Saturday, July 13, 2024

టీవి తెచ్చి న తంట

 టీవి తెచ్చి న  తంట
సుజత తన పిల్లలు మేఘన నందులను తీసుకొని వేసవి సెలవులకి పుట్టింటికి వచ్చింది చాలా కాలం తర్వాత. వచ్చింది. కనుక తల్లి లక్ష్మమ్మ ఎదురుల్లి స్వాగతం పలికి ఇంట్లోకి తీసుకొచ్చింది. పిల్లలు ఇద్దరు అమ్మమ్మతో పాటు వెనుకగా నడుస్తూ బోలెడన్ని విషయాలు మాట్లాడుతూ నవ్వుతూ వెళ్లారు. లక్ష్మమ్మ సుజాత నీ కుసుల ప్రశ్నలు అన్ని అడిగి, వేడివేడి కాఫీ అందించింది. మీరు ఉండేది ఎక్కడో దూరాభారాలు మేము రాలేము .మీకు రావడం కుదరదు పోనీలే. ఇన్నాళ్ళకి అయినా రాగలిగావ్అందుకే ఆనందం. సరే ఎప్పుడు అనగా తిన్నారో ఏమో ,త్వరగా స్నానాలు అవి కానివ్వండి వేడిగా భోజనం వడ్డించేస్తాను అంది అమ్మ, సరే అండి సుజాత. మధ్యాహ్న సమయం , భోజనాలు అయిన తరువాత అందరూ టీవీ ముందు కూర్చున్నారు. పిల్లలు ఏవో మాట్లాడుకుంటూ టీవీలో చానల్స్ మారుస్తూ చూస్తూ నవ్వుతూ , కాలక్షేపం   చేస్తున్నారు . అంతలో మేఘన అమ్మమ్మ దగ్గరికి వచ్చింది .మీ కాలం లోటీవీలు ఉన్నాయా అమ్మమ్మ, మీరు ఎలాంటివి చూసేవారు అని అడిగింది.. దానికి లక్ష్మమ్మ పకపక నవ్వింది ఎందుకు అంతలా నవ్వుతావు ,అమ్మమ్మ నేను ఏమి అడిగాను ఇప్పుడు నిన్ను అని అడిగింది మేఘన ,ఏం లేదు తల్లి నాకు ఏదో జ్ఞాపకాలు గుర్తుకొచ్చి నవ్వొచ్చింది .నేను కూడా మా అమ్మమ్మ గురించి చాలా విషయాలు వినడం చూడడం జరిగింది అందుకే నవ్వు ఆగలేదు. మీ అమ్మమ్మ ఏం చేశారు నువ్వు అంతలా నవ్వడానికి, నాకు చెప్పమమ్మా అని అడిగింది .దానికి లక్ష్మమ్మ సరే చెప్తాను విను నజాగ్రత్తగా అని చెప్పింది. అది 1977 అప్పుడే కొత్తగా టీవీలు వస్తున్న సమయం అన్నమాట . అంటే మా అమ్మానాన్న అన్నమాట వాళ్లకి ఇంకెవరూ లేరు .,మా అమ్మ తప్ప అలాంటి సమయంలో ,మా అమ్మ వాళ్ళు దూరప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉండేవారు. అప్పుడు మా అమ్మ వాళ్ళ అమ్మతోటి అందిట ,అమ్మా నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉంటూ ఉంటావు ,నీకు కాలక్షమేము అవుతుంది .అంచేత మాకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిన ఊరుబర్మా ,కనుక అక్కడికి వెళ్లి అని సర్దుకుని అక్కడి నుంచి వచ్చేటప్పుడునీకు ఏమైనా పట్టుకొస్తాను ,దానికి చూద్దాంనువ్వు దూరం వెళ్ళిపోతున్నావు అదే బెంగగా ఉందని ,వాళ్ళ అమ్మ అంటుంది .ఇంతలో వాళ్ళు బర్మా వెళ్ళవలసిన టైం రానే వచ్చింది .వాళ్ళు బర్మా బయలుదేరి వెళ్తారు ,వెళ్లి అక్కడ కొన్నాళ్ళు ఉండి ,అక్కడ సామాన్లు అవి అన్ని సర్దుకుని ,కొంచెం కుదిరి పడిన తర్వాత తిరిగి మళ్ళీ తల్లిని చూడటానికి వస్తుంది .ఆ వచ్చేటప్పుడు తన కూడా ఒక టీవీని పట్టుకుని వస్తుందన్నమాట .రాగానే అమ్మమ్మ మా అమ్మని చూసి చాలా ఆనందపడి వచ్చావా తల్లి ఎన్నాళ్ల తరువాత మళ్ళా అని చెప్పి దగ్గరగా తీసుకొని ప్రేమగా మాట్లాడుతుంటుంది. మాట్లాడుతుండగా అమ్మ ,నాన్నగారు ,తెచ్చిన టీవీ నీ టేబుల్ మీద పెట్టారు .అది మా అమ్మమ్మ చూసి ఏమిటిది అని అడిగింది .