Saturday, July 13, 2024

నీ వంశ రక్షణ కొరకు

           *_నేటి గురు బోధ_*

" నేడు మానవుడు తరతరాలకు సరిపోయేలా ధనము కూడబెట్టుకోవడంలో తలమునకలై ఉండి తమ ధర్మమును మరచిపోతున్నారు"... 

"మీ పిల్లలు చిరకాలం సుఖ శాంతులతో ఉండాలని వాళ్ళకు డబ్బు మూట కట్టి ఇస్తావు, ఆ డబ్బుకి వాళ్ళ పూర్వజన్మ కర్మ ఫలం నుంచి రక్షించగలదా?"... 

నువ్వు కూడబెట్టి ఇచ్చిన ధనంకంటే నువ్వు చేసిన దాన ధర్మముల ఫలములు వాళ్ళకి వెయ్యి రెట్లు రక్షణ కల్పిస్తాయి... 
దాన ధర్మాలవల్ల కలిగిన ఫలములు దైవం నీకందించే ప్రసాదం...
నీ కష్టార్జితమే నీ వంశానికి రక్ష, నీది దుష్టార్జితమైతే నీ వంశాన్ని కష్టాలపాలు చేస్తుంది, అశాంతికి గురిచేస్తుంది...
ఎన్నో వంశ చరిత్రలు ఈ సత్యాన్ని ఋజువు చేశాయి, " కనుక నీ కొరకు, నీ వంశ రక్షణ కొరకు నీ సంపాదన నీ జీవిత కాలంలోనే దాన ధర్మాలకు వినియోగించు..."

                   - బాబా

             *_🥀శుభమస్తు.🥀_*
 *🙏సమస్త లోకా: సుఖినోభవంతు.🙏*

No comments:

Post a Comment