ఓం శ్రీ గురుభ్యోనమః..!!🙏🙏
రాశులు ఆకార స్వరూపాలు..!!
రాశి స్వరూప లక్షణాల ద్వారా జాతకుని లగ్నం గాని, రాశి గాని ఉన్నప్పుడు ఆయా లక్షణాలు కలిగి ఉంటారు.
జాతక చక్ర విశ్లేషణలో జాతకుని యొక్క స్వభావ లక్షణాలు తెలుసుకోవచ్చును.
మేషరాశి:-!!
మేషమంటే గొర్రె.
గొర్రెకు ఉండే తీవ్రత, కలహాశక్తి, ధైర్యం, బలం,
వెనుక ముందు ఆలోచింపక ముందుకు అడుగు వేయటం, దూకుడుతనం, న్యాయకత్వ లక్షణాలు, కొండను కూడా డీకొట్టగలననే నమ్మకం. ఆశ, సాహసం కలిగి ఉందురు.
మోసాలకు లోనగుదురు.
మానవులకు సహాయపడుదురు.
వృషభ రాశి:-!!
వృషభరాశి అంటే ఎద్దు.
స్ధిరత్వం కలిగి ఉంటుంది.
పోషించే స్వభావం, ఎత్తైన భుజాలు,పెరిగినకండలు, కాంతి కల కన్నులు, విశాలమైన ముఖం,
గొడ్డు చాకిరీ చేయుదురు.
ఓర్పు అధికం, ఇతరుల ఆదీనంలో ఉందురు. ఇతరులకు బాగా సహాయపడతారు.
మిధున రాశి:-!!
పురుషుడు ఒక చేత్తో గధ, స్త్రీ ఒక చేత్తో వీణ దరించిన స్వరూపం.
బార్యా భర్తలు ఇద్దరు యుక్తా యుక్త జ్నానాన్ని
కలిగి ఉందురు.
కుటుంబమును పోషించెదరు.
మానవతా దృక్పదం కలిగి ఉంటారు.
ఒకరి కోసం ఒకరు అనే భావన, వైవిధ్యం,
కొంతకాలం ఆర్ధిక ప్రతికూలత,
కొంతకాలం ఆర్ధిక అనుకూలత,
రెండు వృత్తుల ద్వారా ఆదాయం కలిగి ఉంటారు.
కర్కాటక రాశి:-!!
ఎండ్రకాయ(పిత) పీతబుఱ్ఱ (అధిక ఆలోచన)
కలిగి ఉంటారు.
పురుగు స్వభావం.
పట్టుదల, తప్పించుకొనే తెలివి తేటలు, స్వతంత్రత, అపకారం చేయుటకు వెనకాడక పోవటం,
జల భూచరమైన ఆటుపోటులు, వృద్ధి క్ష్యయాలు, మొదలైన లక్షణ ద్వయం కలిగి ఉంటారు.
సింహారాశి:-!!
సింహం. మృగ స్వభావం, బిగ్గరగా అరుచుట, గాండ్రించుట, భయం కలిగించుట,
స్వేచ్ఛగా సంచరించుట, జంకు బొంకు లేకపోవుట, అందరిని మించిపోవాలనే స్వభావం,
న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉందురు.
కన్యారాశి:-!!
సముద్రంలో తెప్పపై ఒక చేత్తో దీపం,
ఒక చేత్తో సస్యమును దరించిన స్త్రీ.
కన్య పుష్పవతి కాని స్త్రీ.
విశేషమైన ఊహాలు, సిగ్గు, లజ్జ, బిడియం,
దగ్గరకు వచ్చి మాట్లాడుటకు భయం,
సభలో మాట్లాడుటకు భయం,
పెద్దల అండ లేనిదే ఏ పని చేయలేరు.
స్త్రీకి ఉండే వాత్సల్యం, అభిమానం, బంధుప్రేమ. తన భాధను, శ్రమను ఇతరులు గుర్తించాలనే
భావం కలిగి ఉంటారు.
తులారాశి:-!!
త్రాసు ధరించిన పురుషుడు.
సమాజంలో వర్తకుడు త్రాసు ధరిస్తాడు.
స్ధిర చిత్తమును కలిగి ఉంటారు.
ధర్మా దర్మముల విచక్షణ, సమయోచితంగా ప్రవర్తించుట, ఇతరులకు సహాయ పడుట, అవకాశాలు, ధనం, కాలం, సాధనాలు సరిగా వినియోగించుట, చిన్న వస్తువులను,
సంఘటనలను సరిగా గుర్తుంచుకోవటం.
వృశ్చికరాశి:-!!
తేలు. తేలు కనపడితే జనం చంపుతారు.
కనుక ఇతరుల నుండి తనను కాపాడుకోవటం కోసం రహస్య ప్రవర్తనం కలిగి ఉంటుంది.
వృశ్చిక రాశి వారికి రహస్య ప్రవర్తన ఉండే సూచనలు.
తనకు ఈ మాత్రం హాని కలగకుండా చూసుకొనుచు, ఇతరులకు హాని కలిగించు మాటలు, పనులు చేయుదురు.
వృశ్చిక రాశి వారు పగ కలిగి ఉంటారు.
ధనస్సు రాశి:-!!
నడుము కింది భాగం అశ్వ రూపం కలిగి విల్లు ధరించిన మానవ రూపం.
ధనుర్ధారుడికి ఉండే ఏకాగ్రత, కార్యదీక్ష, పట్టుదల కలిగి ఉంటారు.
కదలిక లేని స్వభావం, ఇతరుల ఆదేశానుసారం నడుచుకుందురు.
మకరరాశి:-!!
లేడి ముఖం కలిగి మొసలి రూపం కలిగి
ఉన్న రూపం.
లేడికి ఉండే సుకుమారం, లావణ్యత, నాజూకుతనం కలిగి ఉందురు.
మొసలికి ఉండే పట్టుదల,
పొంచి ఉండి అవకాశం రాగానే కబళించే స్వభావం, ఏమి ఎరుగని మనస్తత్వం,
సమయం చూసి పట్టు పడతారు.
పట్టిన పట్టు వదలరు.
కుంభరాశి:-!!
నీటి కుండను(ఖాళీ కుండ) ధరించిన మానవ రూపం. కొత్త నీరు, నవ జీవనం, బద్ధకస్తులు,
చలనం లేక మొండిగా ఉండుట,
ఏ విషయంలో అయిన త్వరగా బయట పడుదురు. సమర్ధులు, భద్ర పరుచుకుందురు.
మీనరాశి:-!!
రెండుచేపలు ఒకదాని తోక వైపు మరొక చేప తల ఉన్నట్లుండే రూపం.
ఒకరిని చూసి మరొకరు సర్ధుకుపోవటం,
నీటి ప్రవాహంలో ప్రయాణం.
సమయమును బట్టి వృద్ధి చెందగలరు.
ఎరవేస్తే వలలో పడుతారు.
ఆశ చూపిస్తే లొంగిపోతారు.
ఓం నమః శివాయ.. ఓం నమః శివాయ..
ఓం నమః శివాయ.. ఓం నమః శివాయ..
ఓం నమః శివాయ..!!🙏🙏
No comments:
Post a Comment