Saturday, July 13, 2024

దేశం కాంక్ష...

 *దేశం కాంక్ష...*

ప్రపంచంలో మనం తోపులం
ప్రపంచంలో మనం తురుములం
ప్రపంచంలో మనమే అధికం
ఇదే మనం సాధించిన ఘనకార్యం...

మనం పతాకాల సాధనలో ముందు ఎపుడు ఉంటాం...
మనం ఆర్థికంగా అగ్రగామి ఎపుడు అవుతాం...
మనం విజ్ఞాన భారతమై ఎపుడు నిలబడతాం...
కుక్కల్లా పందుల్లా పిల్లల్ని కంటున్న మనం
ఆ పిల్లల్ని సింహాల్లా చేయలేకపోతున్నందుకు 
మనం సిగ్గుపడుదాం...

సింహమంటే కౄర జంతువని 
మీ మనసులో నక్క బుద్దిని కప్పిపుచ్చుకునేరు
దాని లక్షణాలను చూడండి 
తక్షణమే నేర్చుకునే గుణం తెచ్చుకోండి...

అడవికి రాజు సింహమైనట్టు
ప్రపంచానికి రాజు నా దేశమవ్వాలే 
అప్పుడే నా దేశం జనాభాలో కాదు
అన్నింటా ముందు ఉందని 
మరింత గర్వంగా చెప్పుకుంటాను....

*అభిరామ్ 9704153642*

No comments:

Post a Comment