Wednesday, March 31, 2021

కథామృతం బంగారం

📚 కథామృతం

బంగారం

- సి.ఎన్‌.చంద్రశేఖర్‌

‘‘నువ్వు మావాడితో ఓసారి మాట్లాడాలి’’ రాజారావు కృష్ణమూర్తితో అన్నాడు.

‘‘ఏం, మీవాడేమన్నా ప్రేమలోపడ్డాడా?’’ నవ్వుతూ అడిగాడు కృష్ణమూర్తి.

‘‘వాడి మొహానికి అదొక్కటే తక్కువ’’.

‘‘ఎందుకురా వాణ్ణి అలా తక్కువచేసి మాట్లాడతావు. వాడికేం తక్కువైందని? అందగాడు, ఆజానుబాహుడు, తెలివితేటలున్నవాడు. అన్నిటినీమించి మంచి మనసున్నవాడు’’.

‘‘నువ్వన్నవన్నీ నిజమే, ఒక్క తెలివితేటల విషయం తప్ప’’.

‘‘ఇంటర్‌లో తొంభై అయిదు శాతం మార్కులతో పాసయ్యాడంటే వాడు తెలివైనవాడికిందే లెక్క. ఇక ఎంసెట్‌ అంటావా, ఎంత కష్టపడి చదివినా రెండు మూడు గంటల్లో వారి అదృష్టాన్ని తేల్చే పరీక్ష అది. కాస్త మనోధైర్యం కోల్పోయినా, కన్ఫ్యూజ్‌ అయినా ఫలితాలు తారుమారవుతాయి. మీవాడి విషయంలో అదే జరిగి ఉంటుందని నా అభిప్రాయం’’.

‘‘కారణాలు ఏవైనా వాడికి ర్యాంకు పదివేలు దాటిందన్నమాట నిజం. మా ఆఫీసులో మా కొలీగ్‌ కొడుకు ఐఐటీలో సీటు సాధించాడు. ప్యూను కొడుకు బిట్స్‌ పిలానీలో సీటు తెచ్చుకున్నాడు. మా మేనేజరు కూతురికి మెడిసిన్‌లో స్టేట్‌లో నాలుగోర్యాంకు వచ్చింది. వాళ్ళందరూ వాళ్ళ పిల్లల విజయాల గురించి చెబుతూంటే నా కొడుకు గురించి ఏమీ చెప్పలేకపోతున్నందుకు నాకెంత బాధగా ఉంటుందో చెప్పు’’.

‘‘మానవుడి అశాంతికి కారణం కోరికలే- అని బుద్ధభగవానుడు చెప్పారు. ‘మధ్యతరగతి మానవుడి జీవితంలో అశాంతికి కారణం అతను ఎప్పుడూ తనని పక్కవాళ్ళతో పోల్చుకుంటూ ఉండటమే’ అంటాను నేను. నీ అశాంతికి కూడా కారణం అదే. భరత్‌కు తన బాధ్యతలు తెలుసు. అందుకే హాస్టల్లో ఉండి చదవడం ఇష్టంలేకపోయినా నీకోసం విజయవాడ వెళ్ళాడు. ఎంతో కష్టపడి చదివాడు. కానీ అదృష్టం వరించలేదు. అయితే, పిల్లల కృషిలో లోటులేనంతవరకూ మనం ఫలితం గురించి బాధపడనక్కరలేదు. ఈసారి కాకుంటే మరోసారి రాణిస్తారు. ఏది జరిగినా అది మన మంచికే జరిగిందనీ భగవంతుడు ఇంకేదో మంచిని మనకోసం సిద్ధంచేసి ఉంటాడనీ అనుకుంటే ఏ బాధా ఉండదు’’.

‘‘నువ్వన్నది నిజమే. కానీ మనసు రాజీపడటంలేదు’’.

‘‘నీ సహోద్యోగుల పిల్లలు సాధించిన విజయాలకు మనస్ఫూర్తిగా నీ అభినందనలు తెలియజేయి. ఆ విధంగా నీ మనసును సిద్ధంచెయ్యి. అప్పుడు నీ మనసులో ఏ బాధా ఉండదు. ఇంతకూ భరత్‌తో నేను మాట్లాడాలన్నావు. ఏ విషయం గురించి?’’

‘‘వాడు లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకుని మరోసారి ఎంసెట్‌ ఎంట్రన్స్‌ రాస్తే మంచిదని నా అభిప్రాయం. అలాగే ఐఐటి, బిట్స్‌, ఎన్‌ఐటీ లాంటి పెద్దపెద్ద కాలేజీల్లో సీటుకోసం ఎంట్రన్స్‌ రాయొచ్చు. వాటిల్లో సీటు వస్తే వాడి భవిష్యత్తు బాగుంటుంది. కానీ వాడు అందుకు సుముఖంగా లేడు. మన వూళ్ళొని ఇంజినీరింగ్‌ కాలేజీలో చేరతానంటున్నాడు. వాడికి నువ్వంటే మంచి గౌరవం. నువ్వు వాడికి నచ్చజెప్పి లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌లో చేరేలా చూడు’’.

‘‘తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను’’.

మరుసటిరోజు భరత్‌తో మాట్లాడాడు కృష్ణమూర్తి. రాజారావు కోరిక గురించి చెప్పాడు.

‘‘సారీ అంకుల్‌. రెండేళ్ళు అమ్మానాన్నలకు దూరంగా గడిపాను. గాలీ వెలుతురూ లేని గదుల్లో క్లాసులు, కంపుకొట్టే టాయిలెట్లు, రుచీ శుచీ లేని వంటకాలు... ఇవన్నీ నాన్నగారి కోసం భరించాను. చదువుతప్ప మరో లోకం లేకుండా గడిపాను. ఇక నావల్ల కాదు. మన వూళ్ళొ మంచి కాలేజీలు ఉన్నాయి. నాలుగేళ్ళు ఇంటిపట్టునే ఉండి హాయిగా చదువుకుంటాను. పైగా ఐఐటీ, ఎన్‌ఐటీ లాంటి పెద్ద కాలేజీల విషయం వదిలేస్తే మిగిలిన ఏ కాలేజీలో చదివినా ఒకటే అని నా అభిప్రాయం. ఎటూ ఉద్యోగాలు బాగానే దొరుకుతున్నాయి’’.

‘‘కానీ మీ నాన్న ఆశలూ ఆశయాలూ కూడా నువ్వు అర్థంచేసుకోవాలి భరత్‌’’.

‘‘ఆయన ఆశల్ని అర్థంచేసుకున్నాను అంకుల్‌. కానీ అంతకంటే ఎక్కువగా నా బాధ్యతల్ని అర్థంచేసుకున్నాను. నాన్నకు ఆఫీసులో టెన్షన్స్‌ ఎక్కువవుతున్నాయి. ఉదయం పదిగంటలకు ఆఫీసుకు వెళ్తే రాత్రి ఎనిమిదికిగానీ ఇంటికి రాలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితిలో నేను వూళ్ళొ ఉంటే కనీసం ఇంటిపనులైనా పంచుకోవచ్చు. అమ్మ ఆరోగ్యం కూడా ఈమధ్య కాస్త దెబ్బతింది. అమ్మను డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళడం, మందులు తెచ్చివ్వడం లాంటి పనులన్నీ నేను చేయవచ్చు. నేను వూళ్ళొ ఉంటే అమ్మకూ ధైర్యంగా ఉంటుంది’’.

‘‘కానీ నువ్వు ఈ పనులన్నీ చేయడంకంటే మంచి కాలేజీలో సీటు తెచ్చుకుంటేనే వాళ్ళకు ఎక్కువ ఆనందం కలుగుతుంది’’.

‘‘ఒకవేళ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకుని మళ్ళీ పరీక్ష రాసినా అప్పుడూ ఇదే పరిస్థితి ఎదురైతే ఏం చేయాలి? పైగా ఒక సంవత్సరం వ్యర్థమైందన్న విషయం నాపై మరింత ఒత్తిడిని పెంచుతుంది. మీ సలహాను కాదంటున్నందుకు ఏమనుకోకండి. దయచేసి మీరిద్దరూ నన్ను అర్థంచేసుకోండి’’.

భరత్‌ తనతో చెప్పింది రాజారావుతో చెప్పి, ‘‘వాడు చెప్పిన ప్రతి కారణం సరైనదేనని నాకనిపించింది. తల్లిదండ్రులకు సంపాదించి ఇచ్చే కొడుకులు చాలామంది ఉంటారు. కానీ తల్లిదండ్రుల కోసం తపించే కొడుకులు చాలా తక్కువమంది ఉంటారు. నువ్వు చాలా అదృష్టవంతుడివి రాజా’’ అన్నాడు కృష్ణమూర్తి.

స్నేహితుడి మాటలు రాజారావు మనసును కుదుటపరచలేకపోయాయి.

‘‘మనం పిల్లలకు మంచిదారి చూపాలనుకుంటాం. వద్దు, నేను ముళ్ళదారిలోనే నడుస్తానంటే మనం ఏం చేయగలం? అనుభవించనీ తెలుస్తుంది’’.

‘‘అలా అశుభంగా మాట్లాడకు. వాడికి అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. ఆశీర్వదిద్దాం’’.



నాలుగురోజుల తర్వాత ఎదురింట్లో ఉంటున్న సీతారామయ్య కొడుకుతోపాటు రాజారావు ఇంటికివచ్చి తన కొడుక్కి ఐఐటీ కాన్పూర్‌లో సీటు వచ్చిందనీ తామిద్దరూ కాన్పూరు వెళుతున్నామనీ తన భార్య ఇంట్లో ఒంటరిగా ఉంటుంది కాబట్టి భరత్‌ను రాత్రిపూట వాళ్ళింట్లో పడుకోమనీ కోరాడు.

భరత్‌ అందుకు ఎంతో సంతోషంగా ఒప్పుకున్నాడు.

బంగారం

‘‘మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అంకుల్‌. అమ్మను నేను చూసుకుంటాను’’ అని సీతారామయ్యతో చెప్పి, ‘‘ఆల్‌ ద బెస్ట్‌ వినోద్‌’’ అంటూ అతని కొడుక్కి చేయి అందించాడు.

కొడుకు ముఖంలో ఎటువంటి అసూయగానీ నిరుత్సాహంగానీ కనిపించకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు రాజారావు. ‘వాడి తండ్రిగా తనే వాళ్ళముందు ఎంతో ఇన్ఫీరియర్‌గా ఫీలవుతున్నాడు. మరి వీడిలో ఆ బాధే కనిపించదే’ అనుకున్నాడు.

వాళ్ళు వెళ్ళిపోయాక లలిత హాల్లోకి వచ్చి ‘‘మీకు టిఫిన్‌ తీసుకురానా?’’ అని అడిగింది రాజారావును.

‘‘వద్దు, కడుపు నిండిపోయింది’’ అన్నాడు రాజారావు విసుగ్గా.

అప్పుడే అక్కడికి వచ్చిన భరత్‌ దెబ్బతిన్నట్టు చూశాడు తండ్రివైపు. తర్వాత మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు.

ఆ క్షణంలో ఎందుకో కొడుకుపై విపరీతమైన జాలి కలిగింది రాజారావుకు.



‘‘నువ్వు మావాడితో ఓసారి మాట్లాడాలి’’ నాలుగేళ్ళ తరవాత రాజారావు కృష్ణమూర్తితో అన్నాడు.

‘‘ఏం, నువ్వు గేట్‌ ఎంట్రన్స్‌గానీ జిఆర్‌ఈ గానీ రాసి పైచదువులు చదవమంటే, వాడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరతానని అంటున్నాడా?’’ అన్నాడు కృష్ణమూర్తి నవ్వుతూ.

‘‘కాదు. నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరమంటే వాడు తను చదివిన కాలేజీలో లెక్చరర్‌గా చేరతానంటున్నాడు. నువ్వు వాడికి కాస్త నచ్చజెప్పు’’.

రాజారావు చెప్పింది విని ఆశ్చర్యపోయాడు కృష్ణమూర్తి.

‘సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం దొరికితే తమ జీవితాశయం నెరవేరినట్లు ఫీలవుతుంటారు చాలామంది కుర్రాళ్ళు. ఆ కంపెనీలు ఇచ్చే జీతాలు అలాంటివి. మరి భరత్‌ అటువంటి ఉద్యోగం వద్దనుకుని ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌ పోస్ట్‌ కోరుకోవడం ఏమిటి? ఒకవేళ తను ఇంటర్వ్యూల్లో నెగ్గలేనని భయపడుతున్నాడా?’ అనుకున్నాడు.

తన అనుమానం భరత్‌తో చెప్పి ‘‘నీకు ఇంగ్లిషులో మంచి వొకాబులరీ ఉంది. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కోరుకునే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, చురుకుదనం నీలో ఉన్నాయి. నీకు తప్పకుండా మంచి ఉద్యోగం దొరుకుతుంది’’ అన్నాడు కృష్ణమూర్తి.

‘‘నాకు అటువంటి ఉద్యోగాలపట్ల ఆసక్తిలేదు అంకుల్‌. పొద్దున్నుంచీ రాత్రివరకూ గానుగెద్దులా పనిచెయ్యాలి. లీవులు కావలసినప్పుడు దొరకవు. జాబ్‌ సెక్యూరిటీ ఉండదు. చెవికో సెల్‌ఫోనూ చేతికో లాప్‌టాప్‌ ఇచ్చేస్తారు. ఇక మనకు ప్రైవసీ అంటూ ఉండదు. వాళ్ళు రమ్మన్నప్పుడల్లా వెళ్ళాలి, చెయ్యమన్న పనల్లా చేయాలి’’.

‘‘డబ్బు సంపాదించాలంటే కష్టపడక తప్పదు’’.

‘‘జీవితంలో డబ్బు అవసరమేకానీ డబ్బే జీవితం కాకూడదు అంకుల్‌. జీవితంలో మనకు ఆనందాన్నిచ్చేవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ చూడకుండా, అనుభవించకుండా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చూసుకుంటూ జీవితాన్ని గడపడం నాకిష్టం ఉండదు. పైగా సిటీల్లో పాతికవేలు సంపాదించడం, మన వూళ్ళొ పదిహేనువేలు సంపాదించడం ఒకటే నా దృష్టిలో’’.

‘‘నీ జీతం పాతికవేల దగ్గర ఆగిపోదుగా భరత్‌. ఇంకా ఎంతో పెరుగుతుంది. ఆ స్థాయిలో జీతం ఇక్కడ పెరగదు. నువ్వు మన వూరిలో ఇంజినీరింగ్‌ చదువుతానని చెప్పిన కారణాలు నాకు నచ్చి, నిన్ను ఆరోజు సమర్థించాను. కానీ ఈరోజు మాత్రం నువ్వు చేస్తున్నది తప్పని నాకనిపిస్తుంది. మంచి భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నావనిపిస్తుంది. మనిషికి జీవితంలో ఎదగాలనే ఆశా తపనా ఉండాలి భరత్‌. అవి లేకపోతే మనిషిలో పురోగతి ఉండదు’’.

‘‘నాకూ ఎదగాలని ఉంది అంకుల్‌. నాకూ ఎన్నో ఆశలున్నాయి. ఈ నాలుగేళ్ళూ కీబోర్డు నేర్చుకున్నాను. అందులో మరింత కృషిచేసి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాను. నేను అనుకున్నది సాధించిన రోజు మీరు నా నిర్ణయాన్ని సమర్థిస్తారు’’.

‘‘నువ్వు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకుంటూ కూడా వాటిని కంటిన్యూ చేయవచ్చు. పైగా సిటీల్లో వాటిని నేర్చుకోవడానికీ నేర్చుకున్నవి ప్రదర్శించడానికీ అవకాశాలు ఎక్కువ’’.

‘‘అటువంటి ఉద్యోగాల్లో ఖాళీ సమయం ఎక్కడుంటుంది అంకుల్‌?’’

భరత్‌ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు కృష్ణమూర్తి. భరత్‌ తన నిర్ణయం మార్చుకోడని అర్థమైంది అతనికి. చివరి ప్రయత్నంగా ‘‘కనీసం మీ నాన్న సంతోషం కోసమైనా ఆయన చెప్పినట్లు విను భరత్‌’’ అన్నాడు.

‘‘పక్కవాళ్ళ పిల్లలతో నన్ను పోల్చుకోకపోతే ఆయన సంతోషంగానే ఉంటారు. ఆయన్ను సంతోషంగా ఉంచాలనే నా ప్రయత్నం కూడా. సీతారామయ్య అంకుల్‌ని చూస్తున్నారుగా. కొడుకు ఎక్కడో దూరంగా ఉన్నాడు. ఆయన అస్తమా పేషెంట్‌. కరివేపాకు దగ్గర్నుంచీ కరెంటుబిల్లు దాకా అన్నీ ఆయనే చూసుకోవాలి. ఓ అర్ధరాత్రి ఆయనకు బ్రీతింగ్‌ ప్రాబ్లం ఎక్కువైతే నేను వెళ్ళి డాక్టరును పిలుచుకుని వచ్చాను. అటువంటి ఇబ్బంది అమ్మకుగానీ నాన్నకుగానీ వస్తే ఎవరు చూసుకుంటారు చెప్పండి? అందుకే నేను వారిని విడిచి వెళ్ళదలచుకోలేదు’’.

‘‘నీ ఇష్టం’’ అన్నాడు కృష్ణమూర్తి నిరుత్సాహంగా.



అతి తక్కువ కాలంలో మంచి లెక్చరర్‌గా విద్యార్థుల అభిమానాన్ని సంపాదించాడు భరత్‌. తన తోటి లెక్చరర్‌ వనిత అందం, మంచితనం, సంస్కారం అతనికి నచ్చి ఆమెను పెళ్ళిచేసుకోవాలని అనుకున్నాడు. అతని ప్రపోజల్‌కు వనిత అంగీకరించింది. వారి పెళ్ళికి ఇరువైపు పెద్దలనుంచి ఎటువంటి వ్యతిరేకతా రాలేదు.

