Saturday, July 20, 2024

 🙏🕉️🛕🔱⚜️🐚🌞🌙🏵️🌹🙏
 *తమిళనాడు లో పేరు ప్రఖ్యాతులు గాంచిన సిద్ద పురుషులు అనేకులు గలరు. అందు 18 మంది ప్రత్యేకం. వారిలో (5) కొoగనార్ గురించి వివరణ*
🙏🕉️🛕🔱⚜️🐚🌞🌙🏵️🌹🙏
      కొంగన సిద్ధర్ ("కొంగనర్ సిద్ధర్") [1] లేదా కొంగనార్ లేదా కొంగ నవ పద్దెనిమిది సిద్ధుల లో అత్యంత ముఖ్య మైన సిద్ధర్‌ గా పరిగణించ బడుతున్నారు.
      ఇతడు క్రీ.శ.7వ శతాబ్దంలో జీవించాడు. కొంగు స్థానికుడు . కాబట్టి అతనికి ఈ పేరు వచ్చిందని ఒక కథనం.. 
   ఒక కథనం ప్రకారం, కొంకణార్ ప్రాథమికంగా కొంగునాథ్‌ లోని మహారాజు అనే రాజు యొక్క ఏకైక కుమారుడు. 16 సంవత్సరాల వయస్సులో అతను అడవుల్లో తిరగాలి అనే  కోరిక మేరకు తన తండ్రికి విన్నవించు కున్నాడు. ఆ ప్రయాణానికి పూవలం అని పేరు.కొండ అరణ్యాల చుట్టూ తిరుగు తున్న యువరాజు తన కంట పడిన పక్షులు, జంతువులు, మొక్కలు, తీగలు అన్నీ కత్తితో నరికి దూరంగా విసిరి వేసి నారు. ఆ కొండ పేరు పెదగూర్ కొండ .
    కొంకణార్ తిరువల్లువర్ శిష్యుడు మరియు బోగర్ శిష్యుడు అని చెబుతారు. అతని పేరుతో వైద్య, రసవాద, యోగ పుస్తకాలు మరియు శ్లోకాలు ఉన్నాయి. 
   మరొక కథనం ప్రకారం అగతి యార్ పాణి 2000 మరియు బోగర్ 7000 ప్రకారం, కొంకణ్ సిద్ధర్ కేరళలోని అందమైన కొంకణ్ ప్రాంతంలోని పులిజ్ఞార్ గుడి అనే ఉారిలో జన్మించి నారని ఉన్నది. 
*తిరువల్లువర్ శిష్యుడు* 
         కొంకణ్ సిద్ధుని గురించి ఒక కథ ఉంది. కొంకణార్ చెట్టు కింద యోగా చేస్తున్నాడు. అప్పుడు చెట్టుపై ఉన్న కొంగ అతని పై రెట్ట వేసింది. కొంగనార్ వెంటనే ధ్యానం నుండి లేచి కొంగను చూశాడు. అది కాలి బూడిద అయినది. ఆ తర్వాత పట్టణంలోకి వచ్చి తిరువల్లు వర్ ఇంటి ద్వారం వద్ద నిలబడి భిక్ష అడిగాడు. వల్లువర్ భార్య వాసుకి యార్ తన భర్తకు భోజనం వడ్డిస్తూ ఉన్నది. అందుకే భిక్ష తీసుకు రావడానికి కొంత సమయం పట్టింది. కొద్ది సేపటికి కొంకణార్  భిక్ష తెచ్చిన వాసుకియార్ వైపు తీక్షణంగా చూశాడు. వెంటనే ఆ మాత వాసుకియార్ "నేను కొంగ లేదా ఒక చిన్న కీటకం అని అనుకుంటున్నారా?" అని అడిగినది. భయపడిన కొంకణార్ వాసుకి మాతకు నమస్కరించాడు. తరువాత తిరువళ్ళువర్ శిష్యుడు అయ్యాడు. 
       ఈయనకు  సిద్ధర్ భోగర్ గురువు. కొంగాణార్ గొప్ప మురుగన్ మరియు అంబి గై భక్తుడు. భోగర్ కొంకణార్‌ కు మురుగన్ ను పూజించే విధానం మరియు మంత్రాలను నేర్పించారు. పళని లో అండి కోలం లో(దిగoబరుడి గా)మురుగ భగవానుడు ఈయనకు దర్శనం ఇచ్చారు.       
