*విద్యార్థులారా!!!*
*"ఒక ఆలోచన ఉండినప్పుడు దాన్ని శరీరం అనుసరిస్తుంది. అప్పుడు వాక్కు కూడా అనుసరిస్తుంది. అప్పుడు చేయి (హ్యాండ్) కూడా ఆ పనిలో ప్రవేశిస్తుంది. త్రికరణశుద్ధిలో రెండవది వాక్కు వాక్కుతో కఠినమైనటువంటివి గానీ లేక ఇంకేవిధమైన ఇతరులను వంచించేవి గానీ మాట్లాడకూడదు. ఒకరి ప్రాణాన్ని, వ్యక్తిత్వాన్ని హీనపరిచేట్లుగా, కించపరిచేట్లుగా కానీ మాట్లాడకూడదు కత్తితో చంపితే ఒక్కతూరి చస్తాడు. తుపాకితో కాలిస్తే వెంటనే చచ్చిపోతాడు కానీ మాటతో చంపినవాడు చచ్చేంతవరకూ అవస్థపడతాడు. ఈ మాటతో వేసేటువంటి, సూటిదైనటువంటి బాణం హృదయాన్ని గుచ్చుకుంటే ఏ డాక్టరుకూడనూ దాన్ని నయం చేయలేడు. బయట తగిలిన దెబ్బలకు ఎవరైనా మందులువేసో, బాండేజి కట్టో దాన్ని నయం చేయవచ్చు. కనుక మాటతో వచ్చిన హింస చాలా బలమైనది, ప్రమాదమైనది. కారణం అది త్వరగా చంపదు. కాలం ఎక్కువ తీసుకుని పీల్చి, పీల్చి చంపుతుంది. కనుకనే ఈ వాక్కును కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి మార్చుకోవడం అత్యవసరము."*
*~భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు.*
*సేకరణ: సత్యసాయి బాలవికాస్ మాస* *పత్రిక,సెప్టెంబర్ ~2020.*
No comments:
Post a Comment