వనిత వచ్చాక లలితకు ఇంటిపని బాగా తగ్గింది. కాలేజీకి వెళ్ళేలోపు వనిత చాలా పనులు అందుకుంటుంది. ఎన్ని పనులున్నా చిరునవ్వుతో కనిపించడం, అత్తామామల్ని గౌరవించడం, ఇంటికి వచ్చిన అతిథులతో ఆప్యాయంగా మాట్లాడటంవల్ల బంధుమిత్రులందరికీ ఇష్టమైన వ్యక్తి అయింది. సాయంత్రాలు నలుగురూ కలిసి గుళ్ళకూ సినిమాలకూ ఫంక్షన్‌లకూ వెళ్ళివస్తున్నందువల్ల జీవితం హాయిగా సాగుతున్నట్టు అనిపించసాగింది రాజారావుకు. భరత్‌ ఓ సెకండ్‌హ్యాండ్‌ మారుతీ కారు కొన్నాడు. నలుగురూ కలిసి వెళ్ళడానికి ఇబ్బందిలేకుండా పోయింది.

సంవత్సరం తర్వాత రాజారావు రిటైరయ్యాడు. మరో సంవత్సరం తర్వాత మనవడితో ఆడుకోసాగారు రాజారావు దంపతులు. వాళ్ళకు కాలం గడిచేదే తెలిసేదికాదు. అనతికాలంలోనే వూళ్ళొ ఉన్న బంధువులకూ స్నేహితులకూ భరత్‌, వనిత చాలా దగ్గరయ్యారు. వారి మంచితనం, సేవా దృక్పథంవల్ల ఇంటికి వచ్చే అతిథుల సంఖ్య పెరిగింది. వచ్చినవాళ్ళంతా భరత్‌ను పొగుడుతూంటే ఎంతో గర్వంగా అనిపించేది లలితకు. అయితే భర్త కొడుకుతో ముక్తసరిగా మాట్లాడటం ఆమెను బాధించేది.

సీతారామయ్య కొడుకు వినోద్‌ బి.టెక్‌ తర్వాత అమెరికాలో ఎం.ఎస్‌. చేసి అక్కడే ఉద్యోగంలో చేరాడు. పెళ్ళికోసం ఇండియా వచ్చి తర్వాత భార్యను తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. కోడలు పురుడు సమయంలో సీతారామయ్య దంపతులు అమెరికా వెళ్ళి మూడునెలలుండి తిరిగి ఇండియా వచ్చారు. మనవరాలి ఫొటోలు ఇంటర్‌నెట్‌లో చూసుకుంటూ కొడుకుతో ఫోన్లో మాట్లాడుకుంటూ వాళ్ళు కాలక్షేపం చేయసాగారు. ప్రతి చిన్నపనికీ సీతారామయ్య తిరుగుతున్నాడు. భరత్‌ అవసర సమయాల్లో వారిని ఆదుకుంటూ ఉన్నాడు.

ఓరోజు కృష్ణమూర్తి రాజారావు ఇంటికి వచ్చాడు. పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకున్నాక ‘‘ఎలా ఉంది జీవితం?’’ అని అడిగాడు స్నేహితుణ్ణి.

‘‘హాయిగా ఉంది. భార్య, కొడుకు, కోడలు, మనవడు- వీళ్ళే నా ప్రపంచం ఇప్పుడు. అద్భుతమైన ప్రపంచం ఇది’’.

‘‘నీ అద్భుత ప్రపంచంలో ఓ వింత కూడా ఉంది’’.

ఏమిటన్నట్లు చూశాడు రాజారావు.

‘‘తండ్రి తనయుడితో మాట్లాడకపోవడం’’.

‘‘నేను వాడితో మాట్లాడుతున్నానే’’.

‘‘అని నువ్వు లోకాన్ని నమ్మించగలవేమోగానీ నీ ప్రాణస్నేహితుణ్ణి నమ్మించలేవు. నువ్వు మనసువిప్పి వాడితో మాట్లాడటంలేదన్న విషయం నాకు తెలుసు. భరత్‌ ఎంత ఆనందంగా కనిపిస్తున్నా వాడి గుండెలో గూడుకట్టుకున్న విషాదాన్ని నేను చూడగలను. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆ కళ్ళ వెనుక కన్నీరు నాకు కనిపిస్తుంది’’.

‘‘అంతా తెలిసినవాడివి, నీకు నేను చెప్పేదేముంది?’’

‘‘నీ పద్ధతి మార్చుకో రాజా. వాడు నువ్వు కోరిన దారిలో నడవలేదు. నిజమే. కానీ దారితప్పలేదు. చక్కగా చదువుకుని ప్రయోజకుడయ్యాడు. తన అభిరుచులకు తగ్గట్టు తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాడు. మీతోనే ఉంటూ ఈ కాలంలో చాలామంది తల్లిదండ్రులకు దొరకని అదృష్టాన్ని మీకు కలగజేశాడు. వాడి మనసు పూర్తిగా విరగకముందే నువ్వు మారితే మంచిది’’.

‘‘తండ్రీకొడుకుల మధ్య గ్యాప్‌ రాకూడదు. వచ్చాక దాన్ని తొలగించడం కష్టం’’.

‘‘నువ్వు ప్రయత్నమే చేయకుండా ఫలితం రాదంటే ఎలా? మావాడు మమ్మల్ని తన దగ్గరకు వచ్చెయ్యమంటున్నాడు. ఈ నెలాఖరున మేము హైదరాబాదు వెళ్ళిపోవచ్చు. ఆలోగా నీనుంచి మంచి వార్త వినాలని ఆశిస్తున్నా’’.

కృష్ణమూర్తి వెళ్ళిపోయాడు. రాజారావు చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. అయితే కృష్ణమూర్తి ఆశించిన మంచివార్త అతనికి అందలేదు.



కీబోర్డులో చాలా కృషి చేశాడు భరత్‌. ప్రతి శని, ఆదివారాలు చెన్నై వెళ్ళి మరింత ప్రావీణ్యం సంపాదించాడు. ఓ ఆర్కెస్ట్రా టీములో చేరి వారితో కలిసి చుట్టుపక్కల వూళ్ళలో ప్రదర్శనలు ఇవ్వసాగాడు. ఓసారి తిరుపతికి వచ్చిన ఓ ప్రముఖ సినీ సంగీత దర్శకుణ్ణి కలిశాడు భరత్‌. భరత్‌ ప్రతిభ చూసి తన దగ్గరికి వచ్చెయ్యమనీ కీబోర్డు ప్లేయర్‌గా తాను అవకాశమిస్తాననీ చెప్పాడు. భరత్‌ ఎంతో సంతోషించాడు.

విషయం విన్న లలిత, వనిత కూడా ఎంతో సంతోషించారు. అయితే రాజారావు మాత్రం ఉన్న ఉద్యోగం వదులుకుని రిస్కు తీసుకోవడం మంచిదికాదని అభిప్రాయపడ్డారు.

‘‘మీరు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదు నాన్నా. సంగీతరంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. అవకాశాలూ బోలెడున్నాయి ఇప్పుడు. సినిమాల్లో అవకాశాలు రాకపోతే టీవీ రంగం ఉంది. అదీ లేకపోయినా ప్రైవేటు ఆల్బమ్స్‌ చేసుకోవచ్చు. ప్రతిభా కృషీ ఉంటే ఆ రంగంలో అవకాశాలకు కొదవలేదు. ఒకవేళ ఏదీ అచ్చిరాకపోతే మళ్ళీ ఈ లెక్చరర్‌ ఉద్యోగమే చెయ్యొచ్చు. ఇటీజ్‌ వర్త్‌ ఎ ట్రై’’ అంటూ తండ్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు భరత్‌.

‘‘నీ ఇష్టం. నువ్వు ఏ రోజు నా మాట విన్నావు, ఈరోజు వినడానికి’’ అన్నాడు రాజారావు వ్యంగ్యంగా.

భరత్‌ బాధగా తండ్రివైపు చూశాడు. తర్వాత ‘‘మీరు చెప్పినట్లే వింటాను నాన్నా. ఈ ఆఫర్‌ను వదులుకుంటాను’’ అన్నాడు.

రెండురోజుల తర్వాత భరత్‌ పనిచేసే కాలేజీ ప్రిన్సిపాల్‌ ఇంటికి వచ్చి రాజారావుతో ‘‘భరత్‌కు మంచి టాలెంటు ఉంది. అతన్ని హైదరాబాదు పంపండి. హషీమ్‌ లాంటి సంగీత దర్శకుడి దగ్గర పనిచేసే అవకాశం దొరకడం అదృష్టం. ఒకవేళ భరత్‌ ఆ రంగంలో ఫెయిలైతే మళ్ళీ మా కాలేజీలోనే లెక్చరర్‌ ఉద్యోగం ఇస్తాను’’ అన్నాడు.

బంగారం

రాజారావు ఒప్పుకున్నాడు.

‘‘అత్తగారినీ మామగారినీ నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. పూర్తి ఏకాగ్రతతో సంగీతంపై ధ్యానం పెట్టండి. చిత్తశుద్ధితో మనం ఏ పనిచేసినా అది విజయవంతమవుతుంది. మంచి మనిషికి భగవంతుడి సహాయం తప్పకుండా ఉంటుంది. చిన్నచిన్న అపజయాలనూ అవమానాలనూ పట్టించుకోకుండా మీ కృషి మీరు చెయ్యండి. గుర్తింపు దానంతట అదే వస్తుంది’’ అంది వనిత రైల్వేస్టేషన్‌లో భర్తకు వీడ్కోలిస్తూ.

హైదరాబాదులో భరత్‌కు పరిస్థితి ఆశాజనకంగా కనిపించింది. రెండేళ్ళు హషీమ్‌ దగ్గర కీబోర్డు ఆపరేటర్‌గా పనిచేసి, తర్వాత కొన్ని టీవీ సీరియల్స్‌కు సంగీతం అందించాడు. కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. మరో మూడేళ్ళ తర్వాత సినిమాలకు సొంతంగా సంగీతం అందించసాగాడు.

హైదరాబాదులో ఇల్లు కొన్నాడు భరత్‌. తల్లిదండ్రుల్ని తనతోపాటు హైదరాబాదు వచ్చేయమని కోరాడు. వెళ్ళడానికి రాజారావుకు అహం అడ్డొచ్చింది. కొడుకు కోరికను తిరస్కరించాడు.

లలిత ప్రోద్బలంతో కొడుకుతోపాటు హైదరాబాదు చేరింది వనిత.

*

‘‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందంటారు. మీ ఈ విజయం వెనుక ఎవరున్నారు?’’

రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించగానే రికార్డింగ్‌ థియేటర్‌లో ఉన్న భరత్‌ను చుట్టుముట్టిన టీవీ పత్రికా రిపోర్టర్లలో ఒకతను భరత్‌ను అడిగాడు.

‘‘నా విజయం వెనుక ఓ పురుషుడు ఉన్నారు. ఆయన మా నాన్నగారు. నేను ఐఐటీలో ఇంజినీరింగ్‌ చదవాలనీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసి అమెరికా వెళ్ళిరావాలనీ ఆశపడ్డారు. కానీ నా అభిరుచులూ ఆలోచనలూ వేరుగా ఉండేవి. టెన్షన్లులేని ఉద్యోగం చేయాలి. రోజూ ఉదయం నాలుగు మంచి పాటలు వినాలి. వారానికి ఒక మంచి సినిమా చూడాలి. మంచి పుస్తకం నెలకు ఒకటైనా చదవాలి. అమ్మానాన్నలకు తోడుగా ఉండాలి. బంధువులకూ స్నేహితులకూ అందుబాటులో ఉండాలి... ఇలా సాగేవి నా ఆలోచనలు. అయితే ఇరుగుపొరుగు పిల్లలతో నన్ను పోల్చుకుని మా నాన్న బాధపడటం చూశాక, వాళ్ళందరికంటే భిన్నంగా ఏదైనా సాధించాలనీ మా నాన్న నన్ను చూసి గర్వపడేలా ఏదైనా చేయాలనీ నాకనిపించేది. మా నాన్నకు పాటలంటే ఇష్టం. ప్రతిరోజూ ఉదయాన గంటసేపైనా పాటలు వినడం ఆయన హాబీ. రోజూ ఆ పాటలు వినడంవల్ల నాకూ పాటలంటే ఇష్టం ఏర్పడింది. నేను విన్న పాటలను కొత్త ట్యూనులో పాడేందుకు ప్రయత్నించేవాడిని. నాలుగేళ్ళు బి.టెక్‌ చేస్తూ కీబోర్డు నేర్చుకున్నాను. ఓసారి తిరుపతికి వచ్చిన ప్రముఖ సంగీత దర్శకులు మహమ్మద్‌ హషీమ్‌ గారు నా టాలెంట్‌ చూసి నన్ను తన ట్రూప్‌లోకి ఆహ్వానించారు. ఆ తర్వాత జరిగింది మీకు తెలిసిందే. నాలో ఎదగాలన్న తపననూ ఏదైనా సాధించాలన్న కసినీ నాకు కలిగించిన మా నాన్నగారికి ఈ నంది అవార్డును అంకితం ఇస్తున్నాను’’.

టీవీలో కొడుకు ఇంటర్వ్యూ చూస్తున్న రాజారావు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. భార్యా ఇరుగుపొరుగువాళ్ళూ అభినందిస్తూంటే దుఃఖంతో ఏం మాట్లాడలేకపోయాడు. తర్వాత కృష్ణమూర్తి హైదరాబాదు నుంచి ఫోన్‌ చేశాడు.

‘‘కంగ్రాట్స్‌రా. నీ కొడుకు నీకు అద్భుతమైన బహుమతి ఇచ్చాడు’’.

‘‘నేను ఈ బహుమతికి అర్హుణ్ణి కాదు. వాడిలోని టాలెంట్‌ని నేను ఏనాడూ గుర్తించలేదు. ఎటువంటి ప్రోత్సాహాన్నీ అందించలేదు. వాడు నాకోసం తపించాడు. నేను వాణ్ణి శపించాను. నా మాటలతో కొన్నాళ్ళూ మౌనంతో కొన్నేళ్ళూ బాధించాను. నా ముఖంలో ఆనందం కోసం పదేళ్ళు శ్రమించాడు వాడు. వాడి ముఖంలో ఆనందం కోసం ఓ మంచిమాట, ప్రోత్సాహకరమైన పదం ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా నేను చెప్పలేకపోయాను.

చాలామంది ఐఐటీ స్టూడెంట్లూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లూ సాధించలేని విజయాన్ని వాడు ఈరోజు సాధించాడు. రాష్ట్రం మొత్తం ప్రజానీకానికి తెలిసిన వ్యక్తి అయ్యాడు. నేను ఎన్ని మాటలన్నా వాడు నోరెత్తేవాడు కాదు. ఈరోజు వాడు తన చేతల్తో నన్ను గెలిచాడు. వాడు... వాడు... బంగారం’’.

రాజారావు ఏడుస్తున్నాడు పశ్చాత్తాపంతో. అతని కళ్ళు వర్షిస్తున్నాయి ఆనందంతో.
💦🐬🐥🐋💦

సేకరణ

కనీసం మన శ్రీరాములు ,ఘంటసాల గొప్పతనం, మన పిల్లలకు తెలియజెప్పటం మన బాధ్యత

💟🌳💟


మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రం లోనే ఉంటున్నాం. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి, తన అహంకారానికి పదవీచ్యుతుడయ్యాడు. తెలుగువారంటే ఆరంభ సూరులు మాత్రమే నని పుకారు పుట్టించారు. తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరినా మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయులు అనే పిలిచేవారు . స్వాతంత్ర్యం వచ్చాక కూడా మనకు గుర్తింపులేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు. 1952 వచ్చినా ఆంధ్రావాళ్లంటే తెలియదు మద్రాసు వాళ్లమే మొత్తం ప్రపంచానికి. ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణిచివేసి సీతారామ్ దీక్షను భగ్నం చేసింది. పైగా తెలుగువారు ఆరంభసూరులు అని హేళన చేసింది.

♦️ దిగమింగుకోలేని ఈ అవమానానికి శ్రీరాములు స్పందించారు. సర్కార్ ఎక్స్ ప్రెస్ లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తిగారి ఇంట దీక్ష ప్రారంభించారు. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ర్టాన్ని ముక్కలు కానివ్వను అని సవాల్ చేశారు ఎవరైనా కాంగ్రేస్ వారు ఆ వైపుకు వెళ్లారా అంతు చూస్తానన్నారు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టిశ్రీరాములు ఒంటరివాడైపోయాడు. యెర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవరూ లేరు. అయినా తన దీక్షను పొట్టిశ్రీరాములు వదల్లేదు. 9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకీ పోన్ చేసారు. అవన్నీ ఉడత ఊపులేనని తాను అణిచివేస్తానని రాజాజీ నమ్మబలికారు. తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు. అదీ తెలుగువారి ఐక్యత. సమస్య కాంగ్రెస్ ది కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించటంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు. తెలుగునాయకులంతా మొఖం చాటేశారు. 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికీ జాలీ దయ లేదు. టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాజాజీకీ వ్యతిరేకం గనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించి వెళ్ళారు. కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్ళబోసుకున్నారు శ్రీరాములు. వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కరరావు. కూరాళ్ల భుజంగం తదితరులు. పొట్టిశ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపుతప్పింది. ఆ బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టేవారు. పేగులు పుండ్లుపడి పురుగుల నోటి వెంట వచ్చేవి. కళ్ళు చెవులు నుంచి కూడా వచ్చేవి. జీర్ణవ్యవస్థ తిరగబడి మలం కూడా నోటినుంచి వచ్చేది. వర్ణించటానికి వీలులేనంత దారుణమైన శారీరక దాష్టీకంతో నిండుకుండ వంటి శ్రీరాములు నిర్జీవుడవ్యటానికి 58 రోజులుపట్టింది. ఎంత దారుణమరణవేదన అనుభవించి తెలుగువారి కోసం ఆయన అసువులు బాసారో చెప్పటానికి మాటలే లేవు.ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరికి ఒంటరివాడిగా ఉన్న గుడివాడ సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకునిి వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. శవాన్ని తాటాకులతో కాకులు పొడవకుండా కప్పివచ్చిన సుబ్రహ్మణ్యాన్ని శవం ఎక్కడా అని ఘంటసాల అడిగారు. ఒక్కొక్క తాటాకూ తీసి శవాన్ని చూస్తున్న ఘంటసాల గుండె కరిగిపోయింది. మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశుడైపోయాడు. ఎవరి కోసం చచ్చిపోయాడు ఆ దీనుడు అని కన్నీరుమున్నీరు అయిపోయారు. వాంతు చేసుకున్నారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆవేశంతో ఊగిపోయారు. వెంటనే ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని , చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువులశ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు.

