ఆలస్యం కాకముందే నిన్ను నీవు కలుసుకో Meet Yourself Before It Is Too Late
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=T7UbyUk2EY4
Transcript:
(00:01) జీవితంలో మనందరం కూడాను చాలామంది వ్యక్తులతో జీవిస్తూ ఉంటాం కదండీ అసలు అలా జీవించకపోతే కుదరదు. ఎప్పుడైతే మనం దగ్గరగా ఉంటామో వాళ్ళకి అప్పుడు మనకు కూడాను కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి. అలా ఏర్పడటం కూడాను సహజమే అవే మనల్ని నడిపిస్తూ ఉంటాయి కూడా ఒక్కొక్కసారి వాటినే నిదమనుకొని మనం ఏం చేస్తుంటాం అంటే వాళ్ళతో వివేదిస్తూ ఉంటాం కూడా కదా అలా మానసిక సంఘర్షణకు వాచిక ఘర్షణకు గురైతూ ఉంటాం వాచిక ఘర్షణ అంటే కొత్త పద ప్రయోజనం లేండి అంటే మాటలతో ఘర్షణకు గురైతూ ఉంటాం కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమందేమో దూరమైపోతూ ఉంటారు
(00:45) కారణం ఏంటి మనం వాళ్ళని దగ్గరగా పరిశీలిస్తూ ఉంటాం వాళ్ళతో దగ్గరగా గడుపుతూ ఉంటాం. ఇలా జీవితం అనేది అభిప్రాయ భేదాలతో నడుస్తూ ఉంటుంది. ఒకానొక రోజు ముగింపు దశకు చేరుకుంటూ ఉంటుంది. కదా అప్పుడు గతాన్ని గనుక ఒక్కసారి నెమర వేసుకుంటూ ఉంటే అబ్బా 80 ఏళ్ళు గడిపాం కదా ఎంత మానసిక సంఘర్షణంతో గడిపాము ఎంతో మందిని విభేదించాం కదా ఎంతో మంది మనసుని గాయపెట్టాం కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది.
(01:18) చేసిన మంచి పనులు ఏటో ఉన్నాయి అనుకోండి కానీ మనుషులు బాధ పెట్టిన క్షణాలే మనల్ని బాధిస్తూ ఉంటాయి అన్నమాట అప్పుడు తెలియని ఒక పరివర్తన కలుగుతూ ఉంటుంది అయ్యయ్యో జీవితం మన చేతి నుంచి జారిపోతున్నది కదా ఆ ఇంక మళ్ళీ వచ్చే జన్మకి ఏ జీవితం వస్తుందో అని బాధపడుతూ ఉంటాం సిక్బెడ్డిలో ఉండి అయితే ఆ పరివర్తన కూడా ఎలా ఉంటుందంటే చాలా విచిత్రంగా ఉంటుందండి ఆ తడువు లేదు పోనీ ఆమె వాళ్ళ శరీరక మానసిక శక్తులన్నీ కూడాను సృష్టిపరంగా వచ్చాయి కదా నేను ఏమన్నా వాళ్ళని సృష్టించానా భగవంతుడే వాళ్ళని అలా సృష్టించి పంపించాడు కదా ఆ శక్తుల దాటి అతడు గాని లేకపోతే ఆమె గాని దాటిపోవడం అంటూ జరగదు కదా అనవసరంగా
(02:03) వాళ్ళని నేను అపార్థం చేసుకున్నాను అన్న భావనకి ఒక్కోసారి మనం తాపిస్తామండి జీవిత చరమంకలో అది కూడాను వ్యాధి మంచంలో ఉన్నప్పుడు సిక్కుబెడ్డలో ఉన్నప్పుడు భగవంతుడు వాళ్ళని ఎలా అయితే సృష్టించి ఈ భూమి మీదకి పంపించాడో వాళ్ళు ఎలాగ ప్రవర్తించారు అన్న వాస్తవాన్ని తెలుసుకునేటప్పటికి నిజంగా అసలు పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా బాధగా ఉంటుందండి ఇది వాస్తవం అయితే ఒక్కసారిగా మనము ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాంండి అంటే కళ్ళు మూసుకొని ఈ విశాల విశ్వంలో బతికున్న వాళ్ళను చనిపోయిన వాళ్ళను అలా సుదూరంగా వినీల ఆకాశంలో వాళ్ళని శరీర ధారులుగా అంటే దూరంగా అంటే ఇంత చిన్న
(02:48) చిన్నగా కనిపిస్తుంటారు కదా అలా వాళ్ళని ఊహించుకుంటూ ఉంటే అంటే మనక ఏమనిపిస్తుందంటే నేను అనవసరంగా వాళ్ళని పట్టించుకని వాదనలో దిగి బాధ పెట్టి నేను కూడా అనవసరంగా బాధపడ్డాను కదా అని అనిపిస్తుందండి ఇంకా ఏమనిపిస్తుంది అంటే వాళ్ళంతే ఇంకలా ఉండటానికి వీలు ఉండదు కదా అని ఎందుకంటే భగవంతుడే ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ అలా సృష్టించి ఈ భూమి మీద పంపించాడు కదా అలా వాళ్ళతో ప్రవర్తించకుండా ఉండవలసింది నేను వాళ్ళని అలా వదిలేసి ఉండవలసింది.
