Tuesday, August 24, 2021

జీవితంలో ప్రేమ విఫలమైన ఓ గణిత విద్యార్థి తన ప్రియురాలికి వ్రాసిన లేఖ...

జీవితంలో ప్రేమ విఫలమైన ఓ గణిత విద్యార్థి తన ప్రియురాలికి వ్రాసిన లేఖ...

డియర్ రేఖ,

వాస్తవ సంఖ్యా సమితి లాంటి నా జీవితంలోనికి కల్పిత సంఖ్యలా ప్రవేశించావు.

అప్పటినుండి క్రమ భిన్నంలా సాఫీగా సాగిన నా జీవితం అపక్రమ భిన్నానికి ఎక్కువ, మిశ్రమ భిన్నానికి తక్కువగా మారింది.

మనిద్దరి వయస్సులు సామాన్య నిష్పత్తి లోనే ఉన్నాయనుకున్నా కానీ భావాలు మాత్రం విలోమానుపాతంలో ఉన్నాయని తెలుసుకోలేకపోయా.

నువ్వు దక్కవని తెలిసాక నా కన్నీళ్ళ ఘన పరిమాణం కొలిచేంత పాత్ర లేదని తెలిసింది. నా హృదయ వేదన వైశాల్యానికి అంతే లేదు.

నీతో సంకలనం... ఇష్టాల వ్యవకలనమని, కష్టాల గుణకారం అని,ఆవర్తనం కాని భాగాహారమని తెలుసుకోలేకపోయా.

మన ప్రేమ సమీకరణాలన్నీ సాధనలేని అసమీకరణాలు అవుతాయని కలలో కూడా ఊహించలేదు.

నిరూపణ లేని సిద్ధాంతానికి దత్తాంశం నువ్వయితే సారాంశం నేనయ్యా!

నా ప్రమేయం లేకుండా నీతో ఏర్పడ్డ ఈ బంధం తుల్య సంబంధం కాకపోయినా కనీసం స్నేహబంధమైనా కాలేదు.

ఇంతకాలం సమైక్య రేఖలా ఉన్న నువ్వు ఒక్కసారిగా సమాంతర రేఖగా ఎందుకు మారావో తెలియదు.

ఏది ఏమైనా నీతో వ్యవహారం సున్నాతో భాగాహారం లాంటిదని ...నిర్వచితం కాదని... ఇన్నాళ్ళకు తెలుసుకున్నా...
ఇట్లు
నీ విఫల ప్రేమికుడు,
గణిత విద్యార్థి

Source - Whatsapp Message

No comments:

Post a Comment