♦️ గుండెల్ని పిండే ఘంటసాల మాటలు పాటలకు మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీ ముందుగా శవం వెళ్తున్న సమయంలో విన్న కాలేజి కుర్రాళ్ళు పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ బండివెంట అరుస్తూ యాత్రలో చేరారు. అమరజీవి మరణవార్త టెలిగ్రాం ద్వారా ఆంధ్రకేసరికి తెలపటంతో ఆయన మెయిల్ కి మద్రాసు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరింది. శ్రీరాములు దారుణశవ పరిస్తితిని చూడగానే ఆంధ్రకేసరి ఆవేశం కట్టలు తెంచుకుంది. బూతుపురాణంతో తెలుగుజాతి చాతకానితనాన్ని ఆయన చీల్చిచెండాడుతూ పనికిరాని తెలుగుజాతి నాకొడక....రా అంటూ పెట్టిన పెడబొబ్బలకి ఎలా కదిలారో లక్షలాది మంది తెలుగువారు క్షణాల్లో మద్రాసు నగరం మంటల్లో తగలబడింది. షాపులు లూటీ అయ్యాయి. ఆంధ్రదేశమంతా అట్టుడికి పోయింది. 8 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. నెహ్రూ రాజాజీని చివాట్లు పెట్టి ప్రజలను శాంత పడమని శ్రీరాములు మరణం వృధాపోదని ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంటులో ప్రకటించటంతో తెలుగుజాతి ఊరడిల్లింది. సాధుసుబ్రహ్మణ్యంగారే శవానికి దహనక్రియలు కర్మకాండ జరిపారు.

♦️ మిత్రులకు విన్నప్పము, ,ఇ కష్టం మనకు తెలీదు కనీసం మన శ్రీరాములు ,ఘంటసాల గొప్పతనం
మన పిల్లలకు తెలియజెప్పటం మన బాధ్యత

Source - Whatsapp Message

నేటి నీతికథ. అపాయంలో ఉపాయం

నేటి నీతికథ. అపాయంలో ఉపాయం : ఒక రోజు అక్బర్, బీర్బల్ వనంలో విహారానికి వెళ్లారు. ఇద్దరూ కాస్సేపు వనంలో నడిచిన తర్వాత అక్బర్ పాదుషాకి ఒక సందేహం వచ్చింది. ‘‘ బీర్బల్ ! హఠాత్తుగా ఏదైనా అపాయం వచ్చిందనుకో, అప్పడు ఏ చెయ్యాలి ?’’ అని అడిగాడు. ‘‘ ఏముంది ప్రభూ! ఆ అపాయాన్న్ని ఉపాయంతో తప్పించుకోవాలి. ‘‘ అపాయాన్ని తప్పించుకోవడానికి ఉపాయమే కావాలా ? ఆయుదం ఉంటే సరిపోదా?’’ అని అడిగాడు. అక్బర్. ‘‘ కాదు ప్రభూ! ఉపాయం ఆయుధం కంటే గొప్పది’’ అని సమాధానం చెప్పాడు బీర్బల్. బీర్బల్ చెప్పిన దాంతో అక్బర్ అంగీకరించలేదు. ఆయుదం ఉంటే ఎలాంటి అపాయం నుండైనా బయటపడొచ్చు. అని వాదించడం మొదలు పెట్టాడు. ఇంతల వారిద్దరికీ ఎనుగు ఘీంకారం వినిపించింది. ఇద్దరూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశారు. ఒక మందించిన ఎనుగు వనంలోని మనషుల్ని తొండంతో విసిరేస్తూ, చెట్లని తొక్కుతూ, బీకరంగా ఘీంకారం చేస్తూ వీరివైపు వచ్చింది. అక్బర్ వెంటనే ఒరలో ఉన్న కత్తిని తీసి, దాన్ని పట్టుకుని నిలబడ్డాడు. అయినా ఏనుగుకి అది అని ఏం తెలసు? అది లెక్క చేయకుండా మీది మీదికి వచ్చేస్తుంది. ఆ చిన్న కత్తి, అంతపెద్ద ఏనుగుని ఏం చేయగలదు? దానికి తోడు అది మదించిన ఏనుగు. జరగబోయే ప్రమాదం పసిగట్టిన అక్బర్, బీర్బల్ వెనక్కి పరుగుతీసి అక్కడ ఉన్న ఒక ఎత్తయిన అరుగని ఎక్కి ఏనుగు బారినుండి బయటపడ్డారు. ‘‘ చూశారా ప్రభూ!మీ దగ్గర కత్తి ఉన్నా మీరేమి చేయలేకపోయారు. పరిగెత్తి ఈ అరుగు ఎక్కడమన్నదే ఉపాయం! అన్నాడు బీర్బల్. ‘‘ నువ్వు చైప్పిందే సరియైనది’’ అంటూ అక్బర్ బీర్బల్ ని మెచ్చుకున్నాడు.

సేకరణ మానస సరోవరం

Source - Whatsapp Message

నేటి మంచిమాట

నేటి మంచిమాట

నువ్వు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా , నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురుచుస్తూనే ఉంటుంది .
దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది...ఇదే ఈ లోకం నైజం... !!

పూర్వకాలంలో మనుషులు
ప్రేమమయులు వారు బంధాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేసేవారు తర్వాత కాలంలో మనుషులు
ప్రాక్టికల్ అయిపోయారు స్వలాభం కోసం బంధాలను కొనసాగించారు కానీ ఇప్పుడు పూర్తిగా ప్రొఫెషనల్స్ లాభం ఉంటేనే బంధాలను కలుపుకుంటున్నారు


జీవితం చాలా చిన్నది
ప్రతివిషయంలోను ఆనందాన్ని వెతుక్కో..
నచ్చిన వారు ఎదురుగా లేరా వారి స్వరాన్ని వింటూ ఆనందించు..
ఎవరన్నా నీపై అలిగారా వారు అలిగే విధానాన్ని ఆనందించు..
దూరమై తిరిగిరాని వారెవరైనా ఉన్నారా వారి జ్ఞాపకాలను ఆనందించు..

రేపు వస్తుందో రాదో తెలియదు ఈరోజు ఈక్షణం ఆనందించు ఆస్వాదించు..



మంచివాడు శత్రువుకి కూడా
సహాయం చేస్తాడు!!

చెడ్డవాడు తోడబుట్టిన వాళ్ళను
కూడా ముంచుతాడు!!!

మంచివారిని దూరం చేసుకుంటే
చివరికి ముంచేవారే దొరుకుతారు

ఇది అక్షరాలా "నిజం"
పరమ సత్యం

ఇతరులలో మన ఆనందాన్ని వెతుక్కోవడమంటే ఎండమావిలో నీళ్ళని వెతుక్కున్నట్టే. దూరం నుండి నీరున్నట్టు భ్రమను కలిగిస్తూ ఉంటుంది.. దాహం తో పోయే వరకు పరిగెత్తిస్తూనే ఉంటుంది. మన ఆనందం జీవనదిలా మనలోనే ప్రవహిస్తోందని తెలుసుకోవడానికి ఒక్క క్షణం చాలు లేదా ఎన్ని జన్మలైనా సరిపోదు.

సేకరణ మానస సరోవరం

Source - Whatsapp Message

జీవిత సత్యం.

జీవిత సత్యం.
1 మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు. తనకు సంబంధించినది కానివ్వండి, కుటుంబానికి సంబంధించినది కానివ్వండి, సమాజానికి సంబంధించినది కానివ్వండి! ప్రారంభించేటపుడు ఏ సమస్యలు ఉండవు. కాని ప్రారంభించిన కొన్ని రోజులకే నూటొక్క సమస్యలు ప్రారంభమవుతాయి. కువిర్శలు ప్రారంభమౌతాయి. ఎన్నెన్నో అడ్డంకులు కలిగి నిరాశ కల్గుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో అకుంటిత దీక్షతో ‘ధృతి’ చెడకుండా ముందుకి సాగిపోవాలి. ‘ఇది ధర్మం’.

2. మనిషి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పు కలిగి వుండాలి. క్షమాగుణంతో ఉండాలి. ప్రతిదానినీ ప్రతివారినీ, ప్రతి విషయాన్నీ, క్షమాశక్తితో ఎదుర్కోనాలి. కోపగించుకోకూడదు. ఓర్పుగుణం వున్నవారిని ఏ శక్తులూ ఏమీ చేయలేవు. ‘ఇది ధర్మం’.

3,. మనం ఒక పని చేసేటపుడు మన మనస్సు సంపూర్ణంగా ఆ విషయంలోనే లగ్నం కావాలి. ఒక పనిచేస్తూ మరొక దానిని గురించి ఆలోచించకూడదు. ఏ విషయంలోనైనా ముఖ్యం. చదువుతున్నా, వింటున్నా, పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, మనస్సును పరిపరిమార్గాలకు పోనివ్వకుండా వుండాలి ‘ఇది ధర్మం’.

4. తనకు తెలియని విషయాలను తాను తెలిసికొనక, పెద్దలు, పూర్వులు, చెప్పినదానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం తీసికోనలేక, నిస్తేజంగా నిర్వికారంగా, నిరాశగా, నిర్లిప్తతగా, నియమరాహితుడుగా, ఉండకూడదు. ‘ఇది ధర్మం’.

5మనిషి ఎల్లపుడూ మనస్సునూ, శరీరాన్నీ, మాటనూ ఆలోచననూ, సంసారన్నీ, ఇంటినీ, పరిసరాన్నీ, మనిషి వస్త్రాలనూ పరిశుభ్రంగా శుచిగా వుంచుకోవాలి. మనసు పరిశుభ్రంగా వుండాలి. మాత్రమే పరిశుభ్రంగా ఉండాలి. మనిషి పరిశుభ్రంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.

6 ,చదువువున్నా, సంపదలున్నా, కీర్తివున్నా, బలంవున్నా ఇంద్రియ నిగ్రహం లేనివానికి ఏదో ఒకరోజు పతనం తప్పదు. కాబట్టి మనస్సును దాని ఇష్టానికి దాని వదలివేయకుండా మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. ‘మనస్సును గెలిచినవాడు దేవేంద్రుడైనా గెలుస్తాడు’ మనస్సును తమ చెప్పుచేతల్లో ఎవరుంచుకొంటారో వారిని భూతప్రేతాలుగాని, దెయ్యాలు గాని, యక్షకిన్నర కిమ్పురుశులుగాని, గ్రహాలు గాని, రోగాలు గాని, కష్టసుఖాలుగానీ, మరణంగానీ, వశంలో వుంటాయి. కాబట్టి మనస్సును, మాటను, దృష్టిని, శరీరాన్నీ, చేతలనూ అదుపుచేయాలి ‘ఇది ధర్మం’.

7 ,ప్రతి విషయానికీ సంకోచపడటం, సిగ్గుపడటం, అనుమానపడటం, తనను తాను తక్కువగా భావించటం కూడదు ‘ఇది ధర్మం’.

8 . మనిషి సత్యవ్రతం కలిగిఉండాలి. అకారణంగా, అనవసరంగా, ఒకరి మెప్పుకోసం, ఒకరిని మెప్పించటంకోసం, తన పనిని సాధించుకోవటం కోసం, తాను ఏ విధంగానైనా ప్రయోజనం పొందటంకోసం. తనవారిని తృప్తిపెట్టట్టంకోసం అబద్దాలు చెప్పకూడదు. అబద్ధం కలిగిస్తుంది. అబద్ధం అల్పసుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. అబద్ధం మరోకనాటికి అవమానం పాలు చేస్తుంది. అబద్ధం మనిషి విలువను మట్టిచేస్తుంది. మన శక్తినీ, మనకీర్తినీ, మన గోప్పదనాన్నీ పాతాళానికి త్రోక్కివేస్తుంది. కాబట్టి సాధ్యమైనంతవరకూ సత్యధర్మాన్ని వదలకూడదు. ‘ఇది ధర్మం’.

9 , మానవునికి ఆహరం ఎంత ముఖ్యమో, వివేకం కూడ అంతే ముఖ్యం. వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాననే వివేకం సిద్ధించదు. విన్న విషయాలను స్వానుభవానికి మళ్ళించుకోవాలంటే మనిషికి విద్య కావాలి. ‘విద్యావిహీనః పశుః’ అని ఆర్యవాణి. మనిషిగా పుట్టి మట్టిబొమ్మగా జీవిత గడపకూడదు. ఎంతటి పెడతానం పెనవేసుకొనివున్నా, స్థితిగతులు ఎంతటి బాధాకరమై వున్నా,భిక్షమెత్తి అయినా చదువుకోవాలి అని ఋషివాక్యం. విద్య ప్రతి వ్యక్తికీ నిర్బంధంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.

10 ,పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం ఇవన్నీ మనిషిని పతనావస్థకు నేడతాయి. పగ, ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురిచేసి అనారోగ్యాన్ని కల్గిస్తాయి. తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలవాల్సివస్తుంది. తనను కన్నవారికీ, తాను జన్మనిచ్చిన వారికీ, తనను నమ్మి బ్రతికేవారికీ అన్యాయం కల్గుతుంది.

సేకరణ మానస సరోవరం.

Source - Whatsapp Message

మంచి మాటలు....

కోపంతో చేసే పనులు పశ్చాత్తాపంతో ముగుస్తాయి...

శాంత చిత్తంతో చేసే పనులు పరమానందంతో ముగుస్తాయి..

ఆవేశంతో మాట్లాడిన మాటలు అనర్థాలను మోసుకొస్తాయి..

ఆత్మీయతతో మాట్లాడిన మాటలు
పరులను కూడా అయినవారిగా చేస్తాయి..

ఈర్ష్యతో చేసిన ఆలోచనలు ఒంటరితనాన్ని మిగిలిస్తాయి..

కోపం వచ్చినపుడు కళ్ళ నుండి కన్నీరు రావాలి..

కానీ

నోటి నుండి మాట రాకూడదు..

కన్నీటితో కోపం పోతుంది..

కానీ

మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతుంది..

కోపం తెచ్చుకొనే హక్కు ఎవరికైనా ఉండవచ్చు..

కానీ

ఆ కోపంతో కూృరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు.....


కోపం మంచిదే..

అమ్మ కోపం కడుపు నింపడానికి..

నాన్న కోపం బ్రతుకు నేర్పడానికి..

గురువు కోపం బుద్ధి నేర్పడానికి..

స్నేహితుల కోపం దారి చూపడానికి..

చెలి కోపం ప్రేమ తెలపడానికి..

శత్రువు కోపం జాగ్రత్త నేర్పడానికి..

కాబట్టి..

కోపం ఎదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది..

అన్నింటికన్నా గొప్పవరం సంతోషంగా ఉండగలగటమే.

ప్రేమతోనే ద్వేషాన్ని దూరం చేయగలము.

సహనం కోల్పోకూడదు.

చెడు ఆలోచనలే సమస్యలకు కారణము.

మార్చలేని గతాన్ని గురించి ఆలోచించడం ఎందుకు.

రాబోయే భవిష్యత్తు గురించి శ్రమించు.

ప్రయత్నం చేసినా ఓడిపోవచ్చు,

కానీ

ప్రయత్నం చేయడం మాత్రం ఆపకూడదు.

కష్టాలు ఎదురైనప్పుడే మనిషి సామర్థ్యం తెలుస్తుంది.

ఎంత కాలం బ్రతికామన్నది ముఖ్యం కాదు,

ఎంత గొప్పగా జీవించామన్నది ముఖ్యం.

విద్య నీడలాంటిది, దానిని మన నుంచి ఎవరు దూరం చేయలేరు.

విజయం సాధించాలంటే చేసే పనిని ప్రేమించాలి.

జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య.

ఎన్ని పూజలు చేసినా బుద్ధి వంకరగా ఉంటే ఉపయోగం లేదు.

సత్యవచనాలను కూడా ప్రేమపూరితంగానే చెప్పాలి.

సంశయం సద్గురువు ఇచ్చే వరాలను శిష్యునికి అందకుండా చేస్తుంది.


" ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది

కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు సాగదు

సింహం నోరు తెరుచుకున్నంత మాత్రాన వన్యమృగం దాని నోటి దగ్గరకు వస్తుందా "


" నీ తప్పు నీతో చెప్పేవాడు స్నేహితుడు,

నీ తప్పు ఎదుటివాళ్ళతో చెప్పేవాడు మిత్రుడిలా కనిపించే..
నీ అనుకూల శత్రువు. "


మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి

బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి.