(03:24) తప్పు చేశాను కదా నేను నిజంగా వెళ్లి వాళ్ళ జీవితాల్లో జీవించానా పోనీ వాళ్ళవచ్చి నా జీవితాల్లో నిజంగా జీవించగలరా ఎవరి జీవితాన్ని వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆలోచనలతో జీవిస్తున్నారు కదా తప్పు చేశాను కదా మనం ముంచుకొచ్చేస్తున్నది కదా అని బాధపడుతూ ఉంటామండి ఎందుకంటే ఆ క్షణం వచ్చేదాకా మనకి మన మానసిక పరిస్థితి లేదు. అది అనుభవిక వైద్యం అంటారు.
(03:53) కానీ చెప్పానుగా అప్పటికే కాలం మించిపోయి ఉంటుంది. అచేతనంగా అలా ఉండిపోతాం అన్నమాట. అసలు ఈ బ్యాక్ డ్రాప్ లో మనిషి ఉన్నవాడు మొదటి నుంచి ఎలా ఉండాలి ఏ భావనను వంట పట్టించుకోవాలి ఎలాంటి సంయమన మనస్తత్వాన్ని అలవరుచుకోవాలి అన్నదే ఈ వీడియోలోని చర్చ అండి. అంతకంటే ఏం లేదు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ఇది కొంత ఫిలాసఫికల్ గా ఉంటుంది అంత స్పిరిచువల్ గా కూడా ఉంటుంది కొంచెం కష్టపడి నేను నోట్స్ కూడా నువ్వు రాసుకున్నాను అన్నమాట నేను ఒక మేధావి అన్నట్టు గుర్తు నేను ఏమన్నా అంటే వాళ్ళని మార్చాలని జీవితంంతా ప్రయత్నించాను కానీ వాళ్ళు వాళ్లే
(04:34) నేను బాధపడ్డాను వాళ్ళని బాధ పెట్టాను చివరికి అర్థమయింది. వాళ్ళు ఇంకోలా ఉండరని నిజమే కదండీ అలాగే ఇంకో మేధావి ఏమన్నాడంటే నాకున్న సమస్యను తీర్చుకోవడానికే సతమతం అయిపోతున్నాను ఇంకొకళని గురించి ఆలోచించే టైం నాకు ఎక్కడ ఉంది అందుకే నేను చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటాను కొందరు దాన్ని గర్వమని అహంకారం అని అనుకుంటూ ఉంటారు.
(05:05) నేను మనకు ఏం చేయగలను అని అంటే చూసారా అతని యొక్క అసక్తతని ఎలా చూపెట్టుకుంటున్నాడో నిజాయితిగా ఉండానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ లోకం అతన్ని అతన్ని అర్థం చేసుకోవట్లేదు. అంటే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఇది నిరాశ కాదు జ్ఞానం వైపుకు వేసే అడుగు ఇప్పుడు కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతి జీవి కూడాను మూడు విషయాల సమ్మేళనం అండి బాగా పట్టుకోవాలి మీరు ఒకటేమో గత కర్మలు రెండు జన్మతో పాటు వచ్చిన స్వభావం వాటినే మనం వాసనలు అంటాము సంస్కారాలు అంటాము.
