సంతృప్తి...
సంతానంలేని ఒక వ్యక్తి పరమేశ్వరుని ప్రార్థించి, ఆయన కృపతో సంతానాన్ని పొందాడు. ఆయనకు ఒక కుమారుడు కలిగాడు. అయితే ఆ బాలుడు తాగక బాధపెడుతుంటే పరమేశ్వరుని తిరిగి ప్రార్థించాడు.
- దేవా! పుత్రుణ్ణి ఇచ్చావు. కాని వాడు పాలుతాగటంలేదు. ఎలా? పరమేశ్వరుడు ప్రత్యక్షమై అలాగే, వాడు పాలు త్రాగుతాడని వరమిచ్చాడు. బాలుడు పాలుతాగి పెరిగి పెద్దవాడయ్యాడు.
అల్లరిపిల్లవాడయాడు. తండ్రి మళ్ళీ పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా ఈశ్వరుడు అల్లరి మానునట్లుగా వరమిచ్చాడు. ఈసారి మరీ మౌనం వహించాడాబాలుడు. మళ్ళీ ప్రార్థించగా పరమేశ్వరుని కృపతో సామాన్యుడయ్యాడు.
ఇలా చాలాసార్లు ప్రార్థించగా వాడు పెద్దవాడై ఉద్యోగస్థుడై పెళ్ళిచేసుకున్నాడు. ఈసారి వాడికి సంతానం లేదు. తండ్రి మళ్ళీ పరమేశ్వరుని ప్రార్థించాడు.
నాకుమారునికి సంతానం లేనందున నాకు దుఃఖంగా వుంది అన్నాడు. కథయిలా నడుస్తూనే ఉన్నది. అటువంటి ప్రార్థనలకు అంతువుండదు. తమకున్న దానితో ప్రజలకు తృప్తి కలుగదు.
: ఒక రూపాయి ఉన్నవాడికి వందకావాలి. వంద ఉన్నవాడికి వేయి కావాలి.వేయి ఉన్నవాడికి లక్ష, లక్ష ఉన్నవాడికి రాజుకావాలని, రాజుకు కుబేరుడు కావాలనీ, కుబేరునికి ఇంద్రుడు కావాలనీ, ఇంద్రునికి బ్రహ్మ కావాలనీ, బ్రహ్మకు విష్ణువు కావాలనీ, విష్ణువుకు శివుడు కావాలని ఉంటుంది. కోరికలకు అంతెక్కడ.:
హాస్యభరితమైన పద్యమొకటుంది,దాని భావం యిలా ఉన్నది.
: పర్వతం పెద్దది. దానికంటే పెద్దది సముద్రం.దానికంటే పెద్దది ఆకాశం. దానికంటె పెద్దవాడు దేముడు. దేముని కంటే పెద్దది కోరిక!
అసంతృప్తి మానవునికి దుఃఖాన్ని కలిగిస్తుంది.సంతృప్తి ఆనందాన్ని యిస్తుంది. వైరాగ్యం ఉన్నవాడికి సంతృప్తి ఉంటుంది. సంతృప్తి వైరాగ్యాన్ని కలిగిస్తుంది.
🍁🍁🍁🍁🍁
Source - Whatsapp Message

No comments:
Post a Comment