ఆకాశంలో అంత ఎత్తులో గద్ద రెక్కలాడించకుండా ఎలా ఎగరగలుగుతుంది....

ఎండుటాకులు, దూదిపింజెలు, వెంట్రుకల లాంటి తేలికైన వస్తువులు గాలిలో తేలుతూ చాలా సేపు కింద పడకుండా ఉండడం తెలిసిందే.

అదే రాయిలాంటి వస్తువులు పైనుంచి కిందకి తటాలున పడిపోవడం కూడా మనకు తెలుసు.

ఎత్తు నుంచి కిందకి పడే వస్తువుపై గాలి వల్ల ఏర్పడే నిరోధక బలం పని చేస్తూ ఉంటుంది.

దీని ప్రభావం ఆయా వస్తువుల సాంద్రత, పరిమాణం, బరువులాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

గద్ద విషయానికి వస్తే దాని రెక్కలు చాలా విశాలంగా ఉంటాయి.

గద్ద పరిమాణం దాని బరువుతో పోలిస్తే చాలా ఎక్కువ.

ప్యారాచూట్‌ కట్టుకున్నప్పుడు, గ్త్లెడర్‌ పట్టుకున్నప్పుడు మనుషులు ఎలాగైతే గాలిలో తేలుతూ ప్రయాణించగలరో గద్దకూడా అలా చేయగలదు.

గద్ద ఆకాశంలోకి ఎగరడానికి మామూలుగానే రెక్కలు ఆడించినా,

పైకి వెళ్లాక రెక్కలను విశాలంగా చాపి గాలి నిరోధాన్ని, గాలి వేగాన్ని ఉపయోగించుకుని బ్యాలన్స్‌ చేసుకుంటూ తన శక్తిని ఆదా చేసుకుంటుంది.

మరింత ఎత్తుకు ఎగరాలంటే మాత్రం రెక్కలు అల్లల్లాడించవలసిందే.


ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాశతో ఉన్న మనిషే ప్రమాదకరం.....

ఒకరితో మరొకర్ని పోల్చడం ఎంత మాత్రం సరికాదు.


పిల్లలు.. ఎవరికి వాళ్లే ప్రత్యేకం.

చదువు విషయంలో ఒకరు ముందు ఉండొచ్చు.

అలాంటప్పుడు మరొకరిని నేర్చుకోమని పోల్చి చూడకూడదు.

మిగతా వారికి దేంట్లో నైపుణ్యం ఉందో గుర్తించి, దాన్ని ప్రోత్సహించాలి.

ఒకరు క్లాస్‌ఫస్ట్‌ వస్తే మిగతావారినీ అలాగే రావాలని ఒత్తిడి చేయడం మంచిదికాదు.

అలా చేయడం వల్ల రెండోవారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది.

తానెందుకూ పనికిరానని కుంగుబాటుకు గురికావచ్చు.

ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయో గుర్తించి,

వాటికి మెరుగులు దిద్దడానికి మీ వంతుగా ప్రయత్నించాలి.

Source - Whatsapp Message

మంచి మాటలు...

ఆత్మీయ బంధు మిత్రులకు బుధవారపు శుభోదయ శుభాకాంక్షలు, విగ్నేశ్వరుడు సుబ్రమణ్య స్వామి అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ....కరాచలం వద్దు నమస్కారం ముద్దు, నమస్కారం మన సంస్కారం 🙏
బుధవారం --: 31-03-2021
ఈ రోజు AVB మంచి మాటలు
స్నేహితుడు ధనవంతుడా , పేదవాడా అన్నది ముఖ్యం కాదు , కష్టసమయంలో మనకు ఎంతవరకు తోడుగా ఉన్నాడనేది ముఖ్యం .

నిజమైన ప్రేమలో కోపాలు తాపాలు అలకలు బుజ్జగింపులు అన్నీ ఉంటాయి కానీ ! వాటన్నింటిలోనూ స్వచ్చమైన ప్రేమ దాగి ఉంటుంది . అర్థం చేసుకునే మనసు ఉండాలే గానీ ప్రతి క్షణం అద్భతమే .

మనశ్శాంతి లేని సంపద
ఆరోగ్యం లేని ఆయుష్షు అర్ధం చేసుకోలేని బంధం అవసరానికి కానరాని స్నేహం ఉన్నా లేకున్నా ఒకటే . ఇతరులను అదుపు చేయడం గొప్ప విషయమే కానీ తనను తాను అదుపుచేసుకోవడం అంతకన్నా గొప్ప విషయం .

మనలో అప్పుడప్పుడు ఇష్టాలు మారుతూ ఉంటాయి కానీ ! ప్రేమ ఎప్పటికి మారకూడదు .మనకు కష్టాలు వస్తూ ఉంటాయి కానీ మనం ఎదుటి వారి వద్ద నమ్మకాన్ని కోల్పోకూడదు , మనం మాట్లాడే మాటలు మారుతూ ఉంటాయి కానీ ! మనం ఇచ్చిన మాట మరవకూడదు .

సేకరణ ✒️ *మీ AVB సుబ్బారావు 💐🤝

Source - Whatsapp Message

మంచి మాటలు....

🌱🌱🌱🌱
విత్తనం తినాలని
చీమలు చూస్తాయ్..
మొలకలు తినాలని
పక్షులు చూస్తాయ్..
మొక్కని తినాలని
పశువులు చూస్తాయ్..
అన్ని తప్పించుకుని
ఆ విత్తనం వృక్షమైనపుడు..
చీమలు, పక్షులు, పశువులు..
ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్....
జీవితం కూడా అంతే TIME
వచ్చే వరకు వేచివుండాల్సిందే
దానికి కావాల్సింది ఓపిక మాత్రమే.....
🌱🌱🌱🌱
లోకులు కాకులు,
మనిషిని చూడరు,
మనస్సును చూడరు,
వ్యక్తిత్వాన్ని చూడరు.
కనిపించింది,
వినిపించింది నమ్మేస్తారు,
మాట అనేస్తారు,
ఒక్కోసారి మన కళ్ళే
మనల్ని మోసం చేస్తాయి.
మరొకసారి చెప్పుడు మాటలు
జీవితాలను
తలకిందులు చేస్తాయి
🌱🌱🌱🌱
అబద్దాలతో, మోసాలతో
కీర్తి, ప్రతిష్టలను
ఎంత గొప్పగా నిర్మించుకొన్నా..
అవి కుప్పకూలి పోవడానికి
ఒక్క "నిజం"చాలు.
అందుకే కష్టమైనా సరే
నీతిగా బ్రతకడమే మనిషికి
ఉత్తమ మార్గం.
: 🌱🌱🌱🌱
ఒక చిన్న మొక్కనాటి
ప్రతిరోజూ వచ్చి కాయకాసిందా అని
చూడకూడదు.
ఎందుకంటే అది పెరగాలి
మొక్క వృక్షం కావాలి
పుష్పించాలి, పిందెలు రావాలి
అవి కాయలై , పండితే తినగలం.
అలాగే నేను ఇది కావాలి
అనే కోరిక కూడా మొలకై
వృక్షమై ఫలవంతం ఔతుందని తెలిసి
మసలుకోండి సన్నిహితులారా🌹
🌱🌱🌱🌱
జీవితంలో కష్టము,
కన్నీళ్ళు, సంతోషము,
భాధ ఏవి శాశ్వతంగా ఉండవు,
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు.
ఆనందం, ఆవేదన కూడా అంతే.
నవ్వులూ, కన్నీళ్ళూ
కలగలసినదే జీవితం.
కష్టమూ శాశ్వతం కాదు,
సంతోషమూ శాశ్వతమూ కాదు.
🌹🌹🌹🌹
ఓడిపోతే
గెలవడం నేర్చుకోవాలి,
మోసపోతే
జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి,
చెడిపోతే ఎలా
బాగుపడలో నేర్చుకోవాలి,
గెలుపును ఎలా పట్టుకోవాలో
తెలిసిన వాడికంటే
ఓటమిని ఎలా
తట్టుకోవాలో తెలిసిన వారే
గొప్ప వారు నేస్తమా !
🌱🌱🌱🌱
దెబ్బలు తిన్న రాయి
విగ్రహంగా మారుతుంది
కానీ దెబ్బలు కొట్టిన
సుత్తి మాత్రం ఎప్పటికీ
సుత్తిగానే మిగిలిపోతుంది....
ఎదురు దెబ్బలు తిన్నవాడు,
నొప్పి విలువ తెలిసిన వాడు
మహనీయుడు అవుతాడు...
ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు
ఎప్పటికీ ఉన్నదగ్గరే ఉండిపోతాడు...
🌱🌱🌱🌱
డబ్బుతో ఏమైనా
కొనగలమనుకుంటున్నారా
అయితే కొనలేనివి ఇవిగో
మంచం పరుపు కొనవచ్చు-
కానీ నిద్ర కాదు
గడియారం కొనవచ్చు:-
కానీ కాలం కాదు
మందులు కొనవచ్చు:-
కానీ ఆరోగ్యం కాదు
భవంతులు కొనవచ్చు :-
కానీ ఆత్మేయిత కాదు
పుస్తకాలు కొనవచ్చు :-
కానీ జ్ఞానం కాదు
పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చు
కానీ జీర్ణశక్తిని కాదు
🌹🌹🌹🌹🌹
ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే
అందరి కన్నా ముందు మేకలే జ్ఞానులు
కావాలి,
స్నానాలతోనే పాపాలు పోతే ముందు
చేపలే పాప విముక్తులు కావాలి,
తలక్రిందులుగా తపస్సు చేస్తేనే
పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు
గబ్బిలాలకే ఆ వరం దక్కాలి,
ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది
నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ
పరుగులు పెడితే ప్రయోజనమే లేదు,
నీలో లేనిది బయటేమీ
లేదు జాగ్రత్త: మేలుకో జనులరా
🙏🏻💐🌹✊🏻..
🙏🏻🌹🌹💐

Source - Whatsapp Message

కర్మకు బాధ్యులు.....

కర్మకు బాధ్యులు.....

ఒక రోజు పార్వతీదేవి ఈశ్వరుని తో...

మానవులు కర్మలు చేస్తుంటారు కదా.. ఆకర్మలను మానవుల చేత దేవుడు చేయిస్తుంటాడా.. లేక వారంతట వారు సంకల్పించి చేస్తుటారా అని అడిగారు...

అప్పుడు పరమశివుడు...

పార్వతీ ! దేవుడు ఏ పనీ చెయ్యడు. కాని దేవుడు మానవుడి కర్మలకు తన సహాయము అందిస్తాడు. మానవుడు చేసే కర్మలకు తగిన ఫలము అందిస్తాడు. ఏ పని చెయ్యాలో నిర్ణయించి కర్మలు చేసేది మానవుడే. ఇందులో దైవప్రమేయము ఏదీయు లేదు. పూర్వజన్మ కర్మఫలితంగా మానవుడు తను చేయవలసిన కర్మలను నిర్ణయించి కర్మలుచేస్తాడు.

మానవుడు పూర్వజన్మలో చేసే పనులు దైవములు అయితే, ఈ జన్మలో చేసే పనులు పౌరుషములు అనగా అవే పురుషప్రయత్నములు.

"ఒక పని చెయ్యడానికి మనిషి చేసే ప్రయత్నములు వ్యవసాయము వంటిది. దైవ సహాయము మొక్కకు అందించబడే గాలి, నీరు వంటిది."

నేలను తవ్వితే భూగర్భము నుండి నీరు ఉద్భవిస్తుంది. అలాగే ఆరణి మధిస్తే అగ్ని పుడుతుంది. అలాగే ఏ పనికైనా పురుషప్రయత్నము ఉంటేనే దైవము కూడా తోడై చక్కటి ఫలితాలను అందిస్తాడు. పురుషప్రయత్నము లేకుండా దైవము సహాయపడతాడని అనుకుంటే కేవలము దైవము చూస్తాడని ఊరకుంటే దేవుడు ఫలితాన్నివ్వడు.

కనుక పార్వతీ ! ఏ పని సాధించాలని అనుకున్నా పురుషప్రయత్నము తప్పక కావాలి. అప్పుడే దేవుడు సత్పఫలితాలను ఇస్తాడు...

|| ఓం నమః శివాయ ||

Source - Whatsapp Message

సప్తపది, పెళ్లిలో..ఏడడుగుల అర్ధం..!పరమార్థం..!!

సప్తపది

పెళ్లిలో..ఏడడుగుల అర్ధం..!పరమార్థం..!!

ఇద్దరు వ్యక్తులను,
రెండు కుటుంబాలను
ఒకటిగా చేసేదే వివాహ బంధం.

హిందూ సాంప్రదాయంలో వివాహ సమయంలో జరిగే వివిధ క్రతువులకు ప్రత్యేకమైన అర్ధం, పరమార్ధం ఉంది. అపరిచితులైన ఇద్దరు వ్యక్తులను మంత్రబద్ధంగా ఒకటి చేస్తుంది వివాహం.

పెండ్లి కుమారుడు కళ్యాణమండపానికి వచ్చిన తర్వాత కళ్యాణ దీక్షా కంకణం కడతారు పూరోహితులు. అమ్మాయి తల్లితండ్రులు వరునికి కాళ్లు కడిగి ,
తమ కన్నబిడ్డను ధర్మార్ధ, కామలలో తోడుగా ఉంటానని ప్రమాణం చేయించి కన్యాదానం చేస్తారు.

వివాహ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టి ,
పిమ్మట మాంగల్యధారణ జరుగుతుంది.
తలంబ్రాల కార్యక్రమం తర్వాత వధూవరుల కొంగు ముడులు కలిపి బ్రహ్మముడి వేస్తారు.

ఇప్పుడు జరిగేది సప్తపది......💐

భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం.
పురోహితుడు వధూవరులిద్దరిని అగ్నిసాక్షిగా జీవితాంతం ఒక్కటిగా కలిసి మెలిసి ఒకరికొకరు తోడుగా, నీడగా ఉంటామనే ప్రమాణాలు చేయిస్తాడు.

సప్తపది చట్టరీత్య కూడా ముఖ్యం .
దీని తరువాతే హిందూ వివాహo చట్టరీత్యా చెల్లినట్లు అవుతుంది .
ఈ సప్తపది తంతు ముగెసిన తరువాత భార్యకు ,
భర్త ఇంటి పేరు ,గోత్రం సంక్రమిస్తాయి.

వివాహంలో సప్తపది అతి ముఖ్యమైన ఘట్టం.
పరమ పావన మూర్తి అగ్నిహోత్రుడి సాక్షిగా,
అగ్నిహోత్రుడి చుట్టూ,
పాణి గ్రహణం తర్వాత వధూవరులిద్దరు,
వధువు కుడి కాలి అడుగుతో ఆరంభించి,
ఏడు అడుగులు వేయిస్తారు.
దీనిని 'సప్తపది' అని అంటారు.

సప్తపది అంటే ఏడడుగులు కలిసి నడవడం.
సభాసప్తపదాభవ.

ఇద్దరూ కలిసి ఏడడుగులు నడిస్తే మిత్రబంధం ఏర్పడుతుందని భావం.
అందుకే పెద్దలు వివాహబంధం ఏడడుగుల బంధం అని అంటారు.

మొదటి అడుగు.....💐
“ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు”
ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరిని
ఒక్కటి చేయుగాక!”

రెండవ అడుగు.....💐
“ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు”
ఈ రెండవ అడుగుతో విష్ణువు మనిద్దరికీ శక్తిని ఇచ్చుగాక

మూడవ అడుగు....💐
త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు”
ఈ మూడవ అడుగుతో విష్ణువు వివాహవ్రతసిద్ధిని అనుగ్రహించుగాక.

నాలుగవ అడుగు...💐
“చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు”
ఈ నాలుగవ అడుగుతో విష్ణువు మనకు ఆనందమును కలిగించుగాక.

ఐదవ అడుగు...💐
“పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు”
ఈ ఐదవ అడుగుతో విష్ణువు మనకు పశుసంపదను కలిగించుగాక.

ఆరవ అడుగు....💐
“షడృతుభ్యో విష్నుః త్వా అన్వేతు ”
ఈ ఆరవ అడుగుతో ఆరు ఋతువులు మనకు సుఖమును ఇచ్చుగాక.

ఏడవ అడుగు...💐
“సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు”
ఈ ఏడవ అడుగుతో విష్ణువు మనకు
గృహాస్తాశ్రమ ధర్మనిర్వహణకు అనుగ్రహమిచ్చుగాక.

💐సప్తపది మంత్రార్ధం గురించి తెలుసుకుందాం....💐

“సఖాసప్తపదాభవ! సఖాయౌ సప్తపదా బభూవ! సఖ్యంతే గమేయం సత్యాత్, తేమాయోషం సఖ్యాన్నే మాయోష్మాః సమయావః సంప్రియౌ రోచిష్ణూ సుమన సుమానౌ! ఇష మూర్జం అభిసంపసానౌ సం నౌమనాంసి సంవ్రతా సమచిత్తాన్యాకరం”

“ఓ నా అర్ధాంగి! ఈ ఏడడుగులతో నీవు నా స్నేహితురాలవయ్యావు.
ఈ స్నేహాన్ని ఎన్నటికీ వీడకుండా నాతో సహవాసిగా ఉండిపో.
ఒకరినొకరు విభేదించక సమానమైన ఆలోచనలతో కలిసి ఉందాము.
మన బంధం శాశ్వతమైనది.
నీవు నన్ను ఎన్నటికీ విడిచిపోరాదు” అంటాడు వరుడు.

