Sunday, August 29, 2021

ఆకలి విలువ.

🍛🍛🍛🍛🍛🍛🍛🍛🍛
ఆకలి విలువ..
🍛🍛🍛🍛🍛🍛🍛🍛🍛
విజయవాడ , బంధువుల పెళ్లి కని బయల్దేరాము. బాగా ఆకలి వేస్తే ఒకచోట హోటల్ చూసి ఆగాము. తలా ఒక్కో ప్లేట్ ఆర్డర్ చేసి తిన్న తరువాత, బాగా ఆకలిగా ఉందని మరో ప్లేట్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు మా అమ్మాయిలిద్దరు..

టిఫిన్ సగం తిని, సగం వదిలేసి మధ్యలోనే లేచి వెళ్లి చేతులు కడిగేసారు. మిగిలి పోయిన టిఫిన్ చూసి నా మనసులో కళుక్కుమంది. ఆకలి వేసి తెప్పించుకున్నారు కదా మొత్తం తింటారనుకున్నగాని ఇలా వదిలేస్తారనుకోలేదు.

దారి మధ్యలో ఒకదగ్గర పుచ్చకాయముక్కలు కోసి ఐస్ పైనపెట్టి ఒకప్లాస్టిక్ ప్లేటులో ఆ ముక్కలు ఉంచి, వాటిమీద ఉప్పు చల్లి అమ్ముతున్నారు. అవి తిందామని బతిమాలి కారు ఆపించారు. ఇక్కడా అదే తంతు. అందరం తిన్నతరువాత మరో ప్లేటు ఆర్డర్ చేసి, సగం తిని సగం వదిలేసారు. ఈ సారి వారిలో నా శ్రీమతి కూడా చేరింది. మరోసారి బాధపడి, నోరుచేసుకోకుండా ఊరుకున్నాను. వద్దని వారిస్తే పిసినారి పైసా పోనియడు, తాను తినడు, తినేవారిని తిననియడు అని తిట్టుకుంటారని నోరు కట్టేసుకున్నాను. అంగరంగవైభవంగా అలంకరించిన వేదిక. వచ్చి పోయే అతిథులతో పెళ్లి మండపం కిటకిటలాడిపోతుంది. వేదికముందు కుర్చీలలో కూర్చున్నవారికి కూల్ డ్రింకులు అందిస్తున్నారు.

కూల్ డ్రింక్ తాగిన వారిలో చాలా మంది సగం వదిలేశారు. పెళ్ళి వారిని పలకరించి, భోజనాలవైపు బయలుదేరాము. ఎన్నిరకాల వంటకాలు పెట్టారో, లెక్కపెట్టడానికే పదినిమిషాలు పడుతుంది. నాకైతే చూసాకే సగం కడుపు నిండిపోయింది. భోజనాల దగ్గర జనాలను చూస్తుంటే కరువు ప్రాంతాలనుండి వచ్చిన వారిలాగా ఎగబడుతున్నారు.

జీవితంలో ఏనాడు అలాంటి పదార్థాలు చూడలేదు ,తినలేదు ,ఇప్పుడు తినకపోతే జీవితం ఇంతటితో ముగిసిపోతుంది అన్నంతఇదిగా ఎగబడ్డారు.. ఎంత వడ్డించుకుంటున్నారో,ఎంతతింటున్నారో, ఎంతవదిలేస్తున్నారో వారికే తెలియడంలేదు. వడ్డించిన భోజనంలో సగం వృధాగా పోతుంది. అక్కడ జరుగుతున్న తతంగమంత గమనిస్తూ ఆలోచనలో పడిపోయిన నన్ను మా అమ్మాయి పిలిచింది భోజనానికి. చేతిలో పళ్లెంతో దానినిండా పదార్థాలు. కలుపుకోవడానికి కూడా చోటులేదు. అది చూసి అన్నం తినబుద్దికాలేదు. నాకు ఆకలిగాలేదు మీరు తినండి అని వారిని పురామయించి, ఓ పక్కన కూలబడిపోయాను.

అక్కడినుండి వస్తుంటే ఎవరో ఇద్దరు కూలీలు పల్లాలలలో వదిలేసిన భోజనాన్ని డేగిసలో నింపి గోడవతల విసిరేస్తున్న దృశ్యం కనిపించింది. వెంటనే మా అమ్మాయిలిద్దరిని పిలిచి చూపించాను. నోరెళ్ళబెట్టి చూసారు, కానీ వారి ముఖంలో ఏ రకమైన భావాలు కనిపించలేదు. నాకు మాత్రం గుండెల్లో దేవినట్లు,కాలికింద నేల కదిలిపోయినట్లు అనిపించింది. తిరుగుప్రయణంలో, నా మనసంతా వృధా అవుతున్న భోజనం చుట్టే తిరిగింది. ముభావంగా ఉండిపోయాను. ఆరుగాలం వ్యవసాయం చేసిన మానాన్నగారు తన ప్రాణ సమానంగా చూసుకునే కాడి ఎడ్లను నిమురుతూ చెప్పిన మాటలు "అన్నం పరబ్రహ్మ స్వరూపం. నేల తల్లి ఇచ్చిన ఫలాన్ని మనతోపాటూ పది మందికీ వృధా చేయకుండా పెడితేనే మన శ్రమకు సార్దకత. " అన్న మాటలు పదేపదే గర్తుకు వచ్చాయి

ఏమైంది నాన్నా?

పిల్లలిద్దరూ పిలిచేసరికి ఆలోచనల్లోంచి తేరుకుని, ఒక్కక్షణం ఆగి, జేబులోనుండి వందరూపాయల నోటు తీసి బయటపడేయమని నా శ్రీమతి చేతిలో పెట్టాను. అకస్మాత్తుగా నేనలా చెప్పేసరికి విస్తుపోయి చూసింది. నేను కల్పించుకుని, నువ్వు విన్నది నిజమే వందరూపాయల నోటు బయటపడేయమన్నాను. మరోసారి చెప్పాను. ఎమ్మాట్లాడుతున్నారండి మీరు. భోజనాల దగ్గరనుండి చూస్తున్నాను. ముభావంగా ఉంటున్నారు.

ఏమిమాట్లాడటంలేదు, ఏమైందని పలకరిస్తే, వందరూపాయలు బయటపాడేయమంటారా?

గాలిగాని సోకిందా, విసురుగా చూసింది.

ఒకవంద రూపాయల నోటు బయటపడేయమంటేనే నీకు అంతకోపం వచ్చింది కదా....? పొద్దున్నుండి మీరు హోటల్లో టిఫిన్, పుచ్చకాయముక్కలు, పెళ్లిభోజనాల దగ్గరకూరలు. దిలేసిన వచ్చిన వాటి విలువ ఎంతో తెలుసా? మీ ముగ్గురివి కలిపి దాదాపు వెయ్యి రూపాయలు అవుతుంది తెలుసా? అంటే మీరు వేయి రూపాయలు బయటపడేసారు.నేను వందరూపాయల నోటు విసిరేయడం పిచ్చయితే మీరు అవసరాన్ని మించి భోజనం వడ్డించుకుని, వదిలేయడం పిచ్చి కాదా? అన్నం పరబ్రహ్మ్ స్వరూపమన్నారు. అలాంటి అన్నాన్ని పడేసి మనం దైవాన్ని అవమానించినట్లు కాదా?వృధాగా పడేసే అన్నం ఒక పేదవాడి ఆకలి తీరుస్తుంది. మనం భోజనాన్ని వృధా చేయక పోతే ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల దుర్వినియోగాన్ని ఆపినట్లే లెక్క. నేను ఆవేశంగా చెబుతున్నమాటల్ని అడ్డుకుంటు .... మీరొక్కరే అనుకుంటే సరిపోతుందా డాడీ, అడిగింది మా అమ్మాయి. అవునమ్మా చిన్నచిన్న నదులు కలిసి సాగితేనే మహానదులు ఏర్పడతాయి.
ఒక్కొక్కనీటిచుక్క కలిసి కుంభవృష్టి వర్షం అవుతుంది. వేల మైళ్ళ గమ్యమైన ఒక్కఅడుగుతోనే మొదలవుతుంది. చెప్పడం ఆపేసాను.
అందరూ ఆలోచనల్లో పడిపోయారు. "మార్పు కి బీజం పడినట్లే.......
ఎందుకంటే ఆలోచిస్తే మనం కూడా ఆ కోవకి వస్తామా అనిపిస్తుంది...
ఇకనుండి నేను ఆహారాన్ని వృధాకానివ్వను ...అని మనస్సులో నిర్ణయించుకున్నాను..
మరి మీరో....!!
🍛🍛🍛🍛🍛🍛🍛🍛🍛
ఆకలి విలువ తెలిసినవారు, ఆహారాన్ని వృధాచేయరు. అలా చేస్తే ఆరుగాలం శ్రమించిన రైతు కష్టాన్ని, భూమాతను అవమానించినట్లే
గొప్పల కోసం, స్థాయిని, స్టేటస్ చూపించుకోవడం కోసం వందల రకాలు వండి వార్చి ఆహారం వృధాచేయకండి. కనీసం ఆ ఖర్చుతో వందల మంది అనాధల, పేదల, అన్నార్తుల కడుపులు నింపవచ్చు. వారు తృప్తిగా తిని చేసిన ఆశీర్వచనమే మన పిల్లలకు శ్రీరామరక్ష. అవసరానికి మించి ఎప్పుడూ వడ్డించుకోవద్దు. తినేటప్పుడు పావు వంతు పొట్టలో పావు శాతం ఖాళీగా ఉంచడం ఆరోగ్యకరం.

Source - Whatsapp Message

Saturday, August 28, 2021

నేటి జీవిత సత్యాలు.

నేటి జీవిత సత్యాలు.

డబ్బుకు ప్రాణం విలువ తెలియదు,డబ్బుకు బంధం విలువ తెలియదు,
డబ్బుకు జాలి,కనికరం,దయ,
మానవత్వం తెలియదు,
కానీధన దాహం ఉన్న మనుష్యులకు వీటి విలువ తెలియదు.చాలా బాధాకరం..

ప్రతి ఉదయం వెంట తెస్తుంది
ఒక వైవిధ్యాన్ని. నూతన అవకాశాన్ని..

సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి.. అలాగే జీవితంలో కష్టలూ..సుఖాలు కూడా అంతే... ఏదీ శాశ్వతంగా ఉండదు.. నీటి బొట్టు వంటి జీవితంలో.. ఎన్ని విడ్డూరాలో కదా.. ఆశ ఉంటే జీవితం శాసిస్తుంది..లేకపోతే స్తబ్దతగా ఉంటుంది... జీవితం అంతే.

అందరూ కాకపోయినా చాలామందికి (Majority People)వారి జీవితంలో.. ఇద్దరిని పరిచయం చేస్తుంది..

1)ఏం చేసినా భరించే వాళ్ళని.. 2)ఎంత ప్రేమించినా బాధ పెట్టె వాళ్ళని..

మీ మానస సరోవరం 👏

Source - Whatsapp Message

మనం తెలుసుకోవలసినది ఏంటంటే ?

మనం ఈ భూమి మీద పుట్టింది ఎందుకు ?
జీవితం అంటే ఏమిటి ?
తాగడం కోసం అని కొందరు ?
తినడం కోసం మరి కొందరు ?
డబ్బు సంపాదించడం కోసం ఇంకొందరు ?
శారీరిక సుఖాల కోసం అని కొందరు ?
ప్రేమించడం కోసం ఇంకొందరు ?
మంచి పేరు కోసం మరి కొందరు ?
శాసించడం కోసం అని కొందరు ?
పాడటం కోసం అని కొందరు ?
ఆడటం కోసం అని కొందరు ?
కలిసుండటం కోసం అని కొందరు ?
ఇలా ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అలోచన ఉంటుంది....
కానీ అందరికి ఒక్కే అలోచన ఎందుకు లేదు
మీరు ఎప్పుడైనా గమనించారో లేదో చీమలు అన్ని వరసగా వెలుతాయి అహారాన్ని తెచ్చుకుంటాయి, దాచుకుంటాయి కలిసి మెలిసి తింటాయి, ఉంటాయి . జంతువులు ,కీటకాలకు లేని వ్యత్యాసం మనుషులమైన మనకెందుకు ?
ఒక్క కాకి కాని ఏదైనా పక్షి కాని లేదా జంతువు కాని ఆపదలో ఉన్నా ఆకలితో ఉన్నా ఆదుకుంటాయి సహాయ పడతాయి అవి భుమి మీద బ్రతుకుతున్నాయి మనము భుమి మీదే బ్రతుకుతున్నాం మనం ఆహారమే తిటున్నాం అవి వాటికి తగిన అహారమే తింటున్నాయి

మనం తెలుసుకోవలసినది ఏంటంటే ?

ఉన్న ఈ జన్మను ఆనందంగా జీవిస్తూ అనందంగా తింటూ అనందంగా అందరు కలిసిమెలసి ఉంటూ ఏ కష్టమొచ్చినా ఒకరికొకరు ఆదుకుంటూ అనందంగా ఉంటే ఎంత బాగుంటుంది
ఎవరు సృష్టించారో తెలీదు కాని మానవ జన్మ గొప్ప వరం తినడానికి ఆహారాన్ని అందించే ప్రకృతిని ఇచ్చి తాగడానికి నీరు అందించే వనరులు ఇచ్చి దేహానికి చల్లదనం శ్వాస కావాలసిన గాలిని ఇచ్చి ఆడా మగా అని సృష్టించి అనందంగా బ్రతకండ్రా " అంటే "చెత్త ఆలోచనలతో చెట్లను నరికి ఆఖరికి మనల్ని మనమే నరుక్కుని పాడుచేసుకుని కావాల్సిన వాటికి మించి సృష్టించుకుని నేను ఎక్కువ నువ్వు తక్కువ నువ్వు పేద నేను ధనిక అని తాగడానికి తినడానికి ఉండటానికి కట్టుకోవడానికి కుడా గతి లేని స్థాయికి తెచ్చుకున్నది మనమే ...
మన ప్రపంచం మనం అనుకోవాల్సిన మనం మన దేశం, మన రాష్త్రం, మన జిల్లా, మన ఊరు, మన వీధి, అని ..... నా ఇల్లు, నా కారు, నా భుమి, అని విడిపొయాము అభివృద్ధి అని కొత్త కొత్త అలోచనలు అందుకే కొత్త కొత్త రోగాలు
జీవితం అంటే భయం లేదు, గౌరవం లేదు అసలు మనిషికి మనిషి అంటేనే విలువ లేదు ఒక్క క్షణం is అలోచించండి మనం సరిగా ఉంటే సరిపోతుందా ?
అందరు అలాగే ఉండాలి కదా అని ఆలోచించకండి ఒక్కరు సరిగా ఉన్నా వారిని చూసి ఎందరో మారవొచ్చు ...... !!

