Tuesday, April 12, 2022

మంచి మాట...లు (05-04-2022)

శ్రీరామ స్తోత్రాం
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

హనుమ స్తోత్రాః
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ।
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ॥

బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా ।
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్స్మరణాద్-భవేత్ ॥

జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః ।
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః ॥

దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః ।
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥

సుబ్రహ్మణ్య స్తోత్రం
శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం
దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుట ధ్వజం ।
స్కందం షణ్ముఖం దేవం శివతేజం చతుర్భుజం
కుమారం స్వామినాధం తం కార్తికేయం నమామ్యహం ॥

ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు.. మా ఇంటి దైవం రామ భక్త వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారు.. తిరుత్తని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..

05-04-2022:-మంగళవారం

ఈ రోజు AVB మంచి మాట...లు

పొద్దున్నే పూచి సాయంత్రానికల్లా రాలిపోయే పూలలాగా యుగయుగాలే కాలగర్భంలో కలిసిపోతుంటే, ఆఫ్ట్రాల్ మానవ మాత్రులం మనమెంత , మనకున్నదేంత ,,

జీవితాంతం మనిషి ఇదే పొరపాటు ను చేస్తున్నాడు, ముఖానికి అంటిన దుమ్మును తుడుచుకోవటం వదిలేసి, ముందున్న అద్దాన్ని తుడుస్తున్నాడు,,

ప్రతిరోజూ దేముడు మనకేదో ఇస్తాడని ఇవ్వాలని ప్రాదించకండి.. ఇచ్చిన వాటికీ కృతజ్ఞతలు చెపుతూ ప్రాదించండి.. ఆయనకు అన్ని తెలుసు.. ఎప్పుడు ఎవరికీ ఏమి ఇవ్వాలనేది . నీకు అర్హత ఉంటే నీకు దక్కలసింది తప్పక దక్కుతుంది

కడుపు నిండా తిండి.. కంటి నిండా నిద్ర.. మనసు విప్పి మాట్లాడుకోవటానికి నలుగురు మనుషులు.. ఉంటే... ఇదే నిజమైన సంపద
సేకరణ ✒️ AVB సుబ్బారావు 🤝

సేకరణ

No comments:

Post a Comment