(05:39) మూడు వచ్చేసి ప్రస్తుత పరిస్థితులు అంటే ఇద్దరు వ్యక్తులు ఒకే సంఘటనని చూసినా వాళ్ళు ఒకే విధంగా స్పందించరు వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్తే ఇంకా బాగా అర్థమవుతుందండి. తండ్రి కొడుకు మీద క్రమశిక్షణని ప్రేమగా భావిస్తాడు. అదే విషయాన్ని కొడుకు నియంత్రణగా పరుస్తాడు నాన్న నన్ను బాగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని అనుకుంటాడు తప్ప ఆయన నన్ను డిసిప్లిన్ లో పెడుతున్నాడు అని మాట అనుకోడండి ఒక విధంగా చెప్పాలి అంటే ఇద్దరు తప్పు కాదు ఇద్దరు తమ తమ సంస్కారాల ప్రకారం స్పందిస్తున్నారు.
(06:20) అంటే విజ్ఞులుగా మొదటి నుంచి మనం చూడవలసింది వ్యక్తిని కాదండి అతని స్వభావాన్ని చాలామంది సామాన్యులు ఇలాగ అనుకుంటూ ఉంటారు అతడు నన్ను బాధ పెట్టాడు అని కానీ విఘ్నుడు ఎలా చూస్తాడు అంటే అతని స్వభావం ద్వారా అతను అలా ప్రవర్తిస్తున్నాడు అంతే అతని చర్యలు అలా ఉంటున్నాయి అనుకుంటాడండి ఉదాహరణకి పాము ఉంది పాముకు మీకు ఏ విధమైన అవినాభావ సంబంధం లేదు కానీ అది కాటు వేసింది.
(06:54) తనను తను రక్షించుకోవడానికి ఒక కాటు వేసిందా భయంతో కాటు వేసిందా లేకపోతే ఆకలి కలిగి కాటు వేసిందా మనకు తెలియదు మొత్తానికి అది కాటు వేసింది. అంటే అది తన సహజ స్వభావాన్ని ప్రదర్శించింది అనుకోవడం తప్ప వేరే మార్గం లేదండి కానీ మనిషి అక్కడ అనుకోలేదు ఎందుకంటే కాటు వేయంగానే విషయం శరీరంలోకి పాగుతూ ఉంటుంది. నోటి నుంచి నొర వస్తూ ఉంటుంది.
(07:17) ఒక్కొకసారి మరణానికి కూడాను దగ్గర అవుతూ ఉంటాం. కదా ఇదొక ఎగజాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి కఠినంగా మాట్లాడుతున్నాడు. మీరు నిశశబ్దంగా ఉన్నారు అంటే ఆయన మాటలు వింటున్నారు. అతని ప్రవర్తనని పోని మీరు అంగీకరిస్తున్నారా లేదు ఆయన ఎంత కఠినంగా మాట్లాడినా అతనే కరెక్ట్ అనుకుంటామా లేదు కదా ప్రస్తుతం అతను అతని సహజ స్వభావాన్ని ప్రదర్శిస్తున్నాడు అంతే అని అనుకుంటాం కదండి అంటే విజ్ఞుడైన వాడు అలా అనుకోవాలి అంతే అంటే విజ్ఞులుగా మనము నేను అతన్ని మార్చాలి అనే అహంకారానికి మనం దూరంగా
(08:02) ఉంటున్నామఅండి ఎందుకంటే అతన్ని మార్చలేంు కదా మార్చాలని ప్రయత్నిస్తూ కొద్ది మనలో అహంకారం తెలియకుండా పెరుగుతున్నట్లు లెక్క ఇప్పుడు దైనందుక జీవితంలో చూడండి కాసేపు కుటుంబ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుందాం. భార్య భర్తని మార్చాలని చూస్తుంది భర్త భార్యని మార్చాలని చూస్తాడు. ఇద్దరు కలిసి పిల్లల్ని మార్చాలని చూస్తారు.