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

భావనకు బలముంది సామవేదం షణ్ముఖశర్మ

భావనకు బలముంది
సామవేదం షణ్ముఖశర్మ |

సంఘటన బహిరంగం. భావన అంతరంగం.
ఈ రెండూ ఒకదానిపై ఒకటి ప్రభావం చూపించడం సహజం, సంఘటనను అంచనా వేయడమో, అనుభవించడమో చేయగలం- కానీ పూర్తిగా మార్చగలగడం మనవల్ల అవుతుందా! అన్ని సందర్భాల్లోనూ కుదరదేమోగానీ; తగిన ప్రణాళికలతో, ప్రయత్నాలతో కొన్నిటినైనా మలచగలం, మార్చగలం అనడంలో సందేహించనక్కర్లేదు. జరగబోయేవి మన చేతుల్లో లేవు- అనడం నిజం కావచ్చు. కానీ 'సద్భావన'తో వాటిని ప్రయోజనకరంగా పరిణమింపజేయగలం- అని శాస్త్రాలు రుజువు చేస్తున్నాయి.
భావనలో సలక్షణం ఉంటే- 1. సంఘటన తీవ్ర ప్రభావం చూపించకపోవచ్చు, 2. లేదా, అది తప్పిపోవచ్చు, 3. దాన్ని తట్టుకొని, సానుకూలంగా మలచుకొనే సమర్థత పొందవచ్చు. అందువల్లనే భావనను బలపరచే సాధనలు మనకు సూచించారు మహర్షులు. ధ్యానం, తపస్సు, క్రమబద్ధమైన జీవితం... భావనకు బలాన్నిస్తాయి. సంకల్ప సిద్ధులు కావడమంటే ఇదే. 'భావనాయోగం' అనే దివ్యప్రక్రియను కొన్ని ఆధ్యాత్మిక శాస్త్రాల్లో వివరించారు. ఒక యోగంగా అభ్యసిస్తే భావనను కళ్లముందు సత్యంగా సాక్షాత్కరింపజేయవచ్చు- అని శాస్త్రనిరూపణ. ఆధ్యాత్మికసిద్ధికి భావనే ఆధారసూత్రం. 'చిత్తంకొద్దీ శివుడు-విత్తం కొద్దీ వైభవం' అనీ సామెత. భౌతికరంగంలోనూ ఈ భావనాబలం పనిచేస్తుంది. జీవితంలో అనుబంధాలు, అనుభవాలు భావంతో అల్లుకున్నవే. ఏకాగ్రచిత్తంతో, యోగశాస్త్రపద్ధతుల్లో తపశ్శక్తితో భావనను దృఢపరిస్తే దేనినైనా సాధ్యం చేయవచ్చు... అని ధైర్యాన్నిస్తున్నాయి. దానికి ఎన్నో తార్కాణాలు నేటి యుగంలోనూ చూడవచ్చు. ఎల్లవేళలా సానుకూల సకారాత్మక భావన కలిగి ఉండి, దాన్నే వ్యక్తీకరించేవాడు తప్పకుండా విజయాలు సాధించగలడు. స్వప్నాలను సత్యం చేసుకోగలడు, ఏ పనినైనా ప్రారంభించేటప్పుడు 'ఇది నేను చేయగలను- చేసి తీరతాను' అనే దృక్పథం ఉన్నప్పుడు ఆ పని దాదాపు సిద్ధించినట్లే. ఈ సద్భావన ఇచ్చే బలం ఏ అవరోధాన్నైనా ఎదుర్కొనేలా చేస్తుంది. ఈ విధానమే 'శుభాకాంక్షలు'లో ద్యోతకమవుతుంది.
దీవెనలు, ఆశీర్వచనాలు, ప్రార్థనలు... ఇవన్నీ శుభాకాంక్షలే. పెద్దలు మనసారా పలికే దీవెనలు, శుభాన్ని 'ఆశించి' చెప్పే ఇతరుల ఆశీస్సులు, భగవచ్ఛక్తిని ఆరాధిస్తూ మనకోసం, ప్రపంచం కోసం ప్రసరించే మంచి భావాల ప్రార్థనలు... ఇవన్నీ ప్రాచీనకాలంనుంచి మనదేశంలో సంప్రదాయాలు. పర్వదినాల్లో, కార్యారంభాల్లో, శుభకర్మల్లో ఈ ఆనవాయితీ నేటికీ ఉన్నది. ముఖ్యంగా కాలం మలుపుల్లో శుభకామనను వ్యక్తపరచడం మానవ స్వభావం. అందుకే దేశాలేవైనా, మత, సంస్కృతులేవైనా అందరూ వారి కాలమానాల ప్రకారం- ఏడాదంతా ఆనందమయం కావాలని కోరుకుంటారు. 'ఈ సంవత్సరంలో జరిగే మార్పులన్నీ శుభకరంగా ఉండాలి...' అంటూ ప్రపంచంలోని ప్రథమ వాఞ్మయమైన వేదంలోనే కనబడుతోంది. నూతన సంవత్సర శుభాకాంక్షలను వేదం తొలిసారి పలికింది. జరగబోయే చెడు ముందే తెలిసినా, సద్భావంతో కాలాన్నే మార్పుచేసిన వైనాలు మన పురాణాల్లో కోకొల్లలు. తన భర్త సత్యవంతుడు కొద్దికాలంలో మరణిస్తాడని తెలిసీ నిబ్బరంగా నిలబడింది సావిత్రి. నిజానికి వివాహానికి పూర్వమే ఆమెకు తెలుసు. కానీ ధైర్యంగా, తన ప్రేమకు ప్రాధాన్యమిచ్చి పెళ్లాడింది. తనకు తెలిసిన నిజం భర్తకు చెప్పలేదు. తాను తపస్సాధనను కొనసాగిస్తూ, తన భర్తకు ఆయువు పెరగాలనే సద్భావాన్ని కేంద్రీకృతం చేసింది. సద్భావాన్ని విశ్వాసంతో, ఏకాగ్రంతో బలపరచడమే కదా తపస్సు! దాని ఫలితంగా కాలం (కాలుడు = యముడు) ఆమెను అనుగ్రహించింది, అనుకూలపడింది. జరగబోయే దుస్సంఘటనను తప్పించగలిగింది. మానవుడు తన సద్భావనాబలంతో దేన్నైనా సాధించగలడనడానికి ఇదో తార్కాణం! 'నేను లంకకు వెళ్లి సీత జాడ తెలుసుకొని తీరతాను' అనే సద్భావనను సమర్థంగా సత్యంచేశాడు హనుమ. సీతమ్మకు ఆ శుభభావనను ప్రసరించి ధైర్యాన్నిచ్చాడు. అరణ్యవాస సమయంలో ధర్మరాజు వద్దకు వచ్చిన అనేకమంది రుషుల దీవెనల్లోంచి ఈ సద్భావన శుభాకాంక్షలుగా వెలువడి శుభాన్నే కలిగించింది.
శుభాన్ని ఆకాంక్షించడం ఎన్నడూ వ్యర్థం కాదనేది- సారాంశం. వ్యర్థంకాని విధంగా ఆకాంక్ష తెలపాలంటే ఆ తెలిపే చిత్తంలో నిజాయతీ, శుద్ధి ఉండాలి. అప్పుడది అమోఘమవుతుంది, ఫలవంతమవుతుంది. సద్భావన స్వభావమైతే ప్రభావం తప్పక ఉంటుంది.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

Wednesday, August 25, 2021

నేటి జీవిత సత్యం.

నేటి జీవిత సత్యం.

జీవితం ప్రశాంతంగా గడపాలని ప్రతి వ్యక్తీ కోరుకుంటాడు. సమాజంలో శాంతి ఉన్నప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారు. ఇందుకు నీతినియమాలు తోడ్పడతాయి. నీతి తప్పిన సమాజంలో అశాంతి నెలకొంటుంది. మన సాహిత్యం లోక క్షేమాన్ని కోరుకొంటుంది. భారతీయ ధర్మశాస్త్రాలు మానవుడు ఎలా జీవిస్తే సమాజానికి మేలు జరుగుతుందో చెబుతాయి. ఈ గ్రంథాలను రచించినవారు మహర్షులే! యుగధర్మాలను బట్టి ఈ ధర్మశాస్త్రాలు విభిన్న మార్గాలను మనకు సూచిస్తాయి. కృతయుగంలో మనుధర్మ శాస్త్రం, త్రేతాయుగంలో గౌతమస్మృతి, ద్వాపరంలో శంఖలిఖితుల స్మృతి- ప్రామాణికాలు. కలియుగంలో పారాశర్య స్మృతిని పాటించాలని రుషులు భావించారు. మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని నీతుల గురించి అభిప్రాయాలూ మారుతున్నాయి. కొన్ని మాత్రం యుగాలు మారినా మారవు.
ఎప్పటికీ సమాజానికి ఉపయోగపడే నీతులు చెప్పినవారిలో విదురుడు ముఖ్యుడు. ఒక దాసికి, వ్యాసుడికి జన్మించిన విదురుడు ధృతరాష్ట్రుడికి తోడుగా ఉంటూ హితోక్తులు చెబుతూ, పాండవుల మేలు కోరుతూ ఉండే కృష్ణభక్తుడు.
రాయబారానికి శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు ఎవరి ఇంట్లోనూ భోజనానికి అంగీకరించడు. విదురుడి ఆహ్వానాన్ని మన్నించి అతడి ఇంటికి మాత్రం వెళ్ళాడు. విదురుడు భక్తితో స్వయంగా తానే కృష్ణుడికి ఆహారం తినిపించాడు. భక్తి పారవశ్యంతో ఒడలు మరచి, అరటిపండు తొక్క ఒలిచి దాన్నే కృష్ణుడి నోటికి అందించి, లోపలి పదార్థాన్ని పారవేశాడు! విదురుడి నిర్మల భక్తికి ఇది నిదర్శనం.
సంజయుడు పాండవుల వద్దకు రాయబారానికి వెళ్ళివచ్చిన తరవాత, ధృతరాష్ట్రుడివి అన్నీ అధర్మ కృత్యాలేనని అధిక్షేపించాడు. అప్పటి నుంచి మానసిక క్షోభతో ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు. విదురుణ్ని పిలిచి మంచి మాటలతో తన మనసుకు ప్రశాంతత కలగజేయమన్నాడు. విదురుడు ముందుగా నిద్ర పట్టనివాళ్లెవరో చెబుతాడు. ‘బలవంతుడితో విరోధం పెట్టుకున్న వాడికి, సంపద పోగొట్టుకున్న వాడికి, కాముకుడికి, దొంగకు నిద్ర ఉండదు’ అని అంటాడు. విదురుడి నీతులకు ఏ యుగంలోనైనా విలువ అలాగే చెక్కుచెదరకుండా ఉంటుంది!
జ్ఞానులు ఎలా ప్రవర్తిస్తారో, మూర్ఖులు ఎలా ఉంటారో విదుర నీతులనుబట్టి చక్కగా తెలుసుకోవచ్చు. తనకు అందనిదాన్ని గురించి ఆరాటపడనివాడు, పోయినదాన్ని గురించి విచారించనివాడు, ఆపదలో సైతం వివేకం కోల్పోనివాడే జ్ఞాని. అధికమైన సంపద, విద్య ఉన్నప్పటికీ ఉత్తముడు వినయంగానే ఉంటాడు.
మూర్ఖుడు వెంటనే చేయవలసిన పనిని అడుగడుగునా అనుమానిస్తూ, ఆలస్యంగా చేస్తాడు. అతడు తాను తప్పుచేసి, ఎదుటివాణ్ని నిందిస్తాడు. ధనం లేకుండా కోరికలు పెంచుకోవడం, సమర్థత లేకపోయినా ఇతరులపై మండిపడటమనే ఈ రెండూ మనిషిని కృశింపజేస్తాయి.
‘మధుర పదార్థం నలుగురికీ పంచకుండా ఒక్కడే భుజించకూడదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక్కడే కూర్చుని బయటపడే ఉపాయం ఆలోచించకూడదు... అందరూ నిద్రపోతుంటే ఒక్కడే మెలకువతో ఉండకూడదు. మానవుడికి ఆరు సుఖాలున్నాయి. అవి ఆరోగ్యం, ధన సంపాదన, ప్రియురాలైన భార్య, చెప్పినట్లు వినే పుత్రుడు, సంపాదనకు పనికివచ్చే విద్య!’ అని విదురుడు విశదీకరించాడు. సమాజానికి ఎప్పటికీ పనికొచ్చే విధంగా ఉపదేశించిన విదురనీతులు అజరామరాలు. అందుకే భారతానికి ‘ధర్మశాస్త్రం’ అనే పేరు వచ్చింది!

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

మంచి మాట... లు

బుధవారం :-25-08-2021
ఈ రోజు AVB మంచి మాట... లు
🔱శుభోదయం🔱

చూడు మిత్రమా!!

మౌనం అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు, ఎన్నో సమాధానాలు దాగివున్న ప్రళయం, కొందరికి ఇది అర్థం కాదు, అందుకే మౌనం సునామీ కంటే ప్రమాదకరమైనది,,

ఎక్కడ అహంకారం ప్రారంభం అవుతుందో, అక్కడ మనిషి పతనం ప్రారంభం అవుతుంది,, గుర్తుంచుకోండి,,

ఎన్ని అరచేతులు అడ్డు పెట్టిన సూర్యకాంతిని అపగలరా, వంద కుక్కలు ఒక్కసారి అరిచిన ఒక సింహ గర్జనకు సరితూగునా,, అట్లాగే కొంతమంది మనమంటే గిట్టని వారు మన గురించి తప్పుగా మాట్లాడితే సమాజంలో మన విలువ తగ్గునా,,

అవసరం బద్ధ శత్రువునైనా కలుపుతుంది, కానీ అపార్థం ప్రాణమిత్రువులనైనా విడదీస్తుంది,,
సేకరణ ✒️ AVB సుబ్బారావు💐🤝🌹
📞9985255805🇮🇳


Source - Whatsapp Message

అహంకారం

🔥అహంకారం🔥

అర్హతకు మించి పేరువస్తే ...
అహం అధికం అవుతుంది !
పాండిత్యానికి మించి ప్రశంసవస్తే ...
పొగరు పెరిగిపోతుంది !
విద్వత్తును మించి ప్రచారంవస్తే ...
విర్రవీగడం వెల్లువవుతుంది !
సన్మానాలు .. సెహబాష్ లువస్తే…
సాధించేసామని సంబరం పుడుతుంది!
బిరుదులూ .. పురస్కారాలు వస్తే…
బాహుబలులమనే భ్రమ బరితెగిస్తుంది!
శ్రమకు మించి సొమ్ములొస్తే ...
సోమరితనం సొంతమవుతుంది!
అవసరం లేని ధనంవస్తే…
భోగలాలస భగ్గుమంటుంది!
విజ్ఞతలేకుండా బలం వస్తే…
విధ్వంసం మొదలవుతుంది!
అధికార కాంక్ష ఆవరిస్తే…
అంతరాత్మ నోరు మూస్తుంది!
అన్యాయం అవతరిస్తే...
అక్రమం అంతటా ఆవరిస్తుంది!

అందుకే ...
పదవులు.. ప్రచారాల వెంట పడకుండా
అంతస్థు.. అధికారాపేక్షలేకుండా
అత్యాశలు .. అహంకారాలు అంటకుండా
అందినదానితో తృప్తిపడుతూ
ఆనందంగా బ్రతికేయాలి!
మామూలు మనిషిగా …
మంచిగా మనుగడ సాగించాలి!

శుభోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

Tuesday, August 24, 2021

అమ్మ- కథ, అమ్మ కావాలా?....అమెరికా కావాలా?...

🙏🙏అమ్మ- కథ🙏🙏

అమ్మ కావాలా?....అమెరికా కావాలా?.....అందరూ దయచేసి చదవండి....

ఈ మధ్య ఒకానొక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళాను.
ఖరీదైనదని ఎందుకన్నానంటే అక్కడున్న వాళ్ళు దాదాపు ఎన్నారైల తల్లితండ్రులు.

నెలవారీ చెల్లింపులు డాలర్లలోనే ఉంటాయి. వృద్ధాశ్రమంలో తమ తల్లి తండ్రులు సుఖంగా బతకాలని పిల్లలు భారీగానే డబ్బు చెల్లిస్తుంటారు. ఇక్కడున్న చాలా మందికి పెద్దపెద్ద ఇళ్ళు, కొందరికి పొలాలు, ఆస్తులూ ఉన్నాయి. ఎవ్వరూ చూసేవాళ్ళు లేక, పెద్ద పెద్ద ఇళ్ళల్లో బిక్కుబిక్కుమంటూ ఉండలేక వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు. విదేశాల్లో ఉంటున్న పిల్లలు చేర్పిస్తున్నారు.

నేను వెళ్ళేటప్పటికి రఘురాం అనే ఒక ఎన్నారై అక్కడున్నాడు. ఆయన తల్లి ఆశ్రమంలో ఉన్నారు. ఆరు నెలలకోసారి వస్తాడట ఆయన. ఆయనతో మాట్లాడాలనిపించింది. ఆశ్రమం బయట ఉన్న గుట్టల వేపు నడుస్తూ వెళ్ళాం.

"మీ అమ్మ గారికి ఇప్పుడెలా ఉంది" అడిగాను. "బాగానే ఉంది. వయసు మీదపడింది. ఓల్డేజ్ రిలేటెడ్ ప్రోబ్లంస్ అంతే." అన్నాడు.

"ఆమెకి హటాత్తుగా ఏమైనా అయితే ఎలా?"
"హోం వాళ్ళు చూసుకుంటారు. నాకు ఇంఫార్మ్ చేస్తారు. జూబిలీ హిల్స్ లో పెద్ద ఇల్లుంది ప్రోపర్టీస్ ఉన్నాయ్.. హటాత్తుగా డాడి చనిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడుంచాం."
"అమెరికా తీసుకెళ్ళొచ్చుగా."
"ప్రయాణం చేయలేనంది"
"ఇక్కడ ఇల్లుంది, ఆస్తులున్నాయ్ కదా ఇంక అమెరికాలోనే ఎందుకుండడం.?"
రఘురాం చివ్వున తలెత్తి నా వేపు చూసాడు.
"ఇక్కడుండలేమండీ"
"ఎందుకుండలేరు?'
"నా వైఫ్,పిల్లలు రారు. అమెరికా జీవితానికి అలవాటు పడితే వదలడం కష్టం."
"ఏముందక్కడ?"
"ఏమి లేదో చెప్పండి."
"మీకు జన్మనిచ్చిన అమ్మ అక్కడ లేదుగా"
"వస్తూ పోతూ ఉంటాగా"
"సారీ...నేనిలా మాట్లాడుతున్నానని వేరే అనుకోకండి. నేను ఈ అంశం మీద పరిశోధన చేస్తున్నా. ఎన్నో ఓల్డేజ్ హోంలు తిరుగుతుంటాను. ఎంతో మంది తల్లితండ్రులతో మాట్లాడుతుంటాను. వాళ్ళ అనుభవాలు, పిల్లల మీద వాళ్ళ ప్రేమలు కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తుంటాయి. లోపల ఎంత బాధ ఉన్నా పిల్లలు విదేశాల్లో ఉండడాన్ని వాళ్ళు సమర్ధిస్తుంటారు."
"మా అమ్మ కూడా అంతేనండి"
"అమ్మలందరూ అంతే రఘురాం గారూ. ఇక్కడ కూర్చుందామా. మా అమ్మ గురించి మీకు చెప్పాలనిపిస్తోంది" అన్నాను.
"తప్పకుండా,అమ్మ కూడా నిద్రపోతోంది" అన్నాడు రఘురాం.
అక్కడున్న ఓ బెంచీ మీద కూర్చున్నాం. "మా అమ్మ నాన్నలకి నేనొక్కడినే. పిజి చేసి వచ్చేస్తానని వెళ్ళి అక్కడే అమెరికాలో ఉండిపోయాను. పిజి అయిపోయింది, మంచి ఉద్యోగమొచ్చింది. పెళ్ళి చేసారు, పిల్లలు పుట్టుకొచ్చారు. విలాసవంతమైన జీవితం, వీకెండ్ పార్టీలు, ప్రయాణాలు. అప్పుడప్పుడూ ఇండియా రావడం, చుట్టాల్లా ఉండి వెళ్ళడం. నాన్న మంచి ఉద్యోగంలో ఉండడంతో ఇంట్లో పనిచేసేవాళ్ళకి లోటులేదు. ఓ రాత్రి నాన్న హటాత్తుగా గుండె పోటుతో చనిపోయాడు. శవంతో అమ్మ ఆ రాత్రంతా ఉంది. షాక్ లోకి వెళ్ళిపోయింది. నాన్న చనిపోయాడని ఆమె మనసు రికార్డ్ చేసుకోలేదు. మూడు రోజుల తర్వాత నేనొస్తే వచ్చావా, నాన్నని ఆసుపత్రిలో జాయిన్ చేసి నాకు చూపించడం లేదు" అంది. నాకు ఏడుపు తన్నుకొస్తోంది. అమ్మ ఏడవడం లేదు. హాస్పిటల్ కి పోదామంటుంది.
అమ్మ చుట్టూ బంధువులున్నారు. అరగంట తర్వాత మార్చురీ నుండి నాన్న శవాన్ని తెచ్చారు. ఆయనకి ఆఖరి స్నానం చేయిస్తున్నప్పుడు అమ్మ విరుచుకుపడిపోయింది. నాన్న లేడని అర్ధమైంది. అంతా ముగిసిపోయింది. అమ్మని అమెరికా పోదాం రమ్మన్నాను. రానంది. ఈ ఇంటితో, మీ నాన్నతో ఏభై ఏళ్ళ అనుబంధం నాది. ఇక్కడే ఉంటాను. ఎక్కడికీ రానంది.
నా పరిస్థితి మీరూహించగలరనుకుంటాను.అమ్మకి నేనొక్కడినే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రమే. ఎన్నో రకాల మందులేసుకుంటుంది. నాన్న ఇన్నాళ్ళు అమ్మని చూసుకున్నాడు. రేపటి నుండి ఎలా. ఒంటరిగా ఉన్న ఓ దగ్గర బంధువును అమ్మ దగ్గరుంచి నేను వెళ్ళిపోయాను...
వెళ్ళాను కానీ పదిహేను రోజుల్లోనే తిరిగొచ్చాను. మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వచ్చాను.
నా తిరుగుళ్ళు ఇంట్లో గొడవలు రేపాయి. నా ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిపోయాయి.
అంత పెద్ద ఇంటిలో ఒక్కర్తీ ఉంటున్న అమ్మ గుర్తుకొస్తే ముద్ద దిగేది కాదు. తన తోడుని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అమ్మ గుర్తొచ్చి ఏడ్చేవాడిని. నా జీవితమంతా అమ్మ పంచిన ప్రేమ, లాలన మర్చిపోయి యంత్రంలా మారిన నా బతుకు పట్ల నాకే అసహ్యం వేసేది. ఓ రొజు నా పిల్లలిద్దరినీ కూర్చోబెట్టి నా పరిస్థితి గురించి చెప్పాను.
"నానీ తో స్కైప్ లో మాట్లాడొచ్చుగా డాడీ" అని మాత్రమే అన్నారు.
"నేను ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నాను."
"వాట్...ఆ ముసలామె కోసం నీ కెరీర్ పాడుచేసుకుంటావా?" అంది నా భార్య.
"డాడీ...ఆ డర్టీ ఇండియాకి మేము రాం." ఇద్దరూ ఒకే సారి అరిచారు.
రోకీ నేను చచ్చిపోతే మీ అమ్మని కూడా నేను వదిలేసినట్టు వదిలేస్తావా?
ముగ్గురూ బిత్తరపోయారు.
నేను మిమ్మళ్ని రమ్మని అడగడం లేదు. మీ చదువులు పాడవుతాయని నాకూ తెలుసు. మీరు ఇక్కడే ఉండండి. నేను వెళతాను.
దాని మీద చాలా అర్గుమెంట్స్ జరిగాయి.
"ఇంత మంచి జీవితాన్నిచ్చిన అమెరికాని వదిలేసి ఇండియా పోతానంటున్నావ్ ఏముంది డాడీ అక్కడ" అంది నా కూతురు
"అక్కడ మా అమ్ముంది. నా మీద ప్రాణాలన్ని పెట్టుకుని పెంచిన మా అమ్ముందమ్మా అక్కడ. నన్ను కని పెంచిన నా కన్నతల్లిని వొంటరిగా వదిలేయలేనమ్మా" అంటూ ఏడ్చాను. గుండెలవిసేలా ఏడ్చాను. ఆ తర్వాత నెల రోజుల్లో అన్నీ సర్దేసుకుని, ఉద్యోగానికి రెజైన్ చేసీ ఇండియా వచ్చేసాను.
నేనొచ్చి ఐదేళ్ళయ్యింది. మా నాన్న మీద బెంగతో, అనారోగ్యంతో అమ్మ వెళ్ళిపోయింది. అమ్మతో గడిపిన ఈ ఐదేళ్ళు నాకు ఎంతో తృప్తిని, సంతోషాన్ని ఇచ్చాయి. ఆ తర్వాత నా భార్యా పిల్లలూ కూడా వచ్చేసారు. చాలా కాలం గా ఇలా ఓల్డేజ్ హోం లు తిరుగుతూ నా కధ చెబుతుంటాను. అమెరికా కంటే అమ్మెంత గొప్పదో చెబుతుంటాను."
రఘురాం కళ్ళల్లో నీళ్ళు.
నన్ను వదిలేసి వడి వడిగా వాళ్ళమ్మ గది వైపు వెళ్ళిపోయాడు.