     కొoగనార్ గారు మురుగన్ పాలించు పళనిని విడిచిపెట్టి ముల్లై  కొండకు *తిరు విళై యాడల్* ( *తిరు* శ్రీ అంటే మురుగన్ స్వామి, *విళయాడల్* అనగా వినోద కేళి ) మహిమ తిలకించడానికి  వెళ్లాడని మురుగన్ కొండ చరిత్ర చెబుతోంది, మురుగన్ పళని నుండి దూరంగా వెళ్లి అక్కడ సిద్ధులు సేకరించిన బంగారు పర్వతాన్ని ఎత్తుకొని వచ్చి వైగై నదీతీరంలో పొన్ మలై అను స్థానంలో స్తాపించి నట్లు అళవాయి పార్వతీ స్థల పురాణంలో చెప్ప బడినది.
కొంగననార్ పళని వదిలి వెళ్ళిన విషయం తన దివ్య ద్రుష్టి ద్వారా తెలుసు కొన్న బోగర్ సిద్దర్ ముల్లై పర్వతం పైన నవ పాషాణముతో మూల విరాట్టు గా దండా యుధ పాణి రూపంతో స్వామిని(మురుగన్)  స్థాపించారు.(ప్రస్తుతం పళని ఆలయం కొండ)
      తన శిష్యుడైన కొంగనార్‌ ని పిలిచి  , ములై పర్వతం పైని  మురుగన్ తిరువిళ యాడల్‌ను చూడమని చెప్పారు. అందుకు అంగీకరించిన కొంకణార్ కూడా పళనినికి వచ్చి  కొండపై జరుగు తున్న వైభవాన్ని తెలుసుకొని, అక్కడే,  కొంత కాలం తపస్సు చేసాడు. 
      పిమ్మట అక్కడి నుండి బయలు దేరి, వైగై నది తీరం లొని  పొన్మలై చేరుకుని సుమారు 300 ఏళ్లు తపస్సు చేసి అక్కడి గుహలో ఉన్న మురుగన్‌ ని దర్శించు కొన్నట్లు చరిత్ర కారులు చెబుతున్నారు. అక్కడి నుంచి ఊదియూర్ మరియు పళని వచ్చి బోగార్‌ ని చూసి ఉప్పొంగి పోయారు.     
      తిరిగి ప్రయాణం కొన సాగిస్తూ,  చివరకు చిత్రై మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం లో తిరుపతి తిరుమలలో జీవ సమాధిని పొందారు.     
          తిరుపూర్ జిల్లా ఊదియూర్ పర్వతంపై  కొంగణ సిద్ధర్ తప పీఠమ్ ఉన్నది తమిళ నాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. కొంకణ్ సిద్ధర్ తమిళనాడులోని అనేక ప్రాంతాలకు వెళ్లి తపస్సు చేసి చివరకు తిరుపతిలో మరణించినట్లు కథనాలు ఉన్నాయి. అతను బస చేసిన ఇతర ముఖ్యమైన ప్రదేశాలు వాయప్పమలై, అలవైమలై మరియు సంగకిరి.ఇవిఆయన నివసించిన ఇతర ప్రదేశాలలో ముఖ్యమైనవి 
     అతనికి కొంకణార్, కొంకణాచ్ సిద్ధర్, కొంకణ్ నాయనార్, కొంకణ్ నాడార్ వంటి అనేక పేర్లు ఉన్నాయి. వారు వేర్వేరు వ్యక్తులు అని అంటారు.
🙏🕉️🛕🔱⚜️🐚🌞🌙🏵️🌹🙏
🦚 *యం.గణేష్ మొదలియార్* 🦜
🙏 🙏
🙏🕉️🛕🔱⚜️🐚🌞🌙🏵️🌹🙏

No comments:

Post a Comment