“సాత్వమసి అమూహం! అమూహమస్మి! సాత్వం ద్యౌః అహం పృధివీ! త్వమ్ రేతో అహంరేతో భృత్ ! త్వం మనో అహమస్మివాక్! సామాహమస్మి! ఋక్తం సా మాం అనువ్రతాభవ !”

” ఓ స్వామి! నీవు ఎప్పుడూ ఎటువంటి పొరపాటు చేయకుండా ఉండుము.
నేను కూడా ఏ పొరపాటు చేయక నీతో కలిసి మెలిసి ఉంటాను.
నీవు ఆకాశమైతే నేను ధరణిని.
నీవు శుక్రమైతే నేను శోణితాన్ని.
నీవు మనసైతే నేను వాక్కును.
నేను సామవేదమైతే నీవు నన్ను అనుసరించే ఋక్కువు. మనిద్దరిలో బేధం లేదు.
ఎప్పటికీ ఒక్కటే.
కష్టసుఖాలలో ఒకరికొకరు తోడునీడగా కలిసి ఉందాము ” అని సమాధానమిస్తుంది పెళ్లి కూతురు.

ఎంత చక్కని సన్నివేశమిది..👌
భార్యను భర్త ఎలా ప్రేమించాలో, ఆదరించాలో ,
భర్తను భార్య ఎలా గౌరవించాలో వివాహ మంత్రాల్లొ స్పష్టంగా చెప్పబడింది.
కష్టసుఖాలను కలబోసి అనుభవిస్తూ జీవించడమే వివాహధర్మం.
ప్రతీ వివాహంలో కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న కలతలు, కలహాలు సహజమే.
అర్ధం చేసుకుని జీవించడమే భార్యభర్తల అనుభందం.

సప్తపది తర్వాత మరో ముఖ్యమైన వివాహ వేడుకలు, 'నాగవల్లి-సదశ్యం'.
ఆ తర్వాత అప్పగింతల కార్యక్రమం.
సదశ్యంలో బ్రాహ్మణులకు కానుకలు,
వధూవరులకు బట్టలు పెట్టే కార్యక్రమం ఉంటుంది. నాగవల్లిలో పెండ్లి కూతురుకు భర్తతో కాలి మెట్టెలు తొడిగించే కార్యక్రమం,
గుచ్చిన నల్లపూసల తాడును వధువు మెడలో కట్టించే కార్యక్రమం జరిపించుతారు.
నల్ల పూసలతాడును కూడా మూడు ముళ్ళు వేయించుతారు.
ఇక వధూవరులతో కలిసి సమీప బంధుమిత్రుల కోలాహలం మధ్య "బంతి భోజనాల" హడావిడి ఉంటుంది.
వధూవరులిద్దరిని పక్కపక్కన కూచోబెట్టి,
వెండి కంచాలలో ఇరువురికీ భోజనాలు వడ్డించి,
వరుసకు బావా-మరదళ్ళలాంటి వారి వేళాకోళాల మధ్య భోజనo చేయడం ఆరంభించుతారు అందరు.

మధ్యలో పాటలు, వధూవరులు ఒకరి కంచంలోది మరొకరి కంచంలో ఉంచడం,
పక్క వారందరూ తినమని బలవంతం చేయడం
అక్కడ జరిగే వేడుక.
ఇవన్నీ వధూవరుల మధ్య సాన్నిహిత్యాన్ని కలిగించడానికి చేసే వేడుకలు.
సనాతన ధర్ముము లోని సంప్రదాయాలు జీవిత పరమార్దము గురించి తెల్పుతాయి
ఇలాంటి వివాహ వ్యవస్థ ప్రపంచములో ఎక్కడ లేదు

ఆత్మల అనుసంధానం.💐
మానవుడు... కడుపులో ఉన్నప్పటి నుంచి,
తనువు చాలించేవరకు మొత్తం 16 కర్మలు ఉంటాయి. వాటిల్లో వివాహం అతి ప్రధానమైనది,
స్త్రీపురుషులు కలిసి ధర్మార్థకామమోక్షాలను సాధించుకోవడమే వివాహ పరమార్థం.

జీవిత భాగస్వామ్య వ్యవస్థ నుంచి రెండు ఆత్మలుగా ఏకమవ్వడమే వైవాహిక జీవితం.
పెళ్లితో స్త్రీపురుషుల అనుబంధానికి నైతికత ఏర్పడుతుంది.
లౌకికంగా ఏర్పడే అన్ని అనుబంధాలలోకి వివాహబంధం అతి ముఖ్యమైనది,
పవిత్రమైనది.
పెళ్లి వెనుక ఉన్న సృష్టి రహస్యం,
పెళ్లి పేరుతో జరిగే మంత్రోచ్చారణలు అన్నీ కలిసి దంపతులను సృష్టికారకులుగా నిలబెడుతున్నాయి.

Source - Whatsapp Message

దేవుడు ఒక్కడే ఐనప్పుడు హిందువులకి ఇంతమంది దేవుళ్ళు ఎందుకు?

దేవుడు ఒక్కడే ఐనప్పుడు హిందువులకి ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అని వ్యగ్యం గా మాట్లాడేవారికి నానా పాటేకర్ సరైన సమాధానం చెప్పాడు.

ఒకసారి ఒక ఆంగ్లేయుడు సత్యశోధన కోసం అనేక మత గ్రంధాలు శోధించాడు అయన స్వతహాగా క్రీస్టియన్. అన్ని మతాలు వెదికి చివరికి హిందూ సనాతనధర్మం లో ఉన్న రామాయణ, భారత, భాగవత, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు చదివాడు. ఎన్నో ఏళ్ల నుండి తను చేస్తున సత్యాన్వేషణ హిందూ సనాతన ధర్మం వలన లభించింది అని అన్నాడు.
అయితే హిందువుల్లో అంతమంది దేవుళ్ళు ఎందుకుంటారు అని అడిగేవాళ్లకు లేదా ఎగతాళి చేసేవాళ్లకు అయన ఇలా సమాధానం చెప్పాడు.
” తల్లి తన బిడ్డకి ఆకలి వేసినప్పుడు చేతిలో గరిటెలు పట్టుకుని అన్నపూర్ణా దేవిలా మారుతుంది. అమ్మా ఈ లెక్క నాకు అర్థం కాలేదు అంటే పుస్తకం తీసుకొని ఇలా చెయ్యమని సరస్వతి అవుతుంది. అమ్మ ఖర్చులకి డబ్బులు కావాలంటే తన చేతితో డబ్బు ఇచ్చి లక్ష్మిదేవిలా మారుతుంది. ఏదైనా తప్పు చేస్తే దండించి ఆదిపరాశక్తి లా మారిపోతుంది.
ఇలా ఎదురుగా ఉన్న తల్లి వివిధ సందర్భాలలో వివిధ రకాలైన అవతారాలు ధరిస్తుంటే, తను సృష్టి చేసిన దేవుడు తన పిల్లల కోసం ఎన్ని అవతారలైనా ధరిస్తాడు. అందుకే హిందూ మతంలో ఇన్ని మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారు ” అన్నాడు.
అలానే కాకుండా హిందూ ధర్మంలో ఉండి ఏమి లేదు అనుకునేవారు కూడా సరిగ్గా ఆరాధిస్తే ఆ ఫలితం తెలుస్తుంది. ఎలాగంటే… మంచు చూడడానికి మనకి ఒకేలా కనిపిస్తుంది. కాని ఆ మంచులో నివసించేవారు చెప్పే మాట “మంచులో మొత్తం 47 రకాలు ఉన్నాయి” అంటారు. దూరంగా ఉండే మనకి ఒకటే. కాని దగ్గరకి వెళ్లి పరిశీలించిన వారికే తెలుస్తుంది.
ఇటు తనవారికి సందేశం ఇచ్చాడు. మరో ప్రక్క అశ్రద్ధ చేస్తున్న మనకీ సందేశం ఇచ్చాడు.
విలువలు తెలుసుకోకపొతే కూలబడేది మనమే. మన సంప్రదాయాలు అశ్రద్ధ చేయకండి అంటూ నానా పాటేకర్ యావత్ భారత జాతికి ఈ విషయాన్నీ తెలియచేసాడు.
ఈ విషయం చదివిన తరువాత అయినా కొంత మంది అజ్ఞానులు ఇకముందు మళ్ళీ ఈ ప్రస్తావన తీసుకురారు అనుకుంటున్నా !

Source - Whatsapp Message

ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు .

ఎవరు రాసారో తెలియదు కానీ అత్యద్భుతంగా ఉంది

ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు .

మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన - ఆదర్శ పురుషుడు

మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన - అద్దం - రాముడు .

ధర్మం పోత పోస్తే రాముడు
ఆదర్శాలు రూపుకడితే రాముడు .
అందం పోగుపోస్తే రాముడు
ఆనందం నడిస్తే రాముడు

వేదోపనిషత్తులకు అర్థం రాముడు
మంత్రమూర్తి రాముడు .
పరబ్రహ్మం రాముడు .
లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు

ఎప్పటి త్రేతా యుగ రాముడు ?
ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ?
అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే

చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట -

శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.

బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన
పాట -
రామాలాలీ - మేఘశ్యామా లాలీ

మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష - సర్వజగద్రక్ష.

మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా

వినకూడని మాట వింటే అనాల్సిన మాట -
రామ రామ

భరించలేని కష్టానికి పర్యాయపదం -
రాముడి కష్టం .

తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు

కష్టం గట్టెక్కే తారక మంత్రం
శ్రీరామ .

విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ .

అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా

వయసుడిగిన వేళ అనాల్సిన మాట -
కృష్ణా రామా !

తిరుగులేని మాటకు - రామబాణం

సకల సుఖశాంతులకు - రామరాజ్యం .

ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన

ఆజానుబాహుడి పోలికకు - రాముడు

అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు- రాముడు

రాముడు ఎప్పుడూ మంచి బాలుడే .

చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా -
Rama killed Ravana ;

Ravana was Killed by Rama .

ఆదర్శ దాంపత్యానికి సీతారాములు

గొప్ప కొడుకు - రాముడు

అన్నదమ్ముల అనుబంధానికి -రామలక్ష్మణులు

గొప్ప విద్యార్ధి రాముడు
(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) .

మంచి మిత్రుడు- రాముడు
(గుహుడు చెప్పాడు).

మంచి స్వామి రాముడు
(హనుమ చెప్పారు).

సంగీత సారం రాముడు
(రామదాసు , త్యాగయ్య చెప్పారు) నాలుకమీదుగా తాగాల్సిన నామామృతం రామనామం
(పిబరే రామరసం)
సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు)

కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు జన్మ తరించడానికి - రాముడు , రాముడు, రాముడు .

రామాయణం పలుకుబళ్లు

మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది .

తెలుగులో కూడా అంతే .

ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని
అడిగినట్లే ఉంటుంది ...

చెప్పడానికి వీలుకాకపోతే -
అబ్బో అదొక రామాయణం .

జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే
సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ .

ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే -
అదొక పుష్పకవిమానం

కబళించే చేతులు , చేష్టలు
కబంధ హస్తాలు .

వికారంగా ఉంటే -
శూర్పణఖ

చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ).

పెద్ద పెద్ద అడుగులు వేస్తే -
అంగదుడి అంగలు.

మెలకువలేని నిద్ర
కుంభకర్ణ నిద్ర

పెద్ద ఇల్లు
లంకంత ఇల్లు .

ఎంగిలిచేసి పెడితే -
శబరి

ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు

అల్లరి మూకలకు నిలయం
కిష్కింధ కాండ

విషమ పరీక్షలన్నీ మనకు రోజూ -
అగ్ని పరీక్షలే .

పితూరీలు చెప్పేవారందరూ -
మంథరలే.

సాయం చేసినపుడు- ఉడుత భక్తి..
కార్యాన్ని సాధించినపుడు -హనుమ యుక్తి..
గొడవ కు దిగే వాళ్ళ పేరు - లంకిని

యుద్ధమంటే రామరావణ యుద్ధమే .

ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ -
(రావణ కాష్టాలే .)

కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది
(ఇది విచిత్రమయిన ప్రయోగం ).

సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు . బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు

ఒంటిమిట్టది ఒక కథ ..
భద్రాద్రిది ఒక కథ
అసలు రామాయణమే మన కథ .
అది రాస్తే రామాయణం
చెబితే మహా భారతం

అందుకే కీ.శే. సర్వేపల్లిరాధాకృష్ణన్ గారు అన్నారు హిందుయిజమ్ ఒక మతం కాదు
అది ఒక జీవన విధానం

అందుకే ఇప్పటి South Asian దేశాలు ఇస్లాం, బౌద్ధమతాలను ఆచరించినా వారి దైనందిక జీవన విధానాలో రామాయణం ఎంతగా పెనవేసుకు పోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు

రామాయణకథలు మనకంటే చక్కగా Muslim majority దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు

జై శ్రీ రామ్.....

|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది

జై శ్రీరామ్

Source - Whatsapp Message

మనిషి ఇరుక్కున్నాడు...గ్లోబలైజేషన్ లో...

🤔మనిషి ఇరుక్కున్నాడు...
గ్లోబలైజేషన్ లో...🤔

👉డ్రమ్ముల మోతను సంగీతమంటున్నారు.!

👉పీలికబట్టల్ని
వస్త్ర ధారణ అంటున్నారు.!

👉భౌతిక అకర్షణను ప్రేమని పిలుస్తున్నారు.!

👉సహజీవనాన్ని సంసారమంటున్నారు.!

👉గ్రాఫిక్ గిమ్మిక్కులను సినిమా అంటున్నారు.!

👉డూప్ ల పోరాటాన్ని
హీరోయిజం అంటున్నారు.!

👉పదవుల పోరాటాన్ని
ప్రజాస్వామ్యమంటున్నారు

👉అధికార ఆరాటాన్ని రాజకీయమంటున్నారు.!

👉ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు.!

👉సరదాలను సంస్కృతి అంటున్నారు.!

👉భుక్తి మార్గాన్ని చదువు అంటున్నారు.!

👉కోరిన కోర్కెలు తీరిస్తేనే... దేవుడంటున్నారు.!

👉ఆస్తి ఉంటేనే... గొప్పవాడు అంటున్నారు.!

👉మందు పోయిస్తేనే...
మిత్రుడు అంటున్నారు.!

👉కట్నం తెస్తేనే...
భార్య అంటున్నారు.!

👉సొమ్ములు తెస్తేనే...
సంసారం అంటున్నారు.!

👉కాసులు తెస్తేనే...
కాపురం అంటున్నారు.!

👉 నిజాయితీగా ఉంటే... అసమర్ధుడంటున్నారు.!

👉 సక్రమంగా ఉంటే... అమాయకుడంటున్నారు.!

👉అసత్యాలు మాట్లాడితే...
బ్రతక నేర్చిన వాడంటున్నారు.!

👉నిజం పలికితే...
బ్రతక నేర్వని వాడంటున్నారు.!

👉న్యాయబద్ధంగా ఉంటే...
ఎలా బ్రతుకుతాడో అంటున్నారు.!

👉అన్యాయంగా బ్రతికినా...
ఎంచక్కా ఉన్నాడంటున్నారు.!

👉అన్యాయాన్ని ఎదిరిస్తే...
అతనికెందుకు అంటున్నారు.!

👉నిజాయితీగా బ్రతికితే... కూడుపెడుతుందా అంటున్నారు.!

👉మాయకమ్మిన జీవితాన్ని శాశ్వతమనుకుంటున్నారు.!

👉మరణమనే మహా సత్యాన్ని విస్మరిస్తున్నారు.!

👉 పరిస్థితులకు అనుగుణంగా. పాత అర్ధం చెరిగిపోయి,
ప్రయోజనాలకు అండగా...
పరమార్ధం ఆవిర్భవిస్తోంది.!

🤔స్వార్ధ కాంక్షాణుగుణంగా... విపరీతార్ధం ఆవిష్కృతమవుతోంది.!🤔

ఇదే గ్లోబలైజేషన్ మహిమ అంటే

🔥 టెక్నాలజీ పెరిగింది...
🔥 సౌకర్యం పెరిగింది...
🔥 విలాసం పెరిగింది...
🔥 విజ్ఞానం పెరిగింది...
🔥 కాలుష్యం పెరుగింది...
🔥 ఖర్చు పెరిగింది...
🔥 కల్తీ పెరిగింది...
🔥 రసాయన బంధం పెరిగింది...
🔥 అన్నీ పెరిగాయి...

కానీ! పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు
మన ఆయుష్ ప్రమాణం మాత్రం 50% పైగా తగ్గింది

సర్వే జనా సుఖినోభవంతు 🙏

🏀🏀🏀🏀🏀🏀🏀🏀

Source - Whatsapp Message

Tuesday, March 30, 2021

జంతు బలుల యొక్క అంతరార్థం ఏమిటి?

🐑జంతు బలుల యొక్క అంతరార్థం ఏమిటి?🐏

శ్రీ విద్యా సంప్రదాయం మరియు కొన్ని ఇతర సనాతన ధర్మ ( హైందవ ) ఆచారాలలో కొంతమంది దేవతలకు జంతు బలులు సమర్పిస్తారు. దానిలోని అంతరార్థం ఏమిటి ?

సనాతన ధర్మంలోని కొన్ని సంప్రదాయాలలో తమ కోరికలు నెరవేర్చుకోవడాని కానీ మొక్కుబడిగా కానీ జంతు బలులు ఇచ్చే ఆచారం ఉన్నది. కానీ సనాతన ధర్మం లోని అన్ని విషయాలు మనుష్యుల మరియు ఇతర ప్రాణుల యొక్క హితం కోసం చెప్పబడ్డాయి. లోకమంతా సుఖంగా ఉండాలీ అన్న సనాతన ధర్మం , దానికి మూలం ఐన ఆ భగవంతుడూ ఒకరి కోరికలు తీర్చడానికి ఇంకొక ప్రాణాన్ని బలి కోరతాడా?