మనుషులు ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అని చెప్తుంది. మేము ఎవరో లేనప్పుడు నీకు కాలక్షేపంగా తోడుగా ఉంటుందని పట్టుకొచ్చాను, దీనిని టీవీ అంటారు. అలాగా అని చాలా ఆశ్చర్యంగా చూసింది అమ్మమ్మ. తరువాత నాన్నగారు తాత గారికి దాన్ని ఎలా వాడాలో చూపించారు. వాళ్ళు కొన్ని రోజుల తర్వాత తిరిగి మళ్ళీ బర్మా వెళ్లి పోయారు. అయితే ఇవాళ ఉన్నంతసేపు అమ్మమ్మ టీవీని చూసిందే కాదు, తర్వాత తాతగారు టీవీని పెట్టారు పొద్దున్నే పెట్టగానే ఆ టీవీలో ఎవరో ఒక ఆయన వచ్చి కూర్చుని దేని గురించి మాట్లాడుతున్నారు అది తాతగారు శ్రద్ధగా వింటున్నారు .ఇంతలో అమ్మమ్మ అక్కడికి వచ్చింది కూర్చుంది .ఆమె ఎదురకుండా ఆయన మాట్లాడుతూ ఉంటే చూసి ,చాలండిముందు టీవీ ని వెనక్కి తిప్పుతారా తిప్పరా అని గట్టిగా అరిచింది . ఎందుకే అని తాత అడిగారు. ఎందుకేమిటి ఏమీ తెలియని అయోమయం మనిషి, పరాయి మగవాడు అలా చూస్తుండగా నేను మీ పక్కన ఎలా కూర్చోగలను, మీకైనా ఆలోచన ఉండదు అని చెప్పి , చీర అంతా  తీసి నిండుగా కప్పుకుంది. దానికి తాతయ్య నీ మొహం వాడేమి అలా అనుకునేవాడు కాదు గాని నువ్వు కామ్ గా కూర్చో అన్నారు ,సరే మీరు మీరు ఏమైనా ఊరేగండి నేను ఇక్కడ కూర్చోలేను పోతున్నానని చెప్పి పెరట్లోకి పోయింది. సాయంత్రం ఇంటి పని అంతా పూర్తిచేసుకుని మళ్ళా వరండాలో వచ్చి కూర్చుంది ,ఈలోగా టీవీలో ఎవరో ఒక ఆడమనిషి ఏవో ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ, మాట్లాడుతూ నవ్వుతూ ఉంది,దాన్ని తాత చూస్తున్నాడు ఆమెకి చాలా కోపం వచ్చింది .ఏంటా చూపు పది మందిలో ఉన్నావ్ అని కూడా ఆలోచించకుండా తదేకంగా దాన్ని చూస్తున్నారు. దానికి అంతకన్నా సిగ్గులేదు , గలగలమాట్లాడేస్తోంది పదిమంది ఏమనుకుంటారు ఇలా చూస్తే మీకేనా బుద్ధి ఉండాలి కదా, అల్లుడు ఇచ్చాడు కదా అని తగునమ్మ అని దాని ముందే అలాకూర్చొని చూస్తున్నారు ఇదేమి బాగాలేదు మీవరుస,అనిదుమదుమలాడుతూ వంటింట్లో కి వెళ్లిపోయింది. ఆయన ఎంత చెప్పినా వినిపించుకోక ,ఆమెకు అర్థం కాక రోజు ఏదో ఒక తలనొప్పి పెట్టుకుంటూ ఉండేది టీవీ గురించి. ఒకరోజు తాతగారు పొద్దున్నే పక్క ఊరికి బయలుదేరి వెళ్లాల్సి వచ్చింది. రాత్రి కానీ రాలేనని చెప్పారు ఆమెను జాగ్రత్తగా ఉండమని చెప్పి బయలుదేరి వెళ్లారు. ఈయన ఉంటే పొద్దున్న ,మధ్యాహ్నం ,రాత్రి ఆయనే పెట్టుకొని చూసేవారా టీవీని .ఇప్పుడు ఈ బాగోతం నాకు పడింది. పొద్దున్నే లేచి పెట్టాలి కాబోలు అని లేచి వెళ్లి టీవీ పెట్టింది. అందులో కోళ్లు పెంపకం గురించి ,కోడిగుడ్లు గురించి, వాటి మాంసం గురించి, ఇలాంటి విషయాలు మీద కార్యక్రమం జరుగుతోంది. వెంటనే అమ్మమ్మ ఛీ,ఛి,శుభ్రమైన బ్రాహ్మణ ఇంట్లో ఈ మాయదారి మాంసం గోల ఏమిటి ఆయనే ఉంటే ఆయనే పెట్టి చూసేవాడి టీవీని. ఆయన ఊరు వెళ్ళడంతో అల్లుడికి కోపం వస్తుందని చచ్చినట్టు నేనే పెట్టుకుని కూర్చున్నాను దీని ముందు ,అని చెప్పి ఒక చెంబు నిండా పసుపు నీళ్లు పట్టుకుని వచ్చి టీవీ మీద కుమ్మరించింది. ఇంతలో కరెంట్ పోయింది అమ్మమ్మ ఆ కోడిగుడ్లు ,కోళ్లు పోయానుకుంది. ఈ లోపల పక్కింట్లో ఉన్న పంకజం వచ్చింది. వదిన అన్నయ్య ఇంట్లో లేరా అని అడిగింది. లేరమ్మ పనిమీద పొరుగురు వెళ్లారు ,అందుకే నాకు ఈ గోల అంతా వచ్చింది. అల్లుడు ఇచ్చిన వస్తువు వాడకపోతే అల్లుడికి కోపం వస్తుంది ,పిల్ల కాపురంలో ఇబ్బంది అవుతుంది అందుకని ఏమీ చేయలేక దీని ముందు ఇలా కూలబడ్డాను, ఎక్కడ పని అక్కడే ఉంది అని చెప్పింది. వదిన కాసేపు నువ్వు దీని ముందు కూర్చుంటావా నేను పోయి ఇంట్లో పని చేసి వస్తాను అని చెప్పింది. దానికి ఆమె సరే అని చెప్పగా లక్ష్మమ్మ ఇంట్లోకి వెళ్లింది. ఇంతలో కరెంట్ వచ్చి టీవీ మోగింది దాన్లో ఐదు ఆరుగురు మగవాళ్ళు కూర్చుని ఒక విషయం మీద చర్చిస్తున్నారు, దాన్ని చూసిన పంకజం వదినా ,వదినా ,అని గట్టిగా అరిచింది ఇంతలో ఏం కొంప మునిగిందో అని పరిగెత్తుకొచ్చింది లక్ష్మమ్మ ,తీరా చూస్తే ఒక అయిదు గురు మగవాళ్ళు కనిపించారు ,వదిన వంటగా వస్తే నేను చేసి పెడతాను కానీ ఈ పరాయి మగవాళ్ళ ముందు నేను కూర్చోలేనమ్మ వెళ్తున్నాను, అని వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఇక చేసేదేమీ లేక లక్ష్మమ్మ వరండాలో కూలబడింది టీవీకి వెనుకగా తిరిగి. పంకజం వంట పూర్తి చేసి ,నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయింది .సాయంత్రం అయింది పరంధామయ్య రానే వచ్చాడు. ఏమోయ్ వంట ఏం చేసావ్ అని అడిగాడు నా బొంద చేశాను, పొద్దున్నుంచి దీని ముందు కూర్చోవడమే సరిపోయింది ,అల్లుడు ఇచ్చిన వస్తువు కాదనుకుంటే అతనితో గొడవ వస్తుందని , పంటి బిగువునాఏ పని చేయకుండా కూర్చున్న అని చెప్పి వంటింట్లోకి వెళ్తుంది మా తాతయ్య అమ్మమ్మ చాదస్తం,తట్టుకోలేక మా అమ్మకు ఉత్తరం రాసాడు అమ్మాయి నువ్వు ఇచ్చిన ఈ టీవీ నా కొంపకొల్లేరు చేసేలా ఉంది .నాకు వద్దమ్మా దీన్ని తీసుకుపో అని రాశారు,దానికి అమ్మ ఏం జరిగింది నాన్నగారు అని ఉత్తరం రాసింది. జరిగిన విషయాలన్నీ తాతగారు ఉత్తరంలోచెప్పారు .వాళ్ళు ఒకటే నవ్వుకుని సరే మేము వచ్చి తీసుకుంటాం  అని చెప్పి వచ్చి దాన్ని పట్టుకెళ్తారు. అయితే అమ్మమ్మ మీ అమ్మమ్మకి అస్సలు తెలియదా టీవీ గురించి. తెలీదమ్మా సత్తికాలం వాళ్ళు కదా చాలా అమాయకులు .అంతా మంచితనమే తప్ప మిగతా విషయాలు గురించి ఏం తెలియదు వాళ్ళకి. అందుకనే ఆమెకి ఎంత చెప్పినా అర్థం కాలేదు ,ఆ బాధపడలేక మా తాత ఈ టీవీని తిరిగి ఇచ్చేశారు. నాకు టీవీ అన్న విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఈ సంఘటన గుర్తు వచ్చి నవ్వు వస్తూ ఉంటుంది. అది విన్న మేఘన నందు పడి పడి నవ్వారు .చాలా చాలా హాస్యంగా ఉందమ్మ నువ్వు చెప్పింది .అని చెప్పి చాలా కాలం అయింది ఇంత బాగా నవ్వుకొని .మేము టీవీ గురించి కథ వ్రాయమంటే దీని గురించే రాస్తాం అని చెప్పారు రోజులన్నీ చాలా సరదాగా గడిచిపోయాయి వాళ్ళు తిరిగి ప్రయాణం అయ్యే రోజు రాని వచ్చింది. క్షేమంగా వెళ్ళమని చెప్పి మనసారా దీవించి సుజాతనీ పిల్లల్ని పంపించింది.
ఈ కథ సరదాగా ఉంటుందని రాశాను .చదివినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. 
రచయిత్రి గంటి బాలా త్రిపుర సుందరి సరూర్నగర్ హైదరాబాద్

No comments:

Post a Comment