*సమస్యలు తీరవు...*
ఒకే ఒరలో మూడు కత్తులు ఇమిడితే
సమస్యలు తీరవు...
సహన సమాచారాలతో
అనుసంధానమైతేనే తీరుతాయి...
ఒకే ప్రాంతంలో మూడు పొత్తులు పొడిస్తే
సమస్యలు తీరవు...
అవగాహన కలిగి అడుగేస్తేనే తీరుతాయి...
మార్పు కోరుకుని ఓట్లు వేశామంటే
సమస్యలు తీరవు...
మన ముందున్న సమస్యల పోవడానికి
సానుకూలంగా మనం స్పందిస్తే తీరుతాయి...
కూటములు ఏకమైతే
సమస్యలు తీరవు...
ఓటముల ఒడ్డు దాటిన గెలుపు గెలకు
అడ్డు తెడ్డులు ఎదుర్కుంటేనే తీరుతాయి...
రాజకీయం నెంబర్ల గారడిలో
సమాజ సమస్యల కంటతడి తీరదు
వెంటపడి వ్యతలుపడి వ్యవస్థలపై
వేగం పెంచబడితేనే ఫలితం
ఆంధ్రాకు... ఆది ఫలం అయితది...
చూడని బాబా...
చూడని జగనా...
చూపాల్సింది ఏమైనా గా పవనే...
ఉచితాలకు ఉరికే యెడ్డి జనాల మధ్య
ఛూ మంతర్ ఖాళీ అంటే పనులు కావు...
ఉక్కు సంకల్పం ఉషోదయమైనపుడే
ఆంధ్రా పురోగతి...
*అభిరామ్ 9704153642*
No comments:
Post a Comment