(08:22) ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులని మార్చాలని చూస్తారు. ఇక్కడే సంఘర్షణ మొదలవుతున్నది ఎందుకంటే మనిషి తనను మార్చుకోవడం చాలా కష్టం అది వాళ్ళ తత్వం అంతే ఇంకోలా ఉండడానికి కుదరదు అని అనుకోలేకపోతున్నాడండి మనిషి మనిషి ఒక్క మాట అండి చాలా గుర్తు పెట్టుకోండి ఈ వాక్యాన్ని మటుకు మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ప్రతి వ్యక్తి కూడాను తన కర్మ యాత్రలో ఉన్నాడు అలాగే మీరు కూడాను ఇద్దరి యాత్రలు వేరు రైలు పట్టాలలాగా దూరంగా కలుసుకున్నట్టు కనిపిస్తాయి. ఇవాళ లేకపోతే రేపు నా
(09:06) అభిప్రాయాలతో ఏకీభవిస్తాడు నేను అతన్ని కన్విన్స్ చేయగలను ఒప్పించగలను అని అనుకుంటాం కానీ ఒప్పించలేము. రైలు పట్టాలలాగా మన అభిప్రాయాలు కలుసుకోవు ప్రయాణం ముగిసేటప్పటికి కానీ వాస్తవం బోధపడదు రైలు దిగిపోతూ ఉంటే ఆ పట్టాలు ఇంకా సమాంతరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. నిజంగా విషయం బోధపడింది అనుకోండి అతనే జ్ఞాని అన్నమాట అప్పుడు తెలియకుండా ఒక విధమైన మౌనం వస్తుంది మనకి ఇది రావాలంటే చాలా పరిపక్వత రావాలనుకోండి అందుకనే నేను ఏమంటానఅంటే మంచి మంచి సద్గ్రంథాలు చదవాలండి సద్గ్రంథాలు చదవాలి జ్ఞానిలో బేసిక్ గా ఉండేది ఏంటంటే మౌనం ఆ మౌనంలో అతను ఏం చేస్తాడంటే ప్రతి
(09:46) పరిస్థితికి స్పందించాలా వద్దా అన్న విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడుఅన్నమాట అంటే శాంతి ఎప్పుడు కలుగుతుంది అంటే ప్రపంచం నా అంచనాల ప్రకారం నడవదు అన్న సత్యాన్ని అంగీకరించినప్పుడే కదండీ ఇంకో ఉదాహరణ ఇస్తానండి అదేంటంటే 80 ఏళ్ళ వృద్ధుడిని అడిగారట మీరు మీ జీవితంలో నేర్చుకున్న గొప్ప పాఠం ఏమిటి అని అతను ఇలా అన్నాటండి నేను చెప్పాను కదా జీవిత ఎరమాంతంలోనే రియలైజేషన్ వస్తూ ఉంటుందని ఆయన ఏమన్నాడఅంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను అంటే నాకు తారసపడిన ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళు జీవితంలో యుద్ధం చేస్తున్నారు నేను మాత్రం వాళ్ళు నాతో యుద్ధం
(10:34) చేస్తున్నారని పొరపాటు పడ్డాను ఇంతవరకు అని ఎంత గొప్ప విషయం అండి ఇది ఎంత గొప్ప విషయం వాళ్ళు వాళ్ళ జీవితాలతో యుద్ధం చేస్తున్నారు అంతే కానీ వాళ్ళు నిజంగా నాతో యుద్ధం చేస్తున్నారు వాళ్ళని గెలవాలని చెప్పేసి తపించాడట ఈ విషయాన్ని నేను తెలుసుకున్నానని ఆ వృద్ధుడు జీవిత చరమాంకంలో ఎవరో అడిగితే చెప్పాండి అంటే ఆలోచించండి ఈ ఒక్క అవగాహన గనుక ముందే వస్తే ఆ క్షణం నుంచి మన జీవితం మారుతుందా లేదా మొదలన్నీ సముద్రంలో కలిసినట్టు మళ్ళీ మనము భగవద్గీత దగ్గరికే రావాలండి కర్తవ్యం మీదే హక్కు ఉంది తప్ప ఫలితం మీద లేదు ఇది గనుక తెలుసుకుంటే జీవిత చరమాంకంలో
(11:19) వాళ్ళను అర్థం చేసుకున్నాను అన్న సంతృప్తి ఉంటుందండి అంటే సరైన రీతిలో వాళ్ళని అర్థం చేసుకున్నాను అన్న సంతృప్తి ఉంటుంది. వాళ్ళని మార్చలేకపోయాను అనే బాధ ఉండదండి ఎందుకంటే మీరు మార్చలేరు కదా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఉన్నారు అంతే దురదృష్టం ఏంటంటే చాలా మంది సామాన్యులు వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అన్న ప్రశ్నతోనే జీవితాన్ని ముగించేస్తూ ఉంటారండి.
