఉన్న పేదోడు చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తున్నాడు ,మనిషి ఎక్కడ గెలిచిపోతాడో ఎక్కడ అలిసిపోతాడో ఎవరికి తెలియదు మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండా వెలుతున్నాడు .

మనం ఎదుటి వారి నుండి ఏమైన ఆశించటం ఆపితే ఆనందం మొదలవుతుంది , అదే వారిమీద అధికారం ఆపితే మనకు సంతోషం మొదలవుతుంది .

ఎదుటి వారిని క‌లుపుకుపోయే మనస్తత్వం మనలో ఉంటే అందరూ మనతోనే ఉంటారు . అంతా నాకే తెలుసు నాకెవరి అవసరం లేదనే అహం మనకుంటే . సమాజమే మనని దూరం పెడుతుంది . మనకు ఎంత ఆస్తి ఉందనేది కాదు మనము ఎంత మంది మనసుల్లో ఉన్నాము అనేదే ముఖ్యం ! వారి మంచి మనస్సులో మనకు మంచిగా స్థానం ఉండాలనదే ముఖ్యం .

నిజం ఉన్నతమైనది , కానీ !
నిజాయితీతో జీవించడం అన్నది అంతకంటే ఉత్తమమైనది . మనం కంటితో చూడనివి చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు . ఎందుకంటే కొంతమంది చెప్పే మాటలవల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి , కుటుంబ బంధాలు తెగిపోతాయి .

సేకరణ ✒️మీ ... AVB సుబ్బారావు 🤝🕉️🌷💐🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment