Tuesday, April 12, 2022

మంచి మాట...లు (08-04-2022)

లక్ష్మీ శ్లోకః
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం ।
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం ।
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం ।
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం ॥
ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు.. లక్ష్మి, దుర్గా, సరస్వతి,గాయత్రి అమ్మవార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..

08-04-2022:-శుక్రవారం
ఈ రోజు AVB మంచి మాట..లు

చూడు మిత్రమా!!

జీవితంలో ఒక్కటి గుర్తుంచుకో,, ఎప్పటికైనా మంచే విజయం సాధిస్తుంది, అరణ్యవాసం చేసిన పాండవులే గెలిచారు కానీ, అంతపురంలో ఉన్న కౌరవులు కాదు, మంచితనంతో బ్రతికే వారు ఏ రోజుకైనా సమాజంలో గుర్తించబడతారు, చెడుతనంతో బ్రతికే వారు ఏనాటికైనా సమాజంలో శిక్షించబడతారు,, ఇది పక్కా,,,,,,


ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధ పడాలని ఎప్పుడు కోరుకోకు, తెలియక బాధపెడితే క్షమించు, తెలిసి బాధపెడితే తీర్పు కాలానికి అప్పగించు, కాలమే నిర్ణయిస్తుంది,,


సంతోషం అనేది డబ్బులోనే దొరికితే,, కేవలం ధనవంతులే నవ్వాలి మరి ధనవంతులు అందరు నవ్వాగలుగుతున్నారా. డబ్బు లేనివారివారు నవ్వకుండా ఉంటున్నారా ఈ లోకంలో,,
సేకరణ ✒️AVB సుబ్బారావు 💐🤝

సేకరణ

No comments:

Post a Comment