(11:48) ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తానండి అదేంటంటే చాలా ముఖ్యమైన విషయం ఒకొకసారి ఇతరులని క్షమించడం కూడాను మనం ఏదో గొప్ప విషయంగా అనుకుంటామండి అది గొప్ప విషయం కాదు గొప్ప విషయం ఏంటంటే అసలు వాళ్ళని సరైన రీతిలో అర్థం చేసుకోవడమే గొప్ప విషయం వాళ్ళు అంతే ఇంకోలా ఉండటానికి వీలు లేదు భగవంతుడు భూమి మీదకి వాళ్ళకి ప్రత్యేకమైన ఒక సహజ స్వభావంతో పంపించాడు దాని ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తున్నారు వాళ్ళ మీద నాకు రాగద్వేషాలు ఎందుకు ఈర్షా ద్వేషాలు ఎందుకు అని నిజంగా గనుక మనసావాచా కర్మణ గనుక అనుకోగలిగినట్లయితే మనం జ్ఞానులమే వినండి ఎందుకంటే మీరు అతన్ని క్షమించేటప్పుడు ఎదుటివాడు
(12:34) తప్పు చేశాడు అనే భావన కూడా మీలో ఉంటుందిగా అందుకనే నేను క్షమించాను అని అనుకుంటారు కదా సే అర్థం చేసుకున్నప్పుడు అతను తన స్వభావాన్ని దాటి ప్రవర్త గుర్తించలేడండి కదా అని అతనికి తెలుస్తుంది కూడా ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి. ఇతరుని అర్థం చేసుకోవడం అంటే ఇదే అతను తన స్వభావాన్ని దాటి ప్రవర్తించలేడు. అలా నిజాయతీగా అనుకున్నాం అనుకోండి ఇతని మీద కోపం ఏం రాదండి మనం శాంతంగా ఉండే ప్రయత్నం చేస్తాం.
(13:13) సింపుల్ గా చెప్పాలంటేనండి రైల్లో పరిచయమైన వాళ్ళందరూ ఒకే గమ్యానికి వెళ్తున్నారు అని అనుకోవడం పొరపాటండి ఎవరి గమే రాంగానే వాళ్ళు వెళ్ళిపోతారు దిగిపోతారు మనం కూడా అంతే కదండి అసలు దీన్ని అర్థం చేసుకున్న వాడికి బాధలుఏమ ఉండవండి బంధాలు కూడాను నిజంగా వీరిపోతాయి వినిపోతాయి అంటే సరిగ్గా అర్థం అవుతాయి అన్నమాట అది అది మనం గమనించాల్సిన విషయం ఎంత ఎఫెక్టివ్ గా చెప్పానో నాకు తెలియదండి.
(13:47) సో ఇదండి వీడియోలోని విషయం మీంద కృతజ్ఞతలు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. వీలంత ఎక్కువ మందికి షేర్ చేయండి. నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడండి. నా ఫోన్ నెంబర్ 9491063089 నా పేరు మారుతి కిరణ్ పూరూరిపిఓఆర్ యుఆర్ఐ 9 అండి. మీరు YouTube లో కూడా వెళ్లి ఎంఏ ఆర్ టహ్ ఐ స్పేస్ ఇచ్చి కే ఐఆర్ఏఎన్ అని గనక టైప్ చేస్తే నా YouTube ఛానల్ ఓపెన్ అవుతుంది అన్నమాట.
(14:11) ఇప్పుడు లైక్ బటన్ నొక్కుతారా బెల్ ఐకాన్ నొక్కుతారా అంటే మీరు ఎటు నొక్కుతారో నాకు తెలుసండి. ఎందుకంటే నా వీడియోలు మొదటి నుంచి మీరు చూస్తున్నారు కదా అయితే చిన్న అభ్యర్థన ఉంది అదేంటంటే ఈ వీడియో విన్నారు కాబట్టి అవసరమైతే ఇంకొకసారి కూడా వినండి. అద్భుతమైన మెసేజ్ ని మటుకు కామెంట్ బాక్స్ లో పెట్టండి.
(14:29) అది చూసి నిజంగా నేను చాలా సంతోషపడతానండి. ఒకవేళ గనక నేను తప్పు అయితే ఆ తప్పుని మీరు ఎత్తి చూపెడితే నేను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తానండి. ఉంటారండి. నమస్కారం
No comments:
Post a Comment