బలి అంటే :

గుడిలోని బలిపీఠం సనాతన ధర్మంలో భూతబలి అనే ఆచారం స్పష్టంగా చెప్పబడింది. ప్రజలు తాము ఇంటిలో వండిన అన్నమును కానీ ఇతర పదార్థమును కానీ గుడిలో వివిధ దిక్కులలో కానీ బలి పీఠం వద్ద కానీ ఉంచుతారు. వాటిని జంతువులూ ప్రకృతిలోని ఉగ్ర భూతములూ తింటాయి. ఇది గృహస్తులు కూడా ఇంటివద్ద చేయాల్సిన పనిగా చెప్పబడింది. ఐతే బలికి హోమానికి తేడా ఉన్నది హోమం అగ్ని ద్వారా ఇస్తారు. ప్రకృతిలోని ఇతర ప్రాణులకూ కూడా ఆహారం అందించే మంచి ఉద్దేశ్యముతో ఇది చెప్పబడినది.

ఆచరణలో దోషం :

శ్రీ విద్య మొదలైన సంప్రదాయాలలో జంతు బలుల ప్రస్థావన ఉన్నది. అవి దేవతలకు ఒక పొట్టేలునో మేకపోతునో నల్లపిల్లినో దున్నపోతునో బలి ఇవ్వమని చెప్పాయి. ఐతే దాని అర్థం ఒక అమాయకమైన జంతువును దేవుడి పేరు చెప్పి అన్యాయంగా హత్య చేయమని కాదు.

నల్ల పిల్లి దొంగతనానికి సంకేతం. అందుకే పిల్లిలా వచ్చాడు రా అంటూ ఉంటారు. చప్పుడు చేయకుండా వచ్చి చీకట్లో దొంగతనం చేయడంలో పిల్లిని ఉదాహరణగా చెప్తారు. ఇక నల్ల పిల్లి ఐతే అసలే కనపడదు. నల్ల పిల్లిని బలియ్యి అంటే నీలోని పరుల సొమ్ముపై ఉన్న ఆశ అనే నల్ల పిల్లిని బలియ్యి అని అంతే కానీ ఒక నల్ల పిల్లిని చంపేయమని కాదు.

మేకపోతు లేక పొట్టేలు మూర్ఖత్వానికి ప్రతీకలు. ఒకటి ఎటు వెళితే మిగిలినవి కూడా అనుసరించి వెళ్ళిపోతూ ఉంటాయి. నీలోని మూర్ఖత్వాన్ని బలి ఇవ్వడం ద్వారా చేసిన కర్మ వలన మరలా పునర్జన్మ వస్తుంది అనే సత్యం తెలుసుకుని మోక్ష మార్గం లో ప్రయాణించవచ్చు.

దున్నపోతు పిరికితనానికీ బద్దకానికీ జడత్వానికి ( చైతన్యం లేకపోవుట )ప్రతీక. నిలోని జడత్వాన్ని వదిలి చైతన్యం వైపూ బద్దకాన్ని విడిచి ఉన్నతమైన జీవితం వైపూ నాకేమౌతుందో అన్న పిరికితనం లో ఉన్న శరీరం పైన మోహాన్ని త్యజించి మోక్షం వైపూ ప్రయాణించమని దాని అర్థం.

ఆ విధంగా మనలోని లోపాలను బలియ్యమని శాస్త్రాలు చెప్పాయి తప్ప జీవహింస చేయమని కాదు.

మూఢనమ్మకం:

కోరికల కోసం జంతుబలులు ఇవ్వడం అనేది ఒక మూఢనమ్మకం మాత్రమే. భాగవతంలో కృష్ణుడిచే పశూమ్ దృశ్యంతి విశబ్దా: అని బలి పేరిట అన్యాయంగా చంపివేయబడ్డ జంతువులు స్వర్గంలో చంపినవాడిపై పగతో ఎదురుచూస్తాయి అని చెప్పబడింది.

అదేవిధంగా భగవద్గీత ప్రతి జీవి దేవుడి దృష్టిలో సమానం అని చెప్పినది – భగవద్గీత , 5.18

ఒక కాలంలో చారిత్రక తప్పిదంగా ఏర్పడిందే తప్ప సనాతన ధర్మంలో జంతుబలి లేదు. అశ్వం నైవా గజంనైవ వ్యాఘ్రం నైవచ నైవచ … అంటూ పూర్వం చెప్పిన రీతిలో గుఱ్ఱమును ఏనుగును పులులను చంపలేరు కనుక లోకువగా దొరికిన మేకను దేవుని పేరుతో చంపినారు అని,

ఋగ్వేదంలో దున్నపోతుల,మేకపోతుల బలులు బ్రాహ్మణులు అర్పించి ఇంద్రిణ్ణి తృప్తి పరిచారు అని ఉన్నది. ఇంద్రడు ఇంద్రియములకు దేవత. అంటే వారి ఇంద్రియాలలో మనసులో లోపాలను బలిగా సమర్పించారు అనే తప్ప చంపేశారు అని కాదు.

వేదాలు ఇతర ఐతిహాసిక గ్రంథాలు పుస్తకరూపంలో రావడం వలనా గురువు వద్ద నేర్చుకోకుండా వారి వారి సొంత అభిప్రాయాలకు రావడం వలన ఏర్పడిన తప్పిదమే తప్ప మరొకటి కాదు.

ఇప్పుడు మనకు జంతు బలుల యొక్క అంతరార్థం తెలిసింది కనుక ఇకనైనా విచక్షణతో ప్రవర్తిద్దాం. అమాయకమైన జంతువులను బతకనిద్దాం.

ఓం నమో నారాయణాయ🙏

Source - Whatsapp Message

సమభావం బహు ముఖ్యం

🌞సమభావం బహు ముఖ్యం 🌞

🍁ఒకోసారి కొన్ని పిచ్చి భావాలు ఏర్పడతాయి.

"నేనే అందరికంటే గొప్పఅన్న భావం.
మనకు తరుచుగా వస్తూ ఉంటుంది.
"నేనే గొప్ప"
"నాకన్నా గొప్పవారు లేరు" అంటూ,
ఇదే భావాన్ని మాటిమాటికీ జపిస్తూ మనలో అహంకారంని పెంచి పోషిస్తూ ఉంటాము.

అందరూ తనని గుర్తించాలి అని,
తనని మాత్రమే పొగడాలనే దుగ్ధ ఎక్కువ అవుతుంది. పొగడ్తలు వెతుక్కుంటుది.
పొగిడేవాళ్ళని దగ్గరకు చేర్చుతుంది.
ఇలా ఉంటుంది సోత్కర్ష ( "స్వగొప్ప తనం").
తనని తాను అందరికన్నా బిన్నుడనే భావమే అహంకారం.
ఇలా ప్రత్యేకత ఏర్పర్చుకొని,
తనకి తాను గిరి గీసు కొని
కూర్చోవడం మనకి బాగా అలవాటు అయిపోయింది.

ఇది పెరిగి పెరిగి ,
నా సాంప్రదాయము,
నా కులం,
నా మతం,
ఇవే గొప్ప అని,
మిగిలినవి పనికి రావని విభేదించడం అలవాటైపోయింది.
ఇక ఇది మనం కొలిచే దైవానికి కూడా చేరిపోయింది. మన వ్యక్తిగత దైవము మాత్రమే దైవము అని అంతకు మించి వెరే దైవం లేదని ఇతరులతో
స్పర్ధలు పెంచుకున్నాం.

ఇలా మనని మనం గొప్ప గా ఊహిస్తూ,
మన సాంప్రదాయము,
మన కులం,
మన మతం అంటూ కాలక్షేపం చేస్తున్నాం,
మన అంతరంగాన్ని స్పర్ధ లతో నింపేశాము.

ఇదా మనకు జ్ఞానం నేర్పింది?
జ్ఞానం అంటే ఇలా విభేదాలకు పెంచు కుంటూ పోవడమా?
అసలు జ్ఞానం అంటె ఏమిటి?
జ్ఞానం మన అజ్ఞానాన్ని తొలగించాలి.
జ్ఞానం ఒక వెలుగు లాంటిది
చీకటిని తొలగించాలి.
సత్య ఆవిష్కరణ జరగాలి.
అంతవరకు ఉన్న అజ్ఞాన భావాలు పారి పోవాలి.

మరి ఏమిటా జ్ఞానం?

చాలా సింపుల్ గా చెప్పాలి అంటే
"అబేధ దర్శనం జ్ఞానము" అంటుంది ఒక ఉపనిషత్తు. ఇందులో ఎంతో విషయం ఉంది.

"అబేధము" అంటే "సమభావం" ఉండడము.

భౌతికము లో అన్ని రెండుగా కనిపిస్తాయి.
శరీర ధారణ జరగగానే
"నేను - శరీరం" అన్న ధ్వందము, ఏర్పడింది.
ఈ ధ్వందం "నేను నాది"
అన్న దానిలో స్థిర పడింది.
"నేను నా వాళ్ళు",
"నేను నా ఇల్లు",
"నేను నా కులం",
"నేను నా మతం",
"నేను నా దైవం".
ఇలా నా కన్నా భిన్నమైనది
ఇంకొకటి ఉంది,
అది నాది అన్న భావం ఏర్పడింది.
నేను ఇతరులకన్న గొప్ప,
నేను ఉన్నది,
నేను భావిస్తున్నది,
అది
కులం కానీ,
మతం కానీ
దైవం కానీ
నాది మాత్రమే గొప్ప,
నా దగ్గర ఉన్నది వేరేవారి దగ్గర ఉండడానికి వీలు లేదు.
ఇలా ధ్వందం లో కొట్టుకు పోతున్నాము.

మరి జ్ఞానం ఏమంటోంది
సమ భావము ఉంచుకో అంటోంది.
భాహ్యనికి అన్ని రెండుగా కనిపించవచ్చు కాని,
అన్ని ఒకటే అన్న భావం ఉంచుకో అంటోంది.

నువ్వు నేను అంటున్నది పరిమితం చేసుకోకు దానిని విస్తరించు అంటోంది జ్ఞానం.
నీకు కనబడే దానిలో,
నువ్వు చూసే వ్యక్తులలో,
ఈ నేను నీ విస్తరించుకో అంటోంది.

కులం అన్నది వృత్తి బట్టి ఏర్పడింది, అని అసలు వృత్తులు వేరు
అవి అందరిలో సమంగా ఉన్నాయి అంటోంది జ్ఞానం.

ఉదాహరణకి నిద్ర ఒక వృత్తి,
ఇంద్రియముల ద్వారా జ్ఞానం గ్రహించడం ఇంకొక వృత్తి.
ఇలా వృత్తులు అందరికి ఒకటే.

మతం అంటే దైవం పట్ల ఒక నిశ్చిత అభిప్రాయం. నిరాకార, నిర్గుణ నామ రహిత పరమాత్మ పై ఒకే అభిప్రాయం ఉంటుంది
కానీ వేరే వేరే అభిప్రాయాలు ఉండడానికి వీలు లేదు.

ఇలా సమ భావం పెంచుకుంటూ పోవాలి.
మన భావలలో సమభావము రావాలి.
ప్రకృతి లో జరిగే మార్పుల పై సమభావం ఉండాలి, కర్మ ఫలాలపైన సమభావం ఉండాలి.
ఇక్కడ సమభావము ఆ కర్మలో జయం అపజయం పై (success or failure పై).

ఇలా సమభావాని పెంచుకుంటూ పోతే మన.అజ్ఞానం తొలిగి జ్ఞానంలో ఉంటాము.
🍁🌞🍁🌞🍁🌞సేకరణ. మానస సరోవరం.

Source - Whatsapp Message

సృష్టి రహస్య విశేషాలు

సృష్టి రహస్య విశేషాలు

1 సృష్టి ఎలా ఏర్పడ్డది

2 సృష్టి కాల చక్రం ఎలా నడుస్తుంది

3 మనిషిలో ఎన్ని తత్వాలున్నాయి

( సృష్ఠి ) ఆవిర్బావము

1 ముందు (పరాపరము) దీనియందు శివం పుట్టినది
2 శివం యందు శక్తి
3 శక్తి యందు నాదం
4 నాదం యందు బిందువు
5 బిందువు యందు సదాశివం
6 సదాశివం యందు మహేశ్వరం
7 మహేశ్వరం యందు ఈశ్వరం
8 ఈశ్వరం యందు రుద్రుడు
9 రుద్రుని యందు విష్ణువు
10 విష్ణువు యందు బ్రహ్మ
11 బ్రహ్మ యందు ఆత్మ
12 ఆత్మ యందు దహరాకాశం
13 దహరాకాశం యందు వాయువు
14 వాయువు యందు అగ్ని
15 అగ్ని యందు జలం
16 జలం యందు పృద్వీ.
17 పృద్వీ యందు ఓషధులు
18 ఓషదుల వలన అన్నం
19 ఈ అన్నము వల్ల నర మృగ పశు పక్షి స్థావర జంగమాదులు పుట్టినవి.

( సృష్ఠి ) కాల చక్రం

పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.
ఇప్పటివరకు ఏంతో మంది శివులు ఏంతోమంది విష్ణువులు ఏంతోమంది బ్రహ్మలు వచ్చారు. ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.
1 కృతయుగం
2 త్రేతాయుగం
3 ద్వాపరయుగం
4 కలియుగం
నాలుగు యుగలకు 1 మహయుగం.
71 మహ యుగలకు 1మన్వంతరం.
14 మన్వంతరాలకు ఒక సృష్ఠి ఒక కల్పం.
15 సందులకు ఒక ప్రళయం ఒక కల్పం
1000 యుగలకు బ్రహ్మకు పగలు సృష్ఠి .
1000 యుగాలకు ఒక రాత్రి ప్రళయం.
2000 యుగాలకు ఒక దినం.
బ్రహ్మ వయస్సు 51 సం.
ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.
1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.
7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.
14 మంది మనువులు.
ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం. శ్వేతవారహ యుగంలో ఉన్నాం.

5 గురు భాగన కాలంకు 60 సం
1 గురు భాగన కాలంకు 12 సం
1 సంవత్సరంకు 6 ఋతువులు.
1 సంవత్సరంకు 3 కాలాలు.
1 రోజుకు 2 పూటలు పగలు రాత్రి
1 సం. 12 మాసాలు.
1 సం. 2 ఆయనాలు
1సం. 27 కార్తెలు
1 నెలకు 30 తిధులు
27 నక్షత్రాలు - వివరణలు
12 రాశులు
9 గ్రహాలు
8 దిక్కులు
108 పాదాలు
1 వారంకు 7 రోజులు
పంచాంగంలో 1 తిధి. 2 వార. 3 నక్షత్రం. 4 కరణం. 5 యోగం.

సృష్ఠి యవత్తు త్రిగుణములతోనే ఉంటుంది

అన్ని జీవులలో మూడే గుణములు ఉంటాయి

1 సత్వ గుణం
2 రజో గుణం
3 తమో గుణం

( పంచ భూతలు )

1 ఆకాశం
2 వాయువు
3 అగ్ని
4 జలం
5 భూమి
.
5 ఙ్ఞానింద్రియంలు
5 పంచ ప్రాణంలు
5 పంచ తన్మాత్రలు
5 ఆంతర ఇంద్రియంలు
5 కర్మఇంద్రియంలు = 25 తత్వంలు

ఆకాశ పంచికరణంలు

ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల ( జ్ఞానం )
ఆకాశం - వాయువులో కలవడం వల్ల ( మనస్సు )
ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల ( బుద్ది )
ఆకాశం - జలంతో కలవడంవల్ల ( చిత్తం )
ఆకాశం - భూమితో కలవడంవల్ల ( అహంకారం ) పుడుతున్నాయి

వాయువు పంచికరణంలు

వాయువు - వాయువుతో కలవడం వల్ల ( వ్యాన)
వాయువు - ఆకాశంతో కలవడంవల్ల ( సమాన )
వాయువు - అగ్నితో కలవడంవల్ల ( ఉదాన )
వాయువు - జలంతో కలవడంవల్ల ( ప్రాణ )
వాయువు - భూమితో కలవడంవల్ల ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.

అగ్ని పంచికరణములు

అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల ( శ్రోత్రం )
అగ్ని - వాయువుతో కలవడంవల్ల ( వాక్కు )
అగ్ని - అగ్నిలో కలవడంతో ( చక్షువు )
అగ్ని - జలంతో కలవడంతో ( జిహ్వ )
అగ్ని - భూమితో కలవడంతో ( ఘ్రాణం ) పుట్టేను.

జలం పంచికరణంలు

జలం - ఆకాశంలో కలవడంవల్ల ( శబ్దం )
జలం - వాయువుతో కలవడంవల్ల ( స్పర్ష )
జలం - అగ్నిలో కలవడంవల్ల ( రూపం )
జలం - జలంలో కలవడంవల్ల ( రసం )
జలం - భూమితో కలవడం వల్ల ( గంధం )పుట్టేను.

భూమి పంచికరణంలు

భూమి - ఆకాశంలో కలవడంవల్ల ( వాక్కు )
భూమి - వాయువుతో కలవడం వల్ల ( పాని )
భూమి - అగ్నితో కలవడంవల్ల ( పాదం )
భూమి - జలంతో కలవడంతో ( గూహ్యం )
భూమి - భూమిలో కలవడంవల్ల ( గుదం ) పుట్టేను.

( మానవ దేహ తత్వం ) 5 ఙ్ఞానింద్రియంలు

1 శబ్ద
2 స్పర్ష
3 రూప
4 రస
5 గంధంలు.

5 ( పంచ తన్మాత్రలు )

1 చెవులు
2 చర్మం
3 కండ్లు
4 నాలుక
5 ముక్కు

5 ( పంచ ప్రాణంలు )
,
1 అపాన
2 సామనా
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యాన

5 ( అంతఃర ఇంద్రియంలు ) 5 ( కర్మఇంద్రియంలు )
,
1 మనస్సు
3 బుద్ది
3 చిత్తం
4 జ్ఞానం
5 ఆహంకారం
.
1 వాక్కు
2 పాని
3 పాదం
4 గుహ్యం
5 గుదం

6 ( అరిషడ్వర్గంలు )
,
1 కామం
3 క్రోదం
3 మోహం
4 లోభం
5 మదం
6 మచ్చార్యం

3 ( శరీరంలు )

1 స్థూల శరీరం
2 సూక్ష్మ శరీరం
3 కారణ శరీరం
.
3 ( అవస్తలు )

1 జాగ్రదవస్త
2 స్వప్నవస్త
3 సుషుప్తి అవస్త
.
6 ( షడ్బావ వికారంలు )

1 ఉండుట
2 పుట్టుట
3 పెరుగుట
4 పరిణమించుట
5 క్షిణించుట
6 నశించుట

6 ( షడ్ముర్ములు )

1 ఆకలి
2 దప్పిక
3 శోకం
4 మోహం
5 జర
6 మరణం

7 ( కోశములు ) ( సప్త ధాతువులు )

1 చర్మం
2 రక్తం
3 మాంసం
4 మేదస్సు
5 మజ్జ
6 ఎముకలు
7 శుక్లం

3 ( జీవి త్రయంలు )

1 విశ్వుడు
2 తైజుడు
3 ప్రఙ్ఞాడు

3 ( కర్మత్రయంలు )

1 ప్రారబ్దం కర్మలు
2 అగామి కర్మలు
3 సంచిత కర్మలు

5 ( కర్మలు )

1 వచన
2 ఆదాన
3 గమన
4 విస్తర
5 ఆనంద

3 ( గుణంలు )

1 సత్వ గుణం
2 రజో గుణం
3 తమో గుణం

9 ( చతుష్ఠయములు )

1 సంకల్ప
2 అధ్యాసాయం
3 అభిమానం
4 అవధరణ
5 ముదిత
6 కరుణ
7 మైత్రి
8 ఉపేక్ష
9 తితిక్ష

10 ( 5 పంచభూతంలు పంచికరణ చేయనివి )
( 5 పంచభూతంలు పంచికరణం చేసినవి )

1 ఆకాశం
2 వాయువు
3 ఆగ్ని
4 జలం
5 భూమి

14 మంది ( అవస్థ దేవతలు )

1 దిక్కు
2 వాయువు
3 సూర్యుడు
4 వరుణుడు
5 అశ్వీని దేవతలు
6 అగ్ని
7 ఇంద్రుడు
8 ఉపేంద్రుడు
9 మృత్యువు
10 చంద్రుడు
11 చతర్వకుడు
12 రుద్రుడు
13 క్షేత్రజ్ఞుడు
14 ఈశానుడు

10 ( నాడులు ) 1 ( బ్రహ్మనాడీ )

1 ఇడా నాడి
2 పింగళ
3 సుషుమ్నా
4 గాందారి
5 పమశ్వని
6 పూష
7 అలంబన
8 హస్తి
9 శంఖిని
10 కూహు
11 బ్రహ్మనాడీ

10 ( వాయువులు )

1 అపాన
2 సమాన
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యానా

6 కూర్మ
7 కృకర
8 నాగ
9 దేవదత్త
10 ధనంజమ

7 ( షట్ చక్రంలు )

1 మూలాధార
2 స్వాదిస్థాన
3 మణిపూరక
4 అనాహత
5 విశుద్ది
6 ఆఙ్ఞా
7 సహస్రారం

( మనిషి ప్రమాణంలు )

96 అంగళంలు
8 జానల పొడవు
4 జానల వలయం
33 కోట్ల రోమంలు
66 ఎముకలు
72 వేల నాడులు
62 కీల్లు
37 మురల ప్రేగులు
1 సేరు గుండే
అర్ద సేరు రుధిరం
4 సేర్లు మాంసం
1 సరేడు పైత్యం
అర్దసేరు శ్లేషం

( మానవ దేహంలో 14 లోకలు ) పైలోకలు 7

1 భూలోకం - పాదాల్లో
2 భూవర్లలోకం - హృదయంలో
3 సువర్లలోకం - నాభీలో
4 మహర్లలోకం - మర్మంగంలో
5 జనలోకం - కంఠంలో
6 తపోలోకం - భృమద్యంలో
7 సత్యలోకం - లాలాటంలో

అధోలోకలు 7

1 ఆతలం - అరికాల్లలో
2 వితలం - గోర్లలో
3 సుతలం - మడమల్లో
4 తలాతలం - పిక్కల్లో
5 రసాతలం - మొకల్లలో
6 మహతలం - తోడల్లో
7 పాతాళం - పాయువుల్లో

( మానవ దేహంలో సప్త సముద్రంలు )

1 లవణ సముద్రం - మూత్రం
2 ఇక్షి సముద్రం - చేమట
3 సూర సముద్రం - ఇంద్రియం
4 సర్పి సముద్రం - దోషితం
5 దది సముద్రం - శ్లేషం
6 క్షిర సముద్రం - జోల్లు
7 శుద్దోక సముద్రం - కన్నీరు

( పంచాగ్నులు )

1 కాలగ్ని - పాదాల్లో
2 క్షుదాగ్ని - నాభీలో
3 శీతాగ్ని - హృదయంలో
4 కోపాగ్ని - నేత్రంలో
5 ఙ్ఞానాగ్ని - ఆత్మలో

7 ( మానవ దేహంలో సప్త దీపంలు )

1 జంబు ద్వీపం - తలలోన
2 ప్లక్ష ద్వీపం - అస్తిలోన
3 శాక ద్వీపం - శిరస్సుప
4 శాల్మల ధ్వీపం - చర్మంన
5 పూష్కార ద్వీపం - గోలమందు
6 కూశ ద్వీపం - మాంసంలో
7 కౌంచ ద్వీపం - వేంట్రుకల్లో

10 ( నాధంలు )

1 లాలాది ఘోష - నాధం
2 భేరి - నాధం
3 చణీ - నాధం
4 మృదంగ - నాధం
5 ఘాంట - నాధం
6 కీలకిణీ - నాధం
7 కళ - నాధం
8 వేణు - నాధం
9 బ్రమణ - నాధం
10 ప్రణవ - నాధం

Source - Whatsapp Message

భరతమాత ముద్దుబిడ్డకి దక్కిన అరుదైనగౌరవం

భరతమాత ముద్దుబిడ్డకి దక్కిన అరుదైనగౌరవం:

ఐక్యరాజ్య సమితి (UNO) 14 ఏప్రిల్ ను బాబాసాహేబ్ జన్మదినం ను "విశ్వ విజ్ఞాన దివస్ ''గా జరుపు కోవాలని -ప్రకటించింది!!!

ఇది భారతియులందరికి గౌరవప్రదమైన విషయం..

.
.
ప్రపంచంలో అందరి కంటే ఎక్కువ విద్య ను ఆర్జించిన బాబాసాహేబ్!!!

బాబాసాహేబ్ డా"భీంరావ్ అంబేడ్కర్ ను ప్రపంచంలోనే అత్యధిక విద్య సంపన్నునిగా ప్రక-టించారు.

బాబాసాహేబ్ వద్ద 16 డిగ్రీలు అలాంటి డిగ్రీలు ఇ-ప్పటికీ ఎవరి వద్ద లేవు.

ఆయన వద్ద సమాచారం లేని రంగమంటు ఏది లేదు. ఆయన న్యూయార్క్ లో 2000 వేల ప్రాచీన గ్రథాలను కొన్నారు.

లండన్ లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశాల సందర్భంగా ఆయన కొన్న పుస్త కాలు 32 పెట్టెల లో అమర్ఛి తీసుకొచ్చారు.

అంతేకాదు లండన్ గ్రంథాలయం లో 1౦౦౦ రోజుల లొ 16000 వేలపుస్తకాలు చదివిన రికార్డు ఆయన పేరు మీదనే ఉన్నది.

ప్రపంచంలో అందరికంటే మహాజ్ఞాని ఎవరంటే భారతదేశం గుర్త కు వస్తుంది. అది ఎవరో కాదు బాబాసాహేబ్ అంబేడ్కరే.

Have you seen any person in world with such bio-data?
(1891-1956)

B.A., M.A., M.Sc., D.Sc., Ph.D., L.L.D.,
D.Litt., Barrister-at-La w.
B.A.(Bombay University)
Bachelor of Arts,
MA.(Columbia university) Master
Of Arts,
M.Sc.( London School of
Economics) Master
Of Science,
Ph.D. (Columbia University)
Doctor of
philosophy ,
D.Sc.( London School of
Economics) Doctor
of Science
L.L.D.(Columbia University)
Doctor of
Laws ,
D.Litt.( Osmania University)
Doctor of
Literature,
Barrister-at-La (Gray's Inn,
London) law
qualification for a lawyer in
royal court of
England.
Elementary Education, 1902
Satara,
Maharashtra
Matriculation, 1907,
Elphinstone High
School, Bombay Persian etc.,
Inter 1909,Elphinston e
College,Bombay
Persian and English
B.A, 1912 Jan, Elphinstone
College, Bombay,
University of Bombay,
Economics & Political
Science
M.A 2-6-1915 Faculty of Political
Science,
Columbia University, New York,
Main-
Economics
Ancillaries-Soc iology, History
Philosophy,
Anthropology, Politics
Ph.D 1917 Faculty of Political
Science,
Columbia University, New York,
The
National Divident of India - A
Historical and
Analytical Study'
M.Sc 1921 June London School
of
Economics, London 'Provincial
Decentralizatio n of Imperial
Finance in
British India'
Barrister-at- Law 30-9-1920
Gray's Inn,
London Law
D.Sc 1923 Nov London School,
of
Economics, London 'The
Problem of the
Rupee - Its origin and it's,
solution' was
accepted for the degree of D.Sc.
(Economics).
L.L.D (Honoris Causa) 5-6-1952
Columbia
University, New York For HIS
achievements,
Leadership and authoring the constitution of India
D.Litt (Honoris Causa)
12-1-1953 Osmania
University, Hyderabad For HIS
achievements,
Leadership and writing the
constitution of india

ఇది భారతదేశానికి గర్వకారణం...

🇮🇳జై భారత్ జై भीम 🇮🇳
Bethala Sudarsan

Source - Whatsapp Message

శూద్రులు వేదాలు చదివితే నాలుకలు కోసారు.. వేదాలు వింటే శూద్రులచెవులలో సీసం పోశారు... అంటూ వాస్తవానికి అసలు అటువంటి సంఘటనలు జరగకపోయినా బ్రిటీష్ దురాక్రమణదారులు చేసిన ప్రక్షిప్తాలను పట్టుకొని మెకాలే- మాక్స్ ముల్లర్ మానసపుత్రులు, పాశాంఢ ఎడారి మతమార్పిడి మాఫియాలు, వామపక్ష చరిత్రకారులు,రచయితలు కల్పించి రాసిన తప్పుడు రాతలను చూపించి....

శూద్రులు వేదాలు చదివితే నాలుకలు కోసారు..
వేదాలు వింటే శూద్రులచెవులలో సీసం పోశారు... అంటూ
వాస్తవానికి అసలు అటువంటి సంఘటనలు జరగకపోయినా బ్రిటీష్ దురాక్రమణదారులు చేసిన ప్రక్షిప్తాలను పట్టుకొని
మెకాలే- మాక్స్ ముల్లర్ మానసపుత్రులు,
పాశాంఢ ఎడారి మతమార్పిడి మాఫియాలు,
వామపక్ష చరిత్రకారులు,రచయితలు కల్పించి రాసిన
తప్పుడు రాతలను చూపించి ఇప్పటికీ కొంతమంది
రైస్ బ్యాగ్ గాళ్ళు,మొండిగాళ్ళు, ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్ గాళ్ళు మా వంటి శూద్రులను హిందూధర్మం నుండి
దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు...!

#అసలు చరిత్రలో ఎన్నడైనా
శూద్రులు వేదాలు చదివితే నాలుకలు కోసారా...???
వేదాలు వింటే శూద్రుల చెవులలో సీసం పోశారా...???

✅ పరమపవిత్ర శ్రీమద్ రామాయణ మహా కావ్యాన్ని రచించిన #బోయవాడు అయిన రత్నాకర పూర్వనామం కలిగిన #వాల్మీకిమహర్షుల వారు శూద్రుడు కాదా...???

✅ మత్స్యగ్రంధికి జన్మించి
పంచమవేదం శ్రీమద్ భగవద్గీత, మహాభారతం వంటి పరమపవిత్ర
సనాతన గ్రంధాలను లిఖించిన #కల్పి అనే పూర్వనామం కలిగిన #వ్యాస
మహర్షుల వారు శూద్రుడు కాదా...???
ఆయనను నారాయణుడి అంశగా, విశ్వగురువుగా గౌరవించుకోవడం లేదా...?
ఆయన జయంతి రోజును గురుపూర్ణిమగా జరుపుకుంటున్నాము కదా...!!!

✅ శూద్రునిగా పుట్టి #దస్య కుమారుడు అయినా
వేద జ్ఞానాన్ని ఆర్జించి రుషి అయి
ఆత్రేయోపనిషత్తు, ఆత్రేయ బ్రాహ్మణము ను
రచించిన #ఆత్రేయఋషి వారు శూద్రుడు కాదా...???

✅ పుట్టుకతో శూద్రునిగా జూదగానికి పుట్టినా కూడా
గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో
ఋగ్వేదంలో గొప్పగొప్ప పరిశోధనలు చేసి,
ఋషి గానే కాదు ఆచార్యులుగా ప్రఖ్యాతిగాంచిన
#ఐలశు
ఋషి వారు శూద్రుడు కాదా...???

✅ శూద్రురాలికి పుట్టిన జాబల కుమారుడైన సత్యాకాం
వేదసారాలను గ్రహించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం,
సత్యానికి నిలువెత్తు గుర్తుగా,వినయం, గురు విధేయతతో గౌతమ మహర్షుల వారినే మెప్పించి, గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచి యజర్వేదం అందలి కొంతభాగానికి కర్తయైన #సత్యాకాంజాబల మహర్షుల
వారు శూద్రుడు కాదా..???

✅ శూద్రురాలికి పుట్టినా కూడా వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ప్రఖ్యాతిగాంచిన
బ్రహ్మర్షి #మాతంగి
మహర్షుల వారు శూద్రుడు కాదా.???
మాతంగి మహర్షుల వారి గురుంచి శ్రీమద్ రామాయణం లోనూ, మహాభారతం అనుశాసనిక పర్వములో ప్రస్తావనలు ఉంటాయి...!

✅ పుట్టుకతో శూద్రురాలి కుమారుడైనా కూడా
గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఖ్యాతి గాంచిన
#విదురుడు హస్తినాపుర రాజ్యంలో మంత్రిగా సేవలు అందించాడు., ఇతడు శూద్రుడు కాదా.???

✅ పుట్టుకతో శూద్రుడు అయిన వత్సుడు
గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో
#ఋషివత్స గా ప్రఖ్యాతిగాంచలేదా...?
వీరు శూద్రుడు కాదా...???
Ref:-(ఆత్రేయ బ్రాహ్మణము-2.19)

✅ శూద్రునికి జన్మించినప్పటికీ అద్భుత మేధో సంపత్తి,
బ్రహ్మ జ్ఞానంతో ఋగ్వేదంనందలి కొన్ని ఋక్కులకు కర్తయై బ్రాహ్మణత్వం పొందిన "కవష ఐలుషుడు"
శూద్రుడు కాదా...???

✅ సాక్షాత్తు #శ్రీకృష్ణపరమాత్ముడు శూద్రులు అయిన గొల్ల వారి ఇంట్లో పెరిగాడు యశోదమ్మ కి మాతృ ప్రేమని పంచాడు !! సాక్షాత్తు దేవుడే అన్నీ వర్ణాల యంధు జన్మించి అన్నీ వర్ణలని పావనం చేశాడు !!! ఎవరిని ఎవరికి బానిసలుగా చూడమని ఎక్కడ కూడా చెప్పలేదు..

✅ మహర్షులకి కూడా దక్కని శ్రీరాముడి ఆలింగనం నిమ్నజాతివాడుగా భావించబడే పల్లెకారుడు(మత్స్యకారుడు) #గుహుడికి దక్కింది.
ఆనాడు అంత తేడాలు ఉంటే మరి శ్రీరాముడికి పల్లెకారుడితో స్నేహం ఎలా ఉంటుంది..?
మరి గుహుడు శూద్రుడు కాదా...???

✅ అద్భుతమైన వేదజ్ఞానంతో, సుమధుర గానంతో
సాక్ష్యాత్ ఆ శ్రీరామచంద్రుల వారికే తన ఎంగిలి ఫలాన్ని
తినిపించిన #శబరి శూద్రురాలు కాదా...???

✅స్వయంగా కవిపండితుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, వేద జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కలిగి
గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్థిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలిగి
విజయనగర సామ్రాజ్య చక్రవర్తి, తెలుగు ప్రబంధ కవి,
ఆంధ్రభోజుడిగా ప్రఖ్యాతుడు అయిన
#శ్రీకృష్ణదేవరాయలు వారు శూద్రుడు కాదా...???

✅ అఖండ భారతాన్ని అప్రతిహతంగా పాలించిన
#సామ్రాట్ #చంద్రగుప్తమౌర్య ముర అనే శూద్ర మహిళకు జన్మించినా... వేద జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కలిగి
గొప్ప రాజనీతిజ్ఞత, మేధస్సు, భుజబల సంపన్నుడు, ఆర్థిక వేత్త, శౌర్యం కలిగి, వ్యూహ నిపుణత, పట్టిన పట్టు విడువని వాడుగా అఖండ భారతాన్ని అప్రతిహతంగా పరిపాలించిన #మౌర్య సామ్రాజ్య స్థాపకుడు
#సామ్రాట్
చంద్రగుప్తమౌర్య శూద్రుడు కాదా...???

✅ మట్టిబొమ్మలను మహారణానికి జట్టునడిపిన
#శాలివాహనుడు కుమ్మరివృత్తికి చెందినవాడు..
మరి ఆయన శూద్రుడు కాదా...???

✅విశ్వకర్మలలో 6 తెగలు ఉన్నాయి. వడ్రంగి, కంసాలి మొదలైనవి వారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. మంగలులను నాయీబ్రాహ్మణులు అంటారు, వారిలో కూడా యజ్ఞోపవీతాన్ని ధరించేవారు ఉన్నారు. ఇక కుమ్మరులు వీరిలో యజ్ఞోపవీతాన్ని ధరించే సంప్రదాయం ఉంది. ఇక మాదిగలలో వారికి ప్రత్యేక పురోహిత వర్గం ఉంది. వారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు.
వీరిలో అనేక లక్షలమంది వేద జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కలిగి
పౌరోహిత్యం చేస్తున్నారు... మరి వీరందరూ
శూద్రులు కాదా...???

✅ వేద కాలంలో పుట్టుకతో శూద్ర కుటుంబంలో పుట్టినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో
ఋషిగా మారి, తన వంటి మిగిలిన శూద్రులకు వేదపాండిత్యాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని పంచి
జనశృతి పౌత్రయణ జరిపిన
#రైక్వఋషి వారు శూద్రుడు కాదా...???

✅ తన మధుర గానంతో, వేద పాండిత్యంతో
భక్తితో సాక్ష్యాత్ ఆ భద్రాద్రి శ్రీరామచంద్రుల వారినే మంత్రముగ్ధులను చేసిన #భక్తరామదాసుగా ఖ్యాతికెక్కిన #కంచర్ల
గోపన్న శూద్రుడు కాదా...???

✅ కుమ్మరివృత్తి చేసేవారి కుటుంబంలో జన్మించినా
గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో, భక్తితో,
సుమధుర గానంతో సాక్ష్యాత్ పండురంగడినే
ముగ్దుడ్ని చేసిన #భక్తతుకారాం గారు
శూద్రుడు కాదా...???
ఆయన ముని బహినాభాయ్ కు గురువుగా వ్యవహరించారు...!

✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా
వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానంతో
ఋషిగా మారిన #ఋషి
నారాయణగురు వారు
శూద్రుడు కాదా...???

✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా
వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన
#కబీర్
దాస్ శూద్రుడు కాదా...???
కబీర్ దాస్ సూరత్ గోపాల్ ,జగుదాస్ వంటి జన్మతః బ్రాహ్మణులు అయిన పండితులకు గురువుగా ఉన్నారు...!

✅జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో బెంగాలీ మహారాజు
లక్ష్మణ్ సేన్ కు రాజగురువుగా ఎనలేని సేవలు అందించిన
#ఋషి_ధోయి శూద్రుడు కాదా...???

✅ శూద్రునిగా పుట్టినా కూడా #కళంగినథార్ శిష్యరికంలో వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో బంగారం తయారీపని చేసే తమిళ
#బోగర్ చైనా దేశం వెళ్లి హిందూధర్మ ప్రచారం చేశారు...!
మరి ఈయన శూద్రుడు కాదా...???

✅ మత్స్యకారుల కుటుంబంలో పుట్టిన కూడా అద్భుతమైన జ్ఞానం, వేద పఠనం, గొప్ప బ్రహ్మ జ్ఞానంతో
63శైవ నాయనార్లలో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన
"ఆదిపట్టన్" శూద్రుడు కాదా...???

✅ కళింగ రాజ్యాన గోవులు కాసే వారి ఇంట పుట్టి వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో
ఐదుగురు పంచసఖాలలో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన
"అచ్యుతానంద" శూద్రుడు కాదా...???

✅ చర్మ కారుల వృత్తి చేసే కుటుంబంలో పుట్టిన కూడా
అద్భుతమైన జ్ఞానం, వేద పఠనం, గొప్ప బ్రహ్మ జ్ఞానంతో
ప్రఖ్యాతి చెందిన తమిళనాడు "అలగై"
శూద్రుడు కాదా...???

✅ కళింగ రాజ్యాన కాటికాపరి వృత్తి చేసేవారి ఇంట పుట్టి వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ఐదుగురు పంచసఖాలలో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన "బలరాం దాస్" శూద్రుడు కాదా...???

✅ కళింగ రాజ్యాన మత్స్యకారుల కుటుంబంలో పుట్టిన కూడా అద్భుతమైన జ్ఞానం, వేద పఠనం,
గొప్ప బ్రహ్మ జ్ఞానంతో ఋషిగా వెలుగొందిన
"భీమ దిబారా" శూద్రుడు కాదా...???

✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా
వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన
ఋషి రవిదాస్ శూద్రుడు కాదా...???
ఋషి రవిదాస్ మీరాభాయ్, చిత్తోర్ ఘడ్ మహారాణి జలి, పాటికి మహారాణి మైనమతి లకు రాజగురువుగా విశేష సేవలు అందించారు...!

✅జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా
వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన
ముని నామ్ దేవ్ శూద్రుడు కాదా...???

✅ శూద్రుల ఇంట పుట్టి వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన
"చోఖ మేళ" శూద్రుడు కాదా...???

✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా
వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన
"సంత్ కణ్హోపుత్ర" శూద్రుడు కాదా...???

✅ " మహారాజు కవార్ధ" రాజగురువు
వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన
శూద్రుడైన "గురు బాలాక్ దాస్" ...!

✅జష్పూర్ యువరాజు రాజ్ కుమార్ దిలీప్ సింగ్ గారి
రాజగురువు శూద్రుడైన "గురు రామేశ్వర్ ప్రసాద్ గాధర"
వారు...!

✅సాక్ష్యాత్ ఆది శంకరాచార్యుల వారు
గురువుగా స్వీకరించి, తలవంచి నమస్కారం పెట్టింది కాటికాపరి అయిన ఒక శూద్రునికి, ఆ సందర్భంలో లిఖించేదే మనిష పంచక...!

✅జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా గొప్ప
బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన
"సంత్ ఘాసిదాస్" శూద్రుడు కాదా...???

✅జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా గొప్ప
బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన
తమిళులకు ఆరాధ్యుడు అయిన,
63శైవ నాయనార్లలో ఒకరైన "తిరు వల్లువార్"
శూద్రుడు కాదా...???

✅ జన్మతః శుచికారునిగా జన్మించినా కూడా గొప్ప
బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన
"వఖ్న" శూద్రుడు కాదా...???

✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో
జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "గురు విఠల్ రాంజీ షిండే"
శూద్రుడు కాదా...???

✅మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో
జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "సోయరాభాయ్"శూద్రురాలు కాదా...??

✅మధ్య భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో
జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెంది శివ,వైష్ణవ బేధాలను రూపుమాపిన
"శోభి రామ్" శూద్రుడు కాదా...???

✅ పౌరవ రాజ్యమున చెప్పులు కుట్టువారు కుటుంబంలో
జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "పిపాల్ దాస్" ఆయన కుమారుడు "శర్వణ దాస్" శూద్రులు కాదా...???

✅పౌరవ రాజ్యమున చెప్పులు కుట్టువారు కుటుంబంలో
జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "రామదాసు" శూద్రుడు కాదా...???

✅ఉత్తరభారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో
జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "పరశురాం" శూద్రుడు కాదా...???

✅పంజాబ్ లో రజక వృత్తి చేయువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "నామ్ దేవ్" శూద్రుడు కాదా...???

✅ఉత్తర భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో
జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "మోహినిదేవి" శూద్రురాలు కాదా...??

✅తమిళనాట వీధులు శుభ్రం చేయు వారి కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "ముని బాణన్" శూద్రుడు కాదా...??

✅మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "బహిరామ్ చోఖమేల"
శూద్రుడు కాదా.??

✅మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "బాలక్ దాస్" శూద్రుడు కాదా.??

✅మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "బంకా మహర్" శూద్రుడు కాదా.??

✅మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "భాగు" శూద్రుడు కాదా.??

✅ఉత్తర భారతదేశంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "బీర్ భాన్" శూద్రుడు కాదా.??

✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "చన్నయ్య" శూద్రుడు కాదా.??

✅మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "చిక్కయ్య" శూద్రుడు కాదా.??

✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "చొఖ మేల" శూద్రుడు కాదా.??

✅మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "దామాజీ పంత్"శూద్రుడు కాదా.??

✅ఉత్తర భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "దేవి దాస్"శూద్రుడు కాదా.??

✅ఉత్తర భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "ధాన్నా"శూద్రుడు కాదా.??

✅మధ్య భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "ఘసి దాస్"శూద్రుడు కాదా.??

✅ఉత్తర భారతంలో పారిశుద్ధ్య వృత్తిచేయు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "గోపాలానంద్ మహరాజ్ "
శూద్రుడు కాదా.?? ఈయన ఆర్య సమాజ్ లో కీలక సభ్యునిగా సేవలు అందిస్తూ బలవంతంగా ఇస్లాంలో కి మతమార్పిడి చేయబడ్డ అనేక వందల మంది హిందువులను ఘర్ వాపసీ చేసి, హిందూధర్మంలోకి తీసుకువచ్చారు... ఈయన అనేక భక్తి పాటలు, పద్యాలు రాసి,గానం చేశారు...!

✅ఉత్తర భారతంలో పారిశుద్ధ్య వృత్తిచేయు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "సాధు జీతౌ జీత్ బహదూర్"
శూద్రుడు కాదా.??

✅మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "కరమమేలం"శూద్రుడు కాదా.??

✅ జన్మతః శూద్రులుగా జన్మించినా కూడా వేదజ్ఞానాన్ని,
బ్రహ్మ జ్ఞానాన్ని సముపార్జించి ఋషులుగా, మునులుగా
ప్రఖ్యాతి చెందిన...
🔯సమ్ఖ్యాక (శుచికారవృత్తి)
🔯అగస్త్య (వేట వృత్తి)
🔯దుర్వాస(cobbler)
🔯దాధిచి(locksmith)
🔯కశ్యప(blacksmith)
🔯రామాజా(coppersmith)
🔯కౌండిల్య(a barber)
🔯గోరా(గ్రామీణ పౌరోహిత్యుడు)
🔯చోఖా(గోసంరక్షకుడు)
🔯సావత(గ్రాసం తొలగించు వృత్తి)
🔯కబీర్ (Wove garments )
🔯రోహిదాస్(Colored hide )
🔯సజనా(మాంస అమ్మకం)
🔯నరహరి(Melted gold)
🔯జనాభాయ్(గో వ్యర్ధల సేకరణ వృత్తి)..
మరి వీరందరూ వేదాలు నేర్చుకుని ఋషివర్యులుగా,మునులుగా ఖ్యాతి గడించిన వారు...
వీరు శూద్రులు కాదా...???

ఇలా చెప్పుకుంటే పోతే అనేక లక్షలమంది
శూద్ర హిందువులు వేదాలు చదివి, బ్రహ్మ జ్ఞానం పొంది
ఋషులుగా,మునులుగా,పంత్ లా,సాధు లా ఎనలేని
ఖ్యాతి పొందారు, పొందుతూ హిందూ ధర్మానికి ఎనలేని సేవ చేస్తున్నారు...!

#వేదాలలో కూడా ఇదే చెప్పారు....👇👇👇

జన్మనా జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజః
వేద జ్ఞానేషు విప్రాణాం
బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః

(ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు)

అనగా పుట్టగానే అందరూ శుద్రులే (అనగా శిసువుకి జన్మతః జ్ఞానం అనేది అసహజం).వేదం నేర్చిన వారే విప్రులు,బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం.
అదేవిధంగా "వేద విధులతో సంచరించక,దేవతలను పూజించక,వివేకములు లేక,కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో
పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు. శూద్రులే అగుదురు.

"జన్మనా జాయతే శూద్రః,
సంస్కారాద్ది్విజ ఉచ్యతే!
వేదపాఠీ భవేద్వ్దిప్రః,
బ్రహ్మ జానాతి బ్రాహ్మణః!!

ఒక బ్రాహ్మణునికి జన్మించినా పౌరుషం కల్గి యుద్దవిద్యలు నేర్చి క్షత్రియుడు కావచ్చు.ఒక శూద్రునికి జన్మించినా మేధోసంపత్తితో బ్రాహ్మణుడు కావచ్చు.

వర్ణాశ్రమా అపి గుణకర్మాచరతో హిభవంతి.అత్రాహ మనుః
శూద్రే బ్రాహ్మణ తామేతి బ్రాహ్మణ శ్చైతి శూద్రతాం
క్షత్రియాజ్ఞాత మేవం తు, విద్యాత్ వైశ్యాత్తథైవచ"

(ఇది మను ధర్మ శాస్త్రం 10-65 మంత్రం.)

భావం : బ్రాహ్మణ గుణాలు కలిగిన శూద్రుడు బ్రహ్మణుడే యగును.
శూద్రగుణాలు కలిగిన బ్రాహ్మణుడు శూద్రుడగును. అదేవిధంగా క్షత్రియజాతి,వైశ్యజాతి
కూడా కేవలం గుణ, కర్మాచరణల వలననే యేర్పడును.

అష్టాపాద్యం తు శూద్రస్య స్తేయే భవతి కిల్బిషమ్I
షోడశైవ తు వైశ్యస్య ద్వాత్రంశత్ క్షత్రియస్యచII
భ్రాహ్మణస్య చతుః షష్ఠిః వూర్ణం వా అపి శతం భవేత్I
ద్విగుణావా చతుః షష్ఠిః తద్ధోషగుణః విద్ధి సఃII

దొంగతనం మొదలైన అపరాధాలలో శూద్రునకు 8రెట్లు దండన విధిస్తే, వైశ్యునకు 16 రెట్లు, క్షత్రియునకు 32 రెట్లు బ్రాహ్మణునకు 64 లేక, 100 లేక 128 రెట్ల దండన విధించాలని మనువు ఆదేశించారు. *శిక్షల విషయం లో ప్రక్షిప్త శోకాలు కనిపించిన మహానుభావులకు ఈ శ్లోకాలు ఎందుకు కనిపించలోదో విజ్ఞులైన
మీరు గ్రహించగలరనుకుంటాను...!

ఇక హిందూ ధర్మంలో వేదాలు, శాస్త్రాలు అభ్యసించి
బ్రహ్మ జ్ఞానం పొంది ఋషులుగా,మునులుగా,పంత్ లా,సాధు లా ఎనలేని ఖ్యాతి పొందుతున్న
శూద్ర హిందువ

Source - Whatsapp Message

వృద్ధులు...

మూలన పడేస్తే వృద్ధులు, వ్యర్థులు..
ముంగిట్లో కూచోబెడితే ఇంటిని కాచే పార్వతీ పరమేశ్వరులు..
బతుకు బాటలో గతుకుల్ని ముందుగా హెచ్చరించి, కాపాడే సిద్ధులు వృద్ధులు..
వృద్ధులు సారధులైతే యువకులు విజయులౌతారు..
అనుభవాల గనులు ఆపాత బంగారాలు..
వదిలేస్తే వృద్ధులు మంచానికి బద్ధులు..
చేయూతనిస్తే ప్రతి వృద్ధులు ఓ బుద్ధులు..
నిర్లక్ష్యంగా చూస్తే కేవలం మూడు కాళ్ల ముసలి..
తగిన గుర్తింపునిస్తే విజయాన్నిచ్చే త్రివిక్రములు..
ఒకనాటి బాలురే ఈనాటి వృద్ధులు..
మూలన పడ్డారని చులకనగా చూడకు...పోయాక మూరెడు కట్టెల చితిలో కాల్చేస్తానని ఎదురు చూడకు..
బతికినన్నాళ్లు నాలుగు మెతుకులు పెట్టి ఇంత అరుసుకో..
వారు లేని నువ్వెక్కడ..నీ జీవితమెక్కడ..
ఎప్పుడు పోతారా అని ఎదురు చూసి..పోయాక దినాల రోజు వరకు తిని, తాగి కడుపులు కడుక్కోవడమేనా..
నువ్వు కొన్నాళ్ళకు వృద్దుడివే అవుతావు.. అప్పుడు నీ గతి ఏంటో ఆలోచించు..
నువ్వు నీ తల్లి దండ్రులను, ఎలా చూసుకున్నావో..నీ వారసులు గమనిస్తూనే ఉన్నారు..నీకు అదే గతి పట్టేనేమో చూసుకో..
తనను పట్టించుకోకున్నా నువ్వు పచ్చగా ఉండాలని తపించే ఉదాత్తములు వృద్ధులు.. పలకరిస్తే చాలు పాలకడలిలా పొంగులు వారే పసివారు వృద్ధులు..
వృద్ధులంటే పై పైన చూస్తే జుట్టు తెల్లబడిన ఫలిత కేశాలవారు..
అంతర్గతంగా తలపండిన పండితులు..
అందుకే మన పూర్వీకులు వృద్ధులకు అమిత గౌరవాన్నిచ్చేరు, ఇమ్మన్నారు..
🙏🙏🙏

Source - Whatsapp Message