Monday, March 29, 2021

నేటి జీవిత సత్యం

నేటి జీవిత సత్యం శరీరంలో ప్రాణములున్నంతవరకే కుశలమునడుగుదురు.

ప్రాణములు పోయిన పిదప ఆ శవమును చూచి భార్య కూడా భయపడును.

ఈ శరీరం ఎప్పుడూ ఇలాగే ఉండేది కాదు, ఇప్పుడు అందంగా, బిగువుగా, ఆకర్షణీయంగా ఉన్న శరీరం కొంతకాలం గడిచేసరికి సడలిపోతుంది, కృశించి పోతుంది, అందవిహీనమౌతుంది, చివరకి రాలిపోతుంది. ఈ విషయాన్ని మనం మరువరాదు, ఈ శరీరం నేను కాదు, ఇది కేవలం నేను వాడుకొనే పరికరం మాత్రమే అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

ఉదాహరణకు నాకో చేతి గడియారం ఉంటే దానిని నేను ఎలా జాగ్రత్తగా వాడుకుంటున్నానో, దానిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నానో, అది చెడిపోతే ఎలా బాగు చేయించు కుంటున్నానో, కొత్త విడి భాగాలు అమర్చుకుంటున్నానో, అలాగే ఈ శరీరాన్ని కూడా అలానే వాడుకోవాలని భావించాలి...
దుస్తులు వేయాలి, పోషించాలి, అందంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి, అవసరమైతే చెడిపోయిన అవయవాలను తొలగించి కొత్త అవయవాలను వేయాలి...
అయితే ఒక ముఖ్య విషయాన్ని మాత్రం మరచిపోకూడదు. ఇది మన కోసం వాడుకోవాల్సిన పరికరమని, ఒక ముఖ్యమైన పని కొరకు వినియోగించ వలసిన సాధనమని, ఇది శాశ్వతంగా ఉండేది కాదని, కనుక తెలివిగా, జాగ్రత్తగా వినియోగించు కోవాల్సినదని జ్ఞాపకం ఉంచుకోవాలి...

🎊💦🌹🦜🍇🦚🍓

’పరోపకారం ఇదం శరీరం’ అన్నారు. ఈ శరీరం పరులకు ఉపకారం చేయుటకు, సత్యశోధనకై, పరమాత్మ ప్రాప్తికై, సత్కార్యములకై మాత్రమే దీనిని వినియోగించాలి... అంతే గాని శరీరాన్ని పోషించటమే మానవ జీవితం యొక్క పవిత్ర కర్తవ్యం కాదు!

ఏదైనా ఒక వస్తువును పనికి వచ్చినంత కాలం వాడుకుంటాం, పనికి రాకపోతే పారవేస్తాం...
అలా పనికిరాక పారవేసే చిత్తు కాగితాలను గాని, ప్లాస్టిక్ వస్తువులను గాని, ఇనుప ముక్కలను గాని, బల్బులను గాని ఎవరో ఒకరు కొంటారు.
అలాగే ఏ జంతువన్నా చనిపోతే వాటి మాంసాన్నో, వాటి చర్మాన్నో, దంతాలనో ఉపయోగించుకుంటాం.
కాని మనిషి శరీరం మాత్రం ఎవరూ కొనరు. ఎదురు డబ్బు ఇచ్చినా తీసుకోరు...
ఇలాంటి పనికిరాని మురికి మూట అయిన ఈ శరీరం కోసం బ్రతికినన్నాళ్ళు తపించి పోవటం, ఇతరుల నెత్తిన చెయ్యి పెట్టటం, గొంతులు కొయ్యటం, యుద్ధాలు చెయ్యటం, దారుణంగా హత్యలు చెయ్యటం జరుగుతుంటాయి.

ప్రాణం పోయిన తర్వాత దీనికి పైసా విలువలేదు, ఇంటిలో ఎవరూ దీని క్షేమాన్ని గురించి పట్టించుకోరు, తుదకు భార్య కూడా భయపడుతుంది, ఈ కట్టెను మండే కట్టెల మీదకు చేర్చి అడ్డం వదలించుకుంటారు

మరి ఇట్టి శరీరాన్ని చూసుకొని, దీని కోసం విలువైన జీవితాన్ని వ్యర్థం చేసు కోవటం, మానవ జీవిత పరమార్థాన్ని సాధించటానికి వినియోగించకపోవటం తెలివైనపనేనా ?

కనుక ప్రాణం పోతే ఎందుకూ పనికిరాని ఈ శరీరాన్ని ప్రాణం ఉన్నంత కాలం ఎలా ఉపయోగించుకోవాలో, ఏమి సాధించు కోవాలో అనే విషయాన్ని నిరంతరం విచారణ చేసుకోవాలి, శరీరాభిమానం తగ్గించుకోవాలి,
నిజంగా శరీరాభిమానమే మనకు ఒక బంధం అని గ్రహించాలి...🙏*
సేకరణ మానస సరోవరం

Source - Whatsapp Message

No comments:

Post a Comment