"తల్లిదండ్రులు జీవించి ఉండగానే మనసారా సేవించి మనబాల్యంలో వారు పంచిన ఆప్యాయతానురాగాలను తిరిగి పంచి కన్నవారి ఋణం తీర్చుకోండి. కాలం కరిగిపోయిన తరువాత ఎంత ఏడ్చినా ఏమి పలితం?"

అశ్రునయనాలతో...మీ...🙏🙏🙏🙏.

Source - Whatsapp Message

సకల దేవతల మంత్రాలు..!!

💐💐💐సకల దేవతల మంత్రాలు..!!💐💐💐
ఓం నమః శివాయ..!!

మంత్ర తంత్రాలు మనిషి జీవితంలోని
గ్రహదోషాలకు పరిష్కార మార్గాలు చూపిస్తాయి. దేనికి ఏ మంత్రం పఠిస్తే ఎలాంటి పరిష్కార మార్గం లభిస్తుందో మీ కోసం.💐

వ్యాపార లాభాలకు మంత్రం:.💐
1. దుర్గే శివే భయనాశిని మాయే నారాయణి సనాతని
జయే మే పత్య దేహేదేహిన్‌ రక్షరక్ష కృపాకరీ
2. ఓం నమో ప్రీం పీతాంబరాయ నమః

మంత్రం::
శివశక్తి కామక్షితి రధ రవి శ్శీతకిరణం స్మరో హంస శక్రస్త
ధనుజ పరామార హరయః
అమీ హృల్లేకాభిఃతి స్వభావ రసానేషు ఘటితా
భజన్తే వర్ణాస్తే తవ జననీ నామావయవతాం

హనుమాన్‌ శత్రుంజయ మంత్రం:💐
ఓం నమో భగవతే మహాబల పరాక్రమాయ మహా విపత్తి నివారణాయ
భక్తజన మనోభీష్ట కల్పనాకల్ప ధ్రుమాయ
దుష్టజన మనోరథ స్తంభనాయ
ప్రభంజన ప్రాణప్రియాయ శ్రీం

ధనప్రద శ్రీ లక్ష్మీ కుబేర మంత్రం:💐

కుబేరో ధన దః శ్రీ దః రాజరాజో ధనేశ్వరః
ధనలక్ష్మీ ప్రయతమో ధనాడ్యో ధనిక ప్రియః
ఓం శ్రీం క్లీం శ్రీం కార్యసిద్థి కుబేరాయ నమః
ఓం శ్రీం క్లీం శ్రీం లక్ష్మీ కుబేరాయ నమః
ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం యుక్తేశ్వరాయ నమః
ఓం యక్షాయవిద్మహే వైశ్రవణాయ ధీమహే
తన్నో కుబేర ప్రచోదయాత్‌

విద్యా విజయానికి మంత్రాలు..💐
1. ఆనంద తీర్థ వరదే దానవారణ్య పావకే
జ్ఞానదాయనే సర్వేశే శ్రీనివాసేస్తు మే మనః
2. శ్రీవేంకటేశా శ్రీనివాసా సర్వశత్రు వినాశకా
త్వమేవ శరణం స్వామిన్‌ సర్వత్ర విజయం దిశా

సంతాన గోపాల మంత్రం:💐
ఓం హ్రీం కృష్ణాయ హూం శ్రీం క్లీం గోవిందాయ ఫట్‌ స్వాహా
ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణా గోవిందా గోపీజన వల్లభా మమ పుత్ర దేహీ స్వాహా
దేవకీ సుత గోవిందా దేవదేవ జగత్పతే దేహిమే తనయే కృష్ణా తవమహం శరణం గతః

విద్యాప్రాప్తికి సరస్వతీ స్తోత్రం:💐
సరస్వతీ మాం దృష్ట్యా వీణా పుస్తక ధారిణీం
హంస వాహన సమాయుక్తా విద్యాదాన కరే మమ
ప్రథమం భారతీనామా, ద్వితీయంచ సరస్వతీ
తృతీయ శారదాదేవీ, చతుర్థం హంస వాహిని
పంచమం జగతీ ఖ్యాతా, షష్ట్యం వాణీశ్వరీ తథా
కౌమారీ సప్తమం ప్రోక్తా, అష్టమం బ్రహ్మచారిణి
నవమం బుద్ధి ధాత్రీచా, దశమం వరదాయని
ఏకాదశం క్షుద్ర ఘంటా, ద్వాదశం భువనేశ్వరీ
ద్వాదశైతాని నామాని త్రిసంధ్య యః పఠేన్నరః
సర్వసిద్ధి ఖరీతస్య ప్రసన్న పరమేశ్వరీ
సామేవసతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతీ

విజయానికీ సకల దోష నివారణకూ తగిన మంత్రాలు, స్తోత్రాలు..💐

లక్ష్మీగణపతి:.💐
సర్వవిజ్ఞ హరం దేవం సర్వవిజ్ఞ వివర్జితం
సర్వసిద్ధి ప్రదాతారం లక్ష్మీగణపతిం భజే

క్షమాపణకు:.💐
నారాసింహానంత గోవిందా భూతభావన కేశవా
దురుక్తం దుష్కృతం ధ్యాతం శమయాషు జనార్దనా

సర్వఫలప్రదభైరవ స్తోత్రం:.💐
ఓం భైరవాయ అనిష్ట నివారణాయ స్వాహా
మమ సర్వేగ్రహ అనిష్ట నివారణాయ స్వాహా
జ్ఞనం దేహి ధనం దేహి మమ దారిద్య్రం నివారణాయ స్వాహా
సుతం దేహి యశం దేహి మమ గృహక్లేశం నివారణాయ స్వాహా
స్వాస్థ్యం దేహి బలం దేహి మమ శత్రు నివారణాయ స్వాహా
సిద్ధం దేహి జయం దేహి మమ సర్వ రుణాం నివారణాయ స్వాహా

దీర్ఘాయువుకూ, చిరంజీవత్వానికి:💐
అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంచ్ఛ విభీషణః
కృపః పరశురామాచ్ఛ సప్తైతే చిరంజీవి నమః
సప్తైతాన్‌ సంస్మరే నిత్యం మార్కండేయ మదాష్టకం
జీవేద్వర్ష శతంశోపి సర్వవ్యాధి వివర్జితః

విద్యావిజయంకరీ మంత్రం:💐
ఓం ఐం హ్రీం హ్రీం క్లీం క్లీం హౌం సః
నీల సరస్వతే నమః
(ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం కనీసం 11సార్లు
లేదా 108సార్లు జపిస్తే సత్వర విద్యాభివృద్ధి కలుగుతుంది)

సత్వర వివాహానికి - దాంపత్య దోష నివారణకు.💐
1. కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్‌ యతీశ్వరీ
నందగోప సుతం దేవీ పతిమే కురుతే నమః
2. అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః
కామేశ బద్ద మాంగల్య సూత్ర శోభిత కందర
3. విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే
3 సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణే నమోస్తుతే
గమనిక: రుక్మిణీ కల్యాణం పారాయణం చేయటం కూడా మంచిది

మంగళచండికా స్తోత్రం:💐
రక్షరక్ష జగన్మాతా దేవీ మంగళ చండికే
హారికే విపదం రక్షే హర్ష మంగళ కారికే
హర్ష మంగళ దక్షేచా హర్ష మంగళ దాయినే
శుభే మంగళ దక్షేచా శుభే మంగళ చండికే
మంగళే మంగళా ర్హేచా సర్వమంగళ మంగళే
సదా మంగళాదేవీ సర్వేశాం మంగళలయే

భార్యాభర్తల పరస్పర ఆకర్షణకు.💐
ద్రాం ద్రవిణే బాణాయ నమః
ద్రీం సంక్షోభణ బాణాయ నమః
క్లీం ఆకర్షణ బాణాయ నమః
బ్లూం వశీకరణ బాణాయ నమః
సం సమ్మోహన బాణాయ నమః

పురుషత్వం,సంతాన ప్రాప్తికి.💐
కథాకాళేమాతః కథయా కళితాలక కరశం
పిబేయం విద్యార్థీ తవచరణ నిర్లేజన జలం
ప్రకీర్తా మూకనామ పిచకలితాకారణ తయా
యథాదత్తే వాణీముఖ కమల తాంబూల రసతాం

శీఘ్ర వివాహానికి..💐
కన్య నిత్యం స్నానానంతరం తులసి చెట్టుకు
12 ప్రదక్షిణాలు చేసి గౌరీమాతను ప్రార్థిస్తూ సౌందర్యలహరిలోని 4,11,27 శ్లోకాలలో
ఏదో ఒకదాన్ని పఠించాలి.
ఇలా 120 రోజులు చేస్తే త్వరగా వివాహమవుతుంది.
స్వస్తి..!!💐

Source - Whatsapp Message

మనసనేది కోరికల కర్మాగారం. ఆ విషయం గ్రహించి బయటపడాల్సింది మనమే.

మనసు
మనిషిలోని మనసు చాలా చంచలమైంది. మనిషి బాల్యం నుంచి చూసిన అనేక దృశ్యాలను లక్షల సంఖ్యలో అది గుర్తుపెట్టుకుంటుంది.

ఒకదాని తరవాత మరొకదాన్ని మనసు కోరుతూనే ఉంటుంది.

నిజానికి మనం మనలోని మనసును గురించి అవగాహన కల్పించుకోవాలి. దాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అలా నమ్మడం ఒక పెద్ద వ్యామోహం.
ఈ వ్యామోహాన్ని తగ్గించుకోవాలంటే మనసు చెప్పినట్లు మనం వినడం కాక మనం చెప్పినట్టు మనసు వినేలా చేయాలి. అనేక సందర్భాలలో మనం అంటూ ఉంటాం నా మనసు ఒప్పుకోలేదు అని. అంటే మనం గట్టిగా చెప్తే ఒప్పుకుంటుంది.

మరి ఈ మనసును స్థిమితపరచడం ఎలా?
కోరికల్ని నియంత్రించడం ఎలా?

ఇందుకోసం మనం సాధన చేయాలి.
మొదట మనలోని కృత్రిమత్వాన్ని గుర్తించాలి
అందులోని చెడును తెలుసుకోవాలి.

మానవత్వాన్ని, దైవత్వాన్ని అవగాహన చేసుకోవడంవల్ల మాత్రమే అది సాధ్యపడుతుంది.

మనసులోకి ప్రవేశిస్తున్న ప్రతి ఆలోచనను గమనిస్తూ ఉండాలి. అలాంటి గమనిక కొనసాగినప్పుడు మనసు తాలూకు చంచల ప్రవృత్తి నెమ్మదిస్తుంది.
ఆ తరవాత మన మనసులోకి మనం ప్రవేశించగలం

సాధారణంగా మనసు తాను గమనించిన ప్రతిదానికి ఏదో ఒక పేరు పెట్టి దానికో ప్రయోజనం కల్పించి, మరొకదానితో పోల్చడం చేస్తుంది.

అయితే ఏ ప్రయోజనం ఆపేక్షించకుండా, నిర్వ్యామోహంగా మనసు లోపలికి చూడటం జరిగితే చంచలమైన ఆలోచనలు ఆగిపోతాయి.
నిశ్చలమైన స్థితి కలుగుతుంది. అప్పుడు మాత్రమే మనం తీసుకునే నిర్ణయం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది.

ఈ స్థితిని నిలుపుకోవడం ఎలా?*

శ్రీహరి యొక్క దివ్య విగ్రహరూపాన్ని ధ్యానించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యం. ఆస్వామి పై ఏకాగ్రతయే ధ్యానం

మనలోని సున్నితత్వం, సూక్ష్మ పరిశీలనా పెరిగే కొద్దీ- ఆలోచనలు, కోరికలు సమసిపోతాయి. ఆలోచనల నుంచి స్వేచ్ఛ పొందడం, స్వస్థితిని చేరడం- మనల్ని మనం తెలుసుకోవడం! ఇవి తెలివితేటలతో సాధించేవి కాదు. మన స్వప్రేరణతో అనుభవించవలసిందే.

మనసు ప్రమేయం లేకుండా స్వప్రేరణ సాధ్యమేనా? సాధ్యమే, కాని సాధన చాలా కష్టం.
ఎందుకు? మనసును గమనించడం మనకు అలవాటు లేని పని.
మన నరాల నిర్మాణం అందుకు సహకరించదు. మన మెదడులోని కణాలు తమను తాము గమనించుకోవడానికి అలవాటు పడిలేవు. అందుకే మన దృక్పథం మారడం ముఖ్యం.
ఏవో కొన్ని అలవాట్లు, ఆలోచనలు మార్చుకున్నంత మాత్రాన సరిపోదు. మనలో మార్పు సమూలంగా రావాలి. అప్పుడే నూతన చైతన్యం కలుగుతుంది. మనశ్శాంతిని ఆనందాన్ని ప్రసాదించే సక్తిగల నారాయణుని ఆశ్రయించాలి. ఆయన అనుగ్రహంతో మనసు మన మాట వింటుంది.

దైవీ హ్యేషా గుణమయి
మమమాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే
అని గీతా వాక్యం

మనసనేది కోరికల కర్మాగారం.
ఆ విషయం గ్రహించి బయటపడాల్సింది మనమే.
మన గురించి మనం అర్థం చేసుకొన్నప్పుడు ఆత్మ విలువ తెలుస్తుంది. అప్పుడే మనసు చేసే పెత్తనం నుంచి మనం స్వేచ్ఛ పొందగలుగుతాం.
ఆ స్వేచ్ఛలోనే శాంతి లభిస్తుంది.

Source - Whatsapp Message

*ఆ దేవుడు చేయాల్సిన పని ని,....* *మానవుడు చేస్తే ,ఆ మనిషిని,* *మానవ రూపంలో ఉన్న* *భగవంతుడు అని అంటాం ,ఎందుకో ఇది చదవండి*

ఆ దేవుడు చేయాల్సిన పని ని,....
మానవుడు చేస్తే ,ఆ మనిషిని,
మానవ రూపంలో ఉన్న భగవంతుడు అని అంటాం ,ఎందుకో ఇది చదవండి

ఒకసారి కృష్ణార్జునులు కలిసి ద్వారకా నగర వీదుల్లో వెళుతున్నారు. వారికి దారి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జనుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచీ నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు.

సంతోషంగా తీసుకువెళుతున్న ఆ యాచకుడిని మార్గంమధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు .మళ్లీ ఆ పేదవాడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు.

మళ్లీ ఓరోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జనుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న పాత కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు.

తెల్లారింది...... చూస్తే భార్య లేదు. అంతేకాదు ఆ కుండ కూడా లేదు. పరుగెట్టుకుంటూ నదీతీరం వద్దకు వెళ్లాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు.

కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ పేధవాడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు.

మళ్లీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైందని. ఇంక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్ణవంతుడిలా ఉన్నాడు – అన్నాడు అర్జనుడు శ్రీ కృష్ణుడితో.

లేదు అర్జునా....... ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని పేదవాడీ చేతిలో రెండు బంగారు నాణేలు పెట్టాడు శ్రీకృష్ణుడు.

ఒకప్పుడు సంచీడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈ రెండు నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చికానీ అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ పేదవాడు

దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిలలాడుతున్న చేపను చూశాడు.
అతని హృదయం ద్రవించింది.

కృష్ణుడు నాకిచ్చిన రెండు నాణేలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం మూగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణేలూ ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకెళ్లి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు.

అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుంది అండీ అందుకే గిలగిలా కొట్టుకుంటోంది అని పిలిచింది. ఇద్దరు కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుకున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు.

నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై “దొరికింది…దొరికింది నా చేతికి చిక్కింది” అని గావుకేకలు పెట్టాడు.

అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద వాడిని చూసి కంగారుపడ్డాడు. గతంలో అతన్ని దారిదోపిడి చేసి బంగారు నాణేల సంచి దొంగలించాను, నన్ను చూసి ఆ పేదవాడు కనిపెట్టాను, నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకుని వణికిపోయాడు.

ఆ పేదవాడు దగ్గరకి వచ్చి నీకు దణ్ణం పెడతాను, నీ బంగారు నాణేలు నువ్వు తీసేసుకో నన్ను రక్షకభటులకు మాత్రం పట్టివ్వద్దు అని ప్రాధేయపడ్డాడు.

ఇప్పుడు నివ్వెరపోవడం పేద దంపతుల వంతయింది. తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులూ తమకు చేరాయి. పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు.

కృష్ణా........, నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు, వజ్రం ఇచ్చినా అతని
దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన రెండు నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు అర్జునుడు.

అర్జునా.........., అతని వద్ద బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను, తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు.

అదే రెండు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచిచెడులు, ఈతిబాధలు, కష్టసుఖాలు గురించి ఆలోచించాడు.

నిజానికి అది దేవుడి చేయాల్సిన పని. తనూ పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ.

Source - Whatsapp Message

జీవితంలో ప్రేమ విఫలమైన ఓ గణిత విద్యార్థి తన ప్రియురాలికి వ్రాసిన లేఖ...

జీవితంలో ప్రేమ విఫలమైన ఓ గణిత విద్యార్థి తన ప్రియురాలికి వ్రాసిన లేఖ...

డియర్ రేఖ,

వాస్తవ సంఖ్యా సమితి లాంటి నా జీవితంలోనికి కల్పిత సంఖ్యలా ప్రవేశించావు.

అప్పటినుండి క్రమ భిన్నంలా సాఫీగా సాగిన నా జీవితం అపక్రమ భిన్నానికి ఎక్కువ, మిశ్రమ భిన్నానికి తక్కువగా మారింది.

మనిద్దరి వయస్సులు సామాన్య నిష్పత్తి లోనే ఉన్నాయనుకున్నా కానీ భావాలు మాత్రం విలోమానుపాతంలో ఉన్నాయని తెలుసుకోలేకపోయా.

నువ్వు దక్కవని తెలిసాక నా కన్నీళ్ళ ఘన పరిమాణం కొలిచేంత పాత్ర లేదని తెలిసింది. నా హృదయ వేదన వైశాల్యానికి అంతే లేదు.

నీతో సంకలనం... ఇష్టాల వ్యవకలనమని, కష్టాల గుణకారం అని,ఆవర్తనం కాని భాగాహారమని తెలుసుకోలేకపోయా.

మన ప్రేమ సమీకరణాలన్నీ సాధనలేని అసమీకరణాలు అవుతాయని కలలో కూడా ఊహించలేదు.

నిరూపణ లేని సిద్ధాంతానికి దత్తాంశం నువ్వయితే సారాంశం నేనయ్యా!

నా ప్రమేయం లేకుండా నీతో ఏర్పడ్డ ఈ బంధం తుల్య సంబంధం కాకపోయినా కనీసం స్నేహబంధమైనా కాలేదు.

ఇంతకాలం సమైక్య రేఖలా ఉన్న నువ్వు ఒక్కసారిగా సమాంతర రేఖగా ఎందుకు మారావో తెలియదు.

ఏది ఏమైనా నీతో వ్యవహారం సున్నాతో భాగాహారం లాంటిదని ...నిర్వచితం కాదని... ఇన్నాళ్ళకు తెలుసుకున్నా...
ఇట్లు
నీ విఫల ప్రేమికుడు,
గణిత విద్యార్థి

Source - Whatsapp Message

ప్రస్తుత బాల్యం వెలవెల పోయె, దానికి మూల్యం ప్రస్తుత మాయే.

జారే అరుగుల ధ్యాసే లేదు
పిర్ర పై చిరుగుల ఊసేలేదు

అమ్మ చేతి మురుకులు లేవు
అలసట లేని పరుగులు లేవు

ఎత్తరుగులు మొత్తం పోయే
రచ్చబండలూ మచ్చుకు లేవు

వీధిలో పిల్లలు అల్లరి లేదు
తాతలు ఇచ్చే చిల్లర లేదు

ఏడు పెంకులు ఏమైపోయే
ఎద్దు రంకెలు యాడకి పోయె

ఎక్కడా ఎదురు తడికెలు లేవు
ఏ తడికకీ భోగి పిడకలు లేవు

కూరలమ్మే సంతలు లేవు
పెరుగులమ్మే ముంతలు లే
బువ్వా లాటల విందే లేదు
గవ్వలాటలు ముందే లేదు

కుప్పిగంతులు లేనే లేవు
కళ్ళ గంతలు కానే రావు

కోకో మూతల గోలే లేదు
బచ్చాలాడే ఇచ్చా లేదు

కోతి కొమ్మచ్చి ఏమైపోయే
మాత అప్పచ్చి ముందే పాయె

గూటీ బిళ్ళా గూటికి పోయే
తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చె

గచ్చకాయలు మచ్చుకు లేవు
చింత పిక్కలు లెక్కకూ లేవు

ధారగా కారే ముక్కులు లేవు
జోరుగా జారే లాగులు లేవు

కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు
కొండముచ్చుని కెలుకుడు లేదు

బట్టన మురికి అంటక పోయె
మనసుకి మురికి జంటగ చేరె

కాకి ఎంగిలి కరువై పోయే
భుజాన చేతులు బరువై పోయె

అన్ని రంగులూ ఏడకో పోయె
ఉన్న రంగులూ చీడకి చేరె

ప్రస్తుత బాల్యం వెలవెల పోయె
దానికి మూల్యం ప్రస్తుత మాయే . ఇది ఈనాటి బాల్య జీవితం గడుపుతున్న వారికి ఏమాత్రం తెలియదు అందుకు పెద్దలు ఎంతవరకు కారణమో మరొకసారి ఆలోచించండి . 🙏🙏🙏🙏

Source - Whatsapp Message

మంచి మాట..లు

ఆత్మీయులైన మీకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు. పరమేశ్వరుని అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.... అందరు బాగుండాలి అందులో మనముండాలి 💐🌹👍🤝

23-08-2021:-సోమవారం
ఈ రోజు
AVB మంచి మాట..లు

చూడు మిత్రమా!!
జీవితంలో ఎప్పుడైనా సరే అబద్దం చెప్పే వాళ్లనైన నమ్మచ్చు కానీ, అబద్దం చెప్పి ఇదే నిజమని నమ్మించే వారిని మాత్రం అస్సలు క్షమించకూడదు,,


ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు,, ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి,, ఈ రెండు సంపాదించుకున్న వారు జీవితంలో అంతులేని ఆనందాన్ని పొందుతారు,,


ఏదో ఒక్కటి ఇవ్వమని దేవుణ్ణి రోజు ప్రార్థిస్తూ ఉంటాం,, కానీ జీవితమే ఒక వరమని ఎప్పటికి అర్థమౌవుతుందో మనకు, ఎన్నో జన్మల పుణ్యమే ఈ మానవ జన్మం అని తెలుసుకోలేకపోతున్నాo మనుషులo,,
సేకరణ ✒️AVB సుబ్బారావు, వినుకొండ 💐🤝🌹👍

Source - Whatsapp Message

మంచి మాట..లు

ఆత్మీయ బంధుమిత్రులకు ఆదివారపు మరియు రాఖీ పండగ శుభోదయ శుభాకాంక్షలు🎁🌅🌼
ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుని అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందం గా జీవించాలని కోరుకుంటూ.. మీ ఆత్మీయ బంధువు.. AVB సుబ్బారావు 💐🤝
ఆదివారం :-22-08-2021

ఈ రోజు AVB మంచి మాట..లు

అమ్మ లోని నాన్న లోని నా మామయ్య లోని య్య.. లతో అన్నయ్య .. ఆత్మీయత లేని పెదాలమీద నుంచి వచ్చే బ్రో అని కాకుండా.. హృదయాంతరాలలో నుంచి వచ్చే అన్నయ్య అనే పిలుపే ఎంతో ఆప్యాయత ఉంటుంది తెలుగు కమ్మదనం తో అన్నయ్య అని పిలుద్దాం

సంభందమో అర్థం కాని పెదవుల మీద నుంచి వచ్చే పిలుపులు మానేద్దాం అంటి అంకుల్ అని పిలుపు అంటి అంటే నువ్వు నాకు యాంటీ అని అంకుల్ అంటే నువ్వు నాకు పెంకుల్ అని కాకుండా అత్తయ్య , పెద్దమ్మ చిన్నమ్మ మామయ్య, చిన్నాన్న పెదనాన్న అని హృదయంతరాలలోంచి వచ్చే పిలుపుతో పిలుద్దాం.. ఆత్మీయతలను బంధాలను అనుబంధాలను గౌరవిద్దాం

మమ్మీ డాడీ అని ముద్దు గా పిలిపంచుకొని మురిసిపోయే తల్లి తండ్రులారా పిల్లలకి అమ్మ అనే పిలుపు లోని ఆప్యాయత నాన్నా అనే పిలుపు లోని నా స్వంతం అనే భావనలు దూరం చేయకండి... అమ్మాని మమ్మి లా నాన్నా ను డ్యూడ్ గా మార్చకండి, ఆప్యాయత లను దూరం చేయకండి

అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.. నేను మీకు రక్షా. మీరు నాకు రక్షా మనమందరం సమాజానికి రక్షా,, మనందరికీ సర్వేశ్వరుడై న పరమేశ్వరుడు రక్ష
🙏
అభినందనలు తెలియచేస్తూ మీ ఆత్మీయుడు.. AVB సుబ్బారావు 💐🤝👍

Source - Whatsapp Message

Monday, August 23, 2021

ఈ రోజు రాఖీ పౌర్ణమి

🚩ఈ రోజు రాఖీ పౌర్ణమి🚩

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

'రాఖీ , రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర , పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు , అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. అది చాలా ఉత్సాహంతో జరుపుకుం‌టూరు.

రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే

పూర్వం దేవతలకు , రాక్షసుల కు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై , తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరుల ను , లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.

రాఖీపౌర్ణమి చరిత్ర

ద్రౌపది - శ్రీకృష్ణుని బంధం

ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది , శ్రీకృష్ణుడి కి అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడి ని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు.

శ్రీ మహావిష్ణువు - బలిచక్రవర్తి

శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి , తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. (ప్రాచీన గాథ " యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వా మభిబధ్నామి రక్షే మా చల మా చల" భావం - ఓ రక్షాబంధమా ! మహాబలవంతుడూ , రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు. కాబట్టే నేను నిన్ను ధరస్తున్నాను.)

అలెగ్జాండర్‌ భార్య – పురుషోత్తముడి కథ

చరిత్రపుటల్లో అలెగ్జాండర్‌ భార్య ‘రోక్సానా’ తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్‌ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలో బాక్ట్రియా (నేటి ఆఫ్ఘనిస్తాన్ )కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహసంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను , ముఖ్యంగా జీలం , చినాబ్‌ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్‌ ఆలోచన. అలెగ్జాండర్‌ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి , అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్‌ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్త అయిన అలెగ్జాండర్‌ను చంపవద్దని రోక్సానా పురుషోత్తముడిని కోరుతుంది. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్‌ను చంపకుండా విడిచిపెడతాడు.

హయగ్రీవావతారం

శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను , శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Source - Whatsapp Message

Sunday, August 22, 2021

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.
🍃🌹మనసు ఆరోగ్యంగా ఉంటే,మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.మనసు ఆరోగ్యంగా ఉండాలంటే,గతాన్ని గురించి తక్కువ ఆలోచించు.భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు..

🍃🌹సాధించాలి అనే తపన ఉంటే,ఎవరూ ప్రోత్సహించక్కర్లే.
ఎవరూ సపోర్టుగా నిలబడాల్సిన అవసరం లేదు.
ఎవరూ మన వెనకే నడుస్తూ అడుగడుగునా పొగడక్కర్లే..

🍃🌹ఎవరు నీ పక్కన నిలబడినా, లేకున్నా, నీ లక్ష్యం వైపు మాత్రమే నీ అడుగులు పడితే నీ లైఫ్ వేరుగా ఉంటుంది..

🍃🌹వ్యక్తిత్వం అనేది కొంటె రాదు.
నీ
తల్లిదండ్రులు నేర్పితే వస్తుంది.గురువుల దగ్గర నేర్చుకుంటే వస్తుంది.కొందరికి పుట్టుకతో వస్తుంది..వస్తే చచ్చేంత వరకు నీ నీడై నీతోనే,నీలోనే ఉంటుంది.ఎండకు ఎండదు వానకు తడవదు.
డబ్బు ప్రలోభంలో అసలే పడదు,సరైన వ్యక్తికి వ్యక్తిత్వమే ఆస్తి..

🍃🌹ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానం.
ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం.
ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద.
ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనఃశాంతి.
ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత.
ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ.

🍃🌹శుభోదయం. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

Saturday, August 21, 2021

అద్భుతమైన నిజ జీవిత కథ కూతురు - కోడలు

అద్భుతమైన నిజ జీవిత కథ

కూతురు - కోడలు

నాపేరు లక్ష్మణరావు. నేనుండేది రాజమండ్రి పక్కన ధవళేశ్వరం. మండల రెవెన్యూ అధికారిగా ఉద్యోగం చేసి ఈమధ్యనే రిటైర్ అయ్యాను. నాకొక కొడుకు ఒక కూతురు. నాకూతురు అచ్చం నా అమ్మ పోలికే అందుకే చిట్టితల్లీ అని గారాబంగా పిలుస్తాను. నా కొడుకు డాక్టర్ అయ్యాడు..నా కూతురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యింది..

నాకూతురుకి చక్కని సంబంధం వచ్చింది. ఒక్కడే కొడుకు. బాగా ఆస్థిపరులు. అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, అమెరికా ఉద్యోగం. కోటి రూపాయల కట్నం పెట్టి ఘనంగా నా కూతురు పెళ్ళి జరిపించాను. నా కూతురు పెళ్ళిలో ఒక అమ్మాయిని చూసి నా కొడుకు ఆమెనే పెళ్ళి చేసుకుంటా అని పట్టుబట్టాడు.

ఆ అమ్మాయి వివరాలు ఆరాతీయగా ఆమె పంచాయితీ గుమస్తా కూతురని, ఆయుర్వేదిక డాక్టర్ అని, చాలామంచి కుటుంబం అని కాని ఆమె తండ్రి ఏమాత్రం ఆస్థులు సంపాదించలేదని తెలిసింది. నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. నా శ్రీమతి, నా కొడుకు మనకు మంచిగా ఆస్థిపాస్థులు ఉన్నాయికదా..

అమ్మాయి ఆయుర్వేదిక డాక్టర్...మంచి కుటుంబం...కాదనకండి అంటూ ఒప్పించే ప్రయత్నం చేసారు. చివర ప్రయత్నంగా అమ్మాయి అబ్బాయి జాతకాలు చూపించాను. నూటికి నూరుపాళ్ళు జాతకాలు కలిసాయి అని విన్నాక ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయిని మా ఇంటి కోడలు చేసుకోవలసి వచ్చింది.

నాకోడలిని మా ఇంటికి తీసుకు వచ్చేటప్పుడు అదేనండీ అప్పగింతల సమయంలో 200 మందిపైగా మా ఇంటికి వచ్చారు. ఎన్నో పిండివంటలు. సారె సామాన్లు..

ఇంత ఖర్చుపెట్టి ఇన్ని తెచ్చేబదులు డబ్బు ఇవ్వచ్చు కదా అనుకున్నాను. కాని తరువాత తెలిసింది ఏమిటంటే ఆ సామాన్లు, పిండివంటలు చుట్టుపక్కల ఊర్లనుంచి అప్పగింతలకోసం వచ్చిన జనాలు పట్టుకొచ్చారట.

నాకోడలు ఇంటికి వచ్చింది మొదలు రోజూ వైద్య సహాయానికి ఎవరో రావటం, వారికి నా కోడలు ట్రీట్మెంట్ చెయ్యటం, అవసరమైన టెస్టులు చేయించుకోమని చెప్పటం, టెస్టులు చేయించుకునే స్థోమత లేనివారికి రామకృష్ణామిషన్ డయాగ్నాస్టిక్ ల్యాబ్ కి వెళ్ళి తక్కువ ఖర్చుతో టెస్టులు చేయించుకోమని చెప్పటం, రిపోర్టులు చూసి వైద్యం చేసి జబ్బు నయం చేయటం జరుగుతున్నాయి..

నా కొడుకు కార్పొరేట్ హాస్పిటల్ లో డాక్టర్ గా చేస్తూ నెలకు లక్ష రూపాయలు జీతం సంపాదించటమే కాకుండా, చిన్న చిన్న హాస్పిటల్స్ లో విజిటింగ్ డాక్టర్ గా వెల్లి ట్రీట్మెంట్, ఆపరేషన్లు చేస్తూ ఇంకొక లక్ష రూపాయలవరకు సంపాదిస్తున్నాడు. నా కోడలు సంపాదన మాత్రం ఏమీలేదు.

ఒకరోజు లంక గ్రామం నుంచి ఒక రైతు దంపతులు గర్భవతి ఐన తమ కుమార్తెను తీసుకొచ్చారు. ఆ అమ్మాయి చాలా బలహీనంగా ఉంది. నడవటం కూడా కష్టంగా ఉంది. ఆ అమ్మాయిని చూసి ఎందుకు ఇంత అశ్రధ్ధ చేసారు అని మా కోడలు ఆమె తల్లిదండృలను మందలించింది. టెస్టులు రాసి రిపోర్టులు తీసుకురమ్మని చెప్పింది. మరునాటి ఉదయం రిపోర్టులతో వచ్చారు..

మీ అమ్మాయికి దాదాపు నెలకుపైగా మంచి ట్రీట్మెంట్ చెయ్యాలి అనగానే రోజూ తీసుకు రావటం కష్టం తల్లీ నీకు తెలియంది కాదు కదా అని రైతు దంపతులు ప్రాధేయపడ్డారు. మా కోడలు నా దగ్గరకు వచ్చి పరిస్థితి వివరించింది. నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు, కాని నా భార్య ఆ అమ్మాయి పరిస్థితి చూసి కనికరించండి అని సెంటిమెంటు తో కొట్టింది. నాకు ఒప్పుకోక తప్పలేదు.

మా ఇంటి ముందర గదిలో బెడ్ వేసి ఆ అమ్మాయికి మా కోడలు ట్రీట్మెంట్ మొదలెట్టింది. ఆ అమ్మాయి తండ్రి ఊరు వెల్లి బియ్యం పప్పులు కూరలు తీసుకొచ్చాడు. మా ఇంటి పని, తోటపని మొత్తం ఆ అమ్మాయి తల్లిదండృలు చేస్తున్నారు. నెలరోజుల తరువాత టెస్టులకు పంపింది..

టెస్టు రిపోర్టులు చూసి బావున్నాయి అంటూ ఇంకొక వారం రోజుల తరువాత వారిని తిరిగి పంపింది. వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి ఆరోగ్యవంతంగా చక్కగా నడుచుకుంటూ వెళ్ళింది. నాకు నాశ్రీమతికి పాద నమస్కారం చెసి రైతు తన భార్యను కూతురుని తీసుకుని వెళ్ళాడు.

రెండు నెలల తరువాత ఆ అమ్మాయి ప్రసవించిందని తల్లీ బిడ్డ క్షేమమని ఫోన్ వచ్చింది. ఇంకొక నెల రోజుల తరువాత ఆ లంకగ్రామం నుంచి దాదాపు 50 మంది మా ఇంటికి వచ్చారు. నా శ్రీమతికి నాకు, నా కోడలికి కొడుక్కి పట్టుబట్టలు పెట్టారు. కొత్తబియ్యం తెచ్చారు. ఎన్నో రకాల కూరలు దుంపలు టమాట, మామిడి, గోంగూర ఆవకాయలు పట్టుకొచ్చారు.

ఇప్పుడు నా ఇల్లు చాలా సందడిగా ఉంటుంది. ధవళేశ్వరం బస్టాండ్ దిగి ఎవరినడిగినా మా ఇంటికి సరాసరి తీసుకొచ్చేస్తున్నారు. నేను రోడ్డు మీదకు వెళ్ళేటప్పుడు ఆటోవాడు, రిక్షావాడు డబ్బులు అడగకుండా గమ్యానికి చేరుస్తున్నాడు. కిరాణాకొట్టు వాడు కూడా సామాన్లు డబ్బు తీసుకోకుండా ఇస్తున్నాడు. మా ఇంటిపని తోటపని చేయటానికి జీతం అడగకుండా మేము పిలవకుండా ఒస్తున్నారు..

కాని నాకున్న ఒకే ఒక బాధ. కోటి రూపాయల కట్నం ఇచ్చి పెళ్ళి చేసిన నా కూతురు అత్తమామలకు నెలకు 5 లక్షలు పంపుతుంటే కానీ కట్నం లేకుండా వచ్చిన నా కోడలు కనీసం లక్ష రూపాయలు కూడా నెలకు సంపాదించటం లేదు.

ఇలా ఉండగా అమెరికానుంచి అల్లుడు ఫోన్ చేసాడు. నా చిట్టితల్లి నెలతప్పిందని, తనకు తోడుగా ఇంట్లో ఉండటానికి నాశ్రీమతిని నన్ను రమ్మని. ఫోన్ వచ్చిందే తడవు తనకు ఇష్టమైన పిండివంటలు చేయించి, బట్టలు కొని నాశ్రీమతి నేను అమెరికా పయనమయ్యాము.

నా చిట్టితల్లి చాలా అనారోగ్యంగా ఉంది. విషయమేమిటంటే ఆఫీసులో పనిచెయ్యటం, అక్కడ పెట్టే ఆహారం చిప్స్, పిజ్జాలు, బర్గర్లు, కేకులు, కూల్ డ్రింకులు తో సరిపెట్టుకోవటం, వంట దాదాపుగా లేదు. ఎప్పుడైన టీ కాఫీలు చేసుకోవటం మాత్రం చేస్తున్నారు. నా శ్రీమతి వంటగదిని శుభ్రం చేసింది..

నేను వండి నా కూతురుకి లాలించి, బుజ్జగించి తినిపిస్తున్నాను. అంతా అంటారు, నా శ్రీమతి కంటే నేనే వంట బాగా చేస్తాను అని, చిన్నప్పడు నా చిట్టితల్లి గారాలు పోతుంటే ఆమెకు వండి తినిపించిన సందర్భాలు కోకొల్లలు.

ఒక నాలుగు రోజుల తరువాత నా చిట్టితల్లి ఇంట్లో నడుస్తూ పడిపోయింది. హుటాహుటిన హాస్పిటల్ లో చేర్పించాము. తనకు ప్లేట్లెట్స్ కౌంట్ రోజు రోజుకూ పడిపోతుందని, డాక్టర్లు ప్రయత్నిస్తామని, ప్లేట్లెట్స్ డోనర్స్ ని సిధ్ధం చేసుకోమని, ఇదే పరిస్థితి తీవ్రమైతే నా చిట్టితల్లి ఇక ఉండదని చెప్పారు. నా కొడుక్కి ఫోన్ చేసాను. వెంటనే నా కోడలు-కొడుకు, నా కొడుకు అత్త-మామ, నా కూతురు అత్త-మామ అమెరికా వచ్చారు.

హాస్పిటల్ లో నా కూతురు రిపోర్టులు చూసిన నా కొడుకు చతికిలపడిపోయాడు. నాకు మరింత భయం వేసింది. నా కోడలు రిపోర్టులు చూసి గైనకాలజీ హెడ్ అపాయింట్‌మెంట్ తీసుకుంది. నేను, నా కోడలు-కొడుకు గైనకాలజీ హెడ్ ని కలిసాము. మీరు ఈ టెస్టులు చేయిస్తే బావుంటుందేమో అంటూ నా కోడలు ఒక పది వరకు టెస్టుల పేర్లు చెప్పింది..

ఎందుకు ఆ టెస్టుల అవసరమేమిటి అని గైనకాలజీ హెడ్ ప్రశ్నించగా నా కోడలు కేసు హిస్టరీ, రిపోర్టులు చూపిస్తూ వివిధ కారణాలు చెప్పింది. హెడ్ గైనకాలజిస్ట్ సరే అంటూ ఆ టెస్టులు చేయించమని చెప్పింది.

నా కోడలుని ఆమె అనుభవమంత వయసు నీకు లేదు ఆమెకే సలహాలిచ్చే ప్రయత్నం చేస్తున్నావే అంటూ తీవ్రంగా చీవాట్లు పెట్టాను. శాయంత్రం కాగానే నా అల్లుడు, కూతురు అత్త-మామ హాస్పిటల్ లో ఉండి మాకు ఇంటికి వెళ్ళి తెల్లారి రమ్మని చెప్పారు. నా కోడలు చెప్పిన టెస్టుల రిపోర్టులు తీసుకుని ఇంటికొచ్చాము.

నా మనసు మనసులో లేదు.నా కోడలు తల్లిదండృల బలవంతం మీద ఏదో ఎంగిలిపడ్డాము. నా శ్రీమతి నా కోడలి తల్లి ఒక బెడ్‌రూంలో నిద్రపోతున్నారు. నా కొడుకు నేను ఒక బెడ్‌రూంలో పడుకున్నాము కాని నిద్రపట్టడం లేదు. ఇంతలో నా ఫోన్ మ్రోగింది. భయం భయంగా ఫోన్ ఎత్తాను..

ఫోన్ చేసింది హెడ్ గైనకాలజిస్ట్. మీతో వచ్చి టెస్టులు చేయించమని చెప్పిన అమ్మాయి మీ అమ్మాయి కేసును చక్కగా అనలైజ్ చేసిందట. హైదరాబాద్ లో నాకు తెలిసిన ఆయుర్వేదిక డాక్టర్ ను అడిగి తెలుసుకున్నాను. మరొక్క విషయం ఆ డాక్టర్ గారి శిష్యురాలు ధవళేశ్వరంలో ఉంటుందట. ఆమె భర్తకూడా డాక్టరేనట. ఆమెను మీరు రప్పించి మీ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయిస్తే ఖచ్చితంగా ఫలితం ఉండొచ్చు అంటున్నారు అని చెప్పింది.

కలా నిజమా నమ్మలేకపోయాను. హెడ్ గైనకాలజిస్ట్ కు ఫోన్ కలిపి మాటాడి నిర్ధారణ చేసుకున్నాను. ఇప్పుడు నా కోడలు అపరధన్వంతరి అవతారమూర్తిలా అనిపించింది. బెడ్‌రూం లోనుంచి లేచి హాల్ లోకి వచ్చాను..

నాకోడలు రిపోర్టులు చూస్తూ, మధ్య మధ్యలో కంప్యూటర్లో వివిధ కేసులు చూస్తూ, నా కూతురి ట్రీట్మెంట్ ఎలా చేయాలో నోట్స్ తయారు చేస్తుంది. ఆమె తండ్రి హాల్ లో పచార్లు చేస్తున్నాడు. నన్ను చూసి బావ గారూ నిద్ర పట్టలేదా అంటూ పలకరించాడు..

కోడలు ఇటు తిరిగి చూసింది. నాన్నా! అమ్మను లేపి టీ పెట్టమని చెప్పవా? నిద్ర వస్తుంది అన్నాది. టీ పెట్టడానికి మీ అమ్మను ఎందుకు నిద్రలేపాలి తల్లీ, నేను పెట్టిస్తాను కదా అంటూ నాకోడలి తలపై ఆప్యాయంగా నిమిరాను.

అయ్యో మామయ్య గారు మీకెందుకు శ్రమ అని కోడలు అనగానే మనపని మనం చేసుకుంటే శ్రమ ఏమిటి అంటూ వంటగదిలోకి వెళ్ళాను. నావెనుక నా కోడలి తండ్రి. టీ కాచి మూడు కప్పులలో వేసాను. టీ త్రాగుతూ నా కోడలు మామయ్య గారూ....తనకు ఏ ఇబ్బంది లేదు...మీరు కంగారు పడవలసిన పనిలేదు అంటూ భరోసా ఇచ్చింది.

మరునాడు హెడ్ గైనకాలజిస్ట్ ని కలిసాము. నా కోడలు ట్రీట్మెంట్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని అడిగింది. ఆమె హైదరాబాద్ లోని డాక్టర్ గారిని సంప్రదించి కొద్దిపాటి మార్పులతో ఆమోదించింది..

ఆరోజునుంచి నా చిట్టితల్లికి నా కోడలి పర్యవేక్షణలో ట్రీట్మెంట్ మొదలయ్యింది. డాక్టర్లు 11 వ రోజున కొద్దిగా గుణం కనిపిస్తుంది అన్నారు, 18 వ రోజున ప్లేట్లెట్స్ నష్టపోవట్లేదు అన్నారు. నెల రోజులు దాటాక నా చిట్టితల్లికి ఏమీ ఇబ్బంది లేదు అని చెప్పారు..

నా చిట్టితల్లి నెమ్మదిగా లేచి నడవటం మొదలెట్టింది. నా కోడలు చెప్పిన ఆహారమే పూర్తిగా నా చిట్టితల్లి కి పెడుతున్నాము. ఒక్కోసారి బాగా లాలన చేసి పెట్టాల్సి వస్తుంది. ఐనా నాకోడలు కాని నేను కాని ఎంతమాత్రం విసుగు చెందలేదు..

నా చిట్టితల్లి డెలివరీ డేట్ దగ్గరపడుతున్నకొద్దీ నాకు భయం ఆవహిస్తుంది. నా కొడుకు, వాడి మామగారు నాకు ధైర్యం చెబుతున్నారు. నా శ్రీమతికైతే కోడలి ట్రీట్మెంట్ మీద పూర్తి నమ్మకం వచ్చేసి ధైర్యంగా ఉంది..

నా చిట్టితల్లికి పురిటినెప్పులు ప్రారంభమయ్యాయి. నా కోడలు హెడ్ గైనకాలజిస్టుతో ఎంతో అవసరమైతే తప్ప సిజేరియన్ వద్దు అని చెప్పి ఒప్పించింది. సుఖప్రసవం అయ్యింది. నా చిట్టితల్లి చిన్నారిచిట్టితల్లికి జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమమని హాస్పిటల్ వర్గాలు ఆనందంగా తెలియజేసాయి..

నా మనసు కుదుట పడింది. ఇంటికి వచ్చాను. నా కూతురు మామగారితో వీళ్ళు ఇక్కడుండి సంపాదించింది చాలు, ఇండియాలో కూడా మంచి జీతాలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి కదండీ, మీకు అభ్యంతరం లేకపోతే మీ కోడలిని-కొడుకును మనతోపాటే ఇండియా తీసుకు వెళ్దామండీ అని అభ్యర్ధించాను. నా కోడలి తల్లిదండృలు కూడా సర్ది చెప్పారు. చివరికి ఆయన ఒప్పుకున్నాడు.

రెండునెలల తరువాత ఇండియా పయనమయ్యాము. వారం రోజుల తరువాత నా కోడలి పుట్టినరోజు. వంటగదిలోకి వెళ్ళి నా కోడలికిష్టమైన పుళిహోర చేసాను. నా కోడలు స్నానం చేసి కొత్తబట్టలు వేసుకుని నాశ్రీమతికి నాకు పాదనమస్కారం చేసింది. అక్కడకు వచ్చిన నా కోడలి తల్లిదండృలకు కూడా పాద నమస్కారం చేసింది. ఆవుపాలలో బెల్లం వేసి కలిపి నా కోడలికిచ్చాను. పాలు కొంచెం త్రాగిన తరువాత నా స్వహస్థాలతో చేసిన పుళిహోర ఆమెకు అందించాను..

నా కోడలికి ఆమె తల్లిదండృలకు ఆనందానికి అవధులు లేవు. ఇంతలో గేటు చప్పుడయ్యింది. చాలామంది నా కోడలిని ఆశీర్వదించటానికి, శుభాకాంక్షలు చెప్పటానికి ఇంటికి వచ్చారు. వచ్చినవారికందరికీ టీ, కాఫీ, టిఫిన్లు పెట్టి పంపించాను.

ఇక మా ఇంటికి నా కోడలి దగ్గర వైద్యానికి వచ్చేవారికి నాకు చేతనైన సాయం చేస్తున్నా.ఖండాంతరాలకు వ్యాపిస్తున్న నా కోడలి సేవలకు తోడుగా ఉండి చందృనికో నూలుపోగుగా మారాలని.
🙏🙏

Source - Whatsapp Message

24 మంచి మాటలు

24 మంచి మాటలు

1. అందరూ నిన్నొదిలి పోతున్నప్పుడు అందర్నీ వదిలి నీ కోసం వచ్చేవాడే నిజమైన స్నేహితుడు.

2. నువ్వు విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టే పది వేళ్ళ కంటే,నువ్వు కనీళ్ళుపెట్టినప్పుడు తుడిచే ఒక్క వేలు గొప్పది.

3. అహంకారాన్ని జయించడం అంటే ఓ బలమైన శత్రువును ఓడించినట్టే.మితిమీరిన అహం నాశనానికి దారితీస్తుంది.

4. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత.

5. లక్ష్యాన్ని సాదించేవరకు నిరాశకు, నిస్పృహకు చోటివ్వక పట్టుదలతో కొనసాగితే తప్పక విజయం నిన్నే వరిస్తుంది.

6.మనం ఎదుటి వాళ్ళకు ఒక వేలు చూపిస్తే మనవైపు నాలుగు వేళ్ళు చూస్తూవుంటాయి...ముందు ఎదుటి వాళ్ళలో తప్పులు వెదకడం మానేసి మనలోని తప్పులను, లోపాలను గుర్తించి వాటిని మార్చుకుంటే అప్పుడు ఎదుటి వాళ్ళలో మంచే కనిపిస్తుంది.

7. ఆగ్రహం కలిగినప్పుడు నిగ్రహం చూపినవాడే నిజమైన బలశాలి.

8. ప్రేమ అనేది నీడ లాంటిది..అది వెలుతురులో మాత్రమే కనిపిస్తుంది..కానీ స్నేహం దీపం లాంటిది.అది చీకటిలో కూడా నీ గమ్యంని చూపిస్తుంది.

9. నీవు ఎవరికైన ఉపకారం చేస్తే దాన్ని గుర్తుంచుకోకు . ఎవరైనా నీకు ఉపకారం చేస్తే దాన్ని మరిచిపోకు.

10. అంధకారం తరువాత వచ్చిన వెలుగు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది . అలాగే దుఖం తరువాత వచ్చిన సుఖం అమిత సంతోషాన్ని ఇస్తుంది.

11. పిరికితనం మనిషిని నిర్వీర్యుడిని చేస్తుంది . ఆత్మవిశ్వాసం మనిషిని విజయపధం వైపు నడిపిస్తుంది.

12. సమస్య వెనుక సమాదానం ఉంటుంది దుఃఖం వెనుక సుఖం ఉంటుంది ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఉంటుంది.

13. చేయబోయే పని గురించి తెలుసుకోవడం వివేకం ,ఎలా చేయాలో తెలుసుకోవడం నైపుణ్యం, తెలుసుకొని పూర్తి చెయ్యడమే సామర్ధ్యం.

14. ఒక వ్యక్తిని త్వరగా అర్ధం చేసుకోకపోయినా ఫర్వాలేదు, కానీ అతిత్వరగా అపార్ధం మాత్రం చేసుకోవద్దు.

15. అవసరమైన దానికంటె ఎక్కువ విషయాలు సేకరించేవారు. తెలుసుకున్న దాని కంటె తక్కువ మాట్లాడేవారు విజ్ఞులు.

16. ప్రతి ఒక్కరు ఎదుటివాళ్ళని మార్చాలని చూస్తారు తప్ప, తమని తాము మార్చుకోవాలని అనుకోరు.

17. మమకారం నీకు తోడును తెస్తుంది,అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది,అందుకే ప్రతి ఒక్కరు అహంకారాన్ని వీడి మమకారాన్ని పెంచుకోవాలి.

18. తెలియక చేస్తే పొరపాటు.. తెలిసి చేస్తే తప్పు.. తప్పని తెలిసి కూడా దిద్దుకోకపోతే అది నేరం.

19. అజ్ఞానులు గతాన్ని, బుద్ధిమంతులు వర్తమానాన్ని, మూర్ఘులు భవిష్యత్తును మాట్లాడతారు.

20. తోటి వారందరిలోకి ప్రధములుగా ఉండాలని కోరుకోవడంలో,అందుకై ప్రయత్నించడం లో తప్పు లేదు.కానీ అలా ఉండకపోవడం తో మీ జీవితానికి విలువే లేదనుకోవడం పొరపాటు.

21. ఒకసారి వద్దని చెప్పిన తరువాత ఎదుటివారి బలవంతానికి ఎట్టి పరిస్థితులలోనూ లొంగిపోవద్దు.మీరు మొదట వ్యక్తపరిచిన అభిప్రాయాన్నే తిరిగి వెల్లడించండి.ధృడంగా వ్యవహరించడం అలవాటుగా మారాలి.

22. నాన్నకి ప్రేమను ఎలా చూపించాలో తెలియదు..అమ్మకి ప్రేమను ఎలా దాచుకోవాలో తెలియదు కానీ ప్రేమించడం మాత్రమే తెలుసు.. వాళ్ళు ఏమి చేసినా అది నీ మంచి కోరే చేస్తారు .కాబట్టి అమ్మ మనస్సు,నాన్న మనస్సు తెలుసుకొని మెలగండి.

23.నవ్వించే నలుగురు మిత్రులు చాలదా నలభై వేల మంది శత్రువులున్నాఈ ప్రపంచాన్ని నేను గెలవడానికి .

24. నిరాశపరిచే బంధువులకంటే మనపైన నమ్మకముంచె మంచి మనసు చెప్పే ఒక్కమాట చాలదా మనం బతికేయడానికి

Source - Whatsapp Message

ఒక చిన్న సందేశాత్మక కధ

ఒక చిన్న సందేశాత్మక కధ
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫

🌻కిటికీ లో నుంచి మధ్యాహ్నం వేళ ఉండే సూర్యుడి వేడి తగిలి మెలకువ వచ్చింది. పక్కనే ఉన్న ఫోన్ చూస్తే పదకొండు అయ్యింది. ఇంటి దగ్గర ఉంటే నాన్న అమ్మ తో కలిసి ఒంటిగంట లోపు భోజనం చేయాలి అనే ఆలోచనతో తొందరగా నిద్ర లేచేవాడిని. ఉద్యోగం పేరుతో బెంగళూరు లో ఉండడం వలన భోజనం చేయాల్సిన సమయం లో టిఫిన్ , టీ తాగాల్సిన సమయం లో భోజనం అలవాటు అయిపోతోంది.
 
🌻తొందరగా లేచి అరగంట లో స్నానం ముగించుకుని, ప్రతి వారం లాగే పక్కన వీధి లో ఉన్న గుడికి వెళ్లాను. మూడేళ్ళ క్రితం కార్తీక మాసం లో అనుకుంటా, ఖాళీగా ఉన్న రోజుల్లో గుడికి వెళ్లిరా అంది అమ్మ. అప్పట్నుంచి ఆఫీస్ లేనపుడు దగ్గర్లో ఉన్న గుడికి వస్తూ ఉంటాను.

🌻ఎప్పటిలాగే దణ్ణం పెట్టుకుని కొంచెంసేపు గర్భ గుడికి పక్కగా కూర్చున్నాను. గుడి గంటల శబ్దాల మధ్య M S సుబ్బలక్ష్మి గారు పాడిన విష్ణు సహస్ర నామం వినిపిస్తోంది. కొంత మంది ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంకొంతమంది అర్చన చేయిస్తున్నారు . కొంత మంది దేవుడికి పట్టు వస్త్రాలు ఇస్తున్నారు. ఇంకొంతమంది తన్మయత్వం తో దేవుడిని చుస్తూ ఉండిపోయారు.

🌻దేవుడికి మధ్యాహ్నం సమర్పించే నైవేద్యంకి ఇంకొంచెం సమయమే ఉండడంతో, ప్రతి వారం గుడిలో ఉండే పూజారిగారు క్షణం కూడా తీరిక లేకుండా కంగారుగా ఉన్నారు.

🌻అమ్మ వెళ్ళమంది అని గుడి కి రావడం మొదలు పెట్టినా, గుడికి వచ్చిన ప్రతిసారీ ఎందుకో చాలా ఆనందంగా ఉంటుంది.
కాని నా మెదడు లో మాత్రం ఎప్పటిలాగే ఎన్నో ప్రశ్నలు రాసాగాయి. దేవుడి గురించి, దేవాలయాల గురించి, భక్తుల గురించి, ఎన్నో సందేహాలు, ఇంకెన్నో విశ్లేషణలు. ప్రతిసారి లాగే ఆ ప్రశ్నల ప్రవాహంలో, ఆలోచనల అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి.

🌻ఇంతలో గుడిలో నేను ఎప్పుడు చూడని పూజారి గారు ఒకరు, నన్ను చూసి, నవ్వి, నా పక్కన వచ్చి కూర్చున్నారు. ఈయన్ని ఎప్పుడు ఈ గుడిలో చూడలేదు కదా, అన్న సందేహంతో కూడిన ఒక నవ్వు నవ్వాను.

కొత్త పూజారి గారు: 
నిన్ను ఈ గుడి లో చాలా రోజులనుంచి చూస్తున్నాను బాబు. కాని ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటావు. ఎమన్నా ఉంటే చెప్పు పర్లేదు అన్నారు. నేను ఎప్పుడూ చూడని వ్యక్తి, నేను వచ్చిన ప్రతిసారి గమనిస్తున్నారా! అన్న ఆలోచన ఒకవైపు, నా ప్రశ్నలు, సందేహాలు నా మోహం మీద కనిపించేస్తున్నాయా అని కంగారు ఇంకోవైపు కలిగి,

నేను
అబ్బే అలాంటిది ఏమి లేదండి.

కొత్త పూజారి గారు
మధ్యాహ్నం నైవేద్యానికి, గుడి ముయ్యడానికి ఇంకా సమయం ఉంది బాబు. పర్లేదు చెప్పు నీ సందేహాలు ఏంటో. నాకు తెలిసినంతలో నీతో చర్చించడానికి ప్రయత్నిస్తాను అన్నారు.
ఎందుకో నాకున్న సందేహాలు అన్నీ అడిగేద్దామని ధైర్యం తెచ్చుకుని నేను ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాను.

నేను: 
పెద్దవాళ్ళు గుడికి వెళ్తే మంచిది అంటారు కదండీ. అసలు గుడి కి ఎందుకు రావాలి? నా ప్రశ్న లో అవివేకం ఉంటే క్షమించండి.

కొత్త పూజారి గారు: 
(గట్టిగా నవ్వుతూ) నువ్వు ఉద్యోగం చేయడానికి బెంగళూరులో ఉన్నావు. కానీ ప్రతి నెలా రెండు రోజులైనా ఇంటికి వెళ్ళి నాన్న అమ్మ ని కలవాలి అనుకుంటావు కదా, ఎందుకు ? ఎందుకంటే వాళ్లతో గడిపినపుడు నీకు ఆనందం వస్తుంది. వాళ్ల ప్రేమ నీకు హాయిని ఇస్తుంది. బహుశా నీ ప్రశ్న కి సమాధానం దొరికింది అనుకుంటున్నాను.

భగవంతుడిని నాన్న అమ్మ తో పొల్చిన వెంటనే ఒక్కసారిగా నాలో కమ్ముకున్న చాలా మేఘాలు తొలగిపోయినట్టు అనిపించింది.

నేను: 
భగవంతుడు అంతటా ఉన్నాడు అంటారు. కాని ఎందుకు గుడికి వచ్చి దణ్ణం పెట్టుకుంటారు అందరూ ?

కొత్త పూజారి గారు: 
నీ ప్రాణ స్నేహితుడు నీకు దూరంగా వేరే ఊరిలో ఉన్నాడనుకో, నువ్వు ఫోన్లో అతనితో మాట్లాడొచ్చు. కానీ అతడిని నేరుగా కలిస్తే వచ్చే ఆనందం ఇంకా ఎక్కువ వుంటుందా? లేదా? కొంత మందికి ఫోనులో మాట్లాడినా ఆనందం కలుగుతుంది, కొంత మందికి నేరుగా కలిస్తే ఆనందం కలుగుతుంది.

నేను: 
కోరికలు తీరితే కానుకలు ఇస్తా అంటారు కదండీ, కానుకలు ఇస్తారని భగవంతుడు కోరికలు తీర్చడు కదా?

కొత్త పూజారి గారు: 
నీకు కొత్తగా ఉద్యోగం వచ్చిందనుకో, ఆ అనందంలో మీ కుటుంబ సభ్యులకి ఎదైనా కొనిపెట్టాలని నువ్వు అనుకుంటావా? అనుకోవా? నీ కుటుంబ సభ్యులు నీకు కొత్త ఉద్యోగం వచ్చిందని సంతోషిస్తారా? నువ్వు ఎదైనా కొనిపెడతావని ఆశిస్తారా? గుర్తుపెట్టుకో దేవుడు కానుకలు కోరుకోడు, నీ అభ్యున్నతి కోరుకుంటాడు. అందుకునే సత్యభామ వెసిన వజ్ర వైఢూర్యాలకి కాకుండా, భక్తితో రుక్మిణి వేసిన తులసీ దళంకి తూగాడు శ్రీ కృష్ణుడు.

నేను: 
ఎదైనా పని మొదలు పెట్టే ముందు, దేవుడికి దణ్ణం పెట్టుకోమంటారు కదండీ, దేవుడి అనుగ్రహం వలన పని పూర్తయితే, మానవ ప్రయత్నం లేనట్టే కదా?అలాకాకుండా మానవ ప్రయత్నం వలన పని పుర్తయితే, పని మొదలు పెట్టే ముందు దేవుడికి దణ్ణం పెట్టమనడంలో ఆంతర్యం ఏమంటారు?

కొత్త పూజారి గారు: 
నీ ఆఫీసులో కొంచం క్లిష్టమైన పని ఇచ్చారనుకో, సాధారణంగా ఏం చేస్తావు? కొంచెం నిశబ్దమైన ప్రదేశానికి వెళ్ళి, నీకు నచ్చిన కాఫీ అయినా, టీ అయినా, తాగుతూ, ఏకాగ్రతతో ఆలోచించి, పని పూర్తి చేస్తావు. అవునా, కాదా?ఇప్పుడు కాఫీ, నిశ్శబ్దమైన ప్రదేశం వీటి వలన పని పూర్తి అయ్యిందా? లేక నీ బుధ్ధి ఉపయోగించడం వలన పని పూర్తి అయ్యిందా? నిజానికి కాఫీ, నిశబ్దమైన ప్రదేశం ఇవన్నీ నీ ఏకగ్రతని పెంచి, నువ్వు నీ పని పూర్తి చెయ్యడానికి నీ బుద్ధిని ఉపయోగించడంలో దొహదపడ్దాయి. అలాగే దైవ దర్శనం కూడా, నీ పని చెయ్యడానికి కావలసిన ప్రశాంతతని పెంచి, నీకు కావలసిన శక్తియుక్తులని సరిగ్గా ఉపయోగించడానికి దోహదపడేది కాదంటావా?

నేను: 
మొక్కులు తీర్చకపోతే భగవంతుడికి కోపం వస్తుంది అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు?

కొత్త పూజారి గారు: 
మీ అమ్మగారి తో నువ్వు, “ఇవాళ సాయంత్రం తప్పకుండా కూరగాయల మార్కెట్ కి నిన్ను తీస్కుని వెళ్తా” అని చెప్పి, తర్వాత మర్చిపోయి నీ స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్లి వచ్చావనుకో, అపుడు మీ అమ్మగారు ఏమంటారు ? స్నేహితులతో బయటకి వెళ్తే లోకం తెలీదు వెధవకి అని కోపంతో తిడతారా లేదా ? అలా ప్రేమగా కొప్పడతారు కానీ, అలా మర్చిపోయినందుకు నువ్వు కష్టాలు పడాలని ఆశించరు కదా..!! మీ తల్లితండ్రులకే ఇంత ప్రేమ ఉంటే, లోకాలు అంతటికి ఆ దేవుడిని తల్లి తండ్రీ అంటారు. తనకి ఇంకెంత ప్రేమ ఉండాలి ?

ఇవన్ని విన్నాక ఎందుకో తెలియకుండానే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసేసాను. నాకున్న ప్రశ్నలు సందేహాలు అన్నీ తొలగిపోయినట్టు అనిపించి ఆ ఆనందం లో కళ్లలో నీళ్ళు తిరిగాయి.

ఆ పూజారి గారు నవ్వుతూ నా తల నిమిరి, సరే బాబు నైవేద్యానికి సమయం అయిందని చెప్పి వెళ్లిపోయారు.

తర్వాత తదేకం గా గర్భ గుడి లోని దేవుడిని అలా తన్మయత్వంతో చాలా సేపు చుస్తూ ఉండిపోయాను. ఇపుడు దేవుడిని చూస్తోంటే ఎందుకో తల్లితండ్రులను చూస్తున్నట్టు, ప్రాణ స్నేహితులను చూస్తున్నట్టు అనిపించింది. నేను నా భావాలని నా కళ్ళతోనే ఆయనతో పంచుకుంటున్నానేమో అనిపిస్తోంది.

ఆ కొత్త పూజారి గారిని కలవాలి అనిపించి, ఆ రోజు సాయంత్రం మళ్ళీ గుడికి వెళ్లాను, కానీ ఆయన కనిపించలేదు. కొత్త పూజారి గారిని కలవాలనే కోరిక ఆపుకోలేక ప్రతీ వారం గుడిలో ఉండే పూజారి గారి దగ్గరికి వెళ్ళి అడిగాను.

నేను
పొద్దున్న ఒక కొత్త పూజారి గారు ఉన్నారు కదండీ, ఆయన సాయంత్రం రాలేదా ?

గుడిలో ప్రతి వారం వుండే పూజారి గారు: 

కొత్త పూజారి గారా ? ఎవరు బాబూ? పొద్దున్న కూడా నేను ఒక్కడినే ఉన్నాను బాబూ గుడిలో. నాతో పాటు ఇంకో పూజారి ఎవరూ లేరు బాబు.

నేను: 
లేదండి, నైవేద్యానికి ఇంకా సమయం ఉందని ఆయన నాతో మాట్లాడారు కూడా.
అని అంటూ, ఆగిపోయాను నేను. నైవేద్యానికి సమయం ఉందని అన్నారు కానీ, భగవంతుడికి నైవేద్యం సమర్పించడానికి సమయం ఉంది అనలేదు కదా.
ఈ విషయం స్ఫురించగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను, నాకేమి అర్ధం కాలేదు, అలా కూర్చుండిపోయాను.

ఇంతలో అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. గుడి నుంచి బయటకి వచ్చి ఫోన్ మాట్లాడాను.

అమ్మ: 
ఏరా ఏం చేస్తున్నావు ? ఇప్పుడే నాన్న నేను టీ తాగాము, నువ్వు భోజనం చేసావా ? పొద్దున్న గుడి కి వెళ్ళొచ్చావా ?

నేను: 
హా.. పొద్దున్న దేవుడిని కలిసొచ్చానమ్మా ..!! అన్నాను.


సేకరణ : జయంతి జ్యోతీసునీల్ కుమార్, చెన్నై.
ఆధ్యాత్మిక భక్తిప్రపంచం,
To join please call 7013672193
💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈

Source - Whatsapp Message

కాబట్టి మన పిల్లల పెంపకం పట్ల జాగ్రత్త వహిద్దాం...

మీకు మన రాష్ట్ర విద్యార్థులకు హిమాచల్ లో జరిగిన ఒక సంఘటన గుర్తుందా..?
కోన్ని ఏళ్ల క్రితం హైదరాబాద్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన దాదాపుగా 46 మంది విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్ కోసం హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు..
అక్కడ 8-06-2014 సాయంత్రం 5:30 గంటలకు బియాస్ నదీ తీరాన ఫోటోలు తీసుకుందామని వెళ్లారు..
అప్పుడు నదిలో నీళ్లు లేవు. కేవలం రాళ్లు మాత్రమే ఉన్నాయి..
ఆ నది ప్రవహించే చోటున మధ్యలో ఒక పెద్ద బండరాయి వీళ్ళను ఆకర్షించింది. దానిపై నిలబడి, ఫోటోలు దిగుదామని వెళ్లారు..
సరిగ్గా 6 గంటల సమయంలో ఒక సైరన్ మ్రోగింది.. అదేంటో వీళ్లకు అర్థం కాలేదు..

వీళ్ళున్న ప్రాంతానికి ముందు ఓ డ్యాం గేట్లు ఎత్తివేసి, నదీ జలాలను విడుదల చేశారు.. ఆ నదీ ప్రవాహం వీళ్ళ వైపుగా రావడాన్ని ఒడ్డున ఉన్న కొందరు చూశారు.. వీళ్ళను alert చెయ్యడానికి కేకలు వేశారు.. కానీ, వీళ్ళు పట్టించుకోలేదు.. ఆ నీళ్ళ మధ్యన నిలబడి, ఫోటోలు దిగుతూ enjoy చేస్తున్నారు..

అంతలో నీటి మట్టం స్థాయి అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.. ఒడ్డుకు దగ్గరలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు చిన్నగా వచ్చేశారు.. అందులో ఒక అమ్మాయి తన చెప్పులు బండ మీద మర్చిపోయాను అని చెప్పుల కోసం మళ్ళీ నది మధ్యలోకి వచ్చేసింది..

ఉన్నట్లుండి, నది ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టింది. నీటి మట్టం ఎత్తు దాదాపుగా 5 అడుగుల వరకూ చేరుకుంది..
రాళ్ళ మీద నిలుచున్న విద్యార్థులు నిస్తేజంగా నిలబడిపోయారు..
అందరూ చూస్తుండగానే నీటి ప్రవాహంలో కళ్లెదుటే కొట్టుకునిపోయారు..
తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు..

ఇక్కడ మనం గమనించవలసింది top college లో చదివిన వీళ్లకు,

ప్రకృతి ఎంత శక్తివంతమైనది అని తెలియకపోవడం..

వీళ్ళలో ఎవరికీ ఈత రాకపోవడం..

"చెప్పుల" కోసం ప్రాణాలను పోగొట్టుకోవడం..

చుట్టూ వర్షం లేకపోయినా, అప్పటి వరకూ నదిలో నీళ్ళు లేకుండా ఒక్కసారిగా నీరు వస్తున్నా సమీపంలోని డ్యాం గేట్లు ఎత్తారు అని కనీస అవగాహన కూడా ఇంజనీరింగ్ చదివిన పట్టబద్రులకు రాకపోవడం విడ్డూరం కదా..

ఈ post చదువుతున్నవారిలో, ఎందరు పిల్లలకు ఈత వచ్చు..?

ఈత అని మాత్రమే కాదు,

ఉన్నట్లుండి మీ ఇంట్లో electrical short circuit ఏర్పడితే, ఏమి చెయ్యాలి అన్నది మనలో ఎంతమంది పిల్లలకు తెలుసు..?

ఎవరైనా పెద్దలకు heart attack, ఊపిరి ఆడకపోవడం, చెయ్యి తెగితే, రక్తం ధారగా కారుతున్నపుడు ఏమి చెయ్యాలి అన్నది ఎందరు పిల్లలకు తెలుసు? కనీసం FIRST AID ఎలా చేయాలో తెలుసా..?

ఏమీ తెలియదు...

పిల్లలకు మనం నేర్పిస్తున్నది ఏమిటో తెలుసా..?

చదువు, చదువు, చదువు, మార్కులు, ర్యాంకులు, Engineering, Medicine, GRE, G-MAT, IELTS, TOEFL, US, UK.. డాలర్లు..

వాళ్ళను Shopping malls లో Branded Dresses వేసుకోమనడం, Reebok, Nike Shoes కొనివ్వడం, పిజ్జాలు, బర్గర్లు, చికెన్ టిక్కా ముక్కలు, బిర్యానీలు...ఇవి మాత్రమే కాదు..

ప్రకృతి అందాలే కాదు, ప్రకృతి కన్నెర్రజేస్తే ఎలా ఉంటుందో కూడా చూపించాలి..
సమాజంలో తిరగడం అలవాటు చెయ్యాలి..

అన్నింటికంటే ముందు "Common Sense" అనేది లేకుండా పిల్లలను పెంచుతున్నాం.. దాన్ని నేర్పకుండా.. చదువుకో, మార్కులు తెచ్చుకో, ర్యాంకులు సంపాదించు.. అంటూ ఒక యంత్రంలా తయారు చేస్తే కొన్నిసార్లు పరిస్థితులు మన చేతులు దాటిపోయినా మనం చూస్తూ ఉండటం తప్ప చేసేదేం ఉడదు..

కాబట్టి మన పిల్లల పెంపకం పట్ల జాగ్రత్త వహిద్దాం...🙏🙏

🙏 సర్వేజనా సృజనో భవంతు 🙏

Source - Whatsapp Message

ప్రక్కవాళ్ళ పూలతో పూజ చేస్తే ఏమొస్తుంది.....

ప్రక్కవాళ్ళ పూలతో పూజ చేస్తే ఏమొస్తుంది.....

రోజూ ఉదయమే చాలా మంది పూజ కోసమని ప్రక్కవాళ్ళ దొడ్లో పూలు కోసేస్త కనపడుతుంటారు. కొంత మంది ఐతే వాకింగ్ కి అని వెల్తూ కూడా ఒక కవరు పట్టికెళ్ళి దారిలో కనపడ్డ మొక్కల పువ్వులన్నీ కోసేస్తుంటారు. ఒకవేళ ఆ ఇంటివాళ్ళు వద్దన్నా.. లేదా వీళ్ళకేసి చూస్తున్నా.. వీళ్ళు వాళ్ళ కేసి చాలా సీరియస్ గా పాపాత్ములని చూసినట్టు చూస్తూ చాలా బిల్డప్ ఇస్తుంటారు. ఇవన్నీ రోజూ మనకి కనపడే దృశ్యాలే...

మరి నిజంగా ప్రక్కవాళ్ళ పూలు కోసి చేసే పూజకి ఏమి ఫలితం వస్తుంది, దీని గురించి శాస్త్రాలు ఏమంటున్నాయి ???

నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు. దేవుని పూజకోసమని మొక్కని ప్రార్దించి.. కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహా పాపం.

ప్రక్కవాళ్ళని అడగకుండా పూలు కోసేయడం దొంగతనం క్రిందకి వస్తుంది. అందుకు శిక్షగా మళ్ళీజన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు. కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి. ఒక వేళ వాళ్ళు ఒప్పుకుంటే, అప్పుడు కూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం వెళ్ళీపోతుంది..


ఈ విషయాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడ పురాణంలో గరుడునికి చెప్పారు. ఈ శ్లోకం చూడండి...

తాంబూల ఫల పుష్పాది హర్తాస్యా ద్వానరో వనే |
ఉపానతృణ కార్పాసహర్తాస్సా న్మేష యోనిషు ||

తాత్పర్యం...

తాంబూలము, ఫలములు, పుష్పములు మొదలగు వానిని అపహరించినవాడు అడవిలో కోతిగాను. పాదుకలు, గడ్డి, ప్రత్తి మొదలగు వానిని అపహరించినవాడు మేక జన్మముగాను పుట్టుచుందురు.

మరి పూజ చేస్తే పుణ్యం రావాలి, దానివల్ల మోక్షం, ముక్తి కలగాలి. లేదా కనీసం వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితం కలగాలి. నిజానికి మానవ జన్మ యొక్క ఏకైక లక్ష్యం ముక్తిని పొందడమే.. ఇక జన్మలనేవే లేని విధంగా ఆ భగవంతునిలో ఐక్యం ఐపోడమే.. అది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యం, ఇక ఏ ఇతర జన్మలలోనూ సాధ్యమే కాదు.

మరి ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజలు వల్ల పుణ్యం సంగతి అటు ఉంచి వచ్చే జన్మలో జంతువుగానే పుట్టాల్సివస్తొందే.. ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాత గానీ మనిషిగా పుట్టే అవకాసమే రాదే.. మరి ఇలాంటి పూజలు మనకి అవసరమా.. ఒక్కాసారి ఆలోచించండి. తెలియని వారికి తెలియచేసి వారికి సాయం చేయండి...

|| ఓం నమః శివాయ ||

Source - Whatsapp Message

శ్రమజీవులు

🌹 శ్రమజీవులు🌹

"మమ్మీ ! స్కూలు బస్ వచ్చే టైమయ్యింది. నా టై కనబడటం లేదు. ఎక్కడ పెట్టావు?" అడిగింది ఆరో తరగతి చదువుతున్న కూతురు.

"వస్తున్నా తల్లీ, ఇదిగో అన్నయ్య లంచ్ బాక్స్ సర్దుతున్నా!" వంటింట్లోంచి బదులిచ్చింది సుధ.

"మమ్మీ! నా ఉతికిన సాక్స్ ఎక్కడ పెట్టావు? త్వరగా రావాలి, ఆటో వచ్చే టైమయ్యింది" అరుస్తున్నాడు ఏడో తరగతి చదువుతున్న కొడుకు.

"వస్తున్నా నాన్నా! ఇదిగో చెల్లాయ్ టై కనబడటం లేదు. వెతుకుతున్నా."

"సుధా! బాత్రూమ్ లో కొత్త సోప్ పెట్టలేదా?" పిలుస్తున్నాడు భర్త వెంకట్.

"ఆ తెస్తున్నానండీ, ఇప్పుడే పిల్లల్ని పంపించి, లోపలికి వచ్చాను" బదులిచ్చింది సుధ.

"ఇదిగో సుధా! ఈరోజు ఆఫీసుకు కొంచెం ముందుగా వెళ్లాలి. టిఫిన్, లంచ్ బాక్స్ లు సర్దేయ్. నీకు కూడా బ్యాంక్ టైం అవుతోంది కదా ! నువ్వు కూడా తయారవ్వు" అని చెప్పి, డ్రెస్ చేసుకోవడానికి లోపలికి వెళ్లాడు వెంకట్.

"అలాగేనండీ" అంటూ ఆ పనిలో మునిగి పోయింది సుధ.

వచ్చిన రెండు రోజుల నుంచీ, తన కూతురు చేస్తున్న అష్టావధానం గమనిస్తోంది, పక్క గదిలో పేపర్ చదువుకుంటున్న సుధ తల్లి సుభధ్ర.

"ఇదీ అమ్మా వరుస. ఇక్కడ ఇంటిపనీ, అక్కడ బ్యాంక్ పనితో నిజంగా ఒత్తిడి పెరిగి, టెన్షన్ వచ్చేస్తోదనుకో. పోనీ ఉద్యోగం మానేద్దామా అంటే, ఇంటికోసం తీసుకున్న అప్పు నిప్పులా భయపెడుతోంది. పోనీ పనిమనిషిని పెట్టుకుందామా అంటే, వాళ్ళు వస్తారా, రారా అని ఎదురు చూడ్డానికే కాలం సరిపోతుంది, అంతే కాదు వాళ్ల జీతాల కోసం నేను ఇంకో చోట పార్ట్ టైం జాబ్ చేయాలి. సరే ఈ గొడవలు ఎప్పడూ ఉండేవే కానీ, నాలుగు రోజులు ఉందామని వచ్చావు, హాయిగా రెస్ట్ తీసుకో. సాయంత్రం వస్తా" అంటూ తల్లికి చెప్పి, పక్క వీధిలోనే ఉన్న తను పని చేస్తున్న ప్రైవేటుబ్యాంక్ కి బయలుదేరింది సుధ.

🌷 🌷 🌷

ఆ రోజు సాయంత్రం, బేంక్ నుంచి ఆలశ్యంగా రావడమే కాకుండా, మొహం వేలాడేసుకుని సోఫాలో కూలబడిన సుధని,

"అమ్మడూ, ఏమయ్యిందే తల్లీ ! అలా ఉన్నావు. ఏం జరిగిందో చెప్పవే?" కూతురు పక్కన కూర్చుని, ఆందోళనతో అడిగింది సుభధ్ర.

"ఏం లేదమ్మా! ఈరోజు బ్యాంక్ లో పని ఎక్కువగా ఉండడం వలన, ఆ ఒత్తిడిలో ఒక ఎంట్రీ తప్పు వేసాను. అది మేనేజర్ కనిపెట్టి సరిచేసి, నాకు చివాట్లు పెట్టాడు" బాధపడుతూ చెప్పింది సుధ.

"ఏంటి మమ్మీ ! ఇంత ఆలశ్యం. ఇంతవరకూ స్నాక్స్ కూడా తినలేదు" కంప్లైంట్ చేసింది, పక్క గదిలోంచి వచ్చిన కూతురు.

"బ్యాంక్ లో పనిఒత్తిడి వలన ఆలశ్యం అయ్యింది తల్లీ! అయినా అమ్మమ్మనడిగి ఏవైనా తినలేకపోయారా?"

"నువ్వు లేకుండా ఎప్పుడైనా ఏదైనా తిన్నామా?" సూటిగా అడిగాడు కొడుకు.

"అయ్యయ్యో, అలాగా! ఇప్పుడే తెస్తా ఉండండి" అంటూ లోపలికి వెళ్లింది సుధ.

ఈ సంఘటనలు చూసిన తరువాత, తను తిరిగి వెళ్లబోయే ఈ రెండు రోజుల్లో ఈ ఇంటికి చేయవలసిన ప్రక్షాళన గురించి ఆలోచనలో పడింది సుభద్ర.

🌷 🌷 🌷

మర్నాడు సాయంత్రం, తను రాసిన ఓ కధకు తుది మెరుగులు దిద్దుతున్న సుభద్ర, ఫోన్ రింగ్ రావడంతో,

"చెప్పవే అమ్మడూ! బ్యాంక్ నుంచి బయలు దేరుతున్నావా?" అడిగింది సుధను.

"లేదమ్మా! ఈ రోజు సాయంత్రం డాక్టర్ దగ్గర అపాయింట్ మెంట్ తీసుకున్నాం. ఆఫీసు అవ్వగానే ఆయన ఇక్కడికి వస్తానన్నారు. అందుకే మేము రావడం కొంచెం ఆలశ్యం అవుతుంది. పిల్లలకి ఏం కావాలో చూడమ్మా!"

"సరేకానీ, డాక్టర్ దగ్గరకు దేనికే? " గాభరాగా అడిగింది సుభద్ర.

"కంగారు పడకు. నీకు నిన్న చెప్పానుగా! ఈ మద్యన కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటోందని ! అందుకే ఓ సారి చూపించు కుందామని వెళ్తున్నాం" అంటూ ఫోన్ పెట్టేసింది సుధ.

ఫోన్ పెట్టేసిన సుభద్ర, ఈ రోజే తన పథకం అమలు చేయాలని ఓ నిశ్చయానికి వచ్చేసింది.

"అమ్మమ్మా! మమ్మీ ఇంకా రాలేదా, ఈ రోజు కూడా? " అడిగారు స్కూలు నుంచి వచ్చిన పిల్లలు.

"మీ మమ్మీకి ఒంట్లో బాగోలేదర్రా! పాపం పని ఒత్తిడిలో నలిగి పోతుంది కదా ? అందుకే డాక్టర్ దగ్గరకు వెళ్లింది. మీరు కొంచెం కోపరేట్ చేస్తే మీ మమ్మీ త్వరగా కోలుకుంటుంది" బిక్కుబిక్కుమంటూ చూస్తున్న పిల్లలతో చెప్పింది సుభద్ర.

"మేము ఏం చేయాలి అమ్మమ్మా, చెప్పు చేస్తాం!" అన్నారు ముక్తకంఠంతో.

"నాకు తెలుసుర్రా! మీరు మంచి పిల్లలని. ఏం చేయాలంటే........" అంటూ పిల్లలకు విడమరిచి చెప్పసాగింది సుభద్ర.

🌷 🌷 🌷

పిల్లలతో కబుర్లలో మునిగిపోయిన సుభద్రకు అల్లుడు, కూతురు వచ్చిన అలికిడి వినబడడంతో హడావుడిగా గది లోంచి బయటకు వచ్చి,

"ఎలావుందే అమ్మడూ! డాక్టర్ గారు ఏమన్నారు?" ఆందోళనగా అడిగింది.

"కంగారు ఏమీ లేదు అత్తయ్య గారూ! నీరసానికి మందులు రాసారు. వీలైతే మెడిటేషన్ చేయమన్నారు" చెప్పాడు అల్లుడు.

అంతా విని, కూతురు వద్దకు వచ్చి,

"అమ్మడూ, రాత్రి పడుకునే ముందు ఓసారి నా గదిలోకి రావే, కొంచెం మాట్లాడే పని ఉంది నీతో" కూతురు భుజంమీద చెయ్యి వేసి, అనునయస్తూ చెప్పింది సుభద్ర.

"అలాగే అమ్మా! నువ్వేమీ గాభరా పడకు" అంటూ తల్లికి చెప్పి వంట గదిలోకి వెళ్లింది సుధ.

🌷 🌷 🌷

"అమ్మా! ఇంకో వారం రోజులు ఉండవచ్చు కదా? ఎప్పుడూ చెప్పులో కాళ్ళు పెట్టుకుని మరీ వస్తావు. సరేకానీ, చెప్పు ఎందుకు రమ్మన్నావు?"తల్లి పక్కన కూర్చుని అడిగింది సుభద్ర.

"నీ గురించి చెప్పి, అల్లుడు గారు రమ్మంటే వచ్చాను గానీ, నీకు తెలియంది ఏముంది? అన్నయ్య ఆరోగ్యం సరైనది కాదు కదా? సరే అసలు విషయానికి వస్తా. ఈ ఒత్తిడి అనేది ఓ జబ్బూ కాదు, అలాగని అంటురోగమూ కాదు. ఇది మన సృష్టించుకున్నదే. అందుకే దీని నివారణ కూడా మన చేతుల్లోనే ఉంది. అలాగని, డాక్టర్ గారు ఇచ్చిన మందులు, సలహాలు మానేయమని చెప్పడంలేదు. వాటితో పాటు ఈ జపమాల అనే పద్ధతి పాటిస్తే, ఈ ఒత్తిడి, అనవసరపు ఆందోళనలు దూరమవుతాయి" చెప్పింది సుభద్ర.

"ఊరుకో అమ్మా! ఈ జపాలూ తపాలు చేసే సమయం ఎక్కడుంటుందే? దేవుడుకి ఓ నమస్కారం పెట్టడానికే సమయం దొరకడం లేదు" కొంచెం విసుగ్గా చెప్పింది సుధ.

"అయ్యో, జపమాల అంటే జపం కాదే. ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉపయోగపడే నాలుగు పద్ధతులలోని మొదటి అక్షరాలే ఈ జ,ప,మా,ల . కిందటి సంవత్సరం మీ వదిన ఇలాగే బాధపడుతూంటే ఈ పద్ధతి చెప్పాను. వెంటనే ఆచరణలో పెట్టడంతో, ఇప్పుడు ఆ ఒత్తిడి అధిగమించి హాయిగా ఉంది."

"ఔనా ? ఆ జపమాల పద్ధతి ఏమిటో నాకూ చెప్పవే" తల్లి ఒడిలో తల ఆనించి ముద్దుగా అడిగింది సుధ.

📍"అయితే విను. ఇందులో మొదటి పద్ధతి న భాగస్వామ్యం:
అంటే మనం చేసే పనిలో కొందరికైనా భాగస్వామ్యం కల్పించాలి. అన్నీ మనం ఒక్కరమే చేద్దాం అనుకోకూడదు. మీ ఇంట్లో చూడు, పిల్లల స్కూలు యూనీఫారాలూ, వాళ్ల టిఫిన్ బాక్సులు సర్దడం, కడగడం అన్నీ నువ్వే చేయాలా? పాపం, చిన్న పిల్లలు, వాళ్లని ఇప్పటినుంచీ కష్టపెట్టడం ఎందుకని నువ్వు అనుకోవచ్చు. కానీ, వాళ్లు ఎదుగుతున్నారు, రేపో మాపో పై చదువుల కోసం హాస్టళ్లలో ఉండవలసి రావచ్చు. అప్పుడు నువ్వు అక్కడికి వెళ్లి చేయలేవు కదా? అందుకే వాళ్ళ పనులు వాళ్లను చేసుకోనివ్వాలి. అప్పుడు నీకు కొంచెం పని ఒత్తిడి తగ్గుతుంది" చెబుతున్న ఆమె మొహంలో ముప్పై సంవత్సరాలు ఉపాధ్యాయవృత్తి చేసిన తల్లి కనపడింది, సుధకు.

ఆశ్చర్యంగా వింటున్న సుధ వైపు చూస్తూ, చెప్పసాగింది సుభద్ర.

📍"ఇక రెండో పద్ధతి
నికి సమయనిర్ధేశం:
అంటే, ప్రతీ పనికి మనం ఓ నిర్ధిష్ట సమయం కేటాయించుకోవాలి. నీ విషయానికి వస్తే, నేను కొన్ని విషయాలు గమనించాను. పొద్దున్నే లేవగానే ఆ ఫోన్ తీసి వాట్సప్ మెసేజులు చూడడం అవసరమా ? అందులో ఏదో ఓ చెత్త మెసేజ్ ఉంటుంది. ఇంక ఆ రోజంతా దాని గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటావు. అందుకే రోజుకు నాలుగు సార్లు, అంటే ఉదయం టిఫిన్ చేస్తూ, మధ్యాహ్నం లంచ్ టైములో, సాయంత్రం ఇంట్లో కాఫీ తాగుతూ, రాత్రి పడుకోబోయే ముందు.. ఇలా సమయం కేటాయించుకో.

అలాగే, రాత్రి టీవీ చూస్తూ మర్నాడు ఉదయానికి కావలసిన కూరలు తరుక్కోవడం, రాత్రి భోజనాలు అయిన తరువాత ఆ పాత్రలు మర్నాడు ఉదయం వరకూ ఉంచకుండా రాత్రి పడుకునేముందే కడుక్కోవడం, ఇలా సమయ పాలన చేయడం వలన మర్నాడు ఉదయానికి నీకు కొంచెం పని ఒత్తిడి తగ్గుతుంది" చెబుతున్న తల్లి మొహంలో ఓ మోటివేటర్ దర్శనమిచ్ఛాడు సుధకు.

ఆశ్చర్యంగా చూస్తున్న కూతురు వైపు ఓ సారి చూసి, తిరిగి చెప్పడం మొదలెట్టింది సుభద్ర.

📍"ఇక మూడోది, అతి ముఖ్యమైనదీ
మా నసిక స్థైర్యం.
ఇది ఉంటే చాలు, ఒత్తిడి ఏం ఖర్మ, మనం దేనినైనా జయించవచ్చు. మిన్ను విరిగి మీదపడినా కానీ చలించకుండా, ధైర్యంగా ఎదుర్కొనేలా ఉండాలి. ఏ కష్టం వచ్చినా, కృంగిపోకుండా, నేను దీనిని ఎదుర్కొన గలను అని గట్టిగా పిడికిలి బిగించి మనసులో అనుకో. నీలో ఆత్మ విశ్వాసం పెరిగి, ఒక విధమైన ధైర్యం వచ్చేస్తుంది.

ఇది లేకపోవడం వల్లనే చిన్నపాటి అప్పులు చేసి, అప్పులవాళ్ల ఒత్తిడి భరించలేక మీ నాన్న మీ చిన్నతనంలో ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు ధైర్యం ఉంది కాబట్టే నేను చదువుకుని, టీచర్ ఉద్యోగం తెచ్చుకుని, అన్నయ్యను, నిన్నూ చదివించి ఈ స్థితికి తెచ్చాను" అని చెబుతున్న తల్లిలో ఓ సైకాలజిస్టు దర్శనమిచ్చాడు సుధకు.

📍ఇక ఆఖరుది
క్ష్యం మీద దృష్టి.
అంటే మనం ఏం పని చేస్తున్నామో దాని మీదే దృష్టి కేంద్రీకరించాలి. మాటవరసకి ఒక బస్సు డ్రైవర్ స్టీరింగ్ ముందు కూర్చోగానే, అతని లక్ష్యం ప్రయాణికులని క్షేమంగా గమ్యం చేర్చడం. అందుకే అతని దృష్టి రోడ్డు మీదే ఉండాలి. అలాకాక, ఉదయం ఇంట్లో జరిగిన సంఘటన గురించి ఆలోచించా డనుకో, అరవై మంది ప్రాణాలు గాల్లో కలిసినట్లే.

నిన్న బ్యాంకు లో నువ్వు చేసింది అదే, ఏదో ఆలోచిస్తూ, ఆ ఒత్తిడిలో తప్పుడు ఎంట్రీ వేసావు. అలా కాకుండా లక్ష్యం మీద దృష్టి పెట్టి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. అందుకే పని మీద దృష్టి పెట్టమనేది.

అంతెందుకు, చాలా మంది ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత, గ్యాస్ స్టవ్ ఆపామా? ఇంటి తాళం సరిగ్గా వేసామా అని అనుమాన పడి ఆ ఒత్తిడితో అసలు వెళ్లిన పని మీద దృష్టి పెట్టకుండా ఇంటికి వచ్చి చూసుకొనేవరకూ బిక్కు బిక్కు మంటూ ఉంటారు. అలా కాకుండా తాళం వేసినప్పుడు కొంచెం దృష్టి పెట్టడం కానీ లేదా ఆ సమయంలో ఏదో ఒక సంఘటన అంటే 'పాపం రామారావు కి ఎలా ఉందో' అనో లేదా 'ఆ వీధి కుక్క ఎలా అరుస్తోందో'..ఇలా ఏదో ఒకటి అనుకుని ఆ పని చేసామనుకో. అప్పుడు మనకి ఆ అనుమానం వచ్చినప్పుడు వెంటనే ఆ సంఘటన జ్ఞాపకం వచ్చి, ఒత్తిడికి దూరం అవుతాం" చెబుతున్న అమ్మ, గీతోపదేశం చేస్తున్న గీతాచార్యుడులా కనిపించింది సుధకు.

"అమ్మా, చక్కటి విషయాలు చెప్పావు. నువ్వు చెప్పిన జపమాల పద్దతి ఇప్పటి నుంచే ఆచరిస్తాను" అంటూ తక్షణ కర్తవ్యంగా సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి, తల్లి వద్దే పడుకుండి పోయింది సుధ.

🌷 🌷 🌷

ఉదయమే లేచి బ్రష్ చేసుకుని, కిచెన్ లోకి వచ్చిన సుధ, అక్కడ సింక్ లో గిన్నెలు కడుగుతున్న కూతురు, డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని బెండకాయలు తరుగుతున్న కొడుకు, కాఫీ పెడుతున్న భర్తను చూసి,
"ఏమిటి షడన్ గా ఈ మార్పు" అని అడిగింది ఆశ్చర్యపోతూ.

"చూడు సుధా! అత్తయ్య గారు చెప్పిన జపమాలలోని మొదటి పథకాన్ని, మా వంతుగా మేము అమలుపరుస్తున్నాం. మిగతా మూడు పథకాలు ఫాలో అవ్వడం ఇక నీ చేతుల్లో ఉంది" చెబుతున్న భర్తని ఆశ్చర్యంగా చూస్తూ, ఒత్తిడిని జయించిన మొహంతో, పిల్లలను దగ్గరకు తీసుకుంది సుధ, మనసులో తల్లికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తనుకూడా రెడీ అయి ఉద్యోగానికి వెళ్ళింది .

..... 🌷..... 🌷..... 🌷..... 🌷.....

ఇప్పటికీ భర్త/తండ్రి కష్టపడి సంపాదిస్తుటే వారికి ఏ విధంగానూ సహాయ సహకారాలు అందించకుండా టీవీల ముందు గానీ, సెల్ ఫోన్ లోగాని, భక్తి వంకతో పూజ గదిలో గాని యోగా, ధ్యానం అనిగాని... సమయం వ్రుదా చేసి కాలక్షేపం చేస్తూ ఇంటిపనికి ఒకరు, వంటపనికి ఒకరు, తోటపని ఒకరు, పాచిపనికి ఒకరు, కారు తుడిచేవాడు ఒకడు, దానిని నడపటానికి ఒకడు. అని దర్పం చుబిస్తు.. శరీరానికి వ్యాయామం లేక, కనీసం చమట కూడా పట్టే పరిస్తితి లేకుండా... వాళ్ళ ఒళ్ళు వాళ్ళే మోయలేక వాళ్ళ పిల్లలని ఎత్తుకోవటానికి పనిపిల్లలను పెట్టుకొని, వాళ్ళు మాత్రం కుక్కపిల్ల ఎత్తుకొని వాకింగ్ పేరుతో తిన్నది అరిగేవరకు రొడ్లవెంట తిరిగే వారు ఉన్న ఈ రోజుల్లో. ..
వేడినీళ్లు చన్నీళ్ళు అన్నట్లుగా, రూపాయికి మరొక రూపాయి కుడబెట్టటానికి శ్రమించే ప్రతిఒక్క మహిళా శ్రమజీవి కి.. పాదాభివందనం🙏🙏

(మహిళా ఉద్యోగినులకు అందరికీ అంకితం)

💥 సర్వేజనాః సుఖినోభవంతు💥

👉సామజిక ఆద్యాత్మిక సమచారం కోసం ఈక్రింది నంబరు కు వాట్సప్/ టెలిగ్రామ్ లలో జాయిన్ గ్రూప్ అని మెసేజ్ పెట్టండి 👈

శ్రీ ధర్మశాస్త సేవాసమితి 🐆విజయవాడ🏹7799797799

Source - Whatsapp Message

అదే జీవిత సత్యం...!!

..మనసు నిలిపి వినండి.

చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్న
స్నేహితులంతా ఓ చోట కలిశారు. అందరికీ వేలల్లో జీతం వస్తోంది . బాగా సెటిల్ అయ్యారు . కానీ జీవితంలో ఏదో మిస్‌ అవుతున్నామనే ఫీలింగ్ అందరిలోనూ ఉంది.

ఇదే విషయం గురించి చర్చించారు...
కానీ ఏదో మిస్‌ అవుతున్నామని అందరూ ఒప్పుకున్నారు.....!
మాటల్లో మాటగా ఎవరో చిన్నప్పుడు వాళ్లకు పాఠం చెప్పిన ఓ మాస్టారూని గుర్తుచేశారు.

ఆ మాస్టారూ పేరు గుర్తుకు రాగానే అందరి మోహాల్లో ఒక సంతోషం...! ఎప్పుడూ సంతోషంగా ఉండే ఆ మాస్టారూ అంటే అందరికీ ఎంతో ఇష్టం....
అతనొక స్పూర్తి ! అంతా ఒక అండస్టాండింగ్‌కు వచ్చారు...

ఆ మాస్టారూ ఎప్పుడూ అంత ఆనందంగా ఎలా ఉండేవాడో కనుక్కుందామని ఆయన దగ్గరకు బయలు దేరారు....!

ఆ మాస్టారూ దగ్గరకు వెళ్ళి, తామిప్పుడు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారో అందరూ గొప్పగా చెప్పుకున్నారు..!

ఆయన చెప్పిన పాఠాల మూలంగానే ఇంత గొప్పవాళ్లమయ్యామని గుర్తుచేశారు...! పనిలోపనిగా ఇప్పుడు జీవితంలో ఎదుర్కొంటున్న బాధలు,
సవాళ్లను కూడా ఏకరువూ పెట్టారు.

ఎంతెంతో పెద్ద పెద్ద హోదాలో వున్నా...వేలకు వేల జీతాలు సంపాధిస్తున్నా ఏదో అశాంతికి గురవుతున్నామని చెప్పుకున్నారు.....!

ఇదంతా విన్న ఆ గురువు
కాసేపు కూర్చోండని చెప్పి లోపలికెళ్ళాడు.

కొద్ది సేపటికి గురువుగారి భార్య వంటగదిలో నుండి వేడి వేడి టీ ని ఓ కేటిల్‌లో తీసుకుని వచ్చింది.

ఓ ప్లేట్‌లో రకరకాల కప్పులను
(పింగాణి, స్టీల్‌, మట్టి, రకరకాల పూలతో ఆకర్షణీయంగా డిజైన్‌ చేసినవి) తీసుకొచ్చి, వారి ముందుపెట్టి టీ తాగమని చెప్పి లోపలికెళ్ళింది.

వాళ్లంతా మోహమాట పడుతూనే....తమకు నచ్చిన కప్పును తీసుకొని టీ తాగడం మొదలెట్టారు...!

వాళ్లంతా టీ తాగడం అయిపోగానే ఆ మాస్టారూ వాళ్లందరిని ఉద్దేశించి..

‘‘మీరంతా గమనించారా...
టీ మీ ముందుకు రాగానే , ఏ కప్పు తీసుకోవాలని కాసేపు అలోచించి మీరంతా మీకు నచ్చిన కప్పును ఎన్నుకుని టీ తాగారు..ఫలితం...
ఇక్కడున్న వాటిలో normal కప్పులే మిగిలిపోయాయి....!

అందరూ తాగే టీ
ఒకటేఅయినా... తాగుతూ..
ఇతరుల టీ కప్పు,
దాని డిజైన్‌ తమ కప్పు కంటే ఎంత బాగున్నాయే అని మధన పడుతూ తాగుతున్నారు ...
ఫలితం...తాగే
"టీ"ని అస్వాధించడం" మరిచిపోయారు..

అదే సకల సమస్యలకు మూలం....

ఈ ప్రపంచంలో మనకు ఆకర్షణీయంగా చాలా కనిపిస్తుంటాయి...
వాటి వెంట పరిగెడితే ఇక అంతే...!

మీరంతా అదే పొరపాటు చేస్తున్నారు...!

ఎదుటి వాళ్లు ఎంత సంపాదిస్తున్నారో,
ఎంత రిచ్‌గా ఉన్నారో...
ఏ హోదాలో ఉన్నారో,
ఏం కొంటున్నారో
అని పొల్చుకొని...
మధన పడుతూ...
వాళ్లలా ఉండటానికి ప్రయత్నిస్తూ
మీ ఇష్టాఇష్టాలను,
మీ అభిరుచులను
అన్నీ అన్నీ మర్చిపోతున్నారు...

మీ జీవితం టీ అయితే.....
మీ ఉద్యోగం, డబ్బు, పరపతి అన్నీ కూడా
టీ కప్పులాంటివి...no limit for them.

కప్పు మీ జీవితాన్ని శాసించనీయకండి...కప్పులోని టీ ని ఆస్వాధించటం నేర్చుకొండి. అప్పుడే "ఆనందంగా" ఉంటారు. Finally understand difference between being rich and being happy. Dont struggle much, do your interests and try to be happy

అదే జీవిత సత్యం...!!

Source - Whatsapp Message

What Time Should You Sleep??

What Time Should You Sleep??
By Dr. Hiralal Pawar D M cardiology

Is there a best time to sleep? There is a saying that sleeping early and waking up early is good for your health. How true is that? Is it alright to sleep late and wake up late?

You actually have an amazing biological clock ticking inside your body. It is very precise. It helps to regulate your various body functions including your sleeping time.

From 11pm to 3am, most of your blood circulation concentrates in your liver. Your liver gets larger when filled with more blood. This is an important time when your body undergoes detoxification process. Your liver neutralizes and breaks down body toxins accumulated throughout the day.

However if you don't sleep at this time, your liver cannot carry out this detoxification process smoothly.

· If you sleep at 11pm, you have full 4 hours to detoxify your body.
· If you sleep at 12am, you have 3 hours.
· If you sleep at 1am, you have 2 hours.
· And if you sleep at 2am, you only have 1 Hr to detoxify.
What if you sleep after 3am? Unfortunately, you won't have any time to actually detoxify your body. If you continue with this sleeping pattern, these toxins will accumulate in your body over time. You know what happens next.

What if you sleep late and wake up late?

Have you tried going to bed very late at night? Did you realize you feel very tired the next day no matter how much you sleep ?

Sleeping late and waking up late is indeed very bad for your health. Besides not having enough time to detoxify your body, you will miss out other important body functions too.

From 3am to 5am, most blood circulation concentrates in your lung. What should you do at this moment? Well, you should exercise and breathe in fresh air. Take in good energy into your body, preferably in a garden. At this time, the air is very fresh with lots of beneficial negative ions.

From 5am to 7am, most blood circulation concentrates in your large intestine. What should you do at this moment? You should poop! Pass out all unwanted poop from your large intestine. Prepare your body to absorb more nutrients throughout the day.

From 7am to 9am, most blood circulation concentrates in your stomach. What should you do at this moment? Have your breakfast! This is your most important meal in a day. Make sure you have all the required nutrients from your breakfast. Not having breakfast causes lots of health problems for you in the future.

That's the way to start your day

No wonder people living in villages or in farms are healthier. They sleep early and wake up early as they follow their natural biological clock.

If one follows this you're sure to feel fresher and more energetic all day long.

PLEASE PASS THIS ON TO OUR YOUNGER GENERATION THEY NEED TO KNOW THESE FACTS !!!

Source